తండ్రి కమల్‌హాసన్ నుంచి శ్రుతీహాసన్ ఏం నేర్చుకున్నారు? లండన్‌లో ఆమె ఇల్లు కొన్నారా? శ్రుతి వాట్సప్ నెంబర్ ఏంటి? ఆమె బలాలు.. బలహీనతలు.. ఇలా ఎన్నో విషయాలకు సమాధానం దొరికింది. బుధవారం ఆమె శ్రుతి ట్విట్టర్‌లో చాట్ చేశారు. నెటిజన్ల సీరియస్ ప్రశ్నలు... శ్రుతి కొంటె సమాధానాలు, నెటిజన్ల కవ్వింపులు, శ్రుతి తెలివైన జవాబులు... ఇలా సాగిన ఈ చాట్ సెషన్ పై ఓ లుక్ వేయండి.
► మీ జీవితంలో మీకు బాగా గుర్తుండిపోయే జ్ఞాపకం?
సింగపూర్‌లో గాయనిగా తొలిసారి నేను స్టేజ్‌పై పాట పాడిన సంఘటన నా బెస్ట్ మెమరీ.
► మీ జీవితంలో మీరు పశ్చాత్తాపపడిన సంఘటనలు ఏమైనా?
కొన్ని ఉన్నాయి. కానీ మరీ అంత బాధపడే సంఘటనలైతే కాదు. నిజం చెప్పాలంటే జీవితంలో మనం ఊహించకుండా జరిగేవన్నీ మంచి పాఠాలే.
► మీరు తరచుగా ఎందుకు నలుపు రంగు దుస్తులే ధరిస్తారు?
నలుపు రంగు నాకు సూట్ అవుతుందని, అందంగా కనిపిస్తానని నా ఫీలింగ్. పైగా నేను ఏదైనా తినేటప్పుడు పొరపాటున నా దుస్తులపై పడితే మరకలు పెద్దగా కనిపించవు కదా (సరదాగా).
► దురదృష్టవశాత్తు మీరు అడవిలో ఒంటరిగా మిగిలిపోతే ఏ జంతువు మీకు బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది?
సింహం.
► మీరు డేట్‌కు వెళ్లాలనుకుంటే మీ ఫస్ట్ ప్రియారిటీ ఎవరు?
ఇది నాకు అసలు ప్రియారిటీయే కాదు.
► ఏ ఫిక్షనల్ క్యారెక్టర్‌ను మీరు మీ లైఫ్‌లో కలవాలనుకుంటున్నారు?
తాలియా రస్గుల్ (అమెరికన్ కామిక్ బుక్స్‌లోని క్యారెక్టర్)
► దోసె, వడా పావ్, ప్యాన్ కేక్స్... వీటిలో మీకు ఏది ఇష్టం?
సందేహం లేదు... దోసె.
► మీ పేరును సరిగ్గా పలకలేని కొందరి గురించి మీరేం చెబుతారు?
చాలామంది చాలా రకాలుగా నా పేరును పలుకుతుంటారు. నాకది కామెడీగా ఉంటుంది.
► మీ ఇల్లు కాకుండా ప్రపంచంలో మీకు బాగా నచ్చే ప్లేస్?
లండన్ . అక్కడ నాకు ఓ ఇల్లు కూడా ఉంది.
► మీలో ఉన్న మంచి, చెడుల గురించి?
నాలో ఉన్న మంచి గురించి ఇతరులు చెప్పాలి. ఇక నాలో ఉన్న చెడు గురించి చెప్పాలంటే నాకు సహనం చాలా తక్కువ. అందుకే లాక్‌డౌన్ లో ఈ విషయంపై ఫోకస్ పెట్టాను. ఇప్పుడు ఫర్లేదు.
► మీరు త్వరలో ఉత్తరాఖండ్‌కు వచ్చే ప్లాన్ ఏమైనా ఉందా?
లేదు. కానీ రావాలని ఉంది
► బెంగళూరు, చెన్నై... ఇంతకీ ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు?
ముంబయ్‌లో!
► మహిళల గురించి మీ మనసులో ఉన్న మాట?
మహిళల హక్కులు, సంక్షేమం, చిన్నపిల్లల భద్రత బాగుండాలి.
► మీ ఫ్యాన్ మూమెంట్?
నా చిన్నప్పటి నుంచి సింగర్ టోరి అమోస్‌కు వీరాభిమానిని. లండన్ లో ఆమెను కలిసేందుకు ఓ కాఫీ షాప్‌కు పరిగెత్తుకుంటూ వెళ్లాను. ఆ సమయంలో భావోద్వేగానికి లోనై ఏడ్చాను.
► మీ మొబైల్ వాల్‌పేపర్‌పై ఏ పిక్చర్ ఉంటుంది?
మురుగన్ (కుమారస్వామి).
► మీ వాట్సప్ నెంబర్?
100.
► మిమ్మల్ని గతంలోకి తీసుకుని వెళ్లే మిషన్ మీ దగ్గర ఉంటే..?
నా ఎనిమిదో తరగతి క్లాసులకు వెళతాను
► మిమ్మల్ని సంతోషపరచే మూడు చిన్న విషయాలు?
నిజం, నిద్ర, స్వచ్ఛమైన కౌగిలింత.
► మీ గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పండి?
పాములంటే నాకు విపరీతమైన భయం.
► నటి కాకపోయి ఉంటే?
ఏదైనా క్రియేటివ్ జాబ్‌లోనే ఉండేదాన్ని.
► మీ నాన్న కమల్‌హాసన్ నుంచి మీరేం నేర్చుకున్నారు?
నిన్ను నువ్వు ప్రశ్నించుకో అండ్ నెవర్ గివ్ అప్
► కోవిడ్ టైమ్ జాగ్రత్తలు తీసుకోండి.
ఓ.. తీసుకుంటున్నా. నేను బాగున్నా. మీరు జాగ్రత్త.
► కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా?
ఇంకా లేదు. త్వరలో తీసుకుంటాను
► నన్ను మీరు ఎక్కడ కలుస్తారు?
కోవిడ్ టైమ్... నో మీటింగ్స్.
► మీలో మీకు నచ్చనిది?
నా గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తుంటాను.
ఒక్క మాటలో...
► మహేశ్‌బాబు: జెంటిల్‌మేన్
► రామ్‌చరణ్: స్వీటెస్ట్
► ప్రభాస్: సూపర్ చిల్ అండ్ లవ్లీ
► విజయ్: ఎమేజింగ్ ∙కీర్తీ సురేశ్: ‘మహానటి’లో కీర్తి నటన నాకు బాగా నచ్చింది
► నాగచైతన్య: కైండెస్ట్ పర్సన్
► నాని: అతనితో నటించే అవకాశం రాలేదు. అద్భుతమైన నటుడు.
► దర్శకుడు ప్రశాంత్ నీల్: సూపర్‌మైండ్ అండ్ కామ్
► మీ ఫ్యా¯Œ ్స: ది బెస్ట్
ఫేవరెట్స్
► సబ్జెక్ట్స్: హిస్టరీ, బయాలజీ
► స్కూల్ డేస్‌లో క్రష్: హృతిక్‌రోషన్, లియోనార్డో డికాప్రియో
► ఫుడ్: సాంబర్ రైస్, దోసె చాలు.. ఈ లైఫ్‌కి!
► హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్స్: ఎంటర్ ది డ్రాగన్, కిల్‌బిల్
► కాఫీ లేదా టీ: కాఫీ తాగను... సో మిగిలింది టీ!
► గులాబ్ జామూన్ లేదా ఐస్‌క్రీమ్: రెండూ కలిపితే బాగుంటుంది
Comments
Please login to add a commentAdd a comment