ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్లు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను హెచ్చరించింది. ప్రచార సమయంలో కులం, భాష, మతపరమైన అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం మానుకోవాలని ఇరు పార్టీలకు ఈసీ ఆదేశించింది. ఈ మేరకు ఈసీ ఒక ప్రకటన విడుదల చేసింది.
ప్రధాని మోదీ, రాహుల్ గాంధీతో సహా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్టార్ క్యాంపెయినర్లకు ఒక నోట్ జారీ చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మళ్లికార్జున్ ఖర్గే, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలను ఈసీ ఆదేశించింది. వారి ప్రసంగాలను సరి చేసుకొవటంతోపాటు, తగిన శ్రద్ధ వహించాలని తెలియజేయాలన్నారు. వారసత్వంగా వస్తున్న నాణ్యమైన ఎన్నికల ప్రక్రియను దిగజార్చడాన్ని ఊరుకోబోమని ఎన్నికల సంఘం తేల్చి చేప్పింది.
ఎన్నికల ప్రచారంలో బీజేపీ, ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు మతపరమైన వ్యాఖ్యలు చేయడాన్ని మానుకోవాలంది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు సైతం ఎటువంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా చూసుకోవాలని ఈసీ సూచించింది. అగ్ని వీర్ వంటి పథకాలపై ప్రసంగించే సమయంలో సాయుధ బలగాలకు రాజకీయం చేవద్దని తెలిది. అలా చేస్తే సాయుధ బలగాల సామాజిక, సాంస్కృతిక ప్రతిష్టను దెబ్బతీయటం అవుతుందని కాంగ్రెస్‌పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment