న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు సాధారణం కంటే 6 శాతం అధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఆదివారం ప్రకటించింది. కానీ, ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే లోటు వర్షపాతమే కొనసాగుతోందని పేర్కొంది. దక్షిణ, మధ్య, ఈశాన్య, తూర్పు భారతదేశంలో సాధారణం కంటే అధిక వర్షం కురిసిందని తెలియజేసింది.
వాయవ్య భారతదేశంలో 19 శాతం లోటు వర్షపాతం నమోదైందని వెల్లడించింది. మరో రెండు నెలలపాటు వర్షాలు కురుస్తాయి కాబట్టి వాయవ్య భారతంలోనూ పరిస్థితి మెరుగు పడుతుందని ఆశిస్తున్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్రా చెప్పారు. దక్షిణాదిలో సాధారణం కంటే 17 శాతం అధిక వర్షపాతం రికార్డు అయ్యిందని ఐఎండీ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment