సాక్షి, ఢిల్లీ : దేశ రాజధానిలో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. గత నెలరోజులుగా వరదలు, ఇసుక తుఫాను, దుమ్ము, ధూళితో కూడిన తుఫానులు ఉత్తర భారతదేశాన్ని కమ్మేస్తున్నాయి. ఇదంతా సద్దుమణిగింది అనుకునేలోపు మళ్లీ అకస్మాత్తుగా దుమ్ముతో కూడిన తుఫాను చెలరేగింది. పాక్షికంగా మేఘాలు కమ్ముకుని, గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఒక్కసారిగా దుమ్ము, ధూళితో కూడిన తుఫానులు సంభవించాయి. నోయిడా ప్రాంతంలో సంభవించిన ఈ అకస్మాత్తు పరిణామానికి ప్రజలు ఆశ్చర్యపోయారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా తెలంగాణ భవన్‌లో స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈదురుగాలులకు ఏర్పాటు చేసిన స్టాళ్లు ఎగిరిపోయ్యాయి. ఉత్తరాఖండ్‌లో శుక్రవారం కుండపోత వర్షం కురిసింది. ఈమేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment