పెరిగిన పింఛను తీసుకోకనే..
తప్పని వృద్ధాప్యం, వెంటాడే ఆయాసం ఆయన పాలిట శాపంగా మారాయి. పెరి గిన పింఛను డబ్బులు తీసుకుని మందులు కొనుక్కోవాలనుకున్నాడు. మంగళవారం గ్రామసభలకు హాజరయ్యాడు. తొందరలో మాత్రలు వెంట తెచ్చుకోలేదు. సభ జరుగుతుండగానే ఆయాసం వచ్చింది. వైద్యులు పరీక్షిస్తుండగానే కన్నుమూశాడు. ఈ విషాద సంఘటన మదనపల్లె మండలం పోతపోలులో చోటు చేసుకుంది.
మదనపల్లె రూరల్: మదనపల్లె మండలం పోతపోలులో నిర్వహించిన జన్మభూమి గ్రామసభలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. పోతపోలు గ్రామంలో మంగళవారం ఉదయం 9 గంటలకు జన్మభూమి గ్రామసభ సర్పంచ్ పఠాన్ ఖాదర్ ఖాన్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. 27 పల్లెల నుంచి రెండు వేల మందికిపైగా ప్రజలు వచ్చారు. గ్రామ సభకు వస్తే పింఛను ఇస్తామని చెప్పడంతో మందుల ఖర్చుకు ఉంటుందని ఆశపడి పోతపోలు హరిజనవాడకు చెందిన పిచ్చోళ్ల చెన్నప్ప(65) సభకు వచ్చాడు. ఆయాసంతో బాధపడుతున్న ఆయన స్పృహ కోల్పోయాడు. వైద్యులకు సమాచారం అందించారు. అదే సభకు హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ దేశాయితిప్పారెడ్డి చెన్నప్పను పరీక్షిస్తుండగానే కన్నుమూశాడు. భర్త మరణవార్త విన్న చెన్నప్ప భార్య వెంకటమ్మ గుండెలు బాదుకుంది. ‘నన్నూ నీతో పాటే తీసుకెళ్లి పోరాదా..’ అంటూ ఏడ్వడం స్థానికుల హృదయాలను కలచివేసింది.
రావద్దంటే వచ్చాడు..
‘ఆరోగ్యం బాగలేదు. గ్రామ సభకు రావద్దు అంటే వినలేదు. పింఛన్ రద్దు చేస్తారేమోనన్న భయంతో ఇక్కడికి వచ్చాడు. తీరా ఇక్కడికి వచ్చి ప్రాణం పోగొట్టుకున్నాడు’ అంటూ మృతుని కుమారుడు రెడ్డెప్ప తెలిపారు. రెండు రోజులుగా ఆస్పత్రిలో ఉన్నామని, అక్కడే ఉంటే బతికేవాడని అన్నాడు.
పరామర్శించిన సబ్ కలెక్టర్
జన్మభూమి గ్రామసభలో మృతిచెందిన పిచ్చోళ్ల చెన్నప్ప కుటుంబాన్ని మదనపల్లె సబ్ కలెక్టర్ ఆర్‌వీ.కర్ణన్ పరామర్శించారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.తలెత్తినా వీరు గమనించడం లేదు. కొందరైతే ఇళ్ల వద్దకు వెళ్లకుండానే నెలలపాటు యావరేజ్ రీడింగ్‌ను వేస్తూ ఒక్కసారిగా కొంపకొల్లేరు చేస్తున్నారు. ఈ విషయమై పలమనేరు ట్రాన్స్‌కో ఏడీ రాజశేఖర్‌రెడ్డిని వివరణ కోరగా ప్రైవేటు ఏజెన్సీల వల్ల ప్రతినెలా తమకు ఇలాంటి తలనొప్పులు వస్తూనే ఉన్నాయన్నారు.
180 వచ్చే బిల్లు 1,300 వస్తే ఎట్ల కట్టేది
మాకు ప్రతినెలా 180 రూపాయల నుంచి ఇన్నూరు దాకా బిల్లొచ్చేది. ఇప్పుడు 1,300 వచ్చింది. ఇదేమని రీడింగ్ తీసే వాళ్లని అడిగితే ఆఫీసులో పోయి మాట్లాడుకోండి అంటూ దురుసుగా చెప్పి వెళ్లారు. అక్కడికెళ్లి బిల్లు చూపిస్తే దాంతో మాకు సంబంధం లేదు మొత్తం డబ్బు కట్టాల్సిందేఅంటారు. మా కోడలోళ్లకు రూ.2,700 వచ్చింది.
-తవ్వమణి, డ్రైవర్స్ కాలనీ, గంగవరం మండలం
రెండు బల్బులకు నాలుగొందలా..
మాకు ప్రతినెలా రూ.140 బిల్లోస్తా ఉన్నింది. పగటి పూట కూలి పనులకెళతాం. సాయంత్రం వచ్చి అన్నం చేసుకుని తిని లైట్లు ఆఫ్ చేసి పడుకుంటాం. ఇంత పొదుపుగా కరెంటు వాడుకున్నా ఈనెల రూ.451 బిల్లొచ్చింది. నెలనెలా రీడింగ్‌కొచ్చే వాళ్లు ఒక్కోసారి రానే రారు. వాళ్లిష్టానుసారంగా రీడింగ్ తీసుకొనిపోతే దానికి మేం బాధ్యులమా?
-శాంతమ్మ, డ్రైవర్స్ కాలనీ, గంగవరం మండలం