నేను మారిపోయాను! | shruti hasan in 20 years completed in film industry | Sakshi
Sakshi News home page

నేను మారిపోయాను!

Published Thu, Jul 25 2019 12:50 AM | Last Updated on Thu, Jul 25 2019 12:50 AM

shruti hasan in 20 years completed in film industry - Sakshi

శ్రుతీహాసన్‌

‘‘నేను మారిపోయా’’ అంటున్నారు శ్రుతీహాసన్‌. సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ సేమ్‌ మ్యాజిక్‌ను అక్కడ రిపీట్‌ చేయడానికి అప్పుడప్పుడు హిందీ సినిమాలు చేస్తున్నారు. ఇలా నటిగా శ్రుతీహాసన్‌ పదేళ్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – ‘‘మూవీ బిజినెస్‌లో ఒక నటిగా పదేళ్లు పూర్తి చేసుకున్నాను. ఎంతో నేర్చుకున్నాను. ఎంతోమందికి థ్యాంక్స్‌ చెప్పాల్సి ఉంది. నటిగా నేను ఈ స్థాయిలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. కెరీర్‌లో ఎదిగేందుకు నేను మరింత కష్టపడతానని ప్రామిస్‌ చేస్తున్నాను. నాకు సపోర్ట్‌ చేసేవారందరూ గర్వపడేలా నేను మరింత శ్రద్ధగా పనిచేస్తాను. ఈ జర్నీలో ‘మూవీ బిజినెస్‌’ అనేది నాకు ఫ్యామిలీ లాంటిదని అర్థమైంది.

ఇక్కడ కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. మరికొన్ని చెడు సంగతులున్నాయి. ఈ పదేళ్ల ప్రయాణంలో వృత్తిపరంగా, వ్యక్తిగా నేను చాలా మారిపోయాను. ఈ మధ్య ఒక ఏడాది విరామం తీసుకుని, వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎలా అడుగులు వేయాలో విశ్లేషించుకున్నాను. కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాను. నా జీవితంలోని తర్వాతి దశకు చేరుకోవడంలో ఈ లక్ష్యాలు నాకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు శ్రుతీహాసన్‌. 2009లో బాలీవుడ్‌ మూవీ ‘లక్‌’ సినిమాతో హీరోయిన్‌గా శ్రుతీహాసన్‌ కెరీర్‌ ప్రారంభమైంది. ఈ సినిమా విడుదలై (2009 జూలై 24) బుధవారం నాటికి సరిగ్గా పదేళ్లు ముగిశాయి. ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయమయ్యారామె.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement