మూడు గదుల ఇంటిలోఉండటం నేరమా?: కేజ్రివాల్
ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ మీడియాపై నిప్పులు చెరిగారు. తనపై మీడియా పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోంది అని కేజ్రివాల్ ఆరోపించారు. తనకు మూడు గదుల ఇంటిని కేటాయించడంపై గోరంతలు కొండతలు చేసిందని ఆయన అన్నారు. అయితే రైతుల భూములను పారిశ్రామికవేత్తలకు ఇవ్వడంపై మీడియా ఒక్కరోజు కూడా ప్రసారం చేయలేదని ఆయన అన్నారు.
కాని తనకు కేటాయించిన మూడు గదులు వ్యవహారాన్ని పనిగట్టుకుని రోజంతా కథనాలతో హోరెత్తించారని కేజ్రివాల్ విమర్శించారు. మూడు గదులు ఇంటిని తీసుకుంటే అదేమన్నా నేరమా అని ప్రశ్నించారు. నేనేమి బంగ్లాను తీసుకోలేదుగా అని కేజ్రివాల్ వ్యాఖ్యానించారు. మోడీ చెబుతున్న అభివృద్ధిని పరిశీలించేందుకు కేజ్రివాల్ గుజరాత్ లో పర్యటించిన సంగతి తెలిసిందే.