aging
-
Ratan Tata: నేను బాగానే ఉన్నా
న్యూఢిల్లీ: దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ సంస్థ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఆరోగ్యంపై వెల్లువెత్తిన వదంతులపై ఆయనే స్వయంగా సమాధానమిచ్చారు. రక్తపోటు తగ్గడంతో సోమవారం తెల్లవారుజామున ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి రతన్ టాటా వెళ్లారు. దీంతో 86 ఏళ్ల రతన్ ఆయన ఆరోగ్యం బాగోలేదని, ఐసీయూలో చేరారని జాతీయ మీడియాలో వెంటనే కథనాలు వెలువడ్డాయి. వీటిపై ఆయన తన సామాజిక మాధ్యమం ఖాతా ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘ నా ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వృద్ధాప్యంతో తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లా. నేను బాగానే ఉన్నా. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని ఆయన స్పష్టంచేశారు. టాటా సన్స్‌కు 1991 మార్చి నుంచి 2012 డిసెంబర్ 28దాకా రతన్ చైర్మన్‌గా కొనసాగారు. 1991లో రూ.10వేల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థను మహా సామ్రాజ్యంగా విస్తరించారు. ఈయన సారథ్యంలో 2011–12 ఆర్థికసంవత్సరం నాటికే 100.09 బిలియన్ డాలర్ల రెవెన్యూ సాధించే స్థాయికి సంస్థ ఎదిగింది. టెట్లీ, కోరస్, జాగ్వార్ ల్యాండ్‌రోవర్ ఇలా భిన్నరంగాల పలు దిగ్గజ అంతర్జాతీయ సంస్థలను టేకోవర్ చేశారు. వ్యాపారాలను విస్తరించడంతో ఇప్పుడు సంస్థ ఆదాయంలో సగభాగం విదేశాల నుంచే వస్తోంది. -
‘హారిస్‌కు బైడెన్‌ను మించిన సమస్యలున్నాయ్’
వాషింగ్టన్: వృద్ధాప్యం, మతిమరుపు, తడబాటు సమస్యలతో సతమతమవుతూ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్‌తో కమలా హారిస్‌ను పోలుస్తూ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. జార్జియా రాష్ట్రంలో బుధవారం జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రచార సభలో కార్యకర్తలనుద్దేశించి ట్రంప్ మాట్లాడారు. ‘‘ఉపాధ్యక్షురాలు హారిస్‌ను చూసి ప్రపంచమే నవ్వుతోంది. ఎందుకో తెలుసా?. ఆమె అధ్యక్షురాలు కాబోయే ఛాన్సుందని తెల్సి నమ్మశక్యంకాక నవ్వుతున్నారు. ఇక ఆలోచనా శక్తి గురించి మాట్లాడితే ఈమెకు బైడెన్‌ను మించిన సమస్యలున్నాయి. అధిక ధరలు, గందరగోళ పాలనకు మనం తెరదించబోతున్నాం. కమల, అసమర్థ బైడెన్ కారణంగానే ఈ దుస్థితి దాపురించింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల కారణంగా మనకు ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్నాం’’అని అన్నారు. సొంత డబ్బా కొట్టుకున్న ట్రంప్హంగేరి ప్రధాని విక్టర్ అర్బాన్ గురించి ట్రంప్ మాట్లాడుతూ పనిలోపనిగా ట్రంప్ సొంత గొప్పలు చెప్పుకున్నారు. ‘‘విక్టర్ సమర్థవంతమైన నేత. విదేశీయులు ఎవరినీ తన దేశంలోకి రానివ్వడు. ప్రపంచంలో ఎందుకు ఇన్ని సమస్యలు?. మధ్యప్రాశ్చ్యంలో యుద్ధాలెందు జరుగుతున్నాయి. మూడో ప్రపంచయుద్ధం దిశగా రష్యా ఎందుకు పయనిస్తోందని విక్టర్‌ను అంతా అడిగితే ఆయన ఒక్కటే సులువైన పరిష్కారం చెప్పారు. ట్రంప్ దేశాధ్యక్ష పీఠంపై లేకపోవడం వల్లే. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నపుడు అంతా అతడిని చూసి భయపడ్డారు. చైనా, రష్యా.. అందరికీ భయమే. నేను అధికారంలో ఉన్నప్పుడు ఉక్రెయిన్‌లోకి రష్యా అడుగుపెట్టలేకపోయింది. నేను దిగిపోగానే ఉక్రెయిన్ గడ్డపై రష్యా దురాక్రమణ జెండా ఎగరేసింది. ఇక హారిస్ నాలుగేళ్లు అధ్యక్ష పీఠంపై కూర్చుంటే అమెరికాలో పరిశ్రమలు లేకుండా చేస్తుంది. దేశాన్ని నాశనం చేస్తుంది. అప్పుడు మన ప్రజాస్వామ్యం మనుగడలో ఉండదు. మన పని అయిపోతుంది. డెమొక్రాట్ల విధాన నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటాయి’’అని ఆరోపించారు. ఇరాన్ నుంచి హత్యాయత్నం ముప్పుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ నుంచి ప్రాణహాని పొంచి ఉందని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. నిఘా వర్గాలు ఈ మేరకు తమకు సమాచారం అందించాయని ట్రంప్ ప్రచార బృందం తాజాగా ప్రకటించింది. వివరాలను ట్రంప్ ప్రచార విభాగ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చియంగ్ వెల్లడించారు. ‘‘అమెరికాలో అస్థిరత, గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా మిమ్మల్ని హత్య చేయడానికి ఇరాన్ కుట్ర పన్నుతోందని మంగళవారం ఉదయం భేటీ సందర్భంగా ట్రంప్‌కు జాతీయ నిఘా విభాగ డైరెక్టర్ వివరించారు. నిరంతరం సమన్వయంతో హత్య కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే ట్రంప్‌ను కాపాడేందుకు అన్ని నిఘా, భద్రతా సంస్థలు పనిచేస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు, అవాంఛనీయ ఘటనలు లేకుండా స్వేచ్ఛగా దేశంలో ఎన్నికలు జరిపేందుకు సంస్థలు కృషిచేస్తున్నాయి’’అని స్టీవెన్ అన్నారు. జూలై 13న పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ పట్టణంలో సభలో ఒక ఆగంతకుడు ట్రంప్‌పైకి బుల్లెట్ల వర్షం కురిపించగా ఒక బుల్లెట్ ట్రంప్ కుడి చెవి సమీపంగా దూసుకుపోవడం, వెనక కూర్చున్న ఒక వ్యక్తి మరణించడం తెల్సిందే. వెస్ట్ పామ్‌బీచ్ క్లబ్లో గోల్ఫ్ ఆడుతున్న ట్రంప్‌ను చంపేందుకు రౌత్ అనే వ్యక్తి ప్రయత్నించడం తెల్సిందే. హారిస్ ప్రచార కార్యాలయంపై కాల్పులువాషింగ్టన్: డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ప్రచార కార్యాలయంపై దాడి జరిగింది. అరిజోనాలో ఫీనిక్స్ శివార్లలో ఉన్న కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు పెల్లెట్ గన్‌తో కిటికీలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగింది. దాంతో కార్యాలయ తలుపుకు, కిటికీలకు రంధ్రాలు పడ్డాయి. ‘‘ఆ సమయంలో కార్యాలయంలో ఎవరూ లేరు. దాంతో ఎవరికీ ఏ హానీ జరగలేదు’’అని పోలీసు లు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్యాలయంపై ఈ నెలలోనే ఇది రెండో దాడి. సెప్టెంబర్ 16న కూడా ఇలాగే పెలెట్ గన్‌తో కాల్పులు జరిగాయి. దాంతో ప్రచార కార్యాలయంతో పాటు పరిసర ప్రాంతాలకు భద్రత పెంచారు. హారిస్ శుక్రవారం అరిజోనాలో మెక్సికో సరిహద్దును సందర్శించనున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. ఈ ముప్పును తీవ్రంగా పరిగణిస్తున్నట్టు అరిజోనా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షుడు యోలాండా బెజరానో చెప్పారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఇప్పటికే రెండుసార్లు హత్యాయత్నం జరగడం తెలిసిందే. -
44లో మీదపడే..60లో ముదిమి
ముసలితనం. మనిషి జీవయాత్రలో అనివార్యమైన చివరి మజిలీ. అయినాసరే, దాని పేరు వింటేనే ఉలిక్కిపడతాం. తప్పదని తెలిసినా వృద్ధాప్యాన్ని తప్పించుకోవడానికి అనాదికాలంగా మనిషి చేయని ప్రయత్నం లేదు. ముదిమిని కనీసం వీలైనంత కాలం వాయిదా వేసేందుకు పడరాని పాట్లు పడేవాళ్లకు కొదవ లేదు! అలాంటి వాళ్లకు ఎంతగానో పనికొచ్చే సంగతొకటి వెలుగు చూసింది. మనిíÙకి వృద్ధాప్యం క్రమక్రమంగా సంక్రమించదట. జీవనకాలంలో రెండు కీలక సందర్భాల్లో ఒక్కసారిగా వచ్చి మీదపడిపోతుందట. 44వ ఏట ఒకసారి, 60వ ఏట రెండోసారి! అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ, సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ వర్సిటీ చేసిన తాజా అధ్యయనంలో ఈ మేరకు తేలి్చంది. ఆ రెండు సందర్భాల్లోనూ వృద్ధాప్య సంబంధిత మార్పులు ఒంట్లోని అణువణువులోనూ ఉన్నట్టుండి భారీగా చేటుచేసుకుంటాయని వెల్లడించింది. ఇలా చేశారు... 25 నుంచి 75 ఏళ్ల వయసున్న 108 మందిని సైంటిస్టులు తమ అధ్యయనం కోసం ఎంచుకుంటున్నారు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలవారూ నివసించే కాలిఫోరి్నయా నుంచి వీరిని ఎంపిక చేశారు. ప్రతి మూడు నుంచి ఆర్నెల్లకోసారి వారి రక్తం, మలం, చర్మం తదితర నమూనాలు సేకరించి పరిశీలించారు. మహిళల్లో 40ల అనంతరం తలెత్తే ముట్లుడిగే దశ వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుందన్న వాదన ఉంది. కనుక స్త్రీ పురుషులకు వేర్వేరు డేటాబేస్‌ను నిర్వహించారు. ఒంట్లో ఆర్ఎన్ఏ, ప్రొటీన్ల వంటి జీవాణువులు తదితరాల్లో వయసు మీద పడే తీరుతెన్నులను ఏళ్ల తరబడి నిశితంగా పరిశీలించారు. ఫలితాలు వారిని ఆశ్చర్యపరిచాయి. ఈ కీలక జీవాణువులన్నీ ఆడా, మగా తేడా లేకుండా 44వ ఏట భారీ మార్పుచేర్పులకు లోనైనట్టు గమనించారు. 60వ ఏట కూడా మళ్లీ అలాంటి మార్పులే అంతటి తీవ్రతతో చోటుచేసుకున్నాయి. ఫలితంగా స్త్రీ పురుషులిద్దరిలోనూ 55వ ఏట నుంచీ వృద్ధాప్య ఛాయలు కొట్టొచి్చనట్టు బయటికి కని్పంచడం గమనించారు. 40ల నుంచైనా మారాలి అధ్యయన ఫలితాలు తమను నిజంగా అబ్బురపరిచాయని నాన్యాంగ్ వర్సిటీ మైక్రోబయోమ్ విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ జియావో టావో షెన్ అన్నారు. ‘‘ఉదాహరణకు కెఫిన్‌ను అరిగించుకునే సామర్థ్యం 40 ఏళ్లు దాటాక ఒకసారి, 60 నిండిన మీదట మరోసారి బాగా తగ్గుతుంది. మద్యాన్ని తీసుకున్నా అంతేనని మా పరిశోధనలో తేలింది’’ అని ఆయన చెప్పుకొచ్చారు. అంతేగాక 40 దాటాక ఒంట్లో కొవ్వు పేరుకుపోవడం బాగా పెరుగుతుందని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ జెనెటిక్స్ విభాగం చీఫ్ మైకేల్ స్నైడర్ గుర్తు చేశారు. ‘‘ఆ దశలో కండరాలకు తగిలే గాయాలు ఓ పట్టాన మానవు కూడా. ఎందుకంటే ప్రొటీన్లు ఒంట్లోని కణజాలాలను పట్టి ఉంచే తీరు 44వ ఏట, 60వ ఏట చెప్పలేనంతగా మార్పులకు లోనవుతున్నట్టు తేలింది. ఫలితంగా చర్మం, కండరాలు, హృదయనాళాల వంటివాటి పనితీరు భారీ మార్పులకు లోనవుతోంది. వీటికి తోడు 60ల్లో మనుషుల్లో సాధారణంగా కండరాల క్షీణత ఒక్కసారిగా వేగం పుంజుకుంటుంది. దాంతో వారిలో హృద్రోగాలు, కిడ్నీ సమస్యలు, టైప్ 2 మధుమేహం వ్యాధుల రిస్కు ఎన్నో రెట్లు పెరుగుతోంది’’ అని వివరించారు. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి తమ అధ్యయనం కొత్త దారులు తెరుస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఈ అధ్యయన ఫలితాలను నేచర్ ఏజింగ్ జర్నల్‌లో ప్రచురించారు. మధ్యవయసు దాటాక మెల్లిమెల్లిగా ముసలితనం గుప్పెట్లోకి వెళ్తామన్నది నిజం కాదు. 40 ఏళ్లు దాటాక రెండు కీలక దశల్లో మనం ఆదమరిచి ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ముదిమి ఒక్కసారిగా వచ్చి మీదపడుతుంది’’ – జియావో టావో షెన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నాన్యాంగ్ వర్సిటీ జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటే వృద్ధాప్యాన్ని వీలైనంతగా వాయిదా వేసుకోవచ్చన్నది మా అధ్యయన ఫలితాల సారాంశం. మధ్య వయసు దాటాకైనా మద్యం మానేయాలి. లేదంటే కనీసం బాగా తగ్గించాలి. నీళ్లు బాగా తాగాలి. ముఖ్యంగా 40ల్లోకి, 60ల్లోకి ప్రవేశిస్తున్న దశలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి’’ – మైకేల్ స్నైడర్, జెనెటిక్స్ విభాగం చీఫ్, స్టాన్‌ఫర్డ్ వర్సిటీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ ఏజ్‌లోనే వృద్ధాప్యం వేగవంతం అవుతుందట! పరిశోధనలో వెల్లడి
వయసు పెరిగే కొద్ది వృద్దాప్య ఛాయలు వస్తాయని అందరికి తెలుసు. అయితే ఏ ఏజ్‌లో వృధాప్యం వేగవంతం అవుతుందనేది తెలియదు. మనం కూడా గమనించం. చూస్తుండగానే మనకే తెలియని విధంగా వృద్ధాప్యంలోకి వచ్చేస్తాం. మన శరీరంలో ఈ మార్పు ఏ నిర్ధిష్ట ఏజ్ నుంచి మొదలవుతుందనేది తెలియదు. ఆ విషయాన్నే తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంతేగాదు అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవేంటంటే..స్టాన్ఫోర్డ్ మెడిసిన్ పరిశోధకులు చేసిన అధ్యయనం ఇన్నాళ్లు వృధాప్యం అనేది కాలానుగుణంగా వచ్చేది అనే సంప్రదాయ సిద్ధాంతాన్ని వ్యతిరేకించింది. మానవ శరీర పరమాణు కూర్పు పరంగా వృద్ధాప్యం అనేది రెండు నిర్ధిష్ట వయసులలో వేగవంతమవుతుందని నిర్ధారించారు పరిశోధకులు. ఆ సమయంలోనే శరీరం విపరీతమైన మార్పులకు లోనవుతుందని అధ్యయనంలో పేర్కొన్నారు. సరిగ్గా చెప్పాలంటే భూకంపం మాదిరిగా శరీరం ఒక్కసారిగా సడెన్ మార్పులకు లోనయ్యి వేలాదిగా అణువులు, సూక్ష్మజీవులు పెరగడం, పడిపోవడం జరుగుతుంది. సరిగ్గా అప్పుడే ఆరోగ్యం వేగంగా క్షీణించడం జరుగుతుంది. అదే వృద్ధాప్యం వేగవంతమవుతుందనడానికి సంకేతమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. చెప్పాలంటే సరిగ్గా 44, 60 ఏళ్ల వయసులలో శరీరం వేగవంతమైన మార్పులకు లోనవ్వుతుందని వెల్లడించారు. అందుకోసం తాము 25 నుంచి 75 ఏళ్ల వయసు వారిపై పరిశోధనలు చేయగా వారిలో ఉండే విభిన్న అణువులు, సూక్ష్మజీవులు, చర్మంపై ఉండే బ్యాక్టీరియా, వైరస్లు, శిలింధ్రాలను నిశితంగా గమనించారు. వాటి వృద్ధి కాలక్రమేణ మారదని, నిర్ధిష్ట వయసు 40, 60 ఏజ్‌లలో వేగవంతమైన మార్పులకు లేదా ఆకస్మిక మార్పులకు లోనవ్వడాన్ని అధ్యయనంలో గుర్తించారు.ఈ పెద్ద మార్పులే ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పారు. అంతేగాదు తమ అధ్యయనంలో ఈ రెండు నిర్ధిష్ల వయసుల్లోనే శరీరం గణనీయమైన మార్పులకు లోనవ్వుతుందని నిర్థారించారు. ముఖ్యంగా రోగనిరోధక పనితీరు బలహీనమవ్వడం 60వ దశకం నుంచి ప్రారంభమవుతుందని అన్నారు. ఈ పరిశోధన పుట్టుక, మరణంలానే వృద్ధాప్యం అనేది సర్వసాదారణమే అని చెబుతున్నప్పటికీ..ఏఏ ఏజ్‌లో ఈ వృధ్ధాప్యం ప్రారంభమవుతుందనేది తెలియజేసిందన్నారు. పైగా ఈ పరిశోధన భవిష్యత్తులో వయసు సంబంధిత ఆరోగ్య సమస్యల గురించి సరైన అవగాహన ఇస్తుందని నమ్మకంగా చెప్పారు. (చదవండి: బాలీవుడ్ నటి అనుష్క శర్మ మోనోట్రోఫిక్ డైట్: నిపుణులు ఏమంటున్నారంటే..!) -
హజ్ యాత్ర మృతుల్లో... 98 మంది భారతీయులు
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలోని మక్కాకు హజ్ యాత్రకు వెళ్లిన భారతీయుల్లో 98 మంది చనిపోయినట్లు విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది. గత ఏడాది హజ్ యాత్ర సమయంలో మొత్తం 187 మంది భారతీయులు చనిపోయినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్«దీర్ జైశ్వాల్ వివరించారు. ‘ఈ ఏడాది మే 9 నుంచి జూలై 22వ తేదీ వరకు జరగాల్సిన హజ్ యాత్రలో 1.75 లక్షల మందికి గాను ఇప్పటి వరకు 98 మరణాలు నమోదయ్యాయి. ఈ మరణాలన్నీ దీర్ఘకాలిక అనారోగ్యం, వృద్ధాప్యం వంటి సహజ కారణాలతో సంభవించినవే. అరాఫత్ రోజున ఆరుగురు మరణించారు. ప్రమాదాల్లో మరో నలుగురు చనిపోయారు’’ అని జైస్వాల్ మీడియాకు వివరించారు. -
మహిళల్లో వృద్ధాప్యం త్వరగా రావడానికి కారణం ఇదే!
మహిళలకు మాతృత్వం అపురూపమైనది. చాలామంది అమ్మ నవ్వడం ఓ వరంలా భావిస్తారు. పిల్లలను కనడమే ఆడజన్మకు సార్థకత అని భావించేవాళ్లు ఉన్నారు. కానీ అమ్మగా ఓ స్త్రీ ఎప్పుడైతే మారుతుందో.. ఇక ప్రతి నిమిషం పిల్లల కోసమే వెచ్చిస్తుంది. తన గురించి ఆలోచించడమే మానేస్తుంది. అంతటి త్యాగమూర్తి స్త్రీ. అలాంటి మహిళలు మగవారికంటే తొందరగా వృద్ధాప్య ఛాయలు వచ్చి ముసిలి వాళ్లు అయిపోతుండటం జరుగుతుంది. అందుకు కారణం ఏంటో తాజా అధ్యాయనంలో వెల్లడించారు శాస్త్రవేత్తలు. దీనికి అదే కారణమంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో మెయిల్‌మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు మహిళల్లో వృద్ధాప్య ప్రక్రియ వేగవంతమవ్వడానికి గల కారణాలపై అధ్యయనం చేశారు. అందుకోసం సుమారు వెయ్యిమందికి పైగా మహిళలపై పరిశోధన చేశారు. వాళ్లలో పునరుత్పత్తి తర్వాత వస్తున్న డీఎన్ఏ మార్పులపై క్షణ్ణంగా అధ్య యనం నిర్వహించగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకోసం శాస్త్రవేత్తలు ఆరు విభిన్నమైన "ఎపిజెనెటిక్ క్లాక్‌లు" లేదా డీఎన్ఏ మిథైలేషన్ నమునా ప్రక్రియలతో మహిళల జీవసంబంధమైన వయసును లెక్కించారు. ఆరేళ్ల సుదీర్ఘ పరిశోధనల్లో.. ఇలా అధ్యయనంలో పాల్గొన్న 825 మంది ఫలితాలు ప్రకారం..ప్రతి గర్భం స్త్రీకి రెండు నుంచి మూడు నెలలు బయోలాజికల్ వృద్ధాప్యంతో ముడి ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆరేళ్లుగా మహిళల్లో వస్తున్న మార్పులను అధ్యయనం చేయగా..గర్భవతుల జీవసంబంధమైన వృద్ధాప్యంలో ఎక్కువ పెరుగుదలను గుర్తించారు. ఈ అంశంపై కొలంబియా ఏజింగ్ సెంటర్లో అసోసియేట్ రీసెర్చ్ సైంటిస్ట్‌లు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. గర్భధారణ జీవసంబంధమైన వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుందని.. ఈ ప్రభావాలు అధిక సంతానోత్పత్తి కలిగిన యువ స్త్రీలలో స్పష్టంగా కనిపిస్తాయని వెల్లడించారు. అంతేగాదు ఎక్కువ గర్భాలు లేదా పిల్లలను కన్న మహిళల్లో జీవసంబంధమైన వృద్ధాప్యంలో ఎక్కువ పెరుగుదల కనిపించిదని అన్నారు. అందువల్లే గతంలో గర్భవతిగా ఉన్న స్త్రీలు బిడ్డను మోయని వారికంటే పెద్దవారిగా కనిపిస్తారని చెప్పారు. కొందరికి ధూమపానం అలవాట్లు, ఆర్థిక పరిస్థితి కారణంగా సరైన పోషాకాలతో కూడిన ఆహారం తీసుకోలేని మహిళలపై పరిశోధనలు చేయగా వారిలో జీవసంబంధమైన వృద్ధాప్యం మరింత వేగవంతంగా ఉందన్నారు. ముఖ్యంగా తండ్రులుగా ఉన్న పురుషుల్లో ఈ ప్రభావ లేదని అన్నారు. దీని ప్రభావం కేవలం గర్భం లేదా పాలిచ్చే తల్లుల్లో కనిపిస్తుందని అన్నారు. ఇక్కడ ప్రతి స్త్రీ గర్భం సంఖ్య కూడా వారిలో జీవసంబంధమైన మార్పులు తీసుకువస్తుందని అధ్యయనంలో తేలింది. ఇవే వృద్ధాప్యంపై ప్రభావం చూపిస్తాయని తెలిపారు. అయితే కౌమారదశలోని గర్భం దాల్చినవారిపై ఈ ప్రభావాలు మరింత ఎక్కువగా ఉంటాయన్నారు. అందుకు ఆరోగ్య సంరక్షణ, సరైన వనరులు లేకపోవడం తదితరాలు కూడా ఈ ప్రభావానికి కారణమవుతాయని అన్నారు శాస్త్రవేత్తలు. అయితే ఇక్కడ మహిళల్లో వేగంగా వచ్చే ఈ వృద్ధాప్యం వారి ఆరోగ్యంపై ప్రభావం చూపి మరణానికి కారణమవుతోందా? లేదా? అన్నది తెలియాల్సి ఉందన్నారు. ఇక్కడ తల్లుల సంరక్షణ అనేది ప్రధానమైనది అనేది ఈ అధ్యయనం పేర్కొంది. కొత్త తల్లులకు మంచి పోషకాలతో కూడిన ఆహారం, హెల్తీగా ఉండేలా తగిన వైద్యం ప్రాముఖ్యతలను తెలియజేస్తోంది ఈ పరిశోధన. అంతేగాఉ ముఖ్యంగా గర్భధారణ సమయంలో సరైన ఫుడ్, డైట్, మానసికంగా హెల్తీగా ఉంటే ఈ వృధ్యాప్య ఛాలయలను అధిగమించొచ్చని చెబుతున్నారు. ఈ పరిశోధన ఫలితాలు 'ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్'లో ప్రచురితమయ్యింది. (చదవండి: మగవారికి మెనోపాజ్ వస్తుందా?..వైద్యులు ఏమంటున్నారంటే..!) -
ఇలా చేస్తే చర్మం నిత్య యవ్వనంగా ఉంటుంది!
చర్మం ఎప్పటికి కాంతిమంతంగా ఉండాలంటే మన ఇంట్లో మనం నిత్యం ఉపయోగించవాటితో ఈజీగా పొందొచ్చు. ముఖ్యంగా కాల్షియం కోసం తాగే పాలతో ముఖాన్ని నిత్య యవ్వనంగా ఉండేలా చేసుకోవచ్చు. అంతేగాదు వార్థప్యపు లక్షణాలకు కూడా చెక్‌పెట్టొచ్చు. పాలతో చర్మ సౌందర్యం పెంచుకునే సింపుల్ చిట్కాలేంటంటే.. పాలతో చర్మ సౌందర్యం చర్మం కాంతిమంతంగా మెరవాలంటే క్రీమ్‌లు లోషన్లకు బదులు ఇంట్లో ఉండే పాలతో ప్రయత్నించి చూడండి. పచ్చి పాలలో దూదిని ముంచి మెడ, గొంతు, ముఖాన్ని తుడిస్తే చర్మం మీద పట్టేసిన మురికి (సబ్బుతో శుభ్రం చేసినప్పటికీ వదలని మురికి) వదిలిపోతుంది. రెండు టీ స్పూన్ల పచ్చిపాలలో టీ స్పూన్ శనగపిండి, రెండు చుక్కల తేనె కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కొద్దిగా నీటిని చల్లి వలయాకారంగా మసాజ్ చేస్తూ శుభ్రం చేయాలి. ముఖం మీద సన్నని గీతలతో చిన్న వయసులోనే వార్థక్యపు లక్షణాలు కనిపిస్తుంటే రోజూ మిల్క్ ప్యాక్ వేయాలి. ముఖాన్ని సబ్బుతో శుభ్రం చేసిన తర్వాత పచ్చి పాలలో దూదిని ముంచి ముఖం మీద అద్దాలి. పాలు ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేసి పెసరపిండి ప్యాక్ వేయాలి. రెండు టీ స్పూన్ల పెసర పిండిలో రెండుచుక్కల తేనె వేసి తగినంత నీటితో కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే చర్మం నిత్య యవ్వనంతో ఉంటుంది. వార్థక్య లక్షణాలు దూరమవుతాయి. (చదవండి: గ్రీన్ టీ మంచిదని తాగేస్తున్నారా? దానివల్ల ఎదురయ్యే సమస్యలివే..!) -
ఆయుష్షు పెంచే డ్రగ్ ట్రయల్!..ఏకంగా వెయ్యి కుక్కలపై..
ఆయుర్దాయం పెంచడం ఎలా అనేదాని గురించి శాస్త్రవేత్తలు ఎన్నేళ్లుగానో పరిశోధనలు చేస్తున్నారు. అందులో భాగంగానే పెంపుడు జంతువుల ఆయువుని పెంచే సరికొత్త పిల్‌ని ఆవిష్కరించారు యూఎస్ శాస్త్రవేత్తలు. ఈ డ్రగ్ విజయవంతంగా పనిచేస్తుందా? లేదా? అనే దాని గురించి యూఎస్‌లోని సుమారు వెయ్యి కుక్కలపై ట్రయల్స్ నిర్వహించనున్నారు. అయితే పెద్ద జాతి కుక్కలపై డ్రగ్ సత్ఫలితాలు ఇవ్వడంతో చిన్న జాతి కుక్కలపై ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఇది విజయవంతమైతే పెంపుడు జంతువుల దీర్ఘాయువుని పెంచడమే గాక మానువుల ఆయుర్దాయన్ని పెంచగలిగే సరికొత్త ఆశను రేకెత్తిస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. వివరాల్లోకెళ్తే..యూఎస్‌కి చెందిన మాట్ కేబర్లీన్ శాస్త్రవేత్తల బృందం ఈ ప్రతిష్టాత్మకమైన పరిశోధనకు నాయకత్వం వహిస్తుంది.'ది డాగ్ ఏజింగ్ ప్రాజెక్ట్' పేరుతో ఈ పరిశోదన చేస్తున్నారు. అందుకోసం ముందుగా యూఎస్ అంతటా ఉన్న పెద్ద జాతి పెంపుడు కుక్కల యజమానులు ఈ పరిశోధనలో నమోదు చేయించుకున్నారు. ఈ పరిశోధనలో పాల్గొనే కుక్కుల వైద్య చరిత్రను వివరణాత్మకంగా విశ్లేషించింది పరిశోధక బృందం. ఆ తర్వాత ఆ కుక్కల నుంచి వెంట్రుకలు, బ్లండ్ శాంపుల్స్, మూత్ర నమునాల వంటి వాటన్నింటిని సేకరంచారు. ఇక యాంటీ ఏజింగ్ పిల్‌ని ఇస్తూ..ఆయా కుక్కల వృధాప్య లక్షణాలను ట్రాక్ చేయడం ప్రారంభించారు. తొలుత శాస్త్రవేత్తలు పెద్ద జాతి కుక్కలపై అధ్యయనం నిర్వహించేలా లాయ్-001-పిల్(LOY-001)ని తీసుకొచ్చారు. ఇది ఐజీఎఫ్-1(IGF-1) స్థాయిలను ప్రేరేపిస్తుంది. అంటే ఆయవును పెంచే దిశగా కణాల పెరుగుదలను ప్రేరిపించే హార్మోన్ ఇది. ఈ పిల్ ఐజీఎఫ్-1 ఓవర్ ఎక్స్‌ప్రెషన్‌కి నిరోధించి కుక్క జీవిత కాలాన్ని పొడిగిస్తుంది. ఈ పిల్కి సెంటర్ ఫర్ వెటర్నరీ మెడిసిన్‌కి సంబంధించిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) ఆమోదం కూడా లభించడం విశేషం. ఇక ఈ పిల్‌ని జంతు ఆరోగ్య బయోటెక్ కంపెనీ లాయల్ అభివృద్ధి చేసింది. ఈ ఔషధం కుక్కలలోని వృధాప్య సంబంధ రుగ్మతలను తగ్గించి జీవితకాలాన్ని పొడిగిస్తుంది. దీన్ని చాలామంది కుక్కల యజమానులు స్వాగతించారు. ఇక డాగ్ ప్రేమికురాలు, బీఫ్ సిరీస్ సృష్టికర్త లీ సంగ్ జిన్ కూడా ఇలా ఎఫ్‌డీఏ తొలిసారిగా యాంటీ ఏజింగ్‌కి సంబంధించిన ఔషధాన్ని ఆమోదించడాన్ని స్వాగతించారు. ఇది చాలా మంచి విషయం, తొందరగా ఫాస్ట్ ట్రాక్ చేసి కుక్కల ఆయువును పెంచేయండి అని పిలుపునిచ్చారు. మరి పెద్దకుక్కల కోసం పిల్‌ని తెచ్చారు మరీ చిన్న జాతి కుక్కలు సంగతేంటీ అన్ని ప్రశ్నించారు లీ. అందుకు ప్రతిస్పందనగా లాయల్ కంపెనీ లాయ్-002 అనే పిల్‌ని పరీక్షించనున్నట్లు ఫిబ్రవరిని 1న ప్రకటించింది. ఇది చిన్నవి మినహ సీనియర్ కుక్కల జీవితకాలం పొడిగించేందుకు రూపొందించబడిన జీవితకాల మాత్ర. దీన్ని స్టడీ(study) అనే పేరుతో చిన్న జాతిలోని పెద్ద వయసు కుక్కలపై ట్రయల్స్ నిర్వహిస్తున్నారు పరిశోధకులు. అందులో భాగంగా తొలి మోతాదు బూ అనే 11 ఏళ్ల విప్పేట్ తీసుకున్నట్లు యజమాని డెబ్ హన్నా పేర్కొన్నారు. ఇది పెద్ద వయసుగల శక్తిమంతమైన కుక్క కావడంతో పరిశోధనలో చేర్చుకోవడమేగాక మొదటి డోసు దీనికే ఇచ్చారని వెల్లడించారు యజమాని హన్నా. ఈ పరిశోధన యూఎస్ అంతటా ఉన్న 55 వెటర్నరీ క్లినిక్‌లో నిర్వహిచనున్నట్లు తెలిపారు శాస్త్రవేత్తలు. వివిధ జాతులు, వయస్సులు, ఆరోగ్యం డేటా వారిగా సుమారు వెయ్యి కుక్కలపై ఈ ట్రయల్స్‌ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అందుకోసం ఆయా యజమానులు తప్పనసరిగా ముందుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ పరిశోధనలో తమ కుక్కలు భాగం కావాలంటే ..నమోదు సమయంలో వాటి వయసు పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ, బరువు 6.4 కేజీలు ఉండాలి. అలాగే ఆయాయజమానులు తమ కుక్కలు నాలుగేళ్ల వరకు ఈ పరిశోధనలో పాల్గొనాలి అనే నిబంధనకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. ఈ పరిశోధన విజయవంతమైతే కుక్కల ఆయుష్షు పెరగడమే గాక మనుషుల దీర్ఘాయువుకు మార్గం సుగమం చేస్తుంది. కుక్కలు మానవులుకు అద్భుత నమునాలుగా పనిచేస్తాయి.కాబట్టి కుక్కల కోసం రూపొందించిన యాంటీ ఏజింగ్ డ్రగ్ పురోగతి మానవులకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. (చదవండి: పూనం పాండే కన్నుమూత: సర్వైకల్ కేన్సర్.. మహిళలకు ఓ శాపం!) -
గంపెడు సంతానం దీర్ఘాయుష్షుకు గ్యారెంటీ కాదు!
ఎక్కువ సంతానం ఉంటే అంత దీర్ఘాయువు ఉంటుందని విశ్వసించేవారు మన పెద్దవాళ్లు. కానీ అది వాస్తవం కాదని శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. త్వరితగతిన పునరుత్పత్తిని ప్రోత్సహించే జన్యువులు మనిషి ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు. ఈ పరిశోధన మనిషి వృధాప్య రహస్యాన్ని అర్థం చేసుకునే మార్గాన్ని సుగమం చేసిందన్నారు. ఇక్కడ పునరుత్పత్తిని ప్రోత్సహించే జన్యువులు మనిషి జీవితకాలంపై ఎలా బలంగా ప్రభావం చూపిస్తున్నాయో అనేదాని గురించి చాలా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పునురుత్పత్తి మనిషి జీవితకాలం తగ్గిపోవడానికి లింకప్ చేయబడి ఉంటుందన్న సరికొత్త విషయాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. త్వరితగతిన పిల్లలను కనడాన్ని ప్రోత్సహించే జన్యువులు తక్కువ జీవిత కాలన్ని సూచిస్తాయని అన్నారు. ఈ మేరకు మిచిగాన్ విశ్వవిద్యాలయం నేతృత్వంలో శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో తొందరగా తల్లిదండ్రులుగా మారిన వారి జీవితకాలం సుమారు 76 ఏళ్ల వరకే ఉంటున్నట్లు వారి సంభావ్యత జన్యువుల సంబంధం ఆధారంగా నిర్థారించారు. ఈ ఆవిష్కరణ వృధాప్య రహస్యన్ని చేధించే పరిశోధనను సులభతరం చేస్తోందన్నారు శాస్త్రవేత్తలు. అలాగే ఈ సృష్టి మానవుడికి ఇచ్చే జీవిత దశలు చాలా ఆశ్చర్యకరంగానూ, సంక్లిష్టంగానూ ఉంటాయన్నారు. ఈ అధ్యయనంలో దాదాపు 2 లక్షల మంది పైగా వ్యక్తులు పాల్గోన్నారు. వారందరి జన్యువులు, పునరుత్పత్తి, వారి జీవిత కాలాన్ని సేకరించి ఆ డేటా ఆధారంగా ఈ కొత్త విషయాన్ని కనుగొన్నామని అన్నారు. జీవశాస్త్రవేత్త జియాంజీ జాంగ్ మనషి జీవిత కాలన్ని జన్యుపరంగా పునురుత్పత్తి చాలా బలంగా పరస్పర సంబంధం కలిగి ఉందన్నారు. అంటే ఇక్కడ పునరుత్పత్తిని ప్రోత్సహించే జన్యు పరివర్తనలే జీవితకాలాన్ని తగ్గిస్తాయి. ఇది కాస్త హాస్యస్పదంగా అనిపిస్తున్నా కాస్త నిశితంగా గమనిస్తే గర్భ నిరోధకం, గర్భస్రావం, తదితరాల ఆరోగ్య సంరక్షణపై ప్రభావం చూపుతాయన్నది వాస్తవం. కాబట్టి పునరుత్పత్తి అనేది మనిషి ఆయుర్దాయంపై ప్రభావం చూపుతుందన్నది పరిశోధకులు వాదన. అదే సమయంలో ఇక్కడ జన్యు సంసిద్ధత తోపాటు కొంత పర్యావరణ కారకాలు కూడా మనిషి జీవితకాలం తగ్గిపోయేందుకు కారణమని చెబుతున్నారు. ఇక్కడ పునురుత్పత్తి, జీవితకాలం మద్య జరగుతున్న జన్యు ఉత్ఫరివర్తనాలకు సంబంధించిన సంక్లిష్ట చర్యను అర్థం చేసుకుంటే వృద్ధాప్య రహస్యాన్ని సులభంగా చేధించగలమని అన్నారు. ఈ అధ్యయనాలు వృధాప్యం(వయసు) అనేది సహజ ప్రక్రియ అని, అది పునరుత్పత్తి అనే అంశంపైనే బలంగా ఆధారపడి ఉందని చెబుతున్నాయన్నారు. ఎందుకంటే? మన ఫిట్నెస్ అనేది పునురుత్పత్తి ఆధారంగానే సెట్ చేసి ఉంటుంది. అందువల్ల పునరుత్పత్తి ప్రక్రియ పూర్తవ్వడం పైనే లైఫ్ స్పాన్ నిర్ణయించబడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. (చదవండి: కలవరపెడుతున్న 'జాంబీ డీర్ వ్యాధి'! మనుషులకు కూడా వస్తుందా?) -
పగటి పూటా ఓ కునుకేయండి
సాక్షి, అమరావతి: చక్కటి నిద్ర దివ్యౌషధంగా పని చేస్తుంది. అందులోనూ పగటిపూట తీసే చిన్నపాటి కునుకు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రోజూ మధ్యాహ్నం 15–30 నిమిషాలు రెప్పవాల్చితే చిత్తవైకల్య ప్రమాదం తగ్గడంతో పాటు వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరవని తాజా అధ్యయనంలో వెల్లడైంది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే పగటిపూట నిద్రించే వారిలో 2.6–7 సంవత్సరాల వరకు వృద్ధాప్యం నెమ్మదిస్తుంది. యూనివర్సిటీ కాలేజ్ లండన్, ఉరుగ్వేలోని యూనివర్సిటీ ఆఫ్ రిపబ్లిక్ పరిశోధకులు క్రమం తప్పకుండా పగటిపూట నిద్రపోవడం వల్ల మెదడు కుచించుకుపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుందని.. చురుకుదనాన్ని ప్రేరేపిస్తుందని తేల్చారు. ఫలితంగా జ్ఞాన సామర్థ్యం, జ్ఞాపక శక్తి పెరుగుతాయని గుర్తించారు. అయితే.. పగటిపూట 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి చేటని సూచిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి 7 గంటల నిద్ర సంపూర్ణ ఆరోగ్యానికి సుమారు 7 గంటల మంచి నిద్రను శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ప్రతిపాదిస్తున్నారు. ఇందుకు విరుద్ధంగా భారత్‌లోని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో నిద్ర లేమితో బాధపడుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నిద్ర లేకపోవడం వల్ల కలిగే సమస్య కేవలం అలసట ఒక్కటే కాదని.. తీవ్ర దీర్ఘకాలిక అనారోగ్యానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట కలతలేని నిద్రతో అలసట, తలనొప్పి, మూడ్ స్వింగ్స్ నియంత్రణలో ఉండి మానసిక ఉత్సాహంతో పని చేస్తారని చెబుతున్నారు. అయితే.. తక్కువ నిద్రపోయే వారిలో అల్జీమర్స్ వచ్చే అవకాశం 40 శాతం ఎక్కువని అధ్యయనం వెల్లడించింది. అతి నిద్ర ప్రమాదకరం తక్కువ నిద్రతోనే కాదు.. అతి నిద్రతోనూ ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. రోజంతా అదే పనిగా నిద్రపోతే అధిక రక్తపోటు, స్ట్రోక్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేల్చారు. అతి నిద్ర అంతర్లీన నిద్ర రుగ్మతకు సంకేతమని భావిస్తున్నారు. ఈ రుగ్మతతో ఒత్తిడి, బరువును నియంత్రించే హార్మోన్లపై ప్రభావం చూపుతుందని తేల్చారు. ఫలితంగా చిన్న వయసులోనే ఊబకాయం, బీపీ, టైప్–2 డయాబెటిస్, గుండె జబ్బులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్క్రీనింగ్ సమయంతోనే ముప్పు స్క్రీనింగ్ సమయం నిద్రలేమి స్థాయిని పెంచుతుందని అధ్యయనం చెబుతోంది. నిద్రలేమితో బాధపడే వారిలో దాదాపు 54 మంది డిజిటల్, సోషల్ మీడియాను విరివిగా వినియోగిస్తున్నట్టు గుర్తించింది. దాదాపు 87 శాతం మంది భారతీయులు పడుకునే ముందు తమ ఫోన్లను ఉపయోగిస్తుండటంతో తీవ్రమైన నిద్ర సమస్యకు దారితీస్తుందని పేర్కొంది. ఫలితంగా 56 శాతం మంది పురుషులతో పోలిస్తే 67 శాతం మంది మహిళలు పని సమయంలో నిద్రపోతున్నారని వెల్లడించింది. వీలైనంత వరకు మధ్యాహ్నం 2 గంటలలోపు కెఫిన్ ఉండే పదార్థాలను తగ్గించాలని.. మద్యం తాగి నిద్రపోవడం/నిద్రపోయే మూడు గంటల ముందు మద్యం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చేటని సూచిస్తున్నారు. ముఖ్యంగా నిద్రవేళకు దగ్గర సమయంలో వ్యాయామం చేయడం కూడా నిద్రలేమికి కారణంగా భావిస్తున్నారు. -
మనసుకి వ్యాయామం
శరీరానికి సంబంధించి ఆహారంతో పాటు వ్యాయామం గురించి చాలామంది చెప్పటం, ఎంతోమంది అనుసరించటం గమనించవచ్చు. కాని, మనస్సు గురించి కొద్దిమంది వైద్యులు చెప్పినా పట్టించుకున్నవారి సంఖ్య అత్యల్పం. మనోవ్యాపారం జరిగేది మెదడులో. దానిని వాడక మూలన పడేస్తే అది మొద్దుబారిపోతుంది. అందుకే చాలామందికి మతిమరుపు వస్తూ ఉంటుంది. వయసు పైబడితే అది సహజం అనుకుంటారు. శరీరం చక్కగా ఉండాలని మందులు, అలంకారాలు చేసుకున్నప్పుడు మెదడుకి కూడా చేయాలని మర్చిపోతూ ఉంటారు. పైగా ఇంత వయసు వచ్చాక పరీక్షలు రాయాలా? ఉద్యోగాలు చేయాలా? ఊళ్లేలా? అని అడుగుతూ ఉంటారు. నిజమే కాని తన విషయాలు తనకి గుర్తు ఉండాలి కదా! ముందు వస్తువులు, మనుషుల పేర్లు మొదలైనవి మర్చిపోవటంతో మొదలై కొంతకాలానికి అవయవాలు కూడా తమ పని చేయటం మర్చిపోయే ప్రమాదం ఉన్నదట!ఆయువు ఉన్నంత కాలం ఒకరి మీద ఆధార పడకుండా తెలివితో ఉండటం ఎవరైనా కోరుకోవలసినదే! దీనికి చేయ వలసిన దల్లా మెదడుకి పని చెప్పి చేయిస్తూ ఉండటమే. ముందు నుండి ఆవిధంగా ఉంటే వృద్ధాప్యంలో మతిమరపు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని మానసిక వైద్యనిపుణులు చెప్పిన మాట. అప్పుడు మానవ జన్మ అనే అద్భుతమైన అవకాశాన్ని పూర్తిగా అనుభవించినట్టు అవుతుంది. దానికోసం కొన్ని మానసిక వ్యాయామాలు సహకరిస్తాయని చెప్పారు. మనస్తత్వ శాస్త్రవేత్తలు సూచించిన వాటిలో కొన్ని చూద్దాం. చదవటం, రాయటం, మాట్లాడటం, ఆలోచించటం, సమస్యలని పరిష్కరించటం మొదలైనవి. వీటి అన్నిటికీ మెదడుని ఉపయోగించక తప్పదు. 40 సంవత్సరాల తరువాత మెదడులో ఉన్న కణాలు పెరగవు. 60 సంవత్సరాల తరువాత తగ్గటం మొదలవుతుంది. కనుక క్రమంగా జ్ఞాపకశక్తి క్షీణిస్తూ ఉంటుంది. కాని చదవటం, రాయటం వంటివి చేసే వారికి పెరగక పోయినా తరగవు. ఉపాధ్యాయులకి జ్ఞాపకశక్తి ఎక్కువ ఉండటానికి కారణం వారు చదువుతూ, రాస్తూ, మాట్లాడుతూ ఉండటమే. అందరికీ ఆ అవకాశం ఉండదు కదా! అందుకని చిన్నపిల్లల దగ్గర కూర్చుని చదివించ వచ్చు. వారికి కథలు చెప్ప వచ్చు. అసలు మాట్లాడటమే చాలు. బుర్రకి కావలసినంత పని. çపద వినోదాలు పూర్తి చేయటం, చదరంగం ఆడటం వంటి వాటిని చేయచ్చు. ఇప్పుడైతే అవన్నీ ఉన్నాయి. మరి, పూర్వం ఏం చేసేవారు? పొడుపు కథలు, చిక్కుప్రశ్నలు, జంటపదాల ఆట, వైకుంఠపాళీ, పులి – జూదం, పచ్చీసు, వామన గుంటలు, వైకుంఠపాళీ వంటి కాలక్షేపాలు, వినోదాలు ఉండేవి. ఇవన్నీ మెదడుకి చురుకుతనం కలిగించేవే. పెద్ద ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కనుక ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవారు. కొంతకాలం మాట్లాడకుండా ఉంటే, మాట్లాడటానికి కొంచెం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అందుకే వృద్ధులని,ఏదయినా కారణంతో జ్ఞాపకశక్తిని కోల్పోయిన వారిని తరచూ పలకరిస్తూ ఉండమని వాళ్ళని మాట్లాడేట్టు చేయమని వైద్యులు చెపుతారు. ఆనాటి వారు తమ కుటుంబ సమస్యలను తామే పరిష్కరించుకునే వారు. ఎవరి సమస్య అయినా అందరు పరిష్కరించటానికి కుస్తీ పట్టే వారు. ఇప్పుడు అందరికీ ఆలోచించటానికి బద్ధకం. కళ్ళు, చెవులు అప్పగించి కూర్చొనే అలవాటు ఎక్కువయింది. ఈనాడు ఎక్కడ పడితే అక్కడ కౌన్సిలింగ్ కేంద్రాలు తయారవటానికి కారణం మెదడుని పని చేయించకపోవటమే. శరీరం లాగానే మనస్సుకి కూడా సోమరితనం అలవాటు అయిపోయింది. నాకు ఏదైనా సమస్య వస్తే ఎవరో పరిష్కారం చూపించాలి, నా మెదడుని నేను కష్టపెట్టను అన్నది అలవాటు అయితే స్థబ్ధుగా తయారవుతారు. మెదడు తుప్పు పడుతుంది. తస్మాత్ జాగ్రత!! డా‘‘ ఎన్ అనంత లక్ష్మి -
ఏడాదికి రూ.16 కోట్లు, నో గర్ల్ ఫ్రెండ్, నో సెక్స్: టెక్ మిలియనీర్ సీక్రెట్
Slow Down the Ageing Process: టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనే లక్ష్యంతో ఒక్కో అవయవాన్ని యవ్వనత్వంతో నింపుకుంటున్న బ్రయాన్ జాన్సన్ తాజాగా తన సక్సెస్ సీక్రెట్‌ను పంచుకున్నాడు. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేసే ప్రయత్నంలో ప్రతీరోజూ కఠినమైన వ్యాయామంతోపాటు చాలా డబ్బు ఖర్చు చేస్తున్నట్టు కాలిఫోర్నియాకు చెందిన ఐటీ డెవలపర్ బ్రయాన్ జాన్సన్ తెలిపాడు. ప్రస్తుతం తనకు 18 ఏళ్ల యువకుడికి ఉండే ఊపిరి తిత్తులు, 37 ఏళ్లవయసునాటి గుండె ఉన్నాయని జాన్సన్ మరోసారి గుర్తు చేశాడు. (గోల్డ్ హిస్టరీ: అతిపెద్ద పతనం తులం ధర రూ.63.25 లే!) యవ్వనంగా ఉండాలనే తపనతో చేసే వ్యాయామం మాత్రమే సరిపోవడంలేదని ఇందుకోసం ఏడాదికి ఏకంగా సుమారు 16.4 కోట్లు(2 మిలియన్ల డాలర్లు) ఖర్చు చేస్తున్నట్టు తెలిపాడు. అయినా చెప్పుకోదగ్గ ప్రయోజనం లేదు. అందుకే మరింత యవ్వనంగా ఉండేందుకు రోజూ 110 మాత్రలు వేసుకుంటున్నట్లు తెలిపాడు. అలాగే ఎప్పుడూ ఒకే సమయంలో నిద్రపోతా. ఉదయం 11 గంటల తర్వాత ఏమీ తినను.. నో సెక్స్.. కనీసం గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు అంటూ ఆశ్చర్యకరమైన విషయాలను తెలిపాడు. ఉదయం 3 ఔన్సుల వైన్ తీసుకోవడం ప్రయోజనకరమని స్పష్టం చేశాడు. ఆహారంలో భాగంగా 100కి పైగా మాత్రలు తీసుకుంటా.. అదీ అశ్వగంధ, పసుపు, వెల్లుల్లి, అకార్బోస్ లాంటి ఆయుర్వేద మందులు మాత్రమే. దీంతో పాటు హార్మోన్లు, ఇతర పదార్ధాల సమ్మిళితమైన గ్లూకోసమైన్ సల్ఫేట్ తీసుకుంటానని, ఇవే సుదీర్ఘ జీవితానికి రహస్యమని పేర్కొన్నాడు. అత్యంత రెజిమెంటెడ్ షెడ్యూల్, కఠిన ఆహార నియమాలు వ్యాయామంతో పాటుగా నెలవారీ ప్రాతిపదికన అనేక రకాల వైద్య ఆపరేషన్లు తప్పవని వెల్లడించాడు. 30 నిమిషాల పాటు వ్యాయామం అదీ కూడా 30 మంది వైద్యుల సిబ్బంది పర్యవేక్షణలో 20,000 సిట్-అప్‌లకు సమానమైన ఎక్స్‌ర్‌సైజ్ చేస్తాడట. ఇందుకోసం ప్రత్యేకమైన పరికరాలను కూడా ఏర్పాటు చేసుకున్నానన్నాడు. (IT refund scam: తెలుసుకోండి: లేదంటే కొంప కొల్లేరే!) రోజూ 7 రకాల క్రీములు జాన్సన్ ప్రతిరోజూ ఏడు వేర్వేరు క్రీములు వాడతాడు. ఇందులో విటమిన్లు సి, ఇ , బి3, ఫెరులిక్ యాసిడ్ , అజెలైక్ యాసిడ్ లాంటి ఉన్నాయి. 0.1 శాతం ట్రెటినోయిన్ టాపికర్ క్రీమ్, ప్రతి ఉదయం SPF 30, బాడీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ పడుకునే ముందు సెరావ్ నైట్ క్రీమ్ పూసుకుంటాడు. ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఫేస్ ఇంజెక్షన్లు స్కిన్ కేర్ కోసం వీక్లీ యాసిడ్ పీల్స్, లేజర్ థెరపీ, మైక్రోనీడ్లింగ్ అబ్బో ఇలా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఫేస్‌కి ఫ్యాట్ ఇంజెక్షన్ (దీనిక తేనెటీగ కుట్టినంత భయంకరంగా ఉబ్బిపోతుందట) మైక్రోబోటాక్స్ ఇంజెక్షన్లు, కొల్లాజెన్ ఉత్పత్తి కోసం పలు ఇంజెక్షన్లతో సహా వివిధ చర్మ సంరక్షణ చికిత్సలు తీసుకుంటాడు. 10 ఏళ్ల వయసులో ఉండే నున్నని మెరుపు, 14 ఏళ్ల వయస్సులో ఉండే మెరిసే చర్మం వచ్చిందట. దీన్ని కొనసాగించడం కష్టంగాను, చాలా పెయిన్పుల్గా అనిపించినప్పటికీ "ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ తన వయస్సును1.01 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లడమే తన లక్ష్యమని చెప్పారు. పరిగెత్తుతున్న వృద్ధాప్యమనే రైలుకు బ్రేక్‌లు వేయాలంటే సామాన్యమైన విషయంకాదు, కఠోర శ్రమ అంతకు మించిన డబ్బు కూడా ఉండాలంటాడు. -
ఈ కాక్టెయిల్ వృద్ధాప్యాన్ని రానివ్వదట!ఎప్పటికీ..
వృద్ధాప్యం! ఆ వయసులో ఎదుర్కొనే సమస్యలు గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ చాలామంది ఆ వయసు సమీపించే సమయంలో కూడా ఫిట్‌గా యవ్వనంగా ఉండాలనే రకరకాల డైట్ ఫాలో అవుతుంటారు. అయినా ఏదో ఒకరకంగా మనలో ఆ వృద్ధాప్య ఛాయాలు కనిపిస్తునే ఉంటాయి. ఐతే దానికి చెక్‌పెట్టి మనం ఎప్పటికీ యవ్వనంగా ఉండొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మన జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చు అని చెబుతున్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. హర్వర్డ్ శాస్త్రవేత్తల బృందం వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ఓ సరికొత్త రసాయన కాక్టెయిల్ని కనిపెట్టింది. వారంతా ఈ కాక్టెయిల్ని మానవులు, ఎలుకలపై ప్రయోగించగా సత్ఫలితాలనిచ్చింది. వారి ఏజ్‌ని చాలా ఏళ్లు వెనక్కి నెట్టినట్లు నిర్థారించారు. తాము ఈ పరిశోధనలను "రసాయన ప్రేరిత రీ ప్రోగ్రామింగ్ టు రివర్స్ సెల్యులర్ ఏజింగ్" అనే పేరుతో చేసినట్లు తెలిపారు ఈ మేరకు హార్వర్డ్ పరిశోధకుడు డేవిడ్ సింక్లైర్ జూలె12న ప్రచురితమైన జర్నల్ ఏజింగ్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నాడు. "జన్యు చికిత్స ద్వారా రివర్సల్ ఏజింగ్ సాధ్యమవుతుందని భావించాం. ఇప్పుడూ ఈ కెమికల్ కాక్టెయిల్స్తో అది సాధ్యమని చూపించాం. ఇది నిజంగా మనిషిని పూర్తి యవ్వనవంతుడిగా మార్చే ఒక ముందడగు అని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. ఈ రసాయన కాక్టెయిల్లో ఐదు నుంచి ఏడు ఏజెంట్లు ఉంటాయని, వీటిలో చాలా వరకు శారీరక, మానసిక రుగ్మతలకు చికిత్స అందిస్తాయని చెప్పారు. తమ బృందం సెల్యూలర్ వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేలా మానవ కణాలను పునర్జ్జీవింప చేయడానికి మిళితం చేయగల అణువులను కనుగొనడానికి మూడు ఏళ్లు పైగా కృషి చేశారు. ఈ పరిశోధనల్లో.. ఆప్టిక్ నరాలు, మెదడు, కణజాలం, మూత్రపిండాలు, కండారాలు తదితరాలపై అధ్యయనాలు మెరుగైన ఫలితాలను ఇచ్చాయని తెలిపారు. ఎలుకలపై చేసిన పరిశోధనల్లో..వాటి జీవితకాలం పొడిగించబడటమేగాక మంచి ఫలితాలు కనిపించాయన్నారు. అలాగే కోతులపై చేసిన పరిశోధనల్లో కూడా మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఇక మిగిలింది మానవులపై చేయాల్సిన పూర్తి స్తాయి క్లినికల్ ట్రయల్స్ అని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో అవి కూడా ప్రారంభకానున్నాయని చెప్పారు. అంతా సవ్యంగానే జరగుతుందని, మంచి ఫలితాలే వస్తాయని ధీమగా చెబతున్నారు హార్వర్డ్ శాస్త్రవేత్త సింక్లైర్. (చదవండి: ఇది చినుకు కాలం.. జనం వణుకు కాలం.. 3-4 వారాలు బాధించే జ్వరంతో జాగ్రత్త!) -
60+ ‘సూపర్’ బ్రెయిన్.. మెదడుకు వృద్ధాప్యం లేదట!
సాక్షి, అమరావతి: వృద్ధాప్యంలో వెంటాడే ఆరోగ్య సమస్యలతో పాటు మెదడు పనితీరు మందగించి జ్ఞాపక శక్తి క్షీణిస్తుందన్న వాదనల్లో నిజం లేదని అమెరికాలోని జార్జి వాషింగ్టన్ మెడికల్ స్కూల్ పరిశోధకులు చెబుతున్నారు. నిజానికి పెద్దల మెదడు ఎంతో ఆచరణాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటుందని, 60 ఏళ్లు దాటిన తర్వాత తీసుకునే నిర్ణయాలు చాలా సృజనాత్మకంగా ఉంటాయంటున్నారు. వీరి మెదడులో కుడి, ఎడమ హెమిస్పియర్స్ చాలా చురుగ్గా ఉండటంతో సృజనాత్మక ఆలోచనలు విస్తరిçస్తున్నట్టు గుర్తించారు. చక్కటి జీవనశైలి, మానసికంగా చురుగ్గా ఉంటే మేధో సామర్థ్యాలు వయసుతో పాటు పెరుగుతాయే కానీ తగ్గవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 60 ఏళ్లు పైబడిన తర్వాత సృజనాత్మక కార్యకలాపాలను ప్రారంభించిన అనేక మందిపై ప్రయోగాలు నిర్వహించి ఈ ఫలితాలను రూపొందించారు. నియంత్రణలో భావోద్వేగాలు.. చిన్నతనంలో ఏదైనా వస్తువు పాడు చేసినప్పుడు మెదడు విపరీతమైన ఒత్తిడికి లోనవుతుంది. యవ్వనంలో అదే పని చేసినప్పుడు కొంత కంగారు పడినా తక్కువ సమయంలోనే స్థిమితపడతారు. 60 ఏళ్లు దాటాక ఎలాంటి భావోద్వేగాలకైనా ఒకేలా స్థిరంగా స్పందిస్తారు. ఇక 70 ఏళ్ల వయసులో మేధో కార్యకలాపాలు గరిష్ట స్థాయికి చేరినట్లు నిర్ధారించారు. ముదిమి వయసులో మెదడులోని మైలిన్ (న్యూరాన్ల మధ్య సంకేతాలను వేగంగా పంపుతుంది) పరిమాణం పెరుగుతుంది. దీంతో సగటు యువకులతో పోలిస్తే 60 ఏళ్లు దాటిన వారిలో మేధో సామర్థ్యాలు 300 శాతం పెరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. తొట్రుపాటు లేకుండా.. 60 ఏళ్ల వయసు నుంచి వృద్ధులు నిర్ణయాలు తీసుకునేందుకు మెదడులోని రెండు హెమిస్పియర్స్ను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ‘80–90 ఏళ్ల వయసులో ఒక వ్యక్తి మెదడు తక్కువ శక్తిని వినియోగించుకుని గరిష్ట స్థాయిలో ఆలోచిస్తుంది. అనవసరమైన విషయాలను వదిలేసి అవసరమైన వాటికే స్పందిస్తుంది’అని మాంట్రియల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మోంచి తెలిపారు. అధ్యయనంలో భాగంగా నిర్వహించిన వివిధ రకాల పరీక్షల్లో విజయం సాధించేందుకు యువకులు చాలా గందరగోళానికి గురవగా 60 ఏళ్లు పైబడినవారు ఎలాంటి తొట్రుపాటు లేకుండా సరైన నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. చికాగో నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీలోని ఫీన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు వీరిని ‘సూపర్ ఏజెర్స్గా’అభివర్ణిస్తున్నారు. 80ల్లో ఉన్నవారు మేధోపరంగా చురుగ్గా ఉండేందుకు పెయింటింగ్, డ్యాన్స్, సంగీతం నేర్చుకోవడంతో పాటు స్నేహితులను కలుస్తూ భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించు కోవడంలో ముందున్నారని, వారు అద్భుతాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
.. ఇచ్చిన హామీలు గుర్తుకు రావడం లేదట. ఈసారి ఎలక్షన్లో యువనాయకుడిని గెలిపించుకుందాం..!
.. ఇచ్చిన హామీలు గుర్తుకు రావడం లేదట. ఈసారి ఎలక్షన్లో యువనాయకుడిని గెలిపించుకుందాం..! -
‘అంతిమం’గా... ఓ బిజినెస్ మోడల్
వారిది ఉన్నత కుటుంబం. వృద్ధాప్య సమస్యలతో ఆస్పత్రి పాలైన ఆ దంపతులిద్దరూ రెండు మూడు రోజుల్లో మరణిస్తారని వైద్యులు చెప్పేశారు. అనుకున్నట్టుగానే వృద్ధ దంపతులిద్దరూ ఒకేసారి మరణించారు. కడసారి చూసేందుకు ‘ఆ నలుగురు’ కాదు కదా.. ఏ ఒక్కరూ రాలేదు. అంత్యక్రియలను మీరే నిర్వహించండంటూ వారసుల నుంచి పురోహితుడి అకౌంట్‌కు క్షణాల్లో నగదు బదిలీ అయ్యింది. ఆ దంపతుల చివరి కోరిక మేరకు రాజమహేంద్రవరంలో గోదావరి గట్టున అంత్యక్రియలతోపాటు కర్మకాండలను సైతం ‘పురమాయింపు’ వ్యక్తులే జరిపించారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాల్ ద్వారా చూసి తరించిన వారసులు ఘన నివాళులే అర్పించారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది ఇటీవల జరిగిన యథార్థ ఘటన. ఇలాంటి వారి కోసమే పురోహితుని నుంచి పాడె మోయడం.. దహన సంస్కారాల వరకు నిర్వహించే ‘ఆన్లైన్ అంతిమ సంస్కార’ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. అంత్యక్రియలనూ ఆన్లైన్ వ్యాపారంగా మార్చేసి కార్పొరేట్ మెట్లెక్కిస్తున్నాయి. సాక్షి, అమరావతి: నానాటికీ దిగజారుతున్న మానవ సంబంధాలు కొత్త వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నాయి. ఉన్నత చదువులు చదివిన పిల్లలు ఉద్యోగాలు నిమిత్తం దూర దేశాలకు వెళ్లిపోయి.. కనీసం తల్లిదండ్రుల చివరి చూపునకు కూడా రాలేనంత బిజీ అయిపోయారు. వారసులు అంత గొప్ప ప్రయోజకులయ్యారని మురిసిపోవాలో... లేక చివరి క్షణాల్లో పిల్లలు ఉన్నా అనాథగా మిగిలిపోయామని బాధపడాలో తెలియని దుస్థితి తలెత్తింది. ఈ మధ్యనే రాజమహేంద్రవరంలో జరిగిన ఘటన కళ్లు చెమ్మగిల్లేలా చేసింది. వృద్థాప్యంతో హాస్పిటల్లో చేరిన తల్లిదండ్రులకు సపర్యలు చేసే నిమిత్తం.. విదేశాల్లో స్థిరపడిన వారసులు ఆయాలను ఏర్పాటు చేశారు. వారిద్దరూ రెండు మూడు రోజుల్లోనే తుది శ్వాస విడుస్తారని తెలియడంతో.. ఆ దంపతుల కోరిక మేరకు గౌతమీ ఘాట్ వద్ద అంత్యక్రియలు జరిపించాలంటూ పురోహితుడి అకౌంట్‌కు వారిద్దరూ బతికుండగానే నగదు బదిలీ చేశారు. అంత్యక్రియల కార్యక్రమాన్ని వీడియో కాల్ ద్వారా చూపిస్తే తాము ఉన్న దేశం నుంచే నివాళి అర్పిస్తామన్నారు. ఆ పిల్లల వైఖరిని స్వయంగా చూసిన ఆ ముసలివాళ్ల మనసులు ఎంత తల్లడిల్లి పోయి ఉంటాయో. సరిగ్గా ఇలాంటి వారి కోసమే ఇప్పుడు అంత్యక్రియలు కూడా పెద్ద వ్యాపార వస్తువుగా మారిపోయాయి. పుట్టిన ప్రతి వాడూ గిట్టక మానడు కాబట్టి ఇది కూడా కార్పొరేట్ రూపు సంతరించుకుంటోంది. ఇందుకోసం అంతిమ సంస్కార్, గురూజీ, అంతేష్టి, లాస్ట్‌రైట్స్ వంటి పేర్లతో పలు సంస్థలు పుట్టుకొస్తున్నాయి. అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్‌లో ప్రత్యేక ఆకర్షణ న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఏటా అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తులను అక్కడ ప్రదర్శించడం ద్వారా మార్కెటింగ్ చేసుకుంటాయి. అలాంటి అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్‌లో ఏర్పాటు చేసిన ఒక స్టాల్ సందర్శకులను విస్తుపోయేలా చేసింది. ‘సుకాంత్ అంతిమ సంస్కార్’ పేరుతో అంత్యక్రియల కోసం ఏర్పాటైన ఒక కార్పొరేట్ కంపెనీ తాను అందించే సేవలను వివరిస్తూ పెట్టిన స్టాల్‌ను చాలామంది కన్నార్పకుండా చూశారు. ఇద్దరు కలిపి.. ‘ఆ నలుగురు’ ఏర్పాట్లు ముంబైకి చెందిన రవీంద్ర పాండురంగ్ సోనావాలే, సంజయ్ కైలాష్ రాముగుడ్ అనే ఇద్దరు కలిసి సుకాంత్ ఫ్యూనరల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేశారు. వివిధ మతాలు, కులాల వారి ఆచార వ్యవహారాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. అంత్యక్రియలకు అవసరమైన పాడె.. దాన్ని మోసే మనుషుల నుంచి పురోహితులు, మంగలి, రామ్ నామ్ సత్యహై అనే నినాదాలిచ్చే వంటివన్నీ ఒక ప్యాకేజీ కింద అందిస్తున్నారు. ప్రారంభం ప్యాకేజీ ధర రూ.37,500గా నిర్ణయించారు. అస్థికలను పవిత్ర నదుల్లో కలిపేదాన్ని బట్టి ప్రత్యేక రుసుములు తీసుకుంటున్నారు. ఇప్పటికే 5 వేలకు పైగా అంత్యక్రియలను నిర్వహించిన ఈ సంస్థ రూ.50 లక్షలకు పైగా లాభాన్ని నమోదు చేసింది. రానున్న కాలంలో ఈ సంస్థ టర్నోవర్ రూ.2 వేల కోట్లకు చేరుకోనుందనే అంచనాలతో పలు సంస్థలు ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయాన్ని ముందే గ్రహించిన శ్రీశ్రీ ‘స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్’ అన్నాడేమో. -
మీలో ‘ఫైర్’ ఉందా..?
వృద్ధాప్యం పలకరించే వరకు (60 ఏళ్లు) సంపాదన కోసం పరుగులు పెట్టడం పాత తరం నమూనా.. 45–50 ఏళ్లకే ఆర్థిక స్వాతంత్య్రం సాధించడం.. 50–55 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకోవడం.. నేటి తరం కోరుకుంటున్న విధానం. సాధ్యమైనంత త్వరగా సంపాదించాలి. భారీగా కూడబెట్టాలి. ముసలితనానికి ముందే ఉద్యోగం లేదా వృత్తి జీవితానికి స్వస్తి చెప్పి మిగిలిన జీవితాన్ని మనసుకు నచ్చినట్టు పూర్తి సంతోషంగా రైడ్ చేయాలి. ఇలా అనుకునే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో పుట్టుకొచ్చిందే ఫైర్ (ఎఫ్ఐఆర్ఈ). ఆ ఫైర్ మీలో ఉందా..? అందుకోసం ఏం చేయాలో చర్చించేదే ఈ కథనం. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ (ఎఫ్ఐ)/రిటైర్ ఎర్లీ (ఆర్ఈ). ఫైర్ అంటే ఇదే. కావాల్సినంత ఆర్థిక స్వేచ్ఛ సాధించడం/ముందుగా రిటైర్ కావడం అన్నదే సంక్షిప్తంగా ఫైర్. జీవితాంతం కూర్చుని తినేందుకు సరిపడా, అన్ని అవసరాలను తీర్చేంత సంపదను వీలైనంత ముందుగా సమకూర్చుకోవడం ఇందులోని అంతరార్థం. ఒక ఉదాహరణ చూద్దాం. 30 ఏళ్ల వ్యక్తికి ప్రస్తుతం నెలవారీగా ఖర్చులు రూ.75,000గా ఉన్నాయని అనుకుందాం. అంటే ఏడాదికి జీవన ఖర్చు రూ.9 లక్షలు. అతని వద్ద రూ.18 లక్షల నిధి కూడా ఉంది. ఇక్కడి నుంచి ప్రతీ నెలా రూ.80,000 చొప్పున 15ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు నెలవారీ సిప్‌ను ఏటా 8 శాతం పెంచుతూ వెళ్లాడు. పెట్టుబడులు 12 శాతం రాబడి రేటు ప్రకారం వృద్ధి చెందాయని, ద్రవ్యోల్బణం 7 శాతంగా ఉందనుకుంటే.. అప్పుడు 45 ఏళ్ల వయసు వచ్చేసరికి రూ.7.2 కోట్లు సమకూరతాయి. ఆ సమయంలో అతని వార్షిక వ్యయాలు రూ.22.8 లక్షలకు చేరతాయి. అదే సమయంలో తన ఖర్చులకు 32 రెట్లు నిధి సమకూరి ఉంటుంది. దీన్ని కదపకుండా మెరుగైన రాబడినిచ్చే సాధనంలో మరో 5–10 ఏళ్లు కొనసాగించినా నిండు నూరేళ్లపాటు నిశ్చితంగా జీవించొచ్చు. ఫైర్‌లో పలు రకాలున్నాయి. ఇందులో ఏదో ఒక ఫైర్ ఉన్నా ముందే ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించొచ్చు. నార్మల్ ఫైర్ ఇప్పటి మాదిరే జీవితాంతం రాజీ లేకుండా జీవించడం. భవిష్యత్తులోనూ విహార యాత్రలు, ఖర్చులు, రెస్టారెంట్ భోజనాలు, వినోదం, వైద్యం అన్నింటి అవసరాలను తీర్చుకునేందుకు కావాల్సినంత సమకూర్చుకోవడం. 45 ఏళ్ల వ్యక్తి అప్పటి తన వార్షిక జీవన వ్యయానికి 35 రెట్ల సంపదను సమకూర్చుకుని ఉంటే ‘నార్మల్ ఫైర్’ సాధించినట్టు అర్థం చేసుకోవాలి. లీన్ ఫైర్ లీన్ ఫైర్ అంటే మీ ఖర్చులు, జీవన విధానంలో కొంత రాజీ పడడం. నార్మల్ ఫైర్‌తో పోలిస్తే కొంత సర్దుకుపోవడం. ఈ విధానంలో తక్కువ వ్యయాలతో జీవించేందుకు సిద్ధం కావాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో నార్మల్ ఫైర్‌ను సాధించడం సాధ్యం కాకపోవచ్చు. అటువంటప్పుడు ప్రస్తుత వ్యయాల్లో 75 శాతంతోనే సరిపెట్టుకోవాల్సి రావచ్చు. ఇది కూడా ఫైర్ కిందకే వస్తుంది. 45 ఏళ్ల వ్యక్తి తన వార్షిక వ్యయానికి 25–28 రెట్ల మేర సంపద కూడబెడితే లీన్ ఫైర్ సాధించినట్టుగా అర్థం చేసుకోవాలి. ఫ్యాట్ ఫైర్ లీన్ఫైర్కు విరుద్ధమైనదే ఫ్యాట్ఫైర్. రాజీకి చోటు లేకుండా రాజులా జీవించడం. అనుకున్నంత స్వేచ్ఛగా ఖర్చు చేస్తూ జీవించడం. ఎందులోనూ రాజీపడక్కర్లేదు. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవక్కర్లేదు. ఈ తరహా ఫైర్ కోసం ఎక్కువ మొత్తమే కావాలి. 45 ఏళ్ల వ్యక్తి తన వార్షిక వ్యయాలకు 45–50 రెట్ల మేర నిధిని సమకూర్చుకోగలిగితే అతను ఫ్యాట్ఫైర్ సాధించినట్టే. ఇలా సమకూర్చుకున్నప్పుడు మిగిలిన జీవితాంతం 125–140 శాతం అధికంగా ఖర్చు చేస్తూ సాగిపోవచ్చు. కోస్ట్ ఫైర్ మిగిలిన జీవితానికి సరిపడా ముందుగా సమకూర్చుకోవడమే కోస్ట్ ఫైర్. దీంతో భవిష్యత్తులో ఎటువంటి అదనపు పెట్టుబడులు అవసరం లేకుండానే ఆ మొత్తం వృద్ధి మరింత వృద్ధి చెందుతుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి ప్రతీ నెలా రూ.2 లక్షలు సంపాదిస్తున్నట్టయితే.. 50 ఏళ్లకు ఫైర్ సాధించడం కోసం అతను రూ.6 కోట్ల నిధిని సమకూర్చుకోవాలి. అటువంటి సందర్భంలో లక్ష్య సాధనకు ప్రతీ నెలా తన ఆదాయం నుంచి 60 శాతాన్ని (రూ.1.2 లక్షలను) పెట్టుబడి పెడుతూ వెళ్లాలి. ఇలా చేస్తే మొదటి పదేళ్లలోనే 40 ఏళ్ల వయసు వచ్చేనాటికి రూ.2.5 కోట్లు సమకూరుతుంది. దీంతో రూ.6 కోట్ల లక్ష్యాన్ని తర్వాతి 10 ఏళ్లలో చేరుకునేందుకు అతను అక్కడి నుంచి రూపాయి కూడా అదనంగా ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. అప్పటి వరకు సమకూరిన రూ.2.5 కోట్ల నిధి ఏటా 10 శాతం రాబడినిచ్చే సాధనంలో ఉంచినా తదుపరి పదేళ్ల కాలంలో రూ.6 కోట్లు అవుతుంది. ముందే ఆర్థిక స్వాతంత్య్రాన్ని చేరుకుంటారు. దాంతో ఒత్తిడితో కూడిన పనిని విడిచిపెట్టి.. వేతనం తక్కువైనా నచ్చిన పనికి మారిపోవచ్చు. మీ ఫైర్ ఏది? తాము ఏ ఫైర్‌ను చేరుకుంటామన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. మీ సంపాదన, ఖర్చులు, జీవన స్థితిగతులు వీటన్నింటి పాత్ర ఉంటుంది. వీటన్నింటి మధ్య మీకున్న సౌకర్యం ఏపాటిది? ఆలోచించుకోవాలి. లీన్ఫైర్లో రాజీపడాల్సి ఉంటుంది. కొన్ని అంచనాలు, పరిస్థితులు మారినా అనుకున్నది నెరవేరకపోవచ్చు. అన్నింటిలోకి నార్మల్ ఫైర్ ఆచరణీయం. కనీసం లీన్ఫైర్తో ఆరంభించి.. కొన్నేళ్ల తర్వాత అయినా నార్మల్ ఫైర్ లక్ష్యం దిశగా అడుగులు వేయాలి. మెరుగైన సంపాదన ఉండి, ఎక్కువ భాగాన్ని వెనకేసుకునే అవకాశం ఉన్నవారికి ఫ్యాట్ ఫైర్ ఆచరణీయం. ఫైర్ సాధిస్తే పని మానవచ్చా? అది మీ ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. కావాలనుకుంటే ఉద్యోగం లేదా వ్యాపారం లేదా వృత్తికి అంతటితో విరా మం చెప్పేసుకోవచ్చు. ఒకవేళ చేస్తున్న పని బోర్‌గా అనిపించకపోతే.. ఒత్తిళ్లతో కూడుకున్నది కాకపోతే కొనసాగడమే మంచిది. దీనివల్ల అదనపు నిధి సమకూరుతుంది. అప్పుడు మీ జీవితానికి మరింత జోష్‌ను తెచ్చుకున్నట్టుగానే భావించాలి. ఇందంతా మీ ఇష్టా అయిష్టాలపై, మానసిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. ఫైర్ ఎందుకు అవసరం? 60 ఏళ్ల వరకు ఉద్యోగంలో కొనసాగడం అంటే కష్టమైన పనే. ప్రైవేటు రంగంలో 58 ఏళ్లకే తప్పుకోవాలి. పైగా ఉద్యోగ భద్రత పాళ్లు తక్కువ. ఆరోగ్యం అందరికీ సహకరించకపోవచ్చు. వృద్ధాప్యంలోనూ సంపాదించుకునే శక్తి ఉంటుందన్న భరోసా పని చేయకపోవచ్చు. ముందుగానే ఫైర్‌ను సాధిస్తే మీపై ఒత్తిడి తగ్గిపోతుంది. మీకు నచ్చినట్టు, మీదైన దారిలో సాగిపోయే స్వేచ్ఛ లభిస్తుంది. ఎవరో ట్యూన్‌కు మీరు డ్యాన్స్ కట్టాల్సిన ఇబ్బంది తప్పుతుంది. అభద్రతా భావం నుంచి బయటకు వస్తారు. మీ డిమాండ్లపై పట్టుబట్టే ధైర్యం లభిస్తుంది. ఫైర్ అంత ఈజీనా..? కాదనే చెప్పుకోవాల్సి ఉంటుంది. మనదేశంలో చాలా మంది 60 దాటిపోయిన తర్వాత కూడా సంపాదన కోసం శ్రమకోరుస్తూనే కనిపిస్తుంటారు. పైగా రిటైర్మెంట్ ప్రణాళిక విషయంలో చాలా మందిలో శ్రద్ధ కనిపించదు. దీంతో 60 వచ్చినా మిగిలిన జీవితానికి చాలినంత నిధి కనిపించదు. ఆర్థిక ప్రణాళికల్లేకుండా సాగిపోవడం వల్ల అసలు తత్వం అప్పుడు కానీ బోధపడదు. ఒకవేళ ముందుగా ఫైర్ సాధించినప్పటికీ అది మంచి రాబడుల వల్ల కాదు.. సంపాదనలో అధిక మొత్తాన్ని పొదుపు చేస్తూ రావడం వల్లే. అందుకే ఫైర్ ఉంటే కాదు.. దాన్ని సాధించే పక్కా ఆచరణ, ప్రణాళికలు కూడా మీ దగ్గర ఉండాలి. ఇవి కీలకం.. ► వ్యయాలను అదుపులో పెట్టుకోవాలి. సంపాదనలో సాధ్యమైనంత తక్కువ వ్యయాలకే పరిమితం కావాలి. ఎందుకంటే ఇక్కడ ఫైర్ అన్నది సంపద. ఆ సంపదకు సంపాదన, వ్యయ నియంత్రణ కీలకం. ► నెల సంపాదన రూ.2లక్షలు. చేస్తున్న వ్యయం రూ.25వేలు. అప్పుడు వ్యయాలకు ఎనిమిదిరెట్లు అధికంగా సంపాదిస్తున్నట్టు. ఇటువంటి వారు చాలా వేగంగా ఫైర్ సాధిస్తారు. ► కొందరికి వ్యయ నియంత్రణ సాధ్యపడదు. పైగా పోనుపోను జీవనశైలిని మరింత మెరుగు పరుచుకుంటూ జీవించేస్తారు. ఇటువంటి వారు ఫైర్‌ను కోల్పోవాల్సి వస్తుంది. ► మంచి ఆదాయానికి బాటలు వేసుకోవాలి. ► ఆదాయం నుంచి కనీసం 60 శాతాన్ని అయినా ఆదా చేసుకుని ద్రవ్యోల్బణాన్ని మించి అధిక రా బడులను ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ► రాబడులు అంచనాలను అందుకోకపోతే, ద్రవ్యోల్బణం అనుకున్నదానికంటే ఎక్కువే ఉంటే ఫైర్ కష్టంగా మారుతుంది. ► దుబారాకు దూరంగా ఉండి, సాధారణ జీవితం గడపాలి. అలా అని ఆనందం, కోర్కెల విషయంలో రాజీపడొద్దు. ► ఫైర్ సాధించిన తర్వాత.. వాటిపై క్రమం తప్పకుండా రాబడులు వచ్చేలా (క్యాష్ ఫ్లో) ఇన్వెస్ట్మెంట్ సాధనాలు ఉండాలి. పెట్టుబడులు ఇరుక్కుపోయే వాటిల్లో ఉంచొద్దు. ► ఎవరికివారు తమకు అనుకూలమైన ఫైర్ దిశగా అడుగులు వేసేందుకు ఎంతో క్రమశిక్షణ అవసరం. ఈ విషయంలో స్పష్టత కోసం ఆర్థిక సలహాదారుల సేవలు తీసుకోవడం సూచనీయం. -
పెరిగే వయసుకు కళ్లెం.. నిత్య యవ్వనం ఇక సులువే..
వయసును జయించాలన్నది మనిషి చిరకాల కోరిక! వృద్ధాప్య ప్రక్రియను వెనక్కు మళ్లించేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నా నేటికీ నిత్య యవ్వనం అందని ద్రాక్షలానే ఉంది. తాజాగా ఈ యుగపు టెక్నాలజీగా చెప్పుకుంటున్న కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ప్రయోగానికి ఓ సంస్థ సిద్ధమైంది! మరి మనిషి నిరీక్షణ ఇప్పటికైనా ఫలిస్తుందా? క్రిప్టో కరెన్సీ ‘కాయిన్‌బేస్’ సృష్టికర్త, బిలియనీర్ బ్రియన్ ఆర్మ్‌స్ట్రాంగ్ (38) ఇటీవల ‘న్యూలి మిట్’ పేరిట కొత్త కంపెనీ పెట్టాడు. పేరులో ఉన్నట్లే ఈ కంపెనీ మనిషి మేధకు కొత్త పరిధిని నిర్ణయించే ప్రయత్నం చేస్తోంది! పెరిగే వయసుకు కళ్లెం వేసి జీవితకాలాన్ని పొడిగించేందుకు అవసరమైన పరిశోధనలు చేపట్టడం న్యూలి మిట్ నిర్దేశించుకున్న లక్ష్యం! మనిషి జన్యువులు తీరుతెన్నులను కృత్రిమ మేధ (ఏఐ)లో భాగమైన మెషీన్ లెర్నింగ్ సాయంతో విశ్లేషించడం ద్వారా వృద్ధాప్యాన్ని నిలువరించడంతో పాటు తిరిగి యవ్వనాన్ని తెచ్చే కొత్త, వినూత్న చికిత్సలను అందు బాటులోకి తెస్తామని కంపెనీ చెబుతోంది. ఈ ప్రయత్నంలో ఆర్మ్‌స్ట్రాంగ్‌కు స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ బయోఇంజనీరింగ్ శాస్త్రవేత్త బ్లేక్ బయర్స్ మద్దతిస్తున్నారు. కణాలకు మళ్లీ శక్తితో... మానవ కణాలకు కొత్త పనులు అప్పగించడం ద్వారా నిత్య యవ్వనాన్ని సులువుగానే సాధించవచ్చని న్యూలిమిట్ అంటోంది! చిన్నప్పుడు మన కణాలు చాలా చురుకుగా ఉంటాయని, వయసు పెరిగేకొద్దీ వాటిల్లో మార్పులొచ్చి తమ పూర్వపు శక్తిని కోల్పోతాయని న్యూలి మిట్ చెబుతోంది. కణాలకు ఆ శక్తిని మళ్లీ అందిస్తే నిత్య యవ్వనం సాధ్యమని పేర్కొం టోంది. జీవశాస్త్రం అభివృద్ధితో డీఎన్ఏ క్రమాన్ని మాత్రమే కాకుండా.. అంతకంటే తక్కువ సైజుండే ఆర్ఎన్ఏ జన్యుక్రమాలనూ సులు వుగా తెలుసుకోగలుగుతున్నామని... ఇవన్నీ తమ పరిశోధనలకు ఉపయోగ పడతాయని న్యూలిమిట్ చెబుతోంది. చదవండి: ఊహించనంత వేగంగా కరిగిపోతున్న గ్లేసియర్లు.. లీడ్స్ యూనివర్సిటీ హెచ్చరిక ఎపిజెనిటిక్స్ మార్గం... వయసును వెనక్కు మళ్లించేందుకు న్యూలిమిట్ ఎపిజెనిటిక్స్ మార్గాన్ని ఎంచుకుంది. డీఎన్ఏ నిర్మాణంలో వచ్చే మార్పులను ఎపిజెనిటిక్స్ అంటారన్నది తెలిసిందే. మన శరీర కణాల్లో కొన్నింటిని మనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చని శాస్త్రవేత్తలు సుమారు 15 ఏళ్ల క్రితం గుర్తించారు. చర్మ కణాలను తీసుకొని వాటిని మెదడు కణాలుగా మార్చవచ్చన్నమాట. కేవలం నాలుగు రకాల ప్రొటీన్లను ఉపయోగించడం ద్వారా ఈ అద్భుతం సాధ్యమవుతుంది. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకొని కణాలకు కొత్త రకమైన పనులు అంటే మృత కణాలను వేగంగా తొలగించడం, కొత్త కణాలను తయారు చేయడం వంటివి అప్పగిస్తే వయసును తగ్గించవచ్చని న్యూలిమిట్ భావిస్తోంది. చదవండి: ఫిలిప్పీన్స్ తుపాను.. 375కు చేరిన మరణాలు అందరికీ అందుబాటులో.. నిత్య యవ్వనం కోసం తాము అభివృద్ధి చేసే ఏ చికిత్స అయినా అందరికీ అందుబాటులో ఉంచుతామని న్యూలిమిట్ హామీ ఇస్తోంది. సెల్ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లు, కంప్యూటర్ల వంటి సైన్స్ అద్భుతాలన్నీ ప్రాథమిక శాస్త్ర పరిశోధనల ఫలితాలుగా పుట్టుకొచ్చినవేనని, మొదట్లో వాటి ఖరీదు ఎక్కువగానే ఉన్నా వాడకం పెరిగినకొద్దీ ధర కూడా తగ్గుతూ వచ్చిందని న్యూలిమిట్ గుర్తుచేసింది. -
ఇలా చేస్తే.. ఎంత వయసొచ్చినా యంగ్‌గా..
చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ చాలా త్వరగా పెరగాలనుకుంటారు. కాని పెద్దయ్యాక ఎప్పటికీ పాతికేళ్లవారిగానే ఉండిపోవాలనుకుంటారు. ఇది సహజం. ఎంతగా పెరిగినా కొందరిలో వయసు అంతగా కనిపించదు. అందరిలోనూ అలాగే జరగడానికి ఈ కింది పేర్కొన్న సూచనలు చాలావరకు ఉపకరిస్తాయి. పాటించి చూస్తే ప్రయోజనం ఉంటుందంటున్నారు వైద్యనిపుణులు. వృద్ధాప్య లక్షణాలకు అనేక కారణాలు ఉన్నప్పటికీ వాటిలో ప్రధానమైనది జన్యు సంబంధమైన కారణాలు. ఇది తప్పించలేని కారణం. అయితే మిగతా కారణాలను ఈ కింది విధంగా చెప్పుకోవచ్చు. అవి... ♦ సాంక్రమిక రోగాలు (ఇన్ఫెక్షియస్ డిసీజెస్) ♦ ఆహార లోపాలు (న్యూట్రిషనల్ డెఫిషియెన్సీస్) ♦ హార్మోన్లలో మార్పులు. ఈ కారణాల్లోని చాలావాటిని మనం చక్కదిద్దుకోగలం. ఇదెలాగో చూద్దాం. ► ఆహారం : ఆహారం అనగానే మనం రోజూ రుచి కోసం, జిహ్వచాపల్యం కోసం తినే ఏది పడితే అది కాదు. అన్ని పోషకాలూ సమపాళ్లలో ఉండే ఆరోగ్యకరమైన ఆహారం. అందునా మరీ ఎక్కువ కారాలూ, మసాలాలూ, ఉప్పు లేని బ్లాండ్ డైట్. ఇలాంటి ఆహారం తీసుకునేవారు చాలాకాలం పాటు యౌవనంగా ఉంటారు. ఛదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా.. కొబ్బరి ప్రయత్నించండి! ►ఆకుపచ్చని ఆకుకూరలు : మనం తీసుకునే ఆహారంలో ముదురాకుపచ్చటి రంగులో ఉండే ఆకుకూరలు కాస్తంత ఎక్కువగా ఉండేలా చేసుకోవాలి. వీటన్నింటిలోనూ చాలాకాలం పాటు దేహాన్ని ఆరోగ్యంగా ఉంచగల అన్ని రకాల విటమిన్లు, ఖనిజలవణాల్లాంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ ప్రతి కణపు ఆరోగ్యాన్ని చిరకాలం కొనసాగేలా చేయగలవు. అంతేకాదు.. ఎముకలను పటిష్టపరచడం, రక్తనాళాల్లో రక్తం సాఫీగా పయనించేలా చేయడం, మంచి చూపు, కొలస్ట్రాల్ తగ్గేలా చేయడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తాయి. ఇవన్నీ యౌవనాన్ని నిలుపుకునేందుకు దోహదపడేవే. చదవండి: ఆడ దోమలు మాత్రమే ఎందుకు కుడతాయో తెలుసా?! ►మంచి కొవ్వులు : చాలామంది కొవ్వులు అనగానే వాటిని నిరసించేలా చూస్తారు. కానీ కొవ్వులు చాలా కీలకమైన కార్యకలాపాలు నిర్వహిస్తాయి. దేహానికి హానిచేసే జంతుసంబంధిత కొవ్వులైన ట్రాన్స్‌ఫ్యాట్స్ కాకుండా బాదం, అవకాడో వంటి నట్స్ నుంచి లభ్యమయ్యే కొవ్వులన్నీ కీలకమైన జీవక్రియల్లో పాలుపంచుకుంటాయి. అంతేకాదు... కీలకమైన అవయవాలన్నింటిపైనా ఆరోగ్యకరమైన రీతిలో అలముకుని, వాటిని రక్షిస్తూ చాలాకాలం పాటు అవి దెబ్బతినకుండా చూస్తాయి. అవెంతకాలం నిరాటంకంగా పనిచేస్తాయో మన దేహం కూడా అంతేకాలం యౌవనంగా కనిపిస్తుంటుంది. ►నిద్ర : రోజులో కనీసం ఏడు నుంచి ఎమినిది గంటల పాటు మంచి ఆరోగ్యకరమైన నిద్రతో యౌవనంగా కనిపిస్తుంటారు. ►సానుకూలమైన ఆలోచనలు (పాజిటివ్ థాట్స్) : ప్రతి విషయాన్నీ సానుకూలమైన దృక్పథంలో చూడటం అన్నది చాలా రకాల ఒత్తిళ్లను నివారిస్తుంది. ఆశాభావంతో ఉన్నప్పుడు చాలా పనులు కూడా సానుకూలంగానే జరుగుతాయి. దాంతో సంతోషం చేకూరి ఒత్తిడి తొలగుతుంది. సరిగ్గా ఈ అంశమే ఏజింగ్ ప్రక్రియకు అడ్డుకట్ట వేస్తుంది. ►ప్రోబయాటిక్ ఫుడ్ : అన్ని రకాల ఆహారాలను మన శరీరానికి అందించి, ఆరోగ్యాన్ని కాపాడేది మన జీర్ణవ్యవస్థ. ఆ జీర్ణవ్యవస్థ ఆరోగ్యం బాగుంటే దేహమంతా బాగున్నట్టే. దాని ఆరోగ్యంగా ఉంచే ఆహారమే ‘ప్రోబయాటిక్ ఫుడ్’. మన జీర్ణవ్యవస్థలో ప్రతి చదరపు అంగుళం స్థలంలో మనకు మేలు చేసే కోటాను కోట్ల మంచి సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన జీర్ణప్రక్రియ నిర్వహణకు తోడ్పడతాయి. ఆ ఆరోగ్యం చెక్కుచెదరకుండా ఉండటానికి పెరుగు, మజ్జిగ, పులిసేందుకు అవకాశమున్న ఇడ్లీ, దోసె వంటివి ఉపయోగపడతాయి. ► దానిమ్మ వంటి మంచి పండ్లు: పండ్లలో దానిమ్మను ‘సూపర్‌ఫుడ్’గా చెప్పవచ్చు. హానికరం కాని రీతిలో తగినంత పాళ్లలోనే చక్కెర, మంచి రుచి, ఇతరత్రా అన్ని రకాల ఖనిజలవణాలు వంటి వాటితో హైబీపీని నివారిస్తూ, గుండెను చాలాకాలం పాటు ఆరోగ్యకరమైన రీతిలో కాపాడుతుంది. చక్కెరపాళ్లు ఒకింత తక్కువగా ఉండే జామ, బొప్పాయి, నేరేడు వంటి పండ్లన్నీ మంచివే. వీటిని కాస్తంత ఎక్కువగా తీసుకుంటూ... వాటితోపాటు కేవలం అప్పుడప్పుడు మాత్రమే చక్కెరలు ఒకింత ఎక్కువగా ఉండే మామిడి, సపోటా వంటివి రుచికోసమే పరిమితంగా తీసుకుంటూ రుచుల సమతౌల్యం పాటిస్తే యౌవనం చాలాకాలం పాటు నిలకడగా ఉంటుంది. ► విటమిన్ డి : దీన్ని కేవలం ఓ విటమిన్‌లా చూడటానికి వీల్లేదు. ఎముకల ఆరోగ్యం మొదలుకొని, వ్యాధి నిరోధక శక్తి వరకు ప్రతి అంశంలోనూ దీని ప్రాధాన్యం ఎంతో ఉంటుంది. ఇది స్వాభావికంగా సూర్యరశ్మిలో దొరుకుతుందన్నది తెలిసిందే. అందుకే ఆరుబయట లేత ఎండలో ఉండటం వల్ల విటమిన్–డి దొరకడంతో పాటు ఆ వాతావరణంలో కాలుష్యం లేని వాయువులు పీల్చడం, ఆహ్లాదకరమైన రీతిలో ప్రకృతిని ఆస్వాదించడం.. ఇవన్నీ బహుముఖమైన ప్రయోజనాలు ఇవ్వడం ద్వారా మనిషిని యౌవనంగా ఉంచుతాయి. ► మంచి వ్యాయామం : మరీ అంతగా శారీరక శ్రమ పడకుండా ఉండేలా... అలాగే దేహం అలసిపోయేలా మంచి వ్యాయామాలు చేయడం వల్ల ప్రతి కణానికీ అవసరమైన ఆక్సిజన్ అందుతుంది. దాంతో కణాలన్నీ చాలాకాలం పాటు ఆరోగ్యంగా ఉంటాయి. అది జరగడం వల్ల మనిషి పూర్తిగా ఆరోగ్యంగా కనపడుతూ చాలాకాలం పాటు యౌవనంగా ఉండగలుగుతాడు. ► మంచి స్నానం : మంచి వ్యాయామం తర్వాత అవసరమైనది మంచి స్నానం. అంటే ఆహ్లాదకరమైన రీతిలో ప్రతి అవయవం శుభ్రమయ్యేలాంటి స్నానం అన్నమాట. ఇలాంటి స్నాన ప్రక్రియలో మన చర్మంపైన, దేహంపైన ఉన్న మృతకణాలన్నీ తొలగిపోతాయి. దాంతో బయటకు కనిపించేవన్నీ ఆరోగ్యకరమైన తాజా కణాలు మాత్రమే. అందుకే స్నానం తర్వాత వ్యక్తులు పరిశుభ్రంగా మాత్రమే కాదు... కొద్దిసేపు తేజోవంతంగా కూడా కనిపిస్తుంటారు. ►ఒత్తిడిని నివారించడం: ఇటు దేహంలో, అటు మనసుపైనా ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ అది శారీరకంగా ప్రభావం చూపెడుతుందని అనేక అధ్యయనాల్లో వెల్లడయ్యింది. ఎలాంటి ఒత్తిడీ లేని కొందరిని పరిశీలించినప్పుడు ఇది చాలావరకు వాస్తవమన్నది మనలో చాలామందికి తెలిసిన విషయమే. అందుకే ఒత్తిడికి ఎంతగా నివారిస్తే దేహం కూడా అంతే యౌవనంతో ఉంటుంది. ► ధ్యానం (మెడిటేషన్) : ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు ధ్యానం (మెడిటేషన్) చేయడం వల్ల శరీరంలోని చాలా వ్యవస్థలు తేలిగ్గా మారతాయి. దాంతోపాటు మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవక్రియల వేగం తగ్గుతుంది. మనసుకు ప్రశాంతత, జీవక్రియల వేగం తగ్గడం... ఈ రెండు అంశాలు వయసుకు కళ్లెం వేయడానికి ఉపకరిస్తాయి. పరిహరించాల్సినవి : పైన పేర్కొన్నవన్నీ పాటించాల్సినవి. అయితే పరిహరించాల్సినవీ కొన్ని ఉన్నాయి. అవే... చక్కెరలు, పొగతాగడం, ఆల్కహాల్... ఇతరత్రా వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఇవన్నీ చర్మాన్ని బిగుతుగా ఉంచే కణాలను వదులుగా అయ్యేలా చేసేవే. దాంతో వృద్ధాప్య చిహ్నాలైన ముడుతలు, రింకిల్స్ వంటివన్నీ వయసు కంటే చాలా ముందుగానే వచ్చేస్తాయి. -
తల్లి రుణం
‘‘ప్రవక్తా వృద్ధాప్య భారంతో నడవలేక మంచానికే పరిమితమైన మా అమ్మను నా భుజాలపై కూర్చోబెట్టుకుని హజ్ యాత్ర చేశాను. మా అమ్మ రుణాన్ని తీర్చుకున్నట్లేనా’’ అని అతడు అడిగాడు. ఒకసారి ముహమ్మద్ ప్రవక్త (సఅసం) తన సహచరులతో ఏదో పనిలో నిమగ్నమై ఉన్నారు. అటుగా ఒక మహిళ ప్రవక్త (స) వారి సమక్షంలోకి వచ్చింది. వెంటనే ప్రవక్త (స) లేచి నిలబడి తన భుజంపై ఉన్న దుప్పటిని తీసి పరిచి ఆమెను కూర్చోబెట్టారు. ఆమెతో ఎంతో గౌరవభావంతో మాట్లాడారు. ఒక సహచరుడు అక్కడున్న వారితో ఆమె ఎవరా అని అడగ్గా ప్రవక్త (స)కు పాలుపట్టిన తల్లి అని మరో సహచరుడు చెప్పారు. ప్రవక్త (స) మాతృమూర్తి ఆయన బాల్యంలోనే కన్నుమూశారు. ఆయనను దాయీ హలీమా అనే మహిళ పాలు పట్టి పెద్దచేశారు. పాలుపట్టిన తల్లిని చూడగాలే లేచి నిలబడటం, ఆమెకు తన భుజంపై దుప్పటిని తీసి పర్చి కూర్చోబెట్టడం ఎంతో ఆదర్శనీయం.ఒకసారి ప్రవక్త (స) సమక్షంలోకి ఆయన అనుచరుడు వచ్చి ‘‘ప్రవక్తా వృద్ధాప్య భారంతో నడవలేక మంచానికే పరిమితమైన మా అమ్మను నా భుజాలపై కూర్చోబెట్టుకుని హజ్ యాత్ర చేశాను. మా అమ్మ రుణాన్ని తీర్చుకున్నట్లేనా’’ అని అడిగాడు. దానికి ప్రవక్త ‘‘మీ అమ్మ నిన్ను ప్రసవిస్తున్నప్పుడు బాధ భరించలేక పెట్టిన ఒక్క కేక రుణం కూడా తీరలేదు’’ అని చెప్పి పంపారు.పై రెండు సంఘటనలతో తల్లి స్థానం ఎంత గొప్పదో బోధపడుతుంది.ఒకసారి ముహమ్మద్ ప్రవక్త (స) సతీమణి హజ్రత్ ఆయిషా (రజి) దగ్గరికి ఒక మహిళ తన ఇద్దరు ఆడపిల్లలను వెంటపెట్టుకొని వచ్చింది. ఎన్నో రోజులుగా పస్తులున్నామని, తన ఆకలి బాధను తెలియజేసిందా మహిళ. అప్పుడు ఆయిషా (రజి) ఇంట్లో తినడానికి ఏమీలేవు ఒకే ఒక్క ఖర్జూరం పండు తప్ప. ఆ ఖర్జూరాన్ని ఆయిషా (రజి) ఆమెకు అందించారు. ఆ మహిళ ఆ ఖర్జూరాన్ని అందుకొని రెండు సమాన భాగాలు చేసి తన ఇద్దరు కూతుళ్లకు పంచి తాను మాత్రం పస్తులుండిపోయింది. ఈ వృత్తాంతాన్ని ఆయిషా (రజి) ఆమె భర్త ముహమ్మద్ (స) ఇంటికి రాగానే వినిపించారు. అప్పుడు ప్రవక్త (స) ఆ మహిళ త్యాగాన్ని ఎంతగానో ప్రశంసించారు. ‘‘తాను పస్తులుండి తన ఆడ పిల్లల ఆకలి తీర్చిన ఆ మహిళకు ఆ ఆడ పిల్లలే నరకానికి అడ్డుగోడలవుతారు. స్వర్గానికి బాటలవుతార’ని ప్రవక్త చెప్పారు. ముహమ్మద్ ముజాహిద్ -
ఆర్థిక సవాళ్లకు సిద్ధమా?
యవ్వనం నుంచి వృద్ధాప్యం సమీపించే వరకు ఉండే 40 ఏళ్ల కాలం ఎంతో విలువైనది అవుతుంది. ఈ కాలంలో ఆర్థికంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఎన్నో లక్ష్యాలు తెరపైకి వస్తాయి... కనుక ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి ప్రతి ఒక్కరూ సదా సన్నద్ధులు కావాలి. ఉదాహరణకు రూ.40 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల వ్యవధిపై తీసుకున్నారనుకోండి... ఇంకా 18 ఏళ్ల కాలం మిగిలి ఉంది. కానీ, వచ్చే పదేళ్లలోనే రుణాన్ని పరిపూర్ణంగా ముగించేయాలన్నది హైదరాబాద్‌కు చెందిన హర్షవర్ధన్ నిర్ణయం. ఇందుకోసం అతను ప్రతీ నెలా చెల్లించాల్సిన రూ.37,500 ఈఎంఐను పెంచుతూ వెళ్లాలనుకున్నాడు. లక్ష్యాన్ని చేరుకునే విషయంలో అతనికి సందేహం లేదు. ఎందుకంటే సొంతింటిని సమకూర్చుకోవాలనుకున్న వెంటనే అతడు పొదుపు ప్రారంభించి రూ.19 లక్షల డౌన్ పేమెంట్‌ను సిద్ధం చేసుకున్న చరిత్ర ఉంది. పొదుపు చేయడం ఎలాగో హర్షవర్ధన్‌కు తెలుసు. ‘‘విలువ తరిగిపోయే ఆస్తుల కొనుగోలుకు దూరంగా ఉంటాను. నా స్నేహితులు ఖరీదైన మొబైల్స్, డ్రెస్‌లు, కార్లను కొనుగోలు చేస్తుంటారు. కానీ, కొంత కాలం తర్వాత అవి ఎందుకూ పనికిరావు’’ అని హర్షవర్ధన్ తెలిపారు. అంటే విలువను సృష్టించడం అన్నది హర్షవర్ధన్‌కు తెలిసిన విషయం. ఆర్థిక విషయాల్లో ఈ తరహా క్రమశిక్షణ ఉన్న వారే ఉన్నత శిఖరాలను చేరుకుంటారు... సవాళ్లకు సై అంటారు. బడ్జెట్, పొదుపు, ఆరు నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధి తదితర అంశాలకు అందులో చోటు ఉండాలి. పన్ను ఆదా కోసం అయితే ఈఎల్ఎస్ఎస్ పథకాలను పరిశీలించొచ్చు. మిలీనియల్ జనరేషన్‌కు (1981–1996 మధ్య జన్మించిన వారు/22–37 వయసు) ఈక్విటీ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు వారి వయసు అనుకూలమైనది. ఎందుకంటే రిటైర్మెంట్కు దీర్ఘకాలం మిగిలి ఉంటుంది. కనుక రిస్క్ తీసుకోవడం ద్వారా అధిక రాబడులు అందుకోవచ్చు. ముప్పైల్లోనే పునాది 30 ఏళ్ల వయసుకొచ్చే సరికి ప్రతీ వ్యక్తికి బాధ్యతలు తెలిసివస్తాయి. వివాహం, పిల్లలు, ఇంటి కొనుగోలు ఇలా ఎన్నో లక్ష్యాలు, అవసరాలు ఎదురవుతాయి. కనుక కుటుంబం కోసం, మీపై ఆధారపడిన వారి పట్ల దృష్టి సారించాల్సిన వయసు ఇది. విశాఖపట్నానికి చెందిన రాధిక (27), పవన్‌కుమార్ (31) గతేడాదే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ కలసి వెడ్డింగ్ మేనేజ్మెంట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. తమకు పుట్టబోయే పిల్లల గురించి వీరు ముందుగానే ఆలోచన కూడా చేశారు. పిల్లల విద్యావసరాల కోసం పెళ్లయిన మూడు నెలల్లోనే ప్రతీ నెలా రూ.6,000 చొప్పున రికరింగ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారు. పదేళ్లలో రూ.10.36 లక్షల రూపాయలైనా సమకూర్చుకోవాలన్నది వారి లక్ష్యంగా ఉంది. లక్ష్యానికంటే ముందుగానే సన్నద్ధం కావడం ఓ మంచి ఆలోచన అవుతుంది. కాకపోతే అనుకున్నట్టు ప్రణాళికలను అమల్లో పెట్టడమే కష్టమైన టాస్క్. హైదరాబాద్‌కు చెందిన క్రాంతి కూడా అంతే. బహుళజాతి కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే క్రాంతి పదేళ్ల క్రితమే... వచ్చే పదేళ్లలో ఇంటి కోసం రూ.80లక్షలు సమకూర్చుకోవాలని నిర్ణయించుకుని అందుకు తగ్గట్టు ఇన్వెస్ట్ చేశాడు. లక్ష్యంలో సఫలం కూడా అయ్యాడు. ఈ మొత్తాన్ని ఇంటి కొనుగోలు కోసం వినియోగించుకోవాలన్నది అతడి ఆలోచన. పిల్లల ఉన్నత విద్యావసరాల కోసం, తన రిటైర్మెంట్ అవసరాల కోసం సిప్ ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. 40ల్లో మల్టీటాస్క్ 40ల్లోకి ప్రవేశించిన వారు రిటైర్మెంట్కు దగ్గర్లో ఉంటారు. అందుకోసం తగినంత నిధిని సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టాలి. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మరో 15–20 ఏళ్లకు చెప్పుకోతగ్గ మొత్తాన్ని సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ‘‘రిస్క్ తీసుకోలేని సంప్రదాయ ఇన్వెస్టర్లు పీపీఎఫ్‌ను ఎంచుకోవచ్చు. కాస్త రిస్క్‌ను తీసుకునేందుకు సిద్ధపడేవారు ఈక్విటీలను పరిశీలించాలి. రెండో ఇంటిని కొనుగోలు చేయడం కూడా మంచి ఆలోచనే అవుతుంది’’ అని ఇండియన్‌మనీ వ్యవస్థాపకుడు సుధీర్ తెలిపారు. ఇక 40ల్లో రుణ భారం లేకుండా ఉండడం అనేది పెద్ద సవాలే. 50కు దగ్గరపడితే అన్ని రకాల రుణాలను తీర్చివేసి, రిటైర్మెంట్ ప్రణాళికపై దృష్టి సారించడం మంచిదన్నది నిపుణుల సూచన. ఒకవేళ పిల్లల ఉన్నత విద్యకు నిధులు సర్దుబాటు అవకపోతే విద్యా రుణ మార్గాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. అంతేకానీ, రిటైర్మెంట్ నిధిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దన్నది సూచన. ఎందుకంటే వృద్ధాప్యంలో పిల్లలపై ఆధారపడకుండా, తమ జీవన అవసరాలను సాఫీగా సాగిపోవాలంటే అందుకు నిధి తప్పనిసరి. దీని అవసరాన్ని గుర్తించి ముందుగానే కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. లేకపోతే జీవన అవసరాల విషయంలో రాజీ పడాల్సి రావడంతోపాటు, పిల్లలపై ఆధారపడాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి. 50–60ల్లోకి ప్రవేశించిన తర్వాత విశ్రాంత జీవనానికి పదేళ్ల కాలమే మిగిలి ఉంటుంది. కనుక ఈ వయసులో రిస్క్ తీసుకోరాదు. సురక్షిత సాధనాలవైపు చూడాలి. రుణాలు తీసుకుని ఉంటే వాటిని చెల్లించే మార్గాలను అన్వేషించాలి. రిటైర్మెంట్ 55 లేదా 60 ఏళ్లు అనుకుంటే దానికి రెండు మూడేళ్ల ముందే బాధ్యతలన్నీ పూర్తయ్యేట్టు చర్యలు తీసుకోవాలి. రిటైర్మెంట్ సమయం తర్వాత సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, ప్రధానమంత్రి వయవందన యోజన వంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేసి ప్రతీ నెలా క్రమం తప్పకుండా ఆదాయం పొందే ఏర్పాటు చేసుకోవాలి. -
కాలచక్రం
అంబాలాల్ వైవాహిక జీవితంలోని ఓ దశాబ్ద కాలం సంతాన సౌఖ్యం లేకుండానే గడిచిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, డాక్టర్లతో పాటు స్వాములు, బాబాల చుట్టూ తిరిగినా, చివరికి మాయమంత్రాలు ప్రయోగించినా ఆయనకు సంతాన భాగ్యం కలగలేదు. ఇక తనకు సద్గతి ప్రాప్తించే మార్గం లేదనుకున్నాడు. తను పోయాక కొరివి పెట్టేవాడు లేనట్టే అని నిర్ధారణకొచ్చాడు. అయితే పదకొండో సంవత్సరం అద్భుతం జరిగింది. ఆయన భార్య రుక్మిణి గర్భం దాల్చింది. నవమాసాల తర్వాత పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. అంతవరకు నిస్సారంగా గడిచిన ఆ దంపతుల జీవితంలోకి హఠాత్తుగా వసంతం వచ్చినట్టయింది. లేకలేక కలిగిన బిడ్డ నామకరణం వేడుకని అంబాలాల్ వైభవంగా జరిపాడు. బాగా ఆలోచించి కొడుక్కి భగవత్ ప్రసాద్ అనే పేరు పెట్టాడు. ఆ బిడ్డ నిజంగానే భగవంతుని ప్రసాదం గనుక ఆ పేరు పెట్టాడు. పైగా భగవత్‌ని పక్కన పెట్టినా ప్రసాద్ అన్న పొట్టి పేరు పలకటానికి సౌకర్యంగా ఉంటుంది. భగవత్ ప్రసాద్ తొలి పుట్టినరోజుని అంబాలాల్ ఘనంగా జరిపాడు. వీధిలోని వారందర్నీ పిలిచి స్వీట్లు పంచిపెట్టాడు. తనకొచ్చే నెలజీతాన్ని ఒక్కరోజులోనే ఖర్చు పెట్టేశాడు. అంబాలాల్‌కి తన ఏకైక కుమారుడంటే వల్లమాలిన ప్రేమ. ఎండవల్ల పిల్లవాడి శరీరం వేడెక్కినా కంగారుపడి వెంటనే పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేవాడు. ఊర్లో దొరికే అన్ని రకాల ఆటబొమ్మల్ని తెచ్చి పిల్లవాడికిచ్చేవాడు. మూడేళ్ల వయసు రాగానే భగవత్ప్రసాద్ని నగరంలోనే పేరు పొందిన స్కూల్లో చేర్పించాడు. ప్రతిరోజూ ఉదయం తనే పిల్లవాణ్ణి స్కూలుకి తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి తీసుకొచ్చేవాడు. సాయంత్రం స్కూలు వదలకముందే అక్కడికెళ్లి మైదానంలో కొడుకు కోసం ఎదురుచూస్తూ కూర్చునేవాడు. ఇంట్లో ఉన్నంతసేపు కూడా పిల్లవాడి బాధ్యత తనదే. భార్యని ఇంటి పనులకే పరిమితం చేశాడు.ఒక్కమాటలో చెప్పాలంటే అంబాలాల్ తన కొడుకుని అచ్చం ఓ రాకుమారునిలా పెంచాడు. అతను అడిగిన దాన్ని ఆగమేఘాల మీద తీసుకొచ్చి ఇచ్చేవాడు. చాక్లెట్ తింటానంటే చాక్లెట్ ప్యాకెట్ తీసుకొచ్చేవాడు. బిస్కెట్ కావాలంటే నాలుగైదు రకాల బిస్కెట్లు తీసుకొచ్చేవాడు. సినిమాకెళతానంటే సినిమాకి, పార్కుకెళతానంటే పార్కుకి తీసుకెళ్లేవాడు. అంబాలాల్‌కి వచ్చే జీతంలో ఓ పెద్ద భాగం కొడుకు విలాసాలకే ఖర్చయ్యేది.దాంతో నెలాఖరులో డబ్బుకి కటకట ఏర్పడి కొంత అప్పు చేయాల్సి వచ్చేది. కానీ కొడుకు ఆనందం కన్నా అప్పులు ముఖ్యం కాదు. ఈ రోజు కొడుకు కోసం చేస్తున్నదంతా వృథా కాదు.వృద్ధాప్యంలో ఇదే కొడుకు తనను ఊతకర్రలా ఆదుకుంటాడని అంబాలాల్ తన మనసుకు నచ్చచెప్పుకొనేవాడు. చిన్నతనంలోనే కొడుక్కి అడిగిందల్లా ఇచ్చేస్తూ విలాసాలకు అలవాటు చేస్తే రేపు పెద్దయ్యాక అతను మొండిగా తయారవుతాడని అంబాలాల్‌ని అప్పుడప్పుడు భార్య అడ్డుకొనేది. కానీ లేకలేక కలిగిన కొడుకు పట్ల భర్తకి గల ప్రేమను చూసి ముచ్చటపడి కోపాన్ని దిగమింగుకొనేది. అదృష్టవశాత్తు నాలుగేళ్ల తర్వాత అంబాలాల్ దంపతులకు మరో కొడుకు పుట్టాడు. భార్యాభర్తలిద్దరూ ఆనందంతో పొంగిపోయారు. అయితే ఇంట్లోకి కొత్త కుటుంబసభ్యుడు రావడంతో ఖర్చు పెరిగింది. దాంతో అంతవరకు భగవత్‌ప్రసాద్ కోసం పెడుతున్న దుబారా ఖర్చుకి కోత పడింది. ఖర్చులో మాత్రమే కాదు, భగవత్‌ప్రసాద్ కోసం అంబాలాల్ కేటాయించే సమయంలోనూ కోతపడింది. అంతకుముందు అంబాలాల్ ఇంటికి రాగానే భగవత్ప్రసాద్ను ఎత్తుకుని ముద్దుపెట్టుకునేవాడు. ఇప్పుడు తండ్రిని చూసి భగవత్‌ప్రసాద్ ‘నాన్నా... నాన్నా’ అని పిలుస్తుంటే వాణ్ణి ఎత్తుకోవడానికి చేతులు చాచి అంతలోనే చిన్నకొడుకు ఏడుపు విని ఆ ఎత్తిన చేతులతోనే చిన్నవాణ్ణి ఎత్తుకునేవాడు. అది చూసి భగవత్‌ప్రసాద్ కోపంతో ఏడుపు లంకించుకునేవాడు. ఒక్కోసారి మితిమీరిన కోపంతో చేతిలో ఉన్న వస్తువుని తండ్రిపైకి విసిరేసేవాడు. ఓరోజు అతను అలాగే తన చేతిలో ఉన్న కొయ్యబొమ్మను తండ్రిపైకి విసిరేశాడు. అంబాలాల్ గబుక్కున తలకాయ కిందికి వంచి తప్పించుకున్నాడు. లేకపోతే ఆ కొయ్యబొమ్మ తగిలి అతడి నెత్తి బొప్పికట్టేది. ఆ దృశ్యం చూసిన రుక్మిణి పరిగెత్తుకొచ్చి కోపంతో భగవత్‌ప్రసాద్ చెంప వాయించింది. దాంతో భగవత్ బిగ్గరగా ఏడుపు లంకించుకున్నాడు. ఇంతకుముందు ఇదే సంఘటన జరిగి ఉంటే అంబాలాల్ భార్యను చెడామడా తిట్టి భగవత్‌ని బుజ్జగించేవాడు. కానీ ఈసారి ఆయన మౌనంగా ఉండిపోయాడు. భార్యను తిట్టలేదు. భగవత్‌ను సముదాయించలేదు. దానికి బదులు చిన్నకొడుకుని ఎత్తుకుని ఆడించసాగాడు. అది చూసి భగవత్ కోపంగా మరింతగా రగిలిపోసాగాడు. కాలం గిర్రున తిరిగింది.అంబాలాల్ కొడుకులిద్దరూ పెరిగి పెద్దవారయ్యారు.స్వతహాగా పెద్దవాడికి ఉడుకురక్తం కాగా, చిన్నవాడైన రమేష్ శాంతిస్వరూపుడు.ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఉన్నంత తేడా ఉండేది. భగవత్ చిన్న చిన్న విషయాలకే ఉద్రేకంతో ఊగిపోయేవాడు. ఓసారైతే అలిగి ఇంట్లోంచి బయటికెళ్లిపోయాడు. అంబాలాల్ అతని కోసం ఎక్కడెక్కడో వెదికాడు. భగవత్ వారం వరకు తన అమ్మమ్మ ఊర్లో ఉండి ఇంటికి తిరిగి వచ్చాడు. కొడుకు వ్యవహారం చూసి అంబాలాల్ కలత చెందేవాడు. ఎన్నో నోములు నోచి కన్న ఆ పిల్లవాడి పెంపకంలో ఎక్కడ తప్పు జరిగిందో ఆయనకు అంతు పట్టలేదు. మరోపక్క తమ రక్తమే పంచుకు పుట్టిన చిన్నవాడు అన్నకు పూర్తిగా భిన్నమైనవాడు. ఎప్పుడూ శాంతంగా, నమ్రతగా ఉంటాడు. పెద్దవాడు మనసుని గాయపరచినప్పుడల్లా అంబాలాల్ చిన్నవాడి ప్రేమతో సాంత్వన పొందేవాడు.భగవత్‌కి ఉద్యోగం దొరకగానే పెళ్లిచేశాడు అంబాలాల్.ఇంటికి కోడలు వచ్చింది. బాగా చదువుకున్న అమ్మాయి. ఉద్యోగం కూడా చేస్తోంది. అందువల్ల ఆమె అత్త మామల్ని పట్టించుకునేది కాదు. పైగా వారిపై భర్తకి లేనిపోని చాడీలు చెప్పేది. ఓరోజు ఏదో విషయం మీద రుక్మిణి కోడల్ని తిట్టింది. దాంతో కోడలు ఏడుపు లంకించుకుంది. అప్పుడే భగవత్ ఇంటికొచ్చాడు.తల్లి మీద మండిపడ్డాడు. ఇందులో రుక్మిణి తప్పేం లేదు. అంబాలాల్ సర్ది చెప్పబోయాడు. దాంతో భగవత్ మరింత రగిలిపోయాడు. మాటా మాటా పెరిగింది. అతడు అప్పటికప్పుడే భార్యతో కలిసి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు.అప్పటికే రిటైరైన అంబాలాల్‌కి పింఛన్ డబ్బుతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. కొడుకు హఠాత్తుగా ఇల్లు వదిలేసి పోవటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయాడు. ఆయనకి గుండెనొప్పి వచ్చింది. రమేష్ వెంటనే తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. గండం తప్పింది. అయితే అప్పటి నుంచి అంబాలాల్ రోజూ బీపీ, కొలెస్ట్రాల్ తగ్గించే మాత్రల్ని వాడాల్సి వచ్చింది. మరోపక్క రుక్మిణి ఆరోగ్యం కూడా క్షీణించింది. అదృష్టవశాత్తు అప్పుడే రమేష్‌కి ఉద్యోగం దొరికింది. దాంతో అందరూ నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు. మరో ఏడాదికల్లా రమేష్ పెళ్లి జరిగింది. తమ్ముడి పెళ్లికి భగవత్ రాలేదు.అయినా అంబాలాల్ పట్టించుకోలేదు. కష్టకాలంలో పెద్దకొడుకు తమను వదిలేసి వెళ్లిపోయినప్పుడే అతను చనిపోయినట్టు భావించాడు అంబాలాల్. తనకు రమేష్ ఒక్కడే కొడుకు అనుకున్నాడు.వృద్ధాప్యంలో తమకు ఊతకర్రలా సాయపడతాడని ఆశలన్నీ చిన్నకొడుకు మీదే పెట్టుకున్నాడు. రమేష్ భార్య కూడా భర్తలాగే శాంతంగా, సౌమ్యంగా ఉండేది. అత్తమామల్ని బాగా చూసుకునేది. ఓరోజు రమేష్ ఆనందంగా ఇంటికొచ్చాడు. తనకు ప్రమోషన్ లభించిందని, కంపెనీ తనను భార్యతో సహా అమెరికాకి పంపిస్తుందని చెప్పాడు. రమేష్కది శుభవార్తే కానీ అంబాలాల్‌కి మాత్రం అది దుర్వార్తగా కనిపించింది.ముసలితనంలో కొడుకు, కోడలు లేకుండా తాము ఎలా ఉండాలి? అనే చింత పట్టుకుంది. అయితే కొడుక్కి జీతం పెరగడం వల్ల తమకు సౌకర్యాలు కూడా పెరుగుతాయని ఆశ పుట్టింది. అరవై ఏళ్లుగా తను చీకటి, దుర్గంధం నిండిన పాతకాలం నాటి ఇంట్లోనే బతికాడు. ఇప్పుడు కొడుక్కి ఆదాయం పెరిగితే ఈ పాత కొంప అమ్మేసి మంచి ఇంట్లో హాయిగా ఉండొచ్చనుకున్నాడు. ఈ ఆశతోనే కొడుకు అమెరికాకి వెళ్లటానికి ఒప్పుకున్నాడు. రమేష్ కొంత అప్పుచేసి మంచి సూటు, బూటు, టై వంటివి కొనుక్కుని భార్యతో కలిసి అమెరికా విమానమెక్కాడు. ఎయిర్‌పోర్టులో కొడుకు కోడలు ఎక్కిన విమానం గాలిలోకి ఎగిరి కనుమరుగయ్యే వరకు కళ్లు విప్పార్చి చూశాడు అంబాలాల్. ఉదాసీనంగా ఇంటికి తిరిగొచ్చాడు. అతనికి అన్నం సయించలేదు. సరిగా నిద్రపట్టలేదు. అయితే మరుసటి రోజు ఉదయమే అమెరికా నుంచి ఫోనొచ్చింది. ఫోన్లో కొడుకు స్వరం వినగానే అంబాలాల్ ఆనందంతో పొంగిపోయాడు.‘‘నాన్నగారు! మేం అమెరికా చేరుకున్నాం’’ అవతలి నుంచి ఆనందంగా పలికాడు రమేష్.‘‘చాలా మంచిది బాబూ!’’‘‘మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్నా? నిన్న రాత్రి మాత్రలు వేసుకున్నారా?’’ ఆదుర్దాగా అడిగాడు రమేష్. కొడుక్కి తన ఆరోగ్యం పట్ల ఉన్న శ్రద్ధను చూసి అంబాలాల్ ఆనందంతో పొంగిపోయాడు. వేల మైళ్ల దూరం వెళ్లినా తన మందుల గురించి మర్చిపోని కొడుకు ఉన్నాడని గ్రహించాక ఆయనకి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టయింది. తర్వాత రమేష్ తన తల్లిని కూడా కుశల ప్రశ్నలు అడిగాడు. ఆనందంతో ఇద్దరి కళ్లు చెమ్మగిల్లాయి. వారం తర్వాత రమేష్ నుంచి నాలుగు పేజీల పెద్ద ఉత్తరం వచ్చింది. తాము విమానం ఎక్కినప్పటి నుంచి అమెరికాలో దిగే వరకు, తాముంటున్న నగర విశేషాలన్నీ రాశాడు. చివర్లో ‘మీరు సమయానికి మందులు వేసుకోండి. నేను లేనని నిర్లక్ష్యం చెయ్యకండి’ అని రాయటం మర్చిపోలేదు. అంత పెద్ద ఉత్తరంలో ఆ చివరి మాటలే అంబాలాల్‌ని ఆనందపరిచాయి. ఆ తర్వాత రమేష్ ఉత్తరాలు క్రమం తప్పకుండా రాసాగాయి. అంబాలాల్ కూడా ఎంతో ఓపికగా జవాబులు రాసేవాడు. తన కొడుకు తొందరగా తండ్రి కావాలని కోరుకునేవాడు. అయితే ఆ శుభవార్త వినటానికి అంబాలాల్‌కి చాలాకాలం పట్టింది. తనకు మనవడు పుట్టాడని తెలియగానే వీధిలోని వారందరికీ మిఠాయిలు పంచిపెట్టాడు. తండ్రి కోరికపై రమేష్ తన పుత్రుడి ఫొటో పంపించాడు. దాన్ని అంబాలాల్ వీధిలోని వారందరికీ చూపించాడు. ఫొటోని తన తలగడ కిందే పెట్టుకొని ఉదయం లేవగానే చూసేవాడు. అలా మనవడి ముఖం చూస్తే ఆయనకి రోజంతా ఉల్లాసంగా గడిచిపోయేది.అయితే తర్వాత మూడు నెలల వరకు రమేష్ నుంచి ఉత్తరం రాలేదు. నెలకి కనీసం ఒక్క ఉత్తరమైనా రాసే కొడుకు మూడు నెలలుగా ఉత్తరం రాయకపోవడంతో అంబాలాల్ కలవరపడ్డాడు. తీరిక దొరకలేదో లేక ఏదైనా సమస్యతో బాధపడుతున్నాడో తెలుసుకోవాలని తనే ఉత్తరం రాశాడు. జవాబు కోసం అసహనంగా ఎదురు చూడసాగాడు. నెల గడిచినా జవాబు రాలేదు. అంబాలాల్‌లో అసహనం పెరగసాగింది. ఐఎస్డీ కాల్ చెయ్యాలంటే రెండొందల దాకా బిల్లవుతుంది. అయినా ధైర్యం చేసి ఫోన్ చేశాడు. కోడలు మాట్లాడింది. రమేష్ ఆఫీసుకెళ్లాడని చెప్పింది. బిల్లు పెరుగుతుందనే భయంతో కుశల ప్రశ్నలడిగి ఫోన్ పెట్టేశాడు. కొద్ది రోజుల తర్వాత రమేష్ నుంచి ఉత్తరం వచ్చింది. అంబాలాల్ ఆత్రంగా తెరిచి చూశాడు. మునపటిలా పెద్ద ఉత్తరం కాదు. నాలుగంటే నాలుగు వాక్యాలున్నాయి. తనకు క్షణం కూడా తీరిక దొరకటంలేదని మాత్రమే రాశాడు. అంబాలాల్ ఉత్తరాన్ని రెండు మూడుసార్లు దీక్షగా చదివాడు. ఉత్తరంలో ఎక్కడా ‘నాన్నా, సమయానికి మందులు వేసుకోండి. అమ్మ ఎలా ఉంది?’లాంటి మాటలు లేవు. తొందర్లో మర్చిపోయినట్లున్నాడు. మరోసారి తీరిగ్గా ఉత్తరం రాస్తాడనుకున్నాడు. చాలాకాలానికి కొడుకు నుంచి ఉత్తరం వచ్చినందుకు అంబాలాల్ దంపతులు సంతోషంగా ఆరోజు మసాలా కిచిడీ వండుకొని తిన్నారు.మరో రెండు నెలలు గడిచినా రమేష్ నుంచి ఉత్తరం రాలేదు.అంబాలాల్‌లో మళ్లీ అసహనం పెరగసాగింది. కొడుకుతో మాట్లాడాలన్న తపన పెరిగింది. ధైర్యం చేసి మరోసారి ఐఎస్డీ కాల్ చేశాడు. అదృష్టవశాత్తు రమేష్ ఫోన్ ఎత్తాడు. అంబాలాల్ ఉత్సాహంగా మాట్లాడాడు. కాని రమేష్ ముక్తసరిగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. అయినా అంబాలాల్ నిరాశపడలేదు. కొడుకుతో మాట్లాడినందుకు తృప్తిపడ్డాడు. బిల్ ఎక్కువవుతుందని అతను త్వరగా ఫోన్ పెట్టేశాడు. తర్వాత తనే తీరిగ్గా రమేష్ ఫోన్ చేస్తాడనుకున్నాడు.కానీ అలా జరగలేదు. రమేష్ నుంచి ఫోన్ రాలేదు. చాలారోజులు గడిచాయి. ఇప్పుడు అంబాలాల్‌కి ఫోన్ చేసే శక్తిలేదు. కంటిచూపు బాగా తగ్గింది. ఎలాగోలా కష్టపడి ఓ ఉత్తరం రాశాడు. జవాబు రాలేదు. నెల తర్వాత మరో ఉత్తరం రాశాడు. దానికీ సమాధానం లేదు. ఇంకో నెలకి మరొకటి రాశాడు. స్పందన రాలేదు. నాలుగో ఉత్తరం రాశాక ఓపిక నశించింది. జవాబు వస్తుందన్న ఆశ కూడా అడుగంటింది. పెద్దకొడుకు పోట్లాడి తన జీవితంలోంచి వెళ్లిపోయాడు. చిన్నకొడుకు పోట్లాడలేదు. కానీ ఎండాకాలంలో గాలిలోకి ఇంకిపోయే వాననీటిలా నిశ్శబ్దంగా నిష్క్రమించాడు. తేడా ఆచరణలోనే. ఫలితం ఒక్కటే!అంబాలాల్ తన వైవాహిక జీవితంలోని తొలి పదేళ్లు తనకు సంతానం లేదని బాధపడ్డాడు.ఇప్పుడు ఆయేన జీవనసంధ్యలోనూ అదే పరిస్థితి పునరావృతమైంది. ఓ కాలచక్రం పరిపూర్ణమైందనిపించింది. గుజరాతీ మూలం : విజయ్ శాస్త్రి అనువాదం: రంగనాథ రామచంద్రరావు -
ఇంగువ అంటే?
ప్రాణ స్నేహితుడు చివరి రోజుల్లో ఉన్నాడట.ఎన్ని రోజులు? ఆరా తీశాడు.మహా అయితే వారం.చూసి రావాలి. చూసి రావాలా? చూడగలడా?చిన్నప్పుడు రోజులు బాగా గడిచాయి. ఇద్దరూ కలిసి పెరిగారు. వాన వస్తే చొక్కాలు విప్పి నెత్తి మీద గొడుగు పట్టారు. ఎండ కాస్తే కొమ్మలు తెంపి వొంటి మీద ఛత్రీ పట్టారు. ఎవరి ఇంట్లోనో కాసిన జామకాయల మీద పెత్తనం చేశారు. ఏదో గోడ మీద ఇష్టం లేని హీరోను పేడతో తడిపారు. కాలానికి కూడా బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం ఉంటుంది.ఇప్పుడు వృద్ధాప్యం.ఈ వృద్ధాప్యంలో ఆకు రాలినా కళవళపడేలా మనసు సున్నితమైన క్షణాల్లో వాణ్ణి చూసి రావాలా? చూసి రావాలి. చూడకపోతే ఎలా?ఇంటికి చేరుకున్నాడు. అప్పుడే ఎవరో పలకరించి వెళుతున్నారు. భార్యా పిల్లలూ... ఇంటి పెద్దమనిషికి సుఖవంతమైన వీడ్కోలు ప్రసాదించమని దేవుణ్ణి వేడుకుంటున్నారా? మంచం దగ్గర శబ్దం రాకుండా స్టూల్‌ను లాక్కుని కూచున్నాడు.చేయి పట్టుకున్నాడు.ఎన్నిసార్లు పట్టుకున్న చేయి. వేలసార్లు పట్టుకున్న చేయి. చిన్న కదలిక వచ్చింది. గట్టిగా నొక్కాడు. ఆ కదలికకు కారణమైన మనిషి ఎవరో కనిపెట్టినట్టుగా ఇంకొంచెం కదిలింది. ‘ఎలా ఉన్నావురా?’ అడిగాడు.చేతిలో ఉన్న చేయి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తోంది. కళ్లు ఏవో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి.ఏం చెప్పాలనుకుంటున్నాడు?నోటి దగ్గరగా మెడను వొంచి చెవి దగ్గర చేశాడు.ఆ మిత్రుడు, మృత్యువు గడప దగ్గర నిలుచుని సుసమయం కోసం ఎదురు చూస్తున్న మిత్రుడు, ప్రాణమిత్రుడు, చిరకాల మిత్రుడు... ప్రశ్న వేశాడు.ఏమని?‘ఇంగువ అంటే ఏమిటిరా?’అదిరిపోయాడు. ఒక్క క్షణం ఉలిక్కిపడి చేయి విడిచేశాడు. స్టూలు నుంచి లేచి నిలబడి, ఏం చేయాలో తోచనట్టుగా నిలబడి, ఇప్పుడే వస్తాను అన్నట్టుగా మొదలు నెమ్మదిగా ఆ తర్వాత వడివడిగా అడుగులు వేసి ఇంట్లో నుంచి బయటపడ్డాడు.ఏమిటి వీడు... ఇంకా మర్చిపోలేదా అది?ఒకసారి ఇద్దరూ పెళ్లిలో కలిశారు. అప్పుడా స్నేహితుడు అన్నాడు–‘ఏమిటో రోజులు.. ఎలాగో గడచిపోతున్నాయి. చిన్నచిన్నవి ఏవో అనుకుంటామా తీరవు. రేపు చేద్దాం అనుకుంటాం. ఆ రేపు రాదు. మాపు చేద్దాం అనుకుంటాం ఆ మాపు రాదు. బతుకు బాదరబందీలో పడీ.... అంతెందుకు? ఇంగువ అంటే ఏమిటో తెలుసుకోవాలని నాకెప్పటి నుంచో కోరిక. అదేమైనా చెట్టా కాయా పండా ఫలమా విత్తనమా లవణమా రసాయనమా... ఏమిటా ఇంగువా. రోజూ వంటలో తింటాను కదా. ఈ ఇంగువంటే ఏమిటో కూడా తెలుసుకోకుండానే చచ్చిపోతానా అని బెంగ. ఇంతకీ ఇంగువంటే ఏమిట్రా’ ఏమో. ఎవరికి తెలుసు. తనకూ తెలియదు. ఆ తర్వాత ఆ సంగతి మర్చిపోయాడు. వీడు మర్చిపోలేదే. అది కూడా తెలుసుకోకుండా పోతాడా? అది కూడా తెలపకుండా పంపుతాడా తను?ఏమీ తోచనట్టుగా బజార్లలో తిరిగాడు. ఏమీ తోచనట్టుగా ఏదో సినిమా చూశాడు. మనసుకు శాంతిగా అనిపించలేదు. ఈ ఊళ్లోనే తెలిసిన లెక్చరర్ ఒకడు ఉన్నాడు. వెళ్లి అతణ్ణి అడిగితే?వేళాపాళా లేకుండా ఊడిపడిన అతణ్ణి లెక్చరర్ వింతగా చూశాడు.‘ఇంగువంటే ఏమిటండీ’ సమయం సందర్భం లేకుండా అడిగిన ప్రశ్నకు ఇంకా వింత పడ్డాడు.కాని వాలకం అర్థమైంది. ఏదో అర్జెన్సీలో ఉన్నాడు.అందుకని ఇంగువంటే ఏమిటో అది ఎలా వస్తుందో వివరంగా చెప్పి పంపించాడు.ఇప్పుడు సంతోషంగా ఉంది. సంతృప్తిగా ఉంది. స్నేహితుడి వెలితిని తొలగించగలనన్న నమ్మకం ఉంది. ఇప్పుడు తనకు ఇంగువ అంటే ఏమిటో తెలుసు. అది పండో ఫలమో కాయో బెరడో వేరో లవణమో తనకు తెలుసు. ఇది వెంటనే స్నేహితుడికి చెప్పాలి. కచ్చితంగా చెప్పాలి. చెప్పి తీరాలి.అడుగులు వేగంగా వేశాడు. ఇంత పెద్ద వయసు కదా. అయితే ఏమిటి? పరిగెత్తినట్టు వేశాడు. పరిగెత్తాడా? అదిగో అల్లంత దూరంలో ఇల్లు. ఒరే స్నేహితుడా... ఇంగువ అంటే ఏమిటో చెప్తాను ఉండు ప్రాణం ఉగ్గబట్టుకో... నడుస్తున్నాడు. కాని– ఏడుపు. అవును. ఏడుపు. బాబోయ్ ఏడుపే.పోయాడు. పోయాడే. ఇంగువ అంటే ఏమిటో తెలుసుకోకుండానే పోయాడే.చిన్న కోరిక. చాలా చిన్నది.తీరకుండా పోయాడా?ఎవరికి చెప్పాలి ఇది. ఈ జవాబు ఎవరికి చెప్పాలి.ఇంగువ అంటే... ఇంగువ అంటే... పెద్దగా అరవబోయాడు. అరవనున్నాడు. అరిచి చెప్పనున్నాడు.కథ ముగిసింది.పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథ, ఆయనకు విశేషమైన పేరు తెచ్చిపెట్టిన కథ ‘ఇంగువ’ ఇది.పెళ్లయ్యాక తొలిరోజుల్లో భార్య సిగలో మల్లెలు తురుముతూ ‘మనం తాజ్‌మహల్ వెళ్దాంలే’ అంటాడొకడు. ఎప్పటికీ జరగదు. సొంత ఇల్లు, నాదంటూ ఒక గది, అందులో అల్మారా నిండా పుస్తకాలు అనుకుంటాడొకడు. జరగదు. చిన్నప్పుడు ‘ఒరే శీనయ్యా’ అని ప్రేమగా పిలిచి ఇంకు పెన్ను బహూకరించిన అమ్మాయి ఫలానా ఊళ్లో స్థిరపడి ఉందని తెలిసి వెళ్లి చూడాలి అనుకుంటాడొకడు. కుదరదు. కొండ సానువుల్లో వేపచెట్టు నీడన చల్లటి అమ్మోరితల్లికి దండం పెట్టుకొద్దామనుకుంటాడొకడు. కుదరనే కుదరదు. మంచి బట్టలూ కుదరవు. కళ్లకు నదురైన ఫ్రేమ్‌తో ఉన్న అద్దాలూ కుదరవు. చిన్న చిన్న కోరికలే అన్ని.మనుషులు కోరుకోదగ్గవే.బరువులు, బాధ్యతలు, ఉద్యోగాలు, సద్యోగాలు, చావులు, పుటకలు... వీటిలోనే రోజులన్నీ గడిచిపోతాయి. తీరా తేరుకుని ఇది నా జీవితం దీనిని నేను అనుభవిస్తాను అని అనుకునేలోపు మృత్యువు మంచం కోడు దగ్గర పాశం పట్టుకు నిలబడి ముగింపు సమయాన్ని ప్రకటిస్తుంది.జీవితాన్ని ప్రతిక్షణం ఒక సమాధానంలా జీవించడం అదృష్టం.జీవితాన్ని ప్రతి నిమిషం ఒక సందేహంలా జీవించడం దురదృష్టం.రచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య రవంత ఇంగువను జోడించి ఈ కథలో చెప్పిన రహస్యం ఇదే.ఇప్పుడు అర్థమైందా ఇంగువ అంటే ఏమిటో. – మూలకథకు పునఃకథనం: మహమ్మద్ ఖదీర్‌బాబు (రచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య శుక్రవారం విజయవాడలో కన్నుమూశారు) - పెద్దిభొట్ల సుబ్బరామయ్య -
వ్యాయామంతో వృద్ధాప్యం దూరం...
వయసుతో సంబంధం లేకుండా, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఆయుష్షు కూడా తగ్గుతుందని బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అంటున్నారు. సైక్లింగ్‌తోపాటు ఇతర వ్యాయామాలు చేసే కొంతమంది (55 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు) పై పరిశోధనలు చేసిన తరువాత తాము ఈ అంచనాకు వచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వ్యాయామం కేవలం కండరాలను గట్టిపరచడానికి మాత్రమే కాకుండా రోగనిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోందని ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. రోగ నిరోధక కణాలు (టీ–సెల్స్) తయారు చేసే థైమస్ అనే అవయవం ఇరవై ఏళ్ల తరువాత ఉత్పత్తిని తగ్గించేస్తుందని, వ్యాయామం ఈ పరిస్థితిని మార్చేస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ జానెట్ లార్డ్ తెలిపారు. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం బలహీనమైపోతుందనే భావన కూడా సరికాదని, అందుకే తాము జీవితాంతం వీలైనంత వరకూ శారీరక శ్రమ చేయడం మంచిదని తమ అంచనా అంటున్నారు డాక్టర్ నిహారికా అరోరా దుగ్గల్. వయసు మీదపడిన తరువాత జబ్బులు సాధారణమన్నది తెలిసినప్పటికీ, దీన్ని వ్యాయామం ఆపివేయడానికి సాకుగా చూపరాదని హెచ్చరిస్తున్నారు. -
ఆదర్శప్రాయం ఆమె సేద్యం!
వ్యవసాయంపై మక్కువ ఆమెను వృద్ధాప్యంలోనూ విశ్రాంతి తీసుకోనివ్వటంలేదు. బీఏ బీఈడీ చదివి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా సేవలందించి ఉద్యోగ విరమణ పొందారు పల్లె రమాదేవి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నక్కపల్లి పంచాయతీలోని ఎత్బార్పల్లి ఆమె స్వస్థలం. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రమాదేవి 2002లో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత 38 ఎకరాలలో వ్యవసాయం చేపట్టారు. ఆధునిక పద్ధతులను అనుసరించడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించవచ్చునని నిరూపిస్తున్నారు. శ్రీ వరి సాగు విధానంలో వరి సాగు చేసి ఎకరాకు 50 బస్తాల దిగుబడి సాధించి ప్రశంసలు పొందారు. అధిక శాతం సేంద్రియ ఎరువులతోనే పంటలను సాగు చేస్తున్నారు. పత్తి, మొక్కజొన్న, కంది తదితర పంటలను సాగు చేస్తున్నారు. తోటి రైతులకు సైతం సేంద్రియ ఎరువుల తయారీ పద్ధతులను నేర్పిస్తున్నారు. గ్రామంలోని రైతులను కూడగట్టి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. రైతు పరపతి సంఘాన్ని ఏర్పాటు చేసి పొదుపును ప్రోత్సహిం చారు. ఆంజనేయస్వామి దేవాలయాన్ని నిర్మించారు. కష్టపడి పనిచేసుకుంటే లాభాలు వస్తాయని, పంటల సాగుతో పాటు పాడి పశువులను పెంచుకుంటే పాల ఉత్పత్తితో పాటు సేంద్రియ ఎరువులకూ కొరత ఉండదంటున్నారు ఆదర్శ మహిళా రైతు రమాదేవి(90003 02289). ఉత్తమ రైతుగా 5 పురస్కారాలు పొందడం విశేషం. – వడ్ల విశ్వనాథాచారి, మొయినాబాద్ రూరల్(చేవెళ్ల), రంగారెడ్డి జిల్లా