న్యూఢిల్లీ: కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్టను మంటగలపడానికి ప్రయత్నిస్తున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఆరోపించారు. మీడియా సంస్థలు ఏ ఎజెండాను కొనసాగించినా, తమ పార్టీ నేతల కుటుంబాల జోలికి మాత్రం రావద్దని కోరారు. తమ పార్టీ నేత కుమార్‌విశ్వాస్ కుటుంబాన్నంతటినీ మీడియా స్కానర్ కిందకు తెచ్చిన తీరు ఘోరమన్నారు. విశ్వాస్‌పై వచ్చిన ఆరోపణలు ఆయన కుటుంబాన్ని తీవ్ర అసహనానికి గురిచేశాయని ఆయన చెప్పారు. ఆ కారణంగా ఆయన కుమార్తె మంగళవారం పాఠశాల మానేసిందన్నారు.
‘ఇదేనా రాజకీయం, ఇదేనా జర్నలిజం. ఏ ఆధారాలు లేకుండా ఓ వ్యక్తి జీవితా న్ని మీడియా నాశనం చేస్తోంది.’ అని కేజ్రీవాల్ తెలిపారు. కుమార్ విశ్వాస్‌తో తనకు వివాహేతర సంబంధాలు ఉన్నట్లు వస్తున్న వదంతులను విశ్వాస్ ఖండించటం లేదని, ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతి ఢిల్లీ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సంజాయిషీ ఇవ్వాలని డీసీ డబ్ల్యు ఇచ్చిన నోటీసుకు విశ్వాస్ స్పందించలేదు.
మా కుటుంబాల జోలికి రాకండి
Published Wed, May 6 2015 2:21 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM
Advertisement
Advertisement