సాక్షి, హైదరాబాద్ : ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు. నేటి నుంచి సమ్మర్ క్యాలెండర్ ఇయర్ ప్రారంభం కానుందని తెలిపారు. వచ్చే మూడు నెలల పాటు సమ్మర్‌పై ఐఎండి బులిటెన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతి యేటా కంటే ఈ ఏడాది 0.5 అధికంగా ఉంటుందని తెలిపారు.
1971 నుంచి ప్రతి ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉందన్నారు. 2010లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉందన్న ఆయన.. 2015లో 540, 2016లో 720కి పైగా మరణించినట్లు తెలిపారు. 2015లో తెలంగాణలోని భద్రాచలం ప్రాంతంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు 47కి చేరుకున్నాయని గుర్తు చేశారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే గాలుల వల్ల మన రాష్ట్రాలకు వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. వాతావరణంలో వేడి ఎక్కువ నమోదు అయితే..ఆరోగ్య సమస్యలు వస్తాయని, ఎండలో పనిచేసేవారు, పిల్లలు, వృద్దులపై వడగాల్పుల ప్రభావం ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment