
మబ్బొచ్చినా, వానొచ్చినా తొలుత పులకించిపోయేది రైతన్నే. బీటలు వారిన నేలన నాలుగు చినుకులు పడినప్పుడు రైతు గుండె ఉప్పొంగి పోతుంది. వర్షపు దాహం తీరిన మట్టి చిందించే పరిమళానికి ఉత్సాహంగా చిందులేస్తాడు. గుజరాత్‌లోని కచ్‌లోని ఒక ప్రాంతంలో సరిగ్గా ఇదే జరిగింది. జోరుగా కురిసిన వాన ప్రవాహంలో పరిపూర్ణ ఆనందంతో తండ్రీ కొడుకులు ఆనందంతో చిందులు వేశారు. అచ్చమైన రైతులా తండ్రి, అతనికి తోడుగా కొడుకు కూడా చేరాడు. ఇద్దరూ కలసి చేసిన అచ్చం లగాన్ సినిమాలో లాగా చేసిన గుజరాతీ సంప్రదాయ నృత్యం ఇంటర్నెట్‌లో హృద్యంగా నిలిచింది. రోనక్ గజ్జర్ అనే జర్నలిస్టు ఎక్స్‌లోదీన్ని పోస్ట్ చేశారు.
The father and son demonstrated their joy by performing a traditional dance in a field, as the semi-arid region of Kutch experienced substantial rainfall.#Gujarat #Monsoon pic.twitter.com/HTPTJ2D8Qr
— Ronak Gajjar (@ronakdgajjar) July 23, 2024
Comments
Please login to add a commentAdd a comment