request
-
ఎస్పీ కి వైఎస్ఆర్సీపీ నేతల విజ్ఞప్తి
-
ఈసీ షెడ్యూల్.. వైఎస్సార్సీపీ కోరిందే జరిగింది
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ చేసిన విజ్ఞప్తిని మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి.. ఒకే రోజు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహణకు మొగ్గు చూపింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో ఒకేసారి లోక్‌సభ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్సీపీ పలుమార్లు కోరిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ మేరకు ఢిల్లీ వెళ్లి ప్రతిపక్షాలపై ఫిర్యాదు చేసిన టైంలోనే కాకుండా.. ఈసీ సమీక్షకు వచ్చినప్పుడు కూడా వినతి పత్రాలను ఈసీకి సమర్పించింది. ఒకే రోజు ఎన్నికలు నిర్వహించడం ద్వారా.. దొంగ ఓట్లను అరికట్టవచ్చని వైఎస్సార్సీపీ మొదటి నుంచి చెబుతోంది. తెలంగాణలో ఓటర్లుగా నమోదైన వారంతా ఏపీలో కూడా ఓటు నమోదు చేసుకున్నారని.. రెండు చోట్ల ఓటు వేయకుండా నిరోధించడానికే తాము ఒకేసారి ఎన్నికల నిర్వహణ కోరుతున్నామని వైఎస్సార్సీపీ ఆ వినతుల్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా.. నాలుగో దశలో ఏపీలో 25, తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు జూన్ 4వ తేదీన ఇరు రాష్ట్రాల లోక్‌సభ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇదీ చదవండి: 175 మందితో వైఎస్సార్సీపీ సిద్ధం -
భారత్‌కు మాల్దీవుల అభ్యర్థన.. ఎందుకో తెలుసా?
మాల్దీవుల-భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా భారత్ తాను ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో కూడా మాల్దీవులకు రూ.600 కోట్ల ఆర్థిక సాయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఆ మరోసటి రోజే.. తాజాగా మాల్దీవుల నుంచి భారత్‌కు ఒక అభ్యర్థన వచ్చింది. తమ దేశ సముద్ర ప్రాదేశిక జలాల్లో మూడు మత్స్యకారుల నౌకల్లో ఇండియన్ కోస్ట్‌గార్డు సిబ్బంది ప్రవేశించటంపై భారత్ నుంచి స్పష్టత ఇవ్వాలని కోరింది. శుక్రవారం రాత్రి తమ దేశ మిలిటరీ.. గురువారం విదేశి మిలిటరీ సిబ్బంది మాల్దీవుల మత్స్యకారుల నౌకల్లోకి ప్రవేశించినట్లు సమాచారం అందుకుందని.. అందులో భారత్‌కు చెందిన కోస్ట్ గార్డు సిబ్బంది ఉన్నట్లు గుర్తించినట్లు భారత్‌కు నివేదించింది. అదేవిధంగా మరో రెండు నౌకల్లో కూడా ఇండియన్ కోస్ట్‌గార్డు సిబ్బంది ప్రవేశించారని పేర్కొంది. అయితే వారు ఏం చేశారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మాల్దీవీయన్ ఎక్స్క్లూసివ్ ఎకానమిక్ జోన్లో ప్రయాణిస్తున్న మాల్దీవుల మత్స్యకారుల నౌకల్లోకి ఇండియన్ కోస్ట్ సిబ్బంది ప్రవేశించటంపై భారత్ అధికారికంగా నివేదిక అందించాలని ఈ మేరకు మాల్దీవుల విదేశీ వ్యవహారాల మంత్రి భారత్‌కు అధికారిక విజ్ఞప్తి చేసింది. సంబంధిత అధికారులతో సమన్వయం లేకుండా అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఘటనపై స్పష్టత ఇవ్వాలని ఆ దేశ స్థానిక భాషలోనే భారత్‌ను అభ్యర్థించడం గమనార్హం. ఇక.. మాల్దీవుల- భారత్ మధ్య నెలకొన్నదౌత్యపరమైన ప్రతిష్టంభన నేపథ్యంలో ఇది మొదటి దౌత్యపరమైన అభ్యర్థనగా తెలుస్తోంది. ఇక కీలకమైన హిందూ మహాసముద్రంలో భారత్, చైనా తమ వ్యూహాత్మ ప్రాధాన్యపై దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. మాల్దీవుల మంత్రులు.. లక్షద్వీప్ విషయంలో ప్రధానిమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో చైనా అనుకూల వ్యక్తిగా పేరున్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జతో భారత్ దౌత్యపరమైన సంబంధాలు క్షీణిస్తూ వచ్చాయి. చదవండి: US Strikes: యూఎస్ ప్రతీకార దాడులు.. ఆరుగురు ఉగ్రవాదులు మృతి! -
'తప్పుగా అనుకోవద్దు ప్లీజ్'.. వారందరికీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ రిక్వెస్ట్!
బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్-6లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా టాప్-5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. ఈ షో ద్వారానే ఆదిరెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలు చేస్తున్నారు. అంతే కాకుండా గతేడాది జరిగిన బిగ్‌బాస్ సీజన్-7పై రివ్యూలు కూడా ఇచ్చారు. బిగ్‌బాస్ షోపై రివ్యూలతో మరింత ఫేమస్ అయ్యారు. అయితే తాజాగా ఆదిరెడ్డికి ఓ సమస్య వచ్చిపడింది. సాయం కావాలంటూ ప్రతి ఒక్కరు నేరుగా ఇంటికి వస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అభిమానులుకు ఆదిరెడ్డి విజ్ఞప్తి చేశారు. దయచేసి ఎవరూ కూడా ఇలా రావొద్దంటూ రిక్వెస్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: అయోధ్య రామ మందిరానికి బిగ్ బాస్ 'ఆదిరెడ్డి' విరాళం) ఆది రెడ్డి వీడియోలో మాట్లాడుతూ మాట్లాడుతూ.. 'దయచేసి అర్థం చేసుకోండి .. నాకు తోచిన సహాయం నేను చేస్తున్నాను. నాకు వీలైనంత సాయం చేస్తుంటే ఉంటా. కానీ డైరెక్ట్‌గా ఇంటికి చాలా మంది వస్తున్నారు. వాళ్ల అందరికి నేనేం చేయగలను చెప్పండి . ఎవరు వచ్చినా ఆహారం అంటే ఒకరోజు పెట్టించగలను. కానీ వాళ్ల బాధలన్నీ చెప్పినా నేను ఏం చేయలేని పరిస్థితి. దయచేసి ఎవరు కూడా ఇంటికి కానీ.. సెలూన్‌కు కానీ రావొద్దు. సమాజానికి నా వంతు కృషి చేస్తాను. అంతే కానీ అందరికి చేయలేను కదా. ఎలాగోలా వచ్చిన వాళ్లకి ఛార్జీలకి ఇచ్చి పంపుతున్నా . దయచేసి అర్థం చేస్కోండి. తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. నాతో మాట్లాడాలంటే కామెంట్స్, మెసేజేస్ ద్వారా పంపండి.' అంటూ విజ్ఞప్తి చేశారు ఆదిరెడ్డి. కాగా.. ఆదిరెడ్డి ఇటీవలే 'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర' ట్రస్ట్‌కు తన వంతుగా ఒక లక్ష రూపాయలు విరాళం అందించాడు. View this post on Instagram A post shared by Adi Reddy (@adireddyofficial) -
‘ప్లీజ్.. పెళ్లి చేసుకోండి’.. యువతులను వేడుకుంటున్న చైనా అధ్యక్షుడు
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లో విచిత్రమైన భయం నెలకొంది. దేశంలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతుండటంతో, అభివృద్ధికి ఆమడదూరంలోకి వెళ్లిపోతామని ఆయన భయపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే దేశంలోని యువతులంతా పెళ్లి చేసుకోవాలని మరోమారు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. తాజాగా జరిగిన ఆల్ చైనా ఉమెన్స్ ఫెడరేషన్ సమావేశంలో జిన్‌పింగ్ యువతులు పెళ్లి చేసుకుని, పిల్లలను కనాలని విజ్ఞప్తి చేశారు. చైనాలో శిశుజననాల రేటు భారీగా తగ్గింది. మరోవైపు చైనా యువతులు పెళ్లికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ దేశంలో జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆల్ చైనా ఉమెన్స్ ఫెడరేషన్ సమావేశంలో పాల్గొన్న ఆయన దేశంలో కుటుంబ వ్యవస్థను కాపాడటంతో మహిళలదే కీలకపాత్ర అని అన్నారు. సమాజంలో కొత్త ఒరవడిని నెలకొల్పడంలో మహిళలు ముందుంటారని పేర్కొన్నారు. దేశంలో వివాహాలు, సంతాన సాఫల్యత అనే నూతన సంస్కృతిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. 2022లో చైనా సంతానోత్పత్తి రేటు చారిత్రాత్మకంగా పడిపోయి 1.09కి చేరుకుంది. దేశంలో పిల్లలు లేని జంటల సంఖ్య రెండింతలు పెరిగింది. తాజాగా విడుదలైన ఒక నివేదిక ప్రకారం దేశంలో పిల్లలు లేని జంటల వాటా 2017-2022 మధ్య 20.6 శాతం నుండి 43.2 శాతానికి చేరుకుని, రెండింతలు పెరిగింది. పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చు, కెరీర్ సంక్షోభం, లింగ వివక్ష తదితర అంశాలు చైనా యువత పెళ్లికి దూరంగా ఉండటానికి కారణాలుగా నిలిచాయి. ఈ నేపధ్యంలో శిశు జననాల రేటు భారీగా పడిపోయింది. ఈ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని చైనా అధ్యక్షుడు దేశంలోని యువత పెళ్లి చేసుకుని పిల్లలను కనాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా భవిష్యత్తులో చైనా వృద్ధాప్య దేశంగా మారిపోనున్నది. ఇప్పటికే చైనాలో వృద్ధుల జనాభా అధికమయ్యింది. మరోవైపు చైనాలో కార్మికుల సంఖ్య తగ్గింది. ఫలితంగా ఉత్పత్తి వ్యయం అంతకంతకూ పెరుగుతోంది. ఇది కూడా చదవండి: ప్రియాంకకు చేదు అనుభవం: పుష్ఫగుచ్ఛం ఇచ్చారు.. పూలు మరచారు! -
హైదరాబాద్ నుంచి నేరుగా విమానాలు ఏర్పాటు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ నుంచి నేరుగా అమెరికాకు విమానసర్వీసులు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి యూఎస్ఏ ఎన్నారైలు వినతిపత్రం సమరి్పంచారు. ఈ మేరకు అమెరికాలో పర్యటిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని తెలుగు ఎన్నారైలు కలిశారు. ఢిల్లీ, ముంబై వంటి అనేక ఇతర భారతీయ నగరాలు ఇప్పటికే అమెరికాలోని ప్రధాన నగరాలతో నేరుగా విమాన కనెక్షన్లు కలిగి ఉన్నాయని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం కోసం ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్ మరింత ఎదుగుతుందని పేర్కొన్నారు. కాగా ఎయిర్ ఇండియా కొత్త ఫ్లైట్లను ఆర్డర్ చేయటంతోపాటు, కొత్త రూట్లలో విమాన సర్వి సులను తెచ్చేందుకు కృషి చేస్తోందని, కేంద్ర అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా ప్రవాసుల కోరిక నెరవేరేలా చూస్తామని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విలాస్ జంబుల, లక్ష్మణ్ అనుగు, సంతోష్ రెడ్డి, శ్రీకాంత్ తుమ్మల, ప్రదీప్ కట్టా, వంశీ యమజాల, మధుకర్ రెడ్డి, రామ్ వేముల, రఘువీర్ రెడ్డి తదితరులు ఉన్నారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ నేతలు భేటీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డితో అమెరికాలోని ప్రవాస తెలంగాణవాదులు, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీడీఎఫ్ మాజీ అధ్యక్షుడు మురళి చింతలపాని, లక్ష్మణ్ అనుగు, ఇతర కార్యవర్గసభ్యులు కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్ర సాధనలో ప్రవాస తెలంగాణవాసులు, టీడీఎఫ్ పోషించిన పాత్రను కిషన్‌రెడ్డి అభినందించారు. -
కేటీఆర్ సార్.. మెట్రో మాక్కూడా!
హైదరాబాద్: నగరవాసుల ప్రయాణ బాధల్ని తీరుస్తూ.. లక్షల మందికి ఊరట ఇస్తోంది మెట్రో రైలు వ్యవస్థ. ఫేజ్‌ల వారీగా మరింత దూరం పట్టాలపై పరుగులు పెట్టేందుకు సిద్ధమైపోతోంది ఇది. అయితే.. ఈ సర్వీసులను తమ ప్రాంతంలోనూ ఏర్పాటు చేయాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు మంత్రి కేటీఆర్ చెంతకు క్యూ కడుతున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు మెట్రో సర్వీస్ పొడిగింపుపై విజ్ఞప్తులు చేశారు. ఎల్బీనగర్-రామోజీ ఫిలింసిటీ, ఎల్బీనగర్-తుర్కయాంజాల్, ఆదిభట్ల-కొంగరకలాన్, ఉప్పల్-బోడుప్పల్-ఫిర్జాదీగూడ, మియాపూర్-పటాన్ చెరు మార్గాల్లో మెట్రో ప్రాజెక్టు నిర్మించాలని కోరారు. ఈ ప్రాజెక్టుల విషయంలో డీపీఆర్ తయారు చేయాలంటూ అధికారులను ఆదేశించాలని మంత్రి కేటీఆర్‌కు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మెట్రో పొడిగింపుతో ఆయా ప్రాంతాల్లో పర్యాటకం, వాణిజ్యం ఊపందుకుంటాయని వారు పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలకు ముగింపు పడుతుందని చెప్పారు. ఈ విజ్ఞప్తులను పరిశీలిస్తామని ఆయన వాళ్లకు చెప్పినట్లు తెలుస్తోంది. -
‘మాకొక వందే భారత్ కావలెను’
ఢిల్లీ: వందేభారత్ రైళ్లకు అక్కడ ఫుల్ గిరాకీ ఉంటోంది. ప్రయాణికులతో అనుకునేరు. మా రూట్లలో ఆ రైలు నడపండి మహాప్రభో అంటూ కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తున్నారు పలువురు ఎంపీలు. వాళ్లలో కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు సైతం ఉండడం గమనార్హం. గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో.. భారత్‌లో సెమీ హైస్పీడ్ రైల్‌గా వందే భారత్ పేరొందింది. టికెట్ ధర ఎక్కువే అయినా.. ఫ్లైట్‌లో ఉండేలా అత్యాధునిక వసతులు, త్వరగతిన గమ్యస్థానానికి చేర్చుతుండడంతో వందే భారత్ రైళ్లను తమ నియోజకవర్గాల్లోని ప్రజలు కోరుకుంటున్నారని చెబుతూ ఎంపీలు.. కేంద్ర రైల్వేశాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. పార్లమెంట్ నుంచి దాదాపు 60 మంది ఎంపీలు.. వందే భారత్ రైళ్లను తమ రూట్లలో నడపాలంటూ కేంద్ర రైల్వే శాఖకు విజ్ఞప్తి చేశారు. వందే భారత్ 2.0 సూపర్ సక్సెస్ అయ్యింటూ లేఖలో పేర్కొన్నారు వాళ్లు. వీళ్లలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. అలాగే పలువురు బీజేపీ ఎంపీలతో పాటు విపక్షాల నుంచి 14 మంది ఎంపీలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా రైల్వేస్‌కు విజ్ఞప్తి చేసినవాళ్లలో ఉన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పది వందే భారత్ రైళ్లు వివిధ రూట్లలో ప్రయాణిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నడుమ సికింద్రాబాద్-విశాఖపట్నం నడుమ వందే భారత్ రైలు నడుస్తోంది. -
వందే భారత్ రైళ్లలో ఇది పరిస్థితి.. భారతీయ రైల్వేస్ రిక్వెస్ట్
Viral News: ఇతర దేశాల్లో బుల్లెట్ ట్రైన్లు, మాగ్నటిక్ బుల్లెట్ ట్రైన్ల టెక్నాలజీతో రైల్వే రంగాలు దూసుకుపోతున్నాయి. మన దగ్గర అంతస్థాయిలో కాకపోయినా మెట్రో, ఈ మధ్యకాలంలో వందే భారత్ లాంటి సెమీ స్పీడ్ రైళ్లను పట్టాలెక్కించింది కేంద్రం. అయితే.. భారత్‌లో ఇప్పటిదాకా హైక్లాస్ రైలుగా వందే భారత్ ఓ ఫీట్ సాధించగా.. వసతులు, ఆధారంగా భూతల విమానంగా అభివర్ణిస్తున్న వందే భారత్ రైలులో పరిస్థితి ఇది అంటూ తాజాగా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వందే భారత్ రైలు కంపార్ట్మెంట్లో మొత్తం వాటర్ బాటిళ్లు, చెత్తా చెదారం, కవర్లు నిండిపోయి ఉన్నాయి. ఓ వర్కర్ దానికి శుభ్రం చేస్తుండగా తీసిన ఫొటో ఇది. ఐఏఎస్ అధికారి అవానిష్ శరణ్ తన ట్విటర్లో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. పైగా ‘వీ ద పీపుల్’ అంటూ మన జనాల్లోని కొందరి మైండ్ సెట్‌ను ఉదాహరించారాయన. “We The People.” Pic: Vande Bharat Express pic.twitter.com/r1K6Yv0XIa — Awanish Sharan (@AwanishSharan) January 28, 2023 ఆయన పోస్ట్‌కు రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ప్లాస్టిక్ నిషేధం లేన్నన్నాళ్లూ ఇలాంటి పరిస్థితి తప్పదంటూ కొందరు.. జనాలకు స్వీయ శుభ్రత అలవడితేనే పరిస్థితి మారుతుందంంటూ మరికొందరు.. ఏది ఏమైనా మన దేశంలో ఇలాంటి పరిస్థితిలో మార్పురాదని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఓవైపు చెత్తాచెదారం శుభ్రం చేశాక కూడా.. సిబ్బంది ముందే చెత్తా పారబోస్తున్నారు. వందే భారత్ రైళ్లు గమ్యస్థానం నుంచి ప్రారంభం అయ్యే లోపే ప్రయాణికులు వేస్తున్న చెత్తాచెదారంతో నిండిపోతోందని సిబ్బంది వాపోతున్నారు. ఇదిలాఉంటే సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే వందేభారత్ రైలులో చెత్తాచెదారం దర్శనమివ్వగా.. దయచేసి శుభ్రతను పాటించాలంటూ భారతీయ రైల్వేస్ సంస్థ వందేభారత్ ప్రయాణికులకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల వైఖరి, మనస్తతత్వం మారనంత కాలం.. స్వచ్ఛ భారత్ సాధించడం కష్టం. కాబట్టి, మెరుగైన సేవలను అందుకోవడానికి రైల్వేస్‌తో సహకరించండి. దయచేసి చెత్తచెదారం వేయకండి. డస్ట్బిన్లలోనే చెత్త వేయండంటూ అంటూ ప్రకటనలో పేర్కొంది భారతీయ రైల్వేస్. హైక్లాస్ రైలు.. అత్యాధునిక, సాంకేతిక వ్యవస్థలతో పనిచేసే వందే భారత్ రైళ్లలో.. విమానాల్లో మాదిరి ఇంటీరియర్ కనిపిస్తుంది. కోచ్‌లన్నీ ఫ్లైట్ ఇంటీరియర్‌తో పోలి ఉంటాయి. సీటింగ్ కూడా అదే విధంగా ఉంటుంది. ఆటోమేటిక్ డోర్లు ఉండటమే కాక అవన్నీ రొటేట్ అవుతుంటాయి. సీట్ల వద్ద ఉండే బటన్ ప్రెస్ చేసి ఎవరితోనైనా మాట్లాడవచ్చు. సీసీ కెమెరాలుంటాయి. ప్రయాణికుల కదలికలను సెంట్రల్ స్టేషన్ నుంచి మానిటరింగ్ చేస్తారు. భద్రతకు ప్రాధాన్యత.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా భద్రతా వ్యవస్థ సత్వరం స్పందిస్తుంది. ఎమర్జన్సీ అలారం ఉంటుంది. మరుగుదొడ్లు స్టార్ హోటల్లో ఉన్నట్టుగా తలపిస్తాయి. ఇంజిన్ కాక్‌పిట్ అత్యద్భుతంగా ఉంటుంది. ఈ-డిస్‌ప్లేలుంటాయి. గంటకు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకుపోయినా గ్లాసులో వాటర్ ఒలకదు. గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సగటు వేగం 88 కిలోమీటర్ల మేర ఉంటుంది. సున్నితంగా ఉంటుంది ఈ రైలులో ప్రయాణం. -
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి ఈడీ షాక్!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. రోహిత్‌రెడ్డి అభ్యర్థనను ఈడీ అధికారులు తిరస్కరించారు. ఆయన లేఖను ఈడీ పరిగణనలోకి తీసుకోకపోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రోహిత్‌రెడ్డి హాజరుకానున్నారు. కాగా, విచారణకు హాజరు కాలేనని లాయర్‌తో ఈడీకి రోహిత్‌రెడ్డి లేఖ పంపించారు. విచారణకు హాజరయ్యేందుకు చాలా తక్కువ సమయం ఇచ్చారని, వరుస సెలవులు కారణంగా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్, ఇతర డాక్యుమెంట్లు తీసుకోలేకపోయానని రోహిత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. అయితే రోహిత్‌రెడ్డి విజ్ఞప్తిని ఈడీ అధికారులు తిరస్కరించారు. కాగా, ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి రావాలని స్పష్టం చేసింది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టంలోని (పీఎంఎల్ఏ) 2, 3, 50 సెక్షన్ల కింద జారీ చేసిన ఈ నోటీసుల్లో మొత్తం పది అంశాలను పొందుపరిచింది. -
విచారణకు రాలేను.. ఈడీకి రాహుల్ గాంధీ విజ్ఞప్తి
ఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) విచారణలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. దర్యాప్తు సంస్థకు ఓ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం విచారణకు హాజరుకాలేనంటూ ఇవాళ ఓ లేఖ రాశారు ఆయన. తన తల్లి బాగోగులు చూసుకునేందుకు అనుమతించాలని, విచారణను పొడిగించాలని లేఖలో ఈడీని కోరారు రాహుల్ గాంధీ(51). నేషనల్ హెరాల్డ్ కేసులో.. రాహుల్ గాంధీ పాత్రపై అనుమానాలు ఏమిటో ఈడీ ఇప్పటిదాకా స్పష్టత అయితే ఇవ్వలేదు. కానీ, మూడు రోజులు పాటు మాత్రం ఎనిమిది గంటలకు తక్కువ కాకుండా ప్రశ్నల వర్షం కురిపించింది. మరోవైపు ఈ చర్యకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తోంది. అయితే ఈడీ విచారణకు గురువారం బ్రేక్ పడింది. తిరిగి శుక్రవారం తమ ఎదుట హాజరుకావాలంటూ కోరింది ఈడీ. తన తల్లి(సోనియా గాంధీ) కరోనాతో చికిత్స పొందుతున్నందునా.. విచారణకు హాజరుకాలేనని, తన తల్లి బాగోగులు చూసుకోవడానికి కొన్ని రోజులు విచారణను పొడిగించాలని లేఖలో కోరారు రాహుల్. అయితే ఈడీ ఆ విజ్ఞప్తిపై స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. 75 ఏళ్ల వయసున్న సోనియా గాంధీ కూడా నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే.. కరోనా కారణంగా హాజరుకాలేకపోయిన ఆమె.. చికిత్స కోసం గంగారాం ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం సోనియాగాంధీ కొడుకు కూతురు రాహుల్, ప్రియాంక వాద్రాలు గంగారాం ఆస్పత్రిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. -
భారత్‌ను బతిమాలుతున్నాం: ఐఎంఎఫ్ చీఫ్
దావోస్: ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జియేవా(68) Kristalina Georgieva.. భారత్‌ను బతిమాలుతున్నారు. గోధుమ ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించగా.. ఈ నిర్ణయంపై వీలైనంత త్వరగా పునరాలోచన చేయాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. అంతర్జాతీయ ఆహార భద్రత, ప్రపంచ స్థిరత్వంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నక్రిస్టలీనా.. వీలైనంత త్వరగా నిషేధాన్ని ఎత్తేయాలని కోరారు. వేసవి ప్రభావంతో గోధుమ ఉత్పత్తి తగ్గిపోవడం, దేశీయంగా ధరలు పెరిగిపోవడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే భారత్ తరపున ఈ పరిస్థితులను అర్థం చేసుకోగలమని పేర్కొన్న ఆమె.. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడబోయే సంక్షోభ స్థితిని భారత్ అర్థం చేసుకోవాలని కోరారు. భారతదేశాన్ని వీలైనంత త్వరగా పునరాలోచించవలసిందిగా నేను వేడుకుంటున్నాను, ఎందుకంటే ఈ నిర్ణయంతో ఎక్కువ దేశాలు ఎగుమతి ఆంక్షలపైకి అడుగుపెట్టే అవకాశం ఉంది. మరికొన్ని దేశాలు కూడా ఆ ఆలోచన చేయొచ్చు. అప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి కష్టతరంగా ఉంటుంది అని ఆమె అన్నారు. ఇప్పటికే ఓ పక్క యుద్ధ సంక్షోభం కొనసాగుతోంది. ఈజిప్ట్, లెబనాన్ లాంటి దేశాల ఆకలి తీర్చేది భారత్. అలాంటప్పుడు భారత్ నిర్ణయంతో ఆయా దేశాల్లో ఆకలి కేకలే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సామాజిక అశాంతి నెలకొనే అవకాశం ఉంది అని ఆమె అభ్రిప్రాయపడ్డారు. స్విట్జర్లాండ్ దావోస్ వేదికగా ఓ భారతీయ మీడియాతో ఆమె పైవ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టెట్ ఎగ్జామ్ వాయిదా వేయడం కుదరదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లాష్ అవ్వకుండానే ఎగ్జామ్ తేదీ ముందుగానే ఖరారు చేసామని ఆమె మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. జూన్ 12వ తేదీన రైల్వే ఎగ్జామ్ ఉన్నందున.. టెట్ ఎగ్జామ్ ను వాయిదా వేయాలంటూ ఓ అభ్యర్థి చేసిన ట్వీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలంటూ మంత్రి సబితకు ట్యాగ్ చేశారు కేటీఆర్. అయితే సంబంధిత అధికారులతో మాట్లాడిన తర్వాతే ట్వీట్ చేస్తున్నట్లు తెలిపిన ఆమె.. వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు. దాదాపు 3.5లక్షల మంది రాయాల్సి ఉన్న టెట్ ను అన్ని పరిగణలోకి తీసుకునే ఏర్పాట్లు చేసామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. any other competitive exams. Taking everything into consideration postponing TET exams is not possible as it has cascading effect on other preparations of the Dept— SabithaReddy (@SabithaindraTRS) May 21, 2022 -
Cryptocurrency: బాబ్బాబు.. కొట్టేసిందంతా వెనక్కి ఇచ్చేయండ్రా!
ఊహించని రీతిలో లాభాలను కురిపిస్తున్నాయనే ఆనందమే కాదు.. క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్టర్లలో ఆందోళనలు నెలకొంటున్నాయి. ముఖ్యంగా హ్యాకర్ల ముప్పు పొంచి ఉండడంతో అభద్రతా భావానికి లోనవుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వాలు, ఆర్థిక విభాగాలు లేవనెత్తుతున్న అభ్యంతరాల్లో ఇది కూడా ఉంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ ప్లాట్‌ఫామ్ ‘క్యూబిట్ ఫైనాన్స్’ నుంచి సుమారు 80 మిలియన్ డాలర్ల (600 కోట్ల రూపాయలకు పైనే) క్రిప్టోకరెన్సీ చోరీకి గురైంది. పక్కాగా ప్లాన్ చేసిన హ్యాకర్లు ఈ ఏడాది ఆరంభంలోనే ఈ భారీ చోరీకి పాల్పడ్డారు. ఇది గ్రహించిన క్యూబిట్ ఫైనాన్స్.. హ్యాకర్లతో బేరానికి దిగింది. మొదట కొంచెం సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చిన క్యూబిట్.. అటుపై కొంచెం తగ్గి ట్వీట్లు చేసింది. The protocol was exploited by; 0xd01ae1a708614948b2b5e0b7ab5be6afa01325c7 The hacker minted unlimited xETH to borrow on BSC. The team is currently working with security and network partners on next steps. We will share further updates when available. — Qubit Finance (@QubitFin) January 28, 2022 కొట్టేసిందంతా తిరిగి ఇచ్చేయాలని, బదులుగా.. మంచి నజరానా ఇస్తామని ప్రకటించింది. అంతేకాదు ఎలాంటి న్యాయపరమైన చర్యలకు వెళ్లమని మాటిస్తోంది కూడా. ఇక క్రిప్టోకరెన్సీలో అరుదైన సర్వీస్‌ను క్యూబిట్ అందిస్తోంది. దీని ప్రకారం.. బ్రిడ్జ్ అనే సర్వీస్‌లో వివిధ రకాల బ్లాక్‌చెయిన్స్ ఉంటాయి. డిపాజిట్ చేసిన క్రిప్టోకరెన్సీని వేరొకదాంట్లోనూ విత్‌డ్రా చేసుకోవచ్చు. An appeal to the exploiter: It's not too late to return to funds. We will pay the maximum bounty reward as mentioned as well as not seek any legal charges if you return the funds and do right by the community. — Qubit Finance (@QubitFin) January 28, 2022 అయితే 2020లో బినాన్స్ స్మార్ట్‌చెయిన్‌ను లాంఛ్ చేసినప్పటి నుంచి డెఫీ(అప్‌కమింగ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ) ప్రాజెక్టులకు హ్యాకింగ్ తలనొప్పులు ఎదురవుతున్నాయి. కిందటి ఏడాది ఏప్రిల్‌లో యురేనియం ఫైనాన్స్ నుంచి 50 మిలియన్ డాలర్లు, మే నెలలో వీనస్ ఫైనాన్స్ నుంచి 88 మిలియన్ డాలర్లు హ్యాకర్ల బారినపడింది. చదవండి: క్రిప్టో దెబ్బకి మిలియనీర్ల నుంచి బికారీలుగా మారిన వేలమంది! -
మీడియాకు జాక్వెలిన్ అభ్యర్థన.. మీ ప్రియమైన వారికి ఇలా చేయరుగా
Jacqueline Fernandez Request To Media Not Circulate Her Private Photos: శ్రీలంక బ్యూటీ, బీటౌన్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గతేడాది నుంచి వార్తల్లో నిలుస్తోంది. సుకేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పలు బాలీవుడ్ హీరోయిన్స్‌తోపాటు జాక్వెలిన్‌కు సుకేష్ ఖరీదైన బహుమతులు ఇవ్వడంతో ఈడీ ఆమెను విచారించింది. అప్పటినుంచి ఫిల్మ్ దునియాలో తరచుగా, వార్తల్లో అప్పుడప్పుడూ జాక్వెలిన్ పేరు వింటూనే ఉన్నాం. తాజాగా జాక్వెలిన్ మీడియాకు విన్నవించుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. సుకేష్ చంద్రశేఖర్‌తో లీక్ అయిన తన ఫొటోను ప్రసారం చేయొద్దని మీడియాను అభ్యర్థించింది. తన గోపత్యకు భంగం కలిగిస్తోందని పేర్కొంది జాక్వెలిన్. 'ఈ దేశం, ఈ ప్రజలు నాకు విపరీతమైన ప్రేమ, గౌరవాన్ని ఇస్తున్నారు. ప్రస్తుతం నేను కఠినమైన పరిస్థితిలో ఉన్నాను. అది నా స్నేహితులు, అభిమానులు గమనిస్తూనే ఉన్నారని తెలుసు. ఈ నమ్మకంతోనే నా వ్యక్తిగత చిత్రాలను ప్రసారం చేయొద్దని మీడియా మిత్రులను అభ్యర్థిస్తున్నాను. నేను ఇప్పటికే చాలా నేర్చుకున్నాను. నా ప్రైవసీకి భంగం కలిగించరని ఆశిస్తున్నాను. మీరు మీ ప్రియమైన వారికి ఇలా చేయరు కదా. అలాగే నాకు కూడా ఇలా చేయరని నమ్ముతున్నా. న్యాయం, మంచి గెలుస్తుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.' అని పోస్ట్‌లో రాసుకొచ్చింది జాక్వెలిన్. View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) ఇదీ చదవండి: జాక్వెలిన్‌ను సుకేష్ ఇలా ముగ్గులోకి దింపాడట.. -
సినీ పరిశ్రమను కాపాడాలని సీఎంకు నిర్మాతల విజ్ఞప్తి
చెన్నై సినిమా : సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు తమిళ సినీ నిర్మాతల మండలి సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా నిర్మాతల మండలి నిర్వాహకులు ఆదివారం ఉదయం సమాచార శాఖ మంత్రి వెళ్లకోవిల్ సామినాథన్ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. కష్టాల్లో ఉన్న సినీ పరిశ్రమను కూడా కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా క్యూబ్ రుసుమును తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో తమిళ్ అభివృద్ధి, సమాచార శాఖ కార్యదర్శి మహేశన్ కాశీరాజు నుంచి, సమాచారశాఖ డైరెక్టర్ వీపీ.జయశీలన్, తమిళ్ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు ఎన్.రామసామి తదితరులు పాల్గొన్నారు. -
భక్తి పారవశ్యంతో ఈ పూజారి చేసిన పని... విగ్రహానికి వైద్యం..!!
ఒక్కోసారి కొంత మంది భక్తిలో పరవశించుపోతూ చేసే కొన్ని పనులు మనకు భయాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఒక్కొసారి ఆ స్థాయి మరి ఎక్కువగా చేరితే ఇక వారి వింత ప్రవర్తనతో జనాలను విసిగిస్తుంటారు. అయితే అచ్చం అలానే ఇక్కడొక పూజారి చేశాడు. అసలు విషయంలోకెళ్లితే..ఒక పూజారి ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రాలోని జిల్లా ఆసుపత్రికి చేరుకుని విచిత్రంగా అభ్యర్థించాడు. ఈ మేరకు అతను తన కృష్ణుడి చిన్ననాటి విగ్రహమైన లడ్డూ గోపాల్ విగ్రహానికి స్నానం చేయిస్తున్నప్పుడు చేయి విరిగిపోయిందని అందువల్ల చికిత్స చేయాలంటూ ఏడుస్తూ అభ్యర్థిస్తాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కి గురవుతారు. అయితే మొదటగా ఎవరు అతని అభ్యర్థనను పట్టించుకోరు. కానీ కాసేపటికి జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ స్పందించి పేషంట్ పేరు కృష్ణుడిగా రిజిస్టర్లో నమోదు చేసుకుని. పూజారి సంతృప్తి నిమిత్తం విగ్రహానికి కట్టుకట్టామని తెలిపారు. అయితే పూజారి లేఖ్ సింగ్ అర్జున్ నగర్‌లోని ఖేరియా మోడ్‌లోని పత్వారీ ఆలయంలో గత 30 ఏళ్లుగా పూజారిగా చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క.. వందల కోట్ల వారసత్వ ఆస్తి!) -
ఆ డబ్బులు అఫ్గనిస్తాన్‌వి.. మాకు తిరిగివ్వండి: తాలిబన్లు
కాబూల్: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచక పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. క్రూరమైన శిక్షలు, పాశవిక పాలన మధ్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మరోవైపు దేశం ఆర్థిక సంక్షోభంలో పడిపోవడంతో పాటు ప్రజలకు తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఖజానా పరంగా కూడా నగదు లేకపోవడంతో పొరుగు దేశాలతో ఎగుమతి ,దిగుమతులకు కూడా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో నిల్వ ఉంచిన తమ డబ్బును తిరిగివ్వాలని తాలిబన్ ప్రభుత్వం బ్యాంకులను కోరుతోంది. అఫ్గనిస్థాన్ గత ప్రభుత్వాలు బిలియన్ల కొద్ది డాలర్లను యూఎస్ ఫెడరల్ రిజర్వ్, ఐరోపాలోని ఇతర సెంట్రల్ బ్యాంకులలో నిల్వచేసింది. అయితే ఆగస్టులో ఇస్లామిస్ట్ తాలిబాన్ పాశ్చాత్య-మద్దతుగల ప్రభుత్వాన్ని తొలగించినప్పటి నుంచి ఆయా దేశ ప్రభుత్వాలు ఆ డబ్బును విత్‌డ్రా చేసుకోకుండా నిలిపివేశాయి. దీంతో ప్రస్తుతం తమ దేశంలో పరిస్థితుల దృష్ట్యా ఆ డబ్బుని తిరిగి ఇవ్వాలని తాలిబన్ ప్రభుత్వం బ్యాంకులను అభ్యర్థిస్తోంది. అఫ్గన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి దీనిపై మాట్లాడుతూ.. ‘‘ఆ డబ్బు అఫ్గనిస్తాన్ దేశానిది. కాబట్టి మా డబ్బు మాకివ్వండి. నగదు నిల్వలను నిలుపుదల చేయడం సమజసం కాదని, అంతర్జాతీయ చట్టాలు, విలువలకు విరుద్ధం. ’’ అని తెలిపారు. తమ ప్రభుత్వం మహిళలకు విద్య సహా మానవ హక్కులను గౌరవిస్తుందని, మానవత్వంతో చేసే పనులకు నిధులు విడుదల చేయాలని కోరారు. చదవండి: ‘నన్ను ప్రత్యక్షంగా చూస్తే థ్రిల్లింగ్‌గా ఉందా.. తేడా కొడితే మాత్రం ఇంతే’ -
ప్లీజ్.. గర్భవతిని! నా పోర్న్ వీడియోల్ని తీసేయండి
కెరీర్లో ఉన్నంత కాలం అవకాశాల కోసం ప్రయత్నిస్తూ.. రాణిస్తూ, ఆపై ఫేమ్ తెచ్చిన ఇండస్ట్రీపై విమర్శలు చేయడం అడల్ట్ స్టార్లకు అలవాటైన పనే. మియా ఖలీఫా, సన్నీ లియోన్ లాంటి మాజీ పోర్న్ స్టార్స్ వ్యతిరేక కామెంట్లు చేసిన వాళ్లే. ఇక ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి చేరింది లానా రోడ్స్. చికాగో ఇల్లినాయిస్లో పుట్టిన పెరిగిన ఈ 25 ఏళ్ల మాజీ అడల్ట్ స్టార్ అసలు పేరు అమరా మాపుల్. టీనేజీలోనే పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి లానా రోడ్స్‌గా ఫేమ్ సంపాదించుకుంది. మొదట మోడలింగ్, యూట్యూబ్, ఇన్ఫ్లుయెన్సర్గా పేరు సంపాదించుకుంది. 2016 అడల్ట్ సినిమాల్లోకి అడుగుపెట్టి.. రెండేళ్లపాటు స్టార్‌డమ్‌ను కొనసాగించింది. కొంతకాలం క్రితం కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన ఆమె.. ప్రస్తుతం హ్యారీ జోసే పాడ్‌కాస్ట్ ‘టాప్ ఇన్’లో పని చేస్తోంది. ఇక అప్పటి నుంచి ఇండస్ట్రీపై తరచూ విమర్శలు చేస్తోంది. తాజాగా తాను గర్భవతిని అనే బాంబ్ పేల్చిన లానా.. తన గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి వీడియోల్ని తొలగించాలని విజ్ఞప్తి చేస్తోంది. ‘‘ప్రస్తుతం నేను గర్భంతో ఉన్నా. నాకు పుట్టే బిడ్డకు నా గతం గురించి తెలిసినా.. ఆ జ్ఞాపకాలు అందకూడదనే అనుకుంటున్నా. అందుకే నిజాయితీగా కోరుతున్నా. దయచేసి అడల్ట్ వెబ్సైట్లు ఆవీడియోలను తొలగించండి. అవకాశం దొరికితే నేనే కాలంలో వెనక్కి వెళ్తా. అలాంటి పనులకు దూరంగా ఉంటా. నా గౌరవాన్ని నేను కాపాడుకుంటా’’ అని పశ్చాత్తాప పడింది లానా. ఇక అంతేకాదు సెక్స్ వర్కర్స్‌తో ఇంటెరాక్షన్ ద్వారా.. వాళ్ల మానసిక సంఘర్షణను అందరికీ తెలియజేసేలా ప్రోగ్రామ్‌లు చేస్తోందామె. వాళ్లకు(అడల్ట్ వెబ్సైట్లకు) కొంత కాలం అవకాశం ఇవ్వాలనుకంటున్నా.. అవసరమైతే న్యాయపరమైన చర్యల దిశగా ఆలోచిస్తా అని చెప్తోంది లానా. చదవండి: అడల్ట్ సినిమాలతో మియా ఖలీఫా సంపాదనెంతో తెలుసా? ఇంతకీ తండ్రెవరు? మైక్ మజ్లక్ అమెరికన్ నటుడు, పాపులర్ వ్లోగర్. లానా రోడ్స్‌తో చాలాకాలంగా రిలేషన్షిప్ కొనసాగించాడు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ.. కొన్ని నెలల క్రితం వీళ్లిద్దరూ విడిపోయారు. దీంతో లానా కడుపులో బిడ్డకు తండ్రి అతనేనా? అనే అనుమానం ఆమె అభిమానులకు వ్యక్తం అవుతోంది. అయితే ఈ ప్రశ్నకు ఆమె ‘బిడ్డ పుట్టాక డీఎన్ఏ టెస్ట్ చేస్తే తెలుస్తుంద’ని సరదా సమాధానం ఇచ్చింది. చదవండి: పాక్ చేష్టలపై మియా ఖలీఫా ఫైర్ -
ముంబైలో కరోనా కల్లోలం.. చేతులెత్తి మొక్కిన మేయర్
ముంబై: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో విలయ తాండవం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మహమ్మారి కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేక పోతున్నాయి. ఇదిలా ఉంటే కరోనా దెబ్బకు మహరాష్ట్ర విలవిలలాడుతోంది. ముఖ్యంగా ముంబై నగరం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రతీ రోజూ నమోదవుతున్న కేసులతో పాటు మరణాలు అదే స్థాయిలో పెరుగడం ముంబై వాసులను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై నగర మేయర్ కిషోర్ పెడ్నెకర్ కరోనా నిబంధనలను ప్రజలు తప్పక పాటించాలని వేడుకున్నారు. ముంబై నగరం వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలతో ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ఈ క్రమంలో జనాభా తాకిడి కూడా అధికమే. అంతటి జనాభా ఉన్నప్పుడు అందులో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా అది అందరినీ ప్రమాదంలో పడేస్తుంది. ప్రస్తుతం ముంబైలో కేసుల పెరుగుదలకు ఇదొక కారణమనడంలో సందేహం లేదు. ఓ పక్క కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ ఇంకా కొందరు నిర్లక్ష్యంగా మాస్క్‌లు ధరించకపోవడం, అవసరం లేకపోయినా బయట సంచరించడం లాంటివి చేస్తూ కేసుల పెరుగుదలకు పరోక్షంగా కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో నగర మేయర్ ముంబై వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీకు చేతులెత్తి మొక్కుతున్నా.. డబుల్ మాస్క్‌లు పెట్టుకోండి. అవసరం ఉంటేనే బయటకి రండి, లేదంటే రాకండి.. అని వేడుకున్నారు. ( చదవండి: శభాష్ ప్యారే ఖాన్: రూ.కోటితో ఆక్సిజన్ ట్యాంకర్లు ) I request everyone with folded hands to wear a mask, that too double masks. People are requested to not step out of their houses unnecessarily: Mumbai Mayor Kishori Pednekar#COVID19 pic.twitter.com/zyjTAPew6x— ANI (@ANI) May 1, 2021 -
తన కొడుకు ప్రాణాలను కాపాడమని ఓ తల్లి ఆవేదన
-
కరోనా కష్టాల్లో రుణగ్రహీతలు
ముంబై: కరోనా వైరస్ పరిణామాలతో రుణగ్రహీతలు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రుణాలను 2021 దాకా వన్–టైమ్ ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరించేందుకు అనుమతించాలంటూ రిజర్వ్ బ్యాంక్‌ను నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ) కోరాయి. అలాగే రుణ వాయిదాలపై మారటోరియం వెసులుబాటు తమకూ ఇవ్వాలని, ప్రొవిజనింగ్ నిబంధనల సడలింపునివ్వాలని విజ్ఞప్తి చేశాయి. ఆర్బీఐతో జరిగిన సమావేశంలో పరిశ్రమ వర్గాలు ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలియజేసినట్లు ఎన్‌బీఎఫ్‌సీల సమాఖ్య ఆర్థిక రంగ అభివృద్ధి మండలి (ఎఫ్ఐడీసీ) వెల్లడించింది. లాక్‌డౌన్‌తో తమ కస్టమర్ల ఆదాయాలు గణనీయంగా దెబ్బతిన్నాయని, ఈ ఆర్థిక సంవత్సరం మిగతా కాలం కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని ఎన్బీఎఫ్సీలు ఆర్బీఐకి తెలిపాయి. ప్రధానంగా రవాణా ఆపరేటర్లు, కాంట్రాక్టర్లు, లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) మొదలైన వాటిపై ఎక్కువగా ప్రతికూల ప్రభావం ఉందని ఎన్బీఎఫ్సీలు వివరించాయి. ‘ఈ నేపథ్యంలో మొండిపద్దుల కింద వర్గీకరించే పరిస్థితి రాకుండా.. 2021 మార్చి దాకా రుణాల రీపేమెంట్ షెడ్యూల్స్‌ను సవరించేందుకు లేదా వాయిదాలను పొడిగించేందుకు లేదా ఈఎంఐలను పునర్వ్యవస్థీకరించేందుకు వన్ టైమ్ రీస్ట్రక్చరింగ్‌కు అనుమతివ్వాలి‘ అని కోరినట్లు ఎఫ్ఐడీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఎంఎస్ఎంఈలకు ఇచ్చిన రుణాలను 2020 డిసెంబర్ దాకా వన్–టైమ్ పునర్వ్యవస్థీకరణ చేసేందుకు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్బీఐ అనుమతించింది. దీన్ని మిగతా రుణ గ్రహీతలందరికీ కూడా వర్తింపచేయాలని ఎన్బీఎఫ్సీలు కోరుతున్నాయి. ఇక మూడు నెలల పాటు ఈఎంఐలను వాయిదా వేసుకునేందుకు ఆర్బీఐ ప్రకటించిన మారటోరియంతో రుణగ్రహీతలకు కాస్త ఉపశమనం లభించిందని ఎఫ్ఐడీసీ తెలిపింది. అయితే, పరిస్థితులు ఇంకా చక్కబడనందున నాలుగో నెలలోనూ వారు వాయిదాలు చెల్లించగలిగే అవకాశాలు ఉండకపోవచ్చని పేర్కొంది. నిధుల లభ్యత పెంచాలి .. తమ రుణ వితరణ కార్యకలాపాలు యథాప్రకారం సాగేలా తోడ్పడేందుకు రీఫైనాన్స్ మార్గం ద్వారా చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బి).. నాబార్డ్ నుంచి మరిన్ని నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని ఎన్బీఎఫ్సీలు కోరాయి. టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ (టీఎల్టీఆర్వో 2.0)కి సగం స్థాయిలోనే బిడ్లు రావడమనేది .. బ్యాంకులు రిస్కు తీసుకోవడానికి ఇష్టపడకపోవడాన్ని సూచిస్తోందని ఎఫ్ఐడీసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో మిగతా మొత్తాన్ని సిడ్బి, నాబార్డ్లకు కేటాయించి తద్వారా తమకు నిధుల లభ్యత మెరుగుపడేలా చూడాలని కోరింది. ఇక, గడువు తీరి 1 రోజు దాటిన రుణ పద్దులన్నింటికీ 10 శాతం దాకా ప్రొవిజనింగ్ చేయాలన్న ఆదేశాలను కాస్త సడలించాలని కోరింది. తమ దగ్గర రుణాలు తీసుకునే ట్రక్కు ఆపరేటర్లు లాంటి వివిధ వర్గాలవారు పలు కారణాలతో ఈఎంఐలను కాస్త ఆలస్యంగా చెల్లించడం సాధారణమేనని పేర్కొంది. కొంత ఆలస్యమైనా 30 రోజుల్లోపే చెల్లించేస్తుంటారు కాబట్టి, ఈ పద్దులను క్రెడిట్ రిస్కు కింద పరిగణించడానికి లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రొవిజనింగ్ నిబంధనను 30 రోజులు దాటిపోయిన రుణాలకు మాత్రమే వర్తింపచేసేలా అనుమతినివ్వాలని ఎన్బీఎఫ్సీలు విజ్ఞప్తి చేశాయి. పీఎస్బీలకు మొండిపద్దుల భారం ► ఈసారి 2–4% పెరుగుతాయి ► బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మొండిబాకీల భారం 2–4 శాతం మేర పెరిగే అవకాశం ఉందని బ్రోకరేజి దిగ్గజం బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీవోఎఫ్‌ఏ) హెచ్చరించింది. దీనితో బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్ కింద ప్రభుత్వం 7–15 బిలియన్ డాలర్ల దాకా అదనపు మూలధనం సమకూర్చాల్సి రావొచ్చని పేర్కొంది. ఉద్దీపన ప్యాకేజీలు, పన్ను వసూళ్లు పడిపోవడం, డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలు నెరవేరే అవకాశాలు లేకపోవడం తదితర అంశాల కారణంగా ద్రవ్య లోటు 2 శాతం మేర పెరగవచ్చని బీవోఎఫ్‌ఏ తెలిపింది. బ్యాంకులకు అదనపు మూలధనం అందించడానికి అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవడానికి ప్రభుత్వం వివిధ మార్గాలు అన్వేషించాల్సి రావచ్చని వివరించింది.రీక్యాపిటలైజేషన్ బాండ్లను జారీ చేయడం లేదా ఆర్బీఐ దగ్గరున్న నిల్వల నుంచి కొంత భాగాన్ని వినియోగించడం వంటి అంశాలు పరిశీలించవచ్చని తెలిపింది. కరోనా వైరస్ కట్టడికి సంబంధించిన పరిణామాలతో బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు భారీగా పెరగవచ్చంటూ విశ్లేషకులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో బీవోఎఫ్‌ఏ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. -
చేతులెత్తి నమస్కరిస్తున్నా.. అర్థం చేసుకోండి
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అదుపు చేయాలంటే మూడు వారాల పాటు ఎక్కడి వారక్కడే ఉండి పోవాలని, ప్రస్తుత పరిస్థితుల్లో అంతకంటే మరో మార్గం లేదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విపత్కర పరిస్థితుల్లో కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని, లేదంటే అనర్థం జరుగుతుందన్నారు. మనందరం ఇళ్లకే పరిమితం కాకపోతే ఈ వైరస్‌ను అదుపు చేయలేమని అన్నారు. దేశంలో కరోనా వైరస్ ప్రబలకుండా ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో గురువారం సాయంత్రం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరూ ప్రభుత్వం విధించిన ఆంక్షలకు అనుగుణంగా స్వీయ నియంత్రణ పాటించి సహకరించాలని కోరారు. పరిస్థితులను అర్థం చేసుకోవాలని చేతులు జోడించి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేశారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏం చెప్పారంటే.. మన వాళ్లను చిరునవ్వుతో ఆహ్వానించే పరిస్థితి లేదు ►వందేళ్లకు ఒకసారి వచ్చే ఇలాంటి వ్యాధులను మన జీవిత కాలంలో ఇప్పుడు చూడాల్సి వస్తోంది. దీనిని మనం క్రమశిక్షణతోనే నివారించగలం. నిర్లక్ష్యం చేస్తే కొన్ని దేశాల్లో ఏం జరిగిందో చూశాం. అందుకే కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకోకపోతే అనర్థం జరుగుతుందనే భయం ఉంది. కాబట్టి అందరూ సహకరించాలి. ►నిన్న (బుధవారం) రాత్రి జరిగిన కొన్ని ఘటనలు మనసును కలిచి వేశాయి. మన వాళ్లను కూడా మనం చిరునవ్వుతో ఆహ్వానించే పరిస్థితి లేక పోవడం బాధ కలిగించింది. కానీ అందరం ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ మనందరం ఇళ్లకు పరిమితం కాకపోతే వ్యాధిని అదుపు చేయలేం. ఇవాళ కూడా పొందుగుల, దాచేపల్లి, సాగర్ సరిహద్దుల్లో మన వాళ్లను మనం రానీయలేని పరిస్థితి ఉంది. ►ఒకసారి ప్రదేశం మారుతున్న వారు ఎందరితోనో కాంటాక్ట్‌లో ఉండి ఉంటారు. వారు ఇంకా ఎంత మందితో కాంటాక్ట్‌లోకి వెళ్తారో తెలియదు. అది కనుక్కోవడం చాలా కష్టం. ఏప్రిల్ 14 వరకు ఇళ్లల్లోనే ఉండక తప్పదు ►ఏప్రిల్ 14 వరకు మనం ఎక్కడికీ వెళ్లకుండా ఇళ్లలోనే ఉంటే, కాంటాక్ట్ ట్రేసింగ్ తేలిగ్గా తెలిసి పోతుంది. వ్యాధి సోకిన వారిని గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించవచ్చు. ఈ మూడు వారాల పాటు అందరూ ఎక్కడి వారు అక్కడే ఆగిపోవాలి. మన వాళ్లను మనమే ఆపాల్సి రావడం బాధ కలిగిస్తోంది. ►నిన్న (బుధవారం) మార్కాపురం, అద్దంకి వద్ద 44 మందిని, కందుకూరు వద్ద 152 మందిని అనుమతించాం. మానవతా దృక్పథంతో అనుమతించినా, వారు వేరే రాష్ట్రం నుంచి వచ్చారు కనుక వారందరినీ 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచక తప్పదు. ►విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు మొత్తం 27,819 మంది ఉండగా, వారందరిపై నిఘా వేసి ట్రాకింగ్‌లో పెట్టాం. వారు ఎందరితో కాంటాక్ట్‌లో ఉన్నారో పరిశీలిస్తున్నాం. ఇదే సమయంలో మనందరం స్వయం క్రమశిక్షణ, సామాజిక దూరం పాటించకపోతే ఇబ్బంది పడతాం. నాలుగు క్రిటికల్ కేర్ ఆసుపత్రులు ► విశాఖ, నెల్లూరు, విజయవాడ, తిరుపతి.. నాలుగు చోట్ల క్రిటికల్ కేర్ ఆస్పత్రులు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 470 ఐసీయూ పడకలతో వెంటిలేటర్లు, అదనపు పడకలు అందుబాటులో ఉన్నాయి. ►ప్రతి జిల్లాలో 200 పడకలతో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రతి నియోజకవర్గంలో 100 పడకలతో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రైవేటు సెక్టార్లో కూడా 213 ఐసీయూ పడకలతో వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి. ►పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడానికి సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణబాబుతో పాటు, మరో 10 మంది ఉన్నతాధికారులను ఏర్పాటు చేశాం. ఇంకా ఆరోగ్యపరమైన సమస్యలకు 104 నంబర్ కూడా అందుబాటులో ఉంది. కంట్రోల్ రూమ్‌లు అండగా ఉన్నాయి.. ►రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. ఇందులో పది మంది సీనియర్ అధికారులతో పాటు ముగ్గురు మంత్రులు, సీఎం ఆఫీసు నుంచి మరో ముగ్గురు అధికారులు ఉంటారు. ప్రతి జిల్లాలోనూ కంట్రోల్ రూమ్‌లు ఉంటాయి. జిల్లా మంత్రులు జిల్లా కంట్రోల్ రూమ్‌లలో భాగస్వాములవుతారు. అక్కడ కూడా వివిధ శాఖలకు చెందిన 10 మంది అధికారులు ఉంటారు. ఎవరికి అసౌకర్యం కలగకుండా చూస్తారు. ►ఎవరికీ ఆహారం, వసతి ఇతర సౌకర్యాల లోటు లేకుండా చూడాలని కలెక్టర్లకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఏ ఇబ్బంది ఉన్నా 1902 కు ఫోన్ చేయండి. వెంటనే కలెక్టర్ స్పందించి మీ సమస్యలు పరిష్కరిస్తారు. ►సరుకుల రవాణా వాహనాలకు అనుమతి ఇచ్చాం. నిత్యావసరాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదు. ►రైతు బజార్లను విస్తరిస్తున్నాం. ప్రజల సంఖ్య, వారి అవసరాలు గుర్తించి కేవలం 2 నుంచి 3 కి.మీ పరిధిలో రైతు బజార్లతో పాటు, నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్నీ తెరిచి ఉంటాయి. కాబట్టి అవసరమైనవి తీసుకుని, ఆ తర్వాత ఇళ్లలోనే ఉండండి. రైతులు సామాజిక దూరం పాటించాలి ►పంటలు కోతకు వస్తున్నాయి కాబట్టి తప్పదు కనుక రైతులు, రైతు కూలీలు పనులకు వెళ్లండి. కానీ అక్కడ తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలి. ►గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని పంచాయతీ రాజ్, పురపాలక శాఖలకు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశాం. -
‘నా కొడుకు ఉద్యోగం మానేస్తాడు.. వదిలిపెట్టండి’
శ్రీనగర్ : ‘మా కుమారుడు ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. తనను వదిలిపెట్టండి. తనే మా కుటుంబానికి ఆధారం. ఇద్దరు ముసలి వాల్లం, ఇద్దరు చిన్నారులు తన మీదే ఆధారపడ్డారు. దయచేసి తనను వదిలి పెట్టండి. ఈ ఉద్యోగం మానేస్తాడు’ అంటూ 70 ఏళ్ల సైదా బేగం కన్నీరు మున్నిరుగా విలపించిన ఆ పాశాన హృదయాలు కరగలేదు. అతి కిరాతకంగా నిసార్ అహ్మద్(44)ని హత్య చేశారు. ఈ హృదయవిదారకరమైన ఘటన కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో చోటుచేసుకుంది. ఉగ్రవాదులు ముగ్గురు స్పెషల్ పోలీసు అధికారులను(ఎస్పీవో) శుక్రవారం వారి ఇళ్ల నుంచి అపహరించి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అలా ఉగ్రవాదుల చేతిలో హతమైన వారిలో నిసార్ అహ్మద్ ఒకరు. పోలీసులను కిడ్నాప్ చేసిన అనంతరం హిజ్బుల్ ముజాహిదీన్ గ్రూప్ నాయకుడు ఓ వీడియోను విడుదల చేసినట్లు సమాచారం. ఈ వీడియోలో అతడు సదరు పోలీసులను తమ ఉద్యోగాలకు రాజీనామా చేయలని.. లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుంది అని తెలిపారు. దాంతో నిసార్ తల్లి, సైదా తమ కుమారుడు తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడని.. అతన్ని విడుదల చేయాల్సిందిగా కోరింది. తన కుటుంబానికి అతనోక్కడే ఆధారం అని తెలిపింది. సైదా అభ్యర్ధనను అంగీకరించిన ఉగ్రవాదుల అతన్ని విడుదల చేస్తామని తెలిపారు. కానీ మాట తప్పి నిసార్‌ని హత్య చేసి అతని కుటుంబానికి తీవ్రం అన్యాయం చేశారు. ఈ ముసలి వయసులో మాకు దిక్కెవరంటూ ఏడుస్తున్న సైదాని సముదాయించడం ఎవరి తరం కాలేదు. -
రిలీఫ్ మెటీరియల్‌కి స్థలం లేదు: డబ్బులు ప్లీజ్
సాక్షి, బెంగళూరు: భారీ వర్షాలతో భీతిల్లిన కర్నాటక వాసులను ఆదుకునేందుకు భారీ స్పందన లభిస్తోంది. కర్నాటక ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ పేరుతో కొడగు జిల్లాకు నిత్యావసరాలు, ఇతర ఆహార పదార్థలు ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి తమ వద్ద ఉన్న ఆహార పదార్థాల నిల్వలు చాలని, ఇక పంపవద్దని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే తగినంత ఆహార, వస్తు సామగ్రి ఉన్నందువల్ల రిలీఫ్ ఫుడ్ మెటీరియల్ పంపించడాన్ని నిలిపివేయాలని కొడగు జిల్లా ఇన్ చార్జి మంత్రి ఎస్ఆర్ మహేష్ ప్రజలకు, దాతలకు విజ్ఞప్తి చేశారు. ఇంతకుమించి సేకరించినా నిల్వ చేయడానికి స్థలం లేదని ఆయన చెప్పారు. దీనికి బదులుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బును బదిలీ చేయాలని కోరారు. కాగా ఒకపక్క భారీ వర్షాలు, వరదలు కేరళను వణికించగా, మరోవైపు పొరుగు రాష్ట్రం కర్నాటకను కూడా భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా కొడగు జిల్లా భారీగా ప్రభావితమైంది. భారీ వర్షాల కారణంగా జిల్లాలో 8మంది మరణించగా, 4వేలమందికి పైగా నిర్వాసితులయ్యారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ ప్రాంతాల్లో వందలాదిమంది చిక్కుండిపోయారు. వర్షాల కారణంగా 123 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. 800కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ముఖ్యమంత్రి కుమారస్వామి బాధిత ప్రాంతాల్లో పర్యటించి, సహాయ పునరావాస శిబిరాలను సందర్శించి, పరిస్థితిని సమీక్షించి సంగతి తెలిసిందే.