చల్లని వర్సెస్‌ వేడి నీళ్లు: బరువు తగ్గేందుకు ఏది బెటర్‌? | Hot Water Vs Cold Water: Which Is Good For Weight Loss? | Sakshi
Sakshi News home page

చల్లని వర్సెస్‌ వేడి నీళ్లు: బరువు తగ్గేందుకు ఏది బెటర్‌?

Published Mon, Jun 24 2024 10:52 AM | Last Updated on Mon, Jun 24 2024 11:21 AM

Hot Water Vs Cold Water: Which Is Good For Weight Loss?

మన ఆరోగ్యానికి నీరు చాలా అవసరం. నీరు బరువు తగ్గడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ఎంతో మందిలో ఉండే సందేహం... బరువు తగ్గాలనుకుంటే ఏ నీరు తాగితే మంచిది? అనే సందేహం వస్తుంటుంది. చాలామంది వేడి నీరు తాగితేనే బరువు తగ్గుతాం అనుకుంటారు. ఇంకొందరూ చల్లని నీరే అన్ని విధాల మంచిదని భావిస్తుంటారు. మరీ దీని గురించి పోషకాహార నిపుణుల ఏమంటున్నారంటే..

వేడి నీళ్లు తాగితే...
ప్రతిరోజూ వేడి నీళ్లు తాగడం వల్ల జీర్ణ క్రియ మెరుగ్గా ఉంటుంది. జీర్ణ ఎంజైమ్లు ఉత్పత్తి చక్కగా ఉంటుంది. ఇది ఆహారాన్ని మరింత సమర్థవంతంగా విచ్ఛిన్నం చేస్తుంది. ఫలితంగా శరీరానికి కావాల్సిన పోషకాల శోషణ ప్రభావంతంగా ఉంటుంది. ఇక్కడ బరువు తగ్గాలంటే జీర్ణ క్రియ సవ్యంగా జరగాలి. కాబట్టి వేడినీరు తాగడం వల్ల జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. అలాగే వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని విషాలను, వ్యర్ధాలను బయటికి పంపవచ్చు. శరీరాన్ని డిటాక్సిఫికేషన్ చేయడంలో గోరువెచ్చని నీళ్లు ముందుంటాయి. గోరువెచ్చని నీళ్లలో నిమ్మకాయ రసం కలిపి తాగితే ఇంకా మంచిది. గోరువెచ్చని నీళ్లు శరీర ఉష్ణోగ్రతను తాత్కాలికంగా కొంతవరకు పెంచుతుంది. దీనివల్లే జీవక్రియ కూడా వేగాన్ని పెంచి ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీరు భోజనానికి ముందు తాగడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల అధికంగా తినడం కూడా తగ్గుతుంది తద్వారా కూడా బరువు తగ్గొచ్చు.

చల్లని నీరు తాగితే...
చల్లటి నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత కాస్త తగ్గుతుంది. మళ్లీ తిరిగి ఉష్ణోగ్రత పెరగడానికి కాస్తా శక్తి ఖర్చు చేయాల్సి వస్తుంది. దీన్ని థర్మోజెనిసిస్ అంటారు. ఇది జరగడానికి ఎన్నో క్యాలరీలు బర్న్ అవుతాయి. ఇలా బర్న్ అయిన క్యాలరీల వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. వ్యాయామం చేసే సమయంలో శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. ఆ సమయంలో చల్లటి నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. అలాగే మరింత ఎక్కువ కాలం వ్యాయామం చేయడానికి ఇది సహాయపడుతుంది. గోరువెచ్చని నీళ్ళలాగే చల్లటి నీరు కూడా జీవక్రియను పెంచుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల ఆకలి కాస్త తగ్గుతుంది. భోజనానికి ముందు చల్లటి నీరు తాగడం వల్ల మంచే జరుగుతుంది.

రెండింటిలో ఏది మంచిదంటే..

గోరువెచ్చటి నీరైనా, చల్లని నీరైనా రెండూ బరువు తగ్గడానికి సహాయపడతాయి. కాబట్టి ఏది అనేది మన ఇష్టమే. ఏదేమైనా నీటిని ఆహారంలో భాగం చేసుకుంటే బరువు తగ్గడం సులభం అవుతుంది. ఈ రెండూ జీర్ణ క్రియను ప్రేరేపించడంలో ముందుంటాయి. అయితే ఉదయం పూట ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో రోజును ప్రారంభిస్తే మంచిది. దానిలో నిమ్మరసం జోడించుకుంటే ఇంకా మంచిది. ఇది ఆకలిని నియంత్రించడానికి, అతిగా తినడాన్ని నిరోధించడానికి కూడా ఉపయోగపడుతుంది. భోజనానికి ముందు గోరువెచ్చని నీరు తాగడం అలవాటు చేసుకోండి. ఇది ఆహారాన్ని ఎక్కువగా తినకుండా అడ్డుకుంటుంది. ఇక చల్లటి నీరు విషయానికొస్తే వ్యాయామం చేసేటప్పుడు చల్లటి నీరు తాగడమే మంచిది. ఇది మీ శరీర ఉష్ణోగ్రతను పెరగకుండా అడ్డుకొని శరీరానికి ఓదార్పుని ఇస్తుంది. కాబట్టి కొన్నిసార్లు గోరువెచ్చని నీరు, కొన్నిసార్లు చల్లటి నీరు తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. రెండింటిన సమాయాను సారంగా శారీరక పరిస్థితిని పరిగణలోనికి తీసుకుని తాగితే బరువు తగ్గడం సులభం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement