
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశాడు. మిమ్మల్ని కలిసేందుకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానని తెలిపాడు. త్వరలోనే మీ అందరినీ కలుస్తానని అన్నారు. త్వరలో సమావేశం ఏర్పాటు చేసి వ్యక్తిగతంగా మాట్లాడతానని వెల్లడించారు. తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
పాదయాత్రలు చేయొద్దు..
అయితే తనను కలిసేందుకు పాదయాత్రలు లాంటివి చేయవద్దని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. మీ సంక్షేమమే నాకు ముఖ్యమన్నారు. తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న మీ ఆసక్తిని అర్థం చేసుకుని వ్యక్తిగతంగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అధికారులతో అన్ని అనుమతులు తీసుకుని.. అందరినీ సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని తెలిపారు. ఇంత పెద్ద సమావేశం నిర్వహించటానికి కొంత సమయం అవసరం అవుతుంది.. ఈ విషయంలో అభిమానులు ఓర్పుగా ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు.
గతేడాది దేవర మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రంతో శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది.
A Statement from @tarak9999 Office#JrNTR #ManOfMasses𝐍𝐓𝐑#Devara #war2 #Ntrneel pic.twitter.com/erzTOohW0R
— TigerNation 🐯 (@IamGanesh1718) February 4, 2025