సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు కాస్త మందగించాయి. జూలైలో అత్యంత చురుకుగా కదిలిన రుతుపవనాలు... ఆగస్టులో నెమ్మదించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టులో వర్ష పాతంపడిపోయింది. నైరుతి సీజన్‌లో ఇప్పటి వరకు 87.20 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిసి నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నా యి. జూన్‌లో రుతుపవనాల రాకలో జాప్యం నెలకొనడం, ఆ తర్వాత ఒకట్రెండు రోజులు చురుకుగా కదిలి తర్వాత మందగించడంతో ఆ నెలలో వర్షాలు నిరాశపర్చాయి.
ఆ తర్వాత జూలై మొదటి వారం నుంచి రుతుపవనాలు చురుకుగా కదలడంతో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. దీంతో వర్షపాతం గణాంకాలు ఒక్కసారిగా పెరిగాయి. ఆగస్టులో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెలాఖరు నాటికి 60.47 సెం.మీ. మేర వర్షాలు కురవాల్సి ఉన్నా.. 87.20 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఈ లెక్కన సాధా రణం కంటే 46 శాతం అధికంగా వర్షాలు కురిశా యి. 33 జిల్లాలకు గాను ఏడు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, మరో 24 జిల్లాల్లో అధిక వర్షాలు, రెండు జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఒక్క జిల్లాలో కూడా లోటు వర్షపాతంనమోదు కాలేదు.
జిల్లాల వారీగా వర్షాల తీరును పరిశీలిస్తే...
అత్యధికం: నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట్
అధికం: ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల పల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, జన గామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట్, ములుగు
సాధారణం: హైదరాబాద్, ఖమ్మం
ఈ నెలలో సాధారణమే..
నైరుతి రుతుపవనాల సీజన్ సెప్టెంబర్‌తో ముగుస్తుంది. వాస్తవానికి ఈ సీజన్‌లో అత్యధిక వానలు కురిసేది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే. కానీ ఈసారి జూలైలోనే అత్యంత భారీ వర్షాలు కురవడంతో సగటు వర్షపాతం భారీగా పెరిగింది. సెప్టెంబర్‌లో కూడా సాధారణ వర్షపాతమే నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెల రెండో వారంలో ఒకట్రెండు రోజులు భారీ వర్షాలకు అవకాశం ఉందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment