మన దేశంలో సమ్మర్ సీజన్‌లో జూన్ నుంచి జూలైలో కాస్త కూరగాయల ధరలు మండిపోతుంటాయి. సామాన్యుడికి కొనాలంటేనే భయంగా ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో అకాల వర్షాలు లేదా వర్షాలు పడక తగు మోతాదులు కూరగాయలు పండపోవడం తదితర కారణాల రీత్యా ధరలు ఆకాశన్నంటేలా పలుకుతాయి.
అయితే మరీ విదేశాల్లో ఉండే భారతీయ కిరాణ స్టోర్‌లో సరకులు ధరలు మాములుగానే ఓ రేంజ్‌లో ధర పలుకుతాయి. కానీ ఇప్పుడూ మాత్రం ఆ ధరలు అలా ఇలా లేవు. కనీసం ఆ స్టోర్ వైపు చూపు పోయే సాహసమే చేయలేనంతగా ఘోరంగా ధరలు పలుకుతున్నాయి. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఢిల్లీకి చెందిన చావీ అగర్వాల్ ప్రస్తుతం లండన్‌లో నివశిస్తున్నట్లు తెలిపారు. తాను లండన్‌లోని భారతీయ కిరణా స్టోర్ వద్దకు వచ్చానని ఇక్కడ ఒక్కో ఐటెం ధర వింటే విస్తుపోతారంటూ వాటి ధరలు వివరాలు చెబుతున్నారు. అక్కడ సరుకులు ధరలు వరుసగా.. రూ. 20లు ఖరీదు చేసే లేస్ మ్యాజిక్ మసాలా ప్యాకెట్‌ను లండన్‌లో ఏకంగా రూ.95కి విక్రయిస్తున్నారు. అలాగే మ్యాగీ ప్యాకెట్ రూ. 300లు, పనీర్ ధర రూ. 700, అల్ఫోన్సో మామిడి కాయలు ఆరు రూ. 2400, బెండకాయలు కేజీ రూ. 650, పొట్టకాయం రూ. 1000 అంటూ వరుసగా వాటి ధరలు వివరంగా చెప్పుకొచ్చారు.
అయితే ఈ వీడియోని చేసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. కొందరూ రెండు దేశాల మధ్య ఆదాయ అసమానతలు, కొనుగోలు శక్తి, సమానత్వం వంటి అంశాలను లేవనెత్తగా, ఇంకొందరూ అయితే ఇప్పుడే లండన్‌లో కిరాణ దుకాణం ప్రారంభిస్తే బెటర్ ఏమో అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: చల్లని వర్సెస్ వేడి నీళ్లు: బరువు తగ్గేందుకు ఏది బెటర్?)
Comments
Please login to add a commentAdd a comment