Monsoon Season
-
Climate change 2024: గతి తప్పుతున్న రుతుపవనాలు
వాతావరణ మార్పులు. భూమిపై జీవుల మనుగడకే సవాలు విసురుతున్న విపరిణామం. ప్రధానంగా వర్షపాతం, ఉష్ణోగ్రతలపై వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. భారత్‌లో ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌పై వీటి ప్రభావం ఎలా ఉందన్న దానిపై క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ సమగ్ర అధ్యయనం చేసింది. రుతపవనాల సీజన్లో స్పష్టమైన మార్పులు కనిపించినట్లు తేల్చింది. వాతావరణ మార్పులు వర్షాల గతినే పూర్తిగా మార్చేస్తున్నట్లు వెల్లడైంది. సాధారణ వర్షాలు పడాల్సిన సమయంలో అతి భారీ వర్షాలు, కొన్నిచోట్ల అసలు వర్షాలే లేకపోవడం వంటి విపరీత పరిణామాలకు వాతావరణ మార్పుల ప్రభావమే కారణమని పరిశోధకులు చెబుతున్నారు. → దేశవ్యాప్తంగా 729 జిల్లాల్లో క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ అధ్యయనం నిర్వహించింది. 2024 రుతుపవనాల సీజన్లో ఆయా జిల్లాల్లో నమోదైన వర్షపాతంలో వైవిధ్యం కనిపించింది. → 340 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. → 158 జిల్లాల్లో భారీ వర్షాలు, 48 జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిశాయి. మరోవైపు 178 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. వీటిలో 11 జిల్లాల్లో అత్యంత లోటు వర్షపాతం నమోదైంది. → గత ఐదేళ్లలో చూస్తే ఈ ఏడాది తక్కువ సమయంలో అత్యధిక వర్షం కురిసిన సందర్భాలు అధికంగా ఉన్నాయి. వర్షపాతంలో మార్పులతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇది ఇందోళనకర పరిణామం అని చెబుతున్నారు. దీనివల్ల వరదలు, తద్వారా ఆస్తినష్టం, ప్రాణనష్టం వాటిల్లుతుందని అంటున్నారు. → ఈ ఏడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా 753 వాతావరణ కేంద్రాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. 2020 తర్వాత ఇదే అత్యధికం. → భూమి ఉపరితలం, సముద్రాల ఉష్ణోగ్రతల్లో మధ్య వ్యత్యాసాలు రుతుపవనాలను ప్రభావితం చేస్తుంటాయి. సముద్రాలతో పోలిస్తే భూమిపై ఉష్ణోగ్రతలు వేగంగా మారుతుంటాయి. వాతావరణ మార్పులు, భూతాపం కారణంగా భూమి క్రమంగా వేడెక్కుతుండడంతో రుతుపవనాలు సైతం గతి తప్పుతున్నాయి. గత పదేళ్లలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. → 2023లో దేశంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. 2024లో మాత్రం సాధారణం కంటే అధిక వర్షాలు కురిశాయి. భూమిపై సగటు ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల రుతుపవనాల్లో ప్రతికూల మార్పు మొదలైందని క్లైమేట్ ట్రెండ్స్ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ ఆర్తి ఖోస్లా చెప్పారు. → వ్యవసాయం, నీటి సరఫరా, పర్యావరణ సమతుల్యతకు రుతుపవనాలే అత్యంత కీలకం. కోట్లాది మంది ప్రజల జీవితాలు రుతుపవనాలపై ఆధారపడి ఉన్నాయి. రుతుపవనాలు పూర్తిగా గతి తప్పితే ఊహించని పరిణామాలు ఎదురవుతాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అందుకే వాతవరణ మార్పులను అరికట్టాలని, పర్యావరణ పరిరక్షణపై తక్షణమే దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కుటుంబాన్ని మింగేసిన గీజర్ : ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!
వేడి నీటి కోసం ఉపయోగించే గీజర్నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ కారణంగా హైదరాబాద్‌లోని సనత్ నగర్‌కు చెందిన కుటుంబం ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఆధునిక కాలంలో దాదాపు ప్రతీ ఒక్కరూ తమ వాష్ రూములలో చిన్నా, పెద్దా గీజర్లను వాడుతున్నారు. పైగా ఇపుడు వర్షాకాలం కూడా కావడంతో స్నానానికి వేడి నీటిని వాడటం ఇంకా అవసరం. ఈ నేపథ్యంలో గీజర్ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం.వాటర్ హీటర్ మీ ఇంటికి సరైన పరిమాణంలో ఉందని నిర్ధారించుకోవాలి. వాటర్ హీటర్ చాలా పెద్దది లేదా చాలా చిన్నది కావడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కనెక్షన్ ఇవ్వడంలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది. నీళ్లు తొందరగా చల్లారిపోకుండా అదనపు మందపాటి ఇన్సులేషన్ వాడాలి. దీంతో కరెంటు ఆదా అవుతుంది. వేడి నీటి హీటర్ ఉష్ణోగ్రత 120 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువగా సెట్ చేయకూడదు. హాట్ వాటర్ హీటర్ నాబ్‌లు , బటన్లు దృఢంగా ఉండేలా చూసుకోవాలి. ఇవి పిల్లలకు దూరంగా ఉండాలి.టెస్ట్ సేఫ్టీ రిలీఫ్ వాల్వ్స్: అధిక ఒత్తిడి , అధిక ఉష్ణోగ్రతల విషయంలో మీ వాటర్ హీటర్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏడాదికి ఒకసారి అయినా సర్వీసింగ్, రిపేర్ వంటివి ఎప్పటికప్పుడు చేయిస్తూ ఉండాలి. ఎలాంటి సమస్య వచ్చినా, సర్వీస్ టెక్నీషియన్ ద్వారానే మరమ్మత్తు చేయించడం ఉత్తమంగ్యాస్ గీజర్‌లో బ్యూటేన్ , ప్రొపేన్ అనే వాయువులు ఉంటాయి. ఆన్ చేసినప్పుడు గాలిలో కార్బన్ మోనాక్సైడ్‌ను లాంటి హాని కరమైన వాయువులు విడుదలౌతాయ్. ఇవి శ్వాసకోస సమస్యలను పెంచుతాయ్. తలనొప్పి, వికారం లాంటి సమస్యలొస్తాయి. అందుకే బాత్రూమ్లో గీజర్‌ను అమర్చేటప్పుడు, ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను కూడా అమర్చాలి. లేదా గాలి, వెలుతురు ఉండేలా అయినా జాగ్రత్త పడాలి.ముఖ్యంగా వర్షాకాలంలో గీజర్ ఆన్‌లోనే ఉండగానే షవర్ బాత్ చేయకుండా ఉండటం చాలా మంచిది. అంతేకాదు, వీలైతే వేటి నీటిని బకెట్లో నింపుకొని, గీజర్ ఆఫ్ చేసి తరువాత మాత్రమే స్నానానికి వెళ్లడం ఇంకా ఉత్తమం.ఎలక్ట్రిక్ హీటర్లు పర్యావరణానికి నష్టం కూడా. హీటర్లకు బదులుగా ప్రత్యామ్నాయాల్ని ఎంచుకోవడం మంచిది. అలాగే హీటర్లను వినియోగించేటపుడు సరైన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, అప్రమత్తంగా ఉండాలి. -
వర్షాకాలంలో కిచెన్ క్లీన్‌గా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
వర్షాకాలం అనంగానే సీజనల్ వ్యాధులు పగబట్టినట్లుగా మనుషులపై దాడి చేస్తాయి. అందుకు ప్రధాన కారణం బ్యాక్టీరియా, వైరస్‌లే. వాతావరణంలోని తేమ కారణంగా సులభంగా బ్యాక్టీరియా, ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కిచెన్‌లోని వస్తువులు పాడవ్వడం లేదా బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో కిచెన్‌ని ఎంత పరిశుభ్రంగా ఉంచితే అంత ఆరోగ్యం ఉంటాం. నిత్యం మన ఉపయోగించే కిచెన్‌లోని వస్తువులు పాడవ్వకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సినవి సవివరంగా తెలుసుకుందామా..!వర్షాకాలంలో కిచెన్‌ని సురక్షితంగా ఉంచేలా పాటించాల్సినవి ఇవే..కిచెన్ చిమ్నీ, ఎగ్జాస్ట్ ఫ్యాన్: వంటగదిలో సూర్యరశ్మి వచ్చేలా, తేమ చేరకుండా ఉండేలా చూసుకోమని చెబుతుంటారు పెద్దలు. కానీ వర్షాకాలంలో అలా అస్సలు కుదరదు. ఎండ అనేది పెద్దగా ఉండదు, పైగా వాతావరణంలోని తేమ కారణంగా కిచెన్‌ను పొడిగా ఉంచడం కాస్త ఇబ్బందే. అలాంటప్పుడూ కిచెన్‌కి ఉండే ఎగ్జాస్ట్ ఫ్యాన్లను శుభ్రపరిచి ఆన్ చేసి ఉంచాలి. అలాగే వంటగది చిమ్నీ కూడా డెస్ట్ లేకుండా ఉంచుకుంటే తేమ చేరకుండా కాపాడుకోగలుగుతాం. కిచెన్ కూడా పొడిగా ఉంటుంది.అలాగే వంటగదిలో సరుకులు పాడవ్వకూడదంటే గాలి చొరబడిన క్లోజ్డ్ కంటైనర్లలో భద్రపరుచుకోండి. సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులను తేమ, బ్యాక్టీరియా చేరకుండా ఉండేలా గాలి చొరబడిని గాజు పాత్రలో ఉంచాలి. ఇక వంటగదిలో పంచదార, కొన్ని రకాలు పొడులు అవి పాడ్వకుండా ఉండేందుకు వంటల్లో ఉపయోగించే మసాలా దినుసులతో సమస్యను నివారించండి. దాల్చిన చెక్క, లవంగాలు వంటి వాటిని నిల్వ ఉంచే పొడులకు చేర్చితే పాడవ్వకుండా ఉంటాయి. సింక్ పైపులను శుభ్రంగా ఉంచండి: వంటగదిలోని సింక్పైపులు చక్కగా ఉండేలా చూడండి. ఎలాంటి లీక్‌లు లేవనేది నిర్థారించుకోండి. దీనివల్ల దోమలు, ఈగలు రాకుండా కాపాడుకోగలుగతాం. ఈ సీజన్ ప్రారంభమయ్యే ముందే ఈ జాగ్రత్తలను తప్పనసరి తీసుకోవాలి. అలాగే కాలానుగుణ పండ్లను, కూరగాయలను తీసుకోండి. వాటిని తాజాగా నిల్వ ఉంచుకునేలా తగు జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి సులభంగా బయటపడగలుగుతారు అని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: యూకేలో భారతీయ కిరాణ సరుకులు ధర తెలిస్తే నోరెళ్లబెడతారు..!) -
తగ్గిన పప్పు ధాన్యాల సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో పప్పుధాన్యాల సాగు గణనీయంగా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. నేటి(శనివారం)తో వానాకాలం సీజన్ ముగియనుంది. ఆదివారం నుంచి యాసంగి సీజన్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఒక నివేదిక విడుదల చేసింది. వానాకాలం సీజన్లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, గతేడాది ఇదే సీజన్లో 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది మాత్రం 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా వరి సాగు విస్తీర్ణం ఆల్ టైం రికార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 65 లక్షల ఎకరాల్లో (130.37 శాతం) సాగైంది. ఇక సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, 4.67 లక్షల (113%) విస్తీర్ణంలో సాగైంది. వరి మినహా పెరగని ప్రధాన పంటల విస్తీర్ణం వరి, సోయాబీన్ మినహా ఇతర ముఖ్యమైన పంటల విస్తీర్ణం పెరగలేదు. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, 44.77 లక్షల (88.51 శాతం) విస్తీర్ణంలోనే సాగైంది. ఇక పప్పు ధాన్యాల సాగు మాత్రం గణనీయంగా తగ్గిందని నివేదిక వెల్లడించింది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం ఈ వానాకాలం సీజన్లో 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 5.51 లక్షల ఎకరాల్లోనే సాగైంది. అంటే 58.46 శాతానికే పరిమితమైంది. అందులో కంది సాధారణ సాగు విస్తీర్ణం 7.69 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.74 లక్షల (61.62 శాతం) ఎకరాల్లోనే సాగైంది. జొన్న సాధారణ సాగు విస్తీర్ణం 81,389 ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 31,107 ఎకరాల్లో (38.22 శాతం) సాగైంది. రాగులు దాని సాధారణ సాగు విస్తీర్ణంలో కేవలం 19.70 శాతం, కొర్రలు, సామలు, కోడో వంటి మిల్లెట్ల సాగు 16.15 శాతానికే పరిమితమైంది. -
ఆగస్ట్–సెప్టెంబర్ నెలల్లో సాధారణ వర్షాలు: వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: దేశంలో వర్షాకాలం రెండో అర్ధభాగం(ఆగస్ట్–సెప్టెంబర్)లో సాధారణ వర్షాలే కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) సోమవారం తెలిపింది. జూలైలో దేశవ్యాప్తంగా అధిక వర్షాలు నమోదయ్యాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలపై ఎల్‌నినో పరిస్థితులు ప్రభావితం చేయలేకపోయాయని తెలిపింది. ఆగస్ట్, సెప్టెంబరు నెలల్లో సాధారణ వర్షపాతాన్ని అంచనా వేసినప్పటికీ, సాధారణ (422.8 మిల్లీమీటర్ల కంటే తక్కువగా (94 శాతం నుంచి 99 శాతం) కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర మీడియాతో అన్నారు. జూన్‌లో సాధారణం కంటే 9% లోటు వర్షపాతం నమోదవగా, జూలై వచ్చే సరికి 13% అదనంగా వానలు పడ్డాయని చెప్పారు. అయితే, తూర్పు, ఈశాన్య భారతంలో 1901 తర్వాత మొదటిసారిగా అత్యల్ప వర్షపాతం 280.9 మిల్లీమీటర్లు నమోదైందని చెప్పారు. గత అయిదేళ్లలోనే అత్యధికంగా ఈసారి 1,113 భారీ వర్షపాతం ఘటనలు, 205 అత్యంత భారీ వర్షపాతం ఘటనలు జూలైలో నమోదయ్యాయని చెప్పారు. -
ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ
హైదరాబాద్: నైరుతి రుతుపవనాల నేపథ్యంతో.. ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో నేడు అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండగా.. మంగళవారం సుమారు 20 సెంటీ మీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
వర్షాలు పడలేదని.. రైతులెవరూ అధైర్యపడొద్దు
సంగారెడ్డి మున్సిపాలిటీ: రుతుపవనాలరాక ఆలస్యం కావడం, వరుణుడి జాడ లేకపోవడంతో ఎన్నో ఆశలతో సాగుకు భూములను సిద్ధం చేసిన రైతుల్లో కొంత ఆందోళన నెలకొందని, అయితే ఎలాంటి ఆందోళన చెందొద్దని జిల్లా వ్యవసాయాధికారి నసింహరావు అన్నారు. విత్తుకునే అదను దాటలేదన్నారు. ప్రస్తుతం సన్నాలు, మధ్యకాలిక, స్వల్పకాలిక వంగడాలు ఎంచుకోవాలి. వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించాలని, వీలైనంత వరకు పంట మార్పిడి చేయాలని అప్పుడే అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని, 70 నుంచి 110 మి.మీ. వర్షం పడితేనే విత్తనాలు విత్తుకునేందుకు అనువుగా ఉంటాయన్నారు. బుధవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌కు రైతుల నుంచి విశేష స్పందన లభించింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా జాన్ 15 వరకే బీపీటీ సోనా రకం వరి సాగుకు నారుపోసుకోవాలన్నారు. ఆ తర్వాత పోసుకుంటే వాటికి తెగుళ్లు ఆశిస్తాయని తెలిపారు. సన్నరకం ధాన్యం ఆర్– ఎన్ఆర్ కేఎస్ఎం, దొడ్డు రకం 1010ని జూలై 15 వరకు నారు పోసుకోవాలి. అన్ని రకాల నేలలు వరి సాగుకు అనుకూలమని రైతులకు భరోసా ఇచ్చారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు. రైతు: నరసయ్య, అంత్వార్ (నారాయణఖేడ్) మూడు ఎకరాల పత్తి వేసాము. దానికి ఎలాంటి మందు వేయాలి. జేడీఏ: ఇప్పుడు డీఏపీ, కాంప్లెక్స్ వేయొచ్చు. రైతు: నవాజ్ రెడ్డి, చక్రియాల్ (చౌటకూర్) జిలుగు, జనుము రాలేదు సార్. ఆలస్యం అయ్యాయి. పంటకు ఇబ్బంది అవుతుంది. జేడీఏ: అవును. జిలుగు జనుము ఆలస్యమయ్యాయి. మీ దగ్గరలోగల మండలం నుంచి తెచ్చుకోవచ్చు. రైతు: శ్రీనివాస్. పుల్కల్ (పుల్కల్) మూడు ఎకరాల పత్తి మొలక వచ్చింది. ఇంకా మూడు ఎకరాలు ఉంది. ఏ పంటకు అనుకూలం సార్ ఇప్పుడు. జేడీఏ: జులై 10 వరకు పత్తి పంట వేసుకోవాలి. అది దాటితే ఇతర పంటలు వేసుకోవాలి. రైతు: విఠల్, జూకల్ (నారాయణఖేడ్) 25 గుంటల భూమి మూడు నెలల క్రితం నా పేరుపై పట్టా చేసుకున్నా. ఏఈఓ దగ్గర చూసుకుంటే డబ్బులు పడలేదు సార్. జేడీఏ: మీరు చేయించుకుని మూడు నెలలు మాత్రమే అయ్యింది. కొంచెం ఆలస్యం అవుతుంది. రైతు: నరసింహారెడ్డి, సత్వర్ (జహీరాబాద్) జనుము విత్తనాలు ఇంకా అందుబాటులోకి రాలేదు సార్. జేడీఏ: జహీరాబాద్ డీసీఎంఎస్ ఆఫీసులో వచ్చాయి తీసుకోండి. రైతు: నరేందర్, వెంకటాపూర్ (సదాశివపేట) సబ్సిడీపై ఎలాంటి ధాన్యాలు ఉన్నాయి సార్. జేడీఏ: కంది, సోయాబీన్ ఉన్నాయి. మిగతావి సబ్సిడీపై డీలర్లను అడిగి తెలుసుకోవాలి. అంతర పంటలు వేస్తే మంచిది. రైతు: రాజ్ కుమార్ దేశ్‌పాండే, మానియర్ పల్లి (కోహిర్) జిలుగు, జనుము తొందరగా రాకపోవడం కారణంగా ఆలస్యంగా విత్తనాలు వేశాము. మొక్కలు లేటుగా మొలుస్తున్నాయి. జేడీఏ: వర్షాలు లేని కారణంగా లేటుగా మొలుస్తున్నాయి. ఆందోళన చేందొద్దు. -
కురిసింది వాన.. జిల్లా అంతటా వర్షాలు అన్నదాతల్లో హర్షం
ఆదిలాబాద్‌టౌన్: రుతుపవనాల రాకతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు జిల్లాలో ఓ మోస్తారు నుంచి సాధారణ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. విత్తనాలు విత్తుకునే అదను దాటుతున్నా వరుణుడు ముఖం చాటేయడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమైంది. గతేడాది ఇప్పటికే విత్తనాలు విత్తుకోగా, ఈసారి కనీసం 20 శాతం కూడా రైతులు విత్తనాలు వేసుకోలేదు. పత్తి పంట విత్తుకునేందుకు జూలై రెండో వారం వరకు, సోయా పంట వేసుకునేందుకు జూలై మొదటి వారం వరకు గడువు ఉందని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇన్నిరోజుల పాటు తీవ్ర ఉక్కపోతకు గురైన జిల్లా వాసులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఉపశమనం పొందారు. జిల్లా అంతటా వర్షాలు.. ఇచ్చోడలో 56.0 మి.మీ, బజార్హత్నూర్లో 34.3 మి.మీ, నార్నూర్‌లో 39.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఈ ఏడాది సగటున 1,100 మి.మీ.లు కురువాల్సి ఉంది. జూన్‌కు సంబంధించి 190 మి.మీ.లు కురవాల్సి ఉండగా ఇప్పటివరకు 29 నుంచి 35 మి.మీ.ల వర్షం కురిసిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంకా 87 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం ఉందని పేర్కొంటున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవనాలతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. తడిసి ముద్ద.. ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం రాత్రి నుంచి వర్షం కురువడంతో పట్టణమంతా తడిసి ముద్దయ్యింది. జనాలు వర్షంలో తడుస్తూ వెళ్లాల్సి వచ్చింది. ద్విచక్ర వాహనాలపై ఆయా పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారు తడుస్తూ వెళ్లగా మరికొంతమంది రెయిన్ కోట్లు ధరించి వెళ్లారు. -
కోత కష్టం.. ఆగితే నష్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం పంటలు కోత దశకు వచ్చాయి. అనేకచోట్ల వరి, మొక్కజొన్న, సోయాబీన్ కోతలు, పత్తితీత మొదలైంది. ఇలాంటి సమయంలో కురుస్తున్న వర్షాలు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. వానాకాలం ప్రారంభదశలో సాగును దెబ్బతీసిన వర్షాలు, తీరా పంటలు చేతికొచ్చే దశలోనూ వెంటాడుతున్నాయి. వర్షాల వల్ల కోతదశలో ఉన్న పంటలు పాడవుతున్నాయి. వాటిని కోయడం కూడా సమస్యగానే మారుతోంది. కోయకుండా పొలాల్లో ఉంచడం వల్ల వరి ధాన్యం రంగు మారుతోంది. కొన్నిచోట్ల కోతకొచ్చిన సోయాబీన్‌ను రైతులు చేలల్లోనే వదిలేస్తున్నారు. ఇక పత్తి పరిస్థితి ఘోరంగా మారింది. తీత దశల తడిసిపోతుండటంతో పంటదెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఈపంటను మొదటి నుంచీ వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. జూలై నుంచి వర్షాలు మొదలుకాగా అప్పటి నుంచి లక్షలాది ఎకరాల్లో పత్తి పాడైపోయింది. దీంతో ఈసారి పత్తి దిగుబడి గణనీయంగా తగ్గుతుందని అంటున్నారు. సీజన్ మొదట్లోనూ సమస్యలు ఈ ఏడాది వానాకాలంలో 1.43 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా (ఆల్‌టైం రికార్డు) 1.36 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వరి సాగు లక్ష్యం 45 లక్షల ఎకరాలు కాగా, రికార్డు స్థాయిలో 64.54 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి సాగు లక్ష్యం 70 లక్షల ఎకరాలు కాగా, 50 లక్షల ఎకరాలకే పరిమితమైంది. వర్షాలతో పత్తి సాగు తగ్గింది. జూలై, ఆగస్టుల్లో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరి నార్లు కొట్టుకు పోయాయి. సరఫరా కాని యంత్రాలు... రైతులకు వరికోత మిషన్లు అందించడంలో వ్యవసాయ శాఖ విఫలమైంది. ఈ ఏడాది బడ్జెట్లో వ్యవసాయ యంత్రాలకు రూ.500 కోట్లు కేటాయించినా యంత్రాలు సరఫరా కాలేదు. ఇప్పుడు వరినాటు యంత్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అనుకున్నారు. దీంతో కంపెనీలు 5 వేల వరికోత యంత్రాలను సిద్ధం చేశాయి. ఒక్కో యంత్రం ధర కంపెనీని బట్టి రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. అయితే ఈ యంత్రాలను సబ్సిడీపై రైతులకు అందజేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంలో వ్యవసాయశాఖ విఫలమయ్యింది. ఓలా, ఉబర్ మాదిరి వ్యవసాయానికి సంబంధించిన భారీ కోత యంత్రాలు బుక్ చేసుకుంటే అద్దెకు పంపించేలా కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని వ్యవసాయ శాఖ గతంలో చెప్పినా ఆచరణకు నోచుకోలేదు. వరి కోత యంత్రాల కొరత ప్రస్తుతం పలు ప్రాంతాల్లో పంటలు కోతకు సిద్ధమయ్యాయి. ఇప్పుడు కూడా వర్షాలు కురుస్తుండటంతో.. ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌గర్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో వేలాది ఎకరాల్లో చేతికొచ్చిన పంట తడిసిపోతోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు వరికోత యంత్రాలు లేకపోవడం సమస్యగా మారింది. వరి రికార్డు స్థాయిలో సాగవడంతో కోత యంత్రాలకు కొరత ఏర్పడుతోంది. చేలల్లోనే సోయా.. మొక్కజొన్న మొలకలు ఆదిలాబాద్ జిల్లాలో కోతకు వచ్చిన సోయా పంటను చేలల్లోనే వదిలేస్తున్నారు. పత్తి తీసే దశకు రాగా వానలకు తడిసి ముద్దయిపోతోంది. కొన్నిచోట్ల తీత మొదలైంది. అక్కడక్కడ కొనుగోళ్లు జరుగుతున్నాయి. కానీ వానల కారణంగా అంతరాయం కలుగుతోంది. జగిత్యాల జిల్లాలో వరి కోతలు ప్రారంభం కాలేదు. కానీ వర్షాలతో భూమి తేమగా మారడంతో పాటు కాలువల ద్వారా నీటిని వదులుతుండటం, వ్యవసాయ బావుల్లో నుండి నీరు ఉబికి వస్తుండటం ఇబ్బందికరంగా మారింది. టైర్ కోత యంత్రాలు (హార్వెస్టర్లు) నడిచే పరిస్థితి లేకుండా పోయింది. చైన్ హార్వేస్టర్లు సరిపడా లేవు. ఇక వర్షాల్లో పత్తి తీస్తే ఆరబెట్టడం కష్టం. కాబట్టి ఉష్ణోగ్రతలు పెరిగేవరకు తీసే పరిస్థితి కనిపించడంలేదు. దిగుబడి కూడా గణనీయంగా తగ్గే పరిస్థితి కన్పిస్తోంది. మొక్కజొన్న పంట కోతకు రావడంతో కంకుల బూరు తీసి ఆరబెడుతున్నారు. వర్షాలకు తడవడంతో మొలకలు వస్తున్నాయి. వరి ఎక్కువగా సాగయ్యే నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం కోతలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 20 శాతం కోతలు పూర్తయ్యాయి. అయితే వర్షాల కారణంగా కోతలు ఆలస్యం అవుతున్నాయి. కోసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ఇబ్బందులెదురవుతున్నాయి. రోడ్లు, కళ్లాల్లో అరబెట్టిన ధాన్యం తడుస్తోంది. కోత కోయని పంట పొలాల్లోనే నేలకొరుగుతోంది. సోయా, మొక్కజొన్న పంటల కోత మాత్రం పూర్తయ్యింది. అధిక వర్షాల వల్ల పత్తిలో ఎదుగుదల లోపించిందని రైతులు చెబుతున్నారు. వరి కోసే పరిస్థితి లేదు నేను నాలుగు ఎకరాల్లో వరి వేశా. ప్రస్తుతం పంట కోతకు వచ్చింది. కానీ కోయించలేని పరిస్థితి నెలకొంది. జూలై నుండి ఇప్పటివరకు కురిసిన వర్షాల కారణంగా పొలమంతా నీరు పైకి ఉబికి వస్తోంది. టైర్ హార్వెస్టర్లు నడిచే పరిస్థితి లేదు. చైన్ హార్వెస్టర్లు లేవు. ఒకవేళ దొరికినా గంటకు రూ.3,500 వరకు కిరాయి ఇవ్వాల్సి వస్తుంది. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. – బందెల మల్లయ్య, చల్గల్, జగిత్యాల రూరల్ మండలం -
వానలు తగ్గినా సగటును మించి..
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు కాస్త మందగించాయి. జూలైలో అత్యంత చురుకుగా కదిలిన రుతుపవనాలు... ఆగస్టులో నెమ్మదించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టులో వర్ష పాతంపడిపోయింది. నైరుతి సీజన్లో ఇప్పటి వరకు 87.20 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిసి నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నా యి. జూన్‌లో రుతుపవనాల రాకలో జాప్యం నెలకొనడం, ఆ తర్వాత ఒకట్రెండు రోజులు చురుకుగా కదిలి తర్వాత మందగించడంతో ఆ నెలలో వర్షాలు నిరాశపర్చాయి. ఆ తర్వాత జూలై మొదటి వారం నుంచి రుతుపవనాలు చురుకుగా కదలడంతో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. దీంతో వర్షపాతం గణాంకాలు ఒక్కసారిగా పెరిగాయి. ఆగస్టులో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెలాఖరు నాటికి 60.47 సెం.మీ. మేర వర్షాలు కురవాల్సి ఉన్నా.. 87.20 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఈ లెక్కన సాధా రణం కంటే 46 శాతం అధికంగా వర్షాలు కురిశా యి. 33 జిల్లాలకు గాను ఏడు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, మరో 24 జిల్లాల్లో అధిక వర్షాలు, రెండు జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఒక్క జిల్లాలో కూడా లోటు వర్షపాతంనమోదు కాలేదు. జిల్లాల వారీగా వర్షాల తీరును పరిశీలిస్తే... అత్యధికం: నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట్ అధికం: ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల పల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, జన గామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట్, ములుగు సాధారణం: హైదరాబాద్, ఖమ్మం ఈ నెలలో సాధారణమే.. నైరుతి రుతుపవనాల సీజన్ సెప్టెంబర్‌తో ముగుస్తుంది. వాస్తవానికి ఈ సీజన్లో అత్యధిక వానలు కురిసేది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే. కానీ ఈసారి జూలైలోనే అత్యంత భారీ వర్షాలు కురవడంతో సగటు వర్షపాతం భారీగా పెరిగింది. సెప్టెంబర్‌లో కూడా సాధారణ వర్షపాతమే నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెల రెండో వారంలో ఒకట్రెండు రోజులు భారీ వర్షాలకు అవకాశం ఉందని భావిస్తున్నారు. -
కోటి మార్కు దాటిన సాగు
సాక్షి, : రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం కోటి ఎకరాలు దాటింది. వానాకాలం సీజన్లో ఇప్పటివరకు 1.02 కోట్ల ఎకరాల్లో పంటల సాగయ్యాయి. దాదాపు నెల రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు ఇటీవల తగ్గుముఖం పట్టడంతో రైతులు పంటల సాగును ముమ్మరం చేశారు. దీంతో ఎక్కడికక్కడ విస్తీర్ణం పెరుగుతోంది. సెప్టెంబర్ చివరి వరకు వానాకాలం సీజన్ కొనసాగనున్నందున రైతులు ఇప్పుడు వరి తదితర పంటలపై దృష్టి సారించారు. ఈ ఏడాది 1.43 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. పత్తి సాగు లక్ష్యం 70 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 48.29 లక్షల ఎకరాల్లో సాగైంది. కంది 15 లక్షల ఎకరాలకు గాను 5.47 లక్షల ఎకరాల్లో, సోయాబీన్ 3.88 లక్షల ఎకరాలకు గాను 3.85 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 8.18 లక్షల ఎకరాలకు గాను 5.04 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇక వరి ప్రతిపాదిత లక్ష్యం 45 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 34.95 లక్షల ఎకరాల్లో సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. 8 జిల్లాల్లో 100%, అంతకు మించి సాగు రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో వంద శాతానికి మించి పంటలు సాగయ్యాయి. సాధారణ సాగుతో పోలిస్తే మెదక్ జిల్లాలో అత్యధికంగా 116%, మహబూబాబాద్ జిల్లాలో 115% పంటలు సాగయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 109%, కొమురంభీం జిల్లాలో 108%, ఆదిలాబాద్ జిల్లాలో 107%, పెద్దపల్లి జిల్లాలో 104%, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 100% చొప్పున పంటలు సాగయ్యాయి. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో కేవలం 30% విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. ములుగులో 40%, భద్రాద్రి కొత్తగూడెంలో 45%, సూర్యాపేటలో 47% మేరకే పంటలు సాగయ్యాయి. 28 జిల్లాల్లో 50 శాతానికి మించి పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. పత్తిపై వర్షాల పెను ప్రభావం రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురిసిన వానలు పత్తి పంటపై తీవ్ర ప్రభావం చూపాయి. లక్షలాది ఎకరాల్లో నీట మునిగిన పత్తి పంట భారీగా దెబ్బతినగా, మిగిలిన చేన్లు కూడా ఎర్రబారి తెగుళ్లతో సమస్యగా మారుతున్నాయి. గతేడాది పత్తికి మంచి ధర పలకడంతో ఈసారి చాలామంది రైతులు పత్తి సాగుకు మొగ్గు చూపారు. వ్యవసాయశాఖ కూడా సమావేశాలు నిర్వహించి పత్తి సాగు పెంచాలని రైతులను కోరింది. ఈ మేరకు పత్తి సాగు పెరిగింది అయితే జూలై ప్రారంభం నుంచి మొన్నటివరకు కురిసిన భారీ వర్షాలకు గోదావరి పరీవాహక ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల ఎకరాల్లో పత్తి పంట నీట మునిగి దెబ్బతిన్నది. వరుసగా కురిసిన భారీ వర్షాలతో మొదట్లో వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో రైతులు రెండోసారి వేశారు. అయితే మొక్క ఎదుగుతున్న దశలోనే మళ్లీ వర్షాలు పడడంతో జాలు పట్టిపోయాయి. ఇక దెబ్బతిన్న పంట పోగా మిగిలిన పత్తి చేన్లలో మొక్క ఎదుగుదల నిలిచిపోయింది. వానలకు చేలలో నీరు నిలిచి పంట ఎదగడం లేదని, కలుపు తీయడం ఇబ్బందికరంగా మారిందని రైతులు వాపోతున్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే అవకాశం లేక పత్తి చేన్లను కొందరు రైతులు వదిలేశారు. మరికొందరు పత్తి చేన్లను పూర్తిగా దున్ని మొక్కజొన్న, వరి పంటలను సాగు చేసుకుంటున్నారు. -
'రివర్స్ వాటర్ ఫాల్'.. ఎక్కడో కాదు మన దేశంలోనే
ముంబై: ఎత్తైన కొండల నుంచి కిందికి జాలువారే జలపాతాల్ని చాలానే చూసి ఉంటాం. కానీ గాల్లో పైపైకి ఎగిరే జలపాతాన్ని ఎప్పుడైనా చూశారా? అలా ఎలా అనుకుంటున్నారా? అవునండి అది నిజమే.. ఆకాశంలోకి ఎగిరే జలపాతం ఎక్కడో కాదు మన దేశంలోనే కనువిందు చేస్తోంది. మన పక్క రాష్ట్రం మహారాష్ట్రలోనే ఈ ప్రకృతి అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత్ నంద.. ఆకాశంలోకి ఎగిరే జలపాతం అద్భుత దృశ్యాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతే కాదు.. అసలు ఇలా రివర్స్ వాటర్‌ఫాల్ ఎలా ఏర్పడుతుందనే విషయాన్ని వివరించారు. గురుత్వాకర్షణ, గాలి ఒకదానినొకటి వ్యతిరేక దిశలో సమానంగా ఉన్నప్పుడు ఇలాంటివి సంభవిస్తాయని తెలిపారు. పశ్చిమ కనుమల్లోని నానేఘాట్ వద్ద ఆదివారం ఇదే జరిగిందంటూ దానికి సంబంధించిన దృశ్యాలను ట్విట్టర్లో షేర్ చేశారు. When the magnitude of wind speed is equal & opposite to the force of gravity. The water fall at its best during that stage in Naneghat of western ghats range. Beauty of Monsoons. pic.twitter.com/lkMfR9uS3R — Susanta Nanda IFS (@susantananda3) July 10, 2022 వర్షాకాల సోయగం.. ఈ ప్రకృతి అద్భుతాన్ని 'వర్షాకాల సోయగం'గా అభివర్ణించారు నంద. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 3 లక్షల వీక్షణలు, 15వేలకుపైగా లైక్‌లు సంపాదించింది. చాలా మంది ఆ అద్భుతంపై కామెంట్లు చేశారు. 'ఆ ప్రాంతాన్ని నేను సందర్శించాను. అది భూలోక స్వర్గం' అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. 'దీనికన్నా సుందరమైనదాన్ని ఇప్పటి వరకు చూడలేదు' అంటూ మరో నెటిజన్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: IndiGo Airlines: 'క్యూట్'గా ఉంటే విమాన టికెట్‌పై అదనపు ఛార్జ్.. ఇందులో నిజమెంత? -
అత్యంత ప్రమాదకరమైన ఈ మూడు పాముల గురించి తెలుసా?
పశ్చిమ గోదావరి (బుట్టాయగూడెం): వర్షాకాలం మొదలైంది. పాములు ఎక్కడపడితే కనిపిస్తుంటాయి. అటవీ ప్రాంతంలోని సరిహద్దు గ్రామాల్లో, దట్టమైన పొదల సమీపంలో పాములు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. రైతులు పొలాలకు నీరుపెట్టేందుకు వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. ఈ సమయంలో అప్రమత్తంగా లేకపోతే పాముల రూపంలో కాలయముడు కాచుకుని ఉంటాడు. గత వారం రోజుల్లో పోలవరం నియోజకవర్గంలోని వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో గల ప్రభుత్వాస్పత్రుల్లో పాము కాటు కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. బుట్టాయగూడెం మండలంలో గత మూడు రోజుల్లో ఇద్దరు పాముకాటుకు గురై మృతి చెందిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా మండ్రకప్ప, తేలు కాటుకు గురై పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ పాములు, ఇతర విష కీటకాల బెడద ఉంటుంది. వీటి బారిన పడకుండా తప్పించుకోవడానికి అప్రమత్తతే ప్రధానమని వైద్యులు చెబుతున్నారు. అన్ని పాములు ప్రమాదకరం కాదు మనకు కనిపించే అన్ని పాములు విషపూరితం కాదని వైద్య నిపుణులు అంటున్నారు. నాగుపాము, కట్లపాము, రక్తపింజర వంటి పాముల వల్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. సాధారణంగా 50 శాతంపైగా పాముల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు అంటున్నారు. పాము కాటేసిన వెంటనే వైద్యం చేయించుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. రక్తపింజర ఎక్కువగా అటవీప్రాంతంలో తిరుగుతుంది. ఈ పాము కాటు వేస్తే 2 గంటల తర్వాత విషం శరీరానికి ఎక్కుతుందని చెబుతున్నారు. రక్తపింజర కాటువేసిన వెంటనే అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆస్పత్రులకు వెళ్లి వైద్యం పొందాలి. నాగుపాము నాగుపాము అత్యంత ప్రమాదకరమైంది. ఈ పాము కాటువేస్తే 15 నిమిషాల్లో విషం ఎక్కుతుందని అంటారు. ముందుగా పాముకాటు వేసిన చోట వెంటనే కట్టు కట్టాలి. తదుపరి పాము కాటుకు గురైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించాలి. నాగుపాము విషం ప్రధానంగా నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కట్లపాము కట్లపాము కాటువేసిన వెంటనే విషం రక్తంలో కలుస్తుంది. ప్రాణాపాయం ఎక్కువ. పాము కాటు వేసిన వెంటనే ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించాలి. కట్లపాము విషం రక్తంలోకి చేరకముందే వైద్యం చేయిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు పాటించాలి ► పాముకాటుకు గురైన వారు ఎలాంటి ఆందోళన చెందకూడదు. తీవ్రమైన ఒత్తిడికి గురైతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ► పాము కాటువేయగానే గాయాల పైభాగంలో కట్టుకట్టాలి. ► ఏ పాము కాటు వేసిందో తెలుసుకొని యాంటీ వీనమ్(విషానికి విరుగుడు) తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ► రైతులు రాత్రిపూట పొలాలకు వెళ్ళేప్పుడు కాళ్ళకు చెప్పులు, టార్చిలైట్లతో పాటు శబ్దాలు చేసే పరికరాన్ని వెంట తీసుకుని వెళ్ళడం వల్ల పాముకాటు నుంచి రక్షించుకోవచ్చు. అన్ని ఆస్పత్రుల్లో యాంటివీనమ్ పాముల నుంచి రక్షించుకునేందుకు అప్రమత్తత అవసరం. పాముకాటుకు గురైతే యాంటివీనమ్ మందులు అన్ని ప్రాథమిక కేంద్రాల్లో ఉంటాయి. కాటుకు గురైన వ్యక్తి శరీరంలో మార్పులు రాకుండా తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. – జె. సురేష్, వైద్యుడు, పులిరామన్నగూడెం -
పత్తికి పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: ఈసారి వానాకాలం సీజన్ సాగు విస్తీర్ణంలో దాదాపు సగం మేరకు పత్తి సాగు చేసేలా రైతులను సన్నద్ధం చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు 2022 వానాకాలం సీజన్ వ్యవసాయ ప్రణాళికను ప్రకటించింది. గతేడాది వానాకాలం సీజన్లో 1.29 కోట్ల ఎకరాల్లో పంటలు వేయగా, ఈసారి ఏకంగా 1.42 కోట్ల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పేర్కొంది. అంటే సాగు విస్తీర్ణం 13 లక్షల ఎకరాలు పెరగనుందన్నమాట. మొత్తం 1.42 కోట్ల ఎకరాల్లో ఏ పంట ఎన్ని ఎకరాల్లో సాగు చేయాలో వ్యవసాయ శాఖ ప్రణాళికలో స్పష్టత ఇచ్చింది. ఆ మేరకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఈ వానాకాలం సీజన్లో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారు. గతేడాది వానాకాలం సీజన్లో 46.42 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగవగా, ఈసారి మరో 23.58 లక్షల ఎకరాలు పెంచేలా ప్రణాళిక రూపొందించింది. -
Hyderabad: జాగ్రత్త సుమా!.. అధికారులకు కేటీఆర్ హెచ్చరిక..
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలంలో నాలాలు, కాలువల్లో పడి ప్రాణాపాయాలు వంటి ఘటనలు చోటు చేసుకోకుండా అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులను హెచ్చరించారు. వర్షాకాల సమస్యలు, ఎస్ఎన్డీపీ పనులు తదితర అంశాలపై జీహెచ్ఎంసీ, తదితర విభాగాల ఉన్నతాధికారులతో ప్రగతిభవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు వివరాలు.. ‘వర్షాకాలానికి సంబంధించి ఎదురయ్యేసమస్యలపై అప్రమత్తంగా ఉండాలి. రెండేళ్ల క్రితం జరిగిన సంఘటనలు పునరావృతం కావద్దు. పనులపై ఏ మాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. అన్ని నాలాల్లో వరద నీరు సాఫీగా సాగేలా ఏర్పాట్లుండాలి. పనులు పురోగతిలో ఉండి పూర్తికానప్పటికీ, నీరు పారేలా తగిన ఏర్పాట్లు చేయాలి. పనులు జరిగే ప్రాంతాల్లో బారికేడింగ్‌లు, ప్రమాదహెచ్చరికలు తప్పనిసరి. ప్రజలే కాదు.. పనిచేసే కార్మికుల భద్రతకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికీ అపాయం జరగరాదు. శిథిలభవనాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదకర భవనాల్లోని వారిని తరలించాలి. అన్ని జోన్లలోనూ కంట్రోల్‌రూమ్స్ ఏర్పాటు చేయాలి. అంటువ్యాధులు ప్రబలకుండా నివారణచర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. వీడని వాన కష్టాలు నైరుతి రుతు పవనాల విస్తరణ, ఉపరితల ద్రోణి ప్రభావంతో గురువారం సైతం నగరంలో పలు ప్రాంతాల్లో జడివాన కురిసింది. లోతట్టు ప్రాంతాలు, నాలాలకు ఆనుకొని ఉన్న బస్తీల్లో వర్షం బీభత్సం సృష్టించింది. మోకాళ్ల లోతున పోటెత్తిన వరద, మురుగు నీటితో పలు బస్తీల వాసులు అవస్థలు పడ్డారు. ఇళ్లలోకి చేరిన వరద నీటిని తొలగించేందుకు పలు బస్తీల వాసులు కష్టాలు పడ్డారు. ఉదయం, సాయంత్రం వేళ కురిసిన వర్షంతో పలు ప్రధాన రహదారులపై వరద నీరు నిలిచి ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. వాహనదారులు, ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. రానున్న 24 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. చదవండి: ఏడేళ్లలో రూ.4.1 లక్షల కోట్ల పెట్టుబడులు -
Hyderabad: పనులు పూర్తి కాలేదు.. మరింత టైమ్ కావాలి!
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలంలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేకంగా వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం(ఎస్ఎన్డీపీ) వింగ్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, నిధులు మంజూరు అయినప్పటికీ పనులు కాలేదు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపునే మే నెలాఖరులోగా వీలైనన్ని పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ పనులు పూర్తవలేదు. ఇందుకు కారణాలనేకం. ఈ సంవత్సరం ఆరంభం వరకు అసలు పనుల్లో కదలిక లేకుండాపోయింది. కాంట్రాక్టర్లు ముందుకురాలేదు. ఒక్కో పనికి మూడు నాలుగుసార్లు టెండర్లు పిలవాల్సి వచ్చింది. తీరా పనులు ప్రారంభమయ్యాక క్షేత్రస్థాయి పరిస్థితులతో అలైన్మెంట్లు, డిజైన్లు మార్చాల్సివచ్చింది. కొన్ని ప్రాంతాల్లో స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇలా చెబుతూపోతే.. ఎన్నో కారణాలున్నాయి. పనులు మాత్రం పూర్తి కాలేదు. వర్షాకాలం వచ్చి నేపథ్యంలో ఉన్నతాధికారులు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పురోగతిలో ఉన్న పనుల వివరాల ఆధారంగా రాబోయే నెలన్నరలో దాదాపు పది పనులు పూర్తి చేస్తామని చెప్పినట్లు సమాచారం. ఆ మేరకు ఉన్నతాధికారులకు జోనల్ కమిషనర్లు, చీఫ్ ఇంజినీర్లు హామీ ఇచ్చారు. ఫాస్ట్ట్రాక్గా .. హామీ ఇచ్చిన పనుల్ని ఫాస్ట్ట్రాక్గా, ఎక్స్‌ప్రెస్ వేగంతో పూర్తి చేయాలని భావిస్తున్నారు. కానీ.. వర్షాలు కురిస్తే ఇంజినీరింగ్ పనులు.. అందునా నాలాల వంటి పనులు చేయడం అసాధ్యం. సమస్య పరిష్కారం కంటే ప్రమాదాలు కొనితెచ్చుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జూలై నెలాఖరు వరకు దాదాపు రూ.200 కోట్ల విలువైన పనుల్ని పూర్తి చేయగలమని జోనల్ కమిషనర్లు హామీ ఇచ్చినా ఏమేరకు అమలవుతాయన్నది వేచి చూడాల్సిందే. పనుల వేగం క్షేత్రస్థాయి స్థితిగతులు, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. జూలై ఆఖరు వరకు పూర్తవుతాయనుకుంటున్న పనుల వివరాలు.. పని పేరు.. అంచనా వ్యయం.. పూర్తయ్యే తేదీ.. ► నాగిరెడ్డి చెరువు– కాప్రా చెరువు వరద కాల్వ పనులు. రూ.41 కోట్లు: (జూన్ 30) ► ఫాక్స్‌సాగర్ కెమికల్ నాలా, కోల్‌కాల్వ– కెమికల్ నాలా. రూ.95 కోట్లు: (జూలై 15) ► కరాచీ బేకరీ వద్ద పికెట్ నాలా ఆధునికీకరణ పనులు (ఒకవైపు).రూ.10 కోట్లు: (జూన్ 30) ► ఈర్ల చెరువు– నేషనల్ హైవే 65.రూ.15.58 కోట్లు: (జూలై 15) ► ఇసుకవాగు– నక్కవాగు.రూ.5 కోట్లు: (జూలై 15) ► మోదుకుల కుంట– కొత్తచెరువు. రూ.17.80కోట్లు: (15 జూలై) ► అప్పాచెరువు– ముల్గుంద్ చెరువు. రూ.8.54 కోట్లు: (జూలై 31) ► బాతుల చెరువు– ఇంజాపూర్ నాలా.రూ.9.65 కోట్లు: (జూన్ 30) ► బండ్లగూడ చెరువు – నాగోల్ చెరువు. రూ.7.26 కోట్లు: ( జూలై 31) ► నెక్నాంపూర్ నాలా– మూసీ. రూ.24 కోట్లు: (జూలై 31) ఫాక్స్‌సాగర్, కెమికల్ నాలా, కోల్‌కాల్వ–కెమికల్నాలా రెండు పనులు ఒకే ప్యాకేజీ కింద చేపట్టారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ 04021111111కు ఫోన్ చేయవచ్చు. టోల్‌ఫ్రీ నంబర్ 1912కు కూడా ప్రజలు ఫోన్ చేయవచ్చని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. -
మీరూ మీ ఇల్లూ వానలకు రెడీయేనా?
దూరాన మేఘాలు గర్జిస్తున్నాయి. ఆకాశం నీళ్ల ధారలు కుమ్మరించనుంది. మరి వానలకు మీ ఇల్లు సిద్ధమేనా? కొట్టాల్సిన కొమ్మలు నాటాల్సిన మొక్కలు చెక్ చేయాల్సిన పైకప్పులు వాననీళ్లు పారాల్సిన తూములు విద్యుత్ తీగల నుంచి భద్రత దోమల నివారణకు తెరలు పిల్లలకై తీసుకోవాల్సిన జాగ్రత్తలు... రెడీ అవుదాం. మన దేశంలో వానకాలం వస్తే దృష్టి సగమే ఉంటుంది. అంటే? రోడ్డు ఉంటుంది... అది రోడ్డో కాదో తెలియదు. వీధి ఉంటుంది. అది వీధో కాదో తెలియదు. నీళ్లు కప్పిన నేలను ఏ లేపనం పూసుకున్నా ఎగురుతూ దాటలేము. కాలో, బండి చక్రమో వేయాల్సిందే. గోతుల్ని చూసుకోకపోతే పడాల్సిందే. అందుకే తీరిగ్గా కాకుండా ఇప్పటి నుంచే ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అది ఇండిపెండెంట్ ఇళ్లు ఉన్నవారైనా, అపార్ట్మెంట్లలో ఉంటున్నవారైనా. చెట్లు... మొక్కలు ఇది చెట్లు మొలిచే సమయం. చెట్లు ఊగే సమయం కూడా. మన ఇంట్లో వేసుకోవాల్సిన కొత్త మొక్కల కోసం కుండీలను, వాటికి అవసరమైన స్థలాలను గుర్తించాలి. పాతవి, డొక్కువి, పగిలిపోయినవి, అడుగుపోయినవి ఇప్పుడే పారేయాలి. ఈ వానల్లో తడిసిన కొత్త మొక్కల్ని చూడటం ఎంతో బాగుంటుంది. అలాగే ఇళ్లల్లో గాని అపార్ట్మెంట్ చుట్టూగాని పెరిగిన చెట్లు ఎలా ఉన్నాయి... వాటి కొమ్మల ధాటి ఎలా ఉంది చూసుకుని విరిగి పడేలా ఉండే వాటిని కొట్టించేయాలి. చాలా ఇళ్లకు, అపార్ట్మెంట్లకు సోలార్ ఫెన్సింగులు ఉన్నాయి. గాలివానలకు పెద్ద చెట్ల వల్ల వీటికి నష్టం జరక్కుండా చూసుకోవాలి. అలాగే ఏ మొక్కా, చెట్టూ లేకుండా కళావిహీనంగా ఉన్న ఇంటిని, అపార్ట్మెంట్లను ఈ సీజన్లో మొక్కలతో నింపుకోవాలి. అందుకు అవసరమైన మట్టిని, పనిముట్లను, బడ్జెట్‌ను కూడా సిద్ధం చేసుకోవాలి. గోడలు... కిటికీలు.. పైకప్పులు వాన నీరు నెత్తి మీద చేరే కాలం ఇది. ప్రతి ఇంటి పైకప్పును క్షుణ్ణంగా చెక్ చేయించుకోవాలి. లీకేజీ లేకుండా ఇప్పుడే నిపుణులతో పూడ్చుకోవాలి. వాటర్‌ప్రూఫ్ కోటింగ్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇంటి బయటి గోడలకు వాటర్‌ప్రూఫ్ పెయింటింగ్ చేయించుకోవడం కూడా ఒక మంచి సంరక్షణ. పైకప్పు మీద వాన నీరు నిలువ ఉండకుండా వాలును, నీరు బయటకు వెళ్లే పైపులను చెక్ చేసుకోవాలి. ఇంటి గోడల చుట్టూ ఉండే స్థలంలో నీటి గుంటలు ఏర్పడకుండా చూసుకోవాలి. ఆ గుంటల్లోని నీరు గోడలని దెబ్బ తీస్తుంది. కాంపౌండ్ వాల్స్‌గా చాలా పాత గోడలైతే కనుక వాటికి చుట్టుపక్కల పిల్లలు ఆడుకోకుండా ఉండటమే కాదు వెహికల్స్ పార్క్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గోడలు, చెట్లు కూలి వాహనాలు ధ్వంసం కావడం ఈ సీజన్లో సాధారణం. కనుక బయట పార్క్ చేసేప్పుడైనా ఇంటి దగ్గర పార్క్ చేసేప్పుడైనా పరిస్థితి అంచనా వేసుకోవాలి. అలాగే గాలికి, నీటి ధాటికి కిటికీలు నిలుస్తాయో లేదో చూసుకుని ఇప్పుడే రిపేర్లు చేసుకోవాలి. విద్యుత్ స్తంభాల నుంచి వైర్లు కిందకు వేళ్లాడి ఉంటే వాటిని సరి చేయించుకోవాలి. మన ఇంటి గోడలకు, శ్లాబ్‌లకు ఈ వైర్లు తగలకుండా చూసుకోవాలి. పాత సామాను పారేయండి ఇది వెలుతురు, ఎండ తగలని సమయం. ఇంట్లో పాత సామాను, చల్లదనానికి ముక్కిపోయే సామాను ఉంటే ఇప్పుడే వదుల్చుకోవడం మంచిది. మంచి వానల్లో చెత్త పారేయడం కూడా సాధ్యం కాదు. అలాగే ఇప్పటి వరకూ వాడిన కూలర్ల వంటి వాటిని అడ్డం లేకుండా అటక ఎక్కించడం మంచిది. అలాగే ఇంట్లో ఉండే ఫర్నీచర్, కప్‌బోర్డులు వాసన కొట్టకుండా, పురుగు పట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దోమలు, ఈగలు పెరిగే కాలం. దోమలు ఇళ్లల్లోకి దూరకుండా మెష్‌లు కొట్టడం, పాతవి రిపేరు చేసుకోవడం తప్పదు. మరీ ఎక్కువ దోమలున్న ఏరియాల్లో వారు దోమతెరలు తెచ్చుకోవాల్సిందే. ముఖ్యంగా చిన్నారులు ఉంటే. డాక్యుమెంట్లు జాగ్రత్త చాలా మంది డాక్యుమెంట్లను చెక్క బీరువాల్లో, టేబుళ్లలో పెట్టుకుంటారు. ముఖ్యమైన సర్టిఫికెట్లు, దస్తావేజులు... ఇవన్నీ ఈ కాలమంతా పూర్తిగా పొడిగా ఉండే సురక్షితమైన చోట ఉండేలా ఇంట్లో పెట్టుకోవాలి. వాటిని ప్లాసిక్ట్ ఫోల్డర్లలో భద్రపరచుకోవాలి. ఎమర్జెన్సీ కిట్ వానాకాలంలో ప్రతి ఇంట్లో ఎమర్జెన్సీ కిట్ ఉండాలి. బ్యాటరీ, టార్చ్‌లైట్, అగ్గిపెట్టె, వరద నీరు చేరితే దాటడానికి తాడు, ముఖ్యమైన మందులు, అదనపు చార్జింగ్ పరికరాలు... ఇవన్నీ ఇంట్లో ఉండాలి. అలాగే శుభ్రమైన నీరు గురించిన పరిశీలన కూడా అవసరం. ఇంటికి వచ్చే నీరు లీకేజీకి గురికావచ్చని అనుకుంటే ఫిల్టర్ పెట్టుకోవాలి. లేదా వేడి చేసి చల్లార్చిన నీరు తాగాలి. అలాగే ఊహించని భారీ వర్షం, ఉత్పాతం జరిగితే మనం వెళ్లవలసిన ఇళ్లు, కాంటాక్ట్ చేయాల్సిన నంబర్లు కుటుంబ సభ్యులు చర్చించుకోవాలి. ముఖ్యంగా లోతట్టు కాలనీల్లో ఉన్నవారు తమకు ఏదైనా సమస్య వస్తే తల దాచుకోవడానికి వస్తాం అని ముఖ్యమైన మిత్రులకో, బంధువులకో చెప్పి వారిని మానసికంగా సిద్ధం చేసి పెట్టాలి. వాహనాలు ఉన్నవారు ఈ కాలంలో బ్యాటరీలు మొరాయించకుండా చెక్ చేయించుని అవసరమైతే కొత్త బ్యాటరీలు వేయించుకోవాలి. ఆల్ట్రాలైట్ రెయిన్ కోట్ వాన వసే గొడుగులో ప్రతిసారీ పోలేము. వాహనం కూడా తీసే పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకే రెయిన్ కోట్ తప్పనిసరిగా ఒక్కటన్నా ఉండాలి. పిల్లలకు ఉండటం కూడా మంచిదే. ఎప్పుడూ బండిలో. కారులో గొడుగు పెట్టుకుని ఉండాలి. కార్లు ఉన్నవారు వైపర్లను చెక్ చేయించుకోవడం తప్పనిసరి అని వేరే చెప్పక్కర్లేదు కదా. -
వెన్నులో వైరస్ల వణుకు.. ఒకటి పోతే మరొకటి!
వానాకాలం రాకుండానే రకరకాల వైరస్ల భయం పట్టుకుంది. కేరళలో వెస్ట్‌నైల్, టమోటా వైరస్, మధ్యప్రదేశ్‌లో చికెన్‌పాక్స్ కేసులు దడపుట్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మంకీ పాక్స్ అనుమానిత కేసు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. మరోవైపు కరోనా వైరస్ మరోసారి విజృంభించి ఫోర్త్ వేవ్ ఉధృతమవుతుందన్న ఆందోళనలు అధికమవుతున్నాయి. కరోనా కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఫోర్త్ వేవ్ తప్పదేమోనన్న అనుమానాలు మొదలయ్యాయి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కేసులు సంఖ్య పెరిగిపోతోంది. రోజువారి పాజిటివిటీ రేటు ఒక్క శాతానికి పైగా నమోదైంది. గత 24 గంటల్లో 4,270 కేసులు నమోదయ్యాయి. క్రియా కేసుల సంఖ్య 24 వేలు దాటేసింది. ప్రముఖులు చాలా మంది కరోనా బరిన పడతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాం క గాంధీకి కరోనా సోకగా, తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. కోవిడ్ –19 నిబంధనల్ని పాటిస్తూ ఆయన క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. మరోవైపు మహారాష్ట్ర మాస్కులు ధరించాలని కోరుతుండగా కేంద్రం అందరూ బూస్టర్ డోసులు తీసుకోవాలని, టీకా సాయంతోనే దేశం కరోనా నుంచి గట్టెక్కుతోందని అంటోంది. వెస్ట్ నైల్ రకరకాల వైరస్‌లకు పుట్టినిల్లు అయిన కేరళలో వెస్ట్ నైల్ వైరస్ బారిన పడి త్రిశూర్‌కు చెందిన 47 ఏళ్ల వయసున్న వ్యక్తి మరణించడంతో ఆ రాష్ట్రం అప్రమత్తమైంది. వైస్ట్ నైల్ వైరస్ సోకిన వారిలో 80 శాతం మందికి ఎలాంటి లక్షణాలు ఉండవు. కానీ వ్యాధి తీవ్రంగా సోకితే ప్రాణాలు పోవడం ఖాయం. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే లక్షణం కాస్త తక్కువగా ఉంటుంది. 150 మందిలో ఒకరికి ఈ వైరస్ అత్యంత తీవ్రమైన వ్యాధిగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దోమకాటు ద్వారా వ్యాపించే ఈ వ్యాధి తీవ్రమైతే జ్వరం, తలనొప్పి, అలసట, ఒళ్లు నొప్పులు, వాంతులు, చర్మంపై దద్దుర్లు, దవడల దగ్గర వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పక్షవాతం కూడా వచ్చిన వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. వైరస్ సోకిన 3 నుంచి 14 రోజుల్లో ఈ వ్యాధి బయటపడుతుంది. కేరళలో టమాటా వైరస్, నిఫా వైరస్ కేసులు కూడా వెలుగులోకి వచ్చి ఆందోళనని పెంచుతున్నాయి. మంకీపాక్స్ ఉత్తరప్రదేశ్‌లో మంకీపాక్స్ వైరస్ కలకలం రేగింది. ఘజియాబాద్‌కు చెందిన అయిదేళ్ల చిన్నారికి మంకీపాక్స్ సోకిందన్న అనుమానంతో ఆమె శాంపిల్స్‌ను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. పట్నా నుంచి ఘజియాబాద్‌కు వచ్చిన ఆ అమ్మాయి శరీరం మీద దద్దుర్లు చూసి వైద్యులకు మంకీ పాక్స్ సోకిందేమోనన్న అనుమానం వచ్చింది. అందుకే శాంపిల్స్‌ను పుణెలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపి ఆ అమ్మాయిని క్వారంటైన్లో ఉంచినట్టుగా ఇఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ బిపి త్యాగి వెల్లడించారు. ఇప్పటికే ప్రపంచంలో 27 దేశాల్లో వెయ్యికి పైగా మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. స్మాల్‌పాక్స్, చికెన్ పాక్స్ మాదిరిగానే మంకీ పాక్స్ సోకితే జ్వరం, ఒళ్లు నొప్పులతో మొదలై శరీరం నిండా కురుపులు ఏర్పడతాయి. ఈ వ్యాధికి ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. స్మాల్ పాక్స్‌కు ఇచ్చే టీకాలు సమర్థంగా పని చేస్తుందని వైద్యాధికారులు చెప్పారు. చికెన్‌పాక్స్ మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని చికెన్‌పాక్స్ వణికిస్తోంది. మొత్తం ఏడు జిల్లాల్లో ఈ వ్యాధి బయటపడింది. ఛత్తర్పూర్, చింద్వారా, దాటియా, నీమచ్, భోపాల్, ధార్, ఖండ్వా జిల్లాల్లో 31 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒకరి నుంచి మరొకరికి అత్యత వేగంగా అంటుకునే లక్షణం కలిగిన వ్యాధి కావడంతో చిన్నారులు, గర్భిణులు, టీనేజర్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని మధ్యప్రదేశ్ సర్కార్ అన్ని జిల్లా కేంద్రాలను అప్రమత్తం చేసింది. కరోనా హాట్‌స్పాట్‌గా కరణ్ బర్త్‌డే ? బాలీవుడ్ నటులు ఒక్కొక్కరు కరోనా బారిన పడుతున్నారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ మే 25న తన 50వ పుట్టిన రోజు వేడుకల్ని యశ్‌రాజ్ ఫిల్మ్ స్టూడియోలో ఘనంగా చేశారు. ఈ పార్టీకి షారూక్‌ఖాన్ దగ్గర్నుంచి జాన్వికపూర్ వరకు ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో కనీసం 50 మంది కోవిడ్–19 బారిన పడ్డారన్న వార్తలు బీ టౌన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆదివారం బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ తనకి కరోనా పాజిటివ్‌గా నిర్థారణైందని వెల్లడించారు. హీరోయిన్లు కత్రినా కైఫ్, అదితి రాయ్‌లు కూడా కరోనా బారినపడి కోలుకుంటున్నారు. పార్టీకి హాజరైన వారిలో చాలా మంది తమకు కరోనా సోకినట్టు బహిరంగంగా వెల్లడిం చలేదని, కరణ్ జోహార్ బర్త్ డే పార్టీ కోవిడ్ –19 సూపర్ స్ప్రెడర్గా మారిందని బాలీవుడ్ హంగా మా ఒక కథనాన్ని రాసుకొచ్చింది. అయితే కరణ్ జోహార్ టీమ్ ఈ విషయాన్ని ఖండిస్తోంది. ముం బైలో కేసులు పెరుగుతూ ఉండడంతో వారందరికీ కరోనా సోకి ఉండవచ్చునని వాదిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వానాకాలం వ్యవసాయ సీజన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బుధవారం నుంచి వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభం కానుంది. జూన్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ చివరి వరకు ఈ సీజన్ కొనసాగుతుంది. రుతుపవనాలు కేరళను తాకడం, త్వరలో మన రాష్ట్రంలోకి కూడా ప్రవేశించనుండటంతో రైతులు అన్ని విధాలుగా సాగుకు సన్నద్ధమయ్యారు. విత్తనాల కొనుగోలు మొదలైంది. అందుకోసం పత్తి కంపెనీలు కోటిన్నర విత్తన ప్యాకెట్లను అందుబాటులో ఉంచాయి. ఇప్పటికే లక్షలాది ప్యాకెట్ల పత్తి విత్తనాలను రైతులు కొనుగోలు చేశారు. ఒక వర్షం పడితే వెంటనే పత్తి విత్తనాలు చల్లుతారు. కాగా, ఈ సీజన్లో 75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు 45 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడే అవకాశముంది. కంది సాగు డబుల్... సోయా పట్ల సుముఖత ఇతర దేశాల నుంచి కంది దిగుమతులను నిలిపివేయడంతో, దేశవ్యాప్తంగా కంది పంటకు మార్కెట్లో డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో కంది పంటను సాధారణ సాగుకంటే డబుల్ చేయించాలని వ్యవసాయశాఖ అంచనాలు రూపొందిస్తోంది. వచ్చే సీజన్లో 15 నుంచి 20 లక్షల ఎకరాలకు విస్తరించాలని భావిస్తోంది. పంట దిగుబడిని కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో కందిని మరింత విస్తరించే కార్యక్రమానికి శ్రీకారం చూడుతోంది. అలాగే సోయా సాగుకు రాష్ట్రంలో విస్త్రృత అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో సోయాను సాగు చేసేందుకు రైతులు ముందుకొస్తున్నారు. అయితే సోయా విత్తనాలు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. రైతులు ఎలాగోలా విత్తనాలు కొనుగోలు చేసే అవకాశముంది. ఈ నెలలోనే రైతుబంధు.. ఇక ఈ సీజన్‌కు 25 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం పడతాయని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఇప్పటికే 4 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా యూరియా రాష్ట్రంలో అందుబాటులో ఉంది. 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ఈ మేరకు కేటాయింపులు జరపాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇక ఈ నెలలోనే రైతుబంధు సొమ్ము విడుదల కానుంది. -
తెలంగాణ రైతుల మెడపై.. ‘డిఫాల్టర్ కత్తి’!.. ఇప్పుడెలా?
సాక్షి, హైదరాబాద్: మరో పదిరోజుల్లో వానాకాలం సీజన్ ప్రారంభం కానుంది. దీంతో రైతులు సాగుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అవసరమైన పెట్టుబడుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదే క్రమంలో చాలామంది రైతులు బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. కానీ బ్యాంకులు వారికి రుణాలిచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. రైతులను రుణ ఎగవేతదారులుగా (డిఫాల్టర్లు) ముద్ర వేస్తున్న బ్యాంకులు..వారు కొత్త రుణాలు పొందేందుకు అనర్హులుగా పేర్కొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 16 లక్షల మంది రైతుల మెడపై ఈ విధమైన ‘డిఫాల్టర్ కత్తి’ వేలాడుతోంది. రుణమాఫీ జరగక..రైతులు చెల్లించక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు ఉపశమనం కోసం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని అధికార టీఆర్ఎస్ 2018 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అయితే ఈ రుణమాఫీ ప్రక్రియ సజావుగా సాగడం లేదు. రుణమాఫీ జరుగుతుందనే ఉద్దేశంతో రైతులు బకాయిలు చెల్లించలేదు. ఇలా రుణమాఫీ కాక కొందరు, అంతకుముందు పాత బకాయిలు పేరుకుపోయి మరికొందరు రైతులు బ్యాంకు డిఫాల్టర్లుగా మారిపోయారు. రాష్ట్రంలో ప్రతి ఏటా సగటున 42 లక్షల మంది వరకు రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటారు. రుణం తీసుకున్న రైతులు మూడు సీజన్లలోగా పూర్తి బకాయిలు చెల్లిస్తేనే తదుపరి రుణం తీసుకోవడానికి అర్హులవుతారు. అయితే ప్రభుత్వం 2018లో రుణమాఫీని ప్రకటించినా నిధులు తగినంతగా విడుదల చేయలేదు. మరోవైపు రైతులు తమ బకాయిలను చెల్లించలేదు. మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ.19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ నాలుగేళ్లలో రుణమాఫీ కోసం రూ. 20,164.20 కోట్లు బడ్జెట్లో కేటాయించినా, అందులో రూ.1,171.38 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. 2021 ఆగస్టులో రూ.25 వేల నుంచి రూ. 50 వేల మధ్య రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం రూ. 1,790 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు (రూ.25 వేల నుంచి రూ.37 వేల లోపు రుణాలు) రూ.763 కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేసింది. ఇవి కాకుండా లక్షలోపు రుణాల కోసం ఇంకా రూ.18 వేల కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉంది. మొత్తంగా ఇప్పటివరకు 5.66 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ కాగా, మరో 31 లక్షల మందికి చెల్లించాల్సి ఉంది. బకాయిలు చెల్లించాలని సర్కారు విన్నపం... కేవలం రూ.37 వేల వరకు మాత్రమే రుణమాఫీ జరగ్గా మిగిలిన వారికి రెన్యువల్ సమస్య వచ్చింది. రెన్యువల్ చేసుకోకపోతే డిఫాల్టర్లుగా మారతారు. అయితే చాలామంది రైతుల నుంచి రైతుబంధు సొమ్మును బ్యాంకులు బకాయిల కింద జమ చేసుకున్నాయి. మరోవైపు రుణం పొందాలంటే రెన్యువల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రైతులు తొలుత బకాయిలు చెల్లించాలని, తర్వాత రుణమాఫీ సొమ్మును వారి ఖాతాలో వేస్తామని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు కొందరు రైతులు అలా చెల్లించగా, మరి కొందరు రైతులు మాత్రం డబ్బులు లేకపోవడంతో బ్యాంకులకు చెల్లించలేకపోయారు. ఇలా 10 లక్షల మంది వరకు రైతులు డిఫాల్టర్లుగా మిగిలినట్లు అంచనా. వీరుగాక మరో ఆరు లక్షల మంది రైతులు రుణమాఫీ ప్రకటన వర్తింపు తేదీకి ముందు తీసుకున్న రుణాలను చెల్లించకపోవడంతో డిఫాల్టర్లుగా మారారు. -
ఈ చర్యలతో ధరల స్పీడ్ తగ్గుతుంది
న్యూఢిల్లీ: బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకున్న నిర్ణయం దీనితోపాటు మంచి రుతుపవన పరిస్థితి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో సహాయపడతాయని పరిశ్రమల సంఘం– సీఐఐ కొత్త ప్రెసిడెంట్ సంజీవ్ బజాజ్ పేర్కొన్నారు. సీఐఐ– కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్‌గా ఫిన్సర్వ్ సీఎండీ కూడా అయిన సంజీవ్ బజాజ్ గత వారం బాధ్యతలు స్వీకరించారు. 2022–23 కాలానికి ఆయన ఈ పదవిలో ఉంటారు. 2019–20లో సీఐఐ పశ్చిమ ప్రాంత చైర్మన్‌గా వ్యవహరించారు. యూఎస్‌లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో విద్యనభ్యసించారు. బోర్డ్ ఆఫ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), అలియాంజ్ ఎస్ఈ ఇంటర్నేషనల్ అడ్వైజరీ బోర్డ్‌లో సభ్యుడిగా ఉన్నారు. సీఐఐ చీఫ్‌గా బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన తన మొట్టమొదటి విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► మనం అధిక వడ్డీ రేట్ల వ్యవస్థలోకి మారామని నేను నమ్ముతున్నాను. ఇది ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో మనకు సహాయపడుతుంది. మొత్తంగా కాకపోయిన, కనీసం దానిలో కొంత భాగమైనా కట్టడి జరుగుతుందని భావిస్తున్నాను. ► ద్రవ్యోల్బణం కట్టడి, అవసరమైనమేరకు వడ్డీ రేట్ల కదలికలపై విధాన రూపకర్తల నిర్ణయాలు, దీనికితోడు బలమైన రుతుపవనాలపై ఆశల వంటి పలు అంశాలు ఈ సంవత్సరం ద్వితీయార్థం నాటికి మనల్ని మంచి స్థానంలో ఉంచుతాయని భావిస్తున్నాను. ► ద్రవ్యోల్బణం పెరుగుదల రెండు అంశాలపై ప్రస్తుతం ఆధారపడి ఉంది. అందులో ఒకటి డిమాండ్. మరొకటి సరఫరా వైపు సవాళ్లు. ► సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే వడ్డీ రేట్లను పెంపు ప్రక్రియను ప్రారంభించింది. రాబోయే సంవత్సరంలో వడ్డీ రేట్లు పెరుగుతాయని మనం భావించాలి. అయితే వడ్డీరేట్ల పెరుగుదల వల్ల వృద్ధికి కలిగే విఘాతాలను సెంట్రల్ బ్యాంక్ ఎలా పరిష్కరిస్తుందన్న అంశంపై మనం దృష్టి పెట్టాలి. ఈ అంశానికి సంబంధించి మేము ఆర్బీఐ నుండి స్పష్టమైన దిశను ఆశిస్తున్నాము. తదుపరి ద్రవ్య విధాన సమీక్షలో సెంట్రల్ బ్యాంక్ నుంచి ఈ మేరకు ప్రకటనలు వెలువడతాయని భావిస్తునాము. ► అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 7.4–8.2 శాతం శ్రేణిలో ఉంటుందని సీఐఐ అంచనావేస్తోంది. ► 2022–23కి సంబంధించి ‘బియాండ్ ఇండియా @75: పోటీతత్వం, వృద్ధి, సుస్థిరత, అంతర్జాతీయీకరణ’ అన్న థీమ్‌ను సీఐఐ అనుసరిస్తుంది. ఆయా అంశాలపై దృష్టి సారిస్తుంది. ► ఆర్థిక వృద్ధి సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ప్రపంచ ఆర్థిక సవాళ్లు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల నుంచి బయటపడ్డానికి కేంద్రం బలమైన విధాన సంస్కరణలతో ముందుకు నడవాలని మేము సూచిస్తున్నాము. ► ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు, వ్యవస్థలో బలమైన డిమాండ్, పీఎల్ఐ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం), వ్యవసాయ రంగం తోడ్పాటు వంటి అంశాలు దేశ ఎకానమీకి సమీప కాలంలో తోడ్పాటును అందిస్తాయని విశ్వసిస్తున్నాం. ► ఇంధన ఉత్పత్తులపై పన్నులను కొత్త తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని తక్షణం కొంత కట్టడి చేయవచ్చు. పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలలో పన్నుల వాటా అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. వీటిపై పన్ను తగ్గింపునకు సంబంధించి కేంద్రం– రాష్ట్రాలు సమన్వయంతో కృషి చేయాలని సీఐఐ కోరుతోంది. ► 2026–27 నాటికి 5 ట్రిలియన్ డాలర్లు, 2030–31 నాటికి 9 ట్రిలియన్ డాలర్ల మైలురాళ్లతో 2047 నాటికి అంటే భారత్‌కు స్వాతంత్యం వచ్చి 100 ఏళ్లు వచ్చేనాటికి దేశం 40 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాం. ► భారత్ వృద్ధికి సేవలు, తయారీ రెండు యంత్రాల వంటివి. ప్రభుత్వ సానుకూల విధానాలు ముఖ్యంగా పీఎల్ఐ పథకం వంటి చర్యలు 2047–48 ఆర్థిక సంవత్సరం నాటికి తయారీ రంగాన్ని బలోపేత స్థానంలో నిలబెడతాయని ఆశిస్తున్నాం. జీడీపీలో ఈ రంగం వాటా 27 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. ► ఇక సేవల రంగం వాటా కూడా జీడీపీలో 55 శాతంగా ఉంటుందని విశ్వసిస్తున్నాం. 2047 నాటికి అప్పటి సమాజం, సమాజ అవసరాలపై పరిశ్రమ ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఫిన్‌టెక్, ఇ–కామర్స్ మొదలైన డిజిటల్ విప్లవ అంశాలు భారతీయ పరిశ్రమకు అపారమైన అవకాశాలను సృష్టిస్తున్నాయి. ఆయా అంశాలు సమాజ అవసరాలను తీర్చడానికి భవిష్యత్తును సిద్ధం చేస్తున్నాయి. ఇవన్నీ ‘‘భారతదేశం ః100’’ ఎజెండాలో అంతర్భాగంగా ఉంటాయి. – సంజీవ్ బజాజ్ -
వాన లెక్క తేల్చే మాస్టారు
..::కంచర్ల యాదగిరిరెడ్డి ఈ ఏడాది రుతుపవనాలు గతంకంటే ముందే పలకరిస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజాగా ప్రకటించడం తెలిసిందే. రుతుపవనాల రాకకు అనుకూలంగా పరిస్థితులు ఉన్నందున మునుపటి కంటే వేగంగానే రుతుపవనాలు విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ... దేశంలో కోట్ల మంది రైతులతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన నైరుతి రుతుపవనాలను ఐఎండీ ఎలా అంచనా వేస్తుందో మీరెప్పుడైనా ఆలోచించారా? ఆసక్తికరమైన ఈ సమాచారం మీ కోసమే... దేశ ఆర్థిక రంగానికి దిక్సూచి... నైరుతి రుతుపవనాలు ఈ దేశానికి ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సకాలంలో వచ్చే వానలే దేశం ఆర్థికంగా, సామాజికంగా బలపడేందుకు అత్యంత కీలకం. ఇందులో ఏమాత్రం హెచ్చుతగ్గులు వచ్చినా కోట్ల మంది రైతులు, రైతు కూలీలకు పస్తులే మిగులుతాయి. ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇంత ముఖ్యమైన వ్యవహారం కాబట్టే భారత వాతావరణ విభాగం రుతుపవనాల ముందస్తు అంచనాకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటుంది. ఏటా ఏప్రిల్‌లో ఒకసారి, ఆ తరువాత రుతుపవనాల రాకకు ముందు, రుతుపవనాల ఆగమనం తరువాత అంచనాలను ప్రకటిస్తుంది. లెక్కలోకి ఐదు అంశాలు... రుతుపవనాల అంచనాకు ‘ద ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్ (ఈఎస్ఎస్ఓ)తో కలసి భారత వాతావరణ విభాగం కనీసం 5 అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. అవి ఏమిటంటే... ►ఉత్తర అట్లాంటిక్, ఉత్తర పసిఫిక్ మహాసముద్ర భాగాల ఉపరితల ఉష్ణోగ్రతల గ్రేడియంట్ (మారే తీరు) ఒకటి. ఇందుకోసం గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి నెలల్లోని లెక్కలను పరిగణనలోకి తీసుకుంటారు. ►హిందూ మహాసముద్రంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉపరితల ఉష్ణోగ్రతల వివరాలు. ►తూర్పు ఆసియా ప్రాంతంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లోని సగటు సముద్రమట్ట పీడనం. ►వాయవ్య యూరప్ ప్రాంతంలో జనవరి నెలలో ఉండే ఉపరితల గాలి ఉష్ణోగ్రతలు. ►ఫిబ్రవరి, మార్చి నెలల్లో భూమధ్య రేఖ వెంబడి పసఫిక్ మహాసముద్రంలో నులివెచ్చటి నీటి పరిమాణం. వానలు సక్రమంగా పడాలంటే ఈ ఐదు అంశాలు సంతృప్తికరంగా ఉంటేనే సరిపోదు. వాటికి తోడుగా మరికొన్ని అంశాలూ సహకరించాలి. నైరుతి నుంచి మేఘాలతో వీచే గాలులే మన రుతుపవనాలన్నది తెలిసిన విషయమే. మరి ఈ గాలులకు కేంద్రం ఏమిటో తెలుసా? భారత్‌కు సుమారు 4 వేల కిలోమీటర్ల దూరంలో ఉండే మాస్కెరేన్ ద్వీప ప్రాంతం! హిందూ మహా సముద్రంలో మడగాస్కర్కు ఇది సమాంతరంగా ఉంటుంది. సాధారణంగా ఏప్రిల్ మధ్యలో అక్కడ అత్యధిక పీడనం ఏర్పడుతుంది. దీన్ని మాస్కెరేన్ హై అంటారు. ఈ పీడనం ఎంత ఎక్కువ ఉంటుందన్న అంశంపై మన రుతుపవనాల తీవ్రత ఆధారపడి ఉంటుంది. పీడనం ఎక్కువగా ఉంటే రుతుపవన గాలులూ బలంగా ఉంటాయి. మాస్కెరేన్ ద్వీపం ప్రాంతంలో అధిక పీడనం ఏర్పడటం ఆలస్యమైతే రుతుపవనాల రాక కూడా ఆలస్యమవుతుంది. ఎక్కడో అంటార్కిటికా ప్రాంతంలో జరిగే కొన్ని అంశాల ఆధారంగా ఈ మాస్కెరేన్ ద్వీపం వద్ద అధిక పీడనం ఏర్పడుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. దిశ మార్చుకొని.. మాస్కరేన్ ద్వీపం వద్ద అధిక పీడనంతో ఏర్పడే గాలులు వాయవ్య దిశగా కదిలి ఆఫ్రికాలోని సొమాలియా ప్రాంతాన్ని ఢీకొంటాయి. అక్కడి ఎత్తుపల్లాలు, స్థల ఆకృతి ఆధారంగా గాలులు తూర్పు వైపునకు కదులుతాయి. భూమధ్య రేఖను దాటాక భూభ్రమణం వల్ల కలిగే కొరియాలిస్ శక్తి ప్రభావానికి లోనవుతాయి. దీని ప్రభావం వల్ల గాలులు దిశ మార్చుకొని నైరుతి దిక్కుగా కదులుతాయి. ఈ గాలుల్లో ఒక భాగం అరేబియా సముద్రం వైపు, ఇంకో భాగం బంగాళాఖాతం వైపు విడిపోతాయి. నైరుతి రుతుపవనాలు దేశంలో మొట్టమొదట తాకే కేరళ రాష్ట్రం అరేబియా సముద్ర తీరంలోనే ఉంటుంది. వేసవి మంట దారి చూపుతుంది రోహిణి కార్తెలో రోకళ్లు పగిలేంత ఎండ ఉంటే... రుతుపవనాల్లో అంతేస్థాయిలో వానలూ ఉంటాయని రైతులు అంచనా వేసుకుంటారు. అయితే దీని వెనుక శాస్త్రీయత కూడా లేకపోలేదు. ఎందుకంటే అరేబియా సముద్రం వైపు నుంచి కదులుతున్న రుతుపవనాలను ఆకర్షించేందుకు వేసవి ఎండలు ఉపయోగపడుతాయి. తుపానులు, వాయుగుండాలు, అల్పపీడనాలు కూడా రుతుపవనాలను సముద్రం నుంచి నేలమీదకు తీసుకొచ్చేందుకు ఉపయోగపడతాయి. గాలులు ఎప్పుడైనా అధిక పీడనం నుంచి తక్కువ పీడనం ఉన్న వైపునకు ప్రయాణిస్తాయి. నీరు పల్లం వైపు ప్రవహించినట్లు. వేసవిలో దేశం ఉత్తర దిక్కు నుంచి వీచే చల్లటిగాలులను హిమాలయ పర్వత శ్రేణి అడ్డుకుంటూ నేల బాగా వేడెక్కేందుకు సాయప డుతూంటుంది. దేశానికి ఇరువైపులా ఉన్న సముద్రాల ఉపరితల జలాలూ వేడెక్కుతాయి. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా కారణంగా నేలపై పీడనం తక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో అటు అరేబియా సముద్రం దక్షిణ ప్రాంతం ఇటు బంగాళాఖాతంలోనూ పీడనం ఎక్కువగా ఉంటుంది. తగిన సమయంలో అరేబియా సముద్రం వైపు నుంచి రుతుపవన గాలులు దేశం మీదకు వీస్తాయి. ఎల్ నినో, లా నినా ఎఫెక్ట్ ఎక్కడో దక్షిణ అమెరికా ప్రాంతంలో సముద్ర ఉపరితల జలాలు వెచ్చబడినా (ఎల్ నినో) లేక చల్లబడినా (లా నినా) దాని ప్రభావం మన రుతుపవనాలపై ఉంటుంది. దేశంలో ఇప్పటివరకు కరవులు ఏర్పడ్డ ప్రతిసారీ ఎల్ నినో పరిస్థితులే ఉన్నాయి. అయితే ఈ రెండు పరిస్థితులను గుర్తించడం ఎంతో సంక్లిష్టం. దీంతోపాటు హిందూ మహాసముద్రంలోనూ ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు రుతుపవనాలపై ప్రభావం చూపుతాయని 1999లో జపాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ఎన్.హెచ్.సాజీ పరిశోధన ద్వారా నిరూపించారు. దీనినే ఇండియన్ ఓషియన్ డైపోల్ అని పిలుస్తారు ‘పాజిటివ్, నెగెటివ్, న్యూట్రల్ అని మూడు దశలుంటాయి. పాజిటివ్ దశలో హిందూ మహాసముద్రం పశ్చిమ ప్రాంతంలో ఉపరితల జలాలు వెచ్చగా ఉంటాయి. ఈ పరిణామం రుతుపవనాలకు ఊపునిస్తుంది. దీనికి భిన్నంగా ఉంటే నెగెటివ్. మార్పులేవీ లేకపోతే న్యూట్రల్. 1994, 2006లలో ఎన్ నినో ఏర్పడ్డా దేశంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడకపోవడానికి ఇండియన్ డైపోల్ పాజిటివ్‌గా ఉండటమే కారణం’ అని ఆయన అంచనా వేశారు. రుతుపవనాల లెక్కలిలా.. ►నైరుతీ రుతుపవనాలు దక్షిణాసియాలోని 25 దేశాలపై ప్రభావం చూపుతాయి. రుతుపవనాల వల్ల తూర్పు నుంచి పశ్చిమంగా 18 వేల కి.మీ. మేర, దక్షిణం నుంచి ఉత్తరానికి సుమారు 6 వేల కి.మీ. మేర వానలు కురుస్తాయి. ►దేశ తొలి రుతుపవన అంచనా 1886 జూన్ 4న వెలువడింది. 1871 నుంచి 2006 వరకూ రుతుపవనాలు 94 సార్లు సాధారణంగా ఉంటే 23 ఏళ్లు కరువులు ఏర్పడ్డాయి. ►50 ఏళ్లపాటు దేశవ్యాప్తంగా కురిసిన సగటు వర్షపాతంలో 96–104 శాతం పడితే సాధారణ వర్షపాతంగా లెక్కిస్తారు. 90 శాతం కంటే తక్కువగా ఉంటే (వర్షాభావం) కరువు కింద లెక్క. ►సాధారణ పరిస్థితుల్లో జూన్ తొలి వారానికల్లా నైరుతి రుతుపవనాలు దక్షిణాదిని మొత్తాన్ని కమ్మేస్తాయి. ఆ తరువాత 15 రోజుల్లో దేశంలోని సగం ప్రాంతానికి విస్తరిస్తాయి. జూలై మధ్య నాటికి దేశం మొత్తమ్మీద ప్రభావం చూపుతాయి. -
ధాన్యం సేకరణలో తెలంగాణ 3
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే మూడోస్థానంలో నిలిచింది. మద్దతు ధరతో రైతుల నుంచి 70.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి తెలంగాణ ఈ ఘనత సాధించినట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 70.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. తాజా వివరాలు కేంద్రానికి అందలేదు. కాగా అత్యధికంగా ధాన్యం సేకరించిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో పంజాబ్ నిలవగా, రెండోస్థానంలో ఛత్తీస్‌గఢ్ నిలిచాయి. ఫిబ్రవరి 20 నాటికి దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను కేంద్రం వెల్లడించింది. వానాకాలం సీజన్లో దేశంలో 94.15 లక్షల మంది రైతులు రూ.1.36 లక్షల కోట్ల విలువైన 6.95 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించారు. రాష్ట్రంలో 32 జిల్లాల్లో 6,872 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం 12.86 లక్షల మంది రైతుల నుంచి 70.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. దీని విలువ రూ. 13,775 కోట్లు. -
రైతుల ఖాతాల్లోకి రూ.2,329 కోట్లు రావాలి
సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం సీజన్ ధాన్యం అమ్మకాల ప్రక్రియ దాదాపుగా ముగిసింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 12.78 లక్షల మంది రైతులు 69.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వి క్రయించారు. దీని విలువ రూ.13,670 కోట్లు కా గా.. 8,71,920మంది రైతులఖాతాల్లో రూ.11,341 కోట్ల సొమ్మును ప్రభుత్వం జమచేసింది. ఇంకా సుమారు 4 లక్షల మంది రైతులకు రూ.2,329 కోట్లు అందాల్సి ఉంది. 4 లక్షల మంది రైతుల్లో ధాన్యం అమ్ముకుని 20–25 రోజులు గడిచిన వారూ ఉన్నారు. వీరంతా ఖాతాల్లో ఎప్పుడు డబ్బు జమవుతుందా అని ఎదురుచూస్తున్నారు. గతంలో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తూకంవేసి, రసీదు ఇస్తే వారంలో బ్యాంకు ఖాతాలోకి డబ్బులు వచ్చేవి. కానీ ఈ సీజన్లో ధాన్యం కొనుగోలు, డబ్బు చెల్లింపు ప్రక్రియ సుదీర్ఘంగా మారింది. వడ్ల తూకం వేయాలంటే తొలుత పట్టా పాస్‌పుస్తకంతో ఆధార్, ఫోన్‌నంబర్‌ను లింక్ చేయాలి. అలాచేసిన రైతుకు ఉన్న పొలం విస్తీర్ణాన్ని బట్టి ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలో నిర్దేశిస్తారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తూకం వేయడంతోనే సరిపోదు. మిల్లింగ్‌కు పంపించే వరకు రైతుదే బాధ్యత. ఆపై రసీదు ఇచ్చే పరిస్థితి ఉంది. తూకం వేసిన ధాన్యం మిల్లుకు వెళ్లాక మిల్లర్ వచ్చిన ధాన్యం నాణ్యతను బట్టి కోతపెట్టి ఎంత కొనుగోలు చేశాడో చెబుతాడు. రైతు నుంచి మిల్లరు ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పిన లెక్కకు అనుగుణంగా ఐకేపీ సెంటర్ నుంచి రసీదు వస్తుంది. ఆ తర్వాతే ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టంలోకి రైతు విక్రయించిన ధాన్యం వివరాలు నమోదవుతాయి. దానికి అనుగుణంగా పౌరసరఫరాల సంస్థ ధాన్యం సొమ్మును ఆయా జిల్లాల ట్రెజరీల ద్వారా రైతుల ఖాతాల్లోకి పంపుతుంది. దీని వల్లే ధాన్యం సొమ్ము ఇంకా వారి ఖాతాల్లోకి రాలేదు. -
‘నెలంతా కురవాల్సిన వర్షం నిన్న ఒక్కరోజే కురవడంతో 30 వేల మంది నిరాశ్రయులయ్యారు'
More than 30,000 people were evacuated from their homes in Malaysia మలేషియా: దేశంలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఆదివారం కురిసిన వర్షపాతానికి సుమారు 30 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. శుక్రవారం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. ప్రధాన రహదారులు తెగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా మలేషియాలో ఆదివారం వరదలు ముంచెత్తడంతో 30,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు. మలేషియా దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలకు చెందిన 30 వేలకు పైగా వరద బాధితులను అధికారికంగా లెక్కించింది. వారిలో 14 వేల మంది పహంగ్‌కు చెందినవారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో అత్యంత రిచెస్ట్ ప్రాంతమైన సెలంగోర్‌లో దాదాపు 10,000 మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోయారని ఆ దేశ ప్రధాని ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్ మీడియాకు తెలిపారు. ఒక నెలమొత్తంలో కురవాల్సిన వర్షం ఆదివారం ఒక్కరోజే కురిసిందని, వరద బాధితులకు సత్వర సహాయం నిమిత్తం 179 కోట్ల నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం నాడు 6 సెంట్రల్, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రమాదకరస్థాయిలో వరదనీళ్లు చేరాయని ఆయన అన్నారు. డజన్ల కొద్ది బస్సు రోడ్లతోపాటు, రైలు సర్వీసులు కూడా నిలిపివేయబడ్డాయని మీడియాకు తెలిపారు. ప్రతి ఏడాది చివరిలో దేశంలోకి ప్రవేశించే తుపానులతో కూడిన రుతుపవనాల కారణంగా తరచూ అధిక వర్షపాతం నమోదవుతుంటుంది. ఈ డిసెంబర్లో ప్రమాదకర స్థాయిలో వరదలు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా 2014లో మలేషియాలో అత్యంత దారుణమైన వరదలు సంభవించాయి. నాటి వరదల కారణంగా దాదాపు 1,18,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. చదవండి: మళ్లీ లాక్డౌన్! నేటి నుంచి జనవరి 14 వరకు కఠిన ఆంక్షలతో.. -
టైఫాయిడ్ టైంలో ఇవి తినడం చాలా ప్రమాదకరం.. మరేం తినాలి?!
పరిసరాల అపరిశుభ్రత కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్‌గున్యా, కలరా, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. వీటిల్లో టైఫాయిడ్ జ్వరం కొంత ప్రమాదకారనే చెప్పవచ్చు. సాధారణంగా టైఫాయిడ్ జ్వరం కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా వ్యాపిస్తుంది. సాల్మొనెల్లా టైఫి అనే బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ సంక్రమిస్తుంది. అయితే నిపుణులు సూచించిన ఈ ఆహార అలవాట్లతో ఏవిధంగా టైఫాయిడ్ నుంచి ఉపశమనం పొందవచ్చో తెలుసుకుందాం.. టైఫాయిడ్ లక్షణాలు ఏ వ్యాధినైనా ఎంత త్వరగా గుర్తించగలిగితే అంత సులువుగా దానిని నయం చేయవచ్చు. టైఫాయిడ్‌ను కూడా తేలికగా గుర్తించవచ్చు. ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి, నీరసం, వాంతులు, విరేచనాలు లేద మలబద్ధకం, అలసట..వంటి ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఆహారం అస్సలు తీసుకోకూడదు.. టైఫాయిడ్ జ్వరం నుంచి త్వరగా తేరుకోవడానికి కొన్ని రకాల ఆహార అలవాట్లు తప్పక పాటించవల్సి ఉంటుంది. ముఖ్యంగా తొక్క తీయకుండా తినగలిగే పండ్లు, కూరగాయాలు, ఘాటుగా ఉండే ఆహారం, నెయ్యి లేదా నూనెతో వండిన పదార్ధాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి మీ కడుపులో మంట లేదా తాపాన్ని పుట్టించే అవకాశం ఉంది. ఇవి కూడా తినకూడదు కడుపులో గ్యాస్‌ను ఉత్పత్తి చేసే కొన్ని రకాల కూరగాయలు అంటే.. క్యాబేజీ, బ్రొకోలీ, క్యాలీఫ్లవర్ వంటి వాటిని కూడా తినకపోవడం మంచిది. అలాగే వ్యాధి నివారణకు ఆటంకాలుగా పరిణమించే ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి కూడా తినకూడదు. మరేం తినాలి? టైఫాయిడ్‌తో బాధపడే వారికి దివ్యౌషధం ఏంటంటే.. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహార పదార్ధాలు. అంటే.. సోయా బీన్స్, వివిధ రకాల గింజలు (నట్స్), భిన్న రకాలైన విత్తనాలు, గుడ్లు.. వంటివి తినాలి. ఆలుగడ్డ వేపుడు, ఉడికించిన అన్నం.. వంటి కార్బొహైడ్రేట్స్ పుష్కలంగా ఉండే ఆహారం కూడా తీసుకోవాలి. పాలు, పన్నీర్ వంటి పాల ఉత్పత్తులు కూడా తినొచ్చు. అలాగే టైఫాయిడ్ నుంచి కోలుకునే ప్రక్రియలో మరిన్ని నీళ్లు తాగడం మాత్రం మర్చిపోకూడదు. ఈ ఆహారపు అలవాట్లతో మీ ఆరోగ్యాన్ని మరింత పదిలంగా కాపాడుకోవచ్చనేది నిపుణుల మాట. చదవండి: Health Tips: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఇది తరచుగా తింటే సరి! -
ఢిల్లీలో భారీ వర్షం.. 18 ఏళ్ల తర్వాత తొలిసారి
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి రహదారులన్ని జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక దేశ రాజధానిలో శుక్రవారం నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో 18 ఏళ్ల రికార్డు బద్దలయింది. 18 ఏళ్ల తర్వాత అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు ఢిల్లీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలతో ఢిల్లీలోని నారేలా ప్రాంతంలో ఓ ఇల్లు కుప్పకూలిపోయింది. ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. మధు విహార్, జోర్‌బాగ్, మోతీబాగ్, ఆర్కేపురం, సదర్ బజార్ ప్రాంతాలు నీటితో రోడ్లు నిండిపోయాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాణిఖేదాలోని అండర్‌పాస్ మొత్తం నీటితో మునిగిపోయింది. రేపు ఉదయం వరకు భారీ వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన పరిస్థితులతో సెప్టెంబర్ 16-17 తేదీల్లో కుంభవృష్టి కురుస్తుందని పేర్కొంది. చదవండి: Covid-19: ‘ఎర్ర చీమల చట్నీ’ వాడాలని చెప్పలేం -
చెల్లిని మోసుకుంటూ వాగు దాటిన అన్న
చెన్నూర్ రూరల్: సరైన దారిలేక.. వర్షాకాలం లో వాగులు దాటలేక గ్రామీణ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సమస్యతో ఒక్కోసారి ప్రాణాలూ కోల్పోతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం నారాయణపూర్‌కు చెందిన నిట్టూరి ప్రవళికకు శనివారం ఫిట్స్ వచ్చాయి. ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబసభ్యులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇంటి నుంచి స్కూటీపై తీసుకొచ్చినా.. గ్రామ సమీపంలోని సుబ్బరాంపల్లి వాగుపై వంతెన లేక దాటడం కష్టంగా మారింది. అప్పటికే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. వాగు అవతలి ఒడ్డు వరకు వచ్చింది. ప్రవళికను ఆమె అన్న ప్రభాకర్ మోసుకుంటూ వాగు దాటి అంబులెన్స్ ఎక్కించాడు. చెన్నూర్ ప్రభుత్వ ఆసు పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. -
ఊహించని ఉపద్రవం.. ధర్మశాలలో ఆర్తనాదాలు
Dharamshala Cloud Burst కమ్ముకున్న నల్ల మేఘాలు, ఆ వెంటనే భారీ వర్షాలు.. హఠాత్తుగా ముంచుకొచ్చిన వరదలతో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో. ముఖ్యంగా భాగ్సు నాగ్ ఏరియాలో వరదల్లో చిక్కుకుపోయిన వందల మంది సాయం కోసం కేకలు వేస్తున్నారు. సిమ్లా: కుంభవృష్టితో ధర్మశాల నీట మునిగింది. సోమవారం ఉదయం వరకు మూడు వేల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచారం. కొండలపై నుంచి నీళ్లు.. భాగ్సునాగ్ నాలా ఉప్పొంగడంతో ధర్మశాలలోకి నీరు చొచ్చుకువచ్చింది. బురద నీటి ప్రవాహం, కార్లు కొట్టుకుపోవడం, కట్టలు తెగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Himachal Pradesh rains wreak havoc in #Dharamshala. pic.twitter.com/J60nmYNKJp — Ayushi Agarwal (@ayu_agarwal94) July 12, 2021 #HimachalPradesh Surge in water level of #Bhagsunag nullah in #Dharamshala following heavy rainfall. pic.twitter.com/S7f5dscHt8 — αѕℓαм кнαη ᴀɴᴛɪ ᴡᴀʀ ᴀᴄᴛɪᴠɪꜱᴛ. (@aslamkhanbombay) July 12, 2021 As rains lash down in #Dharamshala shanties of safai karamcharis get washed out by the river in spate. This community has been demanding proper & safe housing for the last 5 years. HP govt & admin is accountable. They should be given immediate relief by providing shelter & food. pic.twitter.com/MfcKRJRZU6 — Endangered Himalaya (@EndangeredHimal) July 12, 2021 ఆ వీడియోలు అక్కడి ప్రజల నిస్సహయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. తమను కాపాడాలంటూ చాలామంది సోషల్ మీడియాలోనే వీడియోలు పెడుతున్నారు. ఇక మాన్హి నది ఉప్పొంగడంతోనూ వరదలు మరింత పొటేత్తాయి. Orange Alert in #Dharamshala in #HimachalPradesh after a huge cloud burst pic.twitter.com/D52FHzN0Wk — Holidays Hunt (@HolidaysHunt) July 12, 2021 This is Gaggal Bridge.#Dharamshala#HimachalPradesh pic.twitter.com/F2jL1suMGd — Aryan Rajput🇮🇳 (@AryanRajput21) July 12, 2021 Hoping everyone is safe.🙏 #dharamshala pic.twitter.com/80qP8IXZ1y — Srejan Shankar (@SrejanShankar) July 12, 2021 లాక్డౌన్ తర్వాత ఆంక్షలు సడలించడం, పైగా వారాంతం కావడంతో చాలామంది టూరిస్టులు అక్కడికి క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా ఊడిపడ్డ వరదల్లో వాళ్లు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారీ వర్షం కురవడం, వరద ఉధృతి పెరుగుతుండడంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోందని ధర్మశాల అధికారులు చెప్తున్నారు. Flash flood in Bhagsu Nag, #Dharamshala due to heavy rainfall. #HimachalPradesh (Video credit: SHO Mcleodganj Vipin Chaudhary) ANI pic.twitter.com/O3kbHOToji — Jagran English (@JagranEnglish) July 12, 2021 -
సిద్దిపేట.. సింగారం
సిద్దిపేట: రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. నల్లని మేఘాలు ఆకాశాన్ని కమ్మేస్తున్నాయి. నేలంతా పచ్చదనం పరుచుకునేందుకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో అటు నలుపు, ఇటు పచ్చదనం మధ్యన ఎర్రెర్రాని పువ్వులతో సరికొత్తగా సింగారించుకుంది సిద్దిపేట పట్టణం. వేములవాడ కమాన్‌రోడ్, రామగుండం హైవేలో ఈ ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫోటోలు : కే సతీష్, స్టాఫ్ ఫోటోగ్రాఫర్, సిద్దిపేట -
పుడమి పులకరింత
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో పుడమి పులకరిస్తోంది. కృష్ణా, గోదావరి, వంశధార, తుంగభద్ర, పెన్నా, చిత్రావతి నదుల్లో గంగమ్మ పరవళ్లు తొక్కుతోంది. రిజర్వాయర్లు, ప్రాజెక్టులు నిండుకుండల్లా పొర్లుతున్నాయి. రాయలసీమలో ఐదారు వందల అడుగుల లోతులో మాత్రమే నీరుండే కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఉబికివస్తున్నాయి. వైఎస్సార్ జిల్లా గాలివీడు, చిత్తూరు జిల్లా వడమాలపేట లాంటి ప్రాంతాల్లో కొన్ని బోర్ల నుంచి మోటార్లు ఆన్ చేయకుండానే నీరు ఉబికి రావడం గమనార్హం. భారీ వర్షాలు, వరదల వల్ల పంటలు నీట మునిగి రైతులు కొంత ఆందోళన చెందుతున్నా ఇక రెండేళ్లు కరువు ఉండదని, పుష్కలంగా పంటలు పండించుకోవచ్చని ఊరట చెందుతున్నారు. ఇక నీటి సమస్య ఉండదు... ‘2014 నుంచి 2018 వరకూ కరువుతో సతమతమయ్యాం. గత ఏడాది, ఈ సంవత్సరం మంచి వర్షాలు పడటంతో దుర్భిక్షం ఛాయలు కనిపించకుండా పోయాయి. పండ్ల తోటలకు ఇక రెండు మూడేళ్లు నీటి సమస్య ఉండదు’ అని అనంతపురం జిల్లా నంబులపూలకుంటకు చెందిన నారాయణరెడ్డి, పెరవలికి చెందిన వెంకటప్ప సంతోషం వ్యక్తం చేశారు. లోటు మాటే లేదు.. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 27.9 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఒక్క జిల్లాలో కూడా వర్షపాత లోటు లేకపోవడం గమనార్హం. ఇదే కాలంలో రాష్ట్రంలో 68.67 శాతం ప్రాంతంలో అధిక వర్షపాతం నమోదైంది. 26.71 శాతం మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా కేవలం 4.62 శాతం మండలాల్లో మాత్రమే సాధారణం కంటే లోటు వర్షపాతం రికార్డయింది. వైఎస్సార్ జిల్లాలో సాధారణం కంటే 67.7 శాతం అధిక వర్షపాతం నమోదైంది. దశాబ్దాలుగా దుర్భిక్షం తాండవిస్తున్న అనంతపురం జిల్లాలో సాధారణం కంటే 58.2 శాతం అధిక వర్షపాతం నమోదు కావడం విశేషం. రాష్ట్రంలో 460 మండలాల పరిధిలో అధిక వర్షపాతం, 79 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కేవలం 31 మండలాల్లో మాత్రమే సాధారణం కంటే తక్కువ వర్షం కురిసింది. జిల్లాలవారీగా వర్షపాతం వివరాలు (1-6-2020 నుంచి 22-10-2020 వరకు వర్షపాతం మిల్లీమీటర్లలో) జిల్లా సాధారణం కురిసింది తేడా శాతం తేడా శాతం శ్రీకాకుళం 878.2 726.7 -17.3 విజయనగరం 848.7 806.6 -5.0 విశాఖపట్నం 895.3 1004.7 12.2 తూర్పుగోదావరి 947.3 1326.3 40.0 పశ్చిమగోదావరి 936.6 1323.2 41.3 కృష్ణా 823.1 1075.0 30.6 గుంటూరు 632.5 835.6 32.1 ప్రకాశం 540.5 652.9 20.8 నెల్లూరు 470.2 559.3 18.9 చిత్తూరు 545.1 770.4 41.3 వైఎస్సార్ 486.8 816.3 67.7 అనంతపురం 424.4 671.5 58.2 కర్నూలు 559.3 878.6 57.1 -
దేశంలో సాధారణం కంటే 6 % అధిక వర్షపాతం
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు సాధారణం కంటే 6 శాతం అధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఆదివారం ప్రకటించింది. కానీ, ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే లోటు వర్షపాతమే కొనసాగుతోందని పేర్కొంది. దక్షిణ, మధ్య, ఈశాన్య, తూర్పు భారతదేశంలో సాధారణం కంటే అధిక వర్షం కురిసిందని తెలియజేసింది. వాయవ్య భారతదేశంలో 19 శాతం లోటు వర్షపాతం నమోదైందని వెల్లడించింది. మరో రెండు నెలలపాటు వర్షాలు కురుస్తాయి కాబట్టి వాయవ్య భారతంలోనూ పరిస్థితి మెరుగు పడుతుందని ఆశిస్తున్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్రా చెప్పారు. దక్షిణాదిలో సాధారణం కంటే 17 శాతం అధిక వర్షపాతం రికార్డు అయ్యిందని ఐఎండీ స్పష్టం చేసింది. -
రెండో వారంలో ‘నైరుతి’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఈ నెల రెండో వారంలో ప్రవేశించనున్నాయి. సోమవారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించడంతో రాష్ట్రంలోకి ఎప్పుడు వస్తాయోనని రైతులు ఎదురుచూస్తున్నారు. తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సాధారణంగా జూన్ 8న ప్రవేశించాలి. ఈసారి ఎప్పుడు ప్రవేశిస్తాయన్న దానిపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టతనివ్వలేదు. రెండో వారంలో వస్తాయని మాత్రమే చెబుతున్నారు. అంటే 8వ తేదీ తర్వాత రెండో వారంలో ఎప్పుడైనా రావచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజా రావు వెల్లడించారు. ఇది వాతావరణంలోనూ, రుతుపవన గాలుల్లోనూ వచ్చే మార్పులపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. కాగా, 2019లో తెలంగాణలోకి రుతుపవనాలు జూన్ 21న, 2018లో జూన్ 8న ప్రవేశించాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలకు సంబంధించి జూన్ నుండి సెప్టెంబర్ మధ్య దేశవ్యాప్తంగా చాలావరకు సాధారణ వర్షపాతం (96 నుంచి 104 శాతం) నమోదయ్యే అవకాశం ఉందని రాజారావు తెలిపారు. పరిమాణాత్మకంగా రుతుపవనాల సమయంలో వర్షపాతం దేశం మొత్తం 102 శాతం (మోడల్ లోపం 4 శాతం ప్లస్ ఆర్ మైనస్). జూలైలో దేశవ్యాప్తంగా మొత్తం వర్షపాతం 103 శాతం, ఆగస్టులో 97 శాతం (మోడల్ లోపం 9 ప్లస్ఆర్ మైనస్) ఉంటుందని రాజారావు తెలిపారు. ఇక తెలంగాణలో జూన్ నుండి సెప్టెంబర్ మధ్య వర్షపాతం 102 శాతం (మోడల్ లోపం 8 శాతం ప్లస్ ఆర్ మైనస్) ఉంటుందని రాజారావు వివరించారు. అరేబియా సముద్రంలో వాయుగుండం దక్షిణ అరేబియా సముద్రం, లక్షదీవులు మొత్తం ప్రాంతాలు, మాల్దీవుల్లోని మిగిలిన ప్రాంతాలు, కేరళ, మహేలోని చాలా ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లోని కొన్ని ప్రాంతాలు, కోమోరిన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాల్లోకి సోమవారం నైరుతి రుతుపవనాలు విస్తరించాయని రాజారావు తెలిపారు. నైరుతి రుతుపవనాలు 1న కేరళలోకి ప్రవేశించడం వల్ల సాధారణ తేదీకి కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించినట్లైందని రాజారావు వెల్లడించారు. మరోవైపు తూర్పు మధ్య, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండం దక్షిణ నైరుతి దిశగా 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ఇది రాగల 12 గంటల్లో మరింత బలపడి తూర్పు మధ్య, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో బలపడి తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాల్లో తుపానుగా మారే అవకాశం ఉంది. ప్రారంభంలో మంగళవారం ఉదయం వరకు ఉత్తర దిశగా ప్రయాణించి తరువాత ఉత్తర ఈశాన్య దిశగా బుధవారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో హరిహరేశ్వర్ (రైగర్, మహారాష్ట్ర), దామన్ మధ్య ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ తీరాలను దాటే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. దీంతో తెలంగాణలో మంగళవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాజారావు తెలిపారు. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక బుధవారం కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. -
'వర్షాకాలం తర్వాతే క్రికెట్ మొదలవ్వొచ్చు'
ముంబై : వర్షాకాలం తర్వాతే దేశంలో మళ్లీ క్రికెట్ టోర్నీలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ జోహ్రీ తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్-2020)ను కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. కోవిడ్-19 ఆంక్షల వల్ల క్రికెట్ టోర్నీలు అన్నీ రద్దు అయిన విషయం తెలిసిందే. ముంబైలో నిర్వహించిన వెబినార్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ భద్రతను కోరుకుంటారని, వారిని గౌరవించాలని అన్నారు. క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణ అంశంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను పాటించనున్నట్లు ఆయన తెలిపారు. (సచిన్ నిమ్మకాయలు ఇవ్వవా: భజ్జీ) 'వర్షాకాలం ముగిసాకే క్రికెట్ అధికారికంగా ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మన దగ్గర వర్షాకాలం ఉంటుంది. ఒకవేళ ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ వాయిదా పడితే, అప్పుడు అక్టోబర్ లేదా నవంబర్‌లో ఐపీఎల్ నిర్వహించే అవకాశాలు ఉంటాయి. అయితే ఐపీఎల్లో ఆడేందుకు అంతర్జాతీయ ప్లేయర్లు వస్తుంటారని, వారికి 14 రోజుల క్వారెంటైన్ అవసరం ఉంటుందని, అలాంటి సందర్భంలో ఐపీఎల్ మ్యాచ్‌లను షెడ్యూల్ ప్రకారం నిర్వహించే కష్టమే' అంటూ పేర్కొన్నాడు. అంతేగాక దేశవాలి సీజన్లో అక్టోబర్ నుంచి మే వరకు దాదాపు 2వేల మ్యాచ్‌లు జరగాల్సి ఉందని, వీటిని నిర్వహించడం బీసీసీఐకి ఒక చాలెంజ్లా మారే అవకావం ఉన్నట్లు జోహ్రి తెలిపారు. (లాక్డౌన్: విరుష్కల మరో వీడియో వైరల్) -
10 లక్షల ఎకరాల్లో తెలంగాణ ‘సోన’
సాక్షి, హైదరాబాద్: వచ్చే వర్షాకాలం సీజన్‌కు రాష్ట్రంలో తెలంగాణ సోనా రకం వరిని 10 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని వ్యవసాయ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. సాంబమసూరి రకాన్ని కూడా 10 లక్షల ఎకరాల్లో సాగు జరిగేలా ప్రణాళిక రచించింది. రాష్ట్రవ్యాప్తంగా మేలు రకం వరి విత్తనాలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు ఏయే రకాన్ని ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే దానిపై ప్రణాళికలు తయారు చేశారు. (పద్ధతిగా.. పది) పలు దఫాలుగా శాస్త్రవేత్తలతో చర్చించి వరి సాగు విస్తీర్ణంపై నిర్ణయం తీసుకున్నారు. ఆ రెండు రకాలతో పాటు 35 వేల ఎకరాల్లో జేజీఎల్–1798, 25 వేల ఎకరాల్లో డబ్ల్యూజీఎల్–384, హెచ్ఎంటీ సోనా 25 వేల ఎకరాల్లో, అలాగే జై శ్రీరాం, ఇతరాలు కలిపి 4.15 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ప్రతిపాదించింది. అలాగే ఇతర సాధారణ వరిలో ఎంటీయూ–1010 రకాన్ని 9 లక్షల ఎకరాలు, 3.5 లక్షల ఎకరాల్లో కేఎన్ఎం–118 రకం, 50 వేల ఎకరాల్లో ఎన్టీయూ–1001, 30 వేల ఎకరాల్లో ఎంటీయూ–1061, ఇతరాలు 1.7 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ప్రతిపాదించారు. మేలు రకం, సాధారణ రకం వరి కలిపి 40 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. మూడు జిల్లాల్లో అత్యధికంగా వరి సాగును వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. ఇందులో నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి. మొత్తం ప్రతిపాదిత విస్తీర్ణంలో 24.5 శాతం ఈ మూడు జిల్లాల నుంచే ఉండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా వరి విత్తనాల లభ్యత కూడా అధికంగానే ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ విత్తనాల సరఫరా నిలిపివేత.. సమగ్ర వ్యవసాయ విధానాన్ని తీసుకొస్తున్న ప్రభుత్వం.. ఇప్పటికే జిల్లాల్లో వరి, మొక్కజొన్న విత్తనాల విక్రయాలను తాత్కాలికంగా నిలిపేయాలని డీలర్లకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో క్షేత్రస్థాయిలో రైతులకు ప్రస్తుతం విత్తనాలు అమ్మట్లేదు. రెండు, మూడు రోజుల్లో వరి విత్తనాల విక్రయాలు ప్రారంభించనున్నట్లు తెలిసింది. అది కూడా ప్రభుత్వం ఏయే జిల్లాలో ఎంత విస్తీర్ణం చెప్పిందో ఆ మేరకు నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఇక మొక్కజొన్న అసలు వానాకాలంలో సాగు చేయొద్దని ఆ విత్తనాలు అందుబాటులో ఉంచొద్దని స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే విత్తన కంపెనీలు, డీలర్లు మాత్రం సాగు సమీపించే సమయంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా నష్టపోతామని ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. -
గోదావరి జిల్లాల పరిస్థితిపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఉన్నత అధికారులతో ఆదివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడి పరిస్థిలు తెలుసుకున్నారు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో వరదలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశం జరిగింది. వరదల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు, లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కల్పనపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు వ్యాధుల బారీన పడకుండా పారిశుద్ద్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు, నిత్యావసర వస్తువలు ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. -
ముంబైను ముంచెత్తుతున్న భారీ వర్షాలు
ముంబై : కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు ముంబై మహానగరం అతలాకుతలం అవుతోంది. నగర శివారు ప్రజలు ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. సముద్రతీర ప్రాంతాల్లో 4.90 మీ. ఎత్తులో అధిక ఆటుపోట్లతో అలలు ఎగిసిపడుతుండటంతో తీర ప్రాంతాలవైపు వెళ్లకూడదని వాతావరణ శాఖ సూచించింది. 48 గంటల వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముంబై లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రైల్వే, విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంజయ్ గాంధీ జాతీయ పార్కులో వరద నీరు చేరడంతో సందర్శన నిలిపివేశారు. ముంబై-గోవా హైవే పై రాకపోకలు ఆగిపోయాయి. భారీ వర్షాల కారణంగా సముద్ర తీర ప్రాంత రహదారులపై చెత్త కొట్టుకు రావడంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది.. దానిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. -
భారీ వర్షాలు; పెరుగుతున్న గోదావరి ఉధృతి
సాక్షి, తూర్పుగోదావరి : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. మరో 24 గంటల్లో వరద తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో గోదావరి తీర లంక గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 8 లక్షల 60 వేల క్యూసెక్కులు ఉండగా గంట గంటకు ఉధృతి పెరుగుతూ నది ఉగ్రరూపం దాల్చుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలకు దేవిపట్నం మండలంలోని దాదాపు 26 గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. ధవళేశ్వరం బ్యారేజి వద్ద నీటి మట్టం ఇప్పటికే 10.6 అడుగులకు చేరడంతో బ్యారేజ్ 175 గేట్లు పూర్తిగా ఎత్తివేశారు. ధవళేశ్వరం దిగువన గోదావరి ఉప నదులైన వశిష్ట, వైనతేయ, గౌతమి పరవళ్లు తొక్కుతున్నాయి. సాయంత్రానికి నీటిమట్టం విలువ మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేయనున్నారు. ఇప్పటికే భద్రాచలం వద్ద గోదారి వరద పోటెత్తడంతో మొదటి ప్రమాదపు హెచ్చరికలు జారీ చేశారు. -
చురుగ్గా రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాజస్తాన్ నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా తూర్పు పశ్చిమ బంగాళాఖాతం వరకు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి వ్యాపించిందని వివరించింది. అలాగే ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. రుతుపవనాలు, ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో వచ్చే 3 రోజులు చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశముందని వివరించారు. గత 24 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిశాయి. అత్యధికంగా వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్‌కర్నూలు, మహబూబాబాద్‌లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డు అయింది. కాగజ్‌నగర్, సిర్పూరు, పాలకుర్తిలో 4 సెంటీమీటర్లు.. ఆలంపూర్, నర్సంపేట్, జైనూర్, ఉట్నూరు, పినపాక, జఫర్‌గఢ్, వంకిడిలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసిందని అధికారులు వెల్లడించారు. రుతుపవనాలు ప్రవేశించడం, వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గాయి. అనేకచోట్ల సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యాయి. మెదక్‌లో సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా 28 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, హకీంపేట, హన్మకొండల్లో సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
నైరుతి నైరాశ్యం
-
వజ్రాల వేట ప్రారంభం
సాక్షి, వజ్రకరూరు : మండల కేంద్రం వజ్రకరూరు పరిసర పొలాల్లో వజ్రాల వేట ప్రారంభమైంది. ఏటా జూన్ మాసంలో తొలకరి వర్షాలు పడిన వెంటనే వజ్రాల కోసం స్థానికులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి అనేకమంది ఇక్కడకు వచ్చి వజ్రాల కోసం అన్వేషించడం పరిపాటి. ఆదివారం సాయంత్రం భారీ గాలులతోపాటు పెద్ద ఎత్తున వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో రెండురోజులుగా వజ్రాల కోసం అన్వేషకుల తాకిడి పెరిగిపోతోంది. పురుషులు, మహిళలు, చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వెదకడంలో నిమగ్నమవుతున్నారు. ఇక్కడ లభించే వజ్రాలు కోహినూర్ వజ్రంతో సమానంగా ఉంటాయని అంటుంటారు. దేవుడు కరుణిస్తే తమ తలరాతలు మారిపోతాయేమోనని ప్రజలు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొందరైతే భోజనాలను కూడా అక్కడికే తెచ్చుకుంటున్నారు. పొలాల్లో విత్తనం వేసేంతవరకు వజ్రాలకోసం వెతకడం జరుగుతూనే ఉంటుంది. వర్షాలు వచ్చినప్పుడు పైభాగంలోనుంచి నీరుకిందకు వచ్చినప్పుడు ఒడ్డు ప్రాంతాల్లో వజ్రాలు లభిస్తాయనే భావనతో ప్రజలు వెదుకుతున్నారు. ఇక్కడ లభించే వజ్రాలు గుట్టు చప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలివెళుతున్నాయి. -
వరదొచ్చే దాకా వణుకే!
సాక్షి, హైదరాబాద్ : గోదావరి, కృష్ణా ప్రధాన ప్రాజెక్టులన్నీ జలకళను కోల్పోయి నిర్జీవంగా మారాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తీవ్ర నీటి ఎద్దడితో కొట్టుమిట్టాడుతున్నాయి. కృష్ణా బేసిన్ ఎగువన కర్ణాటక ప్రాజెక్టులు సైతం తీవ్ర నీటి కొరతను ఎదుర్కోవడం, అవి నిండితే కానీ దిగువన ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండే అవకాశం లేకపోవడంతో ఇక ఆశలన్నీ వర్షాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లో కనీసం 200 టీఎంసీల మేర నీటి నిల్వలు వస్తేకానీ దిగువన తెలంగాణ ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహాలు పెరిగే అవకాశాల్లేవు. ఈ పరిస్థితి రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. గణనీయంగా పడిపోయిన మట్టాలు కృష్ణా బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టుల్లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నీటిమట్టాలు గణనీయంగా పడిపోయాయి. ఎగువ కర్ణాటకలో గతేడాది కాస్త ఆలస్యంగా సెప్టెంబర్, అక్టోబర్‌లో భారీ వర్షాలు కురిసి ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర నిండినా ఖరీఫ్, రబీలో అక్కడ గణనీయమైన సాగు జరిగింది. దీంతో ఆ మూ డు ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 267 టీఎంసీల నిల్వ కు గానూ కేవలం 45 టీఎంసీల నీటి లభ్యతే ఉంది. 222 టీఎంసీల కొరత ఉంది. గతేడాది ఇదే సమయంలో ఉన్న నిల్వలతో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 10 టీఎంసీలు తక్కువగా ఉంది. ఎగువన సుమారు 200 టీఎంసీల మేర నీరు చేరాకే దిగువకు నీరొచ్చే అవకాశాలుంటాయి. అందుకు రెండు నెలలకన్నా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర పరిధిలోని నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లో 370 టీఎంసీల మేర నీటి కొరత ఉంది. ప్రస్తుతం సాగర్, శ్రీశైలంలో వినియోగించగల నీటి నిల్వలు 10 టీఎంసీలలోపే ఉన్నాయి. ఆ నీరు ఇరు రాష్ట్రాలకు ఆగస్టు వరకు తాగునీటి అవసరాలను తీర్చడం అనుమానమే. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి వచ్చే వరదలపైనే రాష్ట్ర ప్రాజెక్టుల కింద తాగు, సాగు అవసరాలు ఆధారపడి ఉండనున్నాయి. ఒకవేళ జూన్, జూలైలో మంచి వర్షాలు కురిసినా రాష్ట్ర ప్రాజెక్టుల్లో చేరే నీటిలో సుమారు 50 నుంచి 60 టీఎంసీల మేర తాగునీటి అవసరాలకు పక్కన పెట్టాకే ఖరీఫ్ అవసరాలకు వినియోగిస్తారు. మొత్తంగా సెప్టెంబర్, అక్టోబర్ దాకా ఖరీఫ్ ఆయకట్టుపై స్పష్టత వచ్చే అవకాశాల్లేవు. ప్రాజెక్టుల్లోకి సకాలంలో నీరు చేరకుంటే ఆ ప్రభావం సాగర్, జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా పరిధిలోని 11 లక్షల ఎకరాల ఆయకట్టుపై పడే ప్రమాదం ఉంది. ఇక గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లోనూ 160.72 టీఎంసీల నీటి కొరత ఉంది. ఇక్కడ జూలై నుంచే కొంతమేర ప్రవాహాలు కొనసాగితే తాగునీటి వరకు ఇబ్బంది ఉండదు. సకాలంలో నీరు రాకుంటే గతేడాది మాదిరే తాగునీటికి కటకట ఏర్పడనుంది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఇలా.. (టీఎంసీల్లో) ప్రాజెక్టు వాస్తవ నీటి నిల్వ ప్రస్తుత నిల్వ జూరాల 9.65 3.66 శ్రీశైలం 215.81 28.86 సాగర్ 312.05 135.09 ఆల్మట్టి 129.72 22.57 నారాయణపూర్ 37.64 19.73 తుంగభ్రద 100.86 3.81 గోదావరిలో ఇలా.. సింగూర్ 29.91 7.66 నిజాంసాగర్ 17.80 2.48 ఎస్సారెస్పీ 90.31 6.64 ఎల్ఎండీ 24.07 3.66 కడెం 7.60 2.89 ఎల్లంపల్లి 20.18 5.82 -
ఇండిగో మాన్సూన్ ఆఫర్. రూ 745
న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రయిట్ ఎయిర్ లైన్స్ ఇండిగో కూడా మాన్సూన్ ఆఫర్‌ను ప్రకటించింది. వన్ వే విమానాల్లో దాదాపు రూ. 745 కేటికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ పథకం పరిమిత కాలం అమల్లోఉండనుంది. జూలై 4 లోపు ప్రస్తుత డిస్కౌంట్ ధరల్లో టికెట్లను బుక్ చేసుకోవచ్చే. వీటి ద్వారా జూలై 14, 2017 నుంచి మార్చి 24 , 2018ల మధ్య వచ్చే ప్రయాణించవచ్చని ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఇండిగో వెబ్ సైట్ సమాచారం ప్రకారం అన్ని కలుపుకొని విమాన టికెట్లు జమ్మూ - శ్రీనగర్ మార్గంలో రూ. 745 అగర్తల-గైహతి రూ. 778, చెన్నై- బెంగళూరు రూ.898, అహ్మదాబాద్-ముంబై రూ. 1,048, బెంగళూరు-చెన్నై రూ. 1,059, బెంగళూరు-కొచీ రూ.1,199 బాగ్దోగ్రా-కోలకతా రూ. 1,199ప్రారంభధరలుగా ఉన్నాయి. అహ్మదాబాద్, అమృత్సర్ బాగ్దోగ్రా, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, కోయంబత్తూర్, డెహ్రాడూన్, ఢిల్లీ, గోవా, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కొచీ, కోలకతా, మధురై, మంగళూరు, ముంబై నుండి కాని స్టాప్ విమానాలు న చెల్లదు పాట్నా, పోర్ట్ బ్లెయిర్, పూణే, శ్రీనగర్, తిరువనంతపురం, వారణాసి, విశాఖపట్నం నాన్ స్టాప్ విమానాల్లో మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
వానల్లో ఆరోగ్యం కోసం...
ఆయుర్వేద కౌన్సెలింగ్ వానాకాలంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. అంతా తేమ, జలమయం. సూర్యకాంతి కనబడటం లేదు. ఇలాంటప్పుడు పెద్దలుగానీ, పిల్లలుగానీ రోగాల బారిన పడకుండా ఉండటంతో తీసుకోవాల్సిన నివారణలతో పాటు... అవి తగ్గడానికి ఆయుర్వేద చికిత్స సూచించప్రార్థన. - అయలసోమయాజుల మీనాక్షి, బీహెచ్ఈఎల్, హైదరాబాద్ శ్రావణ భాద్రపద మాసాలు వర్షరుతువులోకి వస్తాయి. దీన్నే మనం వానాకాలం అంటాం. వర్షాలు అధికంగా కురుస్తున్నప్పుడు వాతావరణంలో తేమ ఎక్కువవుతంది. ఇంటాబయటా తడితడిగా ఉంటుంది. వాంతులు, విరేచనాల వంటి లక్షణాలతో కూడిన వ్యాధులు ప్రబలుతుంటాయి. వీటికి కారణం అసాత్మ్యత (అలర్జీ), సూక్ష్మజీవులు (ఇన్ఫెక్షన్లు). వీటి నివారణ, చికిత్స కోసం ఈ కింది జాగ్రత్తలు పాటించండి. శుచి, శుద్ధి : ఇంటిలోపల, ఇంటిముందు రోజుకు రెండుసార్లు గుగ్గిలం ధూపం వేయండి. బయట అమ్మే ఆహార పదార్థాలు, ఇతర తినుబండారాలు తినవద్దు. ఇంట్లో తయారు చేసుకున్న తాజా ఆహారపదార్థాలను వేడివేడిగా తినండి. నూనె వంటకాలు, కారం ఎక్కువగా ఉండే టిఫిన్లు తినవద్దు. మరిగించి చల్లార్చిన నీటిని తాగండి. అల్లం, కరివేపాకు వేసిన పలుచని మజ్జిగ, శొంఠితో తయారు చేసిన ‘టీ’ తాగండి. బాగా ఉడికించిన కాయగూరలు తీసుకోవాలి. అంతటా పరిశుభ్రత ముఖ్యం. బయట వర్షంతో తడిసిన బట్టల్ని వేరే పెట్టి, ఇంటికి రాగానే వేడినీటితో స్నానం చేయడం అవసరం. అల్లం, వెల్లుల్లి ఐదేసి గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణం ఒక చెంచా (5 గ్రాములు), పసుపు ఐదు చిటికెలు వేసి పావు లీటరు నీళ్లు కలిపి ‘కషాయం’ కాచుకోండి. మూడువంతులు ఇగరగొట్టి, ఒక వంతు మిగలాలి. రెండుపూటలా ఈ కషాయం... గోరువెచ్చగా తాగండి. మోతాదు : పెద్దలకు 5 చెంచాలు; పిల్లలకు రెండు చెంచాలు (అవసరమైతే తేనె కలుపుకోవచ్చు). ఇది ప్రతిరోజూ రెండు వారాలపాటు సేవించినా పరవాలేదు. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసాల నివారణకూ పనికి వస్తుంది. చికిత్సగానూ పని చేస్తుంది. జీర్ణక్రియను సక్రమం చేస్తుంది. రోగనిరోధకశక్తిని ఉత్తేజపరుస్తుంది. వామును నూనె లేకుండా పొడిగా కొద్దిగా వేయించి, నీళ్లు పోసి మరిగిస్తే దాన్ని ‘వాము’ కషాయం అంటారు. మోతాదు : 5 చెంచాలు... రెండుపూటలా సేవిస్తే అజీర్ణం దూరమవుతుంది. నీళ్ల విరేచనాలు తగ్గిపోతాయి. శొంఠి చూర్ణం రెండు గ్రాములు, మిరియాల చూర్ణం ఒక గ్రాము కలిపి తేనెతో రెండుపూటలా సేవిస్తే కఫంతో కూడిన దగ్గు, ఆయాసం తగ్గుతాయి. పేలాలను నీటిలో నానబెట్టి, ఆ నీటిని ఐదేసి చెంచాల చొప్పున మూడుపూటలా తాగితే వాంతి, వికారం తగ్గుతాయి. ఏలకుల పొడి (మూడు చిటికెలు) ప్లస్ జీలకర్రపొడి (ఒకగ్రాము) కలిపి తేనెతో రెండు పూటలా సేవిస్తే వాంతులు తగ్గుతాయి. శొంఠి, ఇంగువ, జీలకర్ర వేసిన పలుచని మజ్జిగను రెండుపూటలా సేవిస్తే కడుపునొప్పి దూరమవుతుంది. అజీర్ణం ఉండదు. పొట్టలో వాయువు తగ్గి, రోజూ అయ్యే విరేచనం సాఫీగా అవుతుంది. వ్యాయామం : ఇంటిపట్టున ఉన్నప్పటికీ, అన్ని వయసుల వారూ ఇంట్లోనే ఒక అరగంట తేలికపాటి వ్యాయామం విధిగా చేస్తే, శరీరం తేలిక పడి, కీళ్లు-కండరాల నొప్పులు దరిచేరవు. బజారులో లభించే ఔషధం : అరవిందాసవతోపాటు పిప్పల్యాసవ ద్రావకాలను, వానాకాలంలో ఇంట్లో ఉంచుకోవాలి. ఒక్కొక్కటి రెండేసి చెంచాలు, కొద్దిగా నీళ్లలో కలుపుకొని రెండుపూటలా వానాకాలమంతా సేవిస్తే చాలా వ్యాధులు దరిచేరవు. వంటింట్లో ఉండే ఈ పదార్థాలతోనే వానల వల్ల వచ్చే ఆరోగ్య సంబంధిత అనర్థాలను సమర్థంగా ఎదుర్కోవచ్చు - డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు,సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
రోడ్ల తవ్వకాలపై నిషేధం
- ఆర్నెల్ల వరకు తవ్వకాలకు బ్రేక్ - ప్రైవేటుతో పాటు ప్రభుత్వ సంస్థలకూ వర్తింపు - ఉన్నతాధికారుల సమన్వయ సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: వర్షాకాల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని నగరంలో ఆర్నెల్లపాటు ఏ అవసరం కోసమైనా సరే రోడ్ల తవ్వకాలకు అనుమతించేది లేదని జీహెచ్ఎంసీతోపాటు ఆయా ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారుల సమన్వయ సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్నెల్ల వరకు రోడ్ల తవ్వకాలపై నిషేధం విధించింది. ఇప్పటికే తవ్వకాలు జరిగి పనులు జరుగుతున్న ప్రాంతాల్లో పనుల్ని వేగిరం పూర్తిచేయాల్సిందిగా ఆయా విభాగాలను ఆదేశించింది. రోడ్ల విస్తరణ తదితర కారణాల వల్ల రోడ్లపై పడి ఉన్న విద్యుత్‌స్తంభాలు, వైర్లను వెంటనే తొలగించాల్సిందిగా విద్యుత్ శాఖను ఈ సమావేశం కోరింది. ఆయా విభాగాలు తవ్విన రోడ్లను వెంటనే పునరుద్ధరించి, వాటికి సంబంధించి చేసిన వ్యయాన్ని సంబంధిత శాఖలకు పంపాలని నిర్ణయించింది. శనివారం మింట్ కాంపౌండ్‌లోని తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలో జరిగిన సమన్వయ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి, జలమండలి ఎండీ దానకిశోర్, మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ట్రాఫిక్ అడిషనల్ సీపీ జితేందర్, టీఎస్ఎస్ సీపీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, సైబరాబాద్ ఈస్ట్ కమిషనర్ నవీన్‌చంద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశానంతరం వివరాలను జనార్దన్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి.. ప్రస్తుత వర్షాకాల సీజన్లో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పనులు పూర్తయిన మెట్రో కారిడార్లలో ఫుట్‌పాత్‌లు, మీడియన్లను వెంటనే పునరుద్ధరించాలని నిర్ణయించారు. విధిగా బోర్డుల ప్రదర్శన మౌలిక సదుపాయాల కోసం చేపట్టే తాగునీరు, డ్రైనేజీ పైప్లైన్ల నిర్మాణం, రోడ్ల తవ్వకాలు, మరమ్మతులు తదితర ఏ పనులు చేసినా నిర్మాణం జరుగుతున్న పనులు.. ఎప్పుడు ప్రారంభించేది.. ఎప్పుడు పూర్తయ్యేది.. కాంట్రాక్టు సంస్థ ఏది.. తదితర వివరాలను సూచించే బోర్డులు విధిగా ఏర్పాటు చేయాలని కూడా సమన్వయ సమావేశం నిర్ణయించింది. పనులు చేపట్టేందుకు ముందుగానే ఆ సమాచారం ప్రజలకు తెలపాలని నిర్ణయించారు. ప్రభుత్వస్థలాల్లో పార్కింగ్ కాంప్లెక్స్‌లు వీలైనన్ని మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్సులను నిర్మించాలని సమావేశం అభిప్రాయపడింది. ఇందుకు ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాలను గుర్తించి.. ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, ఐటీ విభాగాల ద్వారా టెండర్లు ఆహ్వానించాలని నిర్ణయించారు. నగరంలో జేఎన్ఎన్యూఆర్ఎం పథకం ద్వారా నిర్మించిన ఇళ్లను కేటాయించేందుకు లబ్ధిదారుల జాబితాను వెంటనే అందజేయాల్సిందిగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను కోరారు. ఈ నెల 11న జరిగే 25 లక్షల మొక్కలు నాటే కార్యక్రమంలో గ్రేటర్‌లోని అన్ని ప్రభుత్వశాఖల అధికారులు, సిబ్బంది విధిగా పాల్గొనాలని జనార్దన్‌రెడ్డి కోరారు. శివార్లలో 2,700 కి.మీ. మేర పైప్లైన్ల ఏర్పాటు జీహెచ్ఎంసీ శివారు ప్రాంతాల్లో రానున్న రెండేళ్లలో 2వేల కోట్ల రూపాయల హడ్కో నిధులతో మెరుగైన మంచినీటి సరఫరా పనులు జరగనున్నాయి. ఈ నిధులతో దాదాపు 2,700 కి.మీ.ల మేర పైప్లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులు చేపట్టేందుకు ముందుగానే వివిధ శాఖలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిందిగా జలమండలిని కోరామన్నారు. మంచినీటి సరఫరా పైప్లైన్ల నిర్మాణం పూర్తయ్యాక, అన్ని విభాగాలకు సంబంధించిన వివిధ పనులను సమన్వయంతో చేపట్టడం ద్వారా ప్రజలకు ఇబ్బందులు కలగవని చెప్పారు. తద్వారా రోడ్డు వేయడం.. పైప్‌లైన్ కోసం తిరిగి తవ్వడం.. మళ్లీ రోడ్డు వేయడం వంటి సమస్యల్ని అధిగమించవచ్చునన్నారు. -
పసిడి ధరలపై ‘ఫెడ్’ ప్రభావం
దేశీయంగా వరుసగా మూడువారాలపాటు క్షీణించిన బంగారం ధర గతవారం స్వల్పంగా పెరిగింది. జువెల్లరీ స్టాకిస్టులు, రిటైలర్ల నుంచి డిమాండ్ మెరుగుపడటంతో ఈ స్వల్ప పెరుగుదల సంభవించింది. అయితే కీలకమైన రుతుపవనాల సీజన్ జాప్యంకావడం, ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందకొడిగా వుండటం వల్ల బంగారం ధర వారమంతా హెచ్చుతగ్గులకు లోనయ్యిందని బులియన్ వర్తకులు చెప్పారు. ఈ వారం జరిగే అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కమిటీ సమావేశంపై బులియన్ మార్కెట్ దృష్టి వుందని వారన్నారు. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపునకు సంబంధించిన సంకేతాల ఆధారంగా బంగారం బాగా పెరగడం లేదా తగ్గడం జరుగుతుందని వారు వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లో గతవారం పుత్తడి ధర ఔన్సుకు 11 డాలర్లు పెరిగి 1,179 డాలర్లకు చేరింది. దేశీయంగా ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం ధర అంతక్రితం వారంతో పోలిస్తే రూ. 110 పెరుగుదలతో 26,840 వద్దకు ఎగిసింది. 99.5 స్వచ్ఛతగల స్టాండర్డ్ బంగారం ధర అంతేమొత్తం పెరిగి రూ. 26,690 వద్దకు చేరింది.