southwest monsoon
-
‘ఈశాన్య’ సీజన్లోనూ జోరు వానలు
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రాన్ని ముంచెత్తిన వానలు.. ఈశాన్య రుతుపవనాల సీజన్లోనూ అంతే స్థాయిలో జోరుగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలాన్ని ఈశాన్య రుతుపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో మూడు నెలల కాలంలో వర్షాలు, ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ తాజాగా అంచనాలు విడుదల చేసింది. ఈశాన్య రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో సాధారణ సగటు వర్షపాతం 11.32 సెంటీమీటర్లుకాగా, సీజన్ ముగిసేనాటికి ఇంతకు మించి వర్షాలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. నార్త్–ఈస్ట్ మాన్సూన్ సీజన్లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే 12 శాతం అధికంగా వర్షాలు నమోదు కావొచ్చని పేర్కొన్న ఐఎండీ.. అక్టోబర్‌లో మాత్రం 15 శాతం అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 73.86 సెంటీమీటర్లు కాగా, సీజన్ ముగిసే నాటికి 96.26 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాగా, సీజన్ మారుతున్న సమయంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల నిష్క్రమణ, ఈశాన్య రుతుపవనాల ఆగమనం నేపథ్యంలో మూడు, నాలుగు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయన్నారు. 4 ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు.. ఈశాన్య రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో జోరువానలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.. నాలుగు ఉమ్మడి జిల్లాలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కానున్నట్లు తెలిపింది. ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అక్టోబర్ నెలలో భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదు కావొచ్చని తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధిక వర్షాలు నమోదు కాగా.. ఖమ్మం, భద్రాచలం, ములుగు, సూర్యాపేట జిల్లాల్లో వరదలు పోటెత్తి తీవ్ర నష్టాల్ని మిగిల్చాయి. ఈశాన్య సీజన్లో ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే అధికంగా నమోదు కావొచ్చని, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటే.. కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణ స్థితిలో ఉంటాయని వాతావరణ శాఖ వివరించింది. -
సెప్టెంబర్ 19 నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కి
న్యూఢిల్లీ: ఈనెల 19 నుంచి 25 తేదీల మధ్య నైరుతి రుతుపవనాలు వెనక్కి మళ్లడం మొదలవుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఏటా సాధారణంగా జూన్ ఒకటో తేదీన తొలిసారిగా కేరళను తాకుతాయి. అక్కడి నుంచి విస్తరిస్తూ జూలై ఎనిమిదో తేదీకల్లా దేశమంతా చుట్టేస్తాయి. తర్వాత సెప్టెంబర్ 17వ తేదీన తిరోగమనం మొదలై అక్టోబర్ 15 కల్లా వెళ్లిపోతాయి. ఈ నైరుతి సీజన్లో దేశంలో సగటున 836.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ సగటు వర్షపాతం కంటే ఈసారి 8 శాతం ఎక్కువ నమోదవడం గమనార్హం. ఇదీ చదవండి : ఇయర్‌రింగ్స్‌తో కుట్ర..ట్రంప్-హారిస్ డిబేట్‌పై చర్చ -
పూర్తిస్థాయిలో విస్తరించిన రుతుపవనాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా.. దేశవ్యాప్తంగానూ నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈనెల 8వ తేదీ నాటికి దేశమంతటా నైరుతి విస్తరించాల్సి ఉండగా.. వేగంగా కదిలిన నేపథ్యంలో వారం రోజులు ముందుగానే విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ కారణంగా రాష్ట్రంలోనూ, దేశంలోనూ క్రమంగా వర్షాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంపై పశ్చిమ గాలుల ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
ఏపీలో రుతుపవనాలకు స్వల్ప విరామం!
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాల కదలికలో స్వల్ప విరామం చోటుచేసుకుంది. జూలై 6 వరకు ఏపీలో ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో నాలుగు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉష్ణోగ్రత నమోదు కానున్నాయి. నిన్న(మంగళవారం) బాపట్లలో 35.8, మచిలీపట్నంలో 35.6, తునిలో 35.5 విశాఖ ఎయిర్‌పోర్టు 34.8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈరోజు( బుధవారం) కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు.దేశమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. నిన్న(మంగళవారం) రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల అంతట నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. వారం రోజుల ముందుగానే దేశం మొత్తం నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు.Southwest monsoon covered the entire country on 2nd July 2024. pic.twitter.com/d0QTxAP6Ps— मौसम विज्ञान केंद्र जयपुर (@IMDJaipur) July 2, 2024 ఈ నెల 8వ తేదీన దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన నైరుతి రుతుపవనాలు వారం రోజుల ముందుగా జూలై 2న విస్తరించాయి. ఈసారి నైరుతి రుతుపవనాలు రెండు మూడురోజు ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి. మే30వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి. ఇక.. మరో నాలుగైదు రోజుల పాటు వాయువ్య, తూర్పు ఈశాన్య భారతంలో నైరుతి రుతుపవనాలు కదులుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
జూన్‌లో వర్షాలు బాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్ తొలి నెల ఎక్కువగా సాధారణ వర్ష పాతంతోనే సరిపెట్టింది. రాష్ట్రంలో కురిసిన సగ టు వర్షపాతం గణాంకాలు కాస్త ఆశాజనకంగా ఉన్నప్పటికీ జిల్లాలవారీగా పరిశీలిస్తే వర్షపాతం సాధారణ స్థితిలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. నైరుతి సీజన్లో జూన్ సాధారణ వర్షపాతం 12.94 సెంటీమీటర్లుకాగా ఈసారి 16 సెంటీమీటర్ల మేర సగటు వర్షపాతం కురిసింది. ఈ లెక్కన రాష్ట్రంలో సగటున కురవాల్సిన సాధారణ వర్షపాతం కంటే 23% అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కొన్నిచోట్ల అత్యధికంతో పెరిగిన సగటు.. జూన్ ఒకటో తేదీ నుంచి సెపె్టంబర్ 30 మధ్య కాలాన్ని నైరుతి రుతుపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. సీజన్ మొదటి నెలలో తొలకరి వర్షాలు మొదలు భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే గత నెలలో పలు జిల్లాల్లో సాధారణ వర్షపాతమే నమోదైంది. కానీ కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురవడంతో రాష్ట్ర సగటు వర్షపాతం పైకి ఎగబాకింది. 84 మండలాల్లో లోటు వర్షపాతం... రాష్ట్రవ్యాప్తంగా జూన్‌లో వర్షాలు సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ ఆరు జిల్లాల్లో మాత్రం అత్యధిక వర్షపాతం నమోదైంది. 11 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవగా 14 జిల్లాల్లో మాత్రం సాధారణ వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలో లోటు వర్షపాతం నమోదు కావడం గమనార్హం. మండలాలవారీగా వర్షపాతం గణాంకాలు పరిశీలిస్తే 159 మండలాల్లో అత్యధికం, 171 మండలాల్లో అధికం, 198 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 84 మండలాల్లో మాత్రం లోటు వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జూన్ తొలివారం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురవగా... రెండో వారం నాటికి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. మూడు వారంలో రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతమే నమోదవగా చివరి వారంలో మళ్లీ వర్షాలు ఆశాజనకంగా నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో సాధారణం కంటే రెట్టింపు వర్షాలు నమోదవగా రెండో స్థానంలో నల్లగొండ జిల్లా నిలిచింది. -
వరుణించిన నైరుతి
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతు పవనాలు సీజన్ ఆరంభం నుంచే అధిక వర్షాలు కురిపించాయి. రాష్ట్రంలో జూన్ నెలలో సాధారణ వర్షపాతం 91.2 మి.మీ. కాగా.. 143.7 మి.మీ. వర్షం కురిసింది. 52.5 మి.మీ. అధిక వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 58 శాతం అధికం. సస్యశ్యామల ‘సీమ’ నైరుతి రుతు పవనాలు ఈ ఏడాది రాయలసీమను కరుణించాయి. రాయలసీమలోని 8 జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతమే నమోదైంది. కోస్తాంధ్రలోని అనకాపల్లి, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే అత్యధిక వర్షం కురవగా.. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, బాపట్ల, ఏలూరు, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో సాధారణ వర్షపాతం కురిసింది. ఇక తూర్పు గోదావరి, కాకినాడ, ఎనీ్టఆర్, పార్వతీపురం మన్యం, విజయనగరం, పశి్చమ గోదావరి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే.. రాష్ట్రంలోకెల్లా శ్రీసత్యసాయి జిల్లాలో అత్యధికంగా 180 శాతం వర్షపాతం కురిసింది.ఆ జిల్లాలో జూన్‌లో 55.1 మి.మీ.లకు గాను 154.2 మి.మీ. వర్షం పడింది. ఆ తర్వాత 177 శాతంతో అనంతపురం రెండో అత్యధిక వర్షం కురిసిన జిల్లాల్లో నిలిచింది. అక్కడ 63.6 మి.మీ.లకు 176.2 మి.మీ. వర్షం కురిసింది. రాష్ట్రంలో వాతావరణ విభాగం పరిధిలో కోస్తాంధ్ర, రాయలసీమ సబ్ డివిజన్లు ఉన్నాయి. ఈ లెక్కన కోస్తాంధ్రలో 105.6 మి.మీ.లకు 129.1 మి.మీ. (22 శాతం అధికం), రాయలసీమలో 70.7 మి.మీ.లకు 160 మి.మీ. (127 శాతం అధికం) వర్షపాతం నమోదైంది. సీమలోనే ఎక్కువ ఎందుకంటే.. కోస్తాంధ్ర కంటే రాయలసీమలోనే ఎక్కువ వర్షపాతం నమోదు కావడానికి కారణాలున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు జూన్ ఆరంభంలోనే రాయలసీమ మీదుగా కోస్తాంధ్రలోకి ప్రవేశించాయి. ఆ సమయంలో రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తా నుంచి ఉత్తర కోస్తాలోకి విస్తరించిన రుతుపవనాలు ముందుకు కదలకుండా 10 రోజులపాటు స్తబ్దుగా ఉండిపోయాయి. దీంతో ఆ సమయంలో రాయలసీమలో వర్షాలు కొనసాగాయి. కోస్తాంధ్రలో.. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో తేలికపాటి జల్లులే కురిశాయి. దీంతో రాయలసీమలోని అన్ని జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతం రికార్డయింది.జూలైలోనూ సమృద్ధిగా.. జూన్ నెలలో ఆశాజనకంగా కురిసిన వర్షాలు జూలైలో మరింత సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతు పవనాల ప్రభావం జూలైలో అధికంగా ఉంటుందని, ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురిసే పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటున్నారు. అలాగే జూలై నెలలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడే అవకాశం ఉందని.. ఇవి కూడా వర్షాలు కురవడానికి దోహదపడతాయని చెబుతున్నారు. -
26 నుంచి జోరుగా వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రస్తుతం కొన్ని చోట్ల తేలికపాటి, అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు ఇవి కొనసాగనున్నాయి. ఈనెల 26 నుంచి వానలు మరింత జోరందుకోనున్నాయి. అప్పటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుదనం సంతరించుకోనున్నాయి. ఫలితంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఈశాన్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మోస్తరు వానలు, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశంలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. -
జూన్‌లో లోటు వర్షపాతమే!
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల గమనం మందగించింది. జూన్ నెల మొదటి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి ఆ తర్వాత అత్యంత చురుకుగా కదిలి ఈనెల 14వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. కానీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తర ప్రాంత జిల్లాల్లో మాత్రం ప్రస్తుతం రుతుపవనాల కదలికలు మందగమనంలోనే ఉన్నాయి. దీంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాల సీజన్లో జూన్ నెలకు సంబంధించిన అంచనాలను ఐఎండీ తాజాగా విడుదల చేసింది. ఈ నెలలో రాష్ట్రంలోని చాలాచోట్ల లోటు వర్షపాతం నమోదయ్యే పరిస్థితులే కనిపిస్తున్నట్లు తెలిపింది. నెలాఖరులో వర్షాలు కురుస్తాయని, సాధారణ వర్షపాతానికి దగ్గరగా గణాంకాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతున్నప్పటికీ మొత్తం మీదా చాలాచోట్ల లోటు ఉంటుందని ప్రకటించింది. 8 జిల్లాల్లో సాధారణం..11 జిల్లాల్లో లోటు జూన్ నెలలో ఇప్పటివరకు 7.85 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. బుధవారం ఉదయానికి 8.53 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 9 శాతం అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈనెల చివరి వారంలో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నప్పటికీ, తూర్పు ప్రాంత జిల్లాల్లోనే ఇందుకు ఎక్కువగా అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 7 జిల్లాల్లో అధిక వర్షపాతం, 6 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక 11 జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. మంచిర్యాలలో లోటు ఎక్కువగా నమోదైంది. రానున్న రెండ్రోజుల్లో వర్షసూచన ప్రస్తుతం కోస్తాంధ్రను ఆనుకుని తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. ఇది సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉందని, దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.జూన్‌లో ఇప్పటివరకు జిల్లాల వారీగా వర్షపాతం.. » తీవ్ర లోటు (–60% నుంచి –99%): మంచిర్యాల » లోటు(–20% నుంచి –59%): ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి » సాధారణం(+19% నుంచి –19%): వరంగల్, హనుమకొండ, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, జనగామ, రంగారెడ్డి, ఖమ్మం » అధికం(+20% నుంచి +59%): మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, సూర్యాపేట, నారాయణపేట » అత్యధికం(+60% పైబడి): హైదరాబాద్, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నల్లగొండ జూన్‌లో సాధారణ వర్షపాతం : 12.94 సెంటీమీటర్లు బుధవారం నాటికి కురవాల్సిన వర్షం : 7.85 సెంటీమీటర్లు నమోదైన వర్షపాతం : 8.53 సెంటీమీటర్లు సాధారణం కంటే 9 శాతం అధికంగా నమోదు -
ముందుకు కదలని రుతుపవనాలు..
-
అటు వర్షాలు..ఇటు వడగాడ్పులు!
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ పక్క మోస్తరు వర్షాలు కురుస్తుండగా, మరోపక్క వడగాడ్పులూ వీస్తున్నాయి. జూన్ మొదటి వారం వరకు దడ పుట్టించిన వడగాడ్పులు ఆ తర్వాత నైరుతి రుతుపవనాల ఆగమనంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పగటి ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు గణనీయంగా తగ్గాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ ఊపందుకొని, వడగాడ్పులు వీస్తున్నాయి. వాస్తవానికి నైరుతి రుతుపవనాలు ఆరంభంలో ఆశాజనకంగానే ప్రభావం చూపాయి.గత వారంలో ఉత్తరాంధ్రకు విస్తరించాయి. అప్పట్నుంచి ముందుకు కదలకుండా స్తబ్దుగా ఉండిపోయాయి. దీంతో వర్షాలు అరకొరగానే కురుస్తున్నాయి. ఎక్కడైనా కొన్ని చోట్ల మినహా అనేక చోట్ల తేలికపాటి జల్లులు పడుతున్నాయి. ప్రస్తుతం కోస్తాంధ్రపైకి పశ్చిమ గాలులు వీస్తుండడం, కోస్తా వైపు రుతుపవనాలు విస్తరించకపోవడం వంటి కారణాల వల్ల మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగి వడగాడ్పులకు దోహద పడుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుతం కోస్తాంధ్రలో కొన్నిచోట్ల సాధారణంకంటే 4 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న ఒకట్రెండు రోజులు ఇదే వాతావరణం కొనసాగుతుందని, ఫలితంగా పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో వడగాడ్పులకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం ఒక నివేదికలో వెల్లడించింది. విశాఖపట్నం జిల్లాలోనూ వడగాడ్పుల అనుభూతి కలుగుతుందని పేర్కొంది.నేడు, రేపు తేలికపాటి వర్షాలు..వచ్చే 4 రోజుల్లో నైరుతి రుతుపవనాల్లో కదలిక వచ్చి, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బెంగాల్, బీహార్, కోస్తాంధ్ర అంతటా విస్తరించేందుకు అనువైన పరిస్థితులు నెలకొన్నాయి. మరోపక్క గోవా నుండి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉన్న ద్రోణి సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్లు, 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. వీటన్నంటి ప్రభావంతో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకా>శం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.అదే సమయంలో పలు ప్రాంతాల్లో వడ గాలులు కూడా వీస్తాయని తెలిపింది. మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నంద్యాల, తిరుపతి, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోను, బుధవారం అల్లూరి, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.మరోవైపు గంటకు 40 – 50 కిలోమీటర్ల వేగంతో ఈదరు గాలులు వీస్తాయని, అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని ఐఎండీ హెచ్చరించింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు చిత్తమూరు (తిరుపతి)లో 4.2 సెంటీమీటర్లు, నెమలికళ్లు (పల్నాడు)లో 3.9, మంగళగిరి (గుంటూరు)లో 3.5, ఎస్.కోట (విజయనగరం)లో 3.5, నగరి (చిత్తూరు)లో 2.1 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. -
రాష్ట్రమంతటా విస్తరించిన నైరుతి
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఈ నెల 3న రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు క్రమంగా వ్యాప్తి చెందుతూ వారం రోజుల వ్యవధిలో రాష్ట్రమంతటా వేగంగా విస్తరించినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రుతుపవనాల వ్యాప్తి సమయంలోనే రాష్ట్రంలో తొలకరి వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో గత పదిరోజుల్లో సంతృప్తికర స్థాయిలో వర్షపాతం నమోదైంది. నైరుతి సీజన్లో ఈనెల 12 నాటికి 3.81 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా..6.01 సెం.మీ. నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 55% అధికంగా నమోదైంది. ప్రస్తుతం మోస్తరు వర్షాలే కురవగా..ఈనెల మూడో వారం నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు సైతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావర ణ శాఖ నిపుణులు అంచనా వేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సంతృప్తికరంగా, 4 జిల్లాల్లో మధ్యస్థంగా, 9 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా... ఆదిలాబాద్, మంచిర్యా ల. నిర్మల్, పెదపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. రెండ్రోజులు పలుచోట్ల మోస్తరు వర్షాలు రాష్ట్రంలో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావ రణ శాఖ వెల్లడించింది. ఆసిఫాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించింది. రాష్ట్రానికి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నట్లు తెలిపింది. ఈక్రమంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. బుధవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత అత్యధికంగా ఖమ్మంలో 37.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో అత్యధికంగా 20.0 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. బుధవారం జనగామ జిల్లా జఫర్గడ్లో అత్యధికంగా 4.06 సెం.మీ., సూర్యాపేట జిల్లా మునగాల, పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో 4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
‘నైరుతి’ మందగమనం!
సాక్షి, విశాఖపట్నం: రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రల్లో ప్రభావం చూపుతున్న నైరుతి రుతుపవనాలు ఉత్తరాంధ్రకు వచ్చేసరికి ఒకింత మందగమనంలో ఉన్నాయి. దీంతో ఉత్తరాంధ్ర మినహా రాష్ట్రంలో ఆ రెండు ప్రాంతాల్లో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రవేశించాక ఒక్కోసారి ఉపరితలంలో అధిక పీడన ద్రోణి (రిడ్జ్) ఏర్పడుతుంటుంది. ఇది అల్పపీడన ద్రోణికి విరుద్ధం. అంటే అల్పపీడన ద్రోణి ఏర్పడినప్పుడు ఉపరితలంలో గాలులు గడియారపు ముల్లు తిరిగే దిశ (క్లాక్ వైజ్ డైరెక్షన్)లో తిరుగుతూ మేఘాలు, వర్షాలకు కారణమవుతాయి. అదే అధిక పీడన ద్రోణి ఏర్పడితే గాలులు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి. ఫలితంగా అరకొర మేఘాలు ఏర్పడడమే కాకుండా సూర్యరశ్మి నేరుగా కిందకు ప్రసరిస్తుంది. దీంతో ఉష్ణతీవ్రత పెరగడంతో పాటు వర్షాలకు అడ్డంకులేర్పడతాయి. ప్రస్తుతం రెండు రోజుల నుంచి ఉత్తరాంధ్రపై అధిక పీడన ద్రోణి కొనసాగుతోందని ఆంధ్రా విశ్వవిద్యాలయం వాతావరణం, సముద్ర అధ్యయన విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్ ఓఎస్ఆర్యూ భానుకుమార్ ‘సాక్షి’కి చెప్పారు. దీనివల్ల విజయనగరం వరకు విస్తరించిన రుతుపవనాలు చురుకుదనం సంతరించుకోకుండా స్తబ్దుగా ఉన్నాయన్నారు. దీని ఫలితంగా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నా.. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి జల్లులే పడుతున్నాయని తెలిపారు. పైగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నాయన్నారు. మరో రెండు మూడు రోజుల్లో అధిక పీడన ద్రోణి బలహీనపడుతుందని చెప్పారు. ఆ తర్వాత రుతుపవనాలు పుంజుకుంటాయని.. దీంతో మళ్లీ వర్షాలు ఊపందుకుంటాయని వివరించారు. మూడు రోజులపాటు వర్షాలు..మరోవైపు రానున్న మూడు రోజులు రాయలసీమ, కోస్తాంధ్రల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మంగళవారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే బుధవారం ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే అల్లూరి, పల్నాడు, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని వివరించింది. -
ఆదిలాబాద్ మినహా అంతటా అత్యల్పమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరిస్తుండటం.. పలుచోట్ల వానలు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మినహా దాదాపు అన్నిచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజులు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఆదిలాబాద్‌లో 39.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, మెదక్‌లో 22.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదు కాగా, హనుమకొండ, హైదరాబాద్, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయింది. మిగతా ప్రాంతాల్లో కూడా 3 డిగ్రీలు తక్కువగా నమోదు అయింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించాయి. మరో రెండ్రోజుల్లో రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ వివరించింది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. -
రాష్ట్రంలో తగ్గిన ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పతనమయ్యాయయి. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతుండడం గమనార్హ. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల విస్తరణ ఊపందుకోవడం.. దీనికితోడు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రానున్న మూడురోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు నిజామాబాద్ పరిసర ప్రాంతం వరకు విస్తరించినట్లు నిపుణులు చెబుతున్నారు.రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని చాలాప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శనివారం బలహీనపడింది. శనివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఆదిలాబాద్‌లో 41.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, మెదక్‌లో 22.0 డిగ్రీ ల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, కర్ణాటకలోని మిగిలిన భాగాలు, దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్ర మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతు పవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం, కోస్తా కర్ణాటక ప్రాంతంలో మరొక ఆవర్తనం విస్తరించి ఉందన్నారు. గురువారం.. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సాఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.శుక్రవారం.. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. -
తెలంగాణ రాష్ట్రమంతా నైరుతి
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈనెల 3న రాష్ట్రంలోని ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. రెండ్రోజుల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కు విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ లోని నారాయణపేట, ఆంద్రప్రదేశ్‌లోని నర్సాపూర్ గుండా రుతుపవనాలు కదులుతున్నట్లు చెప్పింది. 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని, కదలికలు ఇదే తరహాలో ఉంటే వారం రోజుల్లో రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తాయని అంచనా వేస్తోంది. రుతుపవనాల రాకతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పగటి పూట కొంతసేపు గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నప్ప టికీ.. ఆశాశం మేఘావృతం కావడంతో క్రమంగా ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గుతూ వస్తోంది. సాయంత్రానికి పూర్తిగా చల్లని వాతావరణం ఏర్పడుతోంది. రెండు రోజులు రాష్ట్రంలో ఉష్ణో గ్రతలు సాధారణం, అంతకంటే తక్కువగా నమోదు కావొచ్చని ఆ శాఖ అంచనా వేసింది. నిజామాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత: దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బుధవారం నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది దక్షిణ ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావొచ్చని పేర్కొంది. బుధవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాలను పరిశీలిస్తే నిజామాబాద్‌లో 40.1 డిగ్రీ సెల్సీయస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 22.5 డిగ్రీ సెల్సీయస్‌గా నమోదైంది. -
ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
-
‘నైరుతి’ వచ్చేసింది
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/యడ్లపాడు/: నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలోకి ముందుగానే ప్రవేశించాయి. ఇవి శనివారం రాత్రి రాయలసీమను తాకినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో రెండ్రోజుల్లో అవి రాష్ట్రమంతా శరవేగంగా విస్తరించే అవకాశమున్నట్లు స్పష్టంచేసింది. సాధారణంగా రుతు పవనాలు ఐదో తేదీ తర్వాత రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ముందుగానే ప్రవేశించాయి. దీంతో రాయలసీమలోని అనంతపురం, అనంతరం నెల్లూరు జిల్లాను తాకడంతో ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.ఇవి ఒకట్రెండు రోజుల్లో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాల్లోకి విస్తరించనున్నాయి. నైరుతి రుతుపవనాలు దూకుడుగా ఉన్నందున రెండు మూడ్రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. అలాగే, పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతాల్లోకి కూడా ఇవి వ్యాపించనున్నట్లు తెలిపింది. ఈ రుతు పవనాలు మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్, కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలకు విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది.మరోవైపు.. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. ఇక వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వైఎస్సార్ జిల్లా సిద్దవటంలో అత్యధికంగా 30.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే, అన్నమయ్య జిల్లాల్లోని రాయచోటి, రాజంపేట, కోడూరు, తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సోమవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు–గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించింది. ఆదివారం సా.5 గంటల నాటికి తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 53.7 మిల్లీమీటర్లు, కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 47.7, చిత్తూరు జిల్లా పుంగనూరులో 33, కాకినాడ జిల్లా గండేపల్లిలో 23.2, అల్లూరి జిల్లా అనంతగిరిలో 22, కాకినాడ జిల్లా పెదపూడిలో 20.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.పిడుగుపాటుకు నలుగురు మృత్యువాత..ఆదివారం కురిసిన వర్షాల్లో పిడుగులు పడి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు మత్స్యకారులు.. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో ఇద్దరు రైతులు మృత్యువాత పడ్డారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో పడవలో ఉన్న దుమ్ము పోలిరాజు అనే యువకుడు పిడుగు పడి అక్కడికక్కడే మరణించగా.. పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో బోటు తనిఖీకి వెళ్లిన కంబాల ముత్యాలు అనే మరో మత్స్యకారుడు కూడా పిడుగుపడి చనిపోయాడు. ఆదివారం ఉదయం ఉమ్మడి విశాఖ జిల్లాలో గంటకు పైగా ఉరుములు, మెరుపులు, పిడుగులు జనాన్ని భయకంపితులను చేశాయి.మరోవైపు.. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో ఇద్దరు రైతులు కూడా పిడుగులకు బలయ్యారు. పొలాల్ని సాగుకు సిద్ధంచేసుకోవాలని వెళ్లిన పెద్ది చినవీరయ్య (58), చిరుతల శ్రీనివాసరావు (51) పిడుగుపాటుకు గురై మృతిచెందారు. ఉ.5.30 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్లిన వీరు అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమైంది. దీంతో సమీపంలోని వేప చెట్టు కిందకు వెళ్లగా అప్పుడే పెద్ద శబ్దంతో అదే చెట్టుపై పిడుగు పడింది. ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. -
ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు
సాక్షి, గుంటూరు: నైరుతి రుతుపవనాలు శరవేగంగా కదులుతున్నాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలోకి నైరుతి రుతు పవనాలు ఈ రోజు(ఆదివారం) ప్రవేశించాయని.. ఏపీ అంతటా రుతు పవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిందినేడు రాయలసీమలోకి ప్రవేశించగా, ఆపై క్రమంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు, కడప, ఒంగోలు మీదుగా పయనిస్తాయి. అనంతరం దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్రల్లోకి ప్రవేశించే అవకాశాలున్నాయి.మరోవైపు కోస్తాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీని ప్రభావంతో ప్రస్తుతం రాష్ట్రంలో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. -
ఏపీలో రేపటి నుంచి భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: రాబోవు రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతు పవనాలు కేరళ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగాడానికి అలాగే రాయలసీమలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకులంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. కోస్తాంధ్ర ప్రాంతంలో ఆవర్తనం విస్తరించి ఉందని దీని ప్రభావంతో రాగల నాలుగు రోజులు అక్కడక్కడ భారీవర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నట్లు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో రేపు(ఆదివారం) అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ , చిత్తూరు జిల్లాల్లో ఎల్లుండి(సోమవారం) అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తెలిపాటి జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు.అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో జిల్లాల్లో జూన్ 4(మంగళవారం) అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జూన్ 5(బుధవారం) అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.శనివారం సాయంత్రం 7 గంటల నాటికి అన్నమయ్య జిల్లా రాజంపేటలో 32.5మిమీ,అనంతపురం జిల్లా గుంతకల్లులో 30.5మిమీ, చిత్తూరు జిల్లా గుడుపల్లెలో 24.2మిమీ, చిత్తూరులో 21మిమీ, తవణంపల్లె 18.7మిమీ,విశాఖ జిల్లా భీమునిపట్నంలో 18.2మిమీ,అల్లూరి జిల్లా కొయ్యురులో 17.7మిమీ, కాకినాడ జిల్లా తొండంగిలో 15.2మిమీచొప్పున వర్షపాతం నమోదైందన్నారు. -
వేగంగా నైరుతి
సాక్షి, అమరావతి/విశాఖపట్నం : నైరుతి రుతు పవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. రెండు రోజుల్లో రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారానికి ఇవి రాయలసీమలోకి ప్రవేశిస్తాయని తెలుస్తోంది. ఇప్పటికే బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, త్రిపుర, మేఘాలయ, అస్సాంలోని కొన్ని ప్రాంతాలతో పాటు ప శ్చిమ బెంగాల్, సిక్కింలోని చాలా ప్రాంతాలకు విస్తరించాయి. రాబోయే రెండు రోజుల్లో అరేబియా సముద్రంలోని పలు భాగాలు, లక్షదీ్వప్, కేరళ, కర్ణాటక, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.రాష్ట్రంలో రుతు పవనాలు ప్రవేశించే వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. రెమల్ తుపాను ప్రభావంతో గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో ఎండ, ఉక్కపోత ప్రభావం ఎక్కువగా ఉంటోంది. రుతు పవనాలు ముందుగా ప్రవేశించనుండటంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత మిగిలిన ప్రాంతాల కంటే కొంచెం తగ్గనున్నట్లు అంచనా వేస్తున్నారు. అవి పురోగమించకపోతే ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉండేదని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.ఏదేమైనా మరో రెండు, మూడు రోజులు ఎండల తీవ్రత ఉంటుందని, ఆ తర్వాత వాతావరణం చల్లబడి వర్షాలు పడతాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం పల్నాడు జిల్లా వినుకొండలో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా పుల్లలచెరువులో 45.4 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 45.3, గుంటూరు జిల్లా తుళ్లూరు, ఫిరంగిపురంలో 45, బాపట్ల జిల్లా పర్చూరులో 44.8, నెల్లూరు జిల్లా జలదంకిలో 44.4, కృష్ణా జిల్లా కోడూరులో 44.2, అల్లూరి జిల్లా కూనవరంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొద్ది రోజులు ఎండల్లో తిరగొద్దు రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశిస్తున్నప్పటికీ, మరోవైపు ఎండల తీవ్రత మరికొద్ది రోజులు కొనసాగనుంది. ఈ తరుణంలో వడదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్ధులు, గర్భిణిలు, బాలింతలు తగిన జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠిన పనులను ఎండలో చేయరాదని వైద్యులు సూచిస్తున్నారు. నేడు అక్కడక్కడ వడగాడ్పులు, వర్షం శనివారం విజయనగరం జిల్లాలో 6, పార్వతీపురం మన్యం జిల్లాలోని 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 43 మండలాల్లో ఓ మోస్తరు వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఆదివారం నుంచి మూడు రోజులు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశి్చమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ప రుతు పవనాలుమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వేసవి భగభగ ఈ ఏడాది వేసవి ఆద్యంతం అగ్ని గుండంగానే కొనసాగింది. గతానికి భిన్నంగా మార్చి మూడో వారం నుంచే సూర్య ప్రతాపం మొదలైంది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 44 డిగ్రీల వరకు నమోదయ్యాయి. అప్పట్నుంచే వడగాడ్పులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ మొదటి వారానికల్లా ఉష్ణోగ్రతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. సాధారణం కంటే 5–8 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని 358 మండలాల్లో వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీచాయి. మే నెల మధ్యలో నమోదు కావలసిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్ రెండో వారంలోనే రికార్డయ్యాయి. ఏప్రిల్ 8న మార్కాపురంలో 46 డిగ్రీలు, మే 2న 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే 3న నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజనులో ఇప్పటి వరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. ఆ తర్వాత కూడా పగటి ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యమధ్యలో వర్షాలు కురిసి ఉష్ణ తీవ్రతను కాస్త తగ్గించినా, రెండు మూడు రోజుల్లోనే మళ్లీ యథా స్థితికి చేరుకున్నాయి. ఇలా ఒకపక్క అధిక ఉష్ణోగ్రతలు, మరోపక్క వడగాడ్పులు పోటీ పడుతూ జనాన్ని బెంబేలెత్తించాయి. ఈ వేసవిలో రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 5–9 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ఏప్రిల్ 17న ప్రకాశం జిల్లా పెద్దారవీడులో 33.4 డిగ్రీలు, కర్నూలులో 32, కడపలో 31 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మే నెలలో రాత్రిళ్లు పలుమార్లు 31–34 డిగ్రీల వరకు నమోదయ్యాయి. -
జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి నైరుతి
సాక్షి, హైదరాబాద్: కేరళలోకి గురువారం ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు సాగుతూ జూన్ 5 నుంచి 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించి విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈలోగా పగటి ఉష్ణోగ్రతలు మరికొంత పెరగొచ్చని పేర్కొన్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుతం పశ్చిమ, వాయవ్య దిశల నుంచి వడగాడ్పులు వీస్తుండటంతో గురువారం రాష్ట్రంలో చాలాచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.మంచిర్యాల జిల్లా భీమారంలో అత్యధికంగా 47.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతగా నమోదైంది. ఇప్పటివరకు ఈ వేసవిలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. అలాగే భద్రాద్రి కొత్తగుడెం జిల్లా గరిమెల్లపాడులో 47.1 డిగ్రీల సెల్సియస్, కమాన్‌పూర్‌లో 46.7, కుంచవల్లిలో 46.6, కాగజ్‌నగర్, పమ్మిలో 46.5, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగత నమోదైంది. చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఖమ్మంలో 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. -
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
-
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
-
నైరుతి వచ్చేసింది.. వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి..
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతు పవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. గురువారం ఉదయం కేరళను తాకాయి. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి. వారంలో తెలుగు రాష్టాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. గతేడాది కంటే ముందుగానే నైరుతి పవనాలు రాగా, ఇప్పటికే కేరళ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు.. కేరళ రాష్ట్రాన్ని ఐఎండీ అలెర్ట్ చేసింది.నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని ఎక్కువ ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాల్లో విస్తరించాయి. లక్షద్వీప్‌లోని కొన్ని ప్రాంతాలు, కేరళ, మరికొన్ని భాగాలు నైరుతి, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నాయి.కాగా, వారం ముందుగానే రుతుపవనాలు పురోగమిస్తుండడంతో ఈ సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాల పురోగమనం, రెమల్ తుఫాన్ కారణంగా ప్రస్తుతం రోహిణీ కార్తె ఉన్నా దాని ప్రభావం పెద్దగా రాష్ట్రంపై పడలేదు. స్వల్పంగానే ఉష్ణోగ్రతలు పెరిగాయి. బుధవారం పలుచోట్ల 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా పోయిమలలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా చిరుమామిళ్లలో 42.5, గరికపాడులో 42 డిగ్రీలు, విజయవాడలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే రెండు రోజులు కూడా వాతావరణం ఈ మాదిరిగానే ఉండవచ్చని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. -
Monsoon 2024: నేడు కేరళకు నైరుతి ఆగమనం.. 2 రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతు పవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఒక రోజు ముందుగా అంటే గురువారానికే అవి కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత రెండు రోజుల్లో ఏపీలోకి ప్రవేశించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ నెల 31 లేదా వచ్చే నెల ఒకటో తేదీకల్లా రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని ఎక్కువ ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాల్లో విస్తరించాయి. వీటి పురోగమనం ఆశాజనకంగా ఉండడంతో గురువారం లక్షద్వీప్‌లోని కొన్ని ప్రాంతాలు, కేరళ, మరికొన్ని భాగాలు నైరుతి, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉంది. వారం ముందుగానే రుతుపవనాలు పురోగమిస్తుండడంతో ఈ సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాల పురోగమనం, రెమల్ తుఫాన్ కారణంగా ప్రస్తుతం రోహిణీ కార్తె ఉన్నా దాని ప్రభావం పెద్దగా రాష్ట్రంపై పడలేదు. స్వల్పంగానే ఉష్ణోగ్రతలు పెరిగాయి. బుధవారం పలుచోట్ల 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా పోయిమలలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా చిరుమామిళ్లలో 42.5, గరికపాడులో 42 డిగ్రీలు, విజయవాడలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే రెండు రోజులు కూడా వాతావరణం ఈ మాదిరిగానే ఉండవచ్చని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.ఒకటి నుంచి వర్షాలు..రాష్ట్రంలో జూన్ ఒకటో తేదీ నుంచి వర్షాలు కురవనున్నాయి. జూన్ ఒకటిన అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోను, జూన్ 2న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోను అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అదే సమయంలో గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు కూడా సంభవిస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. -
నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి..
-
‘నైరుతి’ వచ్చేస్తోంది
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈనెల 31 నాటికల్లా ఇవి కేరళలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమ వారం తెలిపింది. నిరీ్ణత సమయానికి మూడ్రోజులు ముందుగా అంటే ఈనెల 19న అండమాన్ సముద్రంలోకి ఈ రుతుపవనాలు ప్రవేశించిన విషయం తెలిసిందే. ఇవి చురుగ్గా కదులుతుండగా సోమవారం నాటికి బంగాళాఖాతం, శ్రీలంకలోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. అలాగే, దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇదే పరిస్థితి కొనసాగితే అనుకున్న దానికంటే ముందుగానే వచ్చేనెల 1, 2 తేదీల్లో ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు.వాతావరణ పరిస్థితులు ఏమైనా మారితే ఒకట్రెండు రోజులు ఆలస్యమై 3, 4 తేదీల నాటికి రాష్ట్రంలో ప్రవేశించే అవకాశముంది. మొత్తంగా ఐదో తేదీలోపే రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక రుతు పవనాలు చురుగ్గా ఉండడంతో వచ్చేనెల మొదటి వారంలో రాయలసీమలోని పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. రెమల్ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాలతోపాటు రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు పడ్డాయి. ఈ తుపాను బంగ్లాదేశ్ వైపు కదిలి ఆ పరిసరాల్లోనే తీరం దాటడంతో రుతు పవనాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండ్రోజుల్లో అవి చురుగ్గా కదిలాయి. రైతులకు ఎంతో ఊరట.. జూన్‌లో రాష్ట్రంలో సాధారణానికి మించి వర్షాలు కురవనున్నాయని సోమవారం విడుదల చేసిన రెండో దశ దీర్ఘకాలిక నెలవారీ అంచనా నివేదికలో ఐఎండీ పేర్కొంది. ఈ సమాచారం రైతాంగానికి ఎంతగానో ఊరటనిస్తోంది. గత ఏడాది వారం రో జులు ఆలస్యంగా అంటే జూన్ 8న నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. అనంతరం వర్షాలు అరకొరగానే కురిశాయి. పైగా రాష్ట్రంలో జూన్ అంతా మే నెలను తలపించేలా వడగాడ్పులు కొనసాగాయి.ఫలితంగా జూన్‌లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో ఖరీఫ్ పనులు ముందుకు సా గలేదు. ఆపై జూలై, ఆగస్టుల్లో సకాలంలో వర్షాలు కురవలేదు. దీంతో గతేడాది రైతులకు నైరుతి రుతుపవనాలు నిరాశను, నష్టాలను మిగిల్చాయి. కానీ, ఈ ఏడాది పరిస్థితులు అందుకు భిన్నంగా, అనుకూలంగా మారుతున్నాయి. ఎల్‌నినో బలహీనపడుతూ జూన్ మధ్య నుంచే లానినా పరిస్థితులేర్పడుతున్నాయి. దీంతో వర్షాలు పుష్కలంగా కురవడానికి దోహద పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మూడ్రోజులు వడగాడ్పులు.. ఇదిలా ఉంటే.. రెమాల్ తీవ్ర తుపాను ఫలితంగా గాలిలో తేమను తుపాను ప్రాంతం వైపు లాక్కుపోయింది. దీంతో.. రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంది. దీనికి తోడు రోహిణి కార్తె కూడా రెండ్రోజుల క్రితమే మొదలైంది. వీటివల్ల రానున్న మూడ్రోజులు సాధారణంకంటే 4–8 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. గరిష్టంగా కొన్నిచోట్ల 49 డిగ్రీల వరకు రికార్డయ్యే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల మళ్లీ వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీయనున్నాయి. టకాగా, మంగళవారం 149 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 160 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయి. శ్రీకాకుళం జిల్లాలో 22, విజయనగరం 27, పార్వతీపురం మన్యం 15, అల్లూరి సీతారామరాజు 2, విశాఖపట్నం 6, అనకాపల్లి 20, కాకినాడ 18, కోనసీమ 7, తూర్పు గోదావరి 18, పశి్చమ గోదావరి 4, ఏలూరు 7, బాపట్ల 1, కృష్ణా 2 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ⇒ అలాగే, వడగాడ్పులు శ్రీకాకుళం జిల్లాలో 8, అల్లూరి 8, విశాఖపట్నం 2, అనకాపల్లి 2, కాకినాడ 3, కోనసీమ 8, తూర్పుగోదావరి 1, పశ్చిమ గోదావరి 13, ఏలూరు 21, కృష్ణా 19, ఎనీ్టఆర్ 17, గుంటూరు 17, పల్నాడు 15, బాపట్ల 20, ప్రకాశం 6 మండలాల్లోను వీయనున్నాయని వివరించింది. ⇒ ఇక బుధవారం 195 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 147 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. ⇒ సోమవారం తిరుపతి జిల్లా సత్యవేడులో 41.9, మనుబోలు (నెల్లూరు) 41.5, వేమూరు (బాపట్ల), పెడన (కృష్ణా) 40.9, చింతూరు (అల్లూరి) 40.8, డెంకాడ (విజయనగరం) 40.7, రావికమతం (అనకాపల్లి) 40.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఈ సీజన్లో వర్షాలే వర్షాలు.. ఈ సీజన్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా వర్షపాతాలు నమోదవుతాయని తెలిపింది. రుతు పవనాలు వేగంగా విస్తరిస్తుండడంతో మంచి వర్షాలకు అవకాశమున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఐఎండీ ప్రత్యేక బులిటెన్ విడుదల చేసింది. అలాగే, ఈశాన్య భారతంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం, వాయవ్య భారతంలో సాధారణ వర్షపాతం, మధ్య, దక్షిణ భారతదేశాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదుకావచ్చని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర సోమవారం ఢిల్లీలో జరిగిన వర్చువల్ మీడియా సమావేశంలో అంచనా వేశారు. జూన్–సెప్టెంబర్ కాలంలో దీర్ఘకాల సగటు 87 సెం.మీ. వర్షపాతంలో 106 శాతం మేర వర్షపాతం నమోదుకావచ్చన్నారు. -
ఐదు రోజుల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు మధ్య బంగాళాఖాతంలో చురుకుగా కదులుతున్నాయి. రానున్న 5 రోజుల్లో రుతుపవనాలు బంగాళాఖాతంలో పూర్తిగా విస్తరించి కేరళను తాకేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వారాంతంలోగా కేరళలోకి ప్రవేశించిన తర్వాత ఆరు రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. రుతుపవనాల కదలికల ఆధారంగా రాష్ట్రంలోకి ప్రవేశించే సమయం ఆధారపడి ఉంటుందని పేర్కొంది. దేశంలో ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. చాలా చోట్ల సాధారణం.. కొన్నిచోట్ల అత్యధికం..ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనవల్ల రానున్న రెండ్రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయన్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవగా కొన్నిచోట్ల సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అత్యధికంగా 45.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జంబూగలో 45.4 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో 44.9, జగిత్యాల జిల్లా తిర్యాణిలో 44.9, ఆసిఫాబాద్ జిల్లా వెల్గటూరులో 44.8, జగిత్యాల జిల్లా జైనలో 44.7, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో 44.7 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఆదిలాబాద్‌లో అత్యధికంగా 43.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
విస్తరిస్తున్న ‘నైరుతి’
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల విస్తరణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ రుతుపవనాలు ఆదివారం దక్షిణ అండమాన్ సముద్రం, మాల్దీవులు, కొమరిన్, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇవి రానున్న రెండు రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతం, కొమరిన్, అండమాన్, నికోబార్ దీవుల్లోని మిగిలిన భాగాలకు విస్తరించనున్నాయి. మరోవైపు దక్షిణ కోస్తా తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి, నైరుతి దిశగా వంగి ఉంది.అలాగే దక్షిణ కోస్తా తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర అంతర్గత కర్నాటక వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి ఉంది. మరోపక్క రాష్ట్రంపైకి ఆగ్నేయ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటన్నిటి ఫలితంగా రానున్న మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. ప్రధానంగా మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని అన్ని జిల్లాల్లో, బుధవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోను వర్షాలు కురవవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.అదే సమయంలో అక్కడక్కడ పిడుగులు కూడా పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు మంగళవారం 28 మండలాల్లో వడగాడ్పలు వీచే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో 8 మండలాల్లో, విజయనగరం 6, పార్వతీపురం మన్యం 12, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని వివరించింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఓబులదేవర చెరువు (శ్రీసత్యసాయి) వద్ద 5.5 సెంటీమీటర్లు, వెదురుకుప్పం (చిత్తూరు) 3.8, మండపేట (కోనసీమ) 3.3, కొత్తవలస (విజయనగరం) 3, పులివెందుల (వైఎస్సార్) 2.9, నిడదవోలు (తూర్పు గోదావరి), అడ్డతీగల (అల్లూరి సీతారామరాజు)ల్లో 2.8, చింతలపూడి (ఏలూరు), నర్సీపట్నం (అనకాపల్లి)ల్లో 2.6 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. 22న అల్పపీడనం ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 24వ తేదీకి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమై ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉంది. -
దంచి.. ముంచి
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: నైరుతి రుతుపవనాలు రాకముందే రాష్ట్రంలో భారీ వర్షం కురిసింది. గురువారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షం కురవగా... రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మధ్యాహ్నం వరకు ఎండవేడితో ఉక్కిరిబిక్కిరైన గ్రేటర్ ప్రజలకు మధ్యాహ్నం 3.30గంటల సమయంలో మొదలైన వాన ఉపశమనాన్ని ఇచ్చింది. గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని గంటకుపైగా ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. కుండపోత వానతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి.ప్రధాన రహదారుల వెంట ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. సికింద్రాబాద్‌లో అత్యధికంగా 11.6 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, కృష్ణానగర్‌లో 9, షేక్‌పేటలో 8.65, అంబర్‌పేట్‌లో 8.45, నాంపల్లిలో 8.3, ఖైరతాబాద్‌లో 7.73 సెం.మీ. నమోదైంది. హైదరాబాద్ జిల్లాతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. అదేవిధంగా సిద్దిపేట, కరీంనగర్, మెదక్, వనపర్తి, మంచిర్యాల, ఆసిఫాబాద్, కామారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, మహబూబ్‌నగర్, జగిత్యాల, జనగామ, పెద్దపల్లి, సిరిసిల్ల, భువనగిరి, నిజామాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 199 ప్రాంతాల్లో ఒక సెంటీమీటర్ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళికా విభాగం వెల్లడించింది. సాధారణంగా మే నెల మధ్యలో ఇంత పెద్ద వాన కురవడం గత పదేళ్లలో ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మరో రెండు రోజులు.. తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఉపరితల ఆవర్తనం గురువారం మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు చెప్పింది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు సైతం కురుస్తాయని పేర్కొంది. హైదరాబాద్, జనగామ, నాగర్‌కర్నూల్, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం రాష్ట్రంలో చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో... ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. దుబ్బాక మార్కెట్ యార్డులో తూకానికి సిద్ధం చేసిన 3 వేల క్వింటాళ్ల ధాన్యం, మిరుదొడ్డి, అక్బర్పేట–భూంపల్లి, ములుగు మండలాల పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. పాపన్నపేట మండలం ఆరెపల్లిలో పిడుగుపడి 10 మేకలు మృతి చెందాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం కురిసింది. అడ్డాకుల, మిడ్జిల్, మూసపేట, ధరూర్, జడ్చర్ల, భూత్పూర్, వెల్దండ తదితర మండలాల్లో వర్షప్రభావం ఉంది. జడ్చర్ల మార్కెట్లో విక్రయానికి వచి్చన ధాన్యం, సరీ్వస్ రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసింది. ఈదురుగాలులకు పలుచోట్ల మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో, బొమ్మలరామారంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశుల్లోకి వర్షపు నీరు చేరింది. తూకం వేసిన ధాన్యం బస్తాలు కూడా తడిసిపోయాయి. సూర్యాపేట పట్టణంలోని తాళ్లగడ్డలో ఈదురుగాలుల కారణంగా హోర్డింగ్ కూలిపోయింది. పిడుగుపాటుతో ముగ్గురు మృతి రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ముగ్గురు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్ గ్రామపంచాయతీ పరిధిలోని భరత్‌నగర్‌కు చెందిన రైతు రుద్రారపు చంద్రయ్య (42) పొలంలో సాగు చేస్తుండగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మరణించాడు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని శాత్రాజుపల్లికి చెందిన కంబోళ్ల శ్రీనివాస్ (32) చెట్టుపైకి ఎక్కి చింతకాయ తెంపుతుండగా పిడుగుపడి మృతిచెందాడు. చెట్టు కింద ఉన్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనివాస్‌కు తల్లిదండ్రులు, భార్య, మూడు నెలల కుమారుడు ఉన్నారు. కడ్తాల్ మండలం కలకొండకు చెందిన కార్పెంటర్ పసునూరి ప్రవీణ్‌చారి (30) తన మామ నాగోజు జంగయ్యచారితో కలిసి పని నిమిత్తం బైక్‌పై కడ్తాల్ వచ్చారు. పని ముగించుకుని సాయంత్రం స్వగ్రామాలకు వెళ్తుండగా వాస్‌దేవ్‌పూర్ గేట్ వద్దకు చేరుకోగానే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. బైక్‌ను నడుపుతున్న జంగయ్య వాహనాన్ని రోడ్డు పక్కన ఆపేశాడు. వెనకాల కూర్చున్న ప్రవీణ్ బైక్ దిగి బస్ షెల్టర్‌లోకి వెళ్తుండగా.. సమీపంలో ఒక్కసారిగా పిడుగు పడింది. ప్రవీణ్ అక్కడికక్కడే మృతిచెందగా.. జంగయ్యకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. జంగయ్యచారి కూతురు మౌనికతో ప్రవీణ్చారికి ఏడాది క్రితమే వివాహమైంది. బుధవారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు (సెల్సియస్‌లలో) కేంద్రం గరిష్టం ఆదిలాబాద్ 39.8 రామగుండం 39.0 నిజామాబాద్ 38.8 ఖమ్మం 38.4 భద్రాచలం 38.2 మహబూబ్‌నగర్ 38.1 నల్లగొండ 38.0 హన్మకొండ 36.0 హైదరాబాద్ 35.6 హకీంపేట్ 35.4 దుండిగల్ 35.2 మెదక్ 35.2 -
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమృద్ధిగా ‘నైరుతి’ వానలు
సాక్షి, విశాఖపట్నం: భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో మంచి వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంపై ఐఎండీ సోమవారం ముందస్తు అంచనాలను విడుదల చేసింది. రాష్ట్రంలో సాధారణానికి మించి అధికంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఎండలు, వడగాడ్పులతో అల్లాడుతున్న ప్రజలకు ఐఎండీ చెప్పిన కబురు ఉపశమనం కలిగించింది. గత ఏడాది ఎల్‌నినో పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో అరకొర వర్షాలే కురిశాయి. ఫలితంగా పంటలు దెబ్బతిన్నాయి. రానున్న నైరుతి సీజన్లో రాష్ట్రంలో సాధారణంకంటే అధిక వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా తెలిపారు. ఈ వానలు పంటలకు ఎంతో మేలు చేయనున్నాయి. అన్నదాతలకు ఊరట ఇవ్వనున్నాయి. నైరుతి రాకపై మే నెలలో స్పష్టత ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆగమనం ఎప్పుడనే విషయమై మే నెల మధ్య నాటికి స్పష్టత రానుంది. సాధారణంగా జూన్ ఒకటో తేదీ నాటికి ఈ రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. గత ఏడాది ఎనిమిది రోజులు ఆలస్యంగా జూన్ ఎనిమిదిన కేరళను తాకాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాలకు నెమ్మదిగా విస్తరించాయి. దీంతో వర్షాలు సకాలంలో కురవకపోవడమే కాదు.. సమృద్ధిగాను కురవలేదు. కొనసాగుతున్న వడగాడ్పులు రాష్ట్రంలో వడగాడ్పులు కొనసాగుతున్నాయి. పలుచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 40–44 డిగ్రీల వరకు నమోదయ్యాయి. 38 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 75 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. రానున్న మూడురోజులు ఇవి మరింతగా ప్రభావం చూపనున్నాయి. కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు నమోదయ్యే అవకాశాలున్నాయి. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 43.9 డిగ్రీలు, నంద్యాల జిల్లా బనగానపల్లెలో 43.3, అల్లూరి జిల్లా ఎర్రంపేటలో 43.1, పల్నాడు జిల్లా మాచెర్ల, విజయనగరం జిల్లా రాజాంలలో 42.8, అనకాపల్లి జిల్లా గాదిరాయిలో 42.7 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం 63 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 130 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. విజయనగరం జిల్లాలో 22, శ్రీకాకుళం 15, పార్వతీపురం మన్యం 13, అనకాపల్లి 4, అల్లూరి సీతారామరాజు 3, కాకినాడ 3, తూర్పు గోదావరి 2, ఏలూరు జిల్లాలో ఒక మండలంలో తీవ్ర వడగాడ్పులు వీస్తాయి. తూర్పు గోదావరి జిల్లాలో 17, కాకినాడ 16, శ్రీకాకుళం జిల్లాలో 14, ఏలూరు 13, అనకాపల్లి 12, అల్లూరి సీతారామరాజు 11, కోనసీమ 9, కృష్ణా 7, ఎనీ్టఆర్ 7, గుంటూరు 7, విజయనగరం 5, పల్నాడు 4, విశాఖపట్నం 3, పశ్చిమ గోదావరి 3, పార్వతీపురం మన్యం జిల్లాలో 2 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. బుధవారం 38 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 135 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణసంస్థ తెలిపింది. -
చినుకు చుక్క రాలలేదు!
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల సీజన్ సెపె్టంబర్‌తో ముగిసినప్పటికీ.. రుతుపవనాల నిష్క్రమణ సమయమైన అక్టోబర్‌లో వర్షాల నమోదుకు బాగానే అవకాశాలుంటాయి. గత పదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే అక్టోబర్‌లో సాధారణం నుంచి రెట్టింపు స్థాయిలో వర్షాలు కురవగా.. ప్రస్తుత అక్టోబర్‌లో మాత్రం తీవ్ర వర్షాభావం నెలకొంది. 8.8 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను, నెల పూర్తయ్యే నాటికి కేవలం 0.53 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది. హైదరాబాద్‌లో అయితే.. వర్షం పడనేలేదు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగా వర్షాలు నమోదవుతాయని నిపుణులు ముందుగానే హెచ్చరించారు. నైరుతి రుతుపవనాల సీజన్లో సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించగా, సాధారణానికి కాస్త ఎక్కువగానే సగటు వర్షపాతం నమోదైంది. నైరుతి సీజన్లో రాష్ట్ర సగటు 73.8 సెంటీమీటర్లు ఉండగా ఈసారి 86.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కానీ మండలాలను యూనిట్‌గా తీసుకుంటే మాత్రం చాలాచోట్ల లోటు వర్షపాతమే నమోదైంది. అక్టోబర్‌లో నైరుతి నిష్క్రమణతో పాటు ఈశాన్య రుతుపవనాల ప్రవేశం ఉంటుంది. ఈ సమయంలో నెలకొనే వాతావరణ పరిస్థితులతో సాధారణంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. కానీ ఇందుకు భిన్నంగా తీవ్ర వర్షాభావమే నమోదయ్యింది. ‘ఈశాన్య’సీజన్ మొదలైనా.. ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాల సీజన్ కొనసాగు తోంది. రాష్ట్రంలో నైరుతి, ఈశాన్య సీజన్లో జూన్ నెల నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు 82.92 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 86.76 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే 5 శాతం అధిక వర్షపా తం నమోదైనప్పటికీ పలు జిల్లాల్లో లోటు వర్షపా తం ఉంది. జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో లోటు వర్షపాతం ఉండగా..మరో 21 జిల్లాల్లో సాధారణం, 7 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఇక నవంబర్ నెలలోనూ అక్టోబర్ మాదిరి వర్షాభావ పరిస్థితులే ఉంటాయని ఐంఎండీ తాజాగా వెల్లడించింది. ఈ నెలలో కేవలం ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. దక్షిణాదిన కేరళ మినహా మిగతా రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. నవంబర్‌లో రాష్ట్రంలో 2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పతనమై చలి తీవ్రత పెరగాల్సి ఉండగా.. పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో రాత్రిపూట కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది. -
దక్షిణాది రాష్ట్రాల్లో నీటికి కటకట
సాక్షి, అమరావతి: దక్షిణాది రాష్ట్రాల్లో సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) వెల్లడించింది. నైరుతి రుతువపనాల ప్రభావం వల్ల కృష్ణా, కావేరి, పెన్నా పరీవాహక ప్రాంతాల్లో సరైన వర్షాలు కురవకపోవడం వల్ల జలాశయాల్లోకి నీటి నిల్వలు చేరలేదని పేర్కొంది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లోని జలాశయాల పూర్తి నిల్వ సామర్థ్యం 53.334 బీసీఎం (బిలియన్ క్యూబిక్ మీటర్లు) కాగా.. 25.361 బీసీఎం (48 శాతం) నిల్వలే ఉన్నాయని తెలిపింది. గతేడాది ఇదే రోజు నాటికి ఈ జలాశయాల్లో 92 శాతం నీరు నిల్వ ఉండేదని.. గత పదేళ్లలో సగటున ఆ ప్రాజెక్టుల్లో 74 శాతం నిల్వ ఉండేవని వెల్లడించింది. గత పదేళ్లలో ఈ ఏడాదే జలాశయాల్లో కనిష్ట స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో జలాశయాల పూర్తి నిల్వ సామర్థ్యం 11.121 బీసీఎంలు కాగా.. ప్రస్తుతం కేవలం 2.815 బీసీఎంలు (25 శాతం) మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయానికి ఆ ప్రాజెక్టుల్లో 98 శాతం నీరు నిల్వ ఉండేదని.. గత పదేళ్లలో ఇదే రోజు నాటికి సగటున 76 శాతం నీరు నిల్వ ఉండేదని సీడబ్ల్యూసీ వెల్లడించింది. నీటి నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో సాగునీటికి దక్షిణాదిలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, పెన్నా బేసిన్లో తీవ్ర ఇబ్బందులు ఉంటాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా 150 భారీ ప్రాజెక్టుల్లోకి వచ్చే వరద ప్రవాహం, నీటి నిల్వలను సీడబ్ల్యూసీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది. ఆ 150 ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై శుక్రవారం సీడబ్ల్యూసీ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. నివేదికలోని ప్రధానాంశాలివీ సీడబ్ల్యూసీ పర్యవేక్షించే 150 జలాశయాల్లో పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 257.812 బీసీఎంలు. ఆ ప్రాజెక్టుల లైవ్ స్టోరేజ్ కెపాసిటీ 178.784 బీసీఎంలు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుల్లో 129.636 బీసీఎంలు(73 శాతం) నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి ఆ ప్రాజెక్టుల్లో 140.280 బీసీఎంలు (81 శాతం) నీరు నిల్వ ఉండేది. గత పదేళ్లలో ఇదే సమయానికి సగటున 160.40 బీసీఎంలు (92 శాతం) నీరు నిల్వ ఉండేది. దేశవ్యాప్తంగా చూసినా గత పదేళ్ల కంటే ఈ ఏడాది జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. దేశవ్యాప్తంగా దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే మిగతా ప్రాంతాల్లో ప్రస్తుతం నీటి లభ్యత మెరుగ్గానే ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లోని జలాశయాల్లో 89 శాతం, తూర్పు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో 77 శాతం, పశ్చిమ రాష్ట్రాల్లోని జలాశయాల్లో 88 శాతం, మధ్య భారత రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో 83 శాతం మేర నీటి నిల్వలు ఉన్నాయి. -
Andhra Pradesh: 20న అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళా ఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 4.5 కి.మీ.ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం వాయవ్య దిశగా కదులుతూ ఈనెల 20 నాటికి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం నివేదికలో వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంపైకి ఈశాన్య గాలులు వీస్తున్నాయి. రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈనెల 23 నుంచి రాష్ట్రంలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని పేర్కొంది. కాగా నైరుతి రుతుపవనాల ఉపసంహరణ రేఖ మచిలీపట్నం, కర్నూలు మీదుగా పయనిస్తున్నది. మరో నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రం నుంచి పూర్తిగా ని్రష్కమించే పరిస్థితులున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా నైరుతి రుతుపవనాలు పూర్తిగా ఉపసంహరించుకున్న వెనువెంటనే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఇందుకు బంగాళాఖాతంలో అల్పపీడనం లేదా ఉపరితల ఆవర్తనం వంటివి ఏర్పడితే మరింత అనుకూలతకు దోహదం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈనెల 20న బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారనున్నాయని చెబుతున్నారు. అనంతరం రాష్ట్రంలో వర్షాలు ఊపందుకుంటాయని వీరు పేర్కొంటున్నారు. -
‘ఈశాన్యం’లో చల్లని కబురు
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ఒకింత నిరాశపరిచిన నేపథ్యంలో ఈశాన్య రుతుపవనాలు ఎలాంటి ప్రభావం చూపుతాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఆ ఆందోళనకు తెరదించుతూ భారత వాతావరణ శాఖ(ఐఎండీ) చల్లని కబురు మోసుకొచ్చింది. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల వల్ల రాష్ట్రంలో సాధారణం కంటే ఒకింత అధిక వర్షపాతం నమోదవుతుందని తాజాగా ప్రకటించింది. దీనిని బట్టి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగనున్న ఈశాన్య రుతుపవనాల సీజన్లో కురిసే వర్షాలతో రబీ పంటలకు ఎంతో మేలు జరగనుంది. ఐఎండీ అంచనాల ప్రకారం రాష్ట్రంలోని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాలు సాధారణానికి మించి, ఉత్తర కోస్తాంధ్రలో సాధారణంగాను వర్షాలు కురవనున్నాయి. ఈ రుతుపవనాలు రాష్ట్రంలోకి ఈ నెల 20 నాటికల్లా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాల మాదిరిగా ఈశాన్య రుతుపవనాల సీజన్లో కురిస్తే కుండపోత వర్షాలు కురుస్తాయని.. ఒకవేళ అధిక వర్షాలు కురవకపోయినా వర్షాభావ పరిస్థితులు మాత్రం ఉండకపోవచ్చని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. ఈ నెలలో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, నవంబర్‌లో మాత్రం విస్తారంగా కురవనున్నాయని ఐఎండీ అంచనా వేస్తోంది. నైరుతి నిష్క్రమణలో జాప్యం! రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించిన అనంతరం ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపుతాయి. సాధారణంగా రాష్ట్రంలోకి ఇవి అక్టోబర్ 18–22 తేదీల మధ్య ప్రవేశిస్తాయి. ఇప్పటికే వారం రోజుల ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు సెపె్టంబర్ 25న రాజస్థాన్ నుంచి క్రమంగా ఉపసంహరించుకుంటున్నాయి. అక్టోబర్ 15 నాటికల్లా ఇవి దేశం నుంచి పూర్తిగా నిష్క్రమిస్తాయి. మరో రెండు రోజుల్లో ఒడిశా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ నుంచి ఉపస0హరించుకుంటాయని ఐఎండీ తెలిపింది. ఈ తరుణంలో సిక్కిం నుంచి ఉత్తర ఒడిశా వరకు ఉపరితల ద్రోణి, ఉత్తర కోస్తాంధ్ర పరిసరాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. గాలిలో తేమ తగ్గి పొడి గాలులు ఏర్పడితే ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కానీ.. ప్రస్తుత ద్రోణి, ఆవర్తనాల వల్ల గాలిలో తేమ పెరిగి నైరుతి రుతుపవనాల నిష్క్రమణను ఒకింత మందగించేలా చేస్తాయని అంచనా వేస్తున్నారు. ‘నైరుతి’లో సాధారణమే కానీ.. ఐఎండీ నివేదిక ప్రకారం జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకు నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో సాధారణ వర్షపాతమే నమోదైంది. ఈ నాలుగు నెలల సమయంలో రాష్ట్రంలో 521.6 మి.మీ.కు గాను 454.6 మి.మీ. వర్షపాతం రికార్డయింది. అంటే కురవాల్సిన దానికంటే 13 శాతం తక్కువ వర్షపాతం అన్నమాట. సాధారణం కంటే 20 శాతం తక్కువ కురిస్తే అది సాధారణ వర్షపాతంగానే పరిగణిస్తారు. రాష్ట్రంలోని కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమ గోదావరి, అనంతపురం, అన్నమయ్య, కర్నూలు జిల్లాల్లో లోటు, కృష్ణా జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతమే రికార్డయింది. మరోవైపు ఈసారి నైరుతి రుతుపవనాలు సకాలంలో వర్షించకపోగా, కొన్ని సమయాల్లో కుండపోతగా వర్షాలను కురిపించాయి. ఆగస్టులో రుతుపవన ద్రోణి మూడు వారాలకు పైగా హిమాలయాల్లోనే తిష్ట వేసుకుని ఉండిపోయింది. ఫలితంగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడక వర్షాలు కురవకుండా పోయాయి. -
‘నైరుతి’ నిష్క్రమణ ఆరంభం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతోంది. సోమవారం నుంచి పశ్చిమ రాజస్థాన్ ప్రాంతం నుంచి వీటి ఉపసంహరణ మొదలవుతుంది. వాయవ్య భారతదేశంలో యాంటీ సైక్లోన్ అభివృద్ధి చెందడం, నైరుతి రాజస్థాన్‌లో పొడి వాతావరణం నెలకొనడం ద్వారా ఈ రుతుపవనాల నిష్క్రమణ మొదలు కానున్నట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమై అక్టోబర్ 15 నాటికి దేశం నుంచి నైరుతి రుతు పవనాల నిష్క్రమణ పూర్తవుతుంది. సాధారణంగా నైరుతి రుతుపవనాల నిష్క్రమణ రాజస్థాన్ నుంచి సెప్టెంబర్ 17 నుంచి ఆరంభమవుతుంది. కానీ.. ఈ ఏడాది వారం రోజులు ఆలస్యంగా ఉపసంహరణ మొదలవుతోంది. ఈ ఏడాది నైరుతి ఆగమనం కూడా వారం రోజుల ఆలస్యంగానే మొదలైంది. వాస్తవానికి జూన్ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి క్రమంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తాయి. అయితే, ఈ ఏడాది ఇవి వారం రోజులు ఆలస్యంగా అంటే జూన్ 8వ తేదీన కేరళను తాకాయి. వీటి విరమణలోనూ అదే తీరును కనబరిచాయి. ఈ ఏడాది ‘నైరుతి’ విభిన్నం! ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు విభిన్నంగా ప్రభావం చూపాయి. ఈ రుతుపవనాల సీజన్ జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. ఈ సమయంలో బంగాళాఖాతంలో కనీసం ఐదారు అల్పపీడనాలు, మూడు వాయుగుండాలు, ఒకట్రెండు తుపానులు సంభవిస్తాయి. కానీ.. ఈ సీజనులో ఇప్పటివరకు నాలుగు అల్పపీడనాలు మాత్రమే ఏర్పడ్డాయి. ఇవి కూడా స్వల్పంగానే ప్రభావం చూపాయి తప్ప ఆశించిన స్థాయిలో వర్షాలను కురిపించలేదు. ఈ ఏడాది ఒక్క వాయుగుండం గాని, తుపాను గాని ఏర్పడలేదు. వాయుగుండాలు, తుపానులు ఏర్పడితే సమృద్ధిగా వానలు కురిసేందుకు దోహద పడేవి. ఈ దృష్ట్యా రాష్ట్రంలో ఈ సీజన్లో ఇప్పటివరకు 16.8 శాతం లోటు వర్షపాతం నమోదైంది. తిరోగమనంలో వర్షాలు సాధారణంగా నైరుతి రుతుపవనాల తిరోగమనంలోనూ వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలకు ఆస్కారం ఉంటుందని, రుతుపవనాలు చురుకుదనం సంతరించుకుంటాయని, ఫలితంగా వానలు కురుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా తిరోగమనంలో కురిసే వర్షాలతో రాష్ట్రంలో నెలకొన్న లోటు వర్షపాతం సాధారణ స్థితికి చేరుకుంటుందని, వచ్చే నెల 15 వరకు వర్షాలు పడతాయని పేర్కొంటున్నారు. ఎందుకిలా జరిగిందంటే! ఈ సీజన్లో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ప్రభావం చూపకపోవడానికి వాతావరణ నిపుణులు వివిధ కారణాలు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు భూమధ్య రేఖ ప్రాంతం నుంచి అరేబియా, బంగాళాఖాతం శాఖలుగా> విడిపోతాయి. వీటిలో బంగాళాఖాతం శాఖ ప శ్చిమ మధ్య బంగాళాఖాతంలో కాకుండా చైనా, జపాన్ దేశాల వైపు వెళ్లిపోయాయి. దీంతో చైనా సముద్రంలో ఈ సీజన్లో రెండు మూడు బలమైన తుపానులు ఏర్పడ్డాయి. పైగా.. రుతుపవన ద్రోణి దాదాపు నెల రోజులపాటు హిమాలయాల్లోనే ఉండిపోయింది. ఫలితంగా పశి్చమ బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడక రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవకుండా పోయాయి. దీనికి ఎల్‌నినో పరిస్థితులు కూడా తోడయ్యాయని వాతావరణ శాఖ విశ్రాంత అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి వివరించారు. -
India Meteorological Department: 25 నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం!
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఈ నెల 25వ తేదీ తర్వాత వాయవ్య భారత్ నుంచి వెనక్కి వెళ్లిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది. అక్టోబర్ 15 నాటికి నైరుతి రుతుపవనాలు దేశం నుంచి పూర్తిగా నిష్క్రమిస్తాయి. రాబోయే ఐదు రోజుల్లో ఉత్తర, మధ్య భారతదేశంలో వర్షాలు తగ్గిపోతాయని తెలియజేసింది. పశి్చమ రాజస్తాన్ నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనానికి అనువుగా పరిస్థితులు మారుతున్నాయని పేర్కొంది. ఈ రుతుపవనాలతో సాధారణంగా 832.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ, ఈసారి 780.3 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. -
మళ్లీ పుంజుకోనున్న రుతుపవనాలు
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో జూన్, జూలై నెలల్లో వర్షాలు కురిశాయి. జూలైలో భారీ వర్షపాతం నమోదయ్యింది. ఆగస్టులో రుతుపవనాలు ముఖం చాటేశాయి. అయితే, అతిత్వరలో రుతుపవనాలు మళ్లీ పుంజుకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ(ఐఎండీ) గురువారం వెల్లడించింది. మధ్య, దక్షిణ భారతదేశంలో వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. 91 నుంచి 109 శాతం వర్షపాతం నమోదవుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ సెప్టెంబర్‌లో భారీ వర్షాలు కురిసినా.. జూన్–సెప్టెంబర్ సీజన్లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లేనని తెలిపారు. -
మూడురోజులు తేలికపాటి వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవన ద్రోణి, నైరుతి రుతుపవనాల చురుకుదనం ప్రభావంతో ఐదారు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. అల్పపీడనం బలహీనపడడంతో పాటు నైరుతి రుతుపవనాల చురుకుదనం కూడా తగ్గింది. ఫలితంగా శుక్రవారం నుంచి వానలు చిరుజల్లులకే పరిమతమయ్యాయి. శుక్రవారం కర్నూలు జిల్లా కామవరంలో మాత్రమే గరిష్టంగా 1.2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. మరెక్కడా ఒక్క సెంటీమీటరుకు మించి వర్షం కురవలేదు. రానున్న మూడురోజులు రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. -
పది రోజుల్లో నాలుగింతల వాన!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా గత పది రోజుల పాటు కురిసిన వానలు వర్షపాతం రికార్డులను తారుమారు చేశాయి. పది రోజుల క్రితం 54% లోటు వర్షపాతం ఉండగా.. ఇప్పుడు ఏకంగా 65 శాతం అధిక వర్షపాతానికి చేరడం గమనార్హం. ఏటా జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు నైరుతి రుతపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. ఈ నాలుగు నెలల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా సగటున 73.91 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. ఇందులో జూలై 28వ తేదీ నాటికి 33.64 సెంటీమీటర్ల సగటు వర్షం కురవాలి. అయితే ఈ ఏడాది ఇదే సమయానికి ఏకంగా 55.75 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అంటే సాధా రణం కంటే 22.11 సెంటీమీటర్లు (65 శాతం) అధికంగా వానలు పడ్డాయి. కేవలం గత పదిరోజుల వర్షపాతాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. సాధారణం కంటే ఏకంగా నాలుగింతలు అధికంగా వర్షాలు కురిశాయి. లోటు నుంచి అధికం వైపు వాస్తవానికి ఏటా నైరుతి సీజన్ జూన్ 1 నుంచి ప్రా రంభమవుతుంది. ఆ నెల తొలి లేదా రెండో వారంలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించి, వానలు మొదలవుతాయి. కానీ ఈసారి జూన్ నాలుగో వారంలో రుతుపవనాలు ప్రవేశించాయి. ఒకట్రెండు రోజులు మోస్తరు వానలు పడ్డాయి. తర్వాత రుత పవనాల కదలికలు మందగించి వర్షాలు జాడ లే కుండాపోయాయి. దీనితో లోటు పెరుగుతూ వచ్చింది. ఈ నెల 18 నాటికి 19.54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంతో పోలిస్తే 54శాతం లోటు. కానీ 18వ తేదీ నుంచి వానలు మొదలయ్యాయి. తర్వాతి పది రోజులకుగాను 8రోజులు వానలు పడ్డాయి. దీనితో వర్షపాతం 54 శాతం లోటు నుంచి ఏకంగా 65 శాతం అధికానికి చేరింది. అంతటా కుండపోత వానలతో.. గత పది రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కుండపోత వానలు పడ్డాయి. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో అయితే 64.98 సెంటీమీటర్ల అతిభారీ వర్షం రికార్డు సృష్టించింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధికమని వాతావరణ శాఖ ప్రకటించింది కూడా. ఇక తొమ్మిది జిల్లాల్లో అయితే 50 సెంటీమీటర్లపైన సగటు వర్షపాతం నమోదవడం గమనార్హం. -
వాన లోటు తీరినట్టే!
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: : రాష్ట్రమంతటా మూడు రోజులుగా వాన ముసురుకుంది. మరో రెండు రోజులూ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెలరోజులైనా వానలుపడక నెలకొన్న లోటు అంతా తీరిపోతోంది. నాలుగైదు రోజుల కిందటి వరకు ఏకంగా 20 శాతం వరకు లోటు వర్షపాతం ఉండగా.. బుధవారానికి ఇది ఐదు శాతానికి తగ్గింది. నైరుతి సీజన్లో ఏటా ఈ సమయం వరకు 25.7 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఈసారి 24.48 సెంటీమీటర్లకు చేరింది. మరో రెండ్రోజులు వానలు కొనసాగే అవకాశం ఉండటంతో లోటు పూర్తిగా భర్తీ అవుతుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. జిల్లాల వారీగా చూస్తే.. 3 జిల్లాల్లో అధికంగా, 23 జిల్లాల్లో సాధారణ, 7 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ♦ అధిక వర్షపాతం నమోదైన జిల్లాలు: సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ ♦ సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాలు: ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, జనగామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, ములుగు, నారాయణపేట, జయశంకర్ భూపాలపల్లి ♦ లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు: మహబూబాబాద్, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాలు, ఉత్తర ఏపీ తీరం, దక్షిణ ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దాని వల్ల వచ్చే 24 గంటల్లో వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మరో రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండటంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతాయని తెలిపింది. గోదావరిలో పెరిగిన వరద మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణలోని పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వానలు పడుతుండటంతో.. గోదావరి, దాని ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, తాలిపేరు పరవళ్లు తొక్కుతున్నాయి. బుధవారం సాయంత్రం 6 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీలోకి ప్రాణహిత నుంచి 5,41,430 క్యూసెక్కుల వరద వస్తుండగా.. గేట్లు ఎత్తి 5,25,250 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దీనికి ఇంద్రావతి వరద తోడై సమ్మక్క (తుపాకులగూడెం) బ్యారేజీలోకి 6,53,170 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతుండగా.. అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ తర్వాత శబరి, ఇతర వాగుల ప్రవాహాలు కలిసి గోదావరి వరద పోలవరం వైపు పరుగుపెడుతోంది. భద్రాచలం వద్ద బుధవారం రాత్రి 11 గంటలకు గోదావరి వరద 35.07 అడుగులకు చేరింది. వానలు కొనసాగుతుండటంతో ప్రవాహం భారీగా పెరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు ఎగువ గోదావరిలోనూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 33,760 క్యూసెక్కుల వరద వస్తోంది. నీటి నిల్వ 33.34 టీఎంసీలకు చేరింది. వానతో ఏజెన్సీ ప్రజల తిప్పలు ఎడతెరిపి లేని ముసురు, వానలతో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. వాగులు ఉప్పొంగి ప్రవహించి, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు నెలలు నిండిన గర్భిణులను సమీపంలోని సామాజిక ఆస్పత్రుల్లో చేర్చుతున్నారు. వాజేడు, ఏటూరునాగారం మండలాల్లో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మంగపేట మండలంలో మూడు ఇళ్లు కూలిపోయాయి. వెంకటాపురం(కె) మండలంలో నిర్మించిన పాలెం ప్రాజెక్టు ప్రధానకాల్వకు ఒంటిమామిడి గ్రామ సమీపంలో గండి పడింది. గ్రావిటీ కాల్వకు మరమ్మతులేవి! కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నిర్మించిన గ్రావిటీ కాల్వ వర్షాలతో కోతకు గురై కూలుతున్నా.. మరమ్మతులకు నోచుకోవడం లేదు. గత ఏడాది జూలై 14న భారీవర్షాలతో కాల్వ పొడవునా అక్కడక్కడా సిమెంట్ లైనింగ్ కోతకు గురైంది. ప్రస్తుతం రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఎగువ నుంచి వరదనీరు వచ్చి మరింత మట్టి కొట్టుకువస్తోంది. కొట్టుకు వచ్చిన మట్టితో పాటు వరద నీరు మొత్తం గ్రావిటీ కాల్వలోకి చేరుతోంది. ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో కాల్వ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. -
రానున్న రెండు రోజులు విస్తారంగా వర్షాలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో విస్తా రంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్లో 10.5 సెంటీమీటర్ల వర్షపాతం... నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 10.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్ 1వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు 15.4 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కానీ రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో వర్షాలు మందగించాయి. దీంతో రాష్ట్రంలో లో టు వర్షపాతం ఉంది. ఈ సీజన్లో సాధారణ వర్ష పాతం కంటే 32శాతం లోటు వర్షపాతం నమో దైన ట్లు వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 2.51 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అ త్య ధికంగా సిద్దిపేట జిల్లాలో 6.24 సెంటీమీటర్లు, జనగామ జిల్లాలో 6.21 సెంటీమీటర్లు, పెద్దపల్లి జిల్లాలో 4.71 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లాలో 4.60 సెంటీమీటర్ల వర్షం కురిసింది. -
వాతావరణ శాఖ గుడ్‌న్యూస్.. ఈ నెలంతా వానలే!
సాక్షి, హైదరాబాద్: వానాకాలం ఇక జోరందుకోనుంది. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో రాష్ట్రంలో వర్షపాతం ఆశించిన స్థాయిలో లేదు. నైరుతి రుతుపవనాల సీజన్ జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు పరిగణిస్తారు. అయితే జూన్ నెలలో మూడు వారాల తర్వాత రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో వానలు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వానలు జోరందుకున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఈనెలలో సాధారణ వర్షపాతం 24.44 సెంటీమీటర్ల మేర నమోదు కావాల్సి ఉంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల కదలికలు చురుకుగా ఉండటంతో ఈ నెలలో సాధారణంకంటే ఎక్కువగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. జూలై నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా వర్షపాతం నమోదు అంచనాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో సాధారణం కంటే 10 శాతం అధికంగా వర్షాలు కురుస్తాయని వివరించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ వాఖ సూచించింది. ఈనెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్‌లో 46 శాతం లోటు.... జూన్ 22న రాష్ట్రంలోకి వచ్చిన నైరుతి వచ్చినప్పటికీ చాలాచోట్ల మోస్తరు వానలే కురిశాయి. జూన్‌లో 12.93 సెంటీమీటర్ల సగటు వర్షం కురవాల్సి ఉండగా, నెలా ఖరు నాటికి 7.27 సెంటీమీటర్లు మాత్రమే నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 46శాతం లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 7 జిల్లాల్లో మాత్రమే సాధా రణ వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నారాయణపేట్ జిల్లాల్లో జూన్ నెల సా ధారణ వర్షపాతం నమోదైంది. 18 జిల్లాల్లో లోటు వర్షపాతం, మరో 8 జిల్లాల్లో అత్యంత లోటు వర్ష పాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. జూలైలో మాత్రం వర్షాలు ఆశించిన స్థాయిలో కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. -
TS: రాష్ట్రమంతటికీ నైరుతి
సాక్షి, హైదరాబాద్: ఈసారి నైరుతి రుతుపవనాలు చాలా ఆలస్యంగా వచ్చినా రాష్ట్రమంతటా వేగంగా విస్తరించాయి. ఈ నెల 22న రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు.. చురుకుగా కదులుతూ 3రోజుల్లోనే రాష్ట్ర భూభాగానికి పూర్తిగా వ్యాపించాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీనితో అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నట్టు తెలిపింది. శనివారం చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడ్డాయని, రాష్ట్రవ్యాప్తంగా 1.12సెం.మీ.ల సగటు వర్షపాతం నమోదైందని వెల్లడించింది. జిల్లాల వారీగా వర్షపాతం తీరును పరిశీలిస్తే.. భద్రాది కొత్తగూడెం జిల్లాలో 2.15 సెంటీమీటర్లు, మేడ్చల్–మల్కాజిగిరిలో 2.12, సిద్దిపేటలో 2.05, నాగర్‌కర్నూల్‌లో 1.96 సెంటీమీటర్లు కురిసినట్టు తెలిపింది. వర్షపాతం లోటు తగ్గుతూ.. రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న వానలతో లోటు వర్షపాతం తగ్గుతోంది. సాధారణంగా జూన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 12.93 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాలి. ఇందులో ఈ నెల 24 నాటికి 9.94 సెంటీమీటర్ల మేర కురవాలి. కానీ ఈసారి 4.16 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అంటే రాష్ట్రంలో 58శాతం లోటు వర్షపాతం ఉంది. తొమ్మిది జిల్లాల్లో లోటు, 22 జిల్లాల్లో అత్యంత లోటు ఉండగా.. నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మాత్రమే సగటు సాధారణ వర్షపాతానికి చేరువైంది. అయితే రుతుపవనాలు విస్తరిస్తూ, వానల జోరు పెరుగుతోంది. మరో ఐదు రోజులు ఇదే తరహా వాతావరణం ఉంటే సాధారణ వర్షపాతానికి చేరుకుంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. అది క్రమంగా బలపడి ఆదివారం ఉదయం కల్లా అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు పడతాయని.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు చాన్స్ ఉందని పేర్కొంది. -
ఎట్టకేలకు ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. బుధవారం నాటికి ఆంధ్రప్రదేశ్ అంతటా వ్యాప్తి చెందిన రుతుపవనాలు... గురువారం కల్లా తెలంగాణలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం ఖమ్మం జిల్లా పరిసరాల వరకు వ్యాప్తి చెందిన రుతుపవనాలు.. రెండు, మూడు రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది జూన్ మొదటివారం కల్లా రాష్ట్రమంతటా విస్తరించిన రుతుపవనాలు... ఈసారి రెండువారాలకు పైబడి ఆలస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించాయి. సాధారణంగా జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు కాలాన్ని నైరుతి సీజన్‌గా పరిగణిస్తారు. ఈ క్రమంలో జూన్ మొదటి వారంలో తొలకరి జల్లులతో ప్రారంభమై క్రమంగా మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు నమోదవుతాయి. సీజనల్ వర్షాలు వ్యవసాయానికి అత్యంత కీలకం. కానీ ఈసారి తొలకరి వర్షాలు ఆలస్యం కావడంతో రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ రానున్న కాలంలో ఎలాంటి వాతావరణం నెలకొంటుందో వేచి చూడాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. తొలకరి వర్షాలు చూసి విత్తనాలు నాటకుండా కాస్త వేచిచూడడమే మంచిదని సూచిస్తున్నారు. మొదలైన వానలు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాలపై గురువారం రుతుపవనాలు ప్రభావం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ప్రస్తుతానికైతే రుతుపవనాలు చురుకుగా ముందుకు కదులుతున్నాయి. ఇదే వేగాన్ని కొనసాగిస్తే రానున్న మూడురోజుల్లో రాష్ట్రమంతటా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు నిపుణులు సూచిస్తున్నారు. జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా నమోదు కావాల్సిన సాధారణ వర్షపాతం 12.93 సెంటీమీటర్లు. కాగా జూన్ 22 నాటికి 9.15 సెంటీమీటర్ల సాధారణ వర్షం కురవాలి. కానీ రుతుపవనాల రాక ఆలస్యం కావడం, వర్షాలు అరకొరగా మాత్రమే పడటంతో ఈనెల 22 నాటికి కేవలం 2.31 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. సాధారణంగా నమోదు కావాల్సిన వర్షపాతంలో 75 శాతం లోటు ఉన్నట్లు స్పష్టమవుతోంది. కాగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా 0.5 సెంటీమీటర్ల (5 మిల్లీమీటర్లు) సగటు వర్షపాతం నమోదైంది. వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, జనగామ, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, గద్వాల, నల్లగొండ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కాగా యాదగిరిగుట్ట పట్టణంతో పాటు యాదాద్రి కొండపై గురువారం భారీ వర్షం కురిసింది. కొండపై భక్తులు తల దాచుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. కొండ కింద గల సెంట్రల్ పార్కింగ్‌లో వాహనాలు నీట మునిగిపోయాయి. ఉపరితల ఆవర్తనం.. పశ్చిమ దిశ నుంచి గాలులు రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలు, ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 – 5.8 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు నమోదు కానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి రాష్ట్రానికి బలంగా గాలులు వీస్తున్నాయని వివరించింది. పిడుగుపాటుకు రైతు మృతి శంషాబాద్ రూరల్: మండలంలోని ననాజీపూర్ గ్రామానికి చెందిన అయినాల ఇంద్రసేనారెడ్డి (46) గురువారం సాయంత్రం కౌలు భూమిలో బంతినారు వేస్తున్నాడు. ఇంతలో ఉరుములు, మెరుపులతో వాన ప్రారంభం కాగా అతనిపై పిడుగు పడింది. దీంతో స్పృహ తప్పిన ఇంద్రసేనారెడ్డిని స్థానికులు శంషాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. అతనికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. -
తెలంగాణకు చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్..
సాక్షి, హైదరాబాద్: తీవ్రమైన ఎండలు, వడగాలులతో అల్లాడుతున్న తెలంగాణకు ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు తెలిపింది. ఖమ్మం వరకూ నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని, రెండు మూడు రోజుల్లో తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు ఇవి విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత కొంతమేర తగ్గనుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో ఆవర్తనం ఏర్పడిందని, దీని కారణంగా పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకు గాలులు వీస్తున్నాయని వాతావావరణశాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. చదవండి: సిద్దిపేటకు రైలు.. తిరుపతి, బెంగళూరు, ముంబయికి ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ములుగు ,యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. ఈనెల 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ హైదరాబాద్ కేంద్రం తెలంగాణకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. సాక్షి, అమరావతి: ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. పార్వతీపురం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. అనకాపల్లి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం, ఏలూరులో గురువారం ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. పల్నాడు జిల్లాలోనూ పలుచోట్ల వర్షం కురిసింది. ఈదురు గాలులు వీస్తున్నాయి. రాజుపాలెం, సత్తెనపల్లి, క్రోసూరు, నకరికల్లు, పెదకూరపాడు, నూజెండ్లలో వర్షం పడగా.. ఈదురుగాలులకు కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నలిచిపోయింది. -
విస్తరించిన ఆశల ‘నైరుతి’
అనంతపురం : ఆలస్యంగానైనా నైరుతి రుతుపవనాలు ఉమ్మడి అనంతపురం జిల్లా అంతటా విస్తరించాయి. ఈ మేరకు సోమవారం భారత వాతావరణ శాఖ విడుదల చేసిన ఛాయాచిత్రం స్పష్టం చేస్తోంది. ఈ నెల 8న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు 13న శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలను కూడా తాకాయి. కానీ... వాతావరణం అనుకూలించక ఐదారు రోజులు దోబూచులాడిన పవనాల్లో ఆదివారం కదలిక వచ్చింది. సోమవారం ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల్లో దాదాపు విస్తరించినట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.సహదేవరెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె.అశోక్‌కుమార్ తెలిపారు. రుతుపవనాలు ముందుకు కదలడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడినందున రాగల రెండు రోజులూ జిల్లాకు వర్షసూచన ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షపాతం నమోదు కావచ్చని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే పరిస్థితి ఉందన్నారు. నైరుతి విస్తరించడంతో వర్షం కోసం అన్నదాత ఎదురుచూస్తున్నాడు. విత్తనాలు, ఎరువులతో సిద్ధంగా ఉన్న రైతులు ఖరీఫ్ పంట సాగు కోసం సమాయత్తంగా ఉన్నారు. జూలై నెలంతా విత్తుకునేందుకు మంచి అదనుగా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇంకా సమయం ఉన్నందున వర్షం పడితే సాఫీగా సేద్యపు పనులు చేపట్టనున్నారు. -
జలమయమైన చైన్నె... మరో మూడు రోజులు భారీ వర్షాలు!
సాక్షి, చైన్నె : ఈ ఏడాది వేసవిలో భానుడు ప్రతాపాన్ని చూపించాడు. ఎండతోపాటు ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నైరుతి రుతుపవనాల రాకతో శనివారం వాతావరణం కాస్త చల్లబడింది. ఆదివారం రాత్రి ఒక్క సారిగా వాతావరణం పూర్తిగా మారింది. ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో చైన్నె, శివారులోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలు గజగజ వణికిపోయాయి. ఒక్క రాత్రిలో 27 సంవత్సరాల అనంతరం జూన్‌లో అతి భారీ వర్షం కురిసింది. దీంతో ఆరు జిల్లాల్లోని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. చక్కర్లు కొట్టిన విమానాలు రాత్రంతా కురిసిన వర్షానికి విమాన సేవలకు తీవ్ర ఆటంకం కలిగింది. సోమవారం వేకువ జామున చైన్నె వైపుగా షార్జా, అబుదాబి, దుబాయ్, లండన్, దోహ, శ్రీలంక, సింగపూర్, మస్కట్ తదితర దేశాల నుంచి వచ్చిన పది విమానాలు ల్యాండింగ్ చేయలేని పరిస్థితిలో గాల్లో చక్కర్లు కొట్టాయి. వాతావరణం పూర్తిగా అనుకూలించక పోవడంతో వీటిని బెంగళూరుకు మళ్లించారు. అలాగే చైన్నె నుంచి పలు దేశాలకు వెళ్లాల్సిన విమానాల సేవలు కొన్ని గంటల పాటు ఆలస్యమయ్యాయి. ఉదయం వాతావరణం అనుకూలించిన తర్వాత బెంగళూరు నుంచి చైన్నె విమానాలు చేరుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం కుండ పోత వర్షానికి నగర, శివారుల్లోని అనేక మార్గాలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉదయాన్నే విధులకు వెళ్లాల్సిన వాళ్లు, వాహన చోదకులకు కష్టాలు తప్పలేదు. ఎంఎండీఏ, వ్యాసార్పాడి, గిండి, తిరువీనగర్, కోయంబేడు, పూందమల్లి హైరోడ్డు తదితర మార్గాలు, మెట్రో రైలు పనులు జరుగుతున్న రోడ్లపై నీరు ప్రవహించింది. అనేక చోట్ల సబ్ వేలలోకి నీరు చేరింది. కొన్నిచొట్ల చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. చైన్నె కార్పొరేషన్ అధికారులు 4 వేల మంది సిబ్బందితో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. చైన్నె, శివారుల్లో పూర్తి స్థాయిలో నిర్మించిన వర్షపు నీటి కాలువల ద్వారా నటిని గంటల వ్యవధిలోనే తొలగించారు. చైన్నె కార్పొరేషన్ ఇన్చార్జ్ కమిషనర్ సమీరన్ మాట్లాడుతూ చైన్నె కార్పొరేషన్ కంట్రోల్ రూమ్‌లో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారని వివరించారు. 30 చోట్ల విరిగి పడ్డ చెట్లు, కొమ్మలను తొలగించారని తెలిపారు. 1913 ద్వారా చైన్నె కార్పొరేషన్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించారు. అధికారుల అప్రమత్తం ఈ ఏడాది నైరుతి రుతు పవనాల ప్రభావం మరింత ఆశాజనకంగా ఉంటుందని వాతావరణ కేంద్రం ప్రకటించడంతో రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ శాఖమంత్రి కేకేఎస్ఎస్ ఆర్ రామచంద్రన్ నేతృత్వంలో స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్‌ను ఎళిలగంలో ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ప్రత్యేక బృందం అధికారులు వర్షపాతం, సహాయక చర్యలు, జలాశయాల్లోకి నీటి రాక తదితర అంశాలను పర్యవేక్షించి, ఆయా జిల్లాల్లోని ప్రత్యేక బృందాలను అప్రమత్తం చేస్తున్నారు. అలాగే ఒక్క రాత్రిలోనే చైన్నె శివారులో మొత్తం సరాసరి 20.4 సె.మీ మేరకు వర్షం కురిసినట్టు ప్రకటించారు. కాంచీపురం, చెంగల్పట్టు, తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, విల్లుపురం, కడలూరు, మైలాడుతురై, నాగపట్నం, తిరువారూర్, తంజావూరు, తిరుచ్చి, అరియలూరు, పెరంబలూరు జిల్లాల్లో వర్షాల దృష్ట్యా, ఆయా జిల్లా యంత్రాంగాన్ని అలెర్ట్ చేశారు. ఈ విషయంగా మంత్రి కేకేఎస్ఎస్ఆర్ మీడియాతో మాట్లాడుతూ చైన్నెలోని అన్ని సబ్ వేలను పర్యవేక్షిస్తున్నామని, రెండు మూడు మినహా తక్కిన సబ్‌వేలలోకి నీరు చేరలేదని వివరించారు. అన్ని సబ్ వేలు, సొరంగ మార్గాలలో హైకెపాసిటీ మోటార్లను సిద్ధం చేసినట్టు తెలిపారు. చైన్నె కార్పొరేషన్ పరిధిలో 169 సహాయ కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. గిండి కత్తిపారా, ఆర్కాట్ రోడ్డుల్లో నిలిచిన నీటిని గంటల వ్యవధిలో తొలగించామన్నారు. 13 జిల్లాలో జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొనడంతో, ఆయా జిల్లాల అధికారులను మరింత అలర్ట్ చేశామన్నారు. వర్ష ప్రభావితానికి గురయ్యే ప్రాంతాలలో ముందు జాగ్రత్తలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించామన్నారు. అత్యవసర సేవలకు 1070, 1077 టోల్ఫ్రీం నంబర్లు, వాట్సాప్ నంబరు 94458 69848ను సంప్రదించవచ్చునని సూచించారు. రైలు ప్రయాణికులకు తప్పని అవస్థలు చైన్నె ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలోని వ్యాసార్పాడి – బేసిన్ బ్రిడ్జి వంతెన కింది భాగంలో వర్షపు నీరు చేరడంతో పగుళ్లకు ఆస్కారం ఉందన్న సమాచారంతోపాటు సిగ్నలింగ్ సమస్య రావడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి బయలు దేరాల్సిన, రావాల్సిన రైళ్లను ఆవడి, తిరువళ్లూరు, బీచ్ స్టేషన్లకు పరిమితం చేశారు. ఇక్కడి ఉంచి ఈ రైళ్లు పట్టాలెక్కాయి. ఇందులో కోయంబత్తూరు ఇంటర్ సిటీ, ముంబై ఎక్ ప్రెస్, కోయంబత్తూరు వందే భారత్, తిరుపతి ఎక్స్‌ప్రెస్ తదితర 7 రైళ్లు ఉన్నాయి. చైన్నెకు వచ్చిన శతాబ్ది రైలును సిగ్నలింగ్ సమస్యతో ఆవడికి పరిమితం చేశారు. మరో మూడు రోజులు వర్షాలు బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర దిశలో పయనిస్తుండడంతో మరో మూడు రోజులు చైన్నె, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి బాలచంద్రన్ తెలిపారు. కళ్లకురిచ్చి, మైలాడుతురై, డెల్టా జిల్లాలు, ఉత్తర తమిళనాడులోని తిరువణ్ణామలై, రాణిపేట జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు మీనంబాక్కంలో 16 సె.మీ, తరమణి, ఆలందూరులో 14 సె.మీ, చెంబరంబాక్కంలో 13 సె.మీ, అన్నా వర్సిటీ, డీజీపీ కార్యాలయం పరిసరాలలో 10 సె.మీ, తాంబరం, కుండ్రత్తూరు, నుంగంబాక్కంలలో 9 సె.మీ, కొరట్టూరు, ఎంజీఆర్ నగర్ పరిసరాల్లో 8 సె.మీ వర్షం పడింది. 27 సంవత్సరాల అనంతరం చైన్నె, శివారులలో జూన్ నెలలు ఒక్క రాత్రి అతి భారీ వర్షం కురిసినట్టు వాతావరణ పరిశోధకులు వివరించారు. సముద్రంలో గాలి ప్రభావం 45 నుంచి 65 కి.మీ వేగంతో వీస్తాయని పేర్కొన్నారు. -
AP: కదిలిన రుతుపవనాలు..వచ్చే 4 రోజుల్లో రాష్ట్రమంతటికీ విస్తరణ
సాక్షి, అమరావతి: ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు ముందుకు కదిలాయి. పది రోజుల క్రితమే అవి రాయలసీమను తాకినా బిపర్జోయ్ తుపాను ప్రభావంతో ముందుకు కదల్లేదు. శ్రీహరికోట ప్రాంతంలోనే కేంద్రీకృతమై ఉండిపోయాయి. తుపాను తీరం దాటడంతో ఆదివారం నుంచి అవి ముందుకు కదిలేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. సోమవారం దాదాపు రాయలసీమ అంతటికీ విస్తరించాయి. దీంతో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారానికి కోస్తాంధ్రలోని పలు ప్రాంతాలు, తెలంగాణకు విస్తరించే అవకాశం ఉంది. మరో నాలుగు రోజుల్లో రాష్ట్రమంతటికీ విస్తరించి వర్షాలు కురిసే పరిస్థితి నెలకొంది. ఉపరితల ఆవర్తనం ఇలాగే కొనసాగితే ఇంకా ముందుగానే రాష్ట్రమంతా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తగ్గిన ఉష్ణోగ్రతలు రుతుపవనాల ప్రభావంతో కొద్దిరోజులుగా ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. కొన్ని ప్రాంతాలు మినహా చాలాచోట్ల వాతావరణం చల్లబడింది. గ్రేటర్ రాయలసీమ జిల్లాలన్నీ చల్లబడగా కోస్తా జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు తగ్గాయి. కృష్ణా, గుంటూరు బెల్ట్‌లోనే సోమవారం ఎండ తీవ్రత కనిపించింది. గత పది రోజులుగా 600కి పైగా కేంద్రాల్లో 40 నుంచి 46 డిగ్రీలు వరకు నమోదైన ఉష్ణోగ్రతలు సోమవారం 120 కేంద్రాల్లోనే నమోదయ్యాయి. రుతుపవనాల ప్రభావంతో ఏర్పడిన మేఘాలు బలంగా కదులుతుండడంతో మంగళవారానికల్లా రాష్ట్రం మొత్తం చల్లబడి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. -
ముఖం చాటేసిన వరుణుడు
సాక్షి,బళ్లారి: నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో రైతుల్లో ఆందోళన నెలకొంటోంది. ఈసారి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి వరణుడు ముఖం చాటేయడంతో రైతులు తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. జిల్లాలో తుంగభద్ర ఆయకట్టుతో పాటు, వర్షాధారిత భూములు దాదాపు ఐదు లక్షలు ఎకరాలు సాగుభూమి ఉంది. ఇందులో తుంగభద్ర ఆయకట్టు కింద దాదాపు మూడు లక్షల ఎకరాలు సాగుభూమి ఉండగా, మిగిలిన భూమి వర్షాధారిత ఆధారంగా పంటలు పండిస్తున్నారు. బళ్లారి, సిరుగుప్ప, కంప్లి, సండూరు నియోజకవర్గాల పరిధిలో ఇప్పటి వరకు కేవలం రెండు వేల ఎకరాల్లో మాత్రమే విత్తనాలు సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షలు ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా జూన్ నెల దాటే సమయం వస్తున్నప్పటి ఇప్పటి వరకు సరైన పదును వాన రాకపోవడం విత్తన సాగు ప్రశ్నార్థంగా మారింది. దుక్కులు దున్ని దిక్కులు అష్టకష్టాలతో దుక్కులు దున్ని విత్తన సాగుకు రైతులు సిద్ధం చేసుకున్నారు. మరోవైపు రైతులకు విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని వ్యవసాయాధికారి మల్లికార్జున సాక్షికి తెలిపారు. జిల్లాలో ప్రధానంగా వర్షాధారిత భూముల్లో జొన్న, సజ్జ, రాగి, మొక్కజొన్న, కంది తదితర పంటలు సాగు చేస్తుండగా, వర్షాలు ఆలస్యం కావడంతో జొన్న సాగు చేయడానికి కష్టతరమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాధారిత భూముల్లో దుక్కిలు దున్ని పొలాలు సిద్ధం చేసి వర్షం కోసం ఎదురుచూస్తుండగా, తుంగభద్ర డ్యాం ఖాళీ కావడంతో ఆయకట్టు రైతులు పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. ముందుగా వరినారు సిద్ధం చేసుకునేందుకు కూడా భయపడుతున్నారు. సాధారణంగా జూన్ రెండవ వారంలోపు తుంగభద్ర డ్యాంలోకి ఇన్‌ఫ్లో బాగా పెరుగుతుండేవి. ఇప్పుడు డ్యాంలో నిల్వలు అడుగంటాయి. 4 టీఎంసీలు పడిపోవడంతో ఇన్‌ఫ్లోలు జీరో అయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి డ్యాంలో 40 టీఎంసీలకు పైగా ఉండటంతో రైతులు ఆయకట్టులో వ్యవసాయ పనులు చేసుకునేవారు. ఈ ఏడాది డ్యాంలో నీటిమట్టం ఎప్పుడు పెరుగుతుందా, వర్షాలు ఎప్పుడు వస్తాయా అని రైతులు ఎదురు చూస్తున్నారు. -
TS: రెండు రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. మరో వైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కుదులుతున్నాయి. ఏపీ, కర్ణాటక, తమిళనాడు వరకు విస్తరించాయి. పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు రుతుపవనాలు విస్తరిస్తున్నాయని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇక, ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది. మిగతా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. అదే సమయంలో ఈ జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని హెచ్చరించింది. మరోవైపు.. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వానలు పడే సూచనలున్నాయని చెప్పింది. ఇదే సమయంలో వడగాల్పులు కూడా వీచే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ చేసింది. Weather update!! Scattered thuderstorm rains now Adilabad Nirmal Asifabad Mancherial peddapalli nalgonda Places will see rains for next 2 hours with gusty winds also ☔⚡ — Telangana state Weatherman (@ts_weather) June 11, 2023 ఇది కూడా చదవండి: AP: ఇక వానలే.. ఏపీలోకి ప్రవేశించిన రుతుపవనాలు -
AP: ఇక వానలే.. ఏపీలోకి ప్రవేశించిన రుతుపవనాలు
సాక్షి, అమరావతి: వేసవిలో ఎండలు మండుతున్న వేళ తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు అందింది. ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. శ్రీహరికోట సమీపంలో రుతుపవనాలు విస్తరించినట్టు వాతావరణశాఖ తెలిపింది. కాగా, వచ్చే 24 గంటల్లో మరికొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని వాతావరణశాఖ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. దీని ప్రభావంతో అక్కడక్కడే జల్లులు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. -
రైతుకు మరింత దన్ను
సాక్షి, న్యూఢిల్లీః దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న వేళ రైతులకు కేంద్రం తీపికబురు చెప్పింది. ఖరీఫ్ సీజన్ ఆరంభమవుతున్న వేళ 2023–24 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి 14 రకాల పంటల కనీస మద్దతు ధరలు పెంచుతూ నిర్ణయం చేసింది. వ్యవసాయదారుల ఉత్పత్తులకు లాభదాయక ధరలు నిర్ధారించేలా, పంటల వైవిధ్యతను ప్రోత్సహించేలా మద్దతు ధరల పెంపున కు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. వరి సాధారణ, గ్రేడ్–ఏ రకాలపై ప్రస్తుతం ఉన్న మద్దతు ధరను రూ.143 పెంచింది. దీంతో ప్రస్తుతం సాధారణ రకం వరి క్వింటాల్ ధర రూ.2,040 ఉండగా, అది ప్రస్తుత కేంద్రం నిర్ణయంతో రూ.2,183కి పెరగగా, గ్రేడ్–ఏ రకం వరి ధర రూ.2,060 నుంచి రూ.2,203కి చేరింది. పప్పుధాన్యాలకు పెరిగిన మద్దతు.. ఇటీవలి కాలంలో కేంద్రం పప్పుధాన్యాలు, నూనెగింజలు, తృణధాన్యాల పంటల సాగును ప్రోత్సహిస్తోంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, జాతీయ ఆహార భద్రతా మిషన్ వంటి పధకాల ద్వారా పంటల వైవి«ధ్యం ఉండేలా రైతులను ప్రోత్సహిస్తోంది. 2022–23 మూడవ ముందస్తు అంచనాల ప్రకారం, దేశంలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 330.5 మిలియన్ టన్నులుగా అంచనా వేయగా, ఇది మునుపటి ఏడాది 2021–22తో పోలిస్తే 14.9 మిలియన్ టన్నులు ఎక్కువగా ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పప్పుధాన్యాలు, నూనెగింజల ధరలను కేంద్రం గరిష్టంగా పెంచింది. పెసర ధరను ఏకంగా రూ.803కి పెంచింది. దీంతో పెసర ధర రూ.7,755 నుంచి రూ.8,558కి పెరిగింది. కంది మద్దతు ధరను రూ.400, మినప ధరను రూ.350 మేర పెంచింది. నూనెగింజల విషయంలో వేరుశనగకు రూ.527, సన్‌ఫ్లవర్ రూ.360, సోయాబీన్ రూ.300, నువ్వులు రూ.805 చొప్పున ధరలు పెంచింది. వ్యవసాయ ఖర్చులు ధరల కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఎప్పటికప్పుడు మద్దతు ధరని నిర్ణయిస్తున్నామని, గత ఏడాదులతో పోలిస్తే ఈ ఏడాది అత్యధికంగా ధరలను పెంచామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పియూశ్‌గోయల్ పేర్కొన్నారు. రైతు సంక్షేమ సంస్కరణల్లో భాగమిది: మోదీ దాదాపు 14 ఖరీఫ్ పంట రకాలకు కనీస మద్దతు ధర పెంచడంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘గత తొమ్మిదేళ్లలో రైతు సంక్షేమం కోసం మా ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణల క్రమంలో భాగమే ఈ ఎంఎస్పీ పెంపు నిర్ణయం. ఈ పెంపుతో రైతులు తమ పంటకు లాభసాటి ఆదాయం పొందటంతోపాటు వైవిధ్య పంటల సాగు విధానం మరింత పటిష్టమవనుంది’ అని మోదీ ట్వీట్‌చేశారు. వరికి క్వింటాల్‌కు రూ.143 పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయించడంపై మోదీ సంతోషం వ్యక్తంచేశారు. గత దశాబ్దకాలంలో ఇంతగా ధర పెంచడం ఇది రెండోసారి. గత పదేళ్లలో చూస్తే గరిష్టంగా 2018–19లో క్వింటాల్‌కు రూ.200 పెంచారు. 2023–24 ఖరీఫ్ పంటలకు 5.3 శాతం నుంచి 10.35 శాతం శ్రేణిలో కనీస మద్దతు ధర పెంచారు. -
Monsoon 2023: వాతావరణ శాఖ చల్లటి కబురు
సాక్షి, ఢిల్లీ: వాతావరణ శాఖ దేశ ప్రజలకు చల్లటి కబురు చెప్పింది. మరో 48 గంట్లలో నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ప్రకటించింది. రుతుపవనాల రాక ఇప్పటికే ఆలస్యం అయ్యింది. ఈ క్రమంలో.. ‘బిపోర్జాయ్’ తుపాను కారణంగా అది మరింత ఆలస్యం కావొచ్చని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు. కానీ, ఆ అంచనా తప్పింది. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ఈ రుతుపవనాల రాక కోసం రైతులు ఎదురు చూస్తుండగా.. బుధవారం భారత వాతావరణ శాఖ ఊరట ఇచ్చే వార్త అందించింది. చల్లని గాలులతో పాటు ఆగ్నేయ అరేబియా సముద్రంతో పాటు లక్షద్వీప్, కేరళ తీరాల ప్రాంతాలలో మేఘాల పెరుగుదల కనిపిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. వాస్తవానికి గతేడాది జూన్ 1నే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకగా.. ఈ ఏడాది ఆ తేదీ నాటికి కనీసం శ్రీలంకను కూడా దాటలేదు. వాతావరణ మార్పుల కారణంగా ఈ సారి రుతుపవనాల రాక ఆలస్యమయ్యింది. తొలుత జూన్ 4 నాటికి తీరం తాకొచ్చని అంచనా వేసినా అది జరగలేదు. బిపోర్జాయ్ తుపాను ప్రభావంతో అరేబియా సముద్రంలో రుతుపవనాల కదలికలు బలహీనంగా ఉన్నట్లు భావించారు. కానీ, ఇవాళ రుతుపవనాల ఆచూకీ కన్పించడంతో ప్రకటన చేసింది వాతావరణ శాఖ. ఇదీ చదవండి: ఒడిశా ప్రమాదం.. బాధితుల పట్ల మరీ ఇంత దారుణంగానా? -
TS: నైరుతి రాక.. జూన్ రెండో వారం నుంచి వానలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ అంచనావేస్తోంది. గత రెండు సీజన్లతో పోలిస్తే ప్రస్తుతం పది నుంచి పదిహేను రోజులు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా విశ్లేషిస్తోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈనెల రెండో వారంలో రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. ఈనెల మొదటి వారంలో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు సాగుతూ తెలంగాణకు చేరుకునేందుకు వారం రోజుల నుంచి పది రోజుల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ సైతం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. గత రెండు సీజన్లలో రుతుపవనాల రాకను పరిశీలిస్తే.. 2021 వర్షాకాలంలో నైరుతి రుతుపవనాలు మే నెలాఖరులో కేరళను తాకగా.. జూన్ మూడో తేదీ నుంచి ఆరో తేదీ మధ్య రాష్ట్రాన్ని తాకాయి. అదేవిధంగా గతేడాది మే 30వ తేదీన కేరళను తాకిన రుతుపవనాలు రాష్ట్రానికి జూన్ 8వ తేదీకి చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఐదు రోజులు ఆలస్యంగా రానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. సాధారణ వర్షపాతం.. జూన్ ఒకటవ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ మధ్య కాలాన్ని నైరుతి సీజన్(వానాకాలం)గా భావిస్తారు. ఈ క్రమంలో నాలుగు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సగటున 75.19 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు తయారు చేసింది. అయితే గత రెండేళ్లుగా రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే 50 శాతం అధిక వర్షాలు కురిశాయి. 2021లో రాష్ట్రంలో 111.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, 2022 సీజన్లో 109.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే అధిక వర్షాలు నమోదు కావడంతో రాష్ట్రంలో చెరువులు, కుంటలు నీటితో నిండుకుండలుగా మారాయి. రెండు రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు సాక్షి, హైదరాబాద్: పశి్చమ విదర్భ నుంచి మరాఠ్వాడ, ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన ఉపరితలద్రోణి స్థిరంగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడా చెదురుమదురుగా, కొన్ని చోట్ల మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదు కావచ్చని వివరించింది. కాగా, వివిధ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల సెల్సియస్ నుంచి 42 డిగ్రీల సెల్సియస్ మధ్యన నమోదు కావొచ్చని, గ్రేటర్ హైదరాబాద్ పరిసర జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్ నుంచి 41 డిగ్రీల మధ్యన నమోదు కావచ్చని తెలిపింది. బుధవారం రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా కీతవారిగూడెంలో 44.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇది కూడా చదవండి: మిక్స్డ్ వెదర్‌తో మహా డేంజర్! -
రుతుపవనాల్లో కదలిక
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల్లో ఎట్టకేలకు కదలిక వస్తోంది. వారం రోజుల కిందట ఈ రుతుపవనాలు అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి సకాలంలోనే ప్రవేశించాయి. తర్వాత అవి ఊహించిన దానికంటే నెమ్మదిగా కదులుతున్నాయి. గురువారం నుంచి అవి చురుకుదనాన్ని సంతరించుకోనున్నాయి. ఒకటి, రెండురోజుల్లో ఈ రుతుపవనాలు మాల్దీవులు, కొమరిన్ ప్రాంతాలతో పాటు నైరుతి, ఆగ్నేయ, మధ్య బంగాళాఖాతాల్లోని కొన్ని ప్రాంతాలకు, అనంతరం మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) మంగళవారం రాత్రి వెల్లడించింది. ఐఎండీ ముందుగా అంచనా వేసినట్టుగా జూన్ 4వ తేదీకల్లా నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశాలు మెరుగుపడ్డాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు మరఠ్వాడా, కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఏపీ, యానాంలలో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రానున్న మూడురోజులు రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. బుధవారం కోస్తాలో అక్కడక్కడ భారీవర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. రానున్న మూడురోజులు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో పాటు ఒకటి, రెండుచోట్ల పిడుగులు పడొచ్చని వివరించింది. -
ఈసారి సాధారణ వర్షపాతమే
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశవ్యాప్తంగానూ 87 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతమే నమోదవుతుందని తెలిపింది. ఈ మేరకు ఐఎండీ హైదరాబాద్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తొలి ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ సీజన్లో రాష్ట్రంలో సాధారణ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించే తొలి నెల జూన్‌లో వర్షాలు సాధారణం కంటే తక్కువగా పడతాయని, జులై నుంచి క్రమంగా పుంజుకుంటాయని వెల్లడించింది. జూన్ మొదటి వారమంతా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది. పెరగనున్న ఉష్ణోగ్రతలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. గత రెండ్రోజులుగా పలుచోట్ల సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతుండగా... ఇకపై మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చేనెల మొదటి వారమంతా సగటు గరిష్ట ఉష్ణోగ్రతలే 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవ్వచ్చని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రానికి వాయవ్య, పశ్చిమ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలు లు వీస్తున్నట్లు సూచించింది. గురువారం రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండ జిల్లా దామెరచర్లలో 44.3 డిగ్రీల సెల్సియస్, నల్లగొండలో 42.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
మొదలైన ‘నైరుతి’ పురోగమనం
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు పురోగ మించడానికి అనువైన వాతావరణం నెలకొన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి గాలులు నిలకడగా ఉండడం, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రంలో వర్షాలు పడడం వల్ల రుతుపవనాల పురోగమనానికి అవకాశం ఏర్పడినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో రుతుపవనాలు వచ్చే 3, 4 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులు మరికొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. వచ్చే 24 గంటల్లో రుతుపవనాలు ఈ ప్రాంతాల్లోనే కొంతవరకు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో రుతుపవనాలు జూన్ మొదటి వారంలో కేరళలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. అప్పటివరకు ఎండల తీవ్రత కొనసాగనుంది. చాగలమర్రిలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఎండల తీవ్రత ఉండగా రాయలసీమ జిల్లాల్లో దాని ప్రభావం ఎక్కువగా కనిపించింది. నంద్యాల జిల్లా చాగలమర్రిలో 46.2 డిగ్రీలు, వైఎస్సార్ జిల్లా సిద్ధవటంలో 45.2, పల్నాడు జిల్లా రొంపిచర్లలో 44.9 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 3 మండలాల్లో తీవ్రవడగాడ్పులు, 25 మండలాల్లో వడగాడ్పులు వీచినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం 23 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, వైఎస్సార్ జిల్లాల్లోని పలు మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అక్కడక్కడ కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన తెలంగాణ అధికారి తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని శుక్రవారం తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ – డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ఎన్.ప్రకాష్‌రెడ్డి సందర్శించారు. సంస్థ అవలంబిస్తున్న సాంకేతికతల గురించి ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆయనకు వివరించారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లో 24/7 వాతావరణాన్ని పర్యవేక్షించే విధానాన్ని తెలిపారు. తుపాన్లు, వరదలు, వడగాలులు, భారీవర్షాలు, పిడుగుపాటు హెచ్చరిక సమాచారాన్ని జిల్లా యంత్రాంగానికి, ప్రజలకు పంపించే వ్యవస్థను వివరించారు. వాతావరణ పరిశోధన విభాగాల్లోని వివిధ అంశాలను ప్రకాష్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వినియోగిస్తున్న టెక్నాలజీని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకాష్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.నాగరాజు, వాతావరణ నిపుణులు ఎం.ఎం అలీ, ఇన్చార్జి సీహెచ్ శాంతిస్వరూప్ పాల్గొన్నారు. -
ఏపీకి చల్లని కబురు.. నైరుతి రుతుపవనాల ప్రవేశం ఎప్పుడంటే?
సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది జూన్ 15వ తేదీకి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రతి ఏడాదీ మే 20 నాటికి అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. జూన్ 1 నాటికి కేరళను తాకుతాయి. అప్పట్నుంచే దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావం మొదలవుతుంది. అయితే ఈ ఏడాది ‘నైరుతి’ మూడు రోజులు ఆలస్యంగా జూన్ 4 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గతేడాది మే 20వ తేదీ కంటే వారం రోజుల ముందే నైరుతి రుతుపవనాలు అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. ఈసారి మాత్రం ఒకటి, రెండు రోజుల ముందు ప్రవేశించి.. ఈనెల 22 నాటికి అండమాన్, నికోబార్ దీవుల అంతటికీ విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది. మరోవైపు రుతుపవనాల ప్రవేశానికి సూచికగా మూడు రోజులుగా అండమాన్, నికోబార్ దీవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చదవండి: సీఎం జగన్ విజయవాడ పర్యటన షెడ్యూల్ ఇదే.. అనంతరం రుతుపవనాలు జూన్ 4 నాటికి కేరళను తాకనుండటంతో.. ఆ ప్రభావం ఏపీపైనా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన పది రోజుల్లోగా రాయలసీమ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాయి. అనంతరం మరో వారం రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తాయి. అంతా అనుకూలిస్తే జూన్ 10కి బదులు 15వ తేదీకల్లా రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్లోనూ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాగల ఐదు రోజుల పాటు వర్షాలు.. కోస్తా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల ఐదు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి.నిన్న జంగమహేశ్వరం లో 45.2 బాపట్ల 45 నరసాపురం 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నం, ఆరోగ్యవరం, కళింగపట్నం ప్రాంతాల్లో సగటున 40 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. -
కాస్త ఆలస్యం నైరుతి రాక.. జూన్ 4న దేశంలోకి! ఐఎండీ వెల్లడి
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఈసారి కాస్త ఆలస్యం కానున్నాయి. అవి జూన్ 4న దేశంలోకి ప్రవేశించవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు తొలుత కేరళలో ప్రవేశిస్తాయి. ఈ ఏడాది రుతుపవనాలు కొంత ఆలస్యమైనప్పటికీ దేశవ్యాప్తంగా పంటల సాగుపై, మొత్తం వర్షపాతంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ఐఎండీ చీఫ్ ఎం.మొహాపాత్రా స్పష్టం చేశారు. రుతుపవనాలు ప్రవేశించే తేదీకి, ఈ సీజన్లో నమోదయ్యే మొత్తం వర్షపాతానికి సంబంధం లేదని తెలిపారు. సాధారణ వర్షపాతమే! నైరుతి రుతుపవనాలు సాధారణంగా ఏటా జూన్ 1న కేరళలో అడుగు పెడతాయి. 2018లో మే 29న, 2019లో జూన్ 8న, 2020లో జూన్ 1న, 2021లో జూన్ 3న, 2022లో మే 29న ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాల రాకపై తమ అంచనాలు 2015 మినహా గత 18 ఏళ్లలో ఎప్పుడూ తప్పలేదని ఐఎండీ పేర్కొంది. మోకా తుఫాను కారణంగానే ఈసారి రుతుపవనాల రాక ఆలస్యమవుతున్నట్లు చెప్పలేమని కేంద్ర ఎర్త్ సైన్సెస్ శాఖ మాజీ కార్యదర్శి ఎం.రాజీవన్ అన్నారు. ఈ ఏడాది నైరుతి రతుపవనాల సీజన్లో దేశంలో సాధారణ వర్షపాతమే నమోదవుతుందని తాము అంచనా వేస్తున్నట్లు ఐఎండీ గత నెలలో తెలియజేసింది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కానుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. దేశంలో గత నాలుగేళ్లు సాధారణం, సాధారణం కంటే అధిక వర్షాలు కురిశాయి. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఆహారంలో 40 శాతం ఆహారం వర్షాధార సాగుతోనే ఉత్పత్తి అవుతోంది. ఆహార భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి తగిన వర్షపాతం నమోదు కావడం చాలా కీలకం. మన దేశంలో 52 శాతం సాగుభూమి వర్షాలపైనే ఆధారపడి ఉంది. -
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను.. రుతుపవనాలపై ప్రభావం ఉండదు
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు ఈ సంవత్సరం కూడా సకాలంలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ప్రభావం రుతుపవనాలపై ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నా అందుకు అవకాశం లేదని వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అకాల వర్షాల ప్రభావం రుతుపవనాలపై ఉండే అవకాశం ఏమాత్రం లేదని అమరావతి వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త కరుణసాగర్ తెలిపారు. అరేబియా సముద్రంలో తుపాను వస్తే దాని ప్రభావం రుతుపవనాలపై కొంత ఉండే అవకాశం ఉంటుందని చెప్పారు. బంగాళాఖాతంలో వచ్చే తుపానుల ప్రభావం రుతుపవనాలపై ఉండదన్నారు. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళలో ప్రవేశిస్తాయి. ఈసారి కూడా అదే సమయానికి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి రుతుపవనాలు మే నెలలో అండమాన్ నికోబార్‌లో ప్రారంభమవుతాయి. ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను వల్ల వీచే బలమైన గాలులతో అవి ఇంకా ముందే కదిలే అవకాశం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రుతుపవనాలు 4, 5 రోజులు ముందుగానే కేరళలో ప్రవేశించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. మంత్రాలయంలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత మే నెలాఖరు వరకు తీవ్ర ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కర్నూలు జిల్లా మంత్రాలయంలో శుక్రవారం అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా పచ్చవలో 43.3, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కసుమూరులో 43.1, చినఅరికట్లలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
తెలంగాణ: ఈ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల నిష్క్రమణతో రాష్ట్రంపై వర్ష ప్రభావం.. మరో వారంపాటు ఉండొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో ఇవాళ, రేపు..(శని, ఆది వారాల్లో) ఉరుములు, మెరుపులతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, రంగారెడ్డి, వరంగల్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ యెల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 18న ఉత్తర అండమాన్, దాని పరిసరాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రెండు మూడు రోజుల తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టినట్లు అనిపించినప్పటికీ.. ఉదయం లేదా సాయంత్రం పూట చిరుజల్లులు కురిసే అవకాశం ఉండొచ్చని తెలిపింది. #15OCT 4:50AM⚠️ Rainy Morning Ahead for #Hyderabad During 5-8AM Moderate -Heavy Rains expected in Many parts of City in next 3-4Hrs Please Plan Accordingly ⚠️⚠️⚠️#HyderabadRains pic.twitter.com/jH58FNh2BW — Hyderabad Rains (@Hyderabadrains) October 14, 2022 HEAVY DOWNPOUR ALERT TODAY ⚠️ STRONG EASTERLY CONVERGENCE will cause Widespread rains in almost all many districts of Telangana during afternoon - early morning with HEAVY - VERY HEAVY RAINS at few areas ⚠️ Hyderabad too, high chances for strong rains during afternoon - morning pic.twitter.com/wNCk1XY8TY — Telangana Weatherman (@balaji25_t) October 15, 2022 ఇదీ చదవండి: ఏపీకి పొంచి ఉన్న తుపాను గండం! -
మూడురోజుల్లో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి నైరుతి రుతుప వనాల ఉపసంహరణ పూర్తికాగా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాలతోపాటు బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి కూడా రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. రానున్న మూడురోజులు మెజార్టీ ప్రాంతాల నుంచి రుతుపవనాల తిరోగమన ప్రక్రియ పూర్తయ్యేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. ఈ నెల 18న ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న రెండ్రోజులు ఆదిలాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబా బాద్, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న రెండ్రోజులు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉష్ణోగ్రతలు సాధారణస్థితిలోనే ఉంటాయని వివరించింది. -
వానలు తగ్గినా సగటును మించి..
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు కాస్త మందగించాయి. జూలైలో అత్యంత చురుకుగా కదిలిన రుతుపవనాలు... ఆగస్టులో నెమ్మదించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టులో వర్ష పాతంపడిపోయింది. నైరుతి సీజన్లో ఇప్పటి వరకు 87.20 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిసి నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నా యి. జూన్‌లో రుతుపవనాల రాకలో జాప్యం నెలకొనడం, ఆ తర్వాత ఒకట్రెండు రోజులు చురుకుగా కదిలి తర్వాత మందగించడంతో ఆ నెలలో వర్షాలు నిరాశపర్చాయి. ఆ తర్వాత జూలై మొదటి వారం నుంచి రుతుపవనాలు చురుకుగా కదలడంతో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. దీంతో వర్షపాతం గణాంకాలు ఒక్కసారిగా పెరిగాయి. ఆగస్టులో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెలాఖరు నాటికి 60.47 సెం.మీ. మేర వర్షాలు కురవాల్సి ఉన్నా.. 87.20 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఈ లెక్కన సాధా రణం కంటే 46 శాతం అధికంగా వర్షాలు కురిశా యి. 33 జిల్లాలకు గాను ఏడు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, మరో 24 జిల్లాల్లో అధిక వర్షాలు, రెండు జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఒక్క జిల్లాలో కూడా లోటు వర్షపాతంనమోదు కాలేదు. జిల్లాల వారీగా వర్షాల తీరును పరిశీలిస్తే... అత్యధికం: నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట్ అధికం: ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల పల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, జన గామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట్, ములుగు సాధారణం: హైదరాబాద్, ఖమ్మం ఈ నెలలో సాధారణమే.. నైరుతి రుతుపవనాల సీజన్ సెప్టెంబర్‌తో ముగుస్తుంది. వాస్తవానికి ఈ సీజన్లో అత్యధిక వానలు కురిసేది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే. కానీ ఈసారి జూలైలోనే అత్యంత భారీ వర్షాలు కురవడంతో సగటు వర్షపాతం భారీగా పెరిగింది. సెప్టెంబర్‌లో కూడా సాధారణ వర్షపాతమే నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెల రెండో వారంలో ఒకట్రెండు రోజులు భారీ వర్షాలకు అవకాశం ఉందని భావిస్తున్నారు. -
జర పైలం.. రెండ్రోజులు.. జోరు వాన!
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటం, దానికి తోడుగా ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో పలుచోట్ల కుండపోత వాన పడింది. వాగులు వంకలు ఉప్పొంగాయి. కాలనీలు నీట మునిగాయి. రహదారులపైకి నీళ్లు చేరాయి. ఇలాగే మరో రెండు రోజులపాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తొమ్మిది జిల్లాల్లో కుండపోత వానలు పడతాయని, మరో 11 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. సాధారణం కంటే ఎక్కువగా.. వానాకాలం సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 18.03 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. శుక్రవారం సాయంత్రానికల్లా 26.57 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణం కంటే 47 శాతం అధికమని వాతావరణ శాఖ పేర్కొంది. 10 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 20 జిల్లాల్లో అధిక వర్షపాతం, 3 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. ఆనందంలో రైతాంగం జోరుగా వానలు కురుస్తుండటంతో రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. ఇప్పటికే దుక్కి దున్నిన రైతులు విత్తనాలు వేయడం, నారు మడులు సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టారు. ఉద్యాన పంటల సాగు సైతం ఊపందుకుంది. కూరగాయలకు మార్కెట్లో డిమాండ్ ఉన్న నేపథ్యంలో వాటి సాగువైపు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. బాగా తగ్గిన ఉష్ణోగ్రతలు రెండు రోజులుగా మబ్బు పట్టే ఉండటం, విస్తారంగా వానలు పడుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గి చలివేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. బొగత జలపాతం పరవళ్లు నల్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. జలపాతాన్ని చూసేందుకు స్థానికులు పోటెత్తారు. నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు ►మహబూబ్‌నగర్ రూరల్ మండలం బొక్కలోనిపల్లి గ్రామ శివార్లలో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్ బస్సు.. శుక్రవారం ఉదయం కోయిలకొండ మండలం కేశ్వాపూర్, పెర్సివీడు, మణికొండ, రామచంద్రాపూర్, మాచన్‌పల్లి, సూగురుగడ్డ తండాలలో విద్యార్థులను ఎక్కించుకుంది. మాచన్‌పల్లి– కోడూర్ స్టేజీ మధ్య రైల్వే అండర్ పాస్ కింద భారీగా వరద నీరు నిలిచి ఉండగా.. డ్రైవర్ గమనించకుండా బస్సును ముందుకు పోనిచ్చాడు. మధ్యలోకి వెళ్లేసరికి బస్సు నీటిలో చిక్కుకుపోయింది. అందులో ఉన్న విద్యార్థులంతా నర్సరీ నుంచి ఐదో తరగతిలోపు చిన్నారులే కావడం, అంతా భయంతో అరవడంతో.. సమీపంలో ఉన్న యువకులు వచ్చి కాపాడారు. ఒక్కొక్కరుగా 30 మంది విద్యార్థులను బయటికి తీసుకొచ్చారు. ఆర్టీఏ, పోలీస్, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. – మహబూబ్‌నగర్ రూరల్ టార్చిలైట్ వెలుతురులో గర్భిణికి ప్రసవం.. ►భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తీవ్ర ఇబ్బంది ఎదురైంది. ఇక్కడి ఎడ్లబంజరు గ్రామానికి చెందిన దుర్గాభవానికి పురుటి నొప్పులు రావడంతో వైద్యులు టార్చిలైట్, సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులో ప్రసవం చేశారు. విద్యార్థులకు ‘వరద’కష్టం! ►కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం దిందా గ్రామ విద్యార్థుల గోస ఇది. ఉదయం పొరుగూరిలోని బడికి వెళ్లిన విద్యార్థులు.. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇలా వాగు పొంగి ప్రవహిస్తోంది. గ్రామస్తులు అక్కడికి చేరుకుని విద్యార్థులను మెల్లగా వాగు దాటించారు. నల్లగొండ, ఖమ్మం ఆగమాగం నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండడంతో రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కుండపోత వాన కురిసింది. చాలా చోట్ల గురువారం అర్ధరాత్రి నుంచే మొదలైన వాన శుక్రవారం అర్ధరాత్రి దాటినా కురుస్తూనే ఉంది. రహదారులపై నీరు పారుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ►సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలంలో అత్యధికంగా 19.04 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట పట్టణంలో మానస నగర్, వినాయకనగర్ తదితర ప్రాంతాలు నీటమునిగాయి. మద్దిరాల మండలం ముకుందాపురంలో వర్షానికి ఒక ఇల్లు కూలింది. నల్లగొండలో పానగల్ బైపాస్ రోడ్డు చెరువులా మారింది. నకిరేకల్‌లో పలు కాలనీలో జలమయం అయ్యాయి. ►ఖమ్మం ఉమ్మడి జిల్లా పరిధిలో చాలా చోట్ల వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో అధికారులు ఆయా మార్గాల్లో రాకపోకలను నిలిపివేశారు. మాటూరు సమీపంలో నిర్మాణంలోని బ్రిడ్జి వద్ద డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోవడంతో ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 20.3 అడుగులకు పెరిగింది. కిన్నెరసాని, తాలిపేరు జలాశయాలకు భారీగా వరద వస్తుండటంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మణుగూరు మండలం కూనవరం రైల్వేగేట్ సమీపంలోని కోడిపుంజు వాగులో వర్సా శంకర్ అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం నడిగడ్డకు చెందిన గిరిజన మహిళ ఏనిక దుర్గమ్మ (55) గుబ్బలమంగి వాగులో గల్లంతయ్యారు. ఇదే జిల్లా పాల్వంచ మండలం దంతెలబోరుకు చెందిన బొదా నర్సిరెడ్డి పాడి గేదెల కోసం వెళ్లి కిన్నెరసాని నది మధ్యలో చిక్కుకుపోయాడు. అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఆయనను రక్షించారు. నర్సిరెడ్డిని కాపాడుతున్న అగ్నిమాపక సిబ్బంది ►మహబూబాబాద్ జిల్లాలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పాకాల ఏరు చెక్‌డ్యాంపై నుంచి వరద పొంగిపొర్లుతోంది. చిన్నగూడూరు మండలంలోని పలు ఇళ్లు జలమయం అయ్యాయి. -
చిరపుంజిలో రికార్డ్ స్థాయి వర్షం
న్యూఢిల్లీ: దేశంలో అత్యధిక వర్షపాతానికి చిరునామాగా నిలిచిన చిరపుంజిలో గత 27 ఏళ్లలో జూన్‌లో ఎన్నడూలేనంతటి భారీ వర్షపాతం ఈ ఏడాది నమోదైంది. మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర నుంచి బుధవారం ఉదయం ఎనిమిదిన్నర వరకు అంటే ఒక రోజులో ఏకంగా 811.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడ 1995 తర్వాత జూన్‌లో ఒక్కరోజులో ఇంతటి వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి అని భారత వాతావరణ శాఖ బుధవారం పేర్కొంది. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్లే ఇంతటి వర్షం పడిందని వెల్లడించింది. మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర నుంచి బుధవారం ఉదయం ఎనిమిదిన్నర వరకు మాసిర్రమ్లో 710.6 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదవడం గమనార్హం. 1974–2022 కాలానికి ప్రపంచంలోనే అత్యంత అధిక వర్షపాతం నమోదైన ప్రాంతంగా మాసిర్రమ్ గతంలో రికార్డులకెక్కడం తెల్సిందే. చిరపుంజి, మాసిడ్రమ్ రెండూ దాదాపు 10 కి.మీ.ల దూరంతో మేఘాలయలోనే ఉన్నాయి. -
ఏపీ వాసులకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్.. రెండు, మూడు రోజుల్లో..
సాక్షి, అమరావతి: రాయలసీమలోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు నెమ్మదిగా రాష్ట్రమంతా విస్తరిస్తున్నాయి. రెండు, మూడు రోజుల్లో రాయలసీమలోని మరికొన్ని ప్రాంతాలకు, తర్వాత నాలుగైదు రోజుల్లో కోస్తాంధ్రలో విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాయలసీమలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. కోస్తా జిల్లాల్లో మాత్రం పలుచోట్ల ఎండల తీవ్రత కొనసాగుతోంది. చదవండి: AP: అందరి చూపు మనవైపే.. దేశంతోనే పోటీ పడుతున్నాం.. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడుతున్నా, ఎక్కువ ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంది. రాబోయే రెండు, మూడు రోజుల్లో రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దిలా ఉండగా మంగళవారం ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో 41 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జాజులకుంటలో 34, అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గాదిరాయిలో 22.5, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం మంగోలులో 21, పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో 13.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కొండాయిగూడెంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
రాష్ట్రానికి నైరుతి..
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు సోమవారం రాష్ట్రాన్ని తాకనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలు లు, ఇతర వాతావరణ పరిస్థితులు అనుకూ లంగా ఉండటంతో నైరుతి రుతుపవనాలు చురుకుగా వ్యాప్తి చెందే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పరిస్థితు లు ఇలాగే కొనసాగితే రానున్న మూడు, నాలు గు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం ఉందని నిపుణులు చెబు తున్నారు. సోమవారం మధ్యాహ్నం కల్లా నైరు తి రుతుపవనాలు ఉత్తర అరేబియా సము ద్రంలోని కొన్ని ప్రాంతాలు, కొంకణ్‌లోని మిగి లిన భాగాలు, గుజరాత్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు, మధ్య మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలు, మొత్తం కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఆంధ్ర ప్రదేశ్ పశ్చిమ, మధ్య, వాయవ్య బంగాళా ఖాతం ప్రాంతాల్లో ముందుకు సాగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, ఈశాన్య బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో చాలాచోట్ల ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. -
సాక్షి కార్టూన్: 11-06-2022
-
తెలంగాణలోకి ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఊరటనిచ్చేలా వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. తెలంగాణలోకి మంగళవారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే రుతుపవనాల రాకకు రెండ్రోజులు ఆలస్యమైనట్లు పేర్కొంది. ఈ నెల 10వ తేదీ కల్లా రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపింది. వాస్తవానికి మే 29న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించగా ఆ తర్వాత వాటి కదలిక మందగించడంతో వ్యాప్తి ఆలస్యమైంది. ప్రస్తుతం రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. సాధారణం కంటే కాస్త ఎక్కువ వానలు... ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాలు సంతృప్తికరంగా ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే కాస్త ఎక్కువ వానలు కురుస్తాయని చెబుతున్నారు. తెలంగాణలో సాధారణ వర్షపాతం 72.05 సెంటీమీటర్లు కాగా.. గతేడాది వానాకాలంలో 100.97 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 6 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవగా 21 జిల్లాల్లో అధిక వర్షపాతం, మరో 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతంతో పోలిస్తే రాష్ట్రంలో ఈసారి మొత్తంమీద 104 శాతం మేర వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాల కదలికలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అంచనాల్లో మార్పులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పెరిగిన ఉక్కపోత... కేరళలోకి నైరుతి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించినప్పటికీ తొలి మూడు రోజులు మందకొడిగా కదలడంతో వాతావరణం చల్లబడలేదు. సాధారణంగా సీజన్‌కు ముందుగా కురిసే వర్షాలతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకొని చల్లబడుతుంది. కానీ ఈసారి నైరుతి సీజన్‌కు ముందు ఉష్ణోగ్రతలు పెరిగాయి. నడివేసవిలో నమోదైనట్లుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. అసని తుపానుతో మే నెల మూడో వారంలో వాతావరణం చల్లబడినట్లు కనిపించినా ఆ తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయి. దీని ప్రభావంతో వాతావరణంలో ఉక్కపోత పెరిగింది. దీనికి వడగాడ్పులు తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తాజాగా మరో రెండ్రోజులు కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. రుతుపవనాలు పూర్తిగా వ్యాప్తి చెందే వరకు ఉష్ణోగ్రతలు సాధారణానికి కాస్త అటుఇటుగానే నమోదు కానున్నాయి. ఆదివారం నల్లగొండలో 43.8 డిగ్రీ సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా మెదక్‌లో 25 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. -
నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఈశాన్య గాలుల ప్రభావం, తేమ గాలులు వీస్తుండడం వల్ల నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా..రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల నిష్క్రమణం క్రమంగా ప్రారంభమయ్యింది. ఈ నెల 23 నాటికి సగానికిపైగా ప్రాంతాల నుంచి, 26న పూర్తిగా నైరుతి ఉపసంహరణ ఉంటుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో 26వ తేదీన ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. -
TS: నాలుగు నెలలు.. మస్తు వానలు!
సాక్షి, హైదరాబాద్: ఈసారి నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని మురిపించాయి. వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్రంలో అత్యధిక వర్షాలు నమోదయ్యా యి. జూన్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు నైరుతి రుతుపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. రాష్ట్రంలో నైరుతి సీజన్లో సాధారణ వర్షపాతం 75.19 సెంటీమీటర్లు. కాగా, ఈ ఏడాది నైరుతి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 104.47 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 39 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. గతేడాది నైరుతి సీజన్లో 46 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా.. ఈ ఏడాది అది కాస్త తగ్గినప్పటికీ సంతృప్తికరంగా వర్షాలు కురవడం గమనార్హం. ఇదిలా ఉండగా అక్టోబర్ 1వ తేదీనుంచి రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల సీజన్ ప్రారంభమైంది. డిసెంబర్ 31వ తేదీవరకు ఉండే ఈ సీజన్లో కూడా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనాలు విడుదల చేసింది. ఆగస్టులో తగ్గినా.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు జూన్ 3వ తేదీన కేరళకు చేరుకోగా.. అదేనెల 5వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించాయి. జూన్ 10వ తేదీ నాటికి ఈ రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. సీజన్ ప్రారంభం నుంచి రుతుపవనాలు చురుకుగా ఉండ డంతో వాతావరణ శాఖ వేసిన ముం దస్తు వర్షపాతం అంచనాలు దాదాపు సరిపోయా యి. సీజన్ ముగిసేనాటికి రాష్ట్రవ్యాప్తంగా 6 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 21 జిల్లాల్లో అధిక వర్షపాతం, 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 13 జిల్లాల్లో 50% కంటే ఎక్కువ వానలు కురిశాయి. నైరుతి సీజన్లో 105 రోజులు రెయినీ డేస్ నమోదు కాగా, 7నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన రోజులు 72. అదేవిధంగా 12 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన రోజులు 28 కాగా, 21 సెంటీమీటర్ల కంటే అధిక వర్షం కురిసిన రోజులు 5 ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రెండేళ్లు వరుసగా.. 2006 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో వర్షపాతం గణాంకాలు పరిశీలిస్తే గతేడాది 46 శాతం అధిక వర్షాలు కురిశాయి. ఈ ఏడాది 39 శాతం అధికంగా వానలు కురిసి రెండోసారి రికార్డు సృష్టించాయి. వరుసగా రెండుసార్లు అత్యధిక వర్షపాతం నమోదు కావడం పదిహేనేళ్లలో ఇదే తొలిసారి. 2019లో 6 శాతం అధిక వర్షాలు నమోదు కాగా 2014 నుంచి 2018 వరకు లోటు వర్షపాతం నమోదైంది. అంతకు ముందు కొన్నిసార్లు లోటు వర్షపాతం నమోదు కాగా, మరికొన్నిసార్లు సింగిల్ డిజిట్లో అధిక వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది నైరుతి సీజన్లో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో అత్యధిక వర్షాలు కురిశాయి. -
ఊపందుకోని ‘నైరుతి’.. ఆందోళనలో రైతులోకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవ నాలు అంతగా ప్రభావం చూపించడం లేదు. సీజన్ ప్రారంభంలో చురుకుగా వ్యాప్తి చెందడంతో రాష్ట్రమంతటా భారీ వర్షాలు పడతాయని వాతా వరణ శాఖ హెచ్చరించింది. బంగాళా ఖాతంలో జూన్ రెండోవారంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభా వంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవు తాయనే సూచనలు కూడా వచ్చాయి. దీంతో అన్ని ప్రభుత్వ విభాగాలు అప్రమత్తమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం సాగు పనులకు సిద్ధమైంది. కానీ ఒకట్రెండు చోట్ల మాత్రమే భారీ వర్షాలు పడగా చాలాచోట్ల తేలికపాటి వానలు ఉసూరుమని పించాయి. అడపాదడపా తేలికపాటి జల్లులే పడుతున్నాయి మినహా భారీ వర్షాల జాడే లేదు. అక్కడి వాతావరణ పరిస్థితులే మూలం రాష్ట్రంలో సీజనల్ వర్షాలకు మూలం బంగాళా ఖాతం, అరేబియా సముద్రంలోని వాతా వరణ పరిస్థితులే. అక్కడ ఏర్పడే ఉపరితల ఆవర్త నాలు, ఉపరితల ద్రోణులు, అల్పపీడనాలు తదితర పరి స్థితులతో రాష్ట్రంలో వర్షాలు నమోదవుతాయి. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో పొడి వాతావర ణమే ఉంటోంది. ప్రస్తుతం బంగాళా ఖాతం, అరేబియా సముద్రంలో వాతావరణం స్థిరంగా ఉంది. ఎలాంటి మార్పులు లేవు. మరోవైపు రాష్ట్రానికి తక్కువ ఎత్తు నుంచి బలమైన గాలులు వీస్తుండడం కూడా రుతుపవనాల కదలికలపై ప్రభావం చూపు తున్నాయి. మరో నాలుగైదు రోజులు ఇదే వాతా వరణ పరిస్థితులు కొనసాగే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వేచి చూసి సాగు చేయండి రాష్ట్ర రైతాంగానికి ఈ సీజన్ కీలకమైంది. మెట్ట పంటలన్నీ వర్షాలపై ఆధారపడి సాగు చేస్తారు. తొలకరి సమయంలో కురిసే వర్షాల తీరును బట్టి విత్తనాలు వేస్తారు. ఈసారి తొలకరి ఊరించినప్పటికీ.. చాలాచోట్ల విత్తు విత్తే స్థాయిలో వర్షాలు కురవలేదని అధికా రులు చెబుతున్నారు. మరో 4,5 రోజులు వేచి చూసి సంతృప్తికర వర్షాలు కురిసిన తర్వాతే సాగు పనులు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఏపీని తాకిన రుతుపవనాలు
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకాయి. శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో ఈ రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఏపీ వ్యాప్తంగా రేపటి నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. మరోవైపు తూర్పు ఈశాన్య బంగాళాఖాతం, మయన్మార్ పరిసర ప్రాంతంలో సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 11న అల్పపీడనంగా బలపడనుంది. ఈ అల్పపీడనం ఒడిశా తీరం వైపు ప్రయాణిస్తూ క్రమంగా బలపడి 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఈ కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో 200 నుంచి 250 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అల్పపీడనంతో నైరుతి రుతుపవనాలు వేగం పుంజుకోనున్నాయి. ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాలకు విస్తరించిన రుతుపవనాలు శుక్రవారానికి ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి ప్రవేశించనున్నాయి. 12వ తేదీ నాటికి రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశాలున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఈ నెల 11 నుంచి కోస్తా తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉంటుంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వరకు.. గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. 11 నుంచి 15వ తేదీ వరకూ మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. నైరుతి ప్రభావంతో కోస్తాంధ్రలో రెండు రోజులు అనేకచోట్ల ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. గడిచిన 24 గంటల్లో.. ఉప్పలగుప్తంలో 47 మిల్లీమీటర్లు, శ్రీకాకుళంలో 46, సోంపేటలో 42, డెంకాడలో 36, మచిలీపట్నంలో 35, రావులపాలెం, జియ్యమ్మవలసల్లో 34, పెదగంట్యాడలో 32, విశాఖ నగరం, అర్బన్‌లో 29, సాలూరులో 27, గంగవరంలో 26, మామిడికుదురులో 24, ఇచ్ఛాపురం, భీమిలిల్లో 21, ఓక్, గుంతకల్లుల్లో 19 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చదవండి: YSR Bima: సర్కారే పెద్ద దిక్కు -
Monsoon: నైరుతి వచ్చేసింది!
సాక్షి, హైదరాబాద్: ‘నైరుతి’రాష్ట్రాన్ని పలకరించింది. ఈ నెల 3న కేరళను తాకిన రుతుపవనాలు.. చురుకుగా ముందుకు వస్తూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మీదుగా రాష్ట్రం వైపు వ్యాపిస్తున్నాయి. శనివారం రాష్ట్రంలోని నైరుతి దిశలో ఉన్న జిల్లాల్లో రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఈ రుతుపవనాలు రాష్ట్రంలోని చాలాచోట్ల విస్తరించే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే కర్ణాటక తీరం, గోవా అంతటా, మహారాష్ట్రలోని కొంత భాగం వరకు వేగంగా విస్తరిస్తున్నాయి. అలాగే ఉత్తర కర్ణాటకలో చాలా భాగం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని చాలా ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రెండ్రోజులు తేలికపాటి వర్షాలు.. రాష్ట్రానికి నైరుతి దిక్కు నుంచి కిందిస్థాయిలో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతాయని సూచించింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 8గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వానలు కురిశాయి. సగటున సగటున 6.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలు మినహాయిస్తే మిగతా అంతటా వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో అత్యధికంగా 8.75 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. కాస్త ముందే... ఈ ఏడాది నైరుతి రుతపవనాలు కాస్త ముందుగానే వచ్చాయి. గతేడాది జూన్1న కేరళలోకి ప్రవేశించిన నైరుతి క్రమంగా విస్తరిస్తూ జూన్ 11న రాష్ట్రానికి చేరుకుంది. ఈ ఏడాది మే 30న కేరళకు చేరుకుంటాయని వాతావరణ శాఖ తొలుత అంచనా వేసి... క్రమంగా మే 31 నాటికి వస్తాయని ప్రకటించింది. చివరకు మరింత లోతైన అంచనాలతో జూన్ 3న కేరళను తాకుతాయని పేర్కొంది. ఈ మేరకు నైరుతి దిశ నుంచి కిందిస్థాయి గాలులతో రుతుపవనాల రాక కనిపించింది. అనంతరం రుతుపవనాలు చురుకుగా ముందుకు సాగడం... రాష్ట్రానికి నైరుతి దిశ నుంచి కిందిస్థాయి గాలుల తీవ్రత ఎక్కువవడంతో రెండ్రోజుల్లోనే రాష్ట్రాన్ని పలకరించాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆరు రోజుల ముందే రాష్ట్రాన్ని చేరుకోవడం గమనార్హం. -
రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు
-
అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు ఇప్పటికే అండమాన్, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించినట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి శుక్రవారమే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు ఐఎండీ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈరోజు (శనివారం) అల్పపీడనం కొనసాగుతుంది, మరియు దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందని, రాగల 6 గంటలలో ఇది వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించి బలపడి రేపటికి తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. అనంతరం ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఈనెల 26వ తేదీ ఉదయానికి ఒడిస్సా-పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరలోని ఉత్తర బంగాళాఖాతము ప్రాంతమునకు చేరుకుంటుందని వెల్లడించింది. అదే రోజు సాయంత్రానికి పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఒడిస్సా, బంగ్లాదేశ్ తీరాల వెంబడి తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో పరిమితంగా ఉండనుంది. ఈరోజు ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమ: ఈరోజు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. - సంచాలకులు, అమరావతి వాతావరణ కేంద్రము -
3 రోజులు ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం/ కాకినాడ సిటీ/కర్నూలు: నైరుతి రుతుపవనాల ప్రభావం రాష్ట్రంపై చురుగ్గా కొనసాగుతోంది. అదేవిధంగా తూర్పు పశ్చిమ షియర్ జోన్ 3.1 కి.మీ. నుంచి 5.8 కి.మీ.ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.18, 19, 20 తేదీల్లో ఉత్తర కోస్తా, యానాం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. ► గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని కోయిలకుంట్ల, పాకాల, డోర్నిపాడులో 4 సెం.మీ., గజపతినగరం, నల్లమల, రుద్రవరం, చెన్న కొత్తపల్లి, కలక్కడలో 3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ► తూర్పు గోదావరి జిల్లాలో శుక్రవారం 4.9 మి.మీ. సరాసరితో మొత్తం 312.4 మి.మీ. వర్షపాతం నమోదయింది. అత్యధికంగా అమలాపురం మండలంలో 22.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. కర్నూలు జిల్లాలో 19 మండలాల్లో వర్షాలు కురిశాయి. కోవెలకుంట్లలో అత్యధికంగా 39.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఈ నెలలో ఇప్పటికే 12 శాతం అధిక వర్షపాతం నమోదైంది. -
నేడు, రేపు వర్షాలే
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకూ ఏర్పడిన ఉత్తర–దక్షిణ ఉపరితల ద్రోణి బలహీనపడింది. దీనివల్ల గాలుల కలయికతో ఏర్పడిన షియర్ జోన్ ప్రభావం రాష్ట్రంపై కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు కోస్తా, రాయలసీమపై చురుగ్గా ఉన్నాయి. వీటన్నింటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో.. నేడు, రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. వెంకటగిరి, చిత్తూరులో 8 సెం.మీ., జియ్యమ్మవలస, తంబాలపల్లె, పలమనేరులో 5, తాడేపల్లిగూడెంలో 4 సెం.మీ. వర్షపాతం నమోదైంది.