మార్చుకుంటూ.. నేర్చుకుంటూ.. ముందుకెళ్తా! | shruti hassan chatting with her fans | Sakshi
Sakshi News home page

మార్చుకుంటూ.. నేర్చుకుంటూ.. ముందుకెళ్తా!

Published Sun, Aug 4 2019 5:32 AM | Last Updated on Sun, Aug 4 2019 5:32 AM

shruti hassan chatting with her fans - Sakshi

శ్రుతీహాసన్‌ను తన అభిమానులు స్క్రీన్‌ మీద మిస్‌ అవుతున్నారు. ‘మీ అందర్నీ స్క్రీన్‌ మీద త్వరలోనే పలకరిస్తాను. ఈ బ్రేక్‌లో చిన్న చాట్‌ చేద్దామా?’ అని అడిగారు. వెంటనే ఆమె అభిమానులంతా ప్రశ్నల వర్షం కురిపించారు. శ్రుతీ అభిమానులతో చేసిన చాట్‌లో కొన్ని ప్రశ్నలు..
     
► లైఫ్‌లో ఎప్పుడైనా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్‌ అయ్యారా?
అఫ్‌కోర్స్‌! చాలాసార్లు. కానీ దాన్ని ఎదుర్కొనే మార్గం కూడా కనుగొన్నాను.
► పిజ్జా ఇష్టమా లేక బర్గర్‌ ఇష్టమా?
పిజ్జా అంటే ప్రాణం.
► మీ నాన్నగారి సినిమాల్లో మీకు బాగా ఇష్టమైనది?
మహానది.
► మీ యాక్టింగ్‌ సై ్టల్‌ని వర్ణించండి?
 ముందుగా ప్లాన్‌ ఏదీ చేసుకోకుండా లొకేషన్‌లో అక్కడికక్కడ నటించడం నా సై ్టల్‌.
► కమల్‌హాసన్‌ గారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం ఎప్పుడైనా భారంగా అనిపించిందా?
మా ఫ్యామిలీ అంటే నాకు చాలా గర్వం. దాన్ని నిలబెట్టడానికి ప్రతిరోజూ కష్టపడుతూనే ఉంటాను. అది భారం కాదు.
► మీ జీవితంలో గొప్ప అచీవ్‌మెంట్‌ ఏంటి?
ఎప్పటికప్పుడు నన్ను మార్చుకుంటూ కొత్త విషయాలను నేర్చుకోవడం.
► స్క్రీన్‌ మీద మిమ్మల్ని బాగా మిస్‌ అవుతున్నాం. మీ ఫ్యాన్స్‌ కోసం ఓ తెలుగు సినిమా చేయండి.
త్వరలోనే చేస్తాను.
► జీవితం ఎలా ఉంది శ్రుతీ?
వండర్‌ఫుల్‌. అడిగినందుకు ధన్యవాదాలు.
► మీరు చేస్తున్న అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘ట్రెడ్‌స్టోన్‌’ గురించి ఏదైనా చెప్పండి?
ప్రస్తుతానికైతే యాక్షన్‌ ట్రైనింగ్‌ చాలా బాగా నడుస్తోంది.
► మీరు దేనికి ఎక్కువగా భయపడతారు?
పాములకు, అజ్ఞానానికి.
► ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ సీజన్‌ 8 గురించి మీ అభిప్రాయం?
చాలా బాధగా ఉంది. దాని గురించి మాట్లాడదలచుకోలేదు కూడా.
►  మీ ఫేవరెట్‌ చాక్లెట్‌?
రోయ్స్‌.
►మీరు స్ట్రిక్ట్‌గా ఉండే సిస్టరా? ఫ్రెండ్లీ సిస్టరా?
ఆ విషయం మీరు నా చెల్లెలు అక్షరాహాసన్‌ని అడగాలి.
► మీ నుండి ఇండిపెండెంట్‌ మ్యూజిక్‌ వీడియోలు ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చా?
అతి త్వరలోనే..
► ఏలియన్స్‌ (గ్రహాంతర వాసులు) ఉన్నాయని నమ్ముతారా?
నమ్ముతాను.
► ఏ విషయం మీకు చిరాకు తెప్పిస్తుంది?
కామన్‌సెన్స్‌ లేకుండా ఉంటే చిరాకొస్తుంది.
► మీకు పిల్లలు కావాలా? కావల్సిస్తే ఎంత మంది?
కచ్చితంగా కావాలి, ఇద్దరు పిల్లలు కావాలి.  
► విమర్శలను ఎలా స్వీకరిస్తారు?
విలువైన విమర్శలను ఎప్పడూ స్వీకరిస్తాను.
► మీరు రైటర్‌ అని మాకు తెలుసు. నాకో సలహా కావాలి. మనమెప్పుడూ అనుభవించని విషయాన్ని ఎలా రాయాలి?
మనుషులందరం ఒకలాంటి ఎమోషన్స్‌కే కనెక్ట్‌ అయ్యుంటాం అని అనుకుంటాను. అందుకే ఆర్టిస్టిక్ట్‌గా ప్రేక్షకులు కూడా అనుభవించగలిగేది రాయడం చాలా ముఖ్యం. ఆ సంఘటన జరిగితే ఎలా ఉంటుంది? అనే ఊహతో ఆలోచిస్తూ నీకు ఏదనిపిస్తే అది రాస్తూ ఉండు.
► మీ అభిమానుల గురించి ఒక్క మాట?
మీ అందర్నీ నేను ఎంతో ప్రేమిస్తాను. మీరంతా నా డిజిటల్‌ ఫ్యామిలీ. మీరందరూ నా జీవితంలో ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను.
► శ్రుతీహాసన్‌లా ఉండటం ఎలా ఉంటుంది?
చాలా చాలా సరదాగా ఉంటుంది.
► మీ జీవితాన్ని మార్చేసిన పుస్తకాల గురించి చెబుతారా?
రిచార్డ్‌ బ్యాచ్‌ రాసిన ఇల్యూషన్‌ పుస్తకం చదవమని నాన్నగారు చెప్పారు. అది నా జీవితాన్నే మార్చేసింది. అలానే మార్లిన్‌ బ్రాండో ఆటోబయోగ్రఫీలోని పాటలు చాలా ఇష్టం. మా అమ్మ నేర్పించారు.
► స్టార్‌ కిడ్‌గా ఉండటం కష్టమైన విషయమా? యాక్టర్‌గా గుర్తింపు పొందాలనుకుంటున్నారా? సింగర్‌గానా?
స్టార్‌ కిడ్‌గా ఉండటం అంత కష్టమేం కాదు. ఆర్టిస్ట్‌గా గుర్తింపబడాలి అనుకుంటాను.
► మీకేదైనా సూపర్‌పవర్‌ ఉంటే ఏం చేస్తారు?
పేదవాళ్లకు సహాయం చేస్తాను.
► మీ జీవితంలో అంతిమ లక్ష్యం ఏంటి?
సంతోషంగా ఉండటం.
► మీ చిన్నప్పటి క్రష్‌ పేరు ఏంటి?
హృతిక్‌ రోషన్‌.
► మీ అమ్మానాన్న ఉన్న ఫీల్డ్‌లోనే ఉండటం ప్లస్‌ అనుకుంటున్నారా? మైనస్‌ అనుకుంటున్నారా?
ప్లస్‌.
► మిమ్మల్ని ద్వేషించేవాళ్లను ఎలా డీల్‌ చేస్తారు?
నేను వాళ్లను అసలు డీల్‌ చేయను.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement