కలెక్టర్‌కు వీఆర్వోల సంఘం నాయకుల వినతి
Published Sat, Jul 23 2016 9:46 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
నగరంపాలెం (గుంటూరు) : 2012 ఏపీపీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా గ్రామ రెవెన్యూ అధికారుల నియామకం పొంది నాలుగేళ్లు సర్వీస్ పూర్తి చేసిన వారికి సర్వీస్ రెగ్యులైజేషన్ కానీ, ప్రొబేషన్ పీరియడ్ డిక్లరేషన్ గానీ చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా నాయకులు శనివారం కలెక్టర్ కాంతిలాల్ దండేను కోరారు. కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ దండేను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ప్రకాశం, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే సర్వీస్ రెగ్యులరైజషన్ జరిగిందన్నారు. ఆరేళ్లు పూర్తి చేసుకున్న వీఆర్వోలకు స్పెషల్ ఇంక్రిమెంట్ కోసం ఆరు నెలలుగా కలెక్టరేట్‌లో పెండింగ్ ఉన్నాయని తెలిపారు. వివిధ కారణాలతో సస్పెండైన వీఆర్వోలు ఏడాది కాలంగా ఇబ్బంది పడుతున్నారని, వారికి మానవతా దృక్పథంతో పోస్టింగ్‌లు ఇవ్వాలని కోరారు. జిల్లాలో పని చేస్తున్న 13 మంది పార్టు టైం వీఆర్వోలకు 11 నెలలుగా జీతాలు రావటం లేదని, ఇటీవల ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదిలీ అయిన వీఆర్వోలను కొంతమంది తహశీల్దార్లు రిలీవ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని వారు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సూరేపల్లి రాజశేఖర్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ప్రసన్నకుమార్, జిల్లా కార్యదర్శి పెరుగు శ్రీనివాసరావు, ట్రెజరర్ జి.బ్రహ్మేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎస్. వంశీ కృష్ణమోహన్ తదితరులు ఉన్నారు.
Advertisement