కాంగ్రెస్‌కు షాక్‌.. ఢిల్లీ పీసీసీ చీఫ్‌ రాజీనామా | Delhi Congress chief Arvinder Singh Lovely resigns over alliance with aap | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు షాక్‌.. ఢిల్లీ పీసీసీ చీఫ్‌ రాజీనామా

Published Sun, Apr 28 2024 11:37 AM | Last Updated on Sun, Apr 28 2024 12:18 PM

Delhi Congress chief Arvinder Singh Lovely resigns over alliance with aap

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ఢిల్లీలో షాక్ తగిలింది.  ఢిల్లీ పీసీసీ అధ్యక్ష పదవికి అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేశారు. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆప్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవడంపై అసంతృప్తితో కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. 

కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలకు భిన్నంగా పార్టీ అధిష్టానం ఆప్తో పెట్టుకోవడంపై నిరసనగా రాజీనామా చేశారు. అధిష్టానం తన అభిప్రాయాలను పట్టించుకోవడంలేదని కాంగ్రెస్‌కు రాసిన రాజీనామా లేఖ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement