Cyclone Sitrang Likely To Make Landfall In Bangladesh - Sakshi
Sakshi News home page

Cyclone Sitrang: తుపానుగా మారిన వాయుగుండం

Published Mon, Oct 24 2022 8:56 AM | Last Updated on Mon, Oct 24 2022 2:46 PM

Cyclone Sitrang Likely To Make Landfall In Bangladesh - Sakshi

సాక్షి, విశాఖపట్నం/అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తూర్పుమధ్య ప్రాంతానికి ఆనుకుని కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఆదివారం సాయంత్రానికి అదే ప్రాంతంలో తుపానుగా బలపడింది. దీనికి థాయ్‌లాండ్‌ సూచించిన ‘సిత్రాంగ్‌’ అనే పేరు పెట్టారు. ఆదివారం రాత్రి 8 గంటలకు ఈ తుపాను పోర్టుబ్లెయిర్‌కు వాయవ్యంగా 730 కి.మీ., పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌ ద్వీపానికి దక్షిణంగా 580 కి.మీ., బంగ్లాదేశ్‌లోని బరిసాల్‌కు దక్షిణ నైరుతి దిశలో 740 కి.మీ. దూరంలో కొనసాగుతోంది.
చదవండి: ఏపీ బడిబాటలో యూపీ

ఇది ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ సోమవారం నాటికి తీవ్ర తుపానుగా మారనుంది. అనంతరం బంగ్లాదేశ్‌లోని టింకోనా ద్వీపం, సాండ్విప్‌ మధ్య బారిసాల్‌కు సమీపంలో ఈ నెల 25 వేకువజామున తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి బులెటిన్‌లో వెల్లడించింది. 


    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement