Heart failure
-
పాదాల వాపుకి గుండె జబ్బులకు సంబంధం ఏమిటీ..?
పాదాల వాపు ఒక్కోసారి గుండెజబ్బును సూచించవచ్చు. అయితే పాదాలు వాచినప్పుడు రెండు పాదాలూ వాచాయా, కేవలం వాపేనా లేదా నొప్పి కూడా ఉందా అని పరిశీలించాలి. మొదట కాలి ముందు భాగం, మడమ దగ్గర వాపు ఉండి, తర్వాత పాదం పైకి పాకుతూ నొప్పి లేనిదైతే అది గుండెజబ్బును సూచించవచ్చు. మామూలుగా గుండెదడ, ఆయాసం వంటి లక్షణాలుంటే గుండెజబ్బుగా అనుమానిస్తారు. కానీ పైన పేర్కొన్న వాపు లక్షణాలు చూశాక వాటితో పాటు ఆయాసం, గుండెదడ, ఛాతీనొప్పి వంటి లక్షణాలు ఉన్నా లేకపోయినా ఒకసారి గుండెజబ్బుల నిపుణులను కలవడం మేలు. గుండెజబ్బులకూ, పాదాలవాపునకూ సంబంధమేమిటి? గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గినప్పుడూ, అలాగే గుండె సంకోచించే శక్తి లేదా వ్యాకోచించే సామర్థ్యం లోపించినప్పుడు కాళ్ల వాపు కనిపించవచ్చు. రక్తపోటు పెరిగినప్పుడూ పాదాల్లో వాపు రావచ్చు. గుండెజబ్బు కారణంగా ఇలా కాళ్ల వాపు వచ్చిందా అనే విషయం తెలుసుకోడానికి ప్రో బీ–టైప్ నేట్రీయూరేటిక్ పెప్టైడ్ (ప్రో – బీఎన్పీ) అనే రక్తపరీక్ష చేయించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ప్రో బీఎన్పీ విలువ 75 ఏళ్ల లోపు ఉన్న వారికి 125 కంటే తక్కువ లేదా 75 ఏళ్లకు పైబడినవారిలో 450 కంటే ఎక్కువ ఉంటే అది గుండె వైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్) కావచ్చేమోనని డాక్టర్లు అనుమానిస్తారు. అప్పుడు గుండెకు సంబంధించిన ఈసీజీ, ఎకోకార్డియోగ్రఫీ వంటి పరీక్షలు చేయించి గుండెజబ్బును నిర్ధారణ చేస్తారు. సిరల సామర్థ్యం తగ్గినా పాదాల వాపు... కొన్ని సందర్భాల్లో కాళ్లలోని సిరల సామర్థ్యం తగ్గడం వల్ల రక్తంలోని నీరు అక్కడే ఉండపోతుంది. అది పాదాలవాపులా కనిపిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎక్కువసేపు నిల్చుని పనిచేసేవారిలో లేదా ఊబకాయం ఉన్నప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువ. ఇలా కాలివాపు కనిపించినప్పుడు ఈ సమస్యనూ అనుమానించాల్సి ఉంటుంది. తొలి దశలో ఎక్కువసేపు ప్రయాణం చేసినప్పుడు సాయంత్రానికి కాళ్ల వాపు కనిపిస్తుంది. అయితే చాలామందిలో ఇది సాధారణంగా కనిపించేది కాబట్టి సహజంగా ఈసమస్యను పెద్దగా సీరియస్‌గా తీసుకోరు. ఈ సమస్య ఉన్నవారిలో పిక్కల్లో నొప్పి, కాళ్లు బరువుగా ఉన్నట్లు అనిపించడం కూడా ఉంటాయి. క్రమేణా కాళ్లపైనా, మడమ లోపలి వైపున నల్లటి మచ్చలు ఏర్పడతాయి. కాలి సిరలు ఉబ్బి మెలికలు తిరిగినట్లుగా పచ్చగా లేక నల్లగా చర్మంలోంచి ఉబ్బినట్లు బయటకు కనిపిస్తుంటాయి. తొలి దశలో సాయంత్రం మాత్రమే కనిపించే ఈ సమస్య తర్వాత్తర్వాత రోజంతా ఉంటుంది. సిరల సామర్థ్య లోపంవల్ల కాళ్లవాపు సమస్య వస్తే...ఎక్కువసేపు నిలబడకుండా చూసుకోవడం. ఎలాస్టిక్ స్టాకింగ్స్ వేసుకుని ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. స్టాకింగ్స్ వల్ల కాలిపై ఒత్తిడి పడి, అవి సిరలకు మంచి పటుత్వాన్ని ఇస్తాయి. ఈ దశలో నిర్లక్ష్యం చేయడం వల్ల అది ముదిరి వేరికోస్ వెయిన్స్ అనే వ్యాధిగా పరిణమించే అవకాశముంది. ఈ వ్యాధిని తొలిదశలోనే తెలుసుకోవడం కోసం కాలి సిరలకు వీనస్ డాప్లర్ టెస్ట్ అనే పరీక్ష చేయించాలి. వ్యాధి బాగా ముదిరితే కాళ్లకు పుండ్లు కూడా పడవచ్చు. అందుకే ముందే కనుగొని చికిత్స తీసుకోవడం మేలు. ఊపిరితిత్తుల్లో రక్తపోటు-పాదాల వాపుఊపిరితిత్తుల్లో రక్తపోటు పెరగడం వల్ల కూడా పాదాలకు నీరు పట్టి వాపు కనిపించవచ్చు. ఇటీవల ఊబకాయం వల్ల స్లీప్ ఆప్నియా అనే కండిషన్ చాలా మందిలో కనిపిస్తోంది. దీనితో ఊపిరితిత్తుల్లో రక్త΄ోటు కూడా పెరగవచ్చు. స్లీప్ ఆప్నియాలో లక్షణాలివి :గురకపెట్టడం నిద్రలోంచి అకస్మాత్తుగా మెలకువ రావడం దగ్గుతో పలమారి నిద్రనుంచి మేల్కొనడం నిద్రలో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడం రోజంతా అలసట. వైద్యపరీక్షలు : లంగ్స్‌లో రక్తపోటు పెరుగుదలను నిర్ధారణ చేయడానికి ఎకో పరీక్ష చేయించాలి. కాళ్ల వాపులు వచ్చేవారిలో 45 ఏళ్లు దాటితే... వారికి ఎకో పరీక్ష తప్పనిసరి. చికిత్స : లంగ్స్‌లో రక్తపోటు కారణంగా వచ్చే స్లీప్ ఆప్నియా (గురక) ఒక్కోసారి ప్రాణాంతకమూ కావచ్చు కాబట్టి వారు తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలి. చికిత్సతో కాళ్లు వాపులూ తగ్గుతాయి. కొన్ని మందుల వల్ల... కొన్ని మందులు వాడుతున్నప్పుడు కూడా కాళ్ల వాపు రావచ్చు. రక్తపోటు, నొప్పి నివారణ కోసం వాడే ఇబు్ప్రొఫెన్, డయాబెటిస్ అదుపు కోసం వాడే పయోగ్లిటజోన్, ఇతరత్రా సమస్యలకు వాడే కార్టికోస్టెరాయిడ్స్, మానసిక సమస్యలకు వాడే మందులతోనూ కాళ్లవాపులు వస్తాయి. అందుకే కాళ్లవాపుల బాధితులు మందులేమైనా వాడుతున్నారా అని డాక్టర్లు అడిగి తెలుసుకుని, మందుల వల్లనే అని తేలితే ఆపివేస్తారు లేదా మారుస్తారు. కారణాలు తెలియని కాళ్ల వాపులు...మహిళల్లో ముఖ్యంగా 30– 40 ఏళ్లు దాటిన వారిలో కాళ్ల వాపుతో పాటు కొందరిలో ముఖం, చేతుల్లోనూ ఉబ్బు కనిపించవచ్చు. వాళ్లకు అన్ని పరీక్షలూ చేసి ఎలాంటి కారణం లేదని నిర్ధారణ చేసుకుని, అప్పుడు వాపు తగ్గడానికి డైయూరెటిక్స్ వాడతారు. ఏ కారణంతో పాదాలవాపు కనిపిస్తున్నా వాళ్లు ఆహారంలో ఉప్పు తక్కువగా వాడటం మేలు. ఇతర వ్యాధులు... కాళ్ల వాపు.. కిడ్నీ జబ్బులు,కొన్ని క్రానిక్ లివర్ డీసీస్ లాంటి కాలేయవ్యాధులు, కటి సంబంధిత (పెల్విస్ రిలేటెడ్) క్యాన్సర్లలో కూడా కాళ్ల వాపులు కనిపిస్తాయి. కాలు బాగా నునుపుగా ఎర్రగా కనిపించే సెల్యులైటిస్, బోదకాలు (ఫైలేరియాసిస్) వంటి ఇన్ఫెక్షన్లలో, రియాక్టివ్ ఆర్థరైటిస్ వంటి ఇన్ఫ్లమేటరీ కండీషన్లలోనూ కాళ్లవాపులు రావచ్చు. ఇవి కనిపించినప్పుడు తొలుత అవి గుండె సంబంధిత కారణాలతోనా అని మొదట అనుమానించాలి. ఆ అంశాన్ని రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ఇతర కారణాలను అన్వేషించాలి. అవన్నీ కాకుండా అవి కేవలం నిరపాయకరమైన (బినైన్) వాపు మాత్రమే అని గుర్తిస్తే దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరముండదు. డా. టీ.ఎన్.జే. రాజేశ్, సీనియర్ ఫిజీషియన్ (చదవండి: శ్లోకా మెహతా స్టైలిష్ లెహంగాలు రూపొందించిందే ఆ మహిళే..!) -
చల్లటి నీరు గుండె వ్యాధికి దారితీస్తుందా?
చలచల్లటి నీరు అంటే అబగా తాగేస్తాం. గోరు వెచ్చని నీళ్లు మంచిదన్న కూడా తాగడానికే బాధపడిపోతారు కొందరూ. అనారోగ్యంగా ఉంటే తప్ప వేడినీళ్ల జోలికే పోరు. కానీ ఇలా చల్లటి వాటర్ తాగి ఓ బాడీ బిల్డర్ ఆస్పత్రుపాలై అరుదైన గుండె వ్యాధిని ఎదుర్కొన్నాడు. చివరికి చావు అంచులు దాక వెళ్లోచ్చాడు. తనలా మరోకరూ ఇలాంటి భయానక అనుభవాన్ని ఎదుర్కొనకూడదన్న ఉద్దేశ్యంతో గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నాడు. ఇంతకీ అతడు ఎదుర్కొన్న భయానక చేదు అనుభవం ఏంటంటే.. అమెరికాలో టెక్సాస్‌కి చెందిన 35 ఏళ్ల ఫ్రాంక్లిన్ అరిబీనా ఇంటర్నేషనల్ ఫిట్నెస్ అండ్ బాడీబిల్డింగ్ ఫెడరేషన్ సభ్యుడు. పైగా బాడీ బిల్డర్ కూడా. అతను 18 ఏళ్ల వయసున్నప్పుడూ ఈ సమస్యను ఎదుర్కొన్నాడు. అతనికి చల్లటి ఐస్ నీరు తాగడమంటే ఇష్టం. ఇలా చల్లటి నీరు తాగడంతో బాడీ ఒక విధమైన పరిస్థితికి గురవ్వుతుండేది. అయితే అతను కోల్డ్ వాటర్ అలా లోపలికి వెళ్తే ఉండే ఫీల్ అనుకుని అంతగా సీరియస్‌గా తీసుకోలేదు. ఒకరోజు ఎప్పటిలానే జిమ్ వర్కౌట్లు చేసి ఐస్ వాటర్ తాగుతుండగా అదే పరిస్థితి ఎదుయ్యి ఒకలా అయిపోయింది అతడి పరిస్థితి. ఆ తర్వాత కాసేపటికి స్ప్రుహ తప్పి పడిపోయాడు. అక్కడ అతని గుండె అదుపులేకుండా వేగంగా కొట్టుకుంటోంది. వైద్య పరీక్షల్లో అతడు ఒక విధమైన జన్యు పరివర్తనతో బాధపడుతున్నట్లు వెల్లడయ్యింది. అంటే కర్ణిక దడతో బాధపడుతున్నాడని అర్థం. దీనిని అఫీబ్ అని పిలుస్తారు. దీని కారణంగా ఎలక్ట్రిక్ సిగ్నల్‌లో అంతరాయం ఏర్పడి గుండె కొట్టుకోవడం నియంత్రలో ఉండదు. ఇలా ఎందువల్ల వస్తుందంటే..? మెదడు నుంచి ఛాతీ వరకు విస్తరించి ఉన్న వాగస్నాడిని చల్లటి నీరు తాకడం వల్ల ఒక విధమైన దడలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత మనిషి స్ప్రుహ కోల్పోవడం గుండె లయలో మార్పులు వేగవంతంగా జరిగిపోతాయి. ఈ స్థితిలో గుండె కొట్టుకోవడం ఛాతీ నుంచి బయటకు కనిపించేంతగా వేగంగా కొట్టుకుంటుంది. ఈ పరిస్థితి కారణంగా రోగికి శ్వాస ఆడక ఛాతిలో ఒక విధమైన నొప్పితో అల్లాడిపోతుంటాడు. వైద్యులు బాడీ బిల్డర్ ఎదర్కొంటున్న సమస్యను సకాలంలో గుర్తించి గుండెకి శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం అతను పూర్తి స్థాయిలో కోలుకున్నాడు కానీ ఆఫీబ్ కోసం మందులు వాడుతున్నాడు. ఎందుకంటే ఈ చల్లటి నీరు గుండె, వాగస్ నాడుల మధ్య సంబంధాన్ని దెబ్బతీయడంతో జీవితాంతం ఆ మందులు వాడాల్సిందే. లేదంటే గుండె అదుపులేకుండా వేగంగా కొట్టుకుంటుంది.అంటే.. ఒక విధమైన గుండె దడలా వచ్చి..మనిషి స్ప్రుహ కోల్పోయేలా చేసి ప్రాణాంతకంగా మారుతుంది. తనలా ఎవ్వరూ ఇలా చల్లటి నీరు తాగి గుండె సమస్యలు తెచ్చుకోకూడదని తాను ఎదుర్కొన్న అనుభవాన్ని షేర్ చేస్తున్నాడు. పైగా చల్లటి నీరు తాగొద్దనే చెబుతున్నాడు. (చదవండి: క్రియెటివిటీతో లక్షల్లో సంపాదన: ఓ 'అమ్మ' సక్సెస్ స్టోరీ) -
కోవిడ్ తర్వాత పెరిగిన హార్ట్ ఫెయిల్యూర్ రోగులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): గుండె వైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్) ఇటీవల ఎక్కువగా వింటున్న పదం. కోవిడ్ తర్వాత గుండె వైఫల్యం చెందిన వారిని ఎక్కువగా చూస్తున్నట్లు హృద్రోగ వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. శరీరంలో ఉన్న కణాలకు ఆక్సిజన్, పోషకాలు అందించే పక్రియ గుండె పంపింగ్ చర్యలపై ఆధారపడి ఉంటుంది. గుండె తన సామర్థ్యానికి తగిన విధంగా రక్తాన్ని పంపింగ్ చేయలేని స్థితిని హార్ట్ ఫెయి ల్యూర్ అంటారని వైద్యులు చెపుతున్నారు. కొందరిలో హార్ట్ పంపింగ్ సాధారణ స్థితిలో ఉన్నా ఫెయిల్యూర్‌కు దారితీయవచ్చని పేర్కొంటున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయని సూచిస్తున్నారు. గుండె పంపింగ్ తగ్గి హార్ట్ ఫెయి ల్యూర్ అయిన వారితో పాటు, గుండె పంపింగ్‌లో తరచూ వ్యత్యాసాలు ఉండి హార్ట్ ఫెయిల్యూర్‌కు దారి తీసి సడన్ డెత్ అయిన వారిని కూడా చూస్తున్నామని వివరిస్తున్నారు. గుండె వైఫల్యాన్ని ముందుగా గుర్తించి, మెరుగైన చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని సూచిస్తున్నారు. హార్ట్ ఫెయిల్యూర్ రోగులకు అధునాతన చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. హార్ట్ ఫెయిల్యూర్‌కు కారణాలు మధుమేహం, రక్తపోటు, గుండె రక్తనాళాల్లో పూడికలు, సైలెంట్ హార్ట్ ఎటాక్‌కు ప్రధాన కారణాలుగా వైద్యులు పేర్కొంటున్నారు. వైరల్ జ్వరం వచ్చిన వారిలో కూడా ఒక్కోసారి హార్ట్ ఫెయిల్యూర్‌కు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. గర్భిణులు, బాలింతల్లోనూ హార్మోన్ల అసమతుల్యత వల్ల, కిడ్నీ రోగుల్లో హార్ట్ ఫెయిల్యూర్ ఎదురవ్వొచ్చని పేర్కొన్నారు. జెనటిక్‌గా కూడా హార్ట్ ఫెయిల్యూర్ సంభవించొచ్చని వివరిస్తున్నారు. గుండె వైఫల్యంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వారానికి పది మంది వరకు, ప్రయివేటు ఆస్పత్రులకు 100 మంది వరకూ కొత్త రోగులు వస్తున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. లక్షణాలు ఇవీ.. హార్ట్ ఫెయిల్యూర్ అయిన వారు ఆయాసం, నీరసం, నిస్సత్తువ, అలసట, కనీస వ్యాయామం చేయలేక పోవడం, కాళ్లలో, పొట్టలో వాపు, నీరు చేరడం వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు. తొలిదశలో గుర్తించడం ముఖ్యం గుండె వైఫల్యం చెందిన వారిని తొలిదశలో గుర్తించడం చాలా ముఖ్యం. హార్ట్ ఫెయిల్యూర్‌కు గురైన వారికి సత్వర వైద్యం ద్వారా ప్రాణాపాయం నుంచి కాపాడొచ్చని కార్డియాలజిస్టులు సూచిస్తున్నారు. క్వాడ్రాఫుల్ థెరపీ, ఎమర్జెన్సీ బైపాస్ శస్త్ర చికిత్సలతో హార్ట్ ఫెయిల్యూర్ రోగుల జీవన ప్రమాణాలను పదేళ్ల పాటు పొడిగించొచ్చని పేర్కొంటున్నారు. కొన్ని ప్రత్యేకమైన అత్యాధునిక డివైజ్‌లు, క్లిష్టతరమైన కరోనరీ ఇటర్వెన్షనల్ పక్రియల ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ రోగులకు ఉపశమనం కలిగించొచ్చని సూచిస్తున్నారు. తొలి దశలో గుర్తించాలి ఇటీవల కాలంలో హార్ట్ ఫెయిల్యూర్ రోగులను ఎక్కువగా చూస్తున్నాం. కోవిడ్ తర్వాత రోగులు పెరిగారు. హార్ట్ ఫెయిల్యూర్ గుండె పంపింగ్ తగ్గడంతో పాటు, పంపింగ్ నార్మల్‌గా ఉన్న వారిలో కూడా జరుగుతుంది. తొలిదశలో గుర్తించడం ద్వారా ఫెయిల్యూర్‌ను నివారించేందుకు ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ, అత్యవసర బైపాస్ సర్జరీతో పాటు, పలు డివైజ్‌లు ఉన్నాయి. – డాక్టర్ బి.విజయ్‌చైతన్య, కార్డియాలజిస్టు, విజయవాడ ప్రభుత్వాస్పత్రి -
Heart Attack: ఫోన్ మాట్లాడుతూ కుప్పకూలిన యువకుడు..
సాక్షి, కామారెడ్డి: యువతపై మాయదారి గుండెపోట్లు పగబట్టినట్లున్నాయి. గతంలో ఎటువంటి అనారోగ్యం ఆనవాలు లేని వ్యక్తులు కూడా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. చూస్తుండగానే హార్ట్ స్ట్రోక్‌తో మరణిస్తున్నారు. తాజాగా కామారెడ్డిలో అలాంటి ఘటనే బుధవారం వెలుగుచూసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన గోనె సంతోష్ (33) అనే యువకుడు ఇంట్లో ఫోన్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలాడు. (చదవండి: చిన్నవయసులోనే గుండెపోటు సంఘటనలు ఎందుకు?) వెంటనే అతడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. సంతోష్ మృతితో కుంటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గత ఐదు రోజుల్లో జిల్లాలో గుండెపోటుకు గురై నలుగురు ప్రాణాలు విడిచారు. (చదవండి: కబడ్డీ ఆడుతూ కుప్పకూలిన బీ ఫార్మసీ విద్యార్థి.. చూస్తుండగానే...) -
పల్నాడు జిల్లా పసుమర్రులో 17 ఏళ్ల ఫిరోజ్ గుండెపోటుతో మృతి
-
విషాదం: కబడ్డీ ఆడుతూ కుప్పకూలిన 19 ఏళ్ల యువకుడు, చూస్తుండగానే...
సాక్షి, అనంతపురం: నిర్దిష్ట కారణాలేంటో తెలియదుగానీ ఈమధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోట్లు కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా నిండా పాతికేళ్లు కూడా లేని యువత హార్ట్ అటాక్‌తో చూస్తుండగానే ప్రాణాలు విడుస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ నెల 1న అనంతపురం జిల్లాలో 19 ఏళ్ల తనూజ నాయక్ అనే యువకుడు కబడ్డీ ఆడుతూ కుప్పకూలిపోయాడు. అతన్ని బెంగళూరులోని ఎమ్మెస్ రామయ్య ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచాడని వైద్యులు తెలిపారు. ఆరోగ్యంగా ఉండే తమ బిడ్డకు గుండెపోటు ఏంటని ఆ తల్లిదండ్రులు స్థాణువయ్యారు. దేవుడు తమకు అన్యాయం చేశాడని, ఆడుతూ పాడుతూ తిరిగే తమ కుమారుడికి ఇంత చిన్న వయసులో ఈ ప్రాణాలు తీసే రోగమేంటని కన్నీరుమున్నీరయ్యారు. మృతుడు తనూజ నాయక్ది మడకశిర మండలం అచ్చంపల్లి తండా. అనంతపురం పట్టణంలోని పీవీకేకే కాలేజీలో బీఫార్మసీ ఫస్టియర్ చదువుతున్నాడు. కాగా, కబడ్డీ ఆడుతూ తనూజ నాయక్ కుప్పకూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి: జనం మధ్యకు పులి కూనలు..24 గంటలు గడిచిన తల్లి జాడ లేదు!) 17 ఏళ్లకే ప్రాణాంతక ‘పోటు’ పల్నాడు జిల్లా పసుమర్రులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 17 ఏళ్ల ఫిరోజ్‌కు సోమవారం అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. -
విషాదం.. లైవ్ మ్యాచ్‌లో ప్రాణాలొదిలిన గోల్ కీపర్
ఫుట్‌బాల్‌లో విషాదం నెలకొంది. లైవ్ మ్యాచ్‌లోనే గోల్ కీపర్ ప్రాణాలొదిలాడు. పెనాల్టీ కిక్‌ను సేవ్ చేసిన గోల్‌కీపర్ ఆ మరుక్షణమే ప్రాణం వదలడం అభిమానులను కలచివేసింది. ఈ ఘటన బెల్జియంలో చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే..బ్రెజిల్‌కు చెందిన సెకండ్ ప్రొవిజనల్ డివిజన్ వెస్ట్ బ్రాబంట్లో వింకిల్ స్పోర్ట్ బి జట్టుకు ఆర్నే ఎస్పీల్ గోల్ కీపర్‌గా సేవలందిస్తున్నాడు. వెస్ట్రోజెబ్కేతో మ్యాచ్‌లో వింకిల్ స్పోర్ట్ జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. రెండో సగం మరికాసేపట్లో ముగుస్తుందనగా వెస్ట్రోజెబ్కేకు పెనాల్టీ కిక్ లభించింది. అయితే గోల్‌కీపర్‌గా తన బాధ్యతను సమర్థంగా నిర్వహించిన ఆర్నే స్పిల్ పెనాల్టీ కిక్‌ను అడ్డుకున్నాడు. అయితే పెనాల్టీ కిక్‌ను అడ్డుకున్న మరుక్షణమే గ్రౌండ్‌పై కుప్పకూలాడు. ఎమర్జెన్సీ సర్వీస్ సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికి హార్ట్ ఫెయిల్యూర్‌తో అప్పటికే మరణించినట్లు వైద్యులు పేర్నొన్నారు. ఈ వార్త వింకిల్ స్పోర్ట్స్ క్లబ్లో విషాదం నింపింది. చదవండి: మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కోచ్ కన్నుమూత -
ఆ ఒక్క కామెంట్ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది..!
21 ఏళ్ల ధన్య సోజన్ వధువుగా నటించిన యాడ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. బాలీవుడ్ పర్సనాలిటీలతో మొదలు అందరూ ఆమెను మెచ్చుకుంటున్నారు. ఎందుకు? ధన్య చావుతో పోరాడుతోంది. చావును గెలవాలనుకుంటోంది. కేవలం 20 శాతం గుండె పని తీరు కలిగి, వెంట్రుకలు పూర్తిగా కోల్పోయిన స్థితి నుంచి అందమైన పెళ్లికూతురిగా మారడం ఇటీవలి గొప్ప కుతూహలపు కథ. 28 ఆగస్టు 2019లో ధన్య సోజన్ టొరెంటో (కెనడా)లో దిగింది. అక్కడ రెండేళ్లు పోస్ట్ డిప్లమో కోర్సు ఆమె చదవాలి. కేరళ ఇడుక్కి జిల్లాలోని తోడపుజ అనే చిన్న టౌన్ ఆమెది. తండ్రి జోసఫ్ మిల్క్‌బూత్ నడుపుతాడు. తల్లి శాంతి గృహిణి. హైస్కూల్లో చదివే ఒక తమ్ముడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి చదువు మీద ఆసక్తి ఉన్న ధన్య బాగా చదువుకుని కెనడాలో సీటు సంపాదించుకుంది. కొన్ని నెలలు బాగా జరిగాయి. సెమిస్టర్లు రాసింది. కాని 2020 ఆగస్టు నాటికి ఆమె వూరికూరికే స్పృహ తప్పి పడిపోవడం మొదలెట్టింది. అక్కడి డాక్టర్లు చూసి మొదట నిమోనియా అనుకున్నారు. కాని రిపోర్టులు చూసి ఆమెకు ‘కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్’ ఉందని తేల్చారు. ప్రమాదకరమైన గుండెజబ్బు. ఏ క్షణం ఏమైనా కావచ్చు. గుండె మార్పిడి తప్ప వేరే మార్గం లేదు. భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ధన్య. ఊరుగాని ఊరు. దేశం కాని దేశం. ఇప్పుడు ఏం చేయాలి? హాస్పిటల్ రోజులు 20 ఏళ్ల హుషారైన అమ్మాయి ధన్య. ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఎన్ని రోజులు ఉండాలో తెలియదు. ఆమెకు ఆక్సిజన్ సరిగా అందడం లేదు. జుట్టు కొన్నాళ్లు నిలవదని చెప్పారు. ఉన్న జుట్టును పూర్తిగా తొలగించారు. ఆమె స్టూడెంట్ వీసా మీద రావడం వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ ఉపయోగించుకునే వీలు లేదు. అలాగని ఇంటినుంచి డబ్బు తెప్పించుకోలేదు. దారుణమైన పరిస్థితిలో పడింది ధన్య. అదృష్టం... ఆమె చేరిన హాస్పిటల్లో కేరళ నుంచి వచ్చిన నర్స్‌లు పని చేస్తున్నారు. వారు ధన్యను ఆదుకున్నారు. ధైర్యం చెప్పారు. ధన్య పరిస్థితిని టొరెంటోలో ఉన్న మలయాళీ సంఘం ‘హృదయపూర్వం’కు తెలియచేశారు. హృదయపూర్వం వెంటనే ధన్య కోసం ఫండ్ రైజింగ్ మొదలెట్టింది. దాదాపు లక్షన్నర డాలర్లు (కోటి రూపాయలు) కలెక్ట్ అయ్యాయి. హాస్పిటల్ బిల్ అందులో నుంచే కట్టారు. అయితే సమస్య అదుపులో ఉంది కాని ట్రీట్మెంట్ కొనసాగాల్సి ఉంది. ఇండియాలో ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్పారు. ఈలోపు హాస్పిటల్, యూనివర్సిటీ వాళ్ల సహకారం వల్ల హాస్పిటల్ నుంచి ఎగ్జామ్స్ రాసి పాసయ్యింది ధన్య. మార్చి వరకూ ఉంటే వర్క్ వీసాకు అర్హత వస్తుందని అప్పటి వరకూ అక్కడే ఉండి కొచ్చి చేరుకుంది. కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు వెళ్లి అడ్మిట్ అయ్యింది ధన్య. మెరుపు కలలు ధన్య ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నా మెరుపు కలలు కనడం మానలేదు. ఆమెకు మోడలింగ్ చేయాలని కోరిక. అలాగే పాటలకు డాన్స్ చేయడం కూడా సరదా. హాస్పిటల్ బెడ్ మీద ఉంటూ బోర్ పోయేందుకు కొన్ని సినిమా పాటలకు చేతులు కదిలించి డాన్స్ చేసి ఆ వీడియోలు రిలీజ్ చేసింది. అవి ఇన్స్టాంట్ హిట్ అయ్యాయి. మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి నటులు ఆమె స్థితిని తెలుసుకుని ఆ స్థితిలో కూడా అంత హుషారుగా ఉన్నందుకు మెచ్చుకున్నారు. తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మలుపుతిప్పిన ఘడియ కొచ్చి చేరుకుని వైద్యం తీసుకుంటున్న ధన్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మలబార్ గోల్డ్’ వారి ‘బ్రైడ్స్ ఆఫ్ ఇండియా’ యాడ్ కాంపెయిన్ ప్రకటన కనిపించింది. ‘మీకు పెళ్లికూతురిలా కనిపించాలని ఉందా’ అనే ప్రశ్నకు 7000 మంది యువతులు ‘అవును’ అని ఉత్సాహపడి సమాధానం ఇచ్చారు. ధన్య కూడా ఇచ్చింది. ఆ సంగతి మర్చిపోయింది. కాని కొన్నాళ్లకు మలబార్ గోల్డ్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. తమ ప్రకటనల్లో కేరళ వధువుగా కనిపించమని వారు కోరారు. ధన్య సంతోషానికి అవధులు లేవు. కేరళ క్రిస్టియన్ వధువుగా తెల్లగౌన్లో కనిపించడానికి అందుకు తగ్గ షూట్ చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. మలబార్‌గోల్డ్ ఈ షూట్ కోసం అసలు సిసలు వజ్రాల నెక్లెస్‌ను వాడటానికి పంపింది. దానిని ధరించిన ధన్య ఎంతో ముచ్చటపడింది. ‘ఈరోజు నాకెంతో బాగుంది’ అని అద్దంలో చూసుకుని మురిసిపోయింది. ఆమె స్వచ్ఛమైన నవ్వు వధువు పాత్రకు అందం తెచ్చింది. ఇదంతా చూస్తున్న ఆమె తల్లిదండ్రులు ‘ఈరోజు మా అమ్మాయి పేషెంట్ అన్న సంగతే మర్చిపోయింది’ అని ఎంతో సంబరంగా ఆమెను చూశారు. నిరాశలో కూడా ఒక ఆశ చేతికి దొరుకుతుంది. అంతవరకూ ఓపిక పట్టమని ధన్య నవ్వు అందరికీ చెబుతోంది. విశేష స్పందన ‘స్పెషల్ బ్రైడ్ ఆఫ్ ఇండియా’గా మలబార్ గోల్డ్ వారు విడుదల చేసిన ధన్య యాడ్ విశేష స్పందన పొందింది. ఆ యాడ్‌లో ధన్య ఎంతో అందంగా ఉందని అందరూ మెచ్చుకున్నారు. ఆమె నవ్వుకు ఎందరో ఫాన్స్ అయ్యారు. ఇవాళ ధన్య సెలబ్రిటీ అయ్యింది. తన అనారోగ్యాన్ని గెలిచి తీరగలననే ఆత్మవిశ్వాసం పొందింది. -
గుండెపోటుతో రాయల్ బెంగాల్ టైగర్ మృతి
-
హైదరాబాద్ జూ పార్క్‌లో మరో పులి మృతి
-
గుండె కవాటాల సమస్య అంటే ఏమిటి? వివరంగా చెప్పండి
నా వయసు 58 ఏళ్లు. గత కొద్దికాలంగా నేను ఆయాసంతో బాధపడుతున్నాను. పొడిదగ్గు, గుండెలో దడగా ఉండటంతో పాటు ఛాతీలో నొప్పి కూడా వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని పరీక్షలు జరిపి, నేను గుండె కవాటాల్లో సమస్యతో బాధపడుతున్నట్లుగా చెప్పారు. గుండె కవాటాల సమస్యలు, వాటి చికిత్స విధానాల గురించి దయచేసి వివరంగా చెప్పండి. మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీలో హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. గుండెలో నాలుగు కవాటాలు (వాల్వ్స్) ఉంటాయి. అవి ట్రైకస్పిడ్ వాల్వ్, పల్మనరీ వాల్వ్, మైట్రల్‌వాల్వ్, అయోర్టిక్ వాల్వ్. ఈ నాలుగు కవాటాల్లో ప్రధానంగా రెండు రకాల సమస్యలు రావచ్చు. అవి... 1) కవాటం సన్నబడటం (స్టెనోసిస్), 2) కవాటం లీక్ కావడం (రిగర్జటేషన్). దీనికి కారణం... కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు. అయితే మరికొందరిలో రుమాటిక్ హార్ట్ డిసీజ్తోనూ, ఇంకొందరిలో పుట్టుకతోనే ఇలాంటి సమస్యలు రావచ్చు. సాధారణంగా మీరు పేర్కొన్న లక్షణాలతో ఈ సమస్య కొందరిలో వ్యక్తమయితే... ఇంకొందరిలో మాత్రం సమస్య వచ్చిన వాల్వ్‌ను బట్టి నిర్దిష్టంగా కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు ట్రైకస్పిడ్ వాల్వ్ లీక్ సమస్య ఉన్నవారిలో కాళ్ల వాపు కనిపిస్తుంది. మైట్రల్ వాల్వ్ సన్నబడితే స్పృహతప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో సమస్య ఉన్న వాల్వ్‌ను స్పష్టంగా చూసేందుకు ట్రాన్స్ఈసోఫేసియల్ ఎకో కార్డియోగ్రామ్ అనే పరీక్ష అవసరం కావచ్చు. ఇక చికిత్స విషయానికి వస్తే కవాటాల (వాల్వ్స్) సమస్యకు చాలావరకు మందులతోనే చికిత్స చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మందులతో చికిత్స సాధ్యం కాకపోతే... రోగిపరిస్థితిని బట్టి శస్త్రచికిత్స అవసరమవుతుంది. అంటే మైట్రల్వాల్స్ సన్నగా మారితే అలాంటి రోగుల్లో బెలూన్ వాల్వులోప్లాస్టీ అనే శస్త్రచికిత్స చేసి, సన్నబడ్డ వాల్వ్‌ను తిరిగి తెరవవచ్చు. అయితే మిగతా కవాటాలు సన్నగా మారి లీక్ అవుతుంటే ఈ వాల్వులోప్లాస్టీ ప్రక్రియ సాధ్యం కాదు. అలాంటప్పుడు వాల్వ్ రీప్లేస్మెంట్ అన్నదే పరిష్కారం.గుండె కవాటాలను మార్చి కృత్రిమ కవాటాలను అమర్చే క్రమంలో రెండు రకాల కవాటాలను ఉపయోగించవచ్చు. మెకానికల్ వాల్వ్ అనేది ఉపయోగించినప్పుడు ఒక ప్రతికూలత ఉంటుంది. అలాంటి రోగులకు జీవితాంతం రక్తాన్ని పలచబార్చే ‘ఎసిట్రోమ్’ మందులు వాడాల్సి ఉంటుంది. ఇక టిష్యూ కవాటాల విషయానికి వస్తే, ఇవి ఇతర జంతువుల కండరాలతో రూపొందించినవి. ఇవి వాడిన వారిలో రక్తాన్ని పలుచబార్చే ‘ఎసిట్రోమ్’ వంటి మందులు వాడాల్సిన అవసరం ఉండదు. ఈ టిష్యూ వాల్వ్‌లు 15 ఏళ్ల వరకు పనిచేస్తాయి. ప్రస్తుతం కవాటాలకు వచ్చే సమస్యలను పరిష్కరించడానికి శస్త్రచికిత్స కన్నా వాల్వ్ రిపేర్ చేయడానికి అత్యంత ప్రాధాన్యం వస్తున్నారు. ఎందుకంటే వాల్వ్‌ను రీప్లేస్ చేయడం కంటే ప్రకృతి ఇచ్చిన స్వాభావికమైన మన కవాటమే మెరుగైనది. అందుకే ఇప్పుడు వైద్యనిపుణులు కవాటం మరమ్మతుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పైగా ఇలా ఉన్న వాల్వ్నే రిపేర్ చేసినట్లయితే, జీవితాంతం ‘ఎసిట్రోమ్‘ వాడాల్సిన పనిలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్న వాల్వ్‌ను ప్రత్యేకంగా మైగ్రల్, ట్రైకస్పిడ్ వాల్వ్‌ల విషయంలో రిపేర్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. మాంసాహారం మానేయాల్సిందేనా? నా వయసు 50 ఏళ్లు. నేను మాంసాహారం ఇష్టంగా తింటూ ఉంటాను. కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం ఇంతగా తీసుకోకూడదనీ, దీనివల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ పేరుకుంటుందనీ, అది ఈ వయసులో గుండె జబ్బులకు దారితీస్తుందని ఫ్రెండ్స్ అంటున్నారు. నాకు తగిన సలహా ఇవ్వగలరు. కొలెస్ట్రాల్ అనే కొవ్వులలో రెండు రకాలు ఉంటాయి. మొదటిది ఒంటికి మేలుచేసే కొవ్వులు. వీటిని హైడెన్సిటీ లైపో ప్రొటీన్ (హెచ్‌డీఎల్) అంటారు. ఇవి గుడ్డు తెల్లసొనలో ఉంటాయి. శరీరానికి హానికారకమైన కొవ్వులను ఎల్డీఎల్ (లోడెన్సిటీ లైపో ప్రొటీన్స్) అంటారు. చెడు కొలెస్ట్రాల్ వంటి కొవ్వులు గుండెజబ్బులకు ఒక రిస్క్ ఫాక్టర్. చెడు కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారం తినేవారిలో, ఫాస్ట్‌ఫుడ్ తీసుకునే వారిలో గుండెజబ్బుల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అయితే రక్తంలో ఈ రెండు రకాల కొవ్వులు కలుపుకొని 200 లోపు ఉండాలి. ఎల్డీఎల్ 100 లోపు, హెచ్‌డీఎల్ 40 పైన ఉండాలి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ అనే మరో రకం కొవ్వులు కూడా గుండెకు హాని చేస్తాయి. ఇవి 150 లోపు ఉండాలి. కొలెస్ట్రాల్ మన శరీరంలోకి రెండు రకాలుగా చేరుతుంది. ఒకటి ఆహారం ద్వారా, మరొకటి లివర్ పనితీరు వల్ల. శిశువు పుట్టినప్పుడు 70 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటుంది. మెదడు నరాల వ్యవస్థ కోసం, శిశువు రెండేళ్లపాటు ఎదగడానికి ఈ కొవ్వులు ఉపయోగపడతాయి. ఆ తర్వాత దీని అవసరం అంతగా ఉండదు. అయితే జన్యుతత్వాన్ని బట్టి ఈ కొవ్వులు (మంచి, చెడు రెండు రకాల కొలెస్ట్రాల్స్) ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. వేపుళ్లు, బేకరీ పదార్థాలు, కృత్రిమ నెయ్యి వంటి పదార్థాలను ఎక్కువగా తినేవాళ్లలో కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. ఇక రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉన్నవారికి... డాక్టర్లు వాటిని అదుపు చేసే మందులు ఇస్తుంటారు. ఈ తరహా మందులు వాడుతున్న వారు వాటిని మధ్యలోనే ఆపకూడదు. మీరు మాంసాహారం మానేయలేకపోతే... కొవ్వు తక్కువగా ఉండే చేపలు, చికెన్ వంటి వైట్‌మీట్ తీసుకోండి. వీటిలోనూ చికెన్ కంటే చేపలు మంచిది. అది కూడా ఉడికించినవే. వేపుడు వద్దు. డాక్టర్ పి. ప్రణీత్, సీనియర్ ఇంటర్వెన్షల్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఒక్క లబ్డబ్తోనే గుట్టు పట్టేస్తుంది..
హార్ట్ ఫెయిల్యూర్‌ను ముందుగానే కచ్చితంగా గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పరికరాన్ని అభివృద్ధి చేశారు. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే ఈ యంత్రం ఒకే ఒక్క లబ్డబ్తోనే సమస్యను గుర్తించగలగడం విశేషం. అరవై ఐదేళ్ల పైబడ్డ వారిలో కనీసం 10 శాతం మంది కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్‌తో మరణిస్తుంటారు. శరీరం మొత్తానికి రక్తాన్ని సరఫరా చేయడంలో గుండె విఫలం కావడం వల్ల ఇలా జరుగుతుంటుంది. కారణాలేవైనా.. ఈ పరిస్థితిని గుర్తించడం మాత్రం కష్టం. కొన్ని రోజులపాటు ఈసీజీ తీసి పరిశీలించడం ద్వారా డాక్టర్లు హార్ట్ ఫెయిల్యూర్‌కు ఉన్న అవశాలను అంచనా వేస్తారు. అయితే సర్రే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా ఈసీజీ సమాచారాన్ని వేగంగా విశ్లేషించే కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం ద్వారా గుండె ఒక్కసారి కొట్టుకోగానే సమస్యను గుర్తించగలిగారు. దీనిపై మరిన్ని విస్తృత పరిశోధనలు చేపడతామని చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్‌ను స్మార్ట్‌వాచీలు, హెల్త్ బ్యాండ్స్లోకి చేర్చేందుకు ప్రయత్నిస్తామని పేర్కొంటున్నారు. చిన్ని గుండె సిద్ధమైంది త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో భారతీయ సంతతి శాస్త్రవేత్త డాక్టర్ రవి బిర్లా ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. ఒక వ్యక్తి నుంచి సేకరించిన కణాలతో చిన్న సైజు గుండెను అభివృద్ధి చేశారు. తెల్ల రక్త కణాలను మూలకణాలుగా మార్చడం ద్వారా ఈ ప్రక్రియ మొదలవుతుంది. దీంతో ఈ మూలకణాలు కార్డియో మయోసైట్స్గా రూపాంతరం చెందుతాయి. పోషకాలు కొన్నింటిని కలిపి.. ప్రత్యేకంగా తయారు చేసిన బయో ఇంక్ సాయంతో తాము పొరలు పొరలుగా గుండెను తయారు చేశామని, బయోలైఫ్ 4డీ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ అయిన రవి బిర్లా తెలిపారు. ఒక రోగి తాలూకూ నిజమైన గుండె వివరాల ఆధారంగానే ఈ కృత్రిమ గుండె తయారైందని తెలిపారు. నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత దాన్ని శరీరం లోపలి పరిస్థితులను తలపించే బయో రియాక్టర్లో ఉంచినప్పుడు కణాలన్నీ కండరాల మాదిరిగా దృఢంగా మారాయని, ఫలితంగా అనుకన్న పరిమాణం కంటే తక్కువ సైజు గుండె ఏర్పడిందని తెలిపారు. ఇదే టెక్నాలజీని మరింత అభివృద్ధి చేస్తే గుండెలను కృత్రిమంగా తయారు చేసి అమర్చుకునే రోజులు దగ్గరకొచ్చినట్లే అని అంచనా వేస్తున్నారు. -
హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి... రాకుండా జాగ్రత్తలేమిటి?
ఈమధ్య ‘హార్ట్ ఫెయిల్యూర్’తో చనిపోయారు అనే వార్తలు తరచూ వింటున్నాం. అసలు హార్ట్‌ఫెయిల్యూర్ అంటే ఏమిటి? ఎందుకిలా జరుగుతుంది? అసలు హార్ట్ ఫెయిల్యూర్ అయితే మనిషి ఎలా బతుకుతాడు? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి వివరంగా తెలపండి. గుండె మన శరీరంలో ఒక ప్రధానమైన అవయవం. శరీరంలో అవయవాలన్నింటికీ నిరంతరం రక్తం సరఫరా చేస్తుండే ఒక అద్భుతమైన పంపింగ్ మోటార్ ఇది. ఈ రక్తప్రసరణ వల్లనే అన్ని అవయవాలకూ పోషకాలు, ఆక్సిజన్ అందడం మాత్రమే కాకుండా రక్తంలో చేరిన కార్బన్ డై ఆక్సైడ్, శరీరంలోని జీవక్రియల వల్ల ఉత్పన్నమైన ఇతర వ్యర్థపదార్థాల తొలగింపు జరుగుతుంటుంది. ఈ విధంగా దేహంలో ప్రసరణ వ్యవస్థ నిర్వహణలో గుండె కీలకమైన బాధ్యతను నిర్వహిస్తూ ఉంటుంది.ప్రాణవాయువైన ఆక్సిజన్‌ను గ్రహించడం, కార్బన్ డై ఆక్సైడ్‌ను బయటకు పంపించే ప్రక్రియను నిర్వహించడంలో ఊపిరితిత్తులతో కలిసి పనిచేస్తుంది. అనేక రకాల పరిస్థితుల్లో గుండె దెబ్బతింటుంది. వీటిలో ముఖ్యమైనది అధికరక్తపోటు (హైపర్‌టెన్షన్/హైబీపీ), కరోనరీ ఆర్టరీ డిసీజ్, డయాబెటిస్, స్థూలకాయం (ఒబేసిటీ). వీటితో పాటు వాల్వ్‌లార్ డిసీజ్, వైరల్ ఇన్ఫెక్షన్లు, మితిమీరిన మద్యపానం, పోషకాహార లోపం, కీమో–రేడియేషన్ల (క్యాన్సర్ చికిత్సల్లో) అనంతర స్థితి, వాపు (ఇన్ఫ్లమేటరీ స్టేట్) వల్ల కూడా గుండె దెబ్బతింటుంది.ఈ పరిస్థితులను నివారించడం, ఇందుకు కారణమయ్యే అంశాల నుంచి దూరంగా ఉండటం వల్ల గుండెకు జరిగే నష్టాన్ని చాలావరకు తగ్గించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం తొలిదశలోనే వ్యాధిని గమనించడం, దానికి దారితీస్తున్న కారణాలకు దూరంగా ఉండటం వల్ల గుండెకు వాటిల్లబోయే నష్టాన్ని చాలావరకు తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం తొలిదశలోనే వ్యాధిని గమనించడం, దానికి దారితీస్తున్న కారణాలను గుర్తించడం ముఖ్యం. ఒకసారి గుండె దెబ్బతింటే మళ్లీ మునపటి స్థితిని పునరుద్ధరించుకునే సామర్థ్యం గుండెకు ఉండదు. అందుకే గుండె దెబ్బతినకుండానే తీసుకునే నివారణ చర్యలు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా కీలకమైన భూమిక నిర్వహిస్తాయి. లక్షణాలు ఇటు డాక్టర్లు, అటు పేషెంట్లు హార్ట్‌ఫెయిల్యూర్ లక్షణాలను వెంటనే గుర్తించాలి. కొద్దిపాటి శారీరక శ్రమ చేసినా, పడుకొని ఉన్నా శ్వాస అందకపోవడం, అలసట, కాళ్లవాపు, ఊపిరితిత్తుల్లో ఒత్తిడి ఏర్పడటం, పొట్ట ఉబ్బడం మొదలైనవి హార్ట్‌ఫెయిల్యూర్ లక్షణాలు. ఇవి కనిపించిన వెంటనే రోగి పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించి, తీవ్రతను అంచనా వేయాల్సి ఉంటుంది. నిర్ధారణ పరీక్షలు పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఈసీజీ, 2–డి ఎకో కార్టియోగ్రఫీ, మరికొన్ని రక్తపరీక్షల ద్వారా హార్ట్ ఫెయిల్యూర్‌ను డాక్టర్లు నిర్ధారణ చేస్తారు.ఇటీవల మరిన్ని ఆధునిక విధానాలు వాడుకలోకి వచ్చాయి. బయోమార్కర్లను ఉపయోగించి హార్ట్‌ఫెయిల్యూర్‌ను గుర్తించడం, వర్గీకరించడం చేయగలుగుతున్నారు. అదేవిధంగా ఇమేజింగ్ పద్ధతులు కూడా చాలా అభివృద్ధి చెందాయి. వీటివల్ల వ్యాధిని వేగంగా, ఖచ్చితంగా నిర్ధారణ చేయగలుగుతున్నారు. వీటిలో 3–డితో కూడిన ఎకోకార్డియోగ్రఫీ వ్యాధి నిర్ధారణ ఖచ్చితత్వాన్ని మెరుగుపరచింది. ఇది గుండెపనితీరు, గుండె కవాటాల పనితీరు, గుండెలోని ఒత్తిడిని అధ్యయనం చేయడానికి సాయపడుతుంది. ఎకో ద్వారా పూర్తిగా నిర్ధారణకు రాలేని సందర్భాల్లో కార్డియాక్ ఎమ్మారై ప్రభావవంతమైన ప్రత్యామ్నాయం. వీటితోపాటు కార్డియాక్ కాథటరైజేషన్, న్యూక్లియార్ స్కాన్ (పెట్, స్పెక్), ఎండోకార్డియల్ బయాప్సీ, టాక్సికాలజీతో రోగనిర్ధారణ చేస్తున్నారు. గుండెను కాపాడుకోవడం ఇలా... మనం ముందుగా మన అధిక రక్తపోటును (హైబీపీని) అదుపులో ఉంచుకోవాలి. అయితే అధిక రక్తపోటు విషయంలో చాలామంది నిర్లక్ష్యంగానో లేదా ఉదాసీనంగానో వ్యవహరిస్తుంటారు. అధిక రక్తపోటును (హైబీపీని) అదుపులో ఉంచడం ద్వారా రక్తనాళాలకు నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. అలా జరగకపోతే గుండె దమనులు తీవ్రంగా దెబ్బతీసి, గుండెకండరాలను మందంగా తయారుచేస్తుంది. దాంతో గుండెకు రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం చాలావరకు తగ్గిపోతుంది. డయాబెటిస్, స్థూలకాయం ఉన్నప్పుడు కూడా దాదాపు ఇలాంటి అంశాలే ప్రత్యక్షంగా, పరోక్షంగా హార్ట్‌ఫెయిల్యూర్‌కు దారితీస్తాయి. అందువల్ల గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి అటు హైబీపీ, డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడం, ఇటు స్థూలకాయాన్ని నివారించుకొని ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవడం అవసరమవుతుంది. జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవడం ద్వారా గుండెకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. రోజుకు కనీసం 30 – 35 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, తాజా పండ్లు, కూరగాయలు–ఆకుకూరలతో కూడిన పోషకాహారం తీసుకోవడం, ఆహారంలో ఉప్పు చాలా తక్కువగా తీసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి. అలాగే వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడం అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, ఆధ్యాత్మికత వంటి ప్రక్రియలు బాగా ఉపయోగపడతాయి. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పొగతాగడం వల్ల గుండె మీద తీవ్రమైన భారం పడుతుంది. మద్యం కూడా గుండెకు అనర్థాలను తెచ్చిపెడుతుంది. ఆ అలవాట్లను వెంటనే ఆపేయాలి. ఇక రక్తంలో కొలస్ట్రాల్ ఉంటే దానివల్ల కరొనరీ దమనల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అందుకే రక్తంలోని కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలి.మొత్తంమీద పూర్తిగా నష్టం జరగకమునుపే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండటం వల్ల గుండెకు వాటిల్లే నష్టం నివారించడానికి వీలవుతుంది. తద్వారా హార్ట్‌ఫెయిల్యూర్ రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఒకసారి గుండెపోటుకు గురైతే ఆలస్యం చేయకుండా గుండెకు రక్తసరఫరాను పునరుద్ధరించడం కూడా చాలా కీలకం. దానివల్ల తక్షణ రక్షణతో పాటు మున్ముందు మరింత నష్టం జరగకుండా చూసుకోడానికి, దీర్ఘకాలంలో దుష్ఫలితాలు ఏర్పడకుండా చూడవచ్చు. డా. రాజశేఖర్ వరద, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్. సికింద్రాబాద్ -
హార్ట్ ఫెయిల్యూరా?
నా వయసు 68 ఏళ్లు. కొద్దిరోజులుగా నడిచినప్పుడు తీవ్రంగా ఆయాసం వస్తోంది. దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండి, పాదాల వాపు కనిపించింది. డాక్టర్‌ను కలిస్తే పరీక్షలు చేసి, హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్పారు. జీవన శైలిలోమార్పులు చేసుకోవడం మంచిదని కూడా అన్నారు. నేను నా జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులేమిటో సూచించండి. మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీరు ఆహారంలో తీసుకోవాల్సిన మార్పులివి... ►ఉప్పు: ఒంట్లో నీరు చేరుతూ ఆయాసం వంటి లక్షణాలు కనబడితే ఉప్పు వాడకాన్ని పూర్తిగా తగ్గించడం మంచిది. రోజుకు 2.5 గ్రాములు (అరచెంచా) కంటే తక్కువే తీసుకోవాలి. ఉప్పు వేయకుండా కూరలు వండుకోవాలి. పచ్చళ్లు, బయట దొరికే చిరుతిండ్లను పూర్తిగా మానేయాలి. ఉప్పు ఉండని – బాదం, జీడిపప్పు, ఆక్రోటు వంట్ నట్స్, పాలు, పండ్ల వంటివి ఎక్కువగా తీసుకోవచ్చు. అవసరమైతే కూరల్లో రుచి కోసం కొద్దిగా వెనిగర్ వంటివి ఉపయోగించుకోవచ్చు. ►ద్రవాహారం: ఒంట్లోకి నీరు చేరుతుంటే ద్రవాహారం తగ్గించాలి. ఒంట్లోకి నీరు చేరకపోతే మాత్రం రోజు లీటరున్నర వరకు ద్రవాహారాలు తీసుకోవచ్చు. ►విశ్రాంతి: గుండె వైఫల్యం వస్తే పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి చాలామంది అనుకుంటారు. కానీ ఇది సరికాదు. వైఫల్యం తీవ్రంగా ఉంటే తప్ప... శరీరం సహకరించినంత వరకు, ఆయాసం రానంతవరకు శారీరక శ్రమ, నడక, మెట్లు ఎక్కడం వంటివి చేయవచ్చు. ►మానసికంగా ప్రశాంతంగా ఉండాలి: గుండెవైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్), అశక్తతల వల్ల మానసిక ఒత్తిడి, తీవ్ర భావోద్వేగాలు తలెత్తుతుంటాయి. రోగులు ఒత్తిడిని అధిగమించాలి. ఇందుకు యోగా, ధ్యానం వంటివి మేలు చేస్తాయని అనేక అధ్యయనాల్లో నిరూపితమైంది. ►ఈ మందులు వాడకండి: గుండె వైఫల్యం ఉన్నవారు కొన్ని మందులు... ముఖ్యంగా నొప్పులు తగ్గేందుకు వాడుకునే ఇబూప్రొఫేన్, డైక్లోఫెనాక్ వంటి ఎన్ఎస్ఏఐడీ రకం మందులు వేసుకోకూడదు. స్టెరాయిడ్స్‌కు దూరంగా ఉండాలి. ఇవి ఒంట్లోకి నీరు చేరేందుకు దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని వాడకూడదు. నాటు మందుల్లో ఏ పదార్థాలు ఉంటాయో, అవి గుండె మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియదు. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది. నొప్పులు ఎక్కువగా ఉంటే... మరీ అవసరమైతే నొప్పులు తగ్గేందుకు పారాసిటమాల్ వంటి సురక్షిత మందులు వాడుకోవచ్చు. ►వైద్యపరమైన జాగ్రత్తలు: గుండె వైఫల్యానికి వాడే మందులతో కూడా అప్పుడప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తవచ్చు. పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు వాటి మోతాదుల్లో మార్పులు చేసుకోవడం లేదా మందులను మార్చడం అవసరం. అందుకే తరచూ వైద్యులను సంప్రదించి, వారి సూచనలు తప్పక పాటించాలి. అరిథ్మియాఅంటే ఏమిటి? నా వయసు 37 ఏళ్లు. రెండు వారాల కిందట అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాను. స్పృహ వచ్చాక కూడా చాలా నీరసంగా ఉంది. అప్పట్నుంచి కళ్లు తిరుగుతున్నాయి. చాలా ఆయాసంగా ఉంది. ఊపిరితీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటోంది. డాక్టర్‌ను కలిస్తే ఎరిథ్మియా కావచ్చు అన్నారు. అరిథ్మియా అంటే ఏమిటి? నాకు చాలా ఆందోళనగా ఉంది. సలహా ఇవ్వండి. సాధారణంగా మన గుండె మామూలుగా నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాలి. అలా కాకుండా 60 కన్నా తగ్గినా లేదా 100 కన్నా పెరిగినా ఆ కండిషన్‌ను అరిథ్మియా అంటారు. కానీ ఎవరైనా తీవ్ర భయాందోళనలకు గురైనప్పుడు, వ్యాయామం చేసినప్పుడు గుండె వేగం 100 నుంచి 160 మధ్యన ఉంటుంది. దీన్ని సైనస్ టాకికార్డియా అంటారు. ఇలా కాకుండానే గుండె వేగం దానంతట అదే ఇంకా పెరిగితే అది జబ్బువల్ల కావచ్చు. ఈ లక్షణంతో మరి కొన్నిరకాల గుండెజబ్బులు ఉండవచ్చు. సమస్య ఏదైనా గుండె వేగం మరింత పెరిగినా లేదా తగ్గినా స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. మీరు స్పృహ కోల్పోయినట్లు చెప్పారు కాబట్టి వెంటనే దగ్గర్లోని కార్డియాలజిస్ట్‌ని కలిసి ఈసీజీ, ఎకో, హోల్టర్ పరీక్షల్లాంటివి చేయించండి. మీరు స్పృహ కోల్పోడానికి గుండె జబ్బే కారణమా, మరి ఇంకేదైనా సమస్య వల్ల ఇలా జరిగిందా తెలుసుకొని దానికి తగిన విధంగా చికిత్స తీసుకోవడం అవసరం. ఇప్పుడు ఆధునిక వైద్య విజ్ఞానం వల్ల అన్నిరకాల జబ్బులకు మంచిమందులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఆందోళన చెందకండి. - డాక్టర్ అనూజ్ కపాడియా, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ సీఏబీజీ సర్జరీ అంటే ఏమిటి? నా వయసు 67 ఏళ్లు. ఇటీవల ఒక రోజు ఛాతీనొప్పి వస్తే పరీక్షించిన డాక్టర్లు సీఏబీజీ సర్జరీ చేయాలని చెప్పారు. అంటే ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే కీలకమైన ధమనుల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు, రక్తసరఫరాకు అవరోధం కలగకుండా, సీఏబీజీ అనే సర్జరీ చేసి, రక్తాన్ని ఇతర మార్గాల్లో (బైపాస్ చేసిన మార్గంలో) గుండెకండరానికి అందేలా చేసే ఆపరేషనే సీఏబీజీ. మనం ఇంగ్లిష్‌లో సాధారణంగా ‘బైపాస్ సర్జరీ’ అని పిలిచే దీన్ని వైద్యపరిభాషలో కరొనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ అని వ్యవహరిస్తారు. దాని సంక్షిప్తరూపమే ఈ సీఏబీజీ ఆపరేషన్. ఇందులో కాళ్లు లేదా చేతులపై ఉన్న రక్తనాళాలను తీసి, గుండెకు అడ్డంకిగా ఏర్పడిన రక్తనాళాలకు ప్రత్యామ్నాయంగా, రక్తాన్ని బైపాస్ మార్గంలో అందించేలా అమర్చుతారు. సాధారణంగా ఒక బ్లాక్ (అడ్డంకి)ని బైపాస్ చేయాలంటే ఒక రక్తనాళం అవసరం. గుండె వద్ద ఉన్న రక్తనాళాన్ని నేరుగా బైపాస్ చేసే ప్రక్రియను రీ–వా స్క్యులరైజేషన్ అంటారు. ఛాతీకీ కుడి, ఎడమ వైపున ఉన్న రక్తనాళాలను ఇంటర్నల్ మ్యామరీ ఆర్టరీ అంటారు. గుండెకు ఎడమవైపున ఉన్న నాళాన్ని లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ అర్టరీ అని అంటారు. ఈ రక్తనాళాన్ని బ్లాక్ అయిన నాళాల వద్ద బైపాస్ మార్గంలా కలుపుతారు. దీర్ఘకాల ప్రయోజనాలతో పాటు రోగి త్వరగా కోలుకుంటున్నందున ఇప్పుడు బైపాస్‌లోనూ సరికొత్త విధానాన్ని పాటిస్తున్నారు. బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత, భవిష్యత్తులో ఇలా మార్చిన రక్తనాళాల్లోనూ కొవ్వు పేరుకోకుండా హృద్రోగులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. రక్తనాళాల్లో పేరుకున్న బ్లాక్స్‌ను అధిగమించి, రక్తాన్ని గుండెకు చేరవేసేందుకు వీలుగా బైపాస్ సర్జరీ చేస్తారు. అంతేతప్ప ఇది చేయడం వల్ల అప్పటికే ఉన్న గుండెజబ్బు తొలగిపోయిందని పేషెంట్ అపోహ పడకూడదు. అందుకే రోగి మళ్లీ ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవే... రోగికి హైబీపీ ఉన్నట్లయితే దాన్ని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకునేలా డాక్టర్ సూచించిన మందులు తీసుకోవాలి. అలాగే రోగికి డయాబెటిస్ ఉంటే, రక్తంలోని చక్కెరపాళ్లు ఎల్లప్పుడూ అదుపులో ఉండేలా మందులు తీసుకుంటూ, కొవ్వులు తక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. ఇక పొగతాగే అలవాటు ఉంటే దాన్ని తక్షణం పూర్తిగా మానేయాలి. డాక్టర్లు సూచించిన తగిన వ్యాయామాలు చేస్తూ ఉండాలి. -
హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే...?
మా వారి వయసు 45 ఏళ్లు. ఆయన పదేళ్లుగా గుండె సమస్యతో బాధపడుతున్నారు. బైపాస్ సర్జరీ, రీ–డూ సర్జరీ కూడా చేయించాం. కానీ ఫలితం లేదు. హార్ట్ ఫెయిల్యూర్ అన్నారు. మందులు వాడుతున్నారు. రెండేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నారు. డాక్టర్లను సంప్రదిస్తే ‘హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ ఒక్కటే పరిష్కారం అని చెప్పారు. మాకు ఆందోళనగా ఉంది. ‘హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్’ అంటే ఏమిటి? దానికి సంబంధించిన అన్ని విషయాలను వివరంగా చెప్పండి. గుండెపనితీరు, దాని సామర్థ్యం పూర్తిగా పడిపోయిన వారికి మాత్రమే గుండెమార్పిడి శస్త్రచికిత్స చేస్తారు. సాధారణంగా 65 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండి, శరీరంలోని మిగతా అన్ని అవయవాల పనితీరు నార్మల్‌గా ఉండటంతో పాటు ఎలాంటి ఇన్ఫెక్షన్లూ, యాంటీబాడీస్ లేకుండా ఉంటేనే గుండెమార్పిడి శస్త్రచికిత్స చేస్తారు. మీరు చెప్పిన వివరాలను బట్టి మీ వారికి గుండె నుంచి రక్తం పంప్ అయ్యే సామర్థ్యం 20 శాతం లేదా పది శాతానికి పడిపోయినట్లు అనిపిస్తోంది. ఈ పరిస్థితినే ‘హార్ట్ ఫెయిల్యూర్’ అంటారు. ఇలాంటి వారికి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీరు వెంటనే మీ వారి పూర్తి వివరాలను ప్రభుత్వ సంస్థ అయిన ‘జీవన్‌దాన్’కు అందించి, అందులో మీ వారి పేరు నమోదు చేయించండి. అవయవదానం చేశాక చనిపోయిన వారు లేదా బ్రెయిన్‌డెడ్‌కు గురైన వారి బంధువులు అవయవదానానికి ముందుకు వచ్చిన సందర్భాల్లో ‘జీవన్‌దాన్’ ప్రతినిధులు పూర్తిగా ప్రాధాన్యక్రమంలో గుండెను ప్రదానం చేస్తారు. అలాంటి వారి నుంచి మీవారికి తగిన గుండె లభ్యం కాగానే, మీకు సమాచారం అందజేస్తారు. వారి నుంచి గుండె సేకరించిన (హార్ట్ హార్వెస్టింగ్ జరిగిన) నాలుగు గంటల లోపే ఆ గుండెను రోగికి అమర్చాల్సి ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు మీకు ఎంత త్వరగా గుండె లభ్యమైతే, ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. గుండె మార్పిడి తర్వాత రోగులు అది చక్కగా పనిచేసే మందులతో పాటు ఇమ్యునోసప్రెస్సెంట్స్ అనే ఔషధాలను వాడాల్సి ఉంటుంది. గుండె మార్పిడి ఆపరేషన్లలో చాలావరకు విజయవంతమవుతున్నాయి. ఇలాంటి శస్త్రచికిత్స చేసిన వారు గతంలో కంటే చాలా ఎక్కువ కాలమే జీవిస్తున్నారు. కాబట్టి మీరు ఆందోళన, నిరాశ చెందాల్సిన అవసరం లేదు. – ఎమ్. కవిత, నిజామాబాద్ హార్ట్ కౌన్సెలింగ్ అప్పుడు స్టెంట్ వేశారు... ఇప్పుడు బైపాస్చేయాలంటున్నారు మా నాన్నగారి వయసు 56 ఏళ్లు. ఏడాది క్రితం ఆయనకు గుండెపోటు వచ్చింది. అప్పుడు యాంజియోప్లాస్టీ చేసి, ఒక స్టెంట్ వేశారు. కొన్నాళ్లు బాగానే ఉన్నారు. కానీ మళ్లీ ఇప్పుడు నడుస్తున్నప్పుడు ఆయాసపడుతున్నారు. డాక్టర్ దగ్గరకు తీసుకెళితే పరీక్షలు చేసి, బైపాస్ చేయాలంటున్నారు. మా నాన్నగారికి బీపీతో పాటు షుగర్ కూడా ఉంది. ఈ వయసులో ఆయన సర్జరీని తట్టుకోగలరా? దయచేసి మా సందేహాలకు వివరంగా సమాధానమివ్వగలరు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో అడ్డంకులు (బ్లాక్స్) ఏర్పడితేనే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. రెండు లేదా మూడు అడ్డంకులు ఉంటే యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేస్తారు. మీ నాన్నగారికి గుండె రక్తనాళాల్లో ఎక్కువగా బ్లాక్స్ ఏర్పడి ఉండవచ్చు. అందుకే డాక్టర్ బైపాస్ సర్జరీని సూచించి ఉంటారు. ఒకప్పుడు గుండె ఆపరేషన్లు అంటే ప్రజలు చాలా భయపడేవారు. కానీ ఇప్పుడు వైద్యరంగంలో అనేక మార్పులు, అత్యాధునిక వైద్య ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుండె ఆపరేషన్లు చాలా సురక్షితంగా చేయగలుగుతున్నారు. అందులో భాగంగానే అతి చిన్న కోతతో ‘మినిమల్లీ ఇన్వేజివ్ బైపాస్ సర్జరీ’ అనే అధునాతన పద్ధతి కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం ద్వారా ఛాతీ ఎముకలు కట్ చేయకుండానే కొన్ని ప్రత్యేకమైన పరికరాలతో శస్త్రచికిత్స సులువుగానే నిర్వహించవచ్చు. ఈ ఆపరేషన్ ద్వారా కోత తక్కువగా ఉండటం వల్ల నొప్పి కూడా తక్కువగానే ఉంటుంది. ఈ విధానంలో తక్కువ రక్తస్రావం జరుగుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశం కూడా చాలా తక్కువ. శస్త్రచికిత్స తర్వాత పేషెంట్ 3 – 4 రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారు. ముఖ్యంగా ఈ చికిత్సా విధానం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అలాగే 50ఏళ్లు పైబడిన వారికి కూడా ఈ శస్త్రచికిత్స విధానం అత్యంత సురక్షితం. బీపీ, షుగర్ ఉన్నవారికి కూడా నిపుణుల ప్రత్యేక పర్యవేక్షణలో శస్త్రచికిత్స నిర్వహిస్తారు. ఎటువంటి ఆందోళన అవసరం లేదు. – కె.వి. రమణ, కాకినాడ స్టెంట్ వేశాక కూడా మళ్లీ గుండెపోటు వస్తుందా? నా వయసు 55 ఏళ్లు. ఇదివరకు ఒకసారి గుండె రక్తనాళాల్లో ఒకచోట పూడిక ఏర్పడిందని నాకు స్టెంట్ వేశారు. ఇటీవల మళ్లీ నాకు అప్పుడప్పుడూ ఛాతీలో నొప్పి వస్తోంది. ఇదివరకే స్టెంట్ వేయించుకున్నాను కదా గుండెపోటు రాదులే అనుకొని కొంతకాలంపాటు ఛాతీనొప్పిని అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఒక సందేహం వస్తోంది. ఒకసారి స్టెంట్ వేయించుకున్న తర్వాత మళ్లీ గుండెపోటు వచ్చే అవకాశం ఉందా? దయచేసి వివరంగా చెప్పండి. ఒకసారి స్టెంట్ వేయించుకున్న తర్వాత మళ్లీ రక్తనాళాల్లో పూడికలు రావని చాలామంది మీలాగే అపోహ పడుతుంటారు. కానీ ఇది నిజం కాదు. స్టెంట్ సహాయంతో అప్పటికి ఉన్న అవరోధాన్ని మాత్రమే తొలగిస్తారు. కానీ మళ్లీ కొత్తగా పూడికలు రాకుండా ఆ స్టెంట్ అడ్డుకోలేదు. ఒకసారి గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి, స్టెంట్ అమర్చిన తర్వాత మళ్లీ పూడికలు రాకుండా ఉండాలంటే వైద్యుల పర్యవేక్షణలో పూర్తిస్థాయి జాగ్రత్తలు, చికిత్సలు తీసుకుంటూ ఉండాలి. మీరు వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితి బట్టి మీకు ఎలాంటి చికిత్స అందించాలో వైద్యులు నిర్ణయిస్తారు. ఒకవేళ బైపాస్ అవసరం అని చెప్పినా మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్యవిధానాలతో చిన్న కోతతోనే బైపాస్ చేయడమూ సాధ్యమే. మీరు మీ ఛాతీనొప్పిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. మందులతోనే నయం అయ్యే పరిస్థితి ఉంటే ఆపరేషన్ కూడా అవసరం ఉండదు. ఇక సాధ్యమైనంతవరకు మీరు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. డాక్టర్ ఎన్. నాగేశ్వర్రావు, సీనియర్ కార్డియోథొరాసిక్ అండ్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, మలక్‌పేట్, హైదరాబాద్ -
బురారీ మిస్టరీ : పెట్ డాగ్ డెడ్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బురారీ ఆత్మహత్యల కేసులో, మరో గుండె బద్దలయ్యే సంఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో కీలకంగా మారి.. ఆ కుటుంబంలో ప్రాణాలతో మిగిలి ఉన్న ఏకైక ప్రాణి, పెట్ డాగ్ ‘టామీ’ హార్ట్ అటాక్‌తో మరణించింది. నోయిడా జంతు సంరక్షణ కేంద్రంలో ఉంటున్న ఈ పెట్ డాగ్ మరణించినట్టు హిందూస్తాన్ టైమ్స్ రిపోర్టు చేసింది. బురారీ కుటుంబం హత్యకు గురైనప్పుడు, ఈ పెట్ డాగ్ తీవ్ర జ్వరంతో టెర్రస్‌పై వణుకుతూ కనిపించింది. కుటుంబ సభ్యులంతా ఆత్మహత్యకు యత్నించే సమయంలో ఆ పెట్ డాగ్‌ను గ్రిల్‌కు కట్టేసి ఉంచారు. మీడియా ద్వారా ఈ పెట్ డాగ్ గురించి తెలుసుకు సంజయ్ మొహపాత్ర అనే జంతు హక్కుల పోరాట కార్యకర్త దానిని పోలీసుల అనుమతితో తన జంతు సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే తొలుత ఆ డాగ్ చాలా కోపంగా ఉండేదని, ఎవరిని దగ్గరికి రాణించేదని కాదని అతను మీడియాకు తెలిపారు. ఈ కేసును అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు పెట్ డాగ్ సైగల నుంచి కూడా మరింత సమాచారన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. ‘ఈ డాగ్‌కు అంతకముందు నుంచే పలు అనారోగ్య సమస్యలు ఉండి ఉంటాయి. వారికి తెలిసి ఉండకపోవచ్చు. బురారీ ట్రాజెడీ అనంతరం ఈ డాగ్‌ను కొత్త వాతావరణంలోకి తీసుకురావాల్సి వచ్చింది. అయితే ఇన్ని రోజులు వారి ప్రేమ, ఆప్యాయల మధ్య జీవించిన ఈ పెట్ డాగ్, కొత్త వాతావరణానికి అలవాటు కాలేకపోయింది. దీంతో దీని ఆరోగ్యం మరింత క్షీణించింది’ అని జంతు సంరక్షణ అధికారి చెప్పారు. కాగ, ఇటీవల ఢిల్లీలోని బురారీలో పదకొండు మంది ఆత్మహత్యలకు పాల్పడ్డ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఒకే ఇంట్లో 10 మంది ఇంట్లోని సీలింగ్‌కు ఉన్న ఇనుప కమ్మీలకు ఉరివేసుకోగా.. భాటియా ఇంటి పెద్ద నారాయణ్ దేవీ గొంతు తెగి రక్తపు మడుగులో కనిపించింది. ఈ కేసుపై విచారణ చేపడుతున్న పోలీసులు, వారి ఇంట్లో కొన్ని రాత పూర్వక నోట్లను కూడా గుర్తించారు. ఈ పత్రాలను బట్టి కుటుంబం మొత్తం తాంత్రిక పూజల్లో పాల్గొనేదని, అందులో రాసిపెట్టినట్లుగానే వాళ్లు ఉరి వేసుకుని చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఆరేళ్లు వ్యాయామం చేస్తే..
లండన్ : ఆరేళ్ల పాటు నిత్యం వ్యాయామం చేస్తే గుండె వైఫల్యం ముప్పు మూడో వంతు తగ్గుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. మధ్యవయస్కుల్లో ఆరేళ్ల పాటు ఎలాంటి కదలికలు లేకుండా గడిపే వారిలో గుండె జబ్బుల ముప్పు అధికమని పేర్కొంది. 11,000 మంది పెద్దలపై జరిపిన పరిశోధనలో ఈ అంశాలను గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు. 65 సంవత్సరాలు పైబడిన వారిలో అత్యధికులు హైబీపీ, అధిక కొవ్వు, డయాబెటిస్, గుండె జబ్బుల వంటి జీవనశైలి వ్యాధుల కారణంగానే ఆస్పత్రుల్లో చేరుతున్నారని అథ్యయనానికి నేతృత్వం వహించిన జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ డుములే తెలిపారు. వారానికి 150 నిమిషాల పాటు వేగంగా నడవడం వంటి వ్యాయామాలు అవసరమని ఇలా చేస్తే గుండె వైఫల్యం 31 శాతం వరకూ తగ్గుతుందని తమ పరిశోధనలో వెల్లడైందన్నారు. గుండె జబ్బులను నిరోధించేందుకు మధ్యవయస్కులు ఇప్పటికైనా వ్యాయామానికి నడుం బిగించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ అథ్యయన వివరాలు జర్నల్ సర్క్యులేషన్లో ప్రచురితమయ్యాయి. -
నాన్నా ప్రకాష్.. అమ్మనొచ్చాను లేయ్ రా..
సాక్షి, అనంతపురం : ‘నాన్నా బంగారు లేయ్ నాన్న. ఓరేయ్ ప్రకాషూ అమ్మను వచ్చానురా... లేయ్‌రా.. నాయనా’ అంటూ ఆతల్లి పెట్టిన కన్నీరు అందరినీ కలచివేసింది. నిండా పాతికేళ్లుకూడా లేని కొడుకు కానరానిలోకాలకు పోయాడని తెలిసిన ఆకన్నపేగు పెట్టిన ఆర్తనాదం అంతా ఇంతాకాదు.. నిండా పాతికేళ్లు లేవు... పైగా డిప్లొమో ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (డీఎంఎల్టీ) కోర్సు చదువుతున్నాడు. ఆరోగ్య విషయంలో ప్రాథమికంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అనుభవమూ ఉంది. కానీ విధి చిన్నచూపు చూసింది. ఆస్పత్రి గేటువద్దే ఉన్న ఆ యువకుడికి ఛాతిలో నొప్పిరావడంతో నడుచుకుంటూ వెళ్లి ఎమర్జెన్సీ వార్డులోని బెడ్‌పై పడుకున్న అతను కొద్ది క్షణాల్లోనే కన్నుమూశాడు. కొడుకు మరణ వార్త విని ఆతల్లి తల్లడిల్లింది. ‘నాన్నా బంగారు లేయ్ నాన్న. ఓరేయ్ ప్రకాషూ అమ్మను వచ్చానురా...లేయ్‌రా..నాయనా’ అంటూ ఆతల్లి పెట్టిన కన్నీరు అందరినీ కలచివేసింది. ఈ సంఘటన సోమవారం సర్వజనాస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... విడపనకటళ్ మండలం గడేహొత్తూరుకు చెందిన రామలింగప్ప, శివలింగమ్మల కుమారుడు ప్యాపిలి సూర్యప్రకాష్(23) నగరంలోని సీట్స్ ఇన్స్టిట్యూట్లో డీఎంఎల్టీ (డిప్లొమో ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్) రెండో సంవత్సరం చదువుతున్నాడు. క్లినికల్స్‌లో భాగంగా సోమవారం సర్వజనాస్పత్రిలోని ఓపీ విభాగం బ్లడ్ కలెక్షన్ పాయింట్లో విధులు నిర్వర్తించాడు. మధ్యాహ్నం 1 గంట సమయంలో రూంకు వెళ్లేందుకు ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఛాతినొప్పి రావడంతో వెంటనే నడుచుకుంటూ ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లి పడుకున్నాడు. అయితే బెడ్‌పై పడుకున్న సూర్యప్రకాష్ ఉలుకూ పలుకూ లేకపోవడంతో వెంటనే అక్కడి చేరుకున్న డ్యూటీ డాక్టర్ శివకుమార్... అతన్ని పరీక్షించి, హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా మృతి చెందినట్లు నిర్ధారించారు. పది నిమిషాల ముందు తమతో మాట్లాడిన సూర్యప్రకాష్ నిర్జీవంగా పడి ఉండడం చూసిన సీనియర్ టెక్నీషియన్లు కన్నీరుమున్నీరయ్యారు. నాన్నా ప్రకాష్ అమ్మనొచ్చాను లేయ్ రా.. ‘నాన్నా బంగారు లేయ్ నాన్న. ఓరేయ్ ప్రకాషూ అమ్మను వచ్చానురా...లేయ్‌రా..నాయనా’ అంటూ సూర్యప్రకాష్ తల్లి శివలింగమ్మ కుమారుడి మృతదేహంపై పడి గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలివచ్చి తమ మిత్రుడుని తలుచుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. -
హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే ఆహార నియమాలివి...
సోరియాసిస్ తగ్గుతుందా? నా వయసు 32 ఏళ్లు. నాకు కొంతకాలంగా మోకాలి ప్రాంతంలో చర్మంపై దురదతో కూడి ఎర్రని ప్యాచ్‌లు వస్తున్నాయి. తెల్లని పొలుసులు కూడా రాలుతున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే ఇది సోరియాసిస్ వ్యాధిగా చెప్పారు. మందులు వాడుతున్నాను. కొద్దిపాటి ఉపశమనం మాత్రమే లభిస్తోంది. పైగా ఇప్పుడు మోచేయి ప్రాంతంలో కూడా ఇది కనిపిస్తోంది. హోమియో ద్వారా దీన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చా? సలహా ఇవ్వగలరు. - కృపాకర్, నిజామాబాద్ ఈమధ్యకాలంలో సోరియాసిస్ అనే మాట విననివారు ఉండవు. నేటి జీవనవిధానం, అధిక మానసిక ఒత్తిడి వల్ల ఈ వ్యాధితో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ చల్లటి వాతావరణంలో వ్యాధిని ప్రేరేపించే అంశాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. దాంతో వ్యాధి తీవ్రత పెరగవచ్చు. సోరియాసిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. అంటే శరీర రోగ నిరోధ వ్యవస్థలో కొంత అసమతౌల్యత కారణంగా అది మన సొంత కణాలపైనే దాడి చేయడం వల్ల కలిగే వ్యాధి ఇది. ఇలాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులకు ఇతర వైద్య విధానాల్లో సమర్థమైన చికిత్స అందుబాటులో లేదు. హోమియో ద్వారా ఇది పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. సోరియాసిస్ వ్యాధిలో రోగ నిరోధక వ్యవస్థ సొంత చర్మపు కణాలపై దాడి చేయడం వల్ల ఆ కణాలు ప్రభావితమవుతాయి. అవి ఎర్రగా మారి సాధారణం కంటే 10 రెట్లు ఎక్కువగా వృద్ధి చెందుతుంటాయి. దాంతో అంతర్లీనంగా ఉండే కణాలు త్వరగా చర్మపు ఉపరితలాన్ని చేరుకొని వెండి రంగు పొలుసులలా రాలిపోవడం జరుగుతుంది. ఇది కీళ్లను, గోళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. సోరియాసిస్ వివిధ రకాలుగా కనిపిస్తుంది: 1) సోరియాసిస్ వల్గారిస్ 2) గట్టేట్ సోరియాసిస్ 3) ఇన్వర్స్ సోరియాసిస్ 4) పస్టులార్ సోరియాసిస్ 5) ఎరిథ్రోడర్మక్ సోరియాసిస్ కారణాలు : ఈ వ్యాధికి కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. కానీ జన్యుపరమైన, పర్యావరణ అంశాలు ఈ వ్యాధి కారణం కావచ్చని అనుభవపూర్వకంగా తెలుస్తోంది. అధిక మానసిక ఒత్తిడి, వంశపారంపర్యత, రోగనిరోధక వ్యవస్థలో అసమతౌల్యత వల్ల కూడా ఈ వ్యాధి రావచ్చు. లక్షణాలు : సోరియాసిస్ తల, మోకాళ్లు, అరచేతులు, అరిపాదాలు, ఉదరంపై చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. చర్మం ఎర్రబారవడం, సాధారణం నుంచి అతి తీవ్రమైన దురద, చర్మంపై వెండి రంగు పొలుసులు ఊడిపోవడం కనిపిస్తుంది సోరియాసిస్ ఏర్పడితే పొలుసులు రాలిపోవడంతో పాటు జుట్టు కూడా రాలిపోతుంది సోరియాసిస్ గోళ్లను ప్రభావితం చేస్తే అవి పెళుసుగా మారి దృఢత్వాన్ని కోల్పోయి త్వరగా విరిగిపోతాయి. సోరియాసిస్ వ్యాధి తీవ్రంగా ఉంటే కీళ్లను ప్రభావితం చేసి కీళ్లనొప్పులు (సోరియాటిక్ ఆర్థరైటిస్)కి దారితీస్తుంది. చికిత్స : హోమియో విధానం ద్వారా అందించే జెనెటిక్ కాన్సిట్యూషనల్ చికిత్స వల్ల ఎలాంటి చర్మ సమస్యలనైనా సమర్థంగా నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల వికటించిన రోగ నిరోధక శక్తిని సరిచేయవచ్చు. దీనివల్ల ఎలాంటి దుష్ర్పభావాలు, దుష్ఫలితాలు లేకుండా సోరియాసిస్ వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చు. హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే ఆహార నియమాలివి... నా వయసు 64 ఏళ్లు. కొద్దిరోజులుగా నడిచినప్పుడు ఆయాసం తీవ్రత పెరగడం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, పాదాల వాపు ఉండటంతో దగ్గర్లోని డాక్టర్‌ను కలిశాను. హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్పారు. ఆయన నాకు కొన్ని పరీక్షలు చేసి జీవనశైలిలోమార్పులు చేసుకోవడం మంచిదని తెలిపారు. నాలాంటి వారు జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో దయచేసి వివరించండి. - రాజారావు, కొండాపూర్ మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీరు ఆహారంలో తీసుకోవాల్సిన మార్పులివి... ఉప్పు : ఒంట్లో నీరు చేరుతూ ఆయాసం వంటి లక్షణాలు కనిబడితే ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. రోజుకు 2.5 గ్రాములు (అరచెంచా) కంటే తక్కువే తీసుకోవాలి. ఉప్పు వేయకుండా కూరలు వండుకోవాలి. పచ్చళ్లు, బయట దొరికే చిరుతిండ్లను పూర్తిగా మానేయాలి. ఉప్పు ఉండని - బాదాం, జీడిపప్పు, ఆక్రోటు వంటి నట్స్, పాలు, పండ్ల వంటివి ఎక్కువగా తీసుకోవచ్చు. అవసరమైతే కూరల్లో రుచి కోసం కొద్దిగా వెనిగర్ వంటివి ఉపయోగించుకోవచ్చు. ద్రవాలు : కాళ్ల వాపు ఉంటే నీరు, మజ్జిగ లాంటి ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి. రోజు మొత్తమ్మీద లీటరు కంటే తక్కువ తీసుకోవాలి. ఒంట్లో నీరు చేరుతున్న లక్షణాలు లేకపోతే ఒకటిన్నర లీటర్ల వరకు నీరు తాగవచ్చు. విశ్రాంతి : గుండెవైఫల్యం వస్తే పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. వైఫల్యం తీవ్రంగా ఉంటే తప్ప... శరీరం సహకరించినంత వరకు, ఆయాసం రానంతవరకు శారీరక శ్రమ, నడక, మెట్లు ఎక్కడం వంటివి చేయవచ్చు. మానసిక సాంత్వన : గుండెవైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్), అశక్తతల వల్ల మానసిక ఒత్తిడి, తీవ్ర భావోద్వేగాలు తలెత్తుతుంటాయి. వీరికి యోగా, ధ్యానం వంటివి మేలు చేస్తున్నట్లు అధ్యయనాలలో గుర్తించారు. ఈ మందులు వద్దు : గుండె వైఫల్యం ఉన్నవారు కొన్ని మందులు... ముఖ్యంగా నొప్పులు తగ్గేందుకు వాడుకునే ఇబూప్రొఫేన్, డైక్లోఫెనాక్ వంటి ఎన్ఎస్ఏఐడీ రకం మందులు వేసుకోకూడదు. స్టెరాయిడ్స్‌కు దూరంగా ఉండాలి. ఇవి ఒంట్లోకి నీరు చేరేందుకు దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని వాడకూడదు. సంప్రదాయ ఔషధాలు, నాటు మందుల్లో ఏ అంశాలు ఉంటాయో, అవి గుండె మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియదు. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది. మరీ అవసరమైతే నొప్పులు తగ్గేందుకు పారాసిటమాల్ వంటి సురక్షితమైన మందులు వాడుకోవచ్చు. వైద్యపరమైన జాగ్రత్తలు : గుండె వైఫల్యానికి వాడే మందులతో కూడా అప్పుడప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తవచ్చు. పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు వాటి మోతాదుల్లో మార్పులు చేసుకోవడం లేదా మందులను మార్చడం వంటి జాగ్రత్తలు అవసరం కావచ్చు. కాబట్టి తరచూ వైద్యులను సంప్రదించి, వారి సూచనలు పాటించడం ముఖ్యం. -
గుండె వైఫల్యాన్ని ముందే గుర్తిస్తుంది..!
రోగి కంటే ముందే గుండె వైఫల్యాన్ని గుర్తించే సరికొత్త ఇంప్లాంట్ ఇది. ‘కార్డియోమెమ్స్’ అనే ఈ పరికరాన్ని గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తం తీసుకెళ్లే పుప్పుస ధమనిలో అమర్చుకుంటే చాలు.. రోగి జీవితాంతం బ్యాటరీ సైతం అవసరం లేకుండానే పనిచేస్తుంది. పుప్పుస ధమనిలో బీపీ(రక్తపోటు)ని, గుండె కొట్టుకునే తీరును ఇది నిరంతరం సెన్సర్ల ద్వారా పరిశీలిస్తుంది. గుండె వైఫల్యానికి దారితీసేలా రక్తపోటులో తేడా వచ్చిన తక్షణమే రిసీవర్‌కు సమాచారం పంపుతుంది. ఆ వెంటనే రిసీవర్ నుంచి వైద్యులకు సమాచారం చేరుతుంది. వైద్యులు వెంటనే రోగికి ఏ మందులు వేసుకోవాలో చెప్పడంతో పాటు తగిన సూచనలు చేస్తారు. దీనిని ఇప్పటిదాకా ఏడుగురిలో అమర్చగా కచ్చితత్వంతో పనిచేసిందని లండన్‌లోని రాయల్ బ్రాంప్టన్ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. గుండె వైఫల్యం ముప్పు ఎక్కువగా ఉండే రోగులకు ఇది బాగా ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. దీని ధర సుమారు రూ. 12 లక్షలు.