సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల నిష్క్రమణతో రాష్ట్రంపై వర్ష ప్రభావం.. మరో వారంపాటు ఉండొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో ఇవాళ, రేపు..(శని, ఆది వారాల్లో) ఉరుములు, మెరుపులతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరించింది.
తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, రంగారెడ్డి, వరంగల్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ యెల్లో హెచ్చరికలు జారీ చేసింది.
ఈ నెల 18న ఉత్తర అండమాన్, దాని పరిసరాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రెండు మూడు రోజుల తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టినట్లు అనిపించినప్పటికీ.. ఉదయం లేదా సాయంత్రం పూట చిరుజల్లులు కురిసే అవకాశం ఉండొచ్చని తెలిపింది.
#15OCT 4:50AM⚠️
— Hyderabad Rains (@Hyderabadrains) October 14, 2022
Rainy Morning Ahead for #Hyderabad During 5-8AM
Moderate -Heavy Rains expected in Many parts of City in next 3-4Hrs
Please Plan Accordingly ⚠️⚠️⚠️#HyderabadRains pic.twitter.com/jH58FNh2BW
HEAVY DOWNPOUR ALERT TODAY ⚠️
— Telangana Weatherman (@balaji25_t) October 15, 2022
STRONG EASTERLY CONVERGENCE will cause Widespread rains in almost all many districts of Telangana during afternoon - early morning with HEAVY - VERY HEAVY RAINS at few areas ⚠️
Hyderabad too, high chances for strong rains during afternoon - morning pic.twitter.com/wNCk1XY8TY
ఇదీ చదవండి: ఏపీకి పొంచి ఉన్న తుపాను గండం!
Comments
Please login to add a commentAdd a comment