సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ చేసిన విజ్ఞప్తిని మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి.. ఒకే రోజు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహణకు మొగ్గు చూపింది.
ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో ఒకేసారి లోక్‌సభ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్‌సీపీ పలుమార్లు కోరిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ మేరకు ఢిల్లీ వెళ్లి ప్రతిపక్షాలపై ఫిర్యాదు చేసిన టైంలోనే కాకుండా.. ఈసీ సమీక్షకు వచ్చినప్పుడు కూడా వినతి పత్రాలను ఈసీకి సమర్పించింది.
ఒకే రోజు ఎన్నికలు నిర్వహించడం ద్వారా.. దొంగ ఓట్లను అరికట్టవచ్చని వైఎస్సార్‌సీపీ మొదటి నుంచి చెబుతోంది. తెలంగాణలో ఓటర్లుగా నమోదైన వారంతా ఏపీలో కూడా ఓటు నమోదు చేసుకున్నారని.. రెండు చోట్ల ఓటు వేయకుండా నిరోధించడానికే తాము ఒకేసారి ఎన్నికల నిర్వహణ కోరుతున్నామని వైఎస్సార్‌సీపీ ఆ వినతుల్లో పేర్కొంది.
దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా.. నాలుగో దశలో ఏపీలో 25, తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు జూన్ 4వ తేదీన ఇరు రాష్ట్రాల లోక్‌సభ ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ఇదీ చదవండి: 175 మందితో వైఎస్సార్‌సీపీ సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment