చల్లటి నీరు గుండె వ్యాధికి దారితీస్తుందా? | Sakshi
Sakshi News home page

చల్లటి నీరు గుండె వ్యాధికి దారితీస్తుందా?

Published Fri, Mar 1 2024 12:00 PM

Texas Bodybuild Suffers Heart Failure After Drinking Cold Water - Sakshi

చలచల్లటి నీరు అంటే అబగా తాగేస్తాం. గోరు వెచ్చని నీళ్లు మంచిదన్న కూడా తాగడానికే బాధపడిపోతారు కొందరూ. అనారోగ్యంగా ఉంటే తప్ప వేడినీళ్ల జోలికే పోరు. కానీ ఇలా చల్లటి వాటర్‌ తాగి ఓ బాడీ బిల్డర్‌ ఆస్పత్రుపాలై అరుదైన గుండె వ్యాధిని ఎదుర్కొన్నాడు. చివరికి చావు అంచులు దాక వెళ్లోచ్చాడు. తనలా మరోకరూ ఇలాంటి భయానక అనుభవాన్ని ఎదుర్కొనకూడదన్న ఉద్దేశ్యంతో గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నాడు. ఇంతకీ అతడు ఎదుర్కొన్న భయానక చేదు అనుభవం ఏంటంటే..

అమెరికాలో టెక్సాస్‌కి చెందిన 35 ఏళ్ల ఫ్రాంక్లిన్‌ అరిబీనా ఇంటర్నేషనల్‌ ఫిట్‌నెస్‌ అండ్‌ బాడీబిల్డింగ్‌ ఫెడరేషన్‌ సభ్యుడు. పైగా బాడీ బిల్డర్‌ కూడా. అతను 18 ఏళ్ల వయసున్నప్పుడూ ఈ సమస్యను ఎదుర్కొన్నాడు. అతనికి చల్లటి ఐస్‌ నీరు తాగడమంటే ఇష్టం. ఇలా చల్లటి నీరు తాగడంతో బాడీ ఒక విధమైన పరిస్థితికి గురవ్వుతుండేది. అయితే అతను కోల్డ్‌ వాటర్‌ అలా లోపలికి వెళ్తే ఉండే ఫీల్‌ అనుకుని అంతగా సీరియస్‌గా తీసుకోలేదు. ఒకరోజు ఎప్పటిలానే జిమ్‌ వర్కౌట్‌లు చేసి ఐస్‌ వాటర్‌  తాగుతుండగా అదే పరిస్థితి ఎదుయ్యి ఒకలా అయిపోయింది అతడి పరిస్థితి. ఆ తర్వాత కాసేపటికి స్ప్రుహ తప్పి పడిపోయాడు. అక్కడ అతని గుండె అదుపులేకుండా వేగంగా కొట్టుకుంటోంది.

వైద్య పరీక్షల్లో అతడు ఒక విధమైన జన్యు పరివర్తనతో బాధపడుతున్నట్లు వెల్లడయ్యింది. అంటే కర్ణిక దడతో బాధపడుతున్నాడని అర్థం. దీనిని అఫీబ్‌ అని పిలుస్తారు. దీని కారణంగా ఎలక్ట్రిక్‌ సిగ్నల్‌లో అంతరాయం ఏర్పడి గుండె కొట్టుకోవడం నియంత్రలో ఉండదు. ఇలా ఎందువల్ల వస్తుందంటే..? మెదడు నుంచి ఛాతీ వరకు విస్తరించి ఉన్న వాగస్‌నాడిని చల్లటి నీరు తాకడం వల్ల ఒక విధమైన దడలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత మనిషి స్ప్రుహ కోల్పోవడం గుండె లయలో మార్పులు వేగవంతంగా జరిగిపోతాయి. ఈ స్థితిలో గుండె కొట్టుకోవడం ఛాతీ నుంచి బయటకు కనిపించేంతగా వేగంగా కొట్టుకుంటుంది. ఈ పరిస్థితి కారణంగా రోగికి శ్వాస ఆడక ఛాతిలో ఒక విధమైన నొప్పితో అల్లాడిపోతుంటాడు.

వైద్యులు బాడీ బిల్డర్‌ ఎదర్కొంటున్న సమస్యను సకాలంలో గుర్తించి గుండెకి శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం అతను పూర్తి స్థాయిలో కోలుకున్నాడు కానీ ఆఫీబ్‌ కోసం మందులు వాడుతున్నాడు. ఎందుకంటే ఈ చల్లటి నీరు గుండె, వాగస్‌ నాడుల మధ్య సంబంధాన్ని దెబ్బతీయడంతో జీవితాంతం ఆ మందులు వాడాల్సిందే. లేదంటే గుండె అదుపులేకుండా వేగంగా కొట్టుకుంటుంది.అంటే.. ఒక విధమైన గుండె దడలా వచ్చి..మనిషి స్ప్రుహ కోల్పోయేలా చేసి ప్రాణాంతకంగా మారుతుంది. తనలా ఎవ్వరూ ఇలా చల్లటి నీరు తాగి గుండె సమస్యలు తెచ్చుకోకూడదని తాను ఎదుర్కొన్న అనుభవాన్ని షేర్‌ చేస్తున్నాడు. పైగా చల్లటి నీరు తాగొద్దనే చెబుతున్నాడు. 

(చదవండి: క్రియెటివిటీతో లక్షల్లో సంపాదన: ఓ 'అమ్మ' సక్సెస్‌ స్టోరీ)

Advertisement
 
Advertisement
 
Advertisement