శ్రుతీహాసన్
వృద్ధాప్యంలో మనం ఎలా కనిపిస్తాం? అనే ఆలోచనతో ఫేస్‌యాప్ అనే యాప్ తయారైంది. ఈ యాప్ సాయంతో ప్రతి ఒక్కరు టైమ్ మిషన్ అవసరం లేకుండా భవిష్యత్తులో తాము ఎలా ఉంటామో సరదాగా చూసుకుంటున్నారు. ఫేస్‌యాప్ చాలెంజ్ ద్వారా ముడుతలు నిండిన ముఖాలను చూసుకొని మురిసిపోతున్నారు. ఇప్పుడు ఈ చాలెంజ్‌లో శ్రుతీహాసన్ కూడా పాల్గొన్నారు. వృద్ధాప్యంలో తాను ఎలా ఉంటారో చూపించడమే కాకుండా తన ఓల్డ్ ఏజ్ లైఫ్ ఎలా ఉంటుందో కూడా శ్రుతీహాసన్ సరదాగా పంచుకున్నారు.
‘‘జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. నా పదిమంది మనవళ్లు, మనవరాళ్లు, వివిధ దేశాల్లో ఉండే నా ఇల్లు, సంతృప్తికర జీవితం వీటన్నింటికీ నేను చాలా థ్యాంక్‌ఫుల్‌గా ఉంటాను. ‘ఇప్పటికీ మీరు మానసికంగా చిన్నవాళ్లే’ అనే ప్రశ్నకు ఎప్పటిలానే ‘మన శక్తి మేరకు వర్కౌట్ చేయడమే’ అని సమాధానం ఇస్తుంటానేమో?’ అని చెప్పుకొచ్చారు శ్రుతీహాసన్. ఇంతకీ అర్థమైందా? తాను ఓల్డ్ ఏజ్‌లో ఉన్నట్లుగానే ఫీలై, శ్రుతి ఈ విధంగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment