Shruthi hasan
-
హాట్ టాపిక్‌గా శ్రుతిహాసన్ రెమ్యునరేషన్.. చిరు సినిమాకు అన్ని కోట్లా ?
Shruthi Hasan High Remuneration For Chiranjeevi Movie: డైరెక్టర్ కెఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా శ్రుతిహాసన్‌ను ఎంపిక చేసినట్లు మహిళల దినోత్సవం రోజున ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఒక విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం శ్రుతిహాసన్ తీసుకునే రెమ్యునరేషన్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. చదవండి: చిరంజీవికి జోడిగా ఆ హీరోయిన్.. ఉమెన్స్ డే సందర్భంగా రివీల్ చిరు 154వ చిత్రం కోసం ఈ రేసుగుర్రం బ్యూటీ సుమారు రూ. 2 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసిందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అంతేకాకుండా ఆమె అడిగిన రెమ్యునరేషన్‌ను ఇచ్చేందుకు మేకర్స్ కూడా అంగీకరించారని సమాచారం. శ్రుతిహాసన్ చిరు సరసనే కాకుండా నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రభాస్‌కు జోడిగా కూడా నటిస్తోంది. అయితే శ్రుతిహాసన్.. బాలయ్య చిత్రానికి రూ. కోటిన్నర తీసుకోనున్నట్లు సమాచారం. సీనియర్ హీరోలకు జంటగా వరుస ఆఫర్లు రావడంతో శ్రుతిహాసన్ రెమ్యునరేషన్ పెంచేసినట్లు టాక్ వినిపిస్తోంది. చదవండి: బడ్జెట్ రూ.300 కోట్లు, అందులో సగం రెబల్ స్టార్కే! -
చిరంజీవి 154వ సినిమాలో ఆ హీరోయిన్.. ఉమెన్స్ డే సందర్భంగా రివీల్
మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. యంగ్ హీరోలకన్నా తనేమి తక్కువ కాదంటూ మూడు సినిమాలను లైన్లో పెట్టారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29, 2022న విడుదలకు సిద్ధంగా ఉంది. మెహర్ రమేష్ డైరెక్షన్లో వస్తున్న చిరింజీవి మరో చిత్రం భోళా శంకర్ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇక బాబీ దర్శకత్వం వహిస్తున్న మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రం ఒకటి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి తాజా అప్డేట్ను ఇచ్చారు మేకర్స్. మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ చిత్రంలోని హీరోయిన్ ఎవరో పరిచయం చేశారు దర్శకనిర్మాతలు. ఈ సినిమాలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మహిళా దినోత్సవం రోజున ఇంతకంటే మంచి వార్త ఏం ఉంటుంది. వెల్కమ్ శ్రుతి అంటూ సినిమా యూనిట్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే మొదటి నుంచే ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ అని పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఇవే కాకుండా ప్రభాస్ సరసన సలార్‌లో, గోపిచంద్ మలినేని డైరెక్షన్లో బాలకృష్ణకు జోడిగా శ్రుతిహాసన్ నటిస్తోంది. On this Women's Day, delighted to Welcome you on board @shrutihaasan You bring Woman Power to #Mega154 @MythriOfficial @dirbobby #GKMohan @ThisIsDSP pic.twitter.com/xYMaiQPpni — Chiranjeevi Konidela (@KChiruTweets) March 8, 2022 What better day than #WomensDay to announce the big news! Welcoming #Mega154 Maguva, the gorgeous & talented @shrutihaasan on board for #Mega154 💥 Megastar @KChiruTweets @dirbobby @ThisIsDSP 🔥 pic.twitter.com/kRwiDTDoCR — Mythri Movie Makers (@MythriOfficial) March 8, 2022 -
బిగ్ బాస్‌కి హోస్ట్‌గా శ్రుతీహాసన్!
తమిళ ‘బిగ్ బాస్’ షోకి హీరోయిన్ శ్రుతీహాసన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం ‘బిగ్ బాస్’ 5వ సీజన్ నడుస్తోంది. ఈ షోకి నటుడు కమల్‌హాసన్ హోస్ట్‌గా ఉన్నారు. అయితే కరోనా పాజిటివ్‌తో కమల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన స్థానంలో తాత్కాలికంగా కొత్త వ్యాఖ్యాత ఎవరు ఉంటారనే చర్చ జరుగుతోంది. కమల్ స్థానంలో ఆయన కుమార్తె శ్రుతీహాసన్‌ను తీసుకోవాలని ‘బిగ్ బాస్’ నిర్వాహకులు అనుకున్నారట. శ్రుతీని సంప్రదించారని కూడా టాక్. ఆమె కూడా షోను హోస్ట్ చేయడానికి ఆసక్తి చూపించినట్లు భోగట్టా. కాగా ‘బిగ్ బాస్’ తాత్కాలిక వ్యాఖ్యాత లిస్టులో హీరో సూర్య, నటి రమ్యకృష్ణల పేర్లను పరిశీలిస్తున్నట్లు కూడా ఓ వార్త వినిపిస్తోంది. మరి కమల్ ‘బిగ్ బాస్’కి వచ్చేవరకూ ఎవరు హోస్ట్ చేస్తారనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
శృతిహాసన్ గురించి ఎవరికీ తెలియని విషయం ఇదే!
తండ్రి కమల్‌హాసన్ నుంచి శ్రుతీహాసన్ ఏం నేర్చుకున్నారు? లండన్‌లో ఆమె ఇల్లు కొన్నారా? శ్రుతి వాట్సప్ నెంబర్ ఏంటి? ఆమె బలాలు.. బలహీనతలు.. ఇలా ఎన్నో విషయాలకు సమాధానం దొరికింది. బుధవారం ఆమె శ్రుతి ట్విట్టర్లో చాట్ చేశారు. నెటిజన్ల సీరియస్ ప్రశ్నలు... శ్రుతి కొంటె సమాధానాలు, నెటిజన్ల కవ్వింపులు, శ్రుతి తెలివైన జవాబులు... ఇలా సాగిన ఈ చాట్ సెషన్ పై ఓ లుక్ వేయండి. ► మీ జీవితంలో మీకు బాగా గుర్తుండిపోయే జ్ఞాపకం? సింగపూర్‌లో గాయనిగా తొలిసారి నేను స్టేజ్‌పై పాట పాడిన సంఘటన నా బెస్ట్ మెమరీ. ► మీ జీవితంలో మీరు పశ్చాత్తాపపడిన సంఘటనలు ఏమైనా? కొన్ని ఉన్నాయి. కానీ మరీ అంత బాధపడే సంఘటనలైతే కాదు. నిజం చెప్పాలంటే జీవితంలో మనం ఊహించకుండా జరిగేవన్నీ మంచి పాఠాలే. ► మీరు తరచుగా ఎందుకు నలుపు రంగు దుస్తులే ధరిస్తారు? నలుపు రంగు నాకు సూట్ అవుతుందని, అందంగా కనిపిస్తానని నా ఫీలింగ్. పైగా నేను ఏదైనా తినేటప్పుడు పొరపాటున నా దుస్తులపై పడితే మరకలు పెద్దగా కనిపించవు కదా (సరదాగా). ► దురదృష్టవశాత్తు మీరు అడవిలో ఒంటరిగా మిగిలిపోతే ఏ జంతువు మీకు బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది? సింహం. ► మీరు డేట్‌కు వెళ్లాలనుకుంటే మీ ఫస్ట్ ప్రియారిటీ ఎవరు? ఇది నాకు అసలు ప్రియారిటీయే కాదు. ► ఏ ఫిక్షనల్ క్యారెక్టర్‌ను మీరు మీ లైఫ్‌లో కలవాలనుకుంటున్నారు? తాలియా రస్గుల్ (అమెరికన్ కామిక్ బుక్స్‌లోని క్యారెక్టర్) ► దోసె, వడా పావ్, ప్యాన్ కేక్స్... వీటిలో మీకు ఏది ఇష్టం? సందేహం లేదు... దోసె. ► మీ పేరును సరిగ్గా పలకలేని కొందరి గురించి మీరేం చెబుతారు? చాలామంది చాలా రకాలుగా నా పేరును పలుకుతుంటారు. నాకది కామెడీగా ఉంటుంది. ► మీ ఇల్లు కాకుండా ప్రపంచంలో మీకు బాగా నచ్చే ప్లేస్? లండన్ . అక్కడ నాకు ఓ ఇల్లు కూడా ఉంది. ► మీలో ఉన్న మంచి, చెడుల గురించి? నాలో ఉన్న మంచి గురించి ఇతరులు చెప్పాలి. ఇక నాలో ఉన్న చెడు గురించి చెప్పాలంటే నాకు సహనం చాలా తక్కువ. అందుకే లాక్డౌన్ లో ఈ విషయంపై ఫోకస్ పెట్టాను. ఇప్పుడు ఫర్లేదు. ► మీరు త్వరలో ఉత్తరాఖండ్‌కు వచ్చే ప్లాన్ ఏమైనా ఉందా? లేదు. కానీ రావాలని ఉంది ► బెంగళూరు, చెన్నై... ఇంతకీ ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు? ముంబయ్‌లో! ► మహిళల గురించి మీ మనసులో ఉన్న మాట? మహిళల హక్కులు, సంక్షేమం, చిన్నపిల్లల భద్రత బాగుండాలి. ► మీ ఫ్యాన్ మూమెంట్? నా చిన్నప్పటి నుంచి సింగర్ టోరి అమోస్‌కు వీరాభిమానిని. లండన్ లో ఆమెను కలిసేందుకు ఓ కాఫీ షాప్‌కు పరిగెత్తుకుంటూ వెళ్లాను. ఆ సమయంలో భావోద్వేగానికి లోనై ఏడ్చాను. ► మీ మొబైల్ వాల్‌పేపర్‌పై ఏ పిక్చర్ ఉంటుంది? మురుగన్ (కుమారస్వామి). ► మీ వాట్సప్ నెంబర్? 100. ► మిమ్మల్ని గతంలోకి తీసుకుని వెళ్లే మిషన్ మీ దగ్గర ఉంటే..? నా ఎనిమిదో తరగతి క్లాసులకు వెళతాను ► మిమ్మల్ని సంతోషపరచే మూడు చిన్న విషయాలు? నిజం, నిద్ర, స్వచ్ఛమైన కౌగిలింత. ► మీ గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పండి? పాములంటే నాకు విపరీతమైన భయం. ► నటి కాకపోయి ఉంటే? ఏదైనా క్రియేటివ్ జాబ్‌లోనే ఉండేదాన్ని. ► మీ నాన్న కమల్‌హాసన్ నుంచి మీరేం నేర్చుకున్నారు? నిన్ను నువ్వు ప్రశ్నించుకో అండ్ నెవర్ గివ్ అప్ ► కోవిడ్ టైమ్ జాగ్రత్తలు తీసుకోండి. ఓ.. తీసుకుంటున్నా. నేను బాగున్నా. మీరు జాగ్రత్త. ► కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా? ఇంకా లేదు. త్వరలో తీసుకుంటాను ► నన్ను మీరు ఎక్కడ కలుస్తారు? కోవిడ్ టైమ్... నో మీటింగ్స్. ► మీలో మీకు నచ్చనిది? నా గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తుంటాను. ఒక్క మాటలో... ► మహేశ్‌బాబు: జెంటిల్‌మేన్ ► రామ్‌చరణ్: స్వీటెస్ట్ ► ప్రభాస్: సూపర్ చిల్ అండ్ లవ్లీ ► విజయ్: ఎమేజింగ్ ∙కీర్తీ సురేశ్: ‘మహానటి’లో కీర్తి నటన నాకు బాగా నచ్చింది ► నాగచైతన్య: కైండెస్ట్ పర్సన్ ► నాని: అతనితో నటించే అవకాశం రాలేదు. అద్భుతమైన నటుడు. ► దర్శకుడు ప్రశాంత్ నీల్: సూపర్‌మైండ్ అండ్ కామ్ ► మీ ఫ్యా¯Œ ్స: ది బెస్ట్ ఫేవరెట్స్ ► సబ్జెక్ట్స్: హిస్టరీ, బయాలజీ ► స్కూల్ డేస్‌లో క్రష్: హృతిక్‌రోషన్, లియోనార్డో డికాప్రియో ► ఫుడ్: సాంబర్ రైస్, దోసె చాలు.. ఈ లైఫ్‌కి! ► హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్స్: ఎంటర్ ది డ్రాగన్, కిల్‌బిల్ ► కాఫీ లేదా టీ: కాఫీ తాగను... సో మిగిలింది టీ! ► గులాబ్ జామూన్ లేదా ఐస్‌క్రీమ్: రెండూ కలిపితే బాగుంటుంది -
క్రాక్ ఆరంభం
రవితేజ, శ్రుతీహాసన్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘క్రాక్’. గతంలో రవితేజతో ‘డాన్ శీను’, ‘బలుపు’ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మలినేని గోపీచంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సరస్వతి ఫిలిమ్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఉద్వేగభరితమైన కథా కథనాలతో ‘క్రాక్’ సినిమా రూపొందుతోందని, ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు, టీజర్‌కు మంచి స్పందన వచ్చిందని చిత్రబృందం పేర్కొంది. వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని, సుధాకర్ కొమాకుల, వంశీ చాగంటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: జి.కె. విష్ణు -
మంచి ముగింపు
వారానికి క్లైమాక్స్ లాంటిది వీకెండ్. క్లైమాక్స్ బావుంటేనే సినిమా బాగా ఆడుతుంది. వీకెండ్ బావుంటేనే కొత్త వారాన్ని ఉత్సాహంతో ప్రారంభించగలుగుతాం. మరి ఈ వీక్‌ను ఏ స్టార్ ఎలా ఎండ్ చేస్తున్నారో చూద్దామా? లాక్డౌన్లో యోగా మీద ధ్యాస పెట్టారు సమంత. కష్టతరమైన ఆసనాలు ప్రాక్టీస్ చేశారు. చాలా వరకూ నేర్చేసుకున్నారు. ఈ వీకెండ్‌ను సూర్య నమస్కారాలతో మొదలుపెట్టారు సమంత. శనివారం 108 సూర్య నమస్కారాలు చేశారామె. ‘వీకెండ్‌కి మంచి స్టార్ట్’ అన్నారు సమంత. తెలుగు సినిమాకు డబ్బింగ్ చెప్పాలన్నది పాయల్ రాజ్‌పుత్ కోరిక. ఈ వీకెండ్ ఆ పని మీదే ఉన్నారు. తెలుగులో తాను నటిస్తున్న తాజా చిత్రానికి డబ్బింగ్ చెప్పడం మొదలెట్టారు. ‘డబ్బింగ్ చెప్పాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను... ఇప్పటికి కుదిరింది. త్వరలోనే నా తెలుగు ఎలా ఉంటుందో మీరూ వింటారు’ అన్నారు పాయల్ రాజ్‌పుత్. లాక్డౌన్లో ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ ప్రారంభించారు శ్రుతీహాసన్. బాక్సింగ్ క్లాసుల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ‘శారీరకంగా బలంగా తయారైతేనే మానసికంగానూ బలంగా ఉండగలం’ అన్నారు శ్రుతి. వీకెండ్లోనూ నో హాలీడే. ఫుల్ బాక్సింగ్ ట్రైనింగ్‌లో ఉన్నారామె. వీకెండ్ సందర్భంగా పూజా హెగ్డే ‘షెఫ్ పూజా’ అయ్యారు. పూజా తన తండ్రి కోసం కాక్టేల్ తయారు చేశారు. టేస్టీ కాక్టేల్ ఎలా చేయాలో రెసిపీ కూడా పంచుకున్నారు. ఇలా అందాల తారలు ఈ వారాన్ని తమకు నచ్చినట్లుగా ముగించి, వచ్చే వారాన్ని హ్యాపీ మూడ్‌తో ఆహ్వానించడానికి రెడీ అయ్యారు. -
చిన్ని చిన్ని సరదా
కరోనా వల్ల లభించిన ఖాళీ సమయంలో శ్రుతీహాసన్ వంటలు చేస్తున్నారు. ఆన్లైన్లో అభిమానులతో చిట్ చాట్ చేశారు. తనకు ఇష్టమైన సంగీతాన్ని బాగా సాధన చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా ఏదైనా చేయాలనుకున్నారట. అది కూడా ఏదైనా ప్రయోగం అయితే బాగుంటుందని భావించానంటున్నారు శ్రుతీహాసన్. సొంతంగా ఓ మాస్క్‌ను తయారు చేసుకున్నారు. ఆ మాస్క్‌ను «ధరించి, ఫొటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు శ్రుతి. ‘‘ఈ కరోనా కాలంలో మాస్క్‌లను తప్పనిసరిగా ధరించండి. వీలైతే సొంత మాస్క్‌లను తయారు చేసుకోండి. నేను అలానే చేశాను. సొంత మాస్క్‌ను తయారు చేసుకోవడం చిన్న పనే కావొచ్చు. కానీ ఈ పని నాకు చాలా సరదాగా అనిపించింది. ఈ చిన్ని ప్రయోగం చాలా సంతోషాన్నిచ్చింది. అందుకే ఇలాంటి మరో ఎగై్జటింగ్ ఎక్స్పరీమెంట్ ఏదైనా చేయాలనుకుంటున్నాను. మీరు (అభిమానులు) కూడా సొంతంగా మాస్క్‌లు తయారు చేసుకోవడాన్ని ఓసారి ప్రయత్నించండి’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్. -
కటారి క్రాక్
‘డాన్ శీను’ (2010), ‘బలుపు’ (2013) చిత్రాల తర్వాత హీరో రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘క్రాక్’. ఇందులో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. రవితేజ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. సరస్వతీ ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై బి. మధు నిర్మిస్తున్న చిత్రం ఇది. అమ్మిరాజు కానుమిల్లి ఈ సినిమాకు సహనిర్మాత. లాక్డౌన్ తర్వాత జరిపే చివరి షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ ముగుస్తుంది. ఆదివారం (ఏప్రిల్ 26) సముద్రఖని పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో కటారి పాత్రలో సముద్రఖని నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) చిత్రంలో సముద్రఖని ఓ కీలక పాత్ర చేస్తున్నారు. -
జోడీ రిపీట్?
‘అరవిందసమేత వీరరాఘవ’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో కథానాయికగా ఇప్పటివరకు పూజా హెగ్డే, కియారా అద్వానీల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్ర కోసం శ్రుతీహాసన్ పేరు కూడా చిత్రబృందం పరిశీలిస్తోందనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. దాదాపు ఏడేళ్ల క్రితం వచ్చిన ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఓ కథానాయికగా శ్రుతీహాసన్ నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. మళ్లీ ఈ జోడీ కుదురుతుందా? వెయిట్ అండ్ సీ. -
విరాళం ఇవ్వాలనిపిస్తే ఇస్తా!
సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేసిన నెటిజన్స్‌కు దీటైన సమాధానం చెప్పారు శ్రుతీహాసన్. ఇంతకీ ఏం జరిగిందంటే... ఇటీవల తాను పియానో వాయిస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు శ్రుతి. ‘ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉండకపోతే బయటకు వెళ్లి ప్రజలకు సేవ చేయవచ్చుగా’, ‘కరోనా రిలీఫ్ ఫండ్‌కు మీరు ఇంకా ఎందుకు విరాళం ఇవ్వలేదు?’ అని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారట. ఈ విషయంపై శ్రుతీహాసన్ స్పందిస్తూ – ‘‘కరోనా సమయంలో ఎందుకు ప్రజలకు సేవ చేయడం లేదని కొందరు నా కామెంట్ బాక్స్‌లో స్పందించారు. నన్ను చేయమని చెప్పేవారు ప్రజలకు ఏ మాత్రం సేవ చేస్తున్నారో నాకు తెలియదు. కరోనా కారణంగా మనందర్నీ ఇంట్లోనే ఉండమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయని గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ఇతరులకు ఎంత సహాయం చేస్తే అంత దేవుడు మనకు ఇస్తూనే ఉంటాడు అనే మాటలను నమ్మే వ్యక్తిని నేను. నాకు విరాళం ఇవ్వాలనిపిస్తే తప్పక ఇస్తాను. అంతేకానీ అది ఇతరుల ఆదేశానుసారంగా జరగాలనుకోను. గతంలో నేను సహాయం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. -
రొమాంటిక్ పోలీస్!
బీచ్‌లో ప్రేయసితో ప్రేమరాగం తీస్తున్నారట రవితేజ. ‘డాన్ శీను’(2010), ‘బలుపు’ (2013) చిత్రాల తర్వాత రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బి. మధు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చీరాలలోని ఓ బీచ్‌లో జరుగుతోందట. అక్కడ ఓ రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరించే పనిలో బిజీగా ఉంది చిత్రబృందం. ఈ పాట చిత్రీకరణకు ముందు ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేశారు రవితేజ. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మే8న విడుదల కానుంది. -
నేను చాలా లక్కీ
కమాన్... ఎవరేం అడగాలనుకున్నా అడిగేయండి.. జవాబు చెబుతా అంటూ అభిమానులకు శ్రుతీహాసన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో తన ఫాలోయర్స్ కోసం కొంత టైమ్ కేటాయించారామె. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సరదాగా జవాబులు చెప్పారు. ఆ కొంటె ప్రశ్నలు, శ్రుతీ చెప్పిన సరదా సమాధానాలు ఇలా.. ► కొత్త సంవత్సరం (2020)లో మీకు మీరు చేసుకున్న ప్రామిస్? సానుకూల ఆలోచనలను పెంపొందించుకోవాలి. అనవసరమైన ఆలోచనలకు అడ్డుకట్ట వేయాలి. బాగా కష్టపడాలి. ► మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోవాలనుకునేవారికి ఏం చెబుతారు? కొన్ని రూల్స్ పెట్టుకోండి. లక్ష్యం కోసం బాగా కష్టపడండి. మీ ఆలోచనలు, నిర్ణయాల్లో జాలికి కాస్త చోటివ్వండి. ► మీ ఆప్తమిత్రుడి పేరు చెప్పండి? చాలామంది ఉన్నారు. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని. ► విహారయాత్రకు వెళ్లడానికి ఏ ప్రదేశాన్ని ఎక్కువగా ఇష్టపడతారు? లండన్. ► మిమ్మల్ని అత్యంత భయపెట్టే విషయం? నాకు పాములంటే చాలా భయం. ► మీ బరువు? 62 కేజీలు. ► ► మీరు మెచ్చిన హాలీవుడ్ చిత్రం? గాడ్‌ఫాదర్. ► మీరు ఏ బ్రాండ్ కారును ఇష్టపడతారు? పనిచేసే అన్ని బ్రాండ్ల కార్లు ఇష్టమే (సరదాగా) ► చాక్లెట్ లేదా ఐస్‌క్రీమ్? ఐస్‌క్రీమ్ అంటే ఇష్టం. ► బ్జీ గేమ్ ఆడతారా? ఆడను. ► నిద్రపోయే ముందు పాలు తాగే అలవాటు ఉందా? లేదు. ► మీ నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ ఇవ్వగలరా? నాకు గుర్తులేదు (నవ్వుతూ) ► ప్రస్తుతం మీరు నటిస్తున్న సినిమాలు? తెలుగులో రవితేజ ‘క్రాక్’, తమిళంలో విజయ్ సేతుపతి ‘లాభం’ సినిమాలు. -
వేసవిలో క్రాక్
రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘క్రాక్’. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. బి. మధు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు రవితేజ. ఈ సినిమా చిత్రీకరణ గురువారం ప్రారంభమైంది. రవితేజ, శ్రుతిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా కథను సిద్ధం చేశారు దర్శకుడు. వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్, పూజిత పొన్నాడ కీలక పాత్రధారులు. అమ్మిరాజు కానుమిల్లి సహ–నిర్మాత. తమన్ సంగీతం అందిస్తున్నారు. -
ట్యూన్ కుదిరింది
కొన్ని కాంబినేషన్లు భలే కుదురుతాయి. అలాంటి వాటిలో హీరో రవితేజ, సంగీత దర్శకుడు తమన్ కాంబినేషన్ ఒకటి. రవితేజ నటించిన 10 సినిమాలకు సంగీతం అందించారు తమన్. తాజాగా మరోసారి ట్యూన్స్ సిద్ధం చేయడానికి రెడీ అయ్యారాయన. ‘డాన్ శీను, బలుపు’ సినిమాల తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని, హీరో రవితేజ మూడో సినిమా చేస్తున్నారు. ఇందులో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. శ్రుతీహాసన్ హీరోయిన్. ‘ఠాగూర్’ మధు నిర్మాత. ‘‘ఈ సినిమా మా అందరికీ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. అందుకు తగ్గట్టు కష్టపడతాను. రవితేజగారితో నా 11వ సినిమా ఇది. నన్ను నమ్మినందుకు థ్యాంక్స్ గోపీచంద్ బావా’’ అని ట్వీటర్లో పేర్కొన్నారు తమన్. -
మళ్లీ జోడీగా...
‘డాన్ శీను’ (2010), ‘బలుపు’ (2013) చిత్రాల తర్వాత హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి చేతులు కలిపారు. ఇదే సినిమాతో మళ్లీ రవితేజ–శ్రుతీహాసన్ జోడీ కుదిరింది. ఈ ఇద్దరూ ‘బలుపు’ చిత్రంలో జంటగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అలాగే రెండేళ్ల తర్వాత శ్రుతీ అంగీకరించిన తెలుగు చిత్రం ఇదే. ‘కా టమరాయుడు’ (2017) సినిమా తర్వాత ఆమె తెలుగులో కనిపించలేదు. ఇక తాజా చిత్రం విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని బి. మధు నిర్మిస్తారు. వచ్చే నెలలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంది. -
మార్చుకుంటూ.. నేర్చుకుంటూ.. ముందుకెళ్తా!
శ్రుతీహాసన్‌ను తన అభిమానులు స్క్రీన్ మీద మిస్ అవుతున్నారు. ‘మీ అందర్నీ స్క్రీన్ మీద త్వరలోనే పలకరిస్తాను. ఈ బ్రేక్‌లో చిన్న చాట్ చేద్దామా?’ అని అడిగారు. వెంటనే ఆమె అభిమానులంతా ప్రశ్నల వర్షం కురిపించారు. శ్రుతీ అభిమానులతో చేసిన చాట్‌లో కొన్ని ప్రశ్నలు.. ► లైఫ్‌లో ఎప్పుడైనా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యారా? అఫ్కోర్స్! చాలాసార్లు. కానీ దాన్ని ఎదుర్కొనే మార్గం కూడా కనుగొన్నాను. ► పిజ్జా ఇష్టమా లేక బర్గర్ ఇష్టమా? పిజ్జా అంటే ప్రాణం. ► మీ నాన్నగారి సినిమాల్లో మీకు బాగా ఇష్టమైనది? మహానది. ► మీ యాక్టింగ్ సై ్టల్ని వర్ణించండి? ముందుగా ప్లాన్ ఏదీ చేసుకోకుండా లొకేషన్లో అక్కడికక్కడ నటించడం నా సై ్టల్. ► కమల్‌హాసన్ గారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం ఎప్పుడైనా భారంగా అనిపించిందా? మా ఫ్యామిలీ అంటే నాకు చాలా గర్వం. దాన్ని నిలబెట్టడానికి ప్రతిరోజూ కష్టపడుతూనే ఉంటాను. అది భారం కాదు. ► మీ జీవితంలో గొప్ప అచీవ్మెంట్ ఏంటి? ఎప్పటికప్పుడు నన్ను మార్చుకుంటూ కొత్త విషయాలను నేర్చుకోవడం. ► స్క్రీన్ మీద మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాం. మీ ఫ్యాన్స్ కోసం ఓ తెలుగు సినిమా చేయండి. త్వరలోనే చేస్తాను. ► జీవితం ఎలా ఉంది శ్రుతీ? వండర్ఫుల్. అడిగినందుకు ధన్యవాదాలు. ► మీరు చేస్తున్న అమెరికన్ టీవీ సిరీస్ ‘ట్రెడ్‌స్టోన్’ గురించి ఏదైనా చెప్పండి? ప్రస్తుతానికైతే యాక్షన్ ట్రైనింగ్ చాలా బాగా నడుస్తోంది. ► మీరు దేనికి ఎక్కువగా భయపడతారు? పాములకు, అజ్ఞానానికి. ► ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సీజన్ 8 గురించి మీ అభిప్రాయం? చాలా బాధగా ఉంది. దాని గురించి మాట్లాడదలచుకోలేదు కూడా. ► మీ ఫేవరెట్ చాక్లెట్? రోయ్స్. ►మీరు స్ట్రిక్ట్‌గా ఉండే సిస్టరా? ఫ్రెండ్లీ సిస్టరా? ఆ విషయం మీరు నా చెల్లెలు అక్షరాహాసన్ని అడగాలి. ► మీ నుండి ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అతి త్వరలోనే.. ► ఏలియన్స్ (గ్రహాంతర వాసులు) ఉన్నాయని నమ్ముతారా? నమ్ముతాను. ► ఏ విషయం మీకు చిరాకు తెప్పిస్తుంది? కామన్సెన్స్ లేకుండా ఉంటే చిరాకొస్తుంది. ► మీకు పిల్లలు కావాలా? కావల్సిస్తే ఎంత మంది? కచ్చితంగా కావాలి, ఇద్దరు పిల్లలు కావాలి. ► విమర్శలను ఎలా స్వీకరిస్తారు? విలువైన విమర్శలను ఎప్పడూ స్వీకరిస్తాను. ► మీరు రైటర్ అని మాకు తెలుసు. నాకో సలహా కావాలి. మనమెప్పుడూ అనుభవించని విషయాన్ని ఎలా రాయాలి? మనుషులందరం ఒకలాంటి ఎమోషన్స్‌కే కనెక్ట్ అయ్యుంటాం అని అనుకుంటాను. అందుకే ఆర్టిస్టిక్ట్గా ప్రేక్షకులు కూడా అనుభవించగలిగేది రాయడం చాలా ముఖ్యం. ఆ సంఘటన జరిగితే ఎలా ఉంటుంది? అనే ఊహతో ఆలోచిస్తూ నీకు ఏదనిపిస్తే అది రాస్తూ ఉండు. ► మీ అభిమానుల గురించి ఒక్క మాట? మీ అందర్నీ నేను ఎంతో ప్రేమిస్తాను. మీరంతా నా డిజిటల్ ఫ్యామిలీ. మీరందరూ నా జీవితంలో ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ► శ్రుతీహాసన్‌లా ఉండటం ఎలా ఉంటుంది? చాలా చాలా సరదాగా ఉంటుంది. ► మీ జీవితాన్ని మార్చేసిన పుస్తకాల గురించి చెబుతారా? రిచార్డ్ బ్యాచ్ రాసిన ఇల్యూషన్ పుస్తకం చదవమని నాన్నగారు చెప్పారు. అది నా జీవితాన్నే మార్చేసింది. అలానే మార్లిన్ బ్రాండో ఆటోబయోగ్రఫీలోని పాటలు చాలా ఇష్టం. మా అమ్మ నేర్పించారు. ► స్టార్ కిడ్‌గా ఉండటం కష్టమైన విషయమా? యాక్టర్‌గా గుర్తింపు పొందాలనుకుంటున్నారా? సింగర్గానా? స్టార్ కిడ్‌గా ఉండటం అంత కష్టమేం కాదు. ఆర్టిస్ట్‌గా గుర్తింపబడాలి అనుకుంటాను. ► మీకేదైనా సూపర్‌పవర్ ఉంటే ఏం చేస్తారు? పేదవాళ్లకు సహాయం చేస్తాను. ► మీ జీవితంలో అంతిమ లక్ష్యం ఏంటి? సంతోషంగా ఉండటం. ► మీ చిన్నప్పటి క్రష్ పేరు ఏంటి? హృతిక్ రోషన్. ► మీ అమ్మానాన్న ఉన్న ఫీల్డ్‌లోనే ఉండటం ప్లస్ అనుకుంటున్నారా? మైనస్ అనుకుంటున్నారా? ప్లస్. ► మిమ్మల్ని ద్వేషించేవాళ్లను ఎలా డీల్ చేస్తారు? నేను వాళ్లను అసలు డీల్ చేయను. -
నేను మారిపోయాను!
‘‘నేను మారిపోయా’’ అంటున్నారు శ్రుతీహాసన్. సౌత్‌లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ సేమ్ మ్యాజిక్‌ను అక్కడ రిపీట్ చేయడానికి అప్పుడప్పుడు హిందీ సినిమాలు చేస్తున్నారు. ఇలా నటిగా శ్రుతీహాసన్ పదేళ్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – ‘‘మూవీ బిజినెస్‌లో ఒక నటిగా పదేళ్లు పూర్తి చేసుకున్నాను. ఎంతో నేర్చుకున్నాను. ఎంతోమందికి థ్యాంక్స్ చెప్పాల్సి ఉంది. నటిగా నేను ఈ స్థాయిలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. కెరీర్లో ఎదిగేందుకు నేను మరింత కష్టపడతానని ప్రామిస్ చేస్తున్నాను. నాకు సపోర్ట్ చేసేవారందరూ గర్వపడేలా నేను మరింత శ్రద్ధగా పనిచేస్తాను. ఈ జర్నీలో ‘మూవీ బిజినెస్’ అనేది నాకు ఫ్యామిలీ లాంటిదని అర్థమైంది. ఇక్కడ కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. మరికొన్ని చెడు సంగతులున్నాయి. ఈ పదేళ్ల ప్రయాణంలో వృత్తిపరంగా, వ్యక్తిగా నేను చాలా మారిపోయాను. ఈ మధ్య ఒక ఏడాది విరామం తీసుకుని, వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎలా అడుగులు వేయాలో విశ్లేషించుకున్నాను. కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాను. నా జీవితంలోని తర్వాతి దశకు చేరుకోవడంలో ఈ లక్ష్యాలు నాకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు శ్రుతీహాసన్. 2009లో బాలీవుడ్ మూవీ ‘లక్’ సినిమాతో హీరోయిన్గా శ్రుతీహాసన్ కెరీర్ ప్రారంభమైంది. ఈ సినిమా విడుదలై (2009 జూలై 24) బుధవారం నాటికి సరిగ్గా పదేళ్లు ముగిశాయి. ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయమయ్యారామె. -
ఇలా ఉంటా!
వృద్ధాప్యంలో మనం ఎలా కనిపిస్తాం? అనే ఆలోచనతో ఫేస్‌యాప్ అనే యాప్ తయారైంది. ఈ యాప్ సాయంతో ప్రతి ఒక్కరు టైమ్ మిషన్ అవసరం లేకుండా భవిష్యత్తులో తాము ఎలా ఉంటామో సరదాగా చూసుకుంటున్నారు. ఫేస్‌యాప్ చాలెంజ్ ద్వారా ముడుతలు నిండిన ముఖాలను చూసుకొని మురిసిపోతున్నారు. ఇప్పుడు ఈ చాలెంజ్‌లో శ్రుతీహాసన్ కూడా పాల్గొన్నారు. వృద్ధాప్యంలో తాను ఎలా ఉంటారో చూపించడమే కాకుండా తన ఓల్డ్ ఏజ్ లైఫ్ ఎలా ఉంటుందో కూడా శ్రుతీహాసన్ సరదాగా పంచుకున్నారు. ‘‘జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. నా పదిమంది మనవళ్లు, మనవరాళ్లు, వివిధ దేశాల్లో ఉండే నా ఇల్లు, సంతృప్తికర జీవితం వీటన్నింటికీ నేను చాలా థ్యాంక్‌ఫుల్‌గా ఉంటాను. ‘ఇప్పటికీ మీరు మానసికంగా చిన్నవాళ్లే’ అనే ప్రశ్నకు ఎప్పటిలానే ‘మన శక్తి మేరకు వర్కౌట్ చేయడమే’ అని సమాధానం ఇస్తుంటానేమో?’ అని చెప్పుకొచ్చారు శ్రుతీహాసన్. ఇంతకీ అర్థమైందా? తాను ఓల్డ్ ఏజ్‌లో ఉన్నట్లుగానే ఫీలై, శ్రుతి ఈ విధంగా చెప్పారు. -
కోడి ముందా? గుడ్డు ముందా?
ఈ సామెత తెలియనివాళ్లు ఉండరు. దీనికి సమాధానం తెలిసినవాళ్లూ ఉండరు. ఇప్పుడు శ్రుతీహాసన్ కూడా తన జీవితానికి ఈ సామెతను ఆపాదించారు. సినిమాలంటే మీకు చిన్నప్పుడే ఇష్టం ఏర్పడిందా? లేక మీ అమ్మానాన్న (కమల్‌హాసన్, సారిక), ఇంకా ఇతర కుటుంబ సభ్యులు సినిమాల్లో ఉన్నందువల్ల మీరూ వచ్చేశారా? అనే ప్రశ్న శ్రుతీహాసన్ ముందుంచితే– ‘‘కోడి ముందా? గుడ్డు ముందా? అంటే ఏం చెబుతాం. ఇది కూడా అంతే. నేను సినిమా వాతావరణంలోనే పెరిగాను. అయితే మీ ఫస్ట్ చాయిస్ ఏంటి? అని అడిగితే, ‘సంగీతం’ అంటాను. అయితే నన్ను సినిమానే సెలక్ట్ చేసుకుంది. ఎందుకంటే అది నా డెస్టినీ అని నా ఫీలింగ్. చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే మా నాన్నగారు యాక్ట్ చేస్తున్న సినిమా షూటింగ్ లొకేషన్‌కి వెళ్లేదాన్ని. జనరేటర్ వ్యాన్ దగ్గర కూర్చుని హోమ్‌వర్క్ రాసేదాన్ని. ప్రొడక్షన్లో ఉన్నవాళ్లంతా నన్ను గారం చేసేవారు. అందుకే చికెన్ అండ్ ఎగ్ ఎగ్జాంపుల్ చెప్పా. నాకు సినిమా మీద దానంతట అదే ప్రేమ పెరిగిందో, సినిమా పరిశ్రమ పిలిచింది కాబట్టి వచ్చానో తెలియడంలేదు. అయితే ఒకటి మాత్రం నిజం. నా జీవితాన్ని సినిమా నుంచి వేరుచేసి చూడలేను’’ అన్నారు. ఇదిలా ఉంటే.. ఓ అభిమాని ఇటీవల శ్రుతీహాసన్‌ని కలిశాడు. అభిమాన తారను కలిసినందుకు బోలెడంత ఆనందాన్ని వ్యక్తం చేసి, ‘మీ పెళ్లెప్పుడు? విందుకి వస్తాను’ అని ట్వీటర్ ద్వారా శ్రుతీని అడిగాడు. ‘‘పెళ్లి విందు అంటే ఇంకా చాలా టైమ్ ఉంది. నా బర్త్‌డే విందుకి వద్దువుగానిలే’’ అని సరదాగా సమాధానం ఇచ్చారామె. బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సలే నుంచి విడిపోయిన శ్రుతి ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదని అభిమానికి ఆమె ఇచ్చిన సమాధానం స్పష్టం చేస్తోంది కదూ. -
కాంబినేషన్ కుదిరేనా?
‘‘హైదరాబాద్ బాయ్స్ ఇక్కడ ఉన్నారు...’ అంటూ శ్రుతీహాసన్ నటుడు రానా, దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడితో కలసి దిగిన ఓ ఫొటోను బయటపెట్టారు. అంతే.. ఈ ఫొటో ఆధారంగా కథలు మొదలయ్యాయి. ఇంతకీ ఇక్కడ అని శ్రుతీహాసన్ అన్నది ముంబై గురించే. ప్రస్తుతం ఆమె ముంబైలో ఉన్నారు. అక్కడే ఈ ముగ్గురూ మీట్ అయి, సెల్ఫీలు దిగి సందడి చేశారు. దాంతో రానా, శ్రుతి కాంబినేషన్లో ప్రకాశ్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడని వార్తలు మొదలయ్యాయి. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో శ్రుతీహాసన్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అప్పటినుంచే ఇద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతోంది. అయితే రానా, శ్రుతీ కలసి యాక్ట్ చేయలేదు. మరి.. ఈ కాంబినేషన్ ప్రకాశ్ సినిమాతో కుదురుతుందా? అంటే వేచి చూడాలి. ‘కాటమరాయుడు’(2017) సినిమా తర్వాత తెలుగులో మరో సినిమాకు సైన్ చేయలేదు శ్రుతీహాసన్. ప్రస్తుతం ‘లాభం’ అనే తమిళ సినిమా, విద్యుత్‌జమాల్ హీరోగా తెరకెక్కుతున్న ఓ హిందీ సినిమా చేస్తున్నారు. అలాగే అమెరికన్ వెబ్ సిరీస్ ఒప్పుకున్నారు. ఎప్పటిలాగే మరోవైపు తన మ్యూజిక్ జర్నీని కూడా కొనసాగిస్తున్నారు. -
హలో హాలీవుడ్
గతంలో కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చి పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేశారు శ్రుతీహాసన్. లండన్‌లో కొన్ని మ్యూజిక్ షోలు నిర్వహించారు. యాక్టింగ్‌కు ఇచ్చిన విరామానికి ఫుల్స్టాప్ పెట్టి మళ్లీ యాక్టింగ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు. తమిళంలో విజయ్ సేతుపతితో ఓ సినిమా, తెలుగులో రవితేజతో ఓ సినిమా అంగీకరించారు శ్రుతీహాసన్. తాజాగా ఓ ఇంటర్నేషనల్ టీవీ సిరీస్‌లోనూ నటిస్తున్నారని తెలిసింది. హాలీవుడ్లో ‘బోర్న్’ సిరీస్‌లో 5 చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రాల తరహాలోనే ‘ట్రెడ్ స్టోన్’ అనే సిరీస్‌ను రూపొందిస్తున్నారు. మైఖేల్ ఫోర్బ్స్, మైఖేల్ గ్యాస్టన్, బ్రైన్ జె. స్మిత్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఇటీవలే బుడాపెస్ట్‌లో ఈ సిరీస్ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఇంటర్నేషనల్ స్పై మిషన్ కథాంశంగా రూపొందనున్న ఈ సిరీస్‌లో శ్రుతీహాసన్ ఢిల్లీకి చెందిన నీరా పటేల్ పాత్రలో కనిపిస్తారు. పగలంతా హోటల్లో వెయిట్రెస్‌గా కనిపించి రాత్రి హత్యలు చేసే కిల్లర్‌గా మారతారట. త్వరలోనే ఈ సిరీస్ షూటింగ్లో శ్రుతీహాసన్ పాల్గొననున్నారు. యూఎస్ టీవీ సిరీస్‌లో నటించనున్న తొలి సౌతిండియన్ హీరోయిన్ కూడా శ్రుతీహాసనే కావడం విశేషం. ఇంతకుముందు ‘క్వాంటికో’ అనే టీవీ సిరీస్‌లో ఉత్తరాది భామ ప్రియాంకా చోప్రా కనిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
శ్రుతీ లాభం
రెండేళ్లుగా తమిళ, తెలుగు సినిమాలేవీ అంగీకరించలేదు శ్రుతీహాసన్. సూర్య ‘సింగం 3’, పవన్ కల్యాణ్‌తో ‘కాటమరాయుడు’ సినిమాల తర్వాత సౌత్‌లో కనిపించలేదు. ఈ రెండు సినిమాలు 2017 ప్రథమార్ధంలో రిలీజయ్యాయి. అప్పటి నుంచి తనలోని నటికి కొంచెం బ్రేక్ ఇచ్చి మ్యూజిషియన్పై శ్రద్ధ పెట్టారు. లండన్‌లో సొంత బ్యాండ్‌తో మ్యూజిక్ షోలు చేశారు. ఓ టీవీ చానెల్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. లేటెస్ట్గా మళ్లీ తమిళ సినిమాలో నటించడానికి రెడీ అయ్యారు. విజయ్ సేతుపతి హీరోగా యస్పీ జననాథన్ దర్శకత్వంలో ‘లాభం’ అనే చిత్రం రూపొందనుంది. ఇందులో హీరోయిన్గా శ్రుతీహాసన్ నటిస్తున్నారు. ఈ సినిమా పూజ సోమవారం జరిగింది. గతంలో విజయ్ సేతుపతితో ‘పురమ్బోక్కు ఎన్గిర పొదువుడమై’ అనే సినిమా రూపొందించారు జననాథన్. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ‘లాభం’తో మళ్లీ విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నారు. -
నా సూపర్ పవర్ అదే!
శ్రుతీహాసన్ వయసెంత? ఆమెకు ఏ కలర్ అంటే ఇష్టం? ఎవరికి ఓటు వేస్తారు?... తెలుసుకోవాలని ఉందా? ఇవే కాదు.. వీటితో పాటు శ్రుతి చెప్పిన మరికొన్ని విశేషాలు కూడా తెలుసుకోవచ్చు. టాలీవుడ్‌కు కాస్త దూరమైన ఈ బ్యూటీ ప్రజెంట్ బాలీవుడ్లో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవల శ్రుతి ఇన్సా్ర్టగామ్ అకౌంట్ రీచ్ కోటికి చేరింది. ఇంతమంది ఫాలోయర్లను సంపాదించుకున్న సందర్భంగా శ్రుతి ‘మీరే ప్రశ్న అయినా అడగొచ్చు. నేను జవాబు చెబుతా’ అన్నారు. అంతే.. నెటిజన్లు ప్రశ్నలు సంధించారు. వాటిలో కొన్ని ఈ విధంగా... ► తెలుగు సినిమాల్లో మళ్లీ ఎప్పుడు నటిస్తారు? ప్రస్తుతం నా కోసం, నా సంగీతం కోసం కొంచెం సమయం తీసుకున్నాను. త్వరలో ఓ న్యూస్ చెబుతాను. ► లేడీ ఓరియంటెడ్ సినిమా ఎప్పుడు చేస్తారు? సరైన కథ కోసం ఎదురు చూస్తున్నాను. ► మీరు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? పని చేయడం వల్ల వచ్చాను. మా అమ్మ, నాన్నలు కూడా డోర్స్ ఓపెన్ చేశారు. ► తమిళ ఫ్యాన్స్ అంటే మీకు ఇష్టమేనా? లేదు. వారంటే అమితమైన ప్రేమ. ► ఆర్టిస్టుగా మీకు కష్టంగా అనిపించింది ఏంటి? కష్టాలు ఉంటాయి. కానీ సంతోషం కూడా అక్కడే ఉంది. ► టాలీవుడ్లో ఒకప్పుడు మీరు ప్రతి హీరోయిన్ని భయపెట్టారు? ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మీ మాటలు వింటుంటే ఇప్పుడు నాకు భయం వేస్తోంది. ► సినిమాల్లోకి రాకపోతే ఏం చేసి ఉండేవారు? క్రియేటివ్‌గా ఉంటూ ప్రజలను బాగా ఎంటర్టైన్ చేయాలని నేను ముందు నుంచే కోరుకున్నాను. కానీ అది ఎలానో ఆలోచన లేదు. అయితే ఏం చేసినా ప్రజలను ఎంటర్టైన్ చేయాలన్నదే మనసులో ఉండేది. అదే చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ► డైరెక్షన్, రాయడం వచ్చా? రాయడం నాకిష్టం. అయితే డైరెక్షన్ చేసే శక్తి నాలో ఉందా? ప్రస్తుతానికి తెలియదు. ► మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరు? నేనే. నన్ను నేను ప్రేమించుకున్నప్పుడే తోటివారిని ఇంకా ప్రేమించగలను. ► మీలో ఉన్న సూపర్ పవర్? మార్పు కోరుకునేవారికి ప్రతి రోజునీ కొత్తగా చూపిస్తా. ► మీకు వంట వచ్చా? రాకపోతే ఎప్పుడు వంట నేర్చుకుంటారు? అమెరికాలో ఉన్నప్పుడు నేర్చుకుంటాను. ఎందుకంటే నాకు ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ► చర్మ సంరక్షణకు చిట్కాలు చెబుతారా? వేళకు నిద్రపోండి. బాగా నీరు తాగండి. గ్రీన్ జ్యూసులను తీసుకోవడం మర్చిపోవద్దు. మీ చర్మానికి సూట్ అయ్యే క్రీమ్స్నే వాడండి. ► ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్‌ని ఇష్టపడతారా? లేక సన్‌రైజర్స్ హైదరాబాద్నా? రెండింటినీ నా హోమ్ టీమ్స్గానే భావిస్తాను. కానీ చెన్నై సూపర్‌కింగ్స్ ఫస్ట్. ► మీకు రాజకీయాలు ఇష్టమేనా? రాజకీయాల పట్ల ఇంకా అవగాహన పెంచుకోవడానికి ట్రై చేస్తున్నా. మా నాన్న ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు. మీకన్నా మీ పిల్లులు అంటే నాకు చాలా ఇష్టం... టూ బ్యాడ్. అవి ఇన్‌స్టాగ్రామ్‌లో నీకు రెస్పాన్స్ వచ్చేలా టైప్ చేయవు. ► మీరు ఈ ఎలక్షన్లో ఎందుకు నిలబడలేదు? ఎందుకంటే నాకు అనుభవం, నాలెడ్జ్ కానీ పాలిటిక్స్‌లో క్రియేటివ్ చేంజ్ తీసుకువచ్చే సామర్థ్యం కానీ లేవు. కానీ మా నాన్నగారి రాజకీయపార్టీని బాగా సపోర్ట్ చేస్తున్నాను. ► ప్రేమలో విశ్వాసం కోల్పోయినవారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఏం కాదు. నిన్ను నువ్వు ప్రేమించుకో. ► జంతువులు మాట్లాడితే ఏ జంతువు రూడ్‌గా మాట్లాడుతుందని మీ అభిప్రాయం? బహుశా చిరుత. ఎందుకో నీకు తెలుసా? ► ఇష్టమైన నగరం? చెన్నై, ముంబై, హైదరాబాద్. ఈ జాబితాలో లండన్ కచ్చితంగా ఉంటుంది. ► ఇష్టమైన రంగు నలుపు ► మీ వయసు ఎంత? గూగుల్‌లో వెతుక్కో. ► ఆధ్యాత్మికంగా ఉంటారా? నాకు చేతనైనంతలో ఉంటాను. ► చూడాలనుకుంటున్న ప్లేస్? జపాన్. ► దెయ్యాలంటే భయం ఉందా? వాటితో పెట్టుకోను ► హీరో షారుక్ ఖాన్ గురించి ఒక్క మాటలో... ప్రేమ. ► మీ పెంపుడు పిల్లుల పేర్లు? కోరా.. క్లారా ► మీరు షార్ట్ హెయిర్‌లో బాగుంటారు? థ్యాంక్స్... నాకూ ఇష్టమే. ► కమల్‌హాసన్‌గారి గురించి ఒక్క మాటలో? ఒక్క మాట లోనా... ఆయన అద్భుతమైనవారు. -
స్క్రీన్ టెస్ట్
‘ఆడొచ్చాడు.. ఆడి కొడుకొచ్చాడని చెప్పు’... ‘మిర్చి’ సినిమాలో ఫేమస్ డైలాగ్ ఇది. తండ్రికి తగ్గ వారసుడిగా సినిమాలో ప్రత్యర్థిపై ప్రభాస్ సవాల్ విసురుతాడు. రియల్ లైఫ్‌లో వారసులు ఇలాంటి డైలాగ్ చెప్పకపోయినా... తల్లిదండ్రులకు తగ్గ బిడ్డలు అనిపించుకోవాలని అనుకుంటారు. మామూలుగా వారసులంటే ఎక్కువ శాతం అబ్బాయిలే ఉంటారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో... ఇది నిన్నటి కథ. ఇప్పుడు అమ్మాయిల జోరు కూడా పెరిగింది. ‘లేడీ వారసుల’ హవాతో ఈ వారం స్పెషల్ క్విజ్. 1 ఇందిరా ప్రొడక్షన్స్ అధినేత మంజుల అనగానే సూపర్‌స్టార్ కృష్ణ కూతురని అందరికీ తెలుసు. మహేశ్‌బాబు అక్కగా ఆమె ఫేమస్. ఈ మధ్య ఆమె ఓ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో హీరో ఎవరో కనుక్కోండి? ఎ) వరుణ్ సందేశ్ బి) సందీప్ కిషన్ సి) ప్రిన్స్ డి) అరవింద్ కృష్ణ 2 విజయ్ హీరోగా నటించిన ‘సర్కార్’ సినిమాలో హీరోయిన్ కీర్తీ సురేశ్. ఆ చిత్రంలో ప్రతి నాయకురాలి పాత్రలో మెప్పించిన నటి ఎవరో తెలుసా? (ఆమె తమిళ హీరో శరత్ కుమార్ కూతురు) ఎ) సమంత బి) వరలక్ష్మి సి) తమన్నా డి) సాయి పల్లవి 3 యన్టీఆర్ హీరోగా నటించిన ‘దమ్ము’ చిత్రంలో ఓ హీరోయిన్గా నటించారు త్రిష. మరో హీరోయిన్గా నటించింది ప్రముఖ నటి రాధ కూతురు. ఆమె పేరేంటి? ఎ) లక్ష్మీ మీనన్ బి) తులసి సి) కార్తీక డి) శరణ్యా మోహన్ 4 తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఇద్దరు కుమార్తెలు. ఒకరు సౌందర్య, మరొకరు ఐశ్వర్యా ధనుష్. ఇద్దరూ దర్శకులే. వీరిలో కార్తీ హీరోగా నటించిన ఓ సినిమాకి ఐశ్వర్య తన గొంతును అరువిచ్చారు. ఆమె ఏ హీరోయిన్‌కి డబ్బింగ్ చెప్పారో తెలుసా? ఎ) రిమ్మీసేన్ బి) రియాసేన్ సి) రీమాసేన్ డి) రైమాసేన్ 5 సంగీత దర్శకుడు యస్.యస్. తమన్‌తో కలిసి ‘రేసుగుర్రం’ చిత్రంలోని ‘డౌన్ డౌన్ డుప్ప డుప్ప...’ సాంగ్‌ను పాడిన సింగర్ ఎవరో తెలుసా? (ఆమె ప్రముఖ హీరో కూతురు) ఎ) అమలా పాల్ బి) శ్రుతీహాసన్ సి) ఆండ్రియా డి) ఐశ్వర్యా అర్జున్ 6 ‘ముద్దపప్పు ఆవకాయ్’ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించి, నటించటంతో పాటు తన ఫిల్మ్ కెరీర్‌ను ప్రారంభించిన ‘ఒక మనసు’ హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) నిహారిక బి) స్వాతి సి) ఇషా రెబ్బా డి) తేజస్వి మడివాడ 7 అఖిల్‌తో ‘హలో’ చెప్పి తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంటరైన కళ్యాణి ఓ హీరోయిన్ కుమార్తె. ఆమె తండ్రి పెద్ద దర్శకుడు. ఈమె హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వకముందు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు. కళ్యాణి అమ్మ గారి పేరేంటి? ఎ) వాణీ విశ్వనాథ్ బి) అంబిక సి) లిజి డి) ఊర్వశి 8 విలక్షణ నటునిగా పేరున్న నటుడు మోహన్‌బాబు. ఆయన కుమార్తె మంచు లక్ష్మీప్రసన్న పేరు మీదే ఆయన చిత్రనిర్మాణ సంస్థ ఉంది. ఆమె ఇంగ్లీషు, తెలుగు, తమిళ సినిమాలతో పాటు అనేక టీవీ షోస్ చేశారు. ఆమె ఏ తమిళ దర్శకుని చిత్రంలో నటించారో తెలుసా? ఎ) మణిరత్నం బి) బాలచందర్ సి) భారతీరాజా డి) పి. వాసు 9 చిరంజీవి పెద్ద కుమార్తె, రామ్‌చరణ్ అక్క సుస్మిత సినీ రంగంలో రాణిస్తున్నారు. ఆమె ఏ శాఖలో తన ఉనికిని చాటుకుంటున్నారో కనుక్కోండి? ఎ) ఎడిటింగ్ బి) ఫొటోగ్రఫీ సి) ప్రొడ్యూసర్ డి) ఫ్యాషన్ డిజైనర్ 10 ‘సాహెబా సుబ్రమణ్యం’ అనే సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి దర్శకురాలిగా అడుగు పెట్టారు శశికిరణ్. ఆమె ఓ ప్రముఖ కమెడియన్ కూతురు. ఎవరా కమెడియన్ కనుక్కోండి? ఎ) ఏ.వి.యస్ బి) యం.యస్. నారాయణ సి) ధర్మవరపు సుబ్రమణ్యం డి) ఎల్బీ శ్రీరామ్ 11 అడివి శేష్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఆయన సరసన హీరోయిన్గా నటిస్తున్న నటి ఎవరు? (ఆ హీరోయిన్ వాళ్ల అమ్మానాన్న ఇద్దరూ సినీ పరిశ్రమలో ఉన్నారు) ఎ) శివాత్మిక బి) రష్మికా మండన్నా సి) శివాని డి) చేతన 12 హీరో కమల్‌హాసన్ అన్న ప్రముఖ నటుడు చారుహాసన్. ఆయన కుమార్తె మొదట కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసి తర్వాత పెద్ద హీరోయిన్ అయ్యారు ఆమె పేరేంటి? ఎ) జయసుధ బి) భానుప్రియ సి) సుహాసిని డి) విజయశాంతి 13 తెలుగులో ‘రక్తకన్నీరు’ నాగభూషణం లానే తమిళ్లో యం.ఆర్. రాధ అనే నటుడు చాలా ఫేమస్. ఆయన కూతురు దక్షిణాదిన పాపులర్ హీరోయిన్. ఆమె పేరేంటి? ఎ) రాధిక బి) రాధ సి) సుమలత డి) జయప్రద 14 1989లో విడుదలైన ‘అడవిలో అభిమన్యుడు’ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు నటి ఐశ్వర్య. ఆమె ప్రముఖ హీరోయిన్ లక్ష్మి కుమార్తె. ఆమె ఏ హీరోతో తన సినీ ప్రయాణం మొదలుపెట్టారో తెలుసా? ఎ) జేడీ చక్రవర్తి బి) వడ్డే నవీన్ సి) జగపతిబాబు డి) శ్రీకాంత్ 15 ప్రముఖ నటుడు అజిత్ నటించిన తమిళ చిత్రం ‘వివేగం’లో ఆయన సరసన హీరోయిన్గా నటించారు కాజల్ అగర్వాల్. మరో నటి కీలక పాత్ర చేశారు. ఆమె పేరేంటి? (ఆమె తండ్రి తమిళ, తెలుగు సినీరంగంలో మంచి పేరున్న నటుడు) ఎ) అమలాపాల్ బి) శ్రుతీహాసన్ సి) అక్షర హాసన్ డి) కీర్తీసురేశ్ 16 వరలక్ష్మీ శరత్‌కుమార్.. ఈ పేరు ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో చాలా ఫేమస్. ఆమెను హీరోయిన్గా మొదట పరిచయం చేసిన దర్శకుని పేరేంటో తెలుసా? (ఆయన ఇప్పుడు చాలా ఫేమస్ హీరోయిన్‌తో ఎఫైర్లో ఉన్నాడు) ఎ) ఏ ఆర్ మురుగదాస్ బి) లింగుస్వామి సి) ఏ.ఎల్. విజయ్ డి) విఘ్నేశ్ శివన్ 17 శ్రీదేవి కూతురు జాహ్నవి. ఆమె నటించిన మొదటి సినిమా ‘ధడక్’ నటిగా మంచి మార్కులు తెచ్చిపెట్టింది. ఆమె ఇప్పుడు చేస్తున్న సినిమాలో ఏ పాత్ర పోషిస్తున్నారో తెలుసా? ఎ) బాక్సర్ బి) పైలెట్ సి) షూటర్ డి) క్రికెటర్ 18 ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన నటిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా? (ఆమె తండ్రి ప్రముఖ హిందీ దర్శకుడు) ఎ) కరీనా కపూర్ బి) కరిష్మా కపూర్ సి) ఆలియా భట్ డి) సోనమ్ కపూర్ 19 1970 – 80ల మధ్య కాలంలో తమిళ్ హీరోల్లో మంచి పేరున్న నటుడు ఆనంద్. ఆయన కుమార్తె తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌కు పెట్టింది పేరు. ఆమె భర్త కూడా నటుడే. ఎవరామె? ఎ) సిల్క్ స్మిత బి) అభినయ శ్రీ సి) అనురాధ డి) డిస్కో శాంతి 20 ఈ మధ్యే విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘118’. ఆ చిత్రంలో నివేదా థామస్ చిన్నప్పటి పాత్రలో నటించిన బాల నటి పేరు పాట. ఆ పాప ఓ ప్రముఖ తెలుగు నటుని కుమార్తె. ఎవరా నటుడు? ఎ) ఉత్తేజ్ బి) రాజీవ్ కనకాల సి) సమీర్ డి) రఘుబాబు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (బి) 2) (బి) 3) (సి) 4) (సి) 5) (బి) 6) (ఎ) 7) (సి) 8) (ఎ) 9) (డి) 10) (బి) 11) (సి) 12) (సి) 13) (ఎ) 14) (సి) 15) (సి) 16) (డి) 17) (బి) 18) (సి) 19) (డి) 20) (ఎ) -
శ్రుతి కుదిరిందా?
‘సైరా’ తర్వాత చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సామాజిక సందేశంతో కూడిన కథగా ఈ చిత్రం రూపొందనుందని టాక్. చిరంజీవి ‘సైరా’తో బిజీగా గడుపుతున్నారు. మరోవైపు చిరంజీవితో చేయబోయే చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో దర్శకుడు కొరటాల శివ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా పలు పేర్లు వినిపించాయి. లేటెస్ట్గా శ్రుతీహాసన్ హీరోయిన్గా బావుంటుందని చిత్రబృందం భావిస్తున్నారట. ఆల్రెడీ ఈ సినిమాలో హీరోయిన్లుగా అనుష్క, నయనతార, తమన్నా పేర్లు వినిపించాయి. తాజాగా శ్రుతీ పేరు పరిశీలనలోకి వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీమంతుడు’ సినిమాలో శ్రుతీ హీరోయిన్గా ఇదివరకే యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరి చిరంజీవితో కొరటాల చేయబోయే చిత్రంలో శ్రుతి నటిస్తారా? ఆ విషయం తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. 2020లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
నువ్విక్కడుంటే బాగుండు
‘యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్సైడ్’ అంటూ ఓ సినిమాలో హీరో శ్రుతీహాసన్‌ను పొగుడుతాడు. వెంటనే ఇద్దరూ ఓ డ్యూయెట్ పాడుకుంటారు. అది తెరమీద ఎవరో రాసిన డైలాగ్. కానీ శ్రుతీహాసన్ పుట్టిన రోజున అదే డైలాగ్‌ను కొట్టారు మైఖేల్ కోర్సలే. శ్రుతీహాసన్ బాయ్‌ఫ్రెండే మైఖేల్ అని చెప్పక్కర్లేదు. పుట్టినరోజు శుభాకాంక్షల్లో ప్రేమను వొలకబోయడమే కాదు, ‘గాళ్‌ఫ్రెండ్’ అని సంబోధించారు కూడా. వీళ్లిద్దరూ గతేడాది నుంచి రిలేషన్షిప్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రేమను పంచుకుంటున్నారే తప్ప ప్రేమికులమని ప్రకటించలేదు. ప్రేయసి బర్త్‌డే రోజున ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు డార్లింగ్. యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అండ్ అవుట్‌సైడ్. నీలాంటి గాళ్‌ఫ్రెండ్ ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. లవ్ యు బేబి. ఈ రోజుని అద్భుతంగా గడుపుతావని అనుకుంటున్నాను’’ అని లండన్ నుంచి శుభాకాంక్షలు పంపారు మైఖేల్. దానికి సమాధానంగా శ్రుతీ ‘‘లవ్ యు టూ డార్లింగ్. నువ్విక్కడుంటే బావుణ్ణు’’ అని స్పందించారు. కెరీర్ పరంగా శ్రుతీహాసన్ కొత్త సినిమాలేవీ సైన్ చేయలేదు. ఇటీవలే లండన్‌లో సొంతంగా ఓ మ్యూజికల్ షో నిర్వహించారు. దానికి విశేషమైన స్పందన లభించింది. కొన్ని రోజులు యాక్టింగ్‌కు బ్రేక్ ఇచ్చి మ్యూజిక్ వైపు శ్రద్ధ చూపాలనుకుంటున్నారని టాక్. -
అందుకే... నువ్వంటే నాకిష్టం!
కొన్ని రోజులుగా శ్రుతీహాసన్ కాస్త మూడీగా ఉంటున్నారు. పనులన్నీ చేస్తూనే ఉన్నారు. అందరితో బాగానే ఉంటున్నారు. కానీ ఎక్కడో ఏదో చిన్న లోటు. కారణం.. మైఖేల్ కోర్సలే. శ్రుతీహాసన్ గురించి తెలిసినవాళ్లకు మైఖేల్ పరిచయం లేని పేరు. ఆమె భాషలో చెబితే అతను శ్రుతీ బెస్ట్ ఫ్రెండ్... మన భాషలో చెప్పుకుంటే బాయ్‌ఫ్రెండ్. లండన్‌లో ఉండే థియేటర్ ఆర్టిస్ట్ కోర్సలే. కొంత కాలంగా వీళ్లిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. అయితే ఈ మధ్యలో వీళ్లిద్దరూ కలుసుకోవడం కుదర్లేదు. టీవీ షో చేస్తూ చెన్నైలో బిజీ బిజీగా గడిపారు శ్రుతీ. దాంతో ఇద్దరికీ మిస్సింగ్ మిస్సింగ్ అయింది. ప్రేమ భాషలో చెప్పాలంటే విరహం. మ్యూజిక్ వర్క్ మీద లాస్ ఏంజెల్స్ వెళ్లారు శ్రుతీ. అక్కడ మైఖేల్‌ను చాలా రోజుల తర్వాత కలిశారు. ఇంకేముంది అవధుల్లేని ఆనందం వచ్చేసింది శ్రుతీకి. ఆ ఆనందాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘‘నువ్వు నన్ను బాగా నవ్విస్తావు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. చాలా రోజుల తర్వాత నా ప్రియమైన వ్యక్తిని కలిశాను’’ అంటూ సెల్ఫీని పోస్ట్ చేశారు శ్రుతి. -
ముసుగు వెయ్యొద్దు...
... మనసు మీద’ అని ‘ఖడ్గం’లో పాట గుర్తుండే ఉంటుంది. ఇక్కడున్న రెండు ఫొటోలు చూస్తుంటే.. ముసుగు వెయ్యొద్దు ముఖము మీద అనాలనిపిస్తోంది. ఈ మాస్క్ వెనకాల ఉన్న ముఖారవిందాలు ఎవరివో తెలుసుకోవాలని ఉంది కదూ. అయితే చిన్న క్లూ. ఒక ముఖం లోకనాయకుడి కుమార్తెగా ఇండస్ట్రీకి వచ్చి, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ది. మరో ముఖం ఎవరిదో తెలుసుకోవాలంటే బాలీవుడ్‌కి వెళ్లాల్సిందే. జర్మనీలో పుట్టి, పెరిగిన ఈ భామ ‘ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్’ అనే హిందీ సినిమా ద్వారా భారతీయ తెరకు పరిచయమయ్యారు. ఇప్పుడు తెలుగులో మిర్చిలాంటి కుర్రాడి సరసన నటిస్తున్నారు. ఈ క్లూస్‌తో ఈ ఇద్దరు ముఖాలు ఎవరివో కనిపెట్టేసి ఉంటారు. అయినా మేమే చెప్పేస్తున్నాం. ఒకరు లోకనాయకుడు కమల్‌హాసన్ కుమార్తె, స్టార్ హీరోయిన్ శ్రుతీహాసన్, మరొకరు ఎవెలిన్ శర్మ. ఇంతకీ వీళ్లిద్దరూ ఎందుకిలా ఫేస్‌ని కవర్ చేశారంటే.. ముఖారవిందం తళుకులీనడానికి ఫేస్ మాస్క్ వేసుకున్నారేమో! -
స్క్రీన్ టెస్ట్
1. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘మరోచరిత్ర’ సినిమాలో కమల్‌హాసన్ సరసన నటించిన హీరోయిన్ ఎవరో గుర్తుందా? ఎ) సరిత బి) జయప్రద సి) సుమలత డి) రేవతి 2. ‘బొమ్మరిల్లు’ చిత్రంలో హీరో సిద్ధార్థ్‌కు తల్లిగా నటించిన ప్రముఖ నటి ఎవరు? ఎ) జయసుధ బి) శారద సి) గీత డి) కవిత 3. ఈ ఏడాది ఆగస్ట్ 27వ తేదీతో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిరంజీవి సినిమా ఏంటో తెలుసా? ఎ) కొదమ సింహం బి) కొండవీటి దొంగ సి) మాస్టర్డి) చూడాలని వుంది 4. ‘అల్లరి మొగుడు’ చిత్రంలో హీరో మోహన్‌బాబు సరసన ఇద్దరు కథానాయికలు నటించారు. ఒకరు మీనా. రెండో హీరోయిన్ ఎవరు? ఎ) వాణీ విశ్వనాథ్ బి) శోభన సి) దివ్యభారతి డి) రమ్యకృష్ణ 5. నటుడు చంద్రమోహన్ హీరోగా చేసిన మొదటి చిత్రం ‘రంగుల రాట్నం’. ఆ చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించింది ఒక్కరే. ఎవరా దర్శక–నిర్మాత? ఎ) బి.ఎన్. రెడ్డి బి) కె.వి. రెడ్డి సి) హెచ్.యం. రెడ్డి డి) ఆదుర్తి సుబ్బారావు 6. ‘జిల్’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమయ్యారు రాధాకృష్ణ. ఆయన తదుపరి చిత్రంలో హీరో ఎవరో తెలుసా? ఎ) ప్రభాస్ బి) నాగార్జున సి) నాని డి) వెంకటేశ్ 7. ‘ఏ మాయ చేశావే’ చిత్రంలో చిన్న పాత్ర ద్వారా తెరంగేట్రం చేసిన నటుడు ఎవరు? ఎ) సుధీర్ బాబు బి) సందీప్ కిషన్ సి) వరుణ్ సందేశ్ డి) నిఖిల్ 8. ఇప్పటివరకు తెలుగులో 5 పాటలు పాడారు ఈ హీరో. ఆయన పాడిన అన్ని పాటలూ ప్రజాదరణ పొందాయి. ఆ టాప్ హీరో ఎవరో కనుక్కోండి? ఎ) రామ్‌చరణ్ బి) రానా సి) నాగచైతన్య డి) యన్టీఆర్ 9. ‘శుభలగ్నం’ చిత్రంలో భర్తను కోటి రూపాయలకు అమ్మేసే క్యారెక్టర్లో నటించన నటి ఎవరు? ఎ) రోజా బి) ఆమని సి) భూమిక డి) సౌందర్య 10. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నర్తించిన నటి ఎవరో తెలుసా? ఎ) తమన్నా బి) జెనీలియాసి) సమీరా రెడ్డి డి) హన్సిక 11. ‘యమహా నగరి కలకత్తా పురీ.. నమహో హుబ్లీ హౌరా వారధీ...’ పాట రచయిత ఎవరో తెలుసా? ఎ) భువనచంద్ర బి) వేటూరి సి) సుద్దాల అశోక్ తేజ డి) ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి 1.2 శ్రీదేవి సోదరి మహేశ్వరి నటించిన హిట్ చిత్రం ‘పెళ్లి’. ఆ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి? ఎ) కోడి రామకృష్ణ బి) పి. వాసు సి) బి. గోపాల్ డి) ముత్యాల సుబ్బయ్య 13. వెంకటేశ్, వరుణ్‌తేజ్ ప్రస్తుతం ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి? ఎ) అనిల్ రావిపూడి బి) బాబీ సి) సంకల్ప్ రెడ్డి డి) సందీప్ రెడ్డి 14. ‘రేసుగుర్రం’ చిత్రంలోని ‘సినిమా సూపిత్త మామా... నీకు సినిమా సూపిత్త మామా.. సీను సీనుకి నీతో సీటీ కొట్టిస్త మామా...’ పాటను పాడిందెవరు? ఎ) అనుదీప్ బి) రేవంత్ సి) సింహా డి) హేమచంద్ర 15. ‘నర్తనశాల’ చిత్రంలో ద్రౌపదిగా నటించిన నటి ఎవరో తెలుసా? ఎ) సావిత్రి బి) వాణిశ్రీ సి) జయలలిత డి) అంజలీదేవి 16. రామ్‌చరణ్ నటించిన ‘ధృవ’ చిత్రానికి సంగీత దర్శకుడు? ఎ) యస్.యస్. తమన్ బి) హిప్ హాప్ తమిళ సి) యువన్ శంకర్‌రాజా డి) దేవిశ్రీ ప్రసాద్ 17. దర్శకుడు సురేందర్ రెడ్డి తన కెరీర్లో ఇద్దరు హీరోలతో రెండు చిత్రాలకు పని చేశారు. కానీ ఓ హీరోయిన్‌కు మాత్రం రెండు సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు. ఎవరా హీరోయిన్? ఎ) అమృతా రావు బి) ఇలియానా సి) శ్రుతీహాసన్ డి) రకుల్ ప్రీత్ సింగ్ 18. ‘బిగ్ బాస్2’ తెలుగు రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా నాని చేస్తున్నారు. మరి తమిళ ‘బిగ్ బాస్’ కి హోస్ట్‌గా ఏ హీరో చేస్తున్నారు? ఎ) విజయ్ బి) ధనుష్ సి) కమల్‌హాసన్ డి) శింబు 19. కృష్ణంరాజు, శ్రీదేవి నటించిన ఈ స్టిల్ ఏ సినిమా లోనిది? ఎ) త్రిశూలం బి) బాబులు గాడి దెబ్బ సి) బొబ్బిలి బ్రహ్మన్న డి) కటకటాల రుద్రయ్య 20. ఈ క్రింది ఫొటోలోని బాల నటుడు ఇప్పుడొక పెద్ద నటుడు చెప్పగలరా? ఎ) కమల్‌హాసన్ బి) హరీశ్ సి) రమేశ్‌బాబు డి) హరికృష్ణ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) ఎ 3) డి 4) డి 5) ఎ 6) ఎ 7) ఎ 8) డి 9) బి 10) సి 11) బి 12) ఎ 13) ఎ 14) సి 15) ఎ 16) బి 17) డి 18) సి 19) బి 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
అది నా అదృష్టం
తమిళ, తెలుగు, హిందీ భాషల్లో కథానాయికగా మంచి పేరు తెచ్చుకున్నారు శ్రుతీహాసన్. తండ్రి కమల్‌హాసన్‌కు తగ్గ తనయగా మార్కులు కొట్టేస్తూనే, సొంత అభిమానులను సంపాదించుకున్నారామె. కథానాయికగా డిఫరెంట్ క్యారెక్టర్స్‌ను ఎంచుకుంటూ ముందుకు వెళుతోన్న శ్రుతిలో మ్యూజిక్ కంపోజింగ్ టాలెంట్ కూడా ఉందని ప్రత్యేకించి చెప్పకర్లేదు. యాక్టింగ్, మ్యూజిక్వైజ్గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అన్న ప్రశ్నను శ్రుతీ ముందు ఉంచితే– ‘‘మా నాన్నగారు నటించి, దర్శకత్వం వహించిన ‘హే రామ్’లో నేను ఓ గెస్ట్ రోల్ చేశాను. అయితే నటిగా అది నాకు మొదటి సినిమా అని నేను అనుకోవడంలేదు. కానీ ఆ సినిమాతో కెమెరా ముందుకు వచ్చినందుకు ఫుల్ హ్యాపీ. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం బాలీవుడ్లో ‘లక్’ మూవీ చేశాను. యాక్టర్‌గా నా తొలి మూవీ అదే. సినిమా ప్రపంచాన్ని నా కళ్లు అర్థం చేసుకుంది అప్పుడే. అందుకే ‘లక్’ని నా మొదటి సినిమాలా భావిస్తున్నాను. యాక్టర్‌గా నా జర్నీ బాగుంది. ఇక మ్యూజిక్ కంపోజింగ్ అనేది నా న్యాచురల్ ఎక్స్టెన్షన్. సాధారణంగా చాలామందిలో యాక్టింగ్ లేదా మ్యూజిక్ ఏదో ఒక టాలెంట్ మాత్రమే ఉంటుంది. కానీ ఆ రెండింటినీ నేను చేయగలుగుతుండటం నా అదృష్టంగా భావిస్తున్నా’’ అని పేర్కొన్నారామె. ప్రస్తుతం మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ హిందీ చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో హీరో విద్యుత్ జమాల్. -
నో స్క్రిప్ట్ నోరీటేక్స్
కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కథానాయిక శ్రుతీహాసన్. కానీ హీరోయిన్గా కాదు. నిర్మాతగా. అయితే సినిమా పూర్తయ్యాక నిర్మాతగా కమిట్ అయ్యారు. విచిత్రంగా ఉంది కదూ. విషయంలోకి వస్తే... ఇసిడ్రో ప్రొడక్షన్స్ పతాకంపై ‘లెన్స్’ ఫేమ్ జయప్రకాశ్ రాధాకృష్ణన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘ది మస్కిటో ఫిలాసఫీ’. ఈ సినిమాకే నిర్మాతగా ముందుకొచ్చారు శ్రుతీ. మ్యూజిక్ డైరెక్టర్‌గా, హీరోయిన్గా సక్సెస్ సాధించిన శ్రుతీ ఇప్పుడు నిర్మాతగా కూడా విజయం సాధించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ‘‘ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ కంటెంట్ సినిమాలను ఇసిడ్రో ప్రొడక్షన్స్ ద్వారా ఆడియన్స్‌కు అందించాలనుకుంటున్నాం. ‘ది మస్కిటో ఫిలాసఫీ’ అలాంటి చిత్రమే అని నమ్ముతున్నాం. ‘లెన్స్’ వంటి మంచి చిత్రం తీసిన జయప్రకాశ్‌తో అసోసియేట్ అవ్వడం ఆనందంగా ఉంది. ఆయన స్టోరీ టెల్లింగ్ కొత్తగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్. అలాగే ఈ సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేశారామె. ఆ పోస్టర్‌పై ‘నో స్క్రిప్ట్.. నో రీటేక్స్’ అని ఉండటం విశేషం. చిత్రదర్శకుడు జయప్రకాశ్ మాట్లాడుతూ–‘‘రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలను ఆడియన్స్‌కు అందించాలని నిర్మాతలు కోరుకుంటారు. అలా గుడ్ కంటెంట్‌తో ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే సినిమానే ‘ది మస్కిటో ఫిలాసఫీ’. ట్రెడిషన్ అండ్ మోడ్రనిటీ బ్యాక్‌డ్రాప్‌లో నలుగురు స్నేహితుల చుట్టూ ఈ సినిమా సాగుతుంది. స్క్రిప్ట్, డైలాగ్స్ లేకుండా చిత్రీకరించాం’’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘సారిక (నటి, శ్రుతీహాసన్ తల్లి) మేడమ్‌తో ఈ సినిమా గురించి చెప్పాను. ఆ తర్వాత శ్రుతీహాసన్గారి ఇసిడ్రో మీడియా మూవీ బోర్డ్లోకి వచ్చింది. నా టాలెంట్ అండ్ విజన్‌ని నమ్మినందుకు చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
స్క్రీన్ టెస్ట్
1. ఓ సినిమా కోసం మహేశ్‌బాబు సిక్స్‌ప్యాక్ చేశారు. ఆ సినిమా ఏదో తెలుసా? ఎ) 1 నేనొక్కడినే బి) బిజినెస్ మేన్ సి) పోకిరి డి) ఖలేజా 2. భారతదేశ విశిష్ట పురస్కారాలైన పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్... ఈ మూడు పురస్కారాలను దక్కించుకున్న ఏకైక భార తీయ సినీ నటుడెవరు? ఎ) అక్కినేని నాగేశ్వరరావు బి) యన్టీ రామారావు సి) చిరంజీవి డి) అమితాబ్ 3. ‘వీర మహాదేవి’ అనే చిత్రంలో నటిస్తున్న హాట్ గర్ల్ ఎవరో తెలుసా? ఎ) షెర్లిన్ చోప్రా బి) సన్నీ లియోన్ సి) మల్లికా శెరావత్ డి) పూనమ్ పాండే 4. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న చిత్రంలో హీరోయిన్ ఎవరు? ఎ) శ్రుతీహాసన్ బి) కృతీ సనన్ సి) పూజా హెగ్డే డి) అదితీరావ్ హైదరీ 5. దర్శకుడు కోడి రామకృష్ణ.. దాసరి నారాయణరావు శిష్యుడు. గురువుకు, శిష్యునికి దర్శకులవ్వటానికి అవకాశం ఇచ్చిన నిర్మాత ఒక్కరే. ఆ నిర్మాత ఎవరు? ఎ) నాగిరెడ్డి–చక్రపాణి బి) దుక్కిపాటి మధుసూదనరావు సి) కె. రాఘవ డి) డి. రామానాయుడు 6. ‘అవతలి వాళ్లని మనం ఎంత కోరుకుంటున్నామో అది మన కళ్లల్లో కనిపించాలి’.. అనే డైలాగ్ రాసిన రచయితెవరో కనుక్కోండి? (చిన్న క్లూ– ఈ డైలాగ్ ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలోనిది) ఎ) అబ్బూరి రవి బి) కోన వెంకట్ సి) మేర్లపాక గాంధీ డి) బుర్రా సాయిమాధవ్ 7. బాలీవుడ్లో నానాపటేకర్ నటించిన ‘క్రాంతివీర్’ తెలుగు రీమేక్‌లో నానా స్థానంలో నటించిన నటుడెవరో కనుక్కోండి? ఎ) శోభన్ బాబు బి) మోహన్ బాబు సి) నాగార్జున డి) వెంకటేశ్ 8. ‘ఓ సుబ్బారావో, ఓ అప్పారావో, ఓ వెంకట్రావో, ఓ రంగారావో ఎవరో ఎవరో ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా..’ అనే పాటను రాసింది పాటల రచయిత కాదు ఓ దర్శకుడు. ఆ దర్శకుడెవరో తెలుసా? ఎ) ఎ. కోదండ రామిరెడ్డి బి) కోడి రామకృష్ణ సి) కె. రాఘవేంద్ర రావు డి) దాసరి నారాయణరావు 9. హీరో కృష్ణతో ఎక్కువ సినిమాల్లో (50 చిత్రాలు) హీరోయిన్గా నటించిన హీరోయిన్ విజయనిర్మల. ఆమె తర్వాత ఆయన సరసన ఓ హీరోయిన్ 45 సినిమాల్లో నటించారు. ఆ హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) శారద బి) జయప్రద సి) విజయశాంతి డి) జయసుధ 10. ‘చారులత’ సినిమాలో అవిభక్త కవలలుగా నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) అంజలి బి) ప్రియమణì æ సి) స్నేహ డి) హన్సిక 11. హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ ఇప్పటివరకు చేసిన తెలుగు సినిమాలెన్నో ఓ సారి లెక్కెట్టండి? ఎ) 12 బి) 15 సి) 18 డి) 19 12. వేల్ రికార్డ్స్ ఆడియో కంపెనీ అధినేత ఎవరో తెలుసా? చిన్న క్లూ: ఆమె ఓ ప్రముఖ సంగీత దర్శకుని సతీమణి. ఎ) వల్లీ బి) రమా సి) సునీత డి) కౌసల్య 13. ‘అ’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు బాలీవుడ్లో వచ్చిన ‘క్వీన్’ సినిమా తెలుగు రీమేక్‌ని తెరకెక్కిస్తున్నారు. ‘అ’ని నిర్మించింది ఓ ప్రముఖ తెలుగు హీరో. ఎవరా హీరో? ఎ) సందీప్ కిషన్ బి) నాగశౌర్య సి) నాని డి) నాగచైతన్య 14. నాగార్జున, అమల వివాహ తేదీ జూన్ 11. ఏ సంవత్సరంలో వీరి పెళ్లి జరిగింది? ఎ) 1990 బి) 1989 సి) 1995 డి) 1992 15. ‘పండగ చేస్కో’ సినిమాలో రామ్ సరసన ఇద్దరు కథానాయికలు నటించారు. అందులో ఒకరు రకుల్ ప్రీత్‌సింగ్, మరో హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) అనుపమా పరమేశ్వరన్ బి) తమన్నా సి) సోనాల్ చౌహాన్ డి) మాళవికా శర్మ 16. ఈ మధ్యే 75 చిత్రాల క్లబ్లో చేరిన సంగీత దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) అనూప్ రూబెన్స్ బి) యస్.యస్. తమన్ సి) దేవిశ్రీ ప్రసాద్ డి) సాయి కార్తీక్ 17. ఇటీవల రిలీజైన బాలీవుడ్ చిత్రం ‘రాజీ’ 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఆ సినిమాలో నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) కరీనా కపూర్ బి) కత్రినా కైఫ్ సి) ఆలియా భట్ డి) డయానా పెంటీ 18. 1961లో ఎన్టీఆర్ నటించిన ‘సీతారామ కళ్యాణం’ చిత్రానికి దర్శకుడెవరో తెలుసా? ఆయన నటుడు కూడా. ఎ) ఎన్టీఆర్ బి) అక్కినేని సి) కాంతారావు డి) యస్వీ రంగారావు 19. ఈ ఫొటోలోని చిన్నారి ఎవరు? ఎ) నిత్యామీనన్ బి) అనుపమా పరమేశ్వరన్ సి) ఆలియా భట్ డి) శోభన 20. ఈ స్టిల్ ఏ సినిమాలోదో చెప్పుకోండి? ఎ) మిస్సమ్మ బి) గుండమ్మకథ సి) అన్నపూర్ణ డి) దొంగరాముడు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) ఎ 3) బి 4) సి 5) సి 6) సి 7) బి 8) డి 9) బి 10) బి 11) బి 12) ఎ 13) సి 14) డి 15) సి 16) బి 17) సి 18) ఎ 19) ఎ 20) డి నిర్వహణ: శివ మల్లాల -
ఫస్ట్ డే ఫన్నీ డే
విద్యుత్ జమాల్, శ్రుతీహాసన్ జంటగా నటించిన తొలి చిత్రం ‘యారా’. ఈ సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాలో జోడీగా నటించేందుకు రెడీ అయ్యారు వీరిద్దరూ. అదెలా అంటే? అలా కుదిరేసిందంతే. జమాల్, శ్రుతి జంటగా తిగ్మాంషు దులియా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యారా’ ఇంకా విడుదల కాలేదు. కానీ, మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో విద్యుత్ జమాల్, శ్రుతీహాసన్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం స్టార్ట్ అయ్యింది. ‘‘నా కెరీర్లో మరో సినిమా జర్నీ స్టార్ట్ అయింది. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. జమాల్‌తో మళ్లీ కలిసి నటించబోతున్నాను. ఫస్ట్ డే ఫన్నీడే’’ అని పేర్కొన్నారు శ్రుతి. గతేడాది ఆమె నటించిన ‘బెహన్ హోగి తేరి’ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ఈ సంగతి అలా ఉంచితే.. ‘కాటమరాయుడు’ సినిమా తర్వాత తెలుగులో మరో చిత్రం ఒప్పుకోలేదు శ్రుతీహాసన్. -
ఇట్టా చెట్టా పట్టాలేసుకుని..!
‘మీ పెళ్లి ఎప్పుడు?’ అని శ్రుతీహాసన్‌ను అడిగితే ‘ఆ ఒక్కటీ అడగద్దంటూనే, ఇతరుల పర్సనల్ లైఫ్‌ని గౌరవించండి’ అని కాస్త ఘాటుగా మాట్లాడతారు. కానీ సెలబ్రిటీల విషయాలను తెలుసుకునేవాళ్లు ఈ మాట విని ఆగుతారా? ఊహూ.. చాన్సే లేదు. లండన్‌కి చెందిన మైఖేల్ కోర్సలేతో శ్రుతి లవ్‌లో ఉన్నారని ఈ ఇద్దర్నీ అక్కడక్కడా చూసినవాళ్లు ఊహిస్తున్నారు. ఆ ఊహలకు తగ్గట్టుగా మైఖేల్‌తో శ్రుతి బాహాటంగానే చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఆ మధ్య ఓ పెళ్లిలో, అలాగే తల్లి సారికతో, ఓసారి షాపింగ్ మాల్లో మైఖేల్‌తో కనిపించారు శ్రుతి. తాజాగా, ఈ ఇద్దరూ ప్రేమపక్షుల్లా విహరిస్తున్న ఫొటోలు బయటికి వచ్చాయి. మరి ఈ జంట ఏడడుగులు ఎప్పుడు వేస్తారో? అని ఔత్సాహికరాయుళ్లు మాట్లాడుకుంటున్నారు. సినిమాల సంగతికొస్తే... ఈ అమ్మడు విద్యుత్ జమాల్ హీరోగా రూపొందనున్న ఓ హిందీ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. -
సినిమాలు లేకపోయినా... ఆమె హవా తగ్గలేదు!
లోకనాయకుడు, నటుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది నటి శ్రుతీహాసన్. అయితే కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటోంది ఈ భామ. తన బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్స్లేతో షికార్లు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ఏడాది నుంచి శ్రుతి ఏ సినిమా చేయకపోయినా... తెరపై అభిమానులకు కనిపించకపోయినా. ట్వీటర్లో మాత్రం ఆమె హవా కొనసాగిస్తోంది. భారీ సంఖ్యలో అభిమానులు ఆమెను ఫాలో అవుతున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్‌లాల్ వంటి స్టార్లను వెనక్కి నెట్టి ముందు వరుసలో నిలిచింది శ్రుతి. ఏడు మిలియన్ల మంది అభిమానులు ట్వీటర్లో ఈ నటిని ఫాలో అవుతున్నారు. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా.. ఆమె హవా మాత్రం తగ్గలేదంటున్నారు నెటిజన్లు. నటి సమంత, శ్రుతికి కాస్త దగ్గర్లో ఉంది. సమంతను ట్వీటర్లో 6.53 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. -
ఊ కొట్టారా? ఊహూ అన్నారా?
ఆల్మోస్ట్ తొమిదేళ్ల క్రితం ‘లక్’ సినిమాతో బీటౌన్‌లో కథానాయికగా అడుగుపెట్టారు శ్రుతీహాసన్. ఆ తర్వాత అరడజనుకు పైగా హిందీ సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరోయిన్గా బాలీవుడ్లో పేరు తెచ్చుకోలేకపోయారు. కానీ ఆ ప్రయత్నం మాత్రం ఆపలేదు. అందులో భాగంగానే బాలీవుడ్లో ఆమె మరో ప్రాజెక్ట్‌కు పచ్చజెండా ఊపారని టాక్. యాక్షన్ స్టార్ విద్యుత్ జమాల్ హీరోగా మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం శ్రుతీహాసన్‌ను సంప్రదించారట చిత్రబృందం. స్క్రిప్ట్ విని ఎగై్జట్ అయ్యారట శ్రుతి. ఇక అధికారికంగా ఎనౌన్స్మెంట్ రావడమే ఆలస్యం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే... ఆల్రెడీ ‘యారా’ అనే చిత్రంలో విద్యుత్ జమాల్, శ్రుతీహాసన్ జంటగా నటించారు. ఎప్పుడో పూర్తయిన ఈ సినిమా విడుదలలో జాప్యం జరుగుతోంది. ఈ సినిమా రషెస్ చూసి విద్యుత్‌తో శ్రుతీ కెమిస్ట్రీ బాగుందని టీమ్ మెంబర్స్ కూడా భావించారని బీటౌన్ టాక్.ఒకవేళ ఈ సినిమాకు ఓకే చెబితే ఫారిన్ రిటర్న్ అమ్మాయి పాత్రలో నటించనున్నారట శ్రుతి. మరి.. ప్రచారంలో ఉన్నట్లు శ్రుతి ఈ ప్రాజెక్ట్‌కి ఊ కొట్టారా? ఊహూ అన్నారా? అనేది తెలియాలంటే వెయిట్ అండ్ సీ. బాలీవుడ్లో శ్రుతీ నటించిన చివరి చిత్రం ‘బెహన్ హోగి తేరి’. ఈ చిత్రం గతేడాది రిలీజైన సంగతి తెలిసిందే. ఆ మాటకొస్తే.. తెలుగులో ‘కాటమరాయుడు’ తర్వాత మరో సినిమా ఒప్పుకోలేదు. ఈ సినిమా విడుదలై ఏడాది అవుతోంది. ఈ 12 నెలల్లో శ్రుతి తమిళ చిత్రాలకు కూడా ‘ఊ’ కొట్టలేదు. మంచి కథ, పాత్ర అయితేనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నారట. లేకపోతే ‘ఊహూ’ అన్నదే ఈ బ్యూటీ సమాధానం అని పరిశీలకులు అంటున్నారు. -
ఎర్ర గులాబీలు రీమేక్‌లో శృతిహసన్
-
డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందుకొచ్చి...
''డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందుకొచ్చి తొడ కొట్టిందట. అయినా నువ్వు డైలాగ్ వేస్తే...కౌంటర్ ఇవ్వటానికి నేనేమైనా రైటర్నా..ఫైటర్ని ... అయ్బాబోయ్ నాకు కూడా సినిమా డైలాగ్స్ వచ్చేస్తున్నాయి...'' ఈ డైలాగ్స్ ఏ సినిమాలోవా అనుకుంటున్నారు కదూ... ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహేష్ బాబు 'ఆగడు' చిత్రం లోనివి. శనివారం (ఆగస్ట్ 9) మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా... 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ కొత్త టీజర్‌ను విడుదల చేసింది. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమా మొదటి టీజర్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు... ఇంకా ఆ ఊపులోనే ఉన్న మహేష్ అభిమానులకు .... తాజా టీజర్ మరింత కిక్ ఇచ్చిందనటంలో సందేహం లేదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రాం ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు సరసన హీరోయిన్ తమన్నాతొలిసారి నటిస్తోంది. ఇక మహేష్ తనయుడు గౌతమ్ బర్త్‌డే ఈనెల 31న చిత్ర ఆడియో ఫంక్షన్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మహేష్ బాబుకు సాక్షి డాట్ కామ్... బర్త్‌డే విషెస్ తెలుపుతోంది.