
ప్రతికాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగు తోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 5 రోజులు అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలతోపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మళ్లీ 26న భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. గత 24 గంటల్లో మెదక్‌లో 7 సెంటీమీటర్లు, మద్నూరులో 5, జుక్కల్, గాంధారి, లింగపేట, భీమదేవరపల్లి, శాయంపేట, ఆత్మకూరులలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.