వర్షాకాలం అనంగానే సీజనల్ వ్యాధులు పగబట్టినట్లుగా మనుషులపై దాడి చేస్తాయి. అందుకు ప్రధాన కారణం బ్యాక్టీరియా, వైరస్‌లే. వాతావరణంలోని తేమ కారణంగా సులభంగా బ్యాక్టీరియా, ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కిచెన్‌లోని వస్తువులు పాడవ్వడం లేదా బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో కిచెన్‌ని ఎంత పరిశుభ్రంగా ఉంచితే అంత ఆరోగ్యం ఉంటాం. నిత్యం మన ఉపయోగించే కిచెన్‌లోని వస్తువులు పాడవ్వకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సినవి సవివరంగా తెలుసుకుందామా..!
వర్షాకాలంలో కిచెన్‌ని సురక్షితంగా ఉంచేలా పాటించాల్సినవి ఇవే..
కిచెన్ చిమ్నీ, ఎగ్జాస్ట్ ఫ్యాన్: వంటగదిలో సూర్యరశ్మి వచ్చేలా, తేమ చేరకుండా ఉండేలా చూసుకోమని చెబుతుంటారు పెద్దలు. కానీ వర్షాకాలంలో అలా అస్సలు కుదరదు. ఎండ అనేది పెద్దగా ఉండదు, పైగా వాతావరణంలోని తేమ కారణంగా కిచెన్‌ను పొడిగా ఉంచడం కాస్త ఇబ్బందే. అలాంటప్పుడూ కిచెన్‌కి ఉండే ఎగ్జాస్ట్ ఫ్యాన్‌లను శుభ్రపరిచి ఆన్ చేసి ఉంచాలి. అలాగే వంటగది చిమ్నీ కూడా డెస్ట్ లేకుండా ఉంచుకుంటే తేమ చేరకుండా కాపాడుకోగలుగుతాం. కిచెన్ కూడా పొడిగా ఉంటుంది.
అలాగే వంటగదిలో సరుకులు పాడవ్వకూడదంటే గాలి చొరబడిన క్లోజ్‌డ్ కంటైనర్‌లలో భద్రపరుచుకోండి. సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులను తేమ, బ్యాక్టీరియా చేరకుండా ఉండేలా గాలి చొరబడిని గాజు పాత్రలో ఉంచాలి.
ఇక వంటగదిలో పంచదార, కొన్ని రకాలు పొడులు అవి పాడ్వకుండా ఉండేందుకు వంటల్లో ఉపయోగించే మసాలా దినుసులతో సమస్యను నివారించండి. దాల్చిన చెక్క, లవంగాలు వంటి వాటిని నిల్వ ఉంచే పొడులకు చేర్చితే పాడవ్వకుండా ఉంటాయి.
సింక్ పైపులను శుభ్రంగా ఉంచండి: వంటగదిలోని సింక్‌పైపులు చక్కగా ఉండేలా చూడండి. ఎలాంటి లీక్‌లు లేవనేది నిర్థారించుకోండి. దీనివల్ల దోమలు, ఈగలు రాకుండా కాపాడుకోగలుగతాం. ఈ సీజన్ ప్రారంభమయ్యే ముందే ఈ జాగ్రత్తలను తప్పనసరి తీసుకోవాలి.
అలాగే కాలానుగుణ పండ్లను, కూరగాయలను తీసుకోండి. వాటిని తాజాగా నిల్వ ఉంచుకునేలా తగు జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి సులభంగా బయటపడగలుగుతారు అని చెబుతున్నారు నిపుణులు.
(చదవండి: యూకేలో భారతీయ కిరాణ సరుకులు ధర తెలిస్తే నోరెళ్లబెడతారు..!)
Comments
Please login to add a commentAdd a comment