లండన్ : మెరుగైన మానసిక, శారీరక ఆరోగ్యానికి తగినంత వ్యాయామం అవసరమని, అయితే అతి వ్యాయామంతో మేలు కన్నా చేటు అధికమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వారానికి ఐదు సార్లు, రోజుకు మూడు గంటలు మించి వ్యాయామం చేసేవారి మానసిక ఆరోగ్యం వ్యాయామం అసలు చేయని వారితో పోలిస్తే మెరుగ్గా లేదని 12 లక్షల మందిపై జరిపిన పరిశోధనలో వెల్లడైంది.
యేల్ యూనివర్సిటీ, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ అథ్యయనంలో రోజుకు 45 నిమిషాలు, వారంలో ఐదు రోజులు వ్యాయామం చేస్తే మెరుగైన ఫలితాలు చేకూరుతాయని, ఇంతకన్నా ఎక్కువగా వ్యాయామం చేయడం ద్వారా ఈ ప్రయోజనాలు దరిచేరవని స్పష్టమైంది.
అతి వ్యాయామం అసాధారణ ప్రవర్తనకు దారితీస్తుందని పరిశోధకులు గుర్తించారు. అయితే తగిన మోతాదులో వ్యాయామం మెరుగైన ఫలితాలు అందిస్తుందని వారు వెల్లడించారు. నలుగిరితో కలిసి చేసే బృంద వ్యాయామంతో కుంగుబాటు, ఒత్తిడిని దూరం చేయవచ్చని మానసికి ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చని తమ పరిశోధనలో వెల్లడైందని యేల్ వర్సిటీ సైకియాట్రీ ప్రొఫెసర్ డాక్టర్ ఆడమ్ చెక్రూడ్ చెప్పారు.
రోజు విడిచి రోజు 45 నుంచి 60 నిమిషాల వరకూ వ్యాయామం చేయడం మెరుగైన మానసిక ఆరోగ్యానికి సరిపోతుందని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ సైకియాట్రీ హెడ్ ప్రొఫెసర్ స్టీఫెన్ ల్యారీ తెలిపారు. కాగా ఈ అథ్యయన వివరాలు లాన్సెట్ సైకియాట్రీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment