వృద్ధురాలిపైకి దూసుకొచ్చిన బస్సు
మాచర్ల: నడిచి వెళ్తున్న వృద్ధురాలి మీద ఆర్టీసీ బస్సు టైర్ ఎక్కడంతో ఆమె రెండు కాళ్లు విరిగిపోయాయి. పిడుగురాళ్ల మండలం నెమలిపురి గ్రామానికి చెందిన ఎడ్లపల్లి కోటమ్మ రెండు రోజులుగా మాచర్లలో యాచిస్తూ జీవనం సాగిస్తోంది. సోమవారం ఉదయం ఆమె బస్టాండ్‌లోకి వస్తున్న సమయంలో గుంటూరు డిపోకు చెందిన ఏపి 29 జడ్ 431 నెంబర్ బస్సు డ్రైవర్ ఎస్.కె.ఎండి. మీరా బస్సును రివర్స్ చేశాడు. ఈ సమయంలో పక్కనే ఉన్న కోటమ్మ రెండు కాళ్లు టైర్ కిందకు వెళ్లడంతో పూర్తిగా విరిగిపోయాయి. పోలీసులు ఈమెను మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చే సి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.