శ్రుతీహాసన్ వయసెంత? ఆమెకు ఏ కలర్ అంటే ఇష్టం? ఎవరికి ఓటు వేస్తారు?... తెలుసుకోవాలని ఉందా? ఇవే కాదు.. వీటితో పాటు శ్రుతి చెప్పిన మరికొన్ని విశేషాలు కూడా తెలుసుకోవచ్చు. టాలీవుడ్‌కు కాస్త దూరమైన ఈ బ్యూటీ ప్రజెంట్ బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవల శ్రుతి ఇన్‌సా్ర్టగామ్ అకౌంట్ రీచ్ కోటికి చేరింది. ఇంతమంది ఫాలోయర్లను సంపాదించుకున్న సందర్భంగా శ్రుతి ‘మీరే ప్రశ్న అయినా అడగొచ్చు. నేను జవాబు చెబుతా’ అన్నారు. అంతే.. నెటిజన్లు ప్రశ్నలు సంధించారు. వాటిలో కొన్ని ఈ విధంగా...
► తెలుగు సినిమాల్లో మళ్లీ ఎప్పుడు నటిస్తారు?
ప్రస్తుతం నా కోసం, నా సంగీతం కోసం కొంచెం సమయం తీసుకున్నాను. త్వరలో ఓ న్యూస్ చెబుతాను.
► లేడీ ఓరియంటెడ్ సినిమా ఎప్పుడు చేస్తారు?
సరైన కథ కోసం ఎదురు చూస్తున్నాను.
► మీరు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు?
పని చేయడం వల్ల వచ్చాను. మా అమ్మ, నాన్నలు కూడా డోర్స్ ఓపెన్ చేశారు.
► తమిళ ఫ్యాన్స్ అంటే మీకు ఇష్టమేనా?
లేదు. వారంటే అమితమైన ప్రేమ.
► ఆర్టిస్టుగా మీకు కష్టంగా అనిపించింది ఏంటి?
కష్టాలు ఉంటాయి. కానీ సంతోషం కూడా అక్కడే ఉంది.
► టాలీవుడ్‌లో ఒకప్పుడు మీరు ప్రతి హీరోయిన్‌ని భయపెట్టారు? ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు?
మీ మాటలు వింటుంటే ఇప్పుడు నాకు భయం వేస్తోంది.
► సినిమాల్లోకి రాకపోతే ఏం చేసి ఉండేవారు?
క్రియేటివ్‌గా ఉంటూ ప్రజలను బాగా ఎంటర్‌టైన్ చేయాలని నేను ముందు నుంచే కోరుకున్నాను. కానీ అది ఎలానో ఆలోచన లేదు. అయితే ఏం చేసినా ప్రజలను ఎంటర్‌టైన్ చేయాలన్నదే మనసులో ఉండేది. అదే చేస్తున్నందుకు ఆనందంగా ఉంది.
► డైరెక్షన్, రాయడం వచ్చా?
రాయడం నాకిష్టం. అయితే డైరెక్షన్ చేసే శక్తి నాలో ఉందా? ప్రస్తుతానికి తెలియదు.
► మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరు?
నేనే. నన్ను నేను ప్రేమించుకున్నప్పుడే తోటివారిని ఇంకా ప్రేమించగలను.
► మీలో ఉన్న సూపర్ పవర్?
మార్పు కోరుకునేవారికి ప్రతి రోజునీ కొత్తగా చూపిస్తా.
► మీకు వంట వచ్చా? రాకపోతే ఎప్పుడు వంట నేర్చుకుంటారు?
అమెరికాలో ఉన్నప్పుడు నేర్చుకుంటాను. ఎందుకంటే నాకు ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం.
► చర్మ సంరక్షణకు చిట్కాలు చెబుతారా?
వేళకు నిద్రపోండి. బాగా నీరు తాగండి. గ్రీన్ జ్యూసులను తీసుకోవడం మర్చిపోవద్దు. మీ చర్మానికి సూట్ అయ్యే క్రీమ్స్‌నే వాడండి.
► ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్‌ని ఇష్టపడతారా? లేక సన్‌రైజర్స్ హైదరాబాద్‌నా?
రెండింటినీ నా హోమ్ టీమ్స్‌గానే భావిస్తాను. కానీ చెన్నై సూపర్‌కింగ్స్ ఫస్ట్.
► మీకు రాజకీయాలు ఇష్టమేనా?
రాజకీయాల పట్ల ఇంకా అవగాహన పెంచుకోవడానికి ట్రై చేస్తున్నా. మా నాన్న ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు.
మీకన్నా మీ పిల్లులు అంటే నాకు చాలా ఇష్టం...
టూ బ్యాడ్. అవి ఇన్‌స్టాగ్రామ్‌లో నీకు రెస్పాన్స్ వచ్చేలా టైప్ చేయవు.
► మీరు ఈ ఎలక్షన్‌లో ఎందుకు నిలబడలేదు?
ఎందుకంటే నాకు అనుభవం, నాలెడ్జ్ కానీ పాలిటిక్స్‌లో క్రియేటివ్ చేంజ్ తీసుకువచ్చే సామర్థ్యం కానీ లేవు. కానీ మా నాన్నగారి రాజకీయపార్టీని బాగా సపోర్ట్ చేస్తున్నాను.
► ప్రేమలో విశ్వాసం కోల్పోయినవారికి మీరు ఇచ్చే సలహా ఏంటి?
ఏం కాదు. నిన్ను నువ్వు ప్రేమించుకో.
► జంతువులు మాట్లాడితే ఏ జంతువు రూడ్‌గా మాట్లాడుతుందని మీ అభిప్రాయం?
బహుశా చిరుత. ఎందుకో నీకు తెలుసా?
► ఇష్టమైన నగరం?
చెన్నై, ముంబై, హైదరాబాద్. ఈ జాబితాలో లండన్ కచ్చితంగా ఉంటుంది.
► ఇష్టమైన రంగు
నలుపు
► మీ వయసు ఎంత?
గూగుల్‌లో వెతుక్కో.
► ఆధ్యాత్మికంగా ఉంటారా?
నాకు చేతనైనంతలో ఉంటాను.
► చూడాలనుకుంటున్న ప్లేస్?
జపాన్.
► దెయ్యాలంటే భయం ఉందా?
వాటితో పెట్టుకోను
► హీరో షారుక్ ఖాన్ గురించి ఒక్క మాటలో...
ప్రేమ.
► మీ పెంపుడు పిల్లుల పేర్లు?
కోరా.. క్లారా
► మీరు షార్ట్ హెయిర్‌లో బాగుంటారు?
థ్యాంక్స్... నాకూ ఇష్టమే.
► కమల్‌హాసన్‌గారి గురించి ఒక్క మాటలో?
ఒక్క మాట లోనా... ఆయన అద్భుతమైనవారు.
Comments
Please login to add a commentAdd a comment