న్యూఢిల్లీ: తమ పార్టీ ప్రతిష్టను మంటగలిపేందుకు కాంగ్రెస్, బీజేపీలు కొన్ని మీడియా సంస్థలకు రూ.1,400 కోట్లు పంచిపెట్టాయని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తీవ్ర ఆరోపణ చేసింది. తమకు వస్తున్న ప్రజాదరణను జీర్ణించుకోలేకపోతున్న ఆ పార్టీల తరఫున మీడియా సర్కార్ వెబ్‌సైట్ తమ అభ్యర్థులపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి అసలు సీడీని ట్యాంపర్ చేసిందని మండిపడింది. ‘కొన్ని మీడియా సంస్థలకు రూ.1,400 కోట్లు పంపిణీ చేశారని నాకు చెప్పారు. ఆ మీడియా సంస్థలు ఏవి?’ అని పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు.