![Six Years Of Exercise In Middle Age Is Enough To Slash Risk Of Heart Failure By A Third - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/21/Exercise.jpg.webp?itok=_jE6f0zv)
లండన్ : ఆరేళ్ల పాటు నిత్యం వ్యాయామం చేస్తే గుండె వైఫల్యం ముప్పు మూడో వంతు తగ్గుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. మధ్యవయస్కుల్లో ఆరేళ్ల పాటు ఎలాంటి కదలికలు లేకుండా గడిపే వారిలో గుండె జబ్బుల ముప్పు అధికమని పేర్కొంది. 11,000 మంది పెద్దలపై జరిపిన పరిశోధనలో ఈ అంశాలను గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు.
65 సంవత్సరాలు పైబడిన వారిలో అత్యధికులు హైబీపీ, అధిక కొవ్వు, డయాబెటిస్, గుండె జబ్బుల వంటి జీవనశైలి వ్యాధుల కారణంగానే ఆస్పత్రుల్లో చేరుతున్నారని అథ్యయనానికి నేతృత్వం వహించిన జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ డుములే తెలిపారు. వారానికి 150 నిమిషాల పాటు వేగంగా నడవడం వంటి వ్యాయామాలు అవసరమని ఇలా చేస్తే గుండె వైఫల్యం 31 శాతం వరకూ తగ్గుతుందని తమ పరిశోధనలో వెల్లడైందన్నారు.
గుండె జబ్బులను నిరోధించేందుకు మధ్యవయస్కులు ఇప్పటికైనా వ్యాయామానికి నడుం బిగించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ అథ్యయన వివరాలు జర్నల్ సర్క్యులేషన్‌లో ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment