చిన్ని చిన్ని సరదా | Actres Shruti Haasan creates her own cool mask | Sakshi
Sakshi News home page

చిన్ని చిన్ని సరదా

Published Sat, Jul 11 2020 1:14 AM | Last Updated on Sat, Jul 11 2020 1:14 AM

Actres Shruti Haasan creates her own cool mask - Sakshi

మాస్కులో శ్రుతీహాసన్‌

కరోనా వల్ల లభించిన ఖాళీ సమయంలో శ్రుతీహాసన్‌ వంటలు చేస్తున్నారు. ఆన్‌లైన్లో అభిమానులతో చిట్‌ చాట్‌ చేశారు. తనకు ఇష్టమైన సంగీతాన్ని బాగా సాధన చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా ఏదైనా చేయాలనుకున్నారట. అది కూడా ఏదైనా ప్రయోగం అయితే బాగుంటుందని భావించానంటున్నారు శ్రుతీహాసన్‌. సొంతంగా ఓ మాస్క్‌ను తయారు చేసుకున్నారు. ఆ మాస్క్‌ను «ధరించి, ఫొటోను అభిమానులతో షేర్‌ చేసుకున్నారు శ్రుతి.

‘‘ఈ కరోనా కాలంలో మాస్క్‌లను తప్పనిసరిగా ధరించండి. వీలైతే సొంత మాస్క్‌లను తయారు చేసుకోండి. నేను అలానే చేశాను. సొంత మాస్క్‌ను తయారు చేసుకోవడం చిన్న పనే కావొచ్చు. కానీ ఈ పని నాకు చాలా సరదాగా అనిపించింది. ఈ చిన్ని ప్రయోగం చాలా సంతోషాన్నిచ్చింది. అందుకే ఇలాంటి మరో ఎగై్జటింగ్‌ ఎక్స్‌పరీమెంట్‌ ఏదైనా చేయాలనుకుంటున్నాను. మీరు (అభిమానులు) కూడా సొంతంగా మాస్క్‌లు తయారు చేసుకోవడాన్ని ఓసారి ప్రయత్నించండి’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement