సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. రహదారులపై వాహనాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల ప్రయాణాలు నిలిచిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు హరియాణా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు పొగమంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
ఈ నాలుగు రాష్ట్రాలలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొగమంచు కారణంగా శుక్రవారం దేశవ్యాప్తంగా 274 విమానాలు ఆలస్యంగా నడిచాయి. 80కి పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment