సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవ నాలు అంతగా ప్రభావం చూపించడం లేదు. సీజన్ ప్రారంభంలో చురుకుగా వ్యాప్తి చెందడంతో రాష్ట్రమంతటా భారీ వర్షాలు పడతాయని వాతా వరణ శాఖ హెచ్చరించింది. బంగాళా ఖాతంలో జూన్ రెండోవారంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభా వంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవు తాయనే సూచనలు కూడా వచ్చాయి. దీంతో అన్ని ప్రభుత్వ విభాగాలు అప్రమత్తమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం సాగు పనులకు సిద్ధమైంది. కానీ ఒకట్రెండు చోట్ల మాత్రమే భారీ వర్షాలు పడగా చాలాచోట్ల తేలికపాటి వానలు ఉసూరుమని పించాయి. అడపాదడపా తేలికపాటి జల్లులే పడుతున్నాయి మినహా భారీ వర్షాల జాడే లేదు.
అక్కడి వాతావరణ పరిస్థితులే మూలం
రాష్ట్రంలో సీజనల్ వర్షాలకు మూలం బంగాళా ఖాతం, అరేబియా సముద్రంలోని వాతా వరణ పరిస్థితులే. అక్కడ ఏర్పడే ఉపరితల ఆవర్త నాలు, ఉపరితల ద్రోణులు, అల్పపీడనాలు తదితర పరి స్థితులతో రాష్ట్రంలో వర్షాలు నమోదవుతాయి. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో పొడి వాతావర ణమే ఉంటోంది. ప్రస్తుతం బంగాళా ఖాతం, అరేబియా సముద్రంలో వాతావరణం స్థిరంగా ఉంది. ఎలాంటి మార్పులు లేవు. మరోవైపు రాష్ట్రానికి తక్కువ ఎత్తు నుంచి బలమైన గాలులు వీస్తుండడం కూడా రుతుపవనాల కదలికలపై ప్రభావం చూపు తున్నాయి. మరో నాలుగైదు రోజులు ఇదే వాతా వరణ పరిస్థితులు కొనసాగే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
వేచి చూసి సాగు చేయండి
రాష్ట్ర రైతాంగానికి ఈ సీజన్ కీలకమైంది. మెట్ట పంటలన్నీ వర్షాలపై ఆధారపడి సాగు చేస్తారు. తొలకరి సమయంలో కురిసే వర్షాల తీరును బట్టి విత్తనాలు వేస్తారు. ఈసారి తొలకరి ఊరించినప్పటికీ.. చాలాచోట్ల విత్తు విత్తే స్థాయిలో వర్షాలు కురవలేదని అధికా రులు చెబుతున్నారు. మరో 4,5 రోజులు వేచి చూసి సంతృప్తికర వర్షాలు కురిసిన తర్వాతే సాగు పనులు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఊపందుకోని ‘నైరుతి’.. ఆందోళనలో రైతులోకం
Published Thu, Jun 24 2021 4:47 AM | Last Updated on Thu, Jun 24 2021 7:46 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment