Cold water
-
చల్లని వర్సెస్ వేడి నీళ్లు: బరువు తగ్గేందుకు ఏది బెటర్?
మన ఆరోగ్యానికి నీరు చాలా అవసరం. నీరు బరువు తగ్గడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ఎంతో మందిలో ఉండే సందేహం... బరువు తగ్గాలనుకుంటే ఏ నీరు తాగితే మంచిది? అనే సందేహం వస్తుంటుంది. చాలామంది వేడి నీరు తాగితేనే బరువు తగ్గుతాం అనుకుంటారు. ఇంకొందరూ చల్లని నీరే అన్ని విధాల మంచిదని భావిస్తుంటారు. మరీ దీని గురించి పోషకాహార నిపుణుల ఏమంటున్నారంటే..వేడి నీళ్లు తాగితే...ప్రతిరోజూ వేడి నీళ్లు తాగడం వల్ల జీర్ణ క్రియ మెరుగ్గా ఉంటుంది. జీర్ణ ఎంజైమ్‌లు ఉత్పత్తి చక్కగా ఉంటుంది. ఇది ఆహారాన్ని మరింత సమర్థవంతంగా విచ్ఛిన్నం చేస్తుంది. ఫలితంగా శరీరానికి కావాల్సిన పోషకాల శోషణ ప్రభావంతంగా ఉంటుంది. ఇక్కడ బరువు తగ్గాలంటే జీర్ణ క్రియ సవ్యంగా జరగాలి. కాబట్టి వేడినీరు తాగడం వల్ల జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. అలాగే వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని విషాలను, వ్యర్ధాలను బయటికి పంపవచ్చు. శరీరాన్ని డిటాక్సిఫికేషన్ చేయడంలో గోరువెచ్చని నీళ్లు ముందుంటాయి. గోరువెచ్చని నీళ్లలో నిమ్మకాయ రసం కలిపి తాగితే ఇంకా మంచిది. గోరువెచ్చని నీళ్లు శరీర ఉష్ణోగ్రతను తాత్కాలికంగా కొంతవరకు పెంచుతుంది. దీనివల్లే జీవక్రియ కూడా వేగాన్ని పెంచి ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీరు భోజనానికి ముందు తాగడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల అధికంగా తినడం కూడా తగ్గుతుంది తద్వారా కూడా బరువు తగ్గొచ్చు.చల్లని నీరు తాగితే...చల్లటి నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత కాస్త తగ్గుతుంది. మళ్లీ తిరిగి ఉష్ణోగ్రత పెరగడానికి కాస్తా శక్తి ఖర్చు చేయాల్సి వస్తుంది. దీన్ని థర్మోజెనిసిస్ అంటారు. ఇది జరగడానికి ఎన్నో క్యాలరీలు బర్న్ అవుతాయి. ఇలా బర్న్ అయిన క్యాలరీల వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. వ్యాయామం చేసే సమయంలో శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. ఆ సమయంలో చల్లటి నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. అలాగే మరింత ఎక్కువ కాలం వ్యాయామం చేయడానికి ఇది సహాయపడుతుంది. గోరువెచ్చని నీళ్ళలాగే చల్లటి నీరు కూడా జీవక్రియను పెంచుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల ఆకలి కాస్త తగ్గుతుంది. భోజనానికి ముందు చల్లటి నీరు తాగడం వల్ల మంచే జరుగుతుంది.రెండింటిలో ఏది మంచిదంటే..గోరువెచ్చటి నీరైనా, చల్లని నీరైనా రెండూ బరువు తగ్గడానికి సహాయపడతాయి. కాబట్టి ఏది అనేది మన ఇష్టమే. ఏదేమైనా నీటిని ఆహారంలో భాగం చేసుకుంటే బరువు తగ్గడం సులభం అవుతుంది. ఈ రెండూ జీర్ణ క్రియను ప్రేరేపించడంలో ముందుంటాయి. అయితే ఉదయం పూట ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో రోజును ప్రారంభిస్తే మంచిది. దానిలో నిమ్మరసం జోడించుకుంటే ఇంకా మంచిది. ఇది ఆకలిని నియంత్రించడానికి, అతిగా తినడాన్ని నిరోధించడానికి కూడా ఉపయోగపడుతుంది. భోజనానికి ముందు గోరువెచ్చని నీరు తాగడం అలవాటు చేసుకోండి. ఇది ఆహారాన్ని ఎక్కువగా తినకుండా అడ్డుకుంటుంది. ఇక చల్లటి నీరు విషయానికొస్తే వ్యాయామం చేసేటప్పుడు చల్లటి నీరు తాగడమే మంచిది. ఇది మీ శరీర ఉష్ణోగ్రతను పెరగకుండా అడ్డుకొని శరీరానికి ఓదార్పుని ఇస్తుంది. కాబట్టి కొన్నిసార్లు గోరువెచ్చని నీరు, కొన్నిసార్లు చల్లటి నీరు తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. రెండింటిన సమాయాను సారంగా శారీరక పరిస్థితిని పరిగణలోనికి తీసుకుని తాగితే బరువు తగ్గడం సులభం. -
చల్లటి నీరు గుండె వ్యాధికి దారితీస్తుందా?
చలచల్లటి నీరు అంటే అబగా తాగేస్తాం. గోరు వెచ్చని నీళ్లు మంచిదన్న కూడా తాగడానికే బాధపడిపోతారు కొందరూ. అనారోగ్యంగా ఉంటే తప్ప వేడినీళ్ల జోలికే పోరు. కానీ ఇలా చల్లటి వాటర్ తాగి ఓ బాడీ బిల్డర్ ఆస్పత్రుపాలై అరుదైన గుండె వ్యాధిని ఎదుర్కొన్నాడు. చివరికి చావు అంచులు దాక వెళ్లోచ్చాడు. తనలా మరోకరూ ఇలాంటి భయానక అనుభవాన్ని ఎదుర్కొనకూడదన్న ఉద్దేశ్యంతో గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నాడు. ఇంతకీ అతడు ఎదుర్కొన్న భయానక చేదు అనుభవం ఏంటంటే.. అమెరికాలో టెక్సాస్‌కి చెందిన 35 ఏళ్ల ఫ్రాంక్లిన్ అరిబీనా ఇంటర్నేషనల్ ఫిట్నెస్ అండ్ బాడీబిల్డింగ్ ఫెడరేషన్ సభ్యుడు. పైగా బాడీ బిల్డర్ కూడా. అతను 18 ఏళ్ల వయసున్నప్పుడూ ఈ సమస్యను ఎదుర్కొన్నాడు. అతనికి చల్లటి ఐస్ నీరు తాగడమంటే ఇష్టం. ఇలా చల్లటి నీరు తాగడంతో బాడీ ఒక విధమైన పరిస్థితికి గురవ్వుతుండేది. అయితే అతను కోల్డ్ వాటర్ అలా లోపలికి వెళ్తే ఉండే ఫీల్ అనుకుని అంతగా సీరియస్‌గా తీసుకోలేదు. ఒకరోజు ఎప్పటిలానే జిమ్ వర్కౌట్లు చేసి ఐస్ వాటర్ తాగుతుండగా అదే పరిస్థితి ఎదుయ్యి ఒకలా అయిపోయింది అతడి పరిస్థితి. ఆ తర్వాత కాసేపటికి స్ప్రుహ తప్పి పడిపోయాడు. అక్కడ అతని గుండె అదుపులేకుండా వేగంగా కొట్టుకుంటోంది. వైద్య పరీక్షల్లో అతడు ఒక విధమైన జన్యు పరివర్తనతో బాధపడుతున్నట్లు వెల్లడయ్యింది. అంటే కర్ణిక దడతో బాధపడుతున్నాడని అర్థం. దీనిని అఫీబ్ అని పిలుస్తారు. దీని కారణంగా ఎలక్ట్రిక్ సిగ్నల్‌లో అంతరాయం ఏర్పడి గుండె కొట్టుకోవడం నియంత్రలో ఉండదు. ఇలా ఎందువల్ల వస్తుందంటే..? మెదడు నుంచి ఛాతీ వరకు విస్తరించి ఉన్న వాగస్నాడిని చల్లటి నీరు తాకడం వల్ల ఒక విధమైన దడలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత మనిషి స్ప్రుహ కోల్పోవడం గుండె లయలో మార్పులు వేగవంతంగా జరిగిపోతాయి. ఈ స్థితిలో గుండె కొట్టుకోవడం ఛాతీ నుంచి బయటకు కనిపించేంతగా వేగంగా కొట్టుకుంటుంది. ఈ పరిస్థితి కారణంగా రోగికి శ్వాస ఆడక ఛాతిలో ఒక విధమైన నొప్పితో అల్లాడిపోతుంటాడు. వైద్యులు బాడీ బిల్డర్ ఎదర్కొంటున్న సమస్యను సకాలంలో గుర్తించి గుండెకి శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం అతను పూర్తి స్థాయిలో కోలుకున్నాడు కానీ ఆఫీబ్ కోసం మందులు వాడుతున్నాడు. ఎందుకంటే ఈ చల్లటి నీరు గుండె, వాగస్ నాడుల మధ్య సంబంధాన్ని దెబ్బతీయడంతో జీవితాంతం ఆ మందులు వాడాల్సిందే. లేదంటే గుండె అదుపులేకుండా వేగంగా కొట్టుకుంటుంది.అంటే.. ఒక విధమైన గుండె దడలా వచ్చి..మనిషి స్ప్రుహ కోల్పోయేలా చేసి ప్రాణాంతకంగా మారుతుంది. తనలా ఎవ్వరూ ఇలా చల్లటి నీరు తాగి గుండె సమస్యలు తెచ్చుకోకూడదని తాను ఎదుర్కొన్న అనుభవాన్ని షేర్ చేస్తున్నాడు. పైగా చల్లటి నీరు తాగొద్దనే చెబుతున్నాడు. (చదవండి: క్రియెటివిటీతో లక్షల్లో సంపాదన: ఓ 'అమ్మ' సక్సెస్ స్టోరీ) -
భోజనం చేసిన వెంటనే పండ్లు తింటున్నారా?
చాలామంది ఆహారం తిన్న వెంటనే తేలిగ్గా తీసుకుని చేసే పనులే అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం. భోజనం తిన్న వెంటనే చల్లటి పదార్థాలు గానీ లేదా పండ్లు తీసుకుంటుంటాం. అలాగే బాగా స్పైసీ ఫుడ్ తినేసి హెర్బల్ టీలు వంటివి తాగేస్తుంటారు కొందరూ. నిజానికి ఇలాంటి అలవాట్లు చాలా ప్రమాదం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణలు. మన జీర్ణ వ్యవస్థ పాడవడ్డానికి ఆ అలవాట్లే ప్రధాన కారణమని హెచ్చరిస్తున్నారు. తిన్న వెంటనే పండ్లు తింటే.. పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ భోజనం చేసిన వెంటనే పండ్లు తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతారంటే భోజనం కాగానే పండ్లు తినడం వల్ల అందులోని ఎంజైమ్‌లు విచ్ఛిన్నమై ఆహారంతో కలిసిపోయి పొట్టలో సమస్యలను కలిగిస్తాయి. దీనివల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చల్లటి నీరు.. ప్రస్తుతం చాలా మంది ఆహారం తీసుకున్న వెంటనే రిఫ్రిజిరేటర్లో.. కొందరైతే మరీ డీప్ ఫ్రీజర్‌లో ఉంచిన చల్లని నీరు తాగుతున్నారు. ఇలా చల్లటి తాగడం వల్ల కడుపులో ఉత్పత్తి అయ్యే డైజెస్టివ్ ఎంజైమ్‌లు పొట్టను చల్లగా చేసి, జీర్ణక్రియ వ్యవస్థను స్తంభింపజేస్తాయి. అంతేకాదు, శరీరం ఆహారంలోని పోషకాలను గ్రహించడం మానుకుంటుంది. దీని కారణంగా పోషకలోపం వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి తిన్న వెంటనే చల్లటి నీటిని తాగడం మానుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. స్పైపీ ఫుడ్ తీసుకున్న తర్వాత టీ తీసుకుంటే.. వేడి ఆహారాలు తీసుకున్న తర్వాత హెర్బల్ టీలు తీసుకోవడం వల్ల తీవ్ర జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు పొట్టలో ఉష్ణోగ్రతలు కూడా ఒక్కసారిగా పెరిగిపోతాయి కాబట్టి ఆహారం తీసుకున్న వెంటనే బాగా వేడిగా ఉండే కాఫీ, టీ వంటి పానీయాలు తాగడం మానుకోవాలి. (చదవండి: స్పైసీ ఫుడ్స్‌తో నిమ్మరసాన్ని జత చేస్తున్నారా! ఐతే ఈ సమస్యలు తప్పవు!) -
వేడి నీళ్లు Vs చన్నీళ్లు.. ఏ నీళ్లతో స్నానం చేస్తే మంచిది?
స్నానం వేడినీళ్లతో చేస్తే మంచిదా? లేక చన్నీళ్లతోనా? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. కొందరు కాలంతో సంబంధం లేకుండా వేడినీళ్ల స్నానానికి అలవాటు పడితే, మరికొందరేమో చన్నీళ్లకు అలవాటు పడతారు. వేడి నీళ్లతో స్నానం చేస్తే ఒళ్లు నొప్పులు తగ్గడంతో పాటు కండరాలు ఉత్తేజంగా ఉంటాయని కొందరు అనుకుంటారు. చల్లటి నీళ్లలతో స్నానం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. ఇంతకీ ఏ నీళ్లతో స్నానం చేస్తే మంచిది? మనం ప్రతిరోజు స్నానం చేసే సమయంలో మనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటాం. దీని కారణంగా పలు సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కొందరు చన్నీళ్ల స్నానమే మంచిదంటారు. మరికొందరు వేడివేడి నీళ్ల వల్ల హానికారక క్రిములన్నీ తొలగిపోయి ఆరోగ్యం సమకూరుతుందనుకుంటారు. ఈ రెండూ అపోహలే. స్నానానికి నీళ్లు మరీ చల్లగా ఉండకూడదు. మరీ వెచ్చగా ఉండకూడదు. గోరువెచ్చని నీళ్లతో స్నానమే ఆరోగ్యం. ఇక బలహీనంగా ఉన్నవాళ్లు, వయసుపైబడిన వృద్ధులు మరీ ఎక్కువ చన్నీళ్ల స్నానం కాని, మరీ ఎక్కువ వేణ్ణీళ్లతో కానీ స్నానం చేయద్దు. ఒకవేళ మీరు మీ వృత్తిరీత్యా వేరే ఊళ్లలో ఉండటం వల్ల వేణ్ణీళ్లు పెట్టుకోవడం సాధ్యం కావడం లేదా? ఇలా మరీ చన్నీళ్ల స్నానమే చేయడం తప్పకపోతే... స్నానం చేసే వ్యవధిని వీలైనంత కుదించండి. అవి వేణ్ణీళ్లయినా, చన్నీళ్లయినా... వీలయినంత వరకు పొద్దున్నే ఏమీ తినకముందే స్నానం చేయడం మంచిది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల స్నానానికి ముందే తినాల్సివచ్చినా... కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయవద్దు.ఇలా చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి స్నానం చేసిన తర్వాత కనీసం అర్ధగంట అయినా వ్యవధి ఉండేలా చూసుకోవడం మంచిది. నీళ్లు ఎంత చల్లగా ఉంటే... స్నానం వ్యవధి అంతగా తగ్గాలి. చన్నీళ్లతో స్నానం చేసే అలవాటు ఉన్నవారు... స్నానానికి ముందర చల్లటి నీళ్లు తాగకండి. చన్నీళ్లు గానీ లేదా వేణ్ణీళ్లు గానీ... వాటితో స్నానం చేశాక ఒకవేళ తలనొప్పి లేదా జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తే... అవి (చన్నీళ్లు / వేణ్ణీళ్లు) మీకు అంతగా సరిపడవని గుర్తించి, ఆ మేరకు గోరువెచ్చని నీటికి షిఫ్ట్ అవడం మంచిది. -
చన్నీటి స్నానం.. చిన్నారుల దైన్యం
అసలే చలికాలం. వేకువజామున మంచు కురుస్తూ గజగజ వణికిస్తోంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రత రోజురోజుకూ పడిపోతోంది. ఇంతటి చలిలోనూ విద్యార్థులు చన్నీటి స్నానం చేస్తూ అవస్థలు పడుతున్నారు. జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గిరిజన సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో ఒకే నల్లా ఉంది. ఈ నల్లా వద్ద శుక్రవారం ఉదయం పదుల సంఖ్యలో విద్యార్థులు చలిలో స్నానాలు చేస్తూ కనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
వేసవి తాపానికి చల్లటి ఐడియా!
మండుతున్న ఎండల్లో తిరిగి ఇంటికొచ్చాక గుక్కెడు చల్లని నీరు తాగితే ఆ హాయే వేరు.. కూరలు, కూరగాయలు, వివిధ ఆహార పదార్థాలు ఎండాకాలంలో తొందరగా పాడవుతుంటాయి. మరి వీటిని తాజాగా ఉంచుకోవాలంటే.. చల్లని నీరు కావాలన్నా.. అందరికీ అందుబాటులో ఫ్రిజ్‌లు ఉండవు కదా.. ఒకవేళ ఉన్నా కరెంట్ లేకపోతే ఇబ్బంది పడాల్సిందే.. అయితే ఈ సమస్యలకు టెక్నాలజీలు చెక్ పెడుతున్నాయి. కరెంటు అవసరం లేకుండా పనిచేసే రకరకాల శీతలీకరణ వ్యవస్థలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చేశాయి. వాటిల్లో కొన్ని.. వాకాటి.. ప్లాస్టిక్ గుడారం.. చిన్న మోటర్... లీటర్ నీళ్లు.. సోలార్ ప్యానెల్.. ఇదీ వాకాటి గురించి. కరెంట్ లేకుండా కూరగాయలను తాజాగా ఉంచే అద్భుతమైన పరికరం ఇది. చిన్న సన్నకారు రైతులు తాము పండించిన కూరగాయలను నిల్వ ఉంచుకోలేక తక్కువ ధరకే అమ్మేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అలాంటి వారికి ఈ వాకాటి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో సౌర ఫలాకాల సాయంతో నీరు ఆవిరిగా మారి ప్లాస్టిక్ గుడారంలో ఉన్న కూరగాయలను తాజాగా ఉంచుతుంది. అదే సమయంలో లోపలి వేడి గాలిని ఓ చిన్న వెంటిలేటర్ తొలగిస్తుంది. దాదాపు 200 కిలోల వరకు కూరగాయలను కొద్ది రోజుల పాటు తాజాగా ఉంచవచ్చు. దీని వివరాలను http://www.wakati.org/ వెబ్సైట్లో చూడొచ్చు. మిట్టీ కూల్.. మన్సుఖ్భాయ్ రాఘవ్ భాయ్ అనే ఔత్సాహిక శాస్త్రవేత్త తయారు చేసిన ఈ మట్టి ఫ్రిజ్ ఇప్పటికే చాలా ఫేమస్. బంకమట్టితో తయారైన ఈ ఫ్రిజ్.. పాలను మూడు రోజుల పాటు చెడిపోకుండా ఉంచుతుంది. కూరగాయలను వారంరోజుల పాటు నిల్వ ఉంచవచ్చు. ఈ ఫ్రిజ్ పై భాగం నుంచి నీరు మట్టిలోకి వెళ్లి ఇంకిపోతూ లోపల చల్లగా ఉండేలా చేస్తుంది. మట్టి కుండపై నీరు పోస్తే చల్లగా అవుతుంది కదా.. అలాగే ఈ ఫ్రిజ్ పనిచేస్తుందన్న మాట. దీని వివరాలు www.mitticool.in వెబ్సైట్లో ఉన్నాయి. బయోఫిల్టర్.. ఈ శీతలీకరణ పరికరాన్ని కోకాకోలా కంపెనీ, కొలంబియాకు చెందిన ఇంటర్నేషనల్ ఫిజిక్స్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దీనిపై ఉన్న మొక్కలకు నీరు పోస్తుంటే అడుగున ఉన్న చిన్న గది చల్లగా మారుతుంది. దీంతో ఇందులో ఉంచిన పానీ యాలు, కూరగాయలు చల్లగా ఉంటాయి. ప్రస్తుతం ఈ యంత్రాన్ని తమ ఉత్పత్తుల కోసమే ఉపయోగించుకుంటున్నా.. భవిష్యత్‌లో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.