
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవన ద్రోణి, నైరుతి రుతుపవనాల చురుకుదనం ప్రభావంతో ఐదారు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. అల్పపీడనం బలహీనపడడంతో పాటు నైరుతి రుతుపవనాల చురుకుదనం కూడా తగ్గింది. ఫలితంగా శుక్రవారం నుంచి వానలు చిరుజల్లులకే పరిమతమయ్యాయి.
శుక్రవారం కర్నూలు జిల్లా కామవరంలో మాత్రమే గరిష్టంగా 1.2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. మరెక్కడా ఒక్క సెంటీమీటరుకు మించి వర్షం కురవలేదు. రానున్న మూడురోజులు రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment