ముసలితనం. మనిషి జీవయాత్రలో అనివార్యమైన చివరి మజిలీ. అయినాసరే, దాని పేరు వింటేనే ఉలిక్కిపడతాం. తప్పదని తెలిసినా వృద్ధాప్యాన్ని తప్పించుకోవడానికి అనాదికాలంగా మనిషి చేయని ప్రయత్నం లేదు. ముదిమిని కనీసం వీలైనంత కాలం వాయిదా వేసేందుకు పడరాని పాట్లు పడేవాళ్లకు కొదవ లేదు! అలాంటి వాళ్లకు ఎంతగానో పనికొచ్చే సంగతొకటి వెలుగు చూసింది. మనిíÙకి వృద్ధాప్యం క్రమక్రమంగా సంక్రమించదట.
జీవనకాలంలో రెండు కీలక సందర్భాల్లో ఒక్కసారిగా వచ్చి మీదపడిపోతుందట. 44వ ఏట ఒకసారి, 60వ ఏట రెండోసారి! అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ, సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ వర్సిటీ చేసిన తాజా అధ్యయనంలో ఈ మేరకు తేలి్చంది. ఆ రెండు సందర్భాల్లోనూ వృద్ధాప్య సంబంధిత మార్పులు ఒంట్లోని అణువణువులోనూ ఉన్నట్టుండి భారీగా చేటుచేసుకుంటాయని వెల్లడించింది.
ఇలా చేశారు...
25 నుంచి 75 ఏళ్ల వయసున్న 108 మందిని సైంటిస్టులు తమ అధ్యయనం కోసం ఎంచుకుంటున్నారు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలవారూ నివసించే కాలిఫోరి్నయా నుంచి వీరిని ఎంపిక చేశారు. ప్రతి మూడు నుంచి ఆర్నెల్లకోసారి వారి రక్తం, మలం, చర్మం తదితర నమూనాలు సేకరించి పరిశీలించారు. మహిళల్లో 40ల అనంతరం తలెత్తే ముట్లుడిగే దశ వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుందన్న వాదన ఉంది. కనుక స్త్రీ పురుషులకు వేర్వేరు డేటాబేస్‌ను నిర్వహించారు.
ఒంట్లో ఆర్‌ఎన్‌ఏ, ప్రొటీన్ల వంటి జీవాణువులు తదితరాల్లో వయసు మీద పడే తీరుతెన్నులను ఏళ్ల తరబడి నిశితంగా పరిశీలించారు. ఫలితాలు వారిని ఆశ్చర్యపరిచాయి. ఈ కీలక జీవాణువులన్నీ ఆడా, మగా తేడా లేకుండా 44వ ఏట భారీ మార్పుచేర్పులకు లోనైనట్టు గమనించారు. 60వ ఏట కూడా మళ్లీ అలాంటి మార్పులే అంతటి తీవ్రతతో చోటుచేసుకున్నాయి. ఫలితంగా స్త్రీ పురుషులిద్దరిలోనూ 55వ ఏట నుంచీ వృద్ధాప్య ఛాయలు కొట్టొచి్చనట్టు బయటికి కని్పంచడం గమనించారు.
40ల నుంచైనా మారాలి
అధ్యయన ఫలితాలు తమను నిజంగా అబ్బురపరిచాయని నాన్యాంగ్ వర్సిటీ మైక్రోబయోమ్ విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ జియావో టావో షెన్ అన్నారు. ‘‘ఉదాహరణకు కెఫిన్‌ను అరిగించుకునే సామర్థ్యం 40 ఏళ్లు దాటాక ఒకసారి, 60 నిండిన మీదట మరోసారి బాగా తగ్గుతుంది. మద్యాన్ని తీసుకున్నా అంతేనని మా పరిశోధనలో తేలింది’’ అని ఆయన చెప్పుకొచ్చారు. అంతేగాక 40 దాటాక ఒంట్లో కొవ్వు పేరుకుపోవడం బాగా పెరుగుతుందని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ జెనెటిక్స్ విభాగం చీఫ్ మైకేల్ స్నైడర్ గుర్తు చేశారు.
‘‘ఆ దశలో కండరాలకు తగిలే గాయాలు ఓ పట్టాన మానవు కూడా. ఎందుకంటే ప్రొటీన్లు ఒంట్లోని కణజాలాలను పట్టి ఉంచే తీరు 44వ ఏట, 60వ ఏట చెప్పలేనంతగా మార్పులకు లోనవుతున్నట్టు తేలింది. ఫలితంగా చర్మం, కండరాలు, హృదయనాళాల వంటివాటి పనితీరు భారీ మార్పులకు లోనవుతోంది. వీటికి తోడు 60ల్లో మనుషుల్లో సాధారణంగా కండరాల క్షీణత ఒక్కసారిగా వేగం పుంజుకుంటుంది. దాంతో వారిలో హృద్రోగాలు, కిడ్నీ సమస్యలు, టైప్ 2 మధుమేహం వ్యాధుల రిస్కు ఎన్నో రెట్లు పెరుగుతోంది’’ అని వివరించారు. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి తమ అధ్యయనం కొత్త దారులు తెరుస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఈ అధ్యయన ఫలితాలను నేచర్ ఏజింగ్ జర్నల్‌లో ప్రచురించారు.
మధ్యవయసు దాటాక మెల్లిమెల్లిగా ముసలితనం గుప్పెట్లోకి వెళ్తామన్నది నిజం కాదు. 40 ఏళ్లు దాటాక రెండు కీలక దశల్లో మనం ఆదమరిచి ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ముదిమి ఒక్కసారిగా వచ్చి మీదపడుతుంది’’
– జియావో టావో షెన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నాన్యాంగ్ వర్సిటీ
జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటే వృద్ధాప్యాన్ని వీలైనంతగా వాయిదా వేసుకోవచ్చన్నది మా అధ్యయన ఫలితాల సారాంశం. మధ్య వయసు దాటాకైనా మద్యం మానేయాలి. లేదంటే కనీసం బాగా తగ్గించాలి. నీళ్లు బాగా తాగాలి. ముఖ్యంగా 40ల్లోకి, 60ల్లోకి ప్రవేశిస్తున్న దశలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి’’
– మైకేల్ స్నైడర్, జెనెటిక్స్ విభాగం చీఫ్, స్టాన్‌ఫర్డ్ వర్సిటీ
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment