oldage
-
44లో మీదపడే..60లో ముదిమి
ముసలితనం. మనిషి జీవయాత్రలో అనివార్యమైన చివరి మజిలీ. అయినాసరే, దాని పేరు వింటేనే ఉలిక్కిపడతాం. తప్పదని తెలిసినా వృద్ధాప్యాన్ని తప్పించుకోవడానికి అనాదికాలంగా మనిషి చేయని ప్రయత్నం లేదు. ముదిమిని కనీసం వీలైనంత కాలం వాయిదా వేసేందుకు పడరాని పాట్లు పడేవాళ్లకు కొదవ లేదు! అలాంటి వాళ్లకు ఎంతగానో పనికొచ్చే సంగతొకటి వెలుగు చూసింది. మనిíÙకి వృద్ధాప్యం క్రమక్రమంగా సంక్రమించదట. జీవనకాలంలో రెండు కీలక సందర్భాల్లో ఒక్కసారిగా వచ్చి మీదపడిపోతుందట. 44వ ఏట ఒకసారి, 60వ ఏట రెండోసారి! అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ, సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ వర్సిటీ చేసిన తాజా అధ్యయనంలో ఈ మేరకు తేలి్చంది. ఆ రెండు సందర్భాల్లోనూ వృద్ధాప్య సంబంధిత మార్పులు ఒంట్లోని అణువణువులోనూ ఉన్నట్టుండి భారీగా చేటుచేసుకుంటాయని వెల్లడించింది. ఇలా చేశారు... 25 నుంచి 75 ఏళ్ల వయసున్న 108 మందిని సైంటిస్టులు తమ అధ్యయనం కోసం ఎంచుకుంటున్నారు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలవారూ నివసించే కాలిఫోరి్నయా నుంచి వీరిని ఎంపిక చేశారు. ప్రతి మూడు నుంచి ఆర్నెల్లకోసారి వారి రక్తం, మలం, చర్మం తదితర నమూనాలు సేకరించి పరిశీలించారు. మహిళల్లో 40ల అనంతరం తలెత్తే ముట్లుడిగే దశ వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుందన్న వాదన ఉంది. కనుక స్త్రీ పురుషులకు వేర్వేరు డేటాబేస్‌ను నిర్వహించారు. ఒంట్లో ఆర్ఎన్ఏ, ప్రొటీన్ల వంటి జీవాణువులు తదితరాల్లో వయసు మీద పడే తీరుతెన్నులను ఏళ్ల తరబడి నిశితంగా పరిశీలించారు. ఫలితాలు వారిని ఆశ్చర్యపరిచాయి. ఈ కీలక జీవాణువులన్నీ ఆడా, మగా తేడా లేకుండా 44వ ఏట భారీ మార్పుచేర్పులకు లోనైనట్టు గమనించారు. 60వ ఏట కూడా మళ్లీ అలాంటి మార్పులే అంతటి తీవ్రతతో చోటుచేసుకున్నాయి. ఫలితంగా స్త్రీ పురుషులిద్దరిలోనూ 55వ ఏట నుంచీ వృద్ధాప్య ఛాయలు కొట్టొచి్చనట్టు బయటికి కని్పంచడం గమనించారు. 40ల నుంచైనా మారాలి అధ్యయన ఫలితాలు తమను నిజంగా అబ్బురపరిచాయని నాన్యాంగ్ వర్సిటీ మైక్రోబయోమ్ విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ జియావో టావో షెన్ అన్నారు. ‘‘ఉదాహరణకు కెఫిన్‌ను అరిగించుకునే సామర్థ్యం 40 ఏళ్లు దాటాక ఒకసారి, 60 నిండిన మీదట మరోసారి బాగా తగ్గుతుంది. మద్యాన్ని తీసుకున్నా అంతేనని మా పరిశోధనలో తేలింది’’ అని ఆయన చెప్పుకొచ్చారు. అంతేగాక 40 దాటాక ఒంట్లో కొవ్వు పేరుకుపోవడం బాగా పెరుగుతుందని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ జెనెటిక్స్ విభాగం చీఫ్ మైకేల్ స్నైడర్ గుర్తు చేశారు. ‘‘ఆ దశలో కండరాలకు తగిలే గాయాలు ఓ పట్టాన మానవు కూడా. ఎందుకంటే ప్రొటీన్లు ఒంట్లోని కణజాలాలను పట్టి ఉంచే తీరు 44వ ఏట, 60వ ఏట చెప్పలేనంతగా మార్పులకు లోనవుతున్నట్టు తేలింది. ఫలితంగా చర్మం, కండరాలు, హృదయనాళాల వంటివాటి పనితీరు భారీ మార్పులకు లోనవుతోంది. వీటికి తోడు 60ల్లో మనుషుల్లో సాధారణంగా కండరాల క్షీణత ఒక్కసారిగా వేగం పుంజుకుంటుంది. దాంతో వారిలో హృద్రోగాలు, కిడ్నీ సమస్యలు, టైప్ 2 మధుమేహం వ్యాధుల రిస్కు ఎన్నో రెట్లు పెరుగుతోంది’’ అని వివరించారు. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి తమ అధ్యయనం కొత్త దారులు తెరుస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఈ అధ్యయన ఫలితాలను నేచర్ ఏజింగ్ జర్నల్‌లో ప్రచురించారు. మధ్యవయసు దాటాక మెల్లిమెల్లిగా ముసలితనం గుప్పెట్లోకి వెళ్తామన్నది నిజం కాదు. 40 ఏళ్లు దాటాక రెండు కీలక దశల్లో మనం ఆదమరిచి ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ముదిమి ఒక్కసారిగా వచ్చి మీదపడుతుంది’’ – జియావో టావో షెన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నాన్యాంగ్ వర్సిటీ జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటే వృద్ధాప్యాన్ని వీలైనంతగా వాయిదా వేసుకోవచ్చన్నది మా అధ్యయన ఫలితాల సారాంశం. మధ్య వయసు దాటాకైనా మద్యం మానేయాలి. లేదంటే కనీసం బాగా తగ్గించాలి. నీళ్లు బాగా తాగాలి. ముఖ్యంగా 40ల్లోకి, 60ల్లోకి ప్రవేశిస్తున్న దశలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి’’ – మైకేల్ స్నైడర్, జెనెటిక్స్ విభాగం చీఫ్, స్టాన్‌ఫర్డ్ వర్సిటీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
81 ఏళ్ల వయసులో పీజీ పట్టా !
సాక్షి, బళ్లారి: చదువుకు వయసుతో పనిలేదు. చదువుకోవాలనే కోరిక ఉంటే చాలు వయసుతో నిమిత్తం లేదు. వృద్ధాప్యంలో ఉన్న కొందరు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. విజయపుర జిల్లా జేఎస్ఎస్ మహా విద్యాలయంలో 81 ఏళ్ల వయసులో నింగయ్య బసయ్య ఎంఏ ఇంగ్లిషులో పట్టా పొందారు. అదే విధంగా విశ్రాంత ఉపాధ్యాయుడు పరసప్ప ఇప్పటికే పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీలు సాధించాడు. తాజాగా ఎంఏ ఇంగ్లిషు పరీక్షలు రాయడం విశేషం. -
మలి వసంతమూ సంతసమే..
ప్రతి మనిషి జీవిత దశని రెండు ప్రధాన అంగాలుగా విభజించుకోవచ్చు. మొదటిది ఉద్యోగబాధ్యతలు నిర్వర్తిస్తూ భార్యాబిడ్డలతో కాలాన్ని గడపడం. రెండోది.. బాధ్యతలను పూర్తిచేసి, ఉద్యోగవిరమణ తర్వాత లేదా ఆరు పదులు నిండాక గడిపే కాలం. వీటిలో మొదటి దశకే ప్రాధాన్యం ఉందని, రెండో దశ పనికిరానిదని భావించడం ఏమాత్రం సమంజసం కాదు. మానవుడు జన్మించాక తన జీవనకాలంలో విభిన్నమైన పరిణామదశలను ఎదుర్కొంటాడు. ముందుగా బాల్యం, తర్వాత కౌమారం, ఆ తర్వాత యవ్వన, ప్రౌఢ దశలను దాటుకుని వృద్ధాప్యంలోనికి అడుగిడడం జరుగుతుంది. ఇది అత్యంత సహజంగా జరిగే జీవన క్రమం. వృద్ధాప్యంలోనికి రాగానే జీవితం అంతా అయిపోయిందని అధిక శాతం వృద్ధులు నైరాశ్యానికి గురి అవుతూ ఉంటారు. అది చాలా తప్పు. ప్రతి జీవన దశలోనూ మనిషికి ప్రత్యేకమైన విషయాలపై శ్రద్ధ కనబరచవలసి ఉంటుంది. అదే విధంగా వృద్ధాప్యంలోనూ కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తే, మలిసంజెలో వెల్లివిరిసే కాంతులు వారికి మనోహరంగానే అగుపిస్తాయి. బాల్యంలో, యవ్వనంలో జరిగిన ముఖ్యమైన కొన్ని సంఘటనలుఆ దశలు పూర్తి అయిన తర్వాతి దశల్లో కూడా మనకు గుర్తుంటాయి.యవ్వనంలో జీవితాన్ని అనుభవించినప్పటి అందమైన రూపం, దఢమైనశరీరం ఇప్పుడు లేకపోయినా, అప్పటి అనుభవం మాత్రం జ్ఞాపకాల రూపంలో పదిలంగా, మధురంగా మన మనస్సులో గుర్తుంటుంది. వృద్ధాప్యంలో ప్రతివారి మదిలో కలిగే సందేహమూ, వారుప్రకటించే భావమూ ఒకటే.. ‘‘నేను ఇది వరకు ఉన్నట్లుగా ఉండలేకపోతున్నాను’’ అనే మాట. ఇది చాలా పెద్ద తప్పిదం. యవ్వనంలో ఉన్నట్లుగా ప్రౌఢవయసులో మనిషి ఉండలేనట్లే, వృద్ధాప్యంలోనూ ప్రౌఢవయసులో ఉన్న సత్తువ మనిషిలో ఉండదు. ఈ విషయాన్ని గ్రహించకపోవడం, గ్రహించినా, విచారిస్తూ ఉండడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. యవ్వనంలో దట్టమైన పటుత్వం, దిట్టమైన బిగువు జీవులందరికీ భగవానుడు ప్రసాదించే సహజ గుణం. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ బిగువు సడలుతూ ఉంటుంది. దానికి ఆవేదన చెందడం నిరర్ధకం. అది శరీరానికుండే సహజ లక్షణం. వయసు పెరుగుతున్నకొద్దీ మనిషికి పెరిగే సంపద ఆపారమైన వారి అనుభవం. గడచిపోయిన కాలం ఒక అనుభవాల సుమహారంలా వారి చెంత పరిమళిస్తూ ఉంటుంది. ఎంతో విలువైన అనుభవాలు, అవి నేర్పిన పాఠాలను యువతరానికి నేర్పడాన్ని మించిన ఆనందం ఎవరికన్నా ఏముంటుంది? ప్రతి అనుభవం ఎంతో విలువైనది. ఎన్నో కష్టాలను, దుఃఖాలను దాటుకుని తెచ్చుకున్న విజయాలను పంచుకుని భావి తరాలను తీర్చిదిద్దగలిగింది విశ్రాంత జీవనం గడిపి మలి సంజలో కాలం గడిపే అనుభవ సంపన్నులే. వారి అనుభవాల చేవను ఏ వ్యక్తిత్వ వికాస గ్రంథాలూ అందించలేవు. అనుభవైక వేద్యమైన వారి జీవనగమనాన్ని కొడుకులతో, మనవళ్ళతో పంచుకుంటూ గడపడం ఆహ్లాదకరమైన విషయం. వృద్ధులు పండుటాకులు కాదు. అనుభవంతో మన ముందు నిలిచే నిండైన అమృతభాండాలు..అనుభవాలను పంచుకునే సమయంలో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రతివాళ్ళూ ఆచరించాలి. పిల్లలకు మంచి విషయాలను బోధించడంలో తమను తాము నియంత్రించుకోవాలి. ‘‘మా రోజుల్లో ఇటువంటివి లేనేలేవు.. మేము ఆ రోజుల్లో ఈ విధంగానే చేశామా’’ అన్న నిరసనాపూర్వక మాటలను మాట్లాడకూడదు. ఈ తరహా మాటలను నేటి తరం ఏ మాత్రం హర్షించదు. ‘‘నువ్వు వెళ్ళే పద్ధతి బావుంది.. కొంచెం నేను చెప్పేది కూడా నీ విజయానికి గానీ, నీ సమస్య పరిష్కారానికి గానీ పనికి వస్తుందేమో చూడు’’ అని మృదువుగా అంటే చాలు, ఆ మాటలు యువత హృదయానికి మరింత గా చేరువ అవుతాయి. పెద్దవాళ్ళు ఆ విధంగా మాట్లాడితే, తమ తర్వాతి తరం వారిని తప్పు పడుతున్నట్లుగా గాక, సాఫల్యపు బాటలో నడిపిన వాళ్ళవుతారు. దేశంలోని, ప్రపంచంలోని రకరకాల ప్రదేశాలు చూసే అవకాశం కేవలంవిశ్రాంత జీవనంలోనే ఎవరికైనా సాధ్యమవుతుంది. ఉద్యోగంలో లేదా వేరే వ్యాపకంలో ఉండే పని ఒత్తిడి వల్ల కొత్త ప్రదేశాలు చూసే సౌలభ్యం తక్కువగానే ఉంటుంది. ఆ విధంగా కొత్త కొత్తవిహారాల్లో సందర్శించే ప్రదేశాలు, అక్కడి ఆహారపు అలవాట్లు, అభిరుచులు తిలకించి ఆనందం పొందడం ద్వారా వృద్ధుల మనసు మరింతగా ఉత్తేజితమవుతుంది. మరింతగా వాళ్ళను చిన్నవాళ్ళను చేసి ఆనంద సంభరితుల్ని చేస్తుంది. యవ్వనంలో, ప్రౌఢవయసులో వచ్చే ఆనందం దొంతర దొంతరలయితే, పెద్ద వయసులో అనుభవంవల్ల అలరించే ఆనందం మన ఊహకందే పిల్ల తెమ్మెరలా హాయిగా మనసును సోకుతూ ఉంటుంది. వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమే. మదిలో మెదిలే భావాలకు అనుగుణంగా మన జీవన నావ సాగుతూ ఉంటుంది. నేను ఎన్నటికీ నవ యువకుడినే అన్న భావం మదిలో నింపుకుంటే ఆనందం సముద్ర తరంగాల్లా ఉరకలు వేస్తూనే ఉంటుంది. మనం సాధించిన విజయాలూ మన జ్ఞాపకాల పందిరిలోంచి పరిమళించే మల్లికల్లా తొంగి చూస్తూ ఉత్సాహానికి ఊపిరులూదుతూనే ఉంటాయి. పెద్దవయసులో గుర్తుపెట్టుకోవలసింది మన వయసునుకాదు.. గడిపే ప్రతి క్షణం తీసుకువచ్చే ఆనందాన్ని మాత్రమే..!! యవ్వనం కొంగ్రొత్త భోగాల సారం.. వృద్ధాప్యం అనుభవాల మణిహారం..!! వృద్ధాప్యం శాపం కాదు...ఆస్వాదిస్తే అణువణువూ ఆనందమే! ప్రతి జీవీ తమ జీవితంలో వృద్ధాప్యాన్ని ఎదుర్కొనక తప్పదు. అయితే ఈ వృద్ధాప్యాన్ని శాపంగా కాకుండా వరంగా భావించి ఆస్వాదిస్తే వృద్ధాప్యంలో కూడా హాయిగా సమయాన్ని అనుభవించవచ్చు. వృద్ధాప్యాన్ని బాధామయమని భావించకుండా, మన కోసం మనం జీవించే అద్భుత అవకాశంగా భావించిన నాడు వృద్ధాప్యం ఏ మాత్రం బాధించదు. – వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి -
ఇలా ఉంటా!
వృద్ధాప్యంలో మనం ఎలా కనిపిస్తాం? అనే ఆలోచనతో ఫేస్‌యాప్ అనే యాప్ తయారైంది. ఈ యాప్ సాయంతో ప్రతి ఒక్కరు టైమ్ మిషన్ అవసరం లేకుండా భవిష్యత్తులో తాము ఎలా ఉంటామో సరదాగా చూసుకుంటున్నారు. ఫేస్‌యాప్ చాలెంజ్ ద్వారా ముడుతలు నిండిన ముఖాలను చూసుకొని మురిసిపోతున్నారు. ఇప్పుడు ఈ చాలెంజ్‌లో శ్రుతీహాసన్ కూడా పాల్గొన్నారు. వృద్ధాప్యంలో తాను ఎలా ఉంటారో చూపించడమే కాకుండా తన ఓల్డ్ ఏజ్ లైఫ్ ఎలా ఉంటుందో కూడా శ్రుతీహాసన్ సరదాగా పంచుకున్నారు. ‘‘జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. నా పదిమంది మనవళ్లు, మనవరాళ్లు, వివిధ దేశాల్లో ఉండే నా ఇల్లు, సంతృప్తికర జీవితం వీటన్నింటికీ నేను చాలా థ్యాంక్‌ఫుల్‌గా ఉంటాను. ‘ఇప్పటికీ మీరు మానసికంగా చిన్నవాళ్లే’ అనే ప్రశ్నకు ఎప్పటిలానే ‘మన శక్తి మేరకు వర్కౌట్ చేయడమే’ అని సమాధానం ఇస్తుంటానేమో?’ అని చెప్పుకొచ్చారు శ్రుతీహాసన్. ఇంతకీ అర్థమైందా? తాను ఓల్డ్ ఏజ్‌లో ఉన్నట్లుగానే ఫీలై, శ్రుతి ఈ విధంగా చెప్పారు. -
కొండంత భరోసా..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పెరిగిన జూన్ నెల వైఎస్సార్ పెన్షన్ కానుకను (పెన్షన్ మొత్తాన్ని ) దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై నెల 8వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నట్లు జగన్ సర్కార్ ప్రకటించింది. గతంలో ప్రతినెలా 1వ తేదీ నుంచి వారం రోజులపాటు ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేసేది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్ సీఎం అయ్యాక మేనెల పెన్షన్ జూన్ 1 న పంపిణీ చేశారు. అయితే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు పెన్షన్ మొత్తాన్ని భారీగా పెంచుతూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం 30–05–2019 న జీఓ నంబర్ 103 ను విడుదల చేసింది. పెరిగిన పెన్షన్ మొత్తాన్ని దివంగత వైఎస్ జయంతి రోజైన జూలై 8వ తేదీ నుంచి పెన్షన్‌దారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జగన్ సర్కార్ శుక్రవారం డీఆర్డీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో జూలై 8 నుంచి పెన్షన్ల పంపిణీకి అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పెన్షన్లు 3,80,490 ఉండగా వీరికి రూ.92,18,24,250 మొత్తాన్ని పంపిణీ చేయాల్సి ఉంది. గతంలో ఇదే పెన్షన్‌దారులకు రూ.81,75,69,000 మాత్రమే ఇవ్వగా ఇప్పుడు పెరిగిన పెన్షన్ ప్రకారం జిల్లాకు అదనంగా రూ.10.42 కోట్లు వస్తోంది. సీఎం వైఎస్ జగన్ ఎన్నికల్లో మాట ఇచ్చిన మేరకు హామీని నిలబెట్టుకోవడంతో పెన్షన్‌దారుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పెరిగిన పెన్షన్ మొత్తం జూలై 8న వైఎస్సార్ జయంతి నాడు అందరికీ అందనుంది. జిల్లాలో పెన్షన్‌దారుల వివరాలు: అభయహస్తం పెన్షన్లు 4586, డప్పు కళాకారులు 3101, వికలాంగులు 39,298, మత్స్యకార పెన్షన్లు 3449, వృద్దాప్య పెన్షన్లు 1,75,574, ఒంటరి మహిళ 8524, కల్లు గీత కార్మికులు 379, చర్మకారులు 3212,ట్రాన్స్‌జెండర్ 100, చేనేత 8821, వితంతు పెన్షన్లు 1,32,996 డయాలసిస్ వారు 450 మంది ఉన్నారు. పండుగలా పెన్షన్ల పంపిణీ: పెరిగిన పెన్షన్ల మొత్తాన్ని జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, వార్డుల్లో పండుగ వాతావరణంలో పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ల పంపిణీకి అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వైఎస్సార్ పెన్షన్ కానుక లబ్ధిదారుల పేర్లను ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నోటీసు బోర్డుల్లో ఉంచాలి. పెన్షన్ పంపిణీ కేంద్రాల్లో పెన్షన్ లకు సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయాలి. పెన్షన్‌దారులకు కొత్తగా వైఎస్సార్ పెన్షన్ కానుక పాస్ బుక్కుల ను అందించాలి. పెరిగిన పెన్షన్ మొత్తం వివరాలను మండల పరిషత్ అధికారులు, మున్సిపల్ అధికారులు విస్తృతంగా ప్రచారం చేయాలి. అందుకు సంబంధించి పోస్టర్, బ్యానర్లు మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాలు, వార్డులు, గ్రామ పంచాయతీ కార్యాలయాలతో పాటుగా జనసంచారం ఉండే కూడళ్లలో సైతం ఏర్పాటు చేయాలి. పెరిగిన పెన్షన్ ఇలా.. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు సీఎం అయిన మరుక్షణమే వైఎస్ జగన్ అన్ని రకాల పెన్షన్ల మొత్తాన్ని భారీగా పెంచారు. ప్రధానంగా వృద్ధులు, వితంతువులు, కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, చర్మకారులు, హెచ్ఐవీ బాధితులకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని రూ.2 వేల నుంచి రూ.2,250 కి పెంచుతూ జీఓ నంబన్ 103ని విడుదల చేశారు. అలాగే వికలాంగులకు రూ.3 వేలు, డయాలసిస్ పేషెంట్లకు ఇచ్చే మొత్తాన్ని రూ.3500 నుంచి రూ.10 వేలకు పెంచారు. జూలై 8 న పెన్షన్ మొత్తం బ్యాంకుల వారీ విడుదల వివరాలు: ఆంధ్రాబ్యాంకు 13 బ్రాంచీల పరిధిలో రూ.20,50,38,000, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు పరిధిలో రూ.84,46,750, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.1,52,25,500, కెనరా బ్యాంక్ నుంచి రూ.1,78,65,000, కార్పొరేషన్ బ్యాంక్ నుంచి రూ.1,43,81,000, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి రూ.76,53,250, స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా పరిధిలోని 36 బ్రాంచిల నుంచి రూ.49,97,48,750, సిండికేట్ బ్యాంక్ పరిధిలోని 9 బ్రాంచ్‌ల నుంచి రూ.14,01,03,000, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.1,33,63,000 లు మొత్తం పై బ్యాంకుల కు సంబంధించి 64 బ్రాంచీల పరిధిలో మొత్తం రూ.92,18,24,250 పెన్షన్‌దారులకు ఇవ్వనున్నారు. -
వృద్ధురాలిపైకి దూసుకొచ్చిన బస్సు
మాచర్ల: నడిచి వెళ్తున్న వృద్ధురాలి మీద ఆర్టీసీ బస్సు టైర్ ఎక్కడంతో ఆమె రెండు కాళ్లు విరిగిపోయాయి. పిడుగురాళ్ల మండలం నెమలిపురి గ్రామానికి చెందిన ఎడ్లపల్లి కోటమ్మ రెండు రోజులుగా మాచర్లలో యాచిస్తూ జీవనం సాగిస్తోంది. సోమవారం ఉదయం ఆమె బస్టాండ్‌లోకి వస్తున్న సమయంలో గుంటూరు డిపోకు చెందిన ఏపి 29 జడ్ 431 నెంబర్ బస్సు డ్రైవర్ ఎస్.కె.ఎండి. మీరా బస్సును రివర్స్ చేశాడు. ఈ సమయంలో పక్కనే ఉన్న కోటమ్మ రెండు కాళ్లు టైర్ కిందకు వెళ్లడంతో పూర్తిగా విరిగిపోయాయి. పోలీసులు ఈమెను మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చే సి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
ఇప్పటికింకా మా వయస్సు నిండా పదహారే
ఎవరన్నారు ముసలితనానికి దసరా వేషాలని..? సంకల్పం..సాహసం..సాధన ఉండాలే కానీ యువతరానికి ధీటుగా వారు కూడా రాణించగలరు..అరుదైన రికార్డులు సృష్టించగలరు. సాహసమే ఊపిరిగా సాగిపోగలరు. యువతకు స్ఫూర్తినివ్వగలరు. 80 ఏళ్ల వయసులోనూ పతకాలు తేగలరు. 70 ఏళ్లు దాటినా చిరుతలా దూసుకుపోగలరు. వృద్ధాప్యం వయసుకుగానీ మనసుకు కాదని ఛాలెంజ్ చేసి మరి చెబుతున్నారు. దమ్ముంటే మాతో పోటీ పడండి డూడ్ అంటూ సవాల్ చేస్తున్నారు. హెన్స్ ప్రూవ్డ్..కావాలంటే వీరిని చూడండి. వృద్ధాప్యంలోనూ వెటరన్ క్రీడల్లో పతకాలు పంట లక్ష్మి,రాజు చోడవరం: అరవైయేళ్లు దాటితే ఇక జీవితం వృద్ధాప్యంలోకి వచ్చేశామంటూ చాలా మంది నిట్టుర్పుగా బతుకుతారు. వృద్ధాప్యం వస్తే జీవితం ముగిసిపోయినట్టు అనుకుంటారు. మనస్సుకు, మానసిక ఉల్లాసానికి వయస్సు లేదంటున్నారు ఈ వెటరన్ క్రీడాకారులు. 75యేళ్ల వయస్సులోనూ అంతర్జాతీయ స్థాయిలో వెటరన్ అథ్లెటిక్ క్రీడల్లో బంగారు పతకాలు సాధించి వారెవ్వా అనిపించారు. జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయి వెటరన్ క్రీడల్లో పాల్గొంటూ ఎన్నో బంగారు, వెండి పతకాలు సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చోడవరానికి చెందిన ముత్యలం లక్ష్మి(80),గణపతి సూర్యనారాయణరాజు (75) వృద్ధాప్యాన్ని జయించి ఆటల్లో అందరికీ ఆదర్శంగా నిలిచారు. వీరు బరిలోకి దిగితే ఎంతటి వారైనా తమ ముందు ఓడిపోవాల్సిందే అన్నట్లు తమ పరుగులతో విజయాలు నమోదు చేశారు. వచ్చాడొచ్చాడు మీసాల ‘రాజు’ గణపతిరాజు సూర్యనారాయణ రాజు 1949 ఏప్రిల్‌లో విశాఖ జిల్లా యలమంచిలిలో జన్మించారు. యలమంచిలి గవర్నమెంట్ హైస్కూల్లో సెవెంత్ ఫారం చదువుకున్నారు. పాఠశాల స్థాయి నుంచీ స్కూల్‌గేమ్స్‌లో పాల్గొంటూ అనేక విజయాలు సాధించారు. చోడవరంలో నివాసం స్థిరపడ్డ ఈయన 1976లో వైజాగ్ నేవల్ డిపార్టుమెంటులో వెపన్ డిపార్టుమెంటులో ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో చేస్తూ ఆలిండియా సివిల్ సెంట్రల్ ఎంప్లాయీస్ తరఫున ఆగ్రాలో హాకీ ఆడారు. అలాగే 1989 నుంచి వెటరన్ క్రీడల్లో పాల్గొంటూ విజయాలు కైవసం చేసుకుంటున్నారు. వెటరన్ క్రీడల్లో జాతీయ స్థాయి పరుగుల పోటీల్లో అయిదు సార్లు , రాష్ట్ర స్థాయిలోని 28 సార్లు ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించారు. సిల్వర్ పతకాలు 24 సార్లు సాధించారు. ఇటీవల భూపాల్‌లో జరిగిన జాతీయ స్థాయి వెటరన్ పరుగుల పోటీల్లో 66 నుంచి 70 ఏళ్ల విభాగంలో 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు పరుగులోని, 4–400 రిలే పోటీలో తతీయ స్థానం సాధించారు. పోటీల్లో పాల్గొనడానికి ఎక్కడికి వెళ్లినా మీసాల రాజు వచ్చాడురా.. అని కొందరు. విశాఖ పులి వచ్చింది అని మరి కొందరు అంటారు. వృద్ధాప్యం అన్న ఆలోచనే లేదు: చిన్నతనం నుంచి బాల్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్లం. హాకీ కూడా ఆడేవాళ్లం. ఈస్ట్రన్ నావెల్ కమెండోలో 45 విభాగంలో మూడు సార్లు ఆల్ రౌండ్ ఛాంపియన్ షిప్ సాధించాను. క్రీడల్లో పాల్గొనడం వలన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాం. నాన్న సీతారామరాజు, అమ్మ నారాయణమ్మలు ప్రోత్సహించారు. ప్రస్తుతం కుటుంబసభ్యులు, చోడవరం వాకర్స్ క్లబ్, విశాఖపట్నం మాస్టర్ అథ్లెటిక్స్వారు పోత్సహిస్తున్నారు. –గణపతి రాజు సూర్యనారాయణరాజు, వెటరన్ క్రీడాకారుడు . పరుగుల సునామీ ‘ముత్యం లక్ష్మి’ ముత్యం లక్ష్మి. వయసు 80. అంతర్జాతీయ స్థాయిలో పరుగు,నడక పోటీల్లో జిల్లా ఖ్యాతిని చాటారు. చోడవరంలోనే చిన్నతనం నుంచి జీవిస్తున్న ఈమె చిన్న వయస్సు నుంచి క్రీడలపై మక్కువ ఏర్పర్చుకున్నారు. జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీల వరకు అనేక సార్లు వెటరన్ క్రీడా పరుగులు, నడక పోటీల్లో పాల్గొని ప్ర«థమ స్థానం, ద్వితీయ స్థానం సాధించి బంగారు, వెండి పతకాలతో సత్తా చాటారు. ముత్యం లక్ష్మి సొంత గ్రామం దేవరాపల్లి మండలం మామిడి పల్లి గ్రామం. పదేళ్లలో 25 గోల్డ్ మెడల్స్, 15 సిల్వర్ మెడల్స్ సాధించారు. ఇండియాలో అనేక ప్రాంతాల్లో ఆడిన ఆమె మలేషియా, చైనా, గోవా,కోలంపూర్ తదితర ప్రాంతాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ప్ర«థమ స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించారు. ఇటీవల భూపాల్, విశాఖపట్నంలో జరిగిన వెటరన్ పోటీల్లో 75 ప్లస్ విభాగంలో 800 మీటర్లు పరుగు పోటీలో ప్రథమ స్థానం, 100 మీటర్లు రెండో స్థానం, 4– 400 రిలే పోటీలో ప్రథమ స్థానం సాధించారు. త్వరలో మలేషియా, అమెరికా, సింగపూర్‌లో జరిగే పోటీలకు ఆహ్వానం వచ్చింది. వయస్సుతో పనేముంది సీనియర్ సిటిజన్స్‌కు ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం.. రమ్మని ఓ స్వచ్ఛంధ సంస్థకు చెందిన మహిళలు ఆహ్వానం పలికారు. నా భర్త కొండాజీ ప్రోత్సహించారు. ఆ పోటీల్లో షాట్ పుట్, పరుగు, నడకతో పాటు పలు పోటీల్లో గెలిచాను. అప్పటి నుంచి భర్త పోత్సాహాంతో పలు పోటీల్లో పాల్గొన్నాను. ఇది 20 ఏళ్ల కిందటి మాట. మొదట్లో చీరతో బూట్లు లేకుండా పరిగెత్తే దాన్ని ,ఇప్పుడు ట్రాక్ మాత్రమే వేసుకుంటా. బూట్లు మాత్రం వేసుకోను. అనుకోకుండా 9 ఏళ్ల క్రితం భర్త చనిపోయారు. దీంతో కోలుకోలేకపోయాను. తోటివారు ధైర్యం చెప్పి మళ్లీ పోటీలకు పంపారు. వెళ్లిన ప్రతిసారీ బంగారు పతకంతో తిరిగివచ్చేదాన్ని. ప్రస్తుతం మాస్టర్ అథ్లెటిక్స్ విశాఖపట్నం వారు ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంగా వున్నాను. –ముత్యం లక్ష్మి, వెటరన్ క్రీడాకారిణి చోడవరం -
ఎన్నాళ్లీ.. నడకయాతన
పండుటాకులకు తప్పని పింఛన్‌పాట్లు ప్రతినెలా కొమ్మాయిగూడెం నుంచి రామన్నపేటకు వెళ్లాల్సిందే.. 350మంది లబ్ధిదారులు రానుబోను 5కి.మీ. మేర కాలినడకనే.. కొమ్మాయిగూడెం (రామన్నపేట) ఆసరా పింఛన్ డబ్బులు పొందేందుకు వృద్ధులకు అవస్థలు తప్పడం లేదు. ప్రతినెలా పింఛన్ తీసుకునేందుకు వారి పడే కష్టాలు అన్నీఇన్ని కావు. మండలంలోని కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన ఆసరా పింఛన్ లబ్ధిదారులే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పింఛన్ డబ్బులు చేతనైనా కాకపోయినా, ఎండైనా వానైనా మండలకేంద్రానికి కాలినడకన వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి వారిది. కొమ్మాయిగూడెం.. రామన్నపేట మేజర్‌గ్రామపంచాయతీ పరిధిలోని మధిరగ్రామం. మండలకేంద్రానికి 2.5కిలోమీటర్ల దూరం ఉంటుంది. కొమ్మాయిగూడెంలో 400పైగా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. జనాభా 2,500 వరకు ఉంటుంది. రామన్నపేట మేజర్‌గ్రామపంచాయతీ పరిధిలో మొత్తం 1,035మంది ఆసరాపింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. వారిలో 329 వృద్ధాప్య, 439 వితంతువులు, 142 వికలాంగులు, 62 గీతకార్మికులు, 63 చేనేతకార్మికులు ఉన్నాయి. ఇందులో సుమారు 350మంది లబ్ధిదారులు కొమ్మాయిగూడెం గ్రామానికి చెందినవారే కావడం గమనార్హం. గ్రామానికి చెందిన ఆసరా పింఛన్ లబ్ధిదారులు పింఛన్‌డబ్బులు పొందాలంటే ప్రతినెలా మండలకేంద్రానికి వెళ్లాలి. ఆర్‌అండ్‌బీకి చెందిన బీటీరోడ్డు ఉన్నప్పటీకీ గ్రామం మీదుగా ఆర్టీసీ బస్సులు, ఆటోలు తిరగవు. దీంతో పింఛన్‌దారులు ప్రలినెలా కాలినడకన మండలకేంద్రానికి వెళ్లవలసి వస్తుంది. పింఛన్‌డబ్బులు పొందడానికి రోజంతా పడుతుంది. సాయంత్రందాక తిండిలేక, తాగడానికి నీళ్లు దొరకక తీవ్ర అసౌకర్యారికి గురవుతూ పింఛన్ తెచ్చుకుంటన్నామని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఇందులో ముఖ్యంగా ఎండాకాలంలో వృద్ధుల పడే బాధలు వర్ణణాతీతంగా మారాయి. సీఎస్పీని ఏర్పాటుచేయాలని వేడుకోలు ఆసరా పింఛన్ లబ్ధిదారులు, ఉపాధిహామీ కూలీలకు డబ్బులు చెల్లించేందుకు కొమ్మాయిగూడెంలో సీఎస్పీ (కమ్యూనిటీ సర్వీస్ ప్రొవైడర్)ని ఏర్పాటు చేయాలని వామపక్షపార్టీలు, ప్రజాప్రతిని«ధులు అనేక పర్యాయాలు పంచాయతీరాజ్, పోస్టల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయినా ఆయాశాఖల నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. రోజంతా పడుతుంది –గుర్జాల బాల్‌రెడ్డి ఈ మధ్యన నాలుగైదు రోజులే పింఛన్లు పంచుతున్నారు. అందరు ఓకేసారి ఎగబడుతున్నారు. మేం నడుచుకుంటూ వచ్చి సీరియల్లో పెట్టడం ఆలస్యం అవుతుంది. దీంతో మా వంతువచ్చి పింఛన్‌డబ్బులు తీసుకోవడానికి రోజంతా పడుతుంది. సర్కారోళ్లు పుణ్యం కట్టుకోవాలి – శానగొండ ఈశ్వరమ్మ మా ఊరుమీదుగా బస్సులు ఆటోలు తిరగవు. నడుచుకుంటూనే పోస్టాఫీసుకు వెళ్లి వస్తాం. రానుబోను ఐదారు కిలోమీటర్లు ఉంటుంది. ఆడాడ చెట్లకింద కూర్చూని నడక సాగిస్తాం. సర్కారోళ్లు మా ఊళ్లోనే పింఛన్‌డబ్బులు ఇప్పించి పుణ్యం కట్టుకోవాలి.