
ఎన్నాళ్లు బతుకుతాం? ఎపుడు చచ్చిపోతాం? ఎలాంటి జబ్బులొస్తాయి? సాధారణంగా ఇలాంటి సందేహాలు ఎపుడో ఒకపుడు అందరికీ వస్తాయి. అందులోనూ ఏ కాస్త అనారోగ్యం బారిన పడినా ఇలాంటి అనుమానాలు పట్టిపీడిస్తాయి. ఇలాంటి ప్రశ్నలు ఇప్పటిదాకా మిలియన్ డాలర్ల ప్రశ్నలు. మరిపుడు ఒక సాధారణ రక్త పరీక్ష ద్వారా, ఒక వ్యక్తికి కేన్సర్ లేదా మతిమరపు వంటి ప్రధాన వ్యాధుల ప్రమాదాన్ని అంచనా వేయవచ్చని, ఏ అవయవాలు ఎలాంటి స్థితిలో ఉన్నాయో, గుర్తించవచ్చని ఒక కొత్త అధ్యయనం కనుగొంది. రానున్న పదేళ్లలో ఎలాంటి జబ్బులు రాబోతున్నాయో కూడా తెలుస్తుందట. ఏంటి నమ్మలేకపోతున్నారా? అయితే మీరీ కథనం సాంతం చదవాల్సిందే.
యూనివర్సిటీ కాలేజ్ లండన్ (UCL) పరిశోధకులు, ప్రారంభంలో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల్లో రానున్న 20 ఏళ్లలో అవయవాలు దెబ్బతినే తీరును, 30 వేర్వేరు వ్యాధుల ప్రమాదాన్ని గుర్తించ గలిగారు కేవలం ఒక రక్తపరీక్ష ద్వారా. ఈ పరీక్ష ద్వారా నిర్దిష్ట అవయవాలకు సంబంధించిన భవిష్యత్తు సమస్యలను మాత్రమే కాకుండా, అవి శరీరంలోని మరొక భాగంలో సమస్యలను ఎలా సృష్టిస్తాయో కూడా తెలుసుకోవచ్చు
స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, హెల్సింకి యూనివర్సిటీ నిపుణులతో,యూసీఎల్ పరిశోధనా బృందం, బ్రిటిష్ వైట్‌హాల్ II అధ్యయనంలో పాల్గొన్న 45 నుంచి 69 సంవత్సరాల వయస్సు గల 6,235 మంది వ్యక్తుల రక్త ప్లాస్మా నమూనాలను సేకరించి వాటిపై పరిశోధన జరిపారు. తొమ్మిది అవయవాల (గుండె, రక్త నాళాలు, కాలేయం, రోగనిరోధక వ్యవస్థ, క్లోమం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, పేగులు మెదడు) మొత్తం శరీరానికి సంబంధించిన జీవసంబంధమైన వయస్సును నిర్ణయించడానికి పరిశోధకులు పనిచేశారు.
తాజా పరిశోధనల ప్రకారం ఒక్క రక్త పరీక్షతో మనిషిలోని అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి; ఎంత వేగంగా వాటి వయసు పెరుగుతోంది అనే విషయాలను అంచనా వేయడం ద్వారా రానున్న పదేళ్ల కాలంలో ఆ వ్యక్తి ఎలాంటి రోగాలకు గురి అవుతాడు, ఏ అవయవం దెబ్బతినడం కారణంగా మరణిస్తాడనే విషయాన్ని తెలుసుకోవచ్చు.
చదవండి: ఓవర్ ఆయిల్ వద్దన్నమోదీ : ఎవరెంత వాడాలో తెలుసా?
Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి?
ఉదాహరణకు గుండె వయసు వేగంగా పెరిగినవారిలో గుండె జబ్బుల ప్రమాదం, ఊపిరితిత్తుల వృద్ధాప్యం ఉన్న వ్యక్తులు తరువాతి కాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి (COPD) , ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడే అవకాశం ఉందని అంచనా వేసింది. అంతేకాదు ఒక మనిషికి ఈ ప్రత్యేకమైన బ్లడ్ టెస్ట్ ద్వారా, అతని శరీరంలోని గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, మెదడు, మూత్ర పిండాలు లాంటి ముఖ్యమైన భాగాల ఏజింగ్ ప్రాసెస్‌ను అంచనా వేయవచ్చు. మధ్య వయసులో మెదడు వయసు పెరుగుతున్నవారితో పోలిస్తే రోగనిరోధక వ్యవస్థ సాధారణం కంటే వేగంగా వృద్ధాప్యం చెందుతున్న వారిలో చిత్తవైకల్యం (dementia) ప్రమాదం ఎక్కువ అని కనుగొన్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు గురయ్యే వ్యక్తుల్లో ఈవ ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు.
అలాగే మూత్రపిండాల ఆరోగ్యం ఇతర అవయవాలతో ముడిపడి ఉందని కూడా గుర్తించారు. మూత్రపిండాల వృద్ధాప్యం వేగవంతం అయిన వ్యక్తులు తరువాతి కాలంలో వాస్కులర్ వ్యాధి, టైప్ 2 డయాబెటిస్ ,కాలేయ వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. దాదాపు అన్ని అవయవాల జీవసంబంధమైన వృద్ధాప్యం మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందని అంచనా వేసింది. వ్యక్తికి వయసుకు తగ్గట్టే అవయవాల వయసు ఉండాలి. కానీ జీవనశైలి, తినే ఆహారం, కాలుష్యం, శారీర శ్రమలేని కారణంగా అవయవాల వయస్సు మనిషి వయసుకు మించి శరీరంలోని అవయవాల వయస్సు త్వరగా పెరుగుతోందని తేల్చారు.
యూసీఎల్ పరిశోధన ఫలితాలు లాన్సెట్ డిజిటల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు. న్యూరోడీజెనరేటివ్ వ్యాధుల అభివృద్ధిలో శోథ ప్రక్రియలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ పరిశోధన మరింత సూచిస్తుందని యూసీఎల్ ఫ్యాకల్టీ ఆఫ్ బ్రెయిన్ సైన్సెస్ ప్రొఫెసర్ మికా కివిమాకి చెప్పారు. “మన అవయవాలు ఒక సమగ్ర వ్యవస్థగా పనిచేస్తాయి, కానీ అవి వేర్వేరు రేట్ల వద్ద వృద్ధాప్యం చెందుతాయి.ముఖ్యంగా అవయవాలలో వృద్ధాప్యం అనేక వృద్ధాప్య సంబంధిత వ్యాధులకు దోహదం చేస్తుంది, కాబట్టి అన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఒక నిర్దిష్ట అవయవం ఊహించిన దానికంటే వేగంగా వృద్ధాప్యం చెందుతుందో లేదో సులభంగా రక్త పరీక్ష ద్వారా గుర్తించవచ్చని మేం కనుగొన్నాం. రాబోయే సంవత్సరాల్లో, “ఆరోగ్య సంరక్షణ యస్సు సంబంధిత వ్యాధుల నివారణ చాలా ముందుగానే ప్రారంభమవుతుందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి రక్త పరీక్షలు అనేక వ్యాధులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.” అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment