Singh
-
దీక్ష విరమించను.. వైద్య చికిత్సకు ఓకే: రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లెవాల్
చండీగఢ్: పంజాబ్‌లోని ఖానౌరీ బోర్డర్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లెవాల్ ఆరోగ్యం క్షీణించింది. మరోవైపు కేంద్రం పంజాబ్ రైతుల డిమాండ్లపై చర్చించేందుకు ముందుకు వచ్చింది. ఈ నేపధ్యంలో జగ్జీత్ సింగ్ దల్లెవాల్ వైద్య సహాయం తీసుకునేందుకు అంగీకరించారు. అయితే తాను ఆమరణ నిరాహార దీక్ష విరమించబోనని ప్రకటించారు. ఈ విషయాన్ని రైతు నేత సుఖ్జీత్ సింగ్ హర్డోజండే మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ నవంబర్ 26 నుండి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన దల్లెవాల్ ఆరోగ్యం క్షీణించిన నేపధ్యంలో ఆయన వైద్య సహాయం తీసుకునేందుకు అంగీకరించారని తెలిపారు.రైతు నేత దల్లెవాల్ ఆమరణ నిరాహార దీక్ష(Hunger strike) 54వ రోజుకు చేరుకుందని, రైతులకు పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టపరమైన హామీ లభించేంత వరకు జగ్జీత్ సింగ్ నిరవధిక నిరాహార దీక్షను విరమించబోనని స్పష్టం చేశారన్నారు. ఉపవాస దీక్ష సమయంలో అతని ఆరోగ్యం క్షీణించిందని, దాదాపు 20 కిలోగ్రాముల బరువు తగ్గారని, ఈ నేపధ్యంలో వైద్య సహాయాన్ని తీసుకునేందుకు ముందుకు వచ్చారని జండే తెలియజేశారు.మరోవైపు జగ్జీత్ సింగ్ దల్లెవాల్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. అయితే తొలుత ఆయన వైద్య సహాయం తీసుకునేందుకు నిరాకరించారు. తాజాగా జాయింట్ సెక్రటరీ ప్రియా రంజన్(Joint Secretary Priya Ranjan) నేతృత్వంలోని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారుల ప్రతినిధి బృందం దల్లెవాల్‌ను కలుసుకుని, యునైటెడ్ కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఇదే సమయంలో ఖనౌరి సరిహద్దు వద్ద మరో 10 మంది రైతులు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. దీంతో మొత్తం నిరాహార దీక్ష చేస్తున్న రైతుల సంఖ్య 121కి చేరింది.ఫిబ్రవరి 14న చండీగఢ్(Chandigarh)లో పంజాబ్ రైతుల సమావేశమయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం పిలుపునివ్వడంతో దల్లెవాల్ వైద్య సహాయం తీసుకునేందుకు అంగీకరించారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంపై చట్టపరమైన హామీని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులతో కేంద్రం తిరిగి చర్చలు జరపనుంది. దీంతో ఈ పంజాబ్ రైతుల సమస్యలపై ప్రతిష్టంభన తొలగిపోనున్నదని రైతులు భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: Jammu and Kashmir: వణికిస్తున్న అంతుచిక్కని వ్యాధి.. 15 మంది మృతి -
నా హత్యకు కుట్ర: పన్నూ
న్యూఢిల్లీ: తనను హత్య చేయడానికి భారత ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపిస్తూ ఖలిస్తాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల అమెరికా కోర్టును ఆశ్రయించాడు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు ఫర్ సదరన్ డి్రస్టిక్ట్ ఆఫ్ న్యూయార్క్‌లో దావా వేశాడు. దీనిపై న్యాయస్థానం స్పందించింది. భారత ప్రభుత్వంతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, భారత నిఘా సంస్థ ‘రా’ మాజీ అధినేత సమంత్ గోయల్, ఉద్యోగి విక్రమ్ యాదవ్, భారత వ్యాపారవేత్త నిఖిల్‌గుప్తాకు తాజాగా సమన్లు జారీ చేసింది.సమన్లు అందుకున్న వ్యక్తులు 21 రోజుల్లోగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21 నుంచి 23వ తేదీ దాకా అమెరికాలో పర్యటించనున్నారు. ఇంతలోనే అమెరికా కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. గురు పత్వంత్‌సింగ్ పన్నూకు కెనడాతోపాటు అమెరికా పౌరసత్వం ఉంది. ఉగ్రవాది వేసిన దావాపై సమన్లా? గురు పత్వంత్ సింగ్ పన్నూ వేసిన దావాపై తమకు అమెరికా కోర్టు సమన్లు జారీ చేయడం పట్ల భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాది అయిన పన్నూ వేసిన దావాపై భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేయడం పూర్తిగా అసమంజసమని పేర్కొన్నారు. ప్రభుత్వంపై పన్నూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. పన్నూ ప్రాతినిధ్యం వహిస్తున్న ఖలిస్తాన్ సంస్థపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం–1967 కింద నిషేధం అమల్లో ఉందని గుర్తుచేశారు. దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో ఆ సంస్థకు ప్రమేయం ఉందని విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు. -
హైజంప్‌లో పూజా సింగ్ జాతీయ రికార్డు
అంతకుముందు భారత యువ అథ్లెట్ పూజా సింగ్ హైజంప్‌లో జాతీయ రికార్డు తిరగరాసింది. 17 ఏళ్ల పూజ 1.83 మీటర్ల ఎత్తు దూకి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో పూజ తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును (1.82 మీటర్లు) బద్దలు కొట్టింది. హరియాణాకు చెందిన తాపీ మేస్త్రీ కూతురైన పూజ క్వాలిఫయింగ్ రౌండ్లో తొమ్మిదో స్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించింది. సరైన సౌకర్యాలు లేకుండానే అండర్–14 స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి స్వర్ణం నెగ్గిన పూజ... ఆ తర్వాత 2022 జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో అండర్–16, అండర్–18 పోటీల్లో పసిడి పతకాలు కైవసం చేసుకుంది. -
ఆ పాత్ర చేయడం కోసం వారిని గమనించా: బడ్డీ హీరోయిన్
అల్లు శిరీష్ హీరోగా నటించిన తాజా చిత్రం బడ్డీ. శామ్ ఆంటోన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రంతో ప్రిషా సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది చిత్రబృందం. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రిషా సింగ్ బడ్డీ సినిమాలో అవకాశం రావడంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.ప్రిషా సింగ్ మాట్లాడుతూ .. 'నా ఫొటోలను చూసి ఆడిషన్‌కు పిలిచారు. సెలక్ట్ అయ్యా. అయితే పాత్రలోని వేరియేషన్స్ నేను చేయగలనా అని కూడా ఆలోచించా. బడ్డీ చిత్రంలో నేను ఎయిర్ హోస్టెస్ పాత్రలో కనిపిస్తా. ఆ పాత్ర కోసం చాలా మంది ఎయిర్ హోస్టెస్లను గమనించా. వారెలా నడుస్తారు.. ఎలా మాట్లాడుతారు.. ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు? వంటి విషయాలను దగ్గరగా గమనించా. టాలీవుడ్ నటించటం నటిగా నాకొక మంచి అనుభవం. ఇంకా వైవిధ్యమైన పాత్రలు చేయటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని అన్నారు.అంతే కాకుండా తనకు వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అంటే అభిరుచి ఎక్కువని చెబుతోంది. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో వాటికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. వైల్డ్ లైఫ్ అంటే కేవలం జంతువులను, చెట్ల ఫొటోలను కెమెరాల్లో బంధించటం మాత్రమే కాదని అంటోంది. వాటి సహజమైన భావోద్వేగాలను కమెరాల్లో బంధించటమేనని వెల్లడించింది. మన కెమెరాల్లో బంధించే ప్రతి విషయానికి బలమైన కథ ఉంటుందని.. నటన పరంగానూ ఇది నన్ను మెరుగుపరుచుకునేలా చేసిందని తెలిపింది. అందుకే కెమెరా ముందు ధైర్యంగా నటిస్తున్నా అని ప్రిషా సింగ్ చెప్పుకొచ్చింది. కాగా.. బడ్డీ చిత్రం ఆగస్టు 2న థియేటర్లలో సందడి చేయనుంది. -
నీట్ పేపర్ లీక్: మరో అరెస్ట్.. కీలక విషయాలు వెల్లడి?
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థుల్లో ఆగ్రహ జ్వాలలు కొనసాగుతున్నాయి. ఉన్నత విద్యాశాఖ ఫిర్యాదుతో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. ఈ దర్యాప్తు సంస్థ అధికారులు ఇప్పటికే జార్ఖండ్‌లో డాక్టర్ ఎహ్సాన్ ఉల్ హక్, ఇంతియాజ్ ఆలంలను అరెస్టు చేశారు. తాజాగా సీబీఐ ఈ కేసులో మరో నిందితుడు అమన్‌సింగ్‌ను జార్ఖండ్‌లోని ధన్బాద్లో అరెస్టు చేసింది.నీట్ పేపర్ లీక్ మాస్టర్ మైండ్ సంజీవ్ ముఖియాకు సన్నిహితులైన చింటూ, ముఖేష్‌ల నుండి అందిన సమాచారం ఆధారంగా సీబీఐ అమన్ సింగ్‌ను అరెస్టు చేసింది. నిందితుడు అమన్ సింగ్.. సంజీవ్ ముఖియా మేనల్లుడు రాకీకి సన్నిహితుడు. రాకీ బీహార్‌లోని రాంచీలో హోటల్ వ్యాపారం నిర్వహిస్తుంటాడు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం.. నీట్ పరీక్షలో పేపర్ లీక్ అయిన తర్వాత సమాధానాలను సిద్ధం చేయడానికి రాకీ సాల్వర్లను ఏర్పాటు చేశాడు. కాగా అమన్ సింగ్ అరెస్టు దరిమిలా నీట్ పేపర్ లీక్‌తో సంబంధమున్న సాల్వర్లు, ఇతర నిందితులను గుర్తించవచ్చని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు అమన్‌ను పట్నాకు తరలించనున్నారు.ఇప్పటి వరకు సీబీఐ అదుపులోకి తీసుకున్న నిందితుల రిమాండ్ గడువు జూలై 4తో ముగియనుంది. దీంతో వీరిని విచారించేందుకు సీబీఐ అదనపు రిమాండ్‌ను కోరే అవకాశాలున్నాయి. మరోవైపు నీట్ పేపర్ లీక్ తర్వాత పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై జూలై ఎనిమిదిన సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. -
Pooja Singh: పూజా సింగ్ టు.. రింకీ దూబే.. బై శాన్వికా..!
కామన్ ఫీచర్స్.. ఎక్స్ట్రార్డినరీ స్కిల్స్‌తో ఆన్‌స్క్రీన్ గ్రామర్ని మార్చేసింది శాన్వికా! ఎవరీమె అనుకుంటున్న వాళ్లు.. అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘పంచాయత్’ చూస్తే ఆమె ఎవరో తెలుస్తుంది.. శాన్వికా ప్రతిభ కనిపిస్తుంది. ఓటీటీ అందుబాటులో లేని వాళ్లు ఇక్కడిస్తున్న వివరాలతో ఆమెను పరిచయం చేసుకోవచ్చు.శాన్వికా అసలు పేరు పూజా సింగ్. పుట్టి, పెరిగింది మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకుంది.చిన్నప్పటి నుంచి నటన మీదే ఆసక్తి. కానీ ఇంట్లోవాళ్లకు ఆ రంగం మీద పెద్ద నమ్మకం లేదు. అందుకే యాక్టింగ్ కెరీర్‌ను వెదుక్కుంటానంటే కుటుంబం ఒప్పుకోదని.. బెంగళూరులో ఉద్యోగం దొరికిందని అబద్ధం చెప్పి ముంబై రైలెక్కేసింది శాన్వికా.అక్కడ హిందీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న తన స్నేహితురాలి సహాయంతో అసిస్టెంట్ క్యాస్ట్యూమ్ డిజైనర్ కొలువులో చేరింది. ఆ ఉద్యోగం చేస్తూ పలు టీవీ కమర్షియల్స్‌కి ఆడిషన్స్ ఇవ్వసాగింది. అలా డామినోస్ వంటి వాటికి మోడల్‌గా ఎంపికైంది.మోడలింగ్‌తో చిన్న చిన్న యాక్టింగ్ రోల్స్ కూడా రావడం మొదలయ్యాయి. ఆ సమయంలోనే నటన పట్ల ఆమెకున్న తపన, టాలెంట్ చూసిన కొందరు యూట్యూబ్ చానెల్ ‘టీవీఎఫ్’ సిరీస్ కోసం ఆడిషన్స్‌కి వెళ్లమని సలహా ఇచ్చారు. అనుసరించింది.టీవీఎఫ్ కోసం ఆడిషన్స్ ఇస్తున్న టైమ్‌లోనే ‘పంచాయత్’ సీజన్ 1కి సెలెక్ట్ అయింది. అప్పటికే హిందీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పూజా సింగ్ పేరుతోనే మరో నటి ఉండటంతో తన స్క్రీన్ నేమ్‌ని ‘శాన్వికా’గా మార్చుకుంది.‘పంచాయత్’లో రింకీ దూబేగా ఆమె వీక్షకులను తెగ ఆకట్టుకుంది. దాంతో తర్వాత రెండు సీజన్లలోనూ కొనసాగింది. తాజాగా మూడో సీజన్‌తో స్పెషల్ ఫ్యాన్ బేస్‌నే ఏర్పరచుకుంది.‘పంచాయత్’ చేస్తున్నప్పుడే ‘లఖన్ లీలా భార్గవా’, ‘హజామత్’ అనే వెబ్ సిరీస్‌లలోనూ అవకాశాలు వచ్చాయి. అవీ ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టాయి.శాన్వికాకు అభినయ కళలోనే కాదు స్కెచింగ్, పెయింటింగ్‌లోనూ నైపుణ్యం మెండే! ఏ కొంచెం ఖాళీ సమయం దొరికినా ఆర్ట్‌లో తన మార్క్ చూపిస్తుంటుంది."పంచాయత్ తర్వాత చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ మూస పాత్రలే ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే కాస్టింగ్ డైరెక్టర్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నాను.. ‘వెర్సటైల్ రోల్స్ చేయగలను.. దయచేసి అలాంటి క్యారెక్టర్స్‌కి నన్ను సెలెక్ట్ చేయండ’ని! మలయాళం, బెంగాలీ వంటి రీజనల్ లాంగ్వెజెస్‌లో నంటించడానికీ నేను సిద్ధమే!" – శాన్వికాఇవి చదవండి: కారు కనిపించని ఊరు.. ఎక్కడుందో తెలుసా!? -
ప్రమాదం బారిన చండీగఢ్ బీఎస్ఫీ అభ్యర్థి
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఎన్నికలకు సంబంధించిన విషయాలు ప్రధానాంశాలుగా నిలుస్తున్నాయి. తాజాగా చండీగఢ్ బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ రీతూ సింగ్ ప్రమాదానికి గురయ్యారు. ఆమె తలకు బలమైన గాయమైంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, తలకు కుట్లు వేశారు.వివరాల్లోకి వెళితే స్థానికంగా ఉన్న ఒక కాలనీలోని బీఎస్పీ నేతలు, కార్యకర్తలు డాక్టర్ రీతూ సింగ్‌ను నాణేలతో తూకం వేస్తున్నారు. ఇంతలో ఆ తూకం తెగిపోయి, దాని రాడ్డు ఆమె తలకు తగిలింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమయ్యింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు చికిత్స అందించి, తలకు కుట్లు వేసి ఇంటికి పంపించారు.చండీగఢ్ నుంచి డాక్టర్ రీతూ సింగ్‌ను బీఎస్పీ పోటీకి నిలిపింది. రీతూ.. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. సైకాలజీ సబ్జెక్టులో ఆమెకు విశేష అనుభవం ఉంది. యూనివర్శిటీలో చదువుకుంటున్న సమయంలో ఆమె దళితుల పక్షాన గొంతెత్తారు. ఈ నేపధ్యంలో ఆమెను డిస్మిస్ చేయడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకున్నాయి. డాక్టర్ రీతూ సింగ్ పీహెచ్డీ పకోడా వాలీ పేరుతో ఓ స్టాల్ కూడా పెట్టారు. కుల వేధింపుల ఆరోపణలతో 2023, సెప్టెంబర్‌లో ఆమె ఢిల్లీ యూనివర్సిటీలో నిరసన చేపట్టారు. ఈ సమయంలోనే ఆమె విశ్వవిద్యాలయం నుండి బహిష్కరణకు గుర్యయ్యారు. -
బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
Arvinder Lovely, Who Quit As Delhi Congress Chief Twice, Rejoins BJPలోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఇటీవల ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అరవిందర్ సింగ్ లవ్లీ తాజాగా బీజేపీలో చేరారు. శనివారం కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పూరీ, బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే, ఢిల్లీ పార్టీ చాఫ్ వీరేంద్ర సచ్‌దేవా ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో తీవ్ర అసహనానికి గురైన అరవిందర్ ఇటీవల ఢిల్లీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరుతున్నట్లు వచ్చిన పుకార్లను కొట్టిపారేశాడు. అయితే నిన్నటి మొన్నటి వరకు కూడా బీజేపీలో చేరడం లేదని తెలిపిన ఆయన..నేడు కాషాయ కండువా కంపుకోవడం ఆసక్తికరంగా మారింది.బీజేపీలో చేరిన తర్వాత లవ్లీ మాట్లాడుతూ.. బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో ఢిల్లీ ప్రజల తరుపున పోరాడే అవకాశం లభించిందని, దేశంలో అఖండ మెజారిటీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదని, రానున్న రోజుల్లో ఢిల్లీలోనూ బీజేపీ జెండా రెపరెపలాడుతుందని అన్నారు.అయితే 2015లోనే అరవిందర్ ఢిల్లీ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేశారు. 2017లో బీజేపీలో చేరిన ఆయన కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. ప్రస్తుతం మళ్లీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.#WATCH | Congress leader Arvinder Singh Lovely joins BJP at the party headquarters in Delhi in the presence of Union Minister Hardeep Singh Puri.Arvinder Singh Lovely resigned from the position of Delhi Congress president on April 28. pic.twitter.com/3OJXisQIEd— ANI (@ANI) May 4, 2024 -
కాంగ్రెస్‌కు షాక్.. ఢిల్లీ పీసీసీ చీఫ్ రాజీనామా
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ఢిల్లీలో షాక్ తగిలింది. ఢిల్లీ పీసీసీ అధ్యక్ష పదవికి అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేశారు. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంపై అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలకు భిన్నంగా పార్టీ అధిష్టానం ఆప్‌తో పెట్టుకోవడంపై నిరసనగా రాజీనామా చేశారు. అధిష్టానం తన అభిప్రాయాలను పట్టించుకోవడంలేదని కాంగ్రెస్‌కు రాసిన రాజీనామా లేఖ పేర్కొన్నారు. Arvinder Singh Lovely resigns from the position of Delhi Congress president."The Delhi Congress Unit was against an alliance with a Party which was formed on the sole basis of leveling false, fabricated and malafide corruption charges against the Congress Party. Despite that,… https://t.co/Y1A360fuut pic.twitter.com/hLP9RtnzUE— ANI (@ANI) April 28, 2024 -
లంగా ఓణీలో అదిరిపోయిన రాశి సింగ్ (ఫోటోలు)
-
సొంత నేతలతో కాంగ్రెస్‌కు తలనొప్పులు?
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని కష్టాలు వెంటాడుతున్నాయి. దీనికి ఆ పార్టీలోని సీనియర్ నేతలే కారణమంటూ పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలు పార్టీకి కత్తిమీద సాములా మారాయి. హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ హిమాచల్‌లోని మండి స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి ససేమీరా అంటున్నారు. ప్రతిభా సింగ్ 2019లో మండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక్కడ ఆమెకు అమితమైన ప్రజాదరణ ఉంది. కాగా మండి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సినీ నటి కంగనా రనౌత్ పోటీ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే లోకసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రతిభా సింగ్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభా సింగ్ తనయుడు విక్రమాదిత్య సింగ్ కూడా ఇదే వైఖరితో ఉన్నట్లు సమాచారం. దీనికితోడు వీరభద్ర సింగ్ గ్రూపులోని పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు వైఖరిని ప్రదర్శిస్తున్నారట. విక్రమాదిత్య సింగ్ వర్గం హిమాచల్ సీఎం కుర్చీపై కన్నేసింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మరింతగా పెరిగిపోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. -
హర్యానా నూతన సీఎంగా నాయబ్ సింగ్ సైనీ
హర్యానా నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ఎన్నుకుంది ఆ రాష్ట్ర బీజేఎల్పీ. మంగళవారం అక్కడి రాజకీయాల్లో ఒకదాని వెంట ఒకటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయగా.. ఆయన ప్రధాన అనుచరుడైన నాయబ్ ఇప్పుడు సీఎంగా ప్రమాణం చేయనున్నారు. అంతకు ముందు.. జేజేపీ- బీజేపీల మధ్య పొత్తు తెగిపోవడంతో.. ఖట్టర్ రాజీనామా, నూతన ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది. అయితే ఖట్టర్ మళ్లీ బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావించగా.. అనూహ్యంగా నాయబ్ సింగ్ సైనీ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆయన హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగానే కొనసాగుతున్నారు. అంతేకాదు కురుక్షేత్ర పార్లమెంటు సభ్యుడు(ఎంపీ) కూడా. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు సీఎంగా ఆయన ప్రమాణం చేయనున్నారు. ఓబీసీ కమ్యూనిటీకి చెందిన నాయబ్ సింగ్ సైనీ గత ఏడాది బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. సైనీకి సంఘ్ కార్యకాలాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. 1996లో ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత 2002లో అంబాలా బీజేపీ యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఎంపికయ్యారు. ఇదీ చదవండి: జేజేపీ అవుట్ చేసేందుకే బీజేపీ వ్యూహం! 2005లో ఆయన బీజేపీ అంబాలా యువమోర్చా జిల్లా అధ్యక్షుడయ్యారు. తరువాత బీజేపీ హర్యానా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2012లో అంబాలా జిల్లా అధ్యక్షునిగా నాయబ్ సింగ్ సైనీ నియమితులయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణగఢ్ నుంచి గెలిచి హర్యానా అసెంబ్లీకి చేరుకున్నారు. 2016లో ఖట్టర్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాయబ్ సింగ్ సైనీ కురుక్షేత్ర ఎంపీగా ఎన్నికయ్యారు. 2023లో హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. -
హిమాచల్ సీఎం రేసులో ప్రతిభా సింగ్? ఆమె నేపథ్యం ఏమిటి?
హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ గందరగోళం నెలకొంది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో సీఎంను మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖును తొలగించి, సీనియర్ నేత ప్రతిభా సింగ్‌ను ముఖ్యమంత్రిని చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత ప్రతిభా సింగ్ దివంగత నేత వీరభద్ర సింగ్ భార్య. వీరభద్ర సింగ్ ఆరుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రతిభా సింగ్ 1998 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. హిమాచల్‌లోని మండి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆమె తొలిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే నాడు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత 2004 లోక్‌సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2012లో ఆమె భర్త వీరభద్ర సింగ్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన లోక్‌సభకు రాజీనామా చేశారు. దీంతో 2013లో ఉప ఎన్నికలు జరిగాయి. ప్రతిభా సింగ్ ఎన్నికల బరిలో నిలిచి, బీజేపీ నేత జైరామ్ ఠాకూర్‌ను ఓడించారు. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో మోదీ వేవ్‌లో బీజేపీ నేత రామ్ స్వరూప్ శర్మ 39 వేలకు పైగా ఓట్ల తేడాతో ప్రతిభా సింగ్‌పై విజయం సాధించారు. అప్పట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రతిభా సింగ్ ఓటమితో నేతలంతా కంగుతిన్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత 2021లో ప్రతిభా సింగ్ ఎన్నికల బరిలో విజయం సాధించారు. 2022, ఏప్రిల్ 26న, హైకమాండ్ ప్రతిభా సింగ్‌ను హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ 32వ అధ్యక్షురాలిగా నియమించింది. ప్రతిభా సింగ్ హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో 1956 జూన్ 16న జన్మించారు. ప్రతిభా సింగ్ వీరభద్ర సింగ్‌ను 1985లో వివాహం చేసుకున్నారు. ప్రతిభ అతనికి రెండవ భార్య. వీరభద్ర సింగ్ మొదటి భార్య కుమార్తె అభిలాషా కుమారి గుజరాత్లో న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రతిభా సింగ్, వీరభద్ర సింగ్‌ల కుమారుడు విక్రమాదిత్య సింగ్ సిమ్లా రూరల్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా పనిచేశారు. -
ప్రతాప్ సింగ్‌కు పసిడి పతకం
న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌ను భారత్ స్వర్ణ పతకంతో ముగించింది. పోటీల చివరిరోజు బుధవారం భారత్ ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యం సాధించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ వ్యక్తిగత విభాగంలో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ పసిడి పతకం గెలిచాడు. ఫైనల్లో ప్రతాప్ సింగ్ 463.5 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఐశ్వరీ ప్రతాప్ సింగ్, అఖిల్ షెరాన్, స్వప్నిల్ కుసాలేలతో కూడిన భారత బృందం ఇదే విభాగంలో టీమ్ ఈవెంట్లో 1764 పాయింట్లతో రజత పతకం కైవసం చేసుకుంది. పురుషుల 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో ప్రదీప్ సింగ్ షెఖావత్ 582 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత బృందం 8 స్వర్ణాలు, 10 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 22 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. -
ఖలిస్తానీ భావజాలానికి ఆ సింగర్ మద్దతు? ఇప్పుడు పశ్చాత్తాపంతో ఏమంటున్నారు??
భారత్- కెనడా సంబంధాలు బీటలువారుతున్న వేళ.. కెనడియన్ పంజాబీ గాయకుడు శుభనీత్ సింగ్ అలియాస్ శుభ్ పేరు ముఖ్యాంశాలలో కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం శుభ్ సోషల్ మీడియాలో వివాదాస్పద భారతదేశ మ్యాప్ షేర్ చేశారు. అది మొదలు అతనికి భారత్‌లో వ్యతిరేకత మొదలయ్యింది. ఖలిస్తానీ భావజాలానికి మద్దతు ఇస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హర్జీత్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై ఆరోపణలు చేయడంతో ముంబైలో జరగాల్సిన శుభ్ సంగీత కచేరీ రద్దయ్యింది. శుభ్‌నీత్ అలియాస్ శుభ్‌ను ఫాలో చేసే వారిలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు. అయితే శుభ్.. ఖలిస్తాన్ భావజాలానికి మద్దతు ఇస్తున్నాడనే ఆరోపణలు వస్తుండటంతో తాజాగా విరాట్.. శుభ్‌ను అన్‌ఫాలో చేశాడు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్‌లో శుభ్.. భారతదేశ మ్యాప్ నుండి పంజాబ్, జమ్మూ, కాశ్మీర్లను విడిగా చూపించాడు. ఇది తీవ్ర వివాదాస్పదం కావడంతో శుభ్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. అతను ఒక పోస్ట్‌లో.. ‘భారతదేశంలోని పంజాబ్‌కు చెందిన యువగాయకునిగా, నేను ఆలపించే సంగీతాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించాలనేది నా కల. అయితే ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు నన్ను ఇబ్బందుల్లోకి నెట్టివేశాయి. అందుకే నా నిరుత్సాహాన్ని, బాధను వ్యక్తపరచడానికి కొన్ని మాటలు చెప్పాలనుకున్నాను. భారత పర్యటన రద్దుతో నేను తీవ్ర నిరాశకు గురయ్యాను. భారతదేశం నా దేశం. నేను ఇక్కడే పుట్టాను. ఇది నా గురువుల, పూర్వీకుల భూమి. పంజాబ్ నా ఆత్మ, పంజాబ్ నా రక్తంలో ఉంది. నేను పంజాబీ కావడం వల్లనే ఈ స్థాయిలో ఉన్నాను. పంజాబీలు తమ దేశభక్తికి రుజువులు చూపాల్సిన అవసరం లేదు’ అంటూ తనలోని ఆవేదనను ఈ పోస్ట్ ద్వారా తగ్గించుకునే ప్రయత్నం చేశాడు శుభ్. ఇది కూడా చదవండి: గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎవరు? భారత్- కెనడాల మధ్య ఎలా చిచ్చుపెడుతున్నాడు? -
గురుపత్వంత్ సింగ్ ఎవరు? భారత్- కెనడాల మధ్య ఎలా చిచ్చుపెడుతున్నాడు?
భారతదేశం-కెనడాల మధ్య సంబంధాలు అంతకంతకూ దిగజారుతున్నాయి. కెనడా ప్రభుత్వం తమ దేశంలో ఖలిస్థాన్ అనుకూల కార్యకలాపాలను అరికట్టకపోవడమే ఇందుకు కారణం. ఢిల్లీలో ఇటీవల జరిగిన జీ-20 సదస్సులో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై పీఎం నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించలేదు. ఈ కఠినమైన ప్రవర్తనకు స్పందనగా ట్రూడో తమ దేశంలోని సిక్కు ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) గ్రూప్‌తో సంబంధం ఉన్న హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించింది. అలాగే ఒక అగ్రశ్రేణి భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది. ఈ నేపధ్యంలో భారత ప్రభుత్వం ఒక సీనియర్ కెనడియన్ దౌత్యవేత్తను దేశం విడిచి వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కెనడావి నిరాధార ఆరోపణలు కెనడా ఆరోపణలను అసంబద్ధమని, రాజకీయ ప్రేరేపిత ఆరోపణలుగా భారత్ అభివర్ణించింది. కెనడాలో రక్షణ పొందుతున్న ఖలిస్తానీ ఉగ్రవాదులు, తీవ్రవాదుల నుంచి దృష్టి మరల్చేందుకే కెనడా ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నదని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) పేర్కొంది. భారతదేశ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే ఖలిస్తాన్ మద్దతుదారులపై అక్కడి ప్రభుత్వం ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కెనడాలో ఖలిస్థాన్ అనుకూల తీవ్రవాదుల భారత వ్యతిరేక నిరసనల సంఖ్య పెరిగింది. ఆ భారత దౌత్యవేత్తలను హత్య చేయాలంటూ.. ఈ ఘటనల్లో నిషేధిత ఖలిస్థానీ అనుకూల గ్రూప్ సిక్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) హస్తం ఉన్నట్లు తేలింది.ఈ సంఘంతో సంబంధం ఉన్న గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల కెనడాలో నివసిస్తున్న హిందువులను దేశం విడిచి వెళ్లాలని కోరింది. గురుపత్వంత్ సింగ్ పన్నూ అమృత్సర్ జిల్లాలోని ఖాన్కోట్ గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి పంజాబ్ స్టేట్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ బోర్డులో ఉద్యోగి. పంజాబ్ యూనివర్శిటీ, చండీగఢ్‌లో న్యాయ పట్టా పొందిన పన్నూ.. సిక్ ఫర్ జస్టిస్‌కు న్యాయ ప్రతినిధి. అతనికి కెనడాతో పాటు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. భారత్‌ను వదిలి విదేశాలకు వెళ్లిన పన్నూ తొలుత అక్కడ డ్రైవర్‌గా పనిచేశాడు. కొంతకాలం తర్వాత న్యాయవాద వృత్తిని చేపట్టాడు. జులై 2023లో ఒక వీడియోను విడుదల చేసిన పన్నూ.. ఉత్తర అమెరికా, యూరప్‌లోని భారతీయ దౌత్యవేత్తలను హత్య చేయాలని పిలుపునిస్తూ పోస్టర్లను ముద్రించాడు. భారత ప్రభుత్వం గురుపత్వంత్ సింగ్ పన్నూను 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. భారత్ సిక్కుల మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నదంటూ.. కెనడాలోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయించడమే కాకుండా పన్నూ మరో వీడియోలో ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్ షాను కూడా బెదిరించాడు. పన్నూపై భారత్‌లో దేశద్రోహ కేసుతో సహా 20కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఖలిస్తాన్‌కు మద్దతుగా పన్నూ అమెరికా, కెనడా తదితర దేశాల్లో కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నాడు. భారతదేశం సిక్కుల మానవ హక్కులను ఉల్లంఘిస్తోందనే ఆరోపణలు గుప్పిస్తున్నాడు. అతనిపై అంతర్జాతీయ స్థాయిలో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని భారత్ కోరినప్పటికీ ఇంటర్‌పోల్ ఇంకా నోటీసు జారీ చేయలేదు. కెనడా క్యాబినెట్లో నలుగురు సిక్కు మంత్రులు కెనడాలో సిక్కు జనాభా గణనీయంగా ఉంది. ఇమ్మిగ్రేషన్ విధానం చాలా ఉదారంగా ఉన్న పాశ్చాత్య దేశాలలో కెనడా ఒకటని చెబుతారు. కెనడాలో గణనీయమైన సంఖ్యలో భారత సంతతికి చెందినవారు ఉన్నారు. అందులో ముఖ్యంగా సిక్కులు అధికంగా ఉన్నారు. కెనడాలో ఏడున్నర లక్షల మందికి పైగా సిక్కులు నివసిస్తున్నారు. అక్కడ వారు వ్యాపార రంగం మొదలుకొని రాజకీయ రంగం వరకూ ప్రభావవంతంగా ఉన్నారు. ఈ నేపద్యంలో ఈ సిక్కు ఓటు బ్యాంకుకు ట్రూడో కాపాడుకుంటూ వస్తున్నారు. ట్రూడో తన మొదటి టర్మ్‌లో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు సిక్కులకు అత్యధిక ప్రాముఖ్యతనిచ్చారు. ఆయన క్యాబినెట్లో నలుగురు సిక్కు మంత్రులు ఉన్నారు. అందుకే ఖలిస్థాన్ అనుకూల వేర్పాటువాదులపై కఠిన చర్యలు తీసుకోకూడదని ట్రూడో భావిస్తున్నారని విశ్లేషకుల వాదన. అయితే కెనడాలోని చాలా మంది సిక్కులు అతని భావజాలానికి మద్దతునివ్వడం లేదని సమాచారం. ఎయిర్ ఇండియా విమానంపై బాంబు దాడి 1980 నుండి భారతదేశం- కెనడా మధ్య అగాధం పెరిగింది. 1985లో కెనడాకు చెందిన ఖలిస్తానీ వేర్పాటువాద బృందం ఎయిర్ ఇండియా విమానంపై బాంబు దాడి చేయడంతో ఇది మొదలయ్యింది. ఈ పేలుడులో విమానంలోని మొత్తం 329 మంది చనిపోయారు. ఈ బాంబు పేలుడుపై జరిగిన దర్యాప్తులో ఇంకా ఖచ్చితమైన వివరాలు వెల్లడి కాలేదు. కాగా కొన్ని నెలల క్రితం బ్రాంప్టన్‌లో జరిగిన పరేడ్‌లో మాజీ భారత ప్రధాని ఇందిరా గాంధీ చిత్రం రక్తంతో తడిసిన చీరలో కనిపించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. గత కొన్ని నెలలుగా కెనడాలో భారత వ్యతిరేక నిరసనలు తరచూ కనిపిస్తున్నాయి. కెనడా ప్రభుత్వం వాటిని నియంత్రించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కూడా చదవండి: ఖలిస్తాన్ అంటే ఏమిటి? పంజాబ్‌ను ఎందుకు వేరు చేయాలంటున్నారు? -
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిపై లైంగిక ఆరోపణలు
-
ఢిల్లీ ఘటనలో వెలుగులోకి షాకింగ్ విషయాలు
-
ఫోటో అంటూ ఎగబడిన ఫ్యాన్స్.. పారిపోయిన హీరోయిన్
-
Anchal Singh : ఆంచల్ సింగ్ బ్యూటిఫుల్ ఫోటోలు
-
బ్యాంకుల ప్రైవేటీకరణే పరిష్కారమా?
ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే ప్రభుత్వానికి కొన్ని వేల కోట్ల రూపాయల రాబడి రావచ్చు గానీ, దీన్నుంచి స్థూలంగా దేశానికి ఏం ప్రయోజనం కలుగుతుందన్నది ప్రశ్న. ప్రైవేట్ బ్యాంకులు ప్రభుత్వ పథకాల అమలు, గ్రామీణ ప్రాంతాలకు సేవలు వంటి లాభదాయకం కాని సేవలనుంచి తప్పుకోవచ్చు. లాభం అనేది కేవలం డబ్బు రూపంలోనే ఉండాల్సిన పనిలేదు. మిగిలివున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులపై పని ఒత్తిడి, ఉద్యోగాలు కోల్పోవడం అనే సమస్యలు కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు మెరుగుపడింది, ప్రైవేట్ రంగ బ్యాంకుల పనితీరు తిరోగమిస్తోంది. మొత్తంమీద చూస్తే బ్యాంకింగ్ రంగంలో ఉన్న సమస్యలకు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ అనేది సర్వరోగనివారిణి అయితే కాదు. నీతి ఆయోగ్ సిఫార్సుల ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకు అనే రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించబోతోంది. 2021 ఫిబ్రవరి 1న సమర్పించిన బడ్జెట్లో, రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ఒక ప్రభుత్వ బీమా కంపెనీని 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీ కరించాలనే లక్ష్యాన్ని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేటీకరణ ప్రక్రియను ముగించడానికి, ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టాల్లో మార్పులు తీసుకురావలసి ఉంది. అందుచేత, ప్రభుత్వం బ్యాంకింగ్ లాస్ (సవరణ) బిల్లు, 2021ని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. దీనివల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ కనీసం వాటా 51 నుంచి 26 శాతానికి కుదించబడుతుంది. ప్రస్తుతానికి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ వాటాలు దాదాపు రూ. 44 వేల కోట్ల వరకు ఉండవచ్చని లెక్కించారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 31,641 కోట్లు కాగా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ విలువ రూ. 12,359 కోట్లు. ఈ రీతిన ఈ బ్యాంకుల్లో ఉన్న తన వాటాను ప్రభుత్వం అమ్ముకోవడం ద్వారా తానుపెట్టిన మూల ధనాన్ని వెనక్కి తీసుకుంటుంది. అయితే ప్రభుత్వం తన వాటాని అమ్ముకోవడానికి ఎంత సమయం పడుతుందని చెప్పడం కష్టమవు తుంది. ఈ మూలధనం విలువ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన సమయంలో మార్కెట్ పరిస్థితులపైనా, బ్యాంక్ బలంపైనా అంటే బ్యాంకు శాఖలు, కస్టమర్లు, అలాగే బ్యాంక్ బిజినెస్ స్థాయి, నిరర్థక ఆస్తులు (ఎన్పీఎలు) తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. బ్యాంకులను ప్రైవేటీకరించిన తర్వాత, ఈ బ్యాంకుల్లోకి మూలధనాన్ని మళ్లించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉండదు. పైగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వంటి ప్రభుత్వ విభాగాలు ఈ సంస్థలను పర్యవేక్షించాల్సిన అవసరం ఇకపై ఉండదు. అయితే ఈ రెండు ప్రభుత్వ బ్యాంకులకు చెందిన వాటాలను కొను గోలు చేసిన వారు బ్యాంకును మరింత స్వేచ్ఛగా నిర్వహించు కోగలుగుతారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ప్రభుత్వానికి 95.8 శాతం వాటాలు ఉన్నాయి. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వ వాటా 92.4 శాతం వరకు ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తన వాటాను ప్రభుత్వం మొదట 51 శాతానికి తగ్గించుకుంటుందనీ, తర్వాత దాన్ని 50 శాతంకంటే తక్కువకు కుదించి ఆ బ్యాంకుల అమ్మకం సజావుగా జరిగేందుకు వీలు కల్పిస్తుందనీ భావిస్తున్నారు. ప్రైవేటీకరణ తర్వాత, ఈ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పని చేస్తున్న ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవచ్చు. దీనివల్ల ప్రభు త్వానికి ఉన్న సంక్షేమ ముద్రపై ప్రతికూల ప్రభావం కలుగుతుంది. భవిష్యత్తుపై అనిశ్చితి కారణంగా ఉద్యోగులు తమ పనిలో చురుకు దనం చూపలేకపోవచ్చు. ఇది ఈ బ్యాంకుల పనితీరునే దెబ్బ తీయవచ్చు. పైగా ఈ రెండు బ్యాంకుల సేవా రుసుములు పెరుగు తాయి. అంతేగాక గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించడం నుంచి ఈ బ్యాంకులు తప్పుకోవచ్చు. ప్రభుత్వ పథకాలను అమలు చేయ డానికి ఇవి ఆసక్తి చూపకపోవచ్చు. పైగా పెన్షన్ పంపిణీ, అటల్ పెన్షన్ యోజన, సుకన్యా సమృద్ధి యోజన వంటి తక్కువ ప్రతిఫలం లభించే తరహా సేవలకు సంబంధించిన పనులు చేయడంపై ఇవి ఆసక్తి చూపకపోవచ్చు. అదే సమయంలో తమ రాబడిని పెంచు కోవడానికి మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి బ్యాంకింగేతర సేవలను అందించడానికి ఈ బ్యాంకులు పూనుకోవచ్చు. ప్రైవేటీకరణ జరిగిన తర్వాత, ఈ బ్యాంకుల పట్ల కస్టమర్లు మనస్సుల్లో ఉండే పరపతి స్థాయి తగ్గిపోవచ్చు. ఇటీవలే యస్ బ్యాంక్, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో–ఆపరేటివ్ బ్యాంక్ (పీఎమ్‌సీ)లు మునిగిపోవడం చూశాం. ప్రభుత్వ పథకాలకు ఒక రూపమివ్వడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి, ఈ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల ప్రభుత్వ పథకాలను అమలు చేయడంపై మిగిలివున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులపై తీవ్రమైన భారం పడవచ్చు. ప్రైవేటీకరణ కోసం ప్రతిపాదించిన బ్యాంకుల పరిమాణం చిన్నది. సెంట్రల్ బ్యాంక్‌లో 33 వేలమంది, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 26 వేలమంది ఉద్యోగులు ఉన్నారు. ఈ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 2021 ఆర్థిక సంవ త్సరంలో ఆరేళ్ల తర్వాత రూ. 831 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2020 సంవత్సరంలో ఈ బ్యాంకు రూ. 8,527 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. అదే సమయంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నష్టాలు 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ. 887.58 కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం 20 శాతం పెరిగి రూ. 161 కోట్లుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలానికి గానూ బ్యాంకు 134 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత సంవత్సరం ఇదే కాలంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 6,703.71 కోట్లకు నమోదు కాగా, ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 2 శాతం పెరిగి రూ. 6,833. 94 కోట్లకు చేరింది. బ్యాంకు నిర్వహణాత్మక లాభం 42.16 శాతం వృద్ధితో రూ. 1,458 కోట్లకు పెరిగింది. గత సంవత్సరం ఇదే కాలా నికి బ్యాంకు లాభం రూ. 1,026 కోట్లు మాత్రమే. గత సంవత్సరం బ్యాంకు నిరర్థక ఆస్తులు 19.89 శాతంగా ఉండగా, ఈ సంవత్సరం అవి 17.36కి తగ్గాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నికరలాభం గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 148 కోట్లు కాగా ఈ సంవత్సరం ఇదే కాలానికి అది రెట్టింపై రూ. 376 కోట్లకు చేరింది. బ్యాంక్ ఇచ్చిన మొత్తం అడ్వాన్సులలో నికర ఆస్తుల వాటా 2.77 శాతం కాగా, గత సంవత్సరం ఇదే కాలానికి అది 4.30 శాతంగా ఉండింది. బ్యాంక్ మొత్తం నిరర్థక ఆస్తులు గత సంవత్సరంలో రూ. 5,291 కోట్లు కాగా, ఈ సంవత్సరం అవి రూ. 3,741 కోట్లకు తగ్గి పోయాయి. 2017 మార్చి నెలలో, దేశంలో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండేవి. విలీన ప్రక్రియ మొదలైన తర్వాత 2020 ఏప్రిల్ నాటికి వీటి సంఖ్య 12కి పడిపోయింది. దేశంలో ప్రైవేట్ బ్యాంకుల సంఖ్య ఇప్పుడు 21కి చేరింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 10కి తగ్గిపోతుంది. అదే సమయంలో ప్రైవేట్ బ్యాంకుల సంఖ్య 23కి పెరుగుతుంది. రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్రప్రభుత్వం ప్రైవేటీకరిస్తున్నప్పటికీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రైవేటీకరణ సర్వరోగ నివారిణి కాదు. ఇటీవలికాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు మెరుగుపడింది. ప్రైవేట్ రంగ బ్యాంకుల పనితీరు తిరోగ మిస్తోంది. అనేక ప్రైవేట్ బ్యాంకులు మునిగిపోయాయి. యస్ బ్యాంక్, పీఎమ్‌సీ దీనికి తాజా ఉదాహరణ. కరోనా మహమ్మారి కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఎలా పనిచేశాయనన్నది అందరికీ తెలిసిందే. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే ప్రభు త్వానికి కొన్ని వేల కోట్ల రూపాయల రాబడి రావచ్చు కానీ, దీన్నుంచి ప్రభుత్వం ఎలా ప్రయోజనం పొందుతుందన్నది పరిశీలించాల్సిన విషయమే. లాభం అనేది కేవలం డబ్బు రూపంలోనే ఉండాల్సిన పనిలేదు. మిగిలివున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులపై పని ఒత్తిడి, ఉద్యోగాలు కోల్పోవడం అనే సమస్యలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ అంతిమ పరిణామం ఏంట న్నది వేచి చూడాల్సిందే. – సతీష్ సింగ్ సీనియర్ జర్నలిస్టు -
ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. చార్ధామ్ బోర్డు రద్దు
డెహ్రాడున్: ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చార్ధామ్ దేవస్థానం బోర్డును రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ముఖ్యమంత్రి పుస్కర్ సింగ్ ధామి సోమవారం ఈ విషయాన్ని ప్రకటించారు. దేశస్థానం బోర్డుకు సంబంధించిన అన్ని అంశాలను అధ్యయనం చేస్తామని తెలిపారు. అప్పటివరకు చార్ధామ్ దేవస్థానం బోర్డు చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించామని సీఎం ధామి పేర్కొన్నారు. ఈ బోర్డును 2019లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బోర్డును రద్దు చేయాలని పెద్ద ఎత్తున పూజారులు డిమాండ్ చేస్తున్నారు. ఆలయాల సాంప్రదాయ హక్కులకు వ్యతిరేకంగా బోర్డు ఉందని పూజారులు ఆరోపలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవస్థానం బోర్డుపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం ధామి రద్దు నిర్ణయం తీసుకున్నారు. మనోహర్ కంట్ దయానీ నేతృత్వంలోని బృందం నివేదికను తయారు చేసింది. దేవస్థానం బోర్డు కింద 51 ఆలయాల నిర్వహణ ఉండగా.. ప్రముఖ కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రీ ఆలయాలు కూడా బోర్డు పరిధిలోనే ఉన్నాయి. -
ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా పుష్కర్ సింగ్ ధామి ప్రమాణం
-
మనిషిలా ఉండే మనిషి
అదితి సింగ్ ఎక్కడా పెద్దగా కనిపించరు. వెతుక్కోవాలి ఆమెను మనుషుల్లోకి వెళ్లి! తనకు ఇష్టం లేనిదే పార్టీ చెప్పినా వినరు. తగని పని తన పార్టీ చేసినా ఊరుకోరు. పాలిటిక్స్.. ఆమెకు స్వచ్ఛంగా ఉండాలి. పార్టీ ఏదైనా మనిషి మనిషిలా ఉండాలి. ముందొక జోకు. తర్వాతొక క్రూయల్ జోకు. ∙∙ ‘‘ఎప్పుడు తిన్నాడో ఏమో, పొద్దున చేసిన ఉప్మా కాకుండా మళ్లీ ఫ్రెష్‌గా తీస్కోనిరా’’ అంటాడు సుధతో, తనికెళ్ల భరణి. డైనింగ్ టేబుల్ ముందుంటారు భరణి, నాగార్జున. నాగార్జునకు.. భరణి బాబాయ్. నాగార్జున పిన్ని.. సుధ. ‘‘ఎర్ర రవ్వ ఉప్మా చెయ్యనా? తెల్ల రవ్వ ఉప్మా చెయ్యనా?’’ అని మళ్లీ వచ్చి అడుగుతుంది సుధ. ‘‘ఉప్మాలా ఉండే ఉప్మా చెయ్’’ అంటాడు భరణి. (ఉవ్వెత్తున ఎగసి... ఉసూరుమని కూలి...) భర్త అంగద్తో అదితి ఇప్పుడు ఒక క్రూయల్ జోక్. ఊహు. దానికన్నా ముందు ఒక సత్యశోధన. మనిషి ఎలా ఉండాలి? ఎర్రగానా, ఎత్తుగానా, బక్కగానా, బలంగానా? నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. తండ్రి కారణంగా కూతురికి ఉన్న ఫాలోయింగ్ కాదు అదితికి ఉన్నది. ప్రజలతో చక్కగా మాట్లాతారు. ప్రత్యర్థులకు మాటకు మాట చెబుతారు. ప్రత్యర్థులు అవతలి పార్టీవాళ్లే అయి ఉండాలనేం లేదు ఆమెకు. తిన్నగా లేకపోతే సొంత పార్టీవాళ్లకు కూడా తను ప్రత్యర్థిగా మారిపోతారు. మనుషుల పార్టీ ఆమెది! మనిషికి కష్టం కలిగించిన వాళ్లెవరైనా, మనిషిలా ప్రవర్తించని వాళ్లెవరైనా అదితికి నచ్చరు. రాజకీయాల్లో ఈ స్వభావం పని చేస్తుందా? పని చేసే స్వభావమే రాజకీయ స్వభావం కావాలన్నది అదితి పాలసీ. పని గట్టుకుని ఆమె పాలిటిక్స్‌లోకి రాలేదు. పని చేయాలనుకుని వచ్చారు. ఢిల్లీలో చదువుకున్నారు. తర్వాత ముస్సోరీలో. తర్వాత యూఎస్‌లోని డ్యూక్ యూనివర్సిటీలో. మేనేజ్మెంట్లో డిగ్రీ చేశారు అక్కడ. ఇండియా వచ్చాక సోషల్ వర్క్‌ను ఎంచుకున్నారు. సోషల్ వర్క్‌లో చురుగ్గా ఉండేవాళ్లకు రాజకీయాలు పట్టవు కానీ.. రాజకీయాలు అలాంటివారిని ఎంత దూరాన్నుంచయినా వెంటనే పట్టేస్తాయి. అలా పాలిటిక్స్‌లోకి వెళ్లారు. క్రూయల్ జోక్ నుంచి పక్కకు వచ్చేశామా! లేదు. ప్రియాంక గాంధీ చేసిన ఒక పనిని క్రూయల్ జోక్ తో పోల్చింది అదితినే! ∙∙ అదితి, ప్రియాంక ఒకేపార్టీ వాళ్లు. అదితి.. ఎమ్మెల్యే మాత్రమే కాదు. కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జాతీయ కార్యదర్శి కూడా. ప్రియాంక తూర్పు యూపీకి పార్టీ ప్రధాన కార్యదర్శి. వలస కార్మికులకు కాంగ్రెస్‌పార్టీ వెయ్యి బస్సులు ఏర్పాటు చేసింది అని ప్రియాంక ప్రకటించగానే, ఆ బస్సుల జాబితాను అధికార పార్టీ బీజేపీ తెప్పించుకుని చూసింది. వాటిల్లో సగానికి పైగా కండిషన్లో లేని బస్సులే! 297 బస్సులు తప్పుపట్టి ఉన్నాయి. 98 ఆటో–రిక్షాలు, అంబులెన్స్ వంటి కొన్ని వాహనాలు కూడా ఆ బస్సుల జాబితాలో చేరి ఉన్నాయి! 68 వాహనాలకైతే అసలు పేపర్లే లేవు! ఈ విషయమే అదితికి తన సొంత పార్టీ మీద ఆగ్రహం తెప్పించింది. ఇంతకన్నా చవకబారు రాజకీయం ఉందా? వలస కార్మికుల మీద వేసిన క్రూయల్ జోక్ కాదా ఇది అని బాహాటంగానే అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఆమెను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే క్రమశిక్షణ చర్య ఒకటి అదితిపై పెండింగులో ఉంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశానికి.. పార్టీ ఆదేశాలను ధిక్కరించి మరీ హాజరైనందుకు అదితిని ఎమ్మెల్యేగా అనర్హురాలిని చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్పీకర్‌కు ఇచ్చిన ఆ ఫిర్యాదుపై ఇంకా ఏ నిర్ణయమూ జరగలేదు. ∙∙ ఎవరి నిర్ణయాలకూ తలొగ్గరు అదితి. అలాగే తనపై వచ్చిన ఏ నిజం కాని వార్తకూ ఆమె స్పందించకుండా ఉండరు. రాహుల్, అదితి పెళ్లి చేసుకోబోతున్నారని రెండేళ్ల క్రితం వార్తలు వచ్చినప్పుడు ఆమె వెంటనే ఖండించారు. ‘‘రాహుల్జీ నాకు అన్నయ్య. ఆయనకు రాఖీ కూడా కట్టాను’’ అని స్పష్టంగా చెప్పి ఆ విషయంలో ఇక ఎవరి ఊహల్నీ ముందుకు వెళ్లనీయలేదు. గత ఏడాదే అదితికి అంగద్సింగ్తో వివాహం జరిగింది. ఆయన కూడా ఎమ్మెల్యేనే. అయితే పంజాబ్‌లో. సమావేశాలు, నియోజకవర్గ పర్యటనలు లేనప్పుడు ఢిల్లీనే ఈ దంపతుల ఇల్లు. అతడిదీ కాంగ్రెస్ పార్టీనే. లవ్ మ్యారేజ్ వాళ్లది. అదితి ఎక్కువగా ఉండేది మాత్రం తన నియోజకవర్గ ప్రజలతోనే. -
ఉగ్ర ఖాకీ!
చుట్టూ ఉన్న వాస్తవాలను గమనిస్తూ, తమ ఊహాశక్తికి పదనుపెట్టి, ఆ వాస్తవాలకు కాల్పనికత జోడిస్తారు సృజనాత్మక రచయితలు. కానీ ఒక్కోసారి వాస్తవం కాల్పనికతను మించిపోతుంది. ఎవరి ఊహలకూ అందనంత దిగ్భ్రాంతికరంగా వుంటుంది. జమ్మూ–కశ్మీర్‌లోని శ్రీనగర్ విమానాశ్రయ భద్రతా వ్యవహారాలు పర్యవేక్షిస్తూ, గత ఆగస్టు 15న రాష్ట్రపతి పురస్కారాన్ని కూడా పొందిన డీఎస్పీ దేవిందర్ సింగ్ కరుడుగట్టిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది నవీద్ బాబా, అతని అనుచరుడితో కలిసి కారులో ప్రయాణిస్తూ శుక్రవారం పోలీసులకు చిక్కిన ఉదంతం ఇటువంటిదే. నవీద్ బాబా ఇటీవలికాలంలో ఎందరో అమాయకుల ప్రాణాలు బలిగొన్నాడు. అలాంటివారికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల ప్రాంతంలోని తన ఇంట్లో ఆశ్రయమివ్వడం ఊహకందదు. పంజాబ్‌లో మిలిటెన్సీ తీవ్రంగా వున్నప్పుడు కూడా ఉగ్రవాదులకు కొందరు పోలీసు అధికారులు సహకరించిన వైనం బట్టబయలైంది. కానీ ఆ ఉదంతాలకు లేని ప్రాముఖ్యత ఇప్పుడు దీనికి రావడానికి ముఖ్యమైన కారణం వుంది. 2001లో పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడిలో అరెస్టయిన నిందితుల్లో ఒకడైన అఫ్జల్ గురు అప్పట్లో తన న్యాయవాది సుశీల్‌కుమార్‌కు రాసిన లేఖలో తొలిసారి దేవిందర్ పేరు ప్రసావించాడు. తనను ఈ రొంపిలోకి లాగింది ఆయనేనని ఆ లేఖలో అఫ్జల్ గురు నేరుగా చెప్పాడు. కానీ అప్పట్లో అతని మొర ఆలకించినవారు లేరు. చివరకు సర్వోన్నత న్యాయస్థానం సైతం అఫ్జల్ గురును దోషిగా నిర్ధారించి ఉరిశిక్ష విధించింది. 2005 ఆగస్టులో అతని ఉరిశిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేయగా, 2013 ఫిబ్రవరి 9న అతన్ని ఉరితీశారు. పార్లమెంటుపై ఉగ్రవాద దాడి జరిగాక న్యాయ ప్రక్రియంతా ముగిసి ఉరిశిక్ష ఖరారు కావడానికి నాలుగేళ్ల సమయం పడితే, అతని క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడానికి మన రాజకీయ నాయకత్వానికి దాదాపు ఎనిమిదేళ్ల వ్యవధి కావలసివచ్చింది! దురదృష్టమేమంటే... ఏ దశలోనూ అతను ప్రస్తావించిన దేవిందర్పై వచ్చిన ఆరోపణల్లోని నిజానిజాలేమిటో ఎవరూ పట్టించు కోలేదు. అఫ్జల్ గురు అఫిడవిట్లో దేవిందర్ సింగ్ పేరు ప్రస్తావించినప్పుడు బాధ్యతగల ప్రభుత్వం లోతుగా ఎందుకు దర్యాప్తు చేయించలేదన్నది కీలకమైన ప్రశ్న. ఏ నేరంలోనైనా సంశయానికి తావులేని స్థాయిలో ప్రమేయం ఉన్నదని రుజువైనప్పుడే నిందితుడికి న్యాయస్థానాలు శిక్ష విధి స్తాయి. ఉరిశిక్ష విధించినప్పుడైతే ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాయి. అఫ్జల్ విషయంలో అది జరగలేదని నిర్ద్వంద్వంగా చెప్పలేం. ఎందుకంటే పార్లమెంటుపై ఉగ్రవాద దాడికి పాల్పడి, భద్రతా దళాల కాల్పుల్లో మరణించిన మహమ్మద్‌ను కశ్మీర్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చిందీ, అతను పాత కారు కొనుక్కోవడానికి సాయపడిందీ అఫ్జలే. అతనితోపాటు తాను కూడా ఆ కారులో ప్రయాణించి ఢిల్లీలోనే వేర్వేరు వ్యక్తులను కలిశామని కూడా అఫ్జల్ అంగీకరించాడు. ఆ పాత కారులోనే ఉగ్రవాదులు పార్లమెంటుకొచ్చి దాడి చేశారు. అందులో పాల్గొన్న అయిదుగురు ఉగ్ర వాదులూ మరణించగా, కారు నంబర్ ఆధారంగా దాన్ని కొన్నదెవరో పోలీసులు తెలుసు కోగలిగారు. పోలీసులు ప్రశ్నించినప్పుడు అదనంగా అఫ్జల్ ఇంకేమి చెప్పాడన్నది అలావుంచితే, ఉరిశిక్ష పడ్డాక అతను దేవిందర్ పేరును ప్రస్తావించి, ఆయన తనను చిత్రహింసలకు గురిచేశాడని, చివరకు మహమ్మద్‌ను పరిచయం చేసి, అతన్ని ఢిల్లీకి తీసుకెళ్లమన్నాడని అఫ్జల్ గురు ఆరోపిం చాడు. అతను మరో ముఖ్య విషయం చెప్పాడు. మహమ్మద్‌ను కశ్మీర్ వాసిగా దేవిందర్ పరిచయం చేసినా, అతని ముఖకవళికలు అలా అనిపించలేదని, అతనికి కశ్మీరీ భాష కూడా రాదని, కానీ విధిలేక ఆ అధికారి చెప్పినట్టల్లా చేశానని తెలిపాడు. అప్పట్లో కశ్మీర్ పోలీసులు ఈ ఆరోపణను కొట్టిపారేశారు. కేసు నుంచి తప్పించుకోవడానికి అఫ్జల్ నాటకమాడుతున్నాడని చెప్పారు. అఫ్జల్ నేర ప్రమేయంపై వారికి నమ్మకం ఏర్పడటాన్ని తప్పుబట్టనవసరం లేదు. కానీ ఒక నిందితుడు అంత వివరంగా దేవిందర్ గురించి చెబుతున్నప్పుడు కాస్తయినా సంశయం కలగొద్దా? ఇది అఫ్జల్ కోసం కాదు...తమలో ఒకడిగా వున్న అధికారిపై తీవ్ర ఆరోపణలు వచ్చినప్పుడు వాటి నిజానిజాలు నిర్ధారించడం అత్యవసరమని అనిపించలేదా? పోనీ ఇలా ఒక అధికారిపై ఆరోపణలు రావడం కశ్మీర్లో మొదటి సారి కావచ్చునేమోగానీ, ఈశాన్య రాష్ట్రాలు, పంజాబ్ వంటిచోట్ల అంత క్రితం బయటపడలేదా? సైన్యంలో పనిచేస్తూ గూఢచర్యానికి పాల్పడినవారిని పట్టుకున్న ఉదం తాలు లేవా? ఏ ఉద్దేశంతో అప్పట్లో దేవిందర్‌సింగ్ పాత్రపై దర్యాప్తు చేయలేదన్నది ఇప్పుడు తేల వలసివుంది. అలా దర్యాప్తు చేసివుంటే, ఎన్నో దిగ్భ్రాంతికర అంశాలు బయటపడేవి. వందల మంది ప్రాణాలు కాపాడటం, ఆస్తుల విధ్వంసాన్ని నివారించడం సాధ్యమయ్యేది. అఫ్జల్ ప్రస్తావించడానికి చాలా ముందే దేవిందర్‌సింగ్ వివాదాస్పద అధికారిగా ముద్ర పడ్డాడు. మిలిటెన్సీని సమర్థవంతంగా అదుపు చేసినందుకు ఆరేళ్ల వ్యవధిలో ఎస్ఐ నుంచి డీఎస్పీ దాకా ఎదిగాడు. కానీ తన పరిధిలో లాకప్ మరణాలు జరగడంతో మళ్లీ వెనక్కు పంపారు. అనంతరకాలంలో చాలా త్వరగానే కోల్పోయినదాన్ని సాధించుకున్నాడు. అఫ్జల్‌ను ప్రశ్నించడం, చిత్రహింసలు పెట్టడం వాస్తవమేనని అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో దేవిందర్ అంగీకరించాడు. ఏ ఉగ్రవాద ఘటనైనా స్థానికంగా వుండేవారి తోడ్పాటులేనిదే సాధ్యం కాదు. ఇప్పుడు ఎటూ పార్లమెంటు దాడి కేసులో తిరిగి దర్యాప్తు జరుగుతుంది. ఇన్నేళ్లుగా దేవిందర్ సింగ్ ఎలాంటి ఘోరాలకు ఒడిగట్టాడో తేలుతుంది. కనీసం ఇకముందైనా నేరాల దర్యాప్తునకు, ముఖ్యంగా ఉగ్ర వాద నేరాల దర్యాప్తునకు అనుసరించాల్సిన శాస్త్రీయ విధానాలేమిటో, సూక్ష్మ స్థాయి అంశాలపై సైతం ఎంత తీక్షణమైన దృష్టి సారించాలో, ఎందుకు సారించాలో మన దర్యాప్తు విభాగాలు గ్రహిం చగలిగితే అది దేశ భద్రతకు ఎంతగానో మేలుచేస్తుంది. -
60 ఏళ్ల డీఆర్ఐ : ఎన్నో ఘనతలు
సాక్షి, హైదరాబాద్ : యాంటీ స్మగ్లింగ్, నకిలీ నోట్లు, నకిలీ బంగారం, డ్రగ్స్ నియంత్రణలపై దృష్టి సారిస్తోన్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్(డీఆర్ఐ) నేటితో 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1957లో డీఆర్‌ఐను స్థాపించారు. 1992లో హైదరాబాద్ కేంద్రంగా స్థానికంగా డీఆర్ఐ ప్రారంభమైంది. 1992 నుంచి ఇప్పటివరకూ హైదరాబాద్ డీఆర్ఐ ఎన్నో ఘనతలు సాధించిందని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎంకే సింగ్ పేర్కొన్నారు. డీఆర్ఐ 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ కేంద్రం ఇప్పటివరకూ 660 కిలోల డ్రగ్స్‌ను సీజ్ చేసిందని వెల్లడించారు. 18,900 కిలోల గంజాయి, 26 లక్షల నకిలీ కరెన్సీని పట్టుకున్నట్లు చెప్పారు. వీటిపై 25 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. స్మగ్లింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. గత రెండేళ్లలో డీఆర్ఐ-హైదరాబాద్ మంచి పురోభివృద్ధిని సాధించినట్లు తెలిపారు. 2017-18ల మధ్య 127 కేసుల్లో 817 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసినట్లు చెప్పారు. అక్రమంగా తరలిస్తున్న 148 కోట్లను స్వాధీనం చేసుకుని 61 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు.13 బంగారం స్మగ్లింగ్ కేసుల్లో 7 కోట్ల రూపాయల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 16 నార్కోటిక్ డ్రగ్ కేసుల్లో 41 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 14 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసి 9 వేల కిలోల గంజాయిని పట్టుకున్నామని చెప్పారు. వీటితో పాటు 4 సిగరెట్ స్మగ్లింగ్ కేసుల్లో 9 కోట్ల రూపాయలు విలువైన సిగరెట్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని ఎంకే సింగ్ పేర్కొన్నారు. -
అక్షర దోషంతో 4 రెట్లు పెరిగిన వేతనం
న్యూఢిల్లీ: అక్షర దోషంతో ఫోర్టిస్ హెల్త్‌కేర్ సీఈవో భవదీప్ సింగ్ వేతనం కాస్తా రూ.13 కోట్లు పెరిగిపోయింది. 2015 జూలై నుంచి 2017 మార్చి మధ్య కాలంలో భవదీప్ సింగ్ వేతనం నాలుగు రెట్లు పెరగ్గా, అదే కాలంలో కంపెనీ పనితీరు క్షీణించడం గమనార్హం. 2015 జూలైలో సింగ్‌ను రూ.3.91 కోట్ల వేతనానికి సీఈవోగా ఫోర్ట్స్ హెల్త్‌కేర్ నియమించుకుంది. మరుసటి సంవత్సరమే ఆయన వేతనం రూ.16.80 కోట్లకు పెరిగింది. 2015–16, 2016–17 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి కంపెనీ నివేదికల ఆధారంగా ఈ విషయాలు తెలిశాయి. అయితే, భవదీప్ సింగ్ వేతన గణాంకాల్లో ముద్రిత దోషం ఉన్నట్టు ఫోర్టిస్ హెల్త్‌కేర్ కంపెనీ ప్రతినిధి స్పష్టం చేశారు. ‘‘2016–17 ఆర్థిక సంవత్సరం నివేదికలో నంబర్ తప్పుగా ముద్రితమైంది. దీంతో సింగ్ ఆదాయం అధికంగా కనిపించింది. 2017–18 ఆర్థిక సంవత్సరం నివేదికలో సవరణ ప్రచురిస్తాం. వాస్తవానికి ఆ రెండు సంవత్సరాల్లో సింగ్ వేతనం కంపెనీ నిబంధనలకు అనుగుణంగా 6%, 8% చొప్పునే పెరిగింది’’ అని కంపెనీ ప్రతినిధి వివరించారు. అయితే ఈ అంకెలు వరుసగా రెండేళ్లు ఎలా తప్పు వస్తాయని షేర్ హోల్డర్లు అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. కంపెనీ తీవ్ర కుంభ కోణాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. -
అక్కడ పన్ను కోత.. ఇక్కడ మార్కెట్లకు వాత
న్యూఢిల్లీ: అమెరికా కార్పోరేట్ పన్ను కోత భారత స్టాక్ మార్కెట్‌పై బాగానే ప్రభావం చూపుతుందని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె. సింగ్ వ్యాఖ్యానించారు. ప్రతికూల ఫలితాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. మన స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2,300 కోట్ల డాలర్లుగా ఉన్నాయని తెలిపారు. అమెరికాలో పన్ను కోతల ప్రభావంతో ఈ పెట్టుబడుల్లో స్వల్ప భాగం వెనక్కి వెళ్లిపోయినా, మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం ఉంటుందని వివరించారు. ఇప్పటికే ఆ ప్రభావాన్ని మనం చూస్తున్నామని తెలిపారు. అనిశ్చితి అధికమే..! ఈ ఏడాది స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులకు, అనిశ్చితి చోటు చేసుకోవచ్చని ఎన్.కె. సింగ్ అంచనా వేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ పరిణామాల వల్ల అనిశ్చితి చోటు చేసుకోవచ్చని వివరించారు. ఇక్కడ జరిగిన యస్ బ్యాంక్ యాన్యువల్ ఎకనామిక్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడారు. తొలి, అత్యంత కీలకమైన అంతర్జాతీయ అనిశ్చితి అమెరికా కార్పొరేట్ పన్ను కోతేనని వివరించారు. కార్పొరేట్ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 21 శాతానికి అమెరికా తగ్గించిందని, ఫలితంగా అమెరికా కంపెనీల లాభదాయకత పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ దృష్ట్యా అమెరికా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎఫ్‌పీఐలు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటారని వివరించారు. ఇక రెండో విదేశీ ప్రభావం... అంతంతమాత్రంగానే ఉన్న ఎగుమతులని తెలిపారు. ఎగుమతులు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నా, ముడి చమురు ధరల్లో ఒడిదుడుకుల కారణంగా మన కరెంట్ అకౌంట్‌లోటుపై ప్రభావం బాగానే ఉంటుందని వివరించారు. కనీస మద్దతు ధర పెరగడం వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిడులు కూడా అధికమవుతాయని పేర్కొన్నారు. స్వతంత్రమైన ద్రవ్య మండలిని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని తెలిపారు. ఇప్పటికే ఇలాంటి ద్రవ్య మండలి 44 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ఈ అనిశ్చితిని తట్టుకునేలా చర్యలు తీసుకోగలదని ఆయన భరోసా ఇచ్చారు. ఆర్థికాంశాల్లో మన దేశం స్థిరత్వం సాధిస్తోందని చెప్పారు. గతంతో పోల్చితే ఇప్పుడు పరిస్థితులు బాగా మెరుగయ్యాయని, మనం ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఆశావహంగా ఉండొచ్చని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమావేశంలో నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ కూడా మాట్లాడారు. మైనింగ్, పెట్రోలియమ్, నేచురల్ గ్యాస్, నిర్మాణ రంగాల్లో మరిన్సి సంస్కరణలు రావలసిన అవసరముందని అమితాబ్ కాంత్ చెప్పారు. ద్రవ్య, ఆర్థిక విధానాల కన్నా స్థూల మూలధన కల్పనపై దృష్టి పెట్టాల్సి ఉందని సూచించారు. స్థూల మూలధన కల్పన 36 శాతం నుంచి 26 శాతానికి పడిపోయిందని, దానిని మళ్లీ 36 శాతానికి పెంచాల్సి ఉందని వివరించారు. -
హనీ.. సింగ్.. ఓ కథ..
- తలలంటుకుని జన్మించిన చిన్నారులు - ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబం - శస్త్ర చికిత్సకు ఢిల్లీ ఎయిమ్స్‌లో ఏర్పాట్లు - చేయూతనందించిన రైల్వే శాఖ సాక్షి, భువనేశ్వర్: తెలుగునాట తలలంటుకుని జన్మించిన వీణావాణిలను మరిచిపోకముందే.. ఒడిశాలోని కంధమాల్ జిల్లా ఫిరంగియా గ్రామంలోనూ వీరిలానే ఇద్దరు చిన్నారులు తలలంటుకుని నరకయాతన అనుభవిస్తున్నారు. వారే రెండున్నరేళ్ల హానీ, సింగ్. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు తమ బిడ్డల బాధలు చూడలేక తల్లిదండ్రులు విలవిల్లాడుతున్నారు. ఒకేసారి జన్మించిన సోదరులు విధి వైచిత్రితో ఇంతవరకు ఒకరి ముఖం ఒకరు చూడలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అందరి సాయంతో చిన్నారుల దయనీయ పరిస్థితి అందరి హృదయాల్ని కలిచివేసింది. చికిత్స కోసం తల్లిదండ్రులు కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రి వైద్యుల్ని సంప్రదించారు. అయితే చిన్నారులకు చికిత్స అందించడానికి స్థానికంగా వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. దీంతో కళాశాల సలహా మేరకు చిన్నారులతో కలసి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు బయలుదేరారు. వీరితోపాటు నువాపడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఆయుష్ వైద్యుడు, జాతీయ బాలల ఆరోగ్య కార్యక్రమం విభాగం నుంచి మరో అధికారి కూడా ఉన్నారు. కంధమాల్ కలెక్టర్ స్వయంగా ఎయిమ్స్ డీఎంఈటీ డైరెక్టర్ డాక్టర్ అశోక్ మహాపాత్రోతో ఫోన్లో మాట్లాడారు. ఎయిమ్స్ న్యూరోవిభాగం వీరికి శస్త్రచికిత్స నిర్వహిస్తుంది. ఎయిమ్స్‌లో చికిత్స విజయవంతమై అన్నదమ్ములిద్దరూ ఆడుతూపా డుతూ ఉండాలని అందరూ నిరీక్షిస్తున్నారు. అయితే వీరికి శస్త్రచికిత్స నిర్వహించే తేదీని ఎయిమ్స్ ఇంకా ఖరారు చేయలేదు. మరోవైపు రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో న్యూఢిల్లీ బయల్దేరిన హానీ, సింగ్‌లకు దారిపొడవునా ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. టాటా నగర్ రైల్వే స్టేషన్లో ప్రత్యేక వైద్య నిపుణుల బృందం చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. -
రాష్ట్ర ఇంటెలిజెన్స్‌కు రాజ్‌నాథ్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగిన ఐసిస్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఎన్కౌంటర్లో రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీస్ కీలక పాత్ర పోషించింది. రెండు నెలల నుంచి ఐసిస్ కూర్సన్ మాడ్యుల్‌ని రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. లక్నో–భూపాల్ ఉజ్జయిని ప్యాసింజర్ రైలులో పేలుడు అనంతరం కూర్సన్ మాడ్యుల్ ఉగ్రవాదులు బస్ ఎక్కి పారిపోయినట్లు కౌంటర్ సెల్ పోలీసులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్)కు ఈ సమాచారాన్ని రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఇవ్వడంతో వారు ఆపరేషన్ కూర్సన్ ప్రారంభించారు. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాది సైఫుల్లా మృతి చెందగా.. మిగతా ఇద్దరు ఫైజాన్, ఇమ్రాన్‌ను ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కీలక సమాచారం ఇచ్చి భారీ ఉగ్రముప్పు నుంచి కాపాడిన రాష్ట్ర పోలీస్ శాఖను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం అభినందించారు. ఈ మేరకు డీజీపీ అనురాగ్ శర్మకు కేంద్ర హోంశాఖ మంత్రి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. -
రాజీనామా చేయాలనిపిస్తోంది
సభలో వాజ్‌పేయి ఉంటే బాధపడేవారని అడ్వాణీ వ్యాఖ్య న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న తీరుపై బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ మళ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయడమే మంచిదనిపిస్తోందన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి ఈ సభలో ఉండి ఉంటే చాలా బాధపడేవారని చెప్పారు. గురువారం స్పీకర్ లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేయడంతో అసంతృప్తికి గురైన అడ్వాణీ.. ఈ విషయమై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో మాట్లాడారు. ఆమె ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన అడ్వాణీ మాటలను సావధానంగా ఆలకించారు. రాజ్‌నాథ్ జోక్యం చేసుకుని సభ సజావుగా జరిగేలా చూడాలని, స్పీకర్‌తో మాట్లాడాలని అడ్వాణీ కోరారు. కనీసం శుక్రవారమైనా కార్యకలాపాలు సజావుగా జరిపేందుకు ప్రయత్నించాలని కోరారు. గతంలో సభా సమావేశాల తీరుపై కేంద్ర మంత్రి అనంతకుమార్ వద్ద కూడా అడ్వాణీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అడ్వాణీకి కృతజ్ఞతలు: రాహుల్ బీజేపీలో ఉండి ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడుతున్నందుకు అడ్వాణీకి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. ‘అధికార పార్టీలో ఉంటూ ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడుతున్న అడ్వాణీకి కృతజ్ఞతలు’అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. మరోవైపు ‘అడ్వాణీ సొంత పార్టీపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ’ అని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అన్నారు. లోక్‌సభలో ప్రభుత్వం చెప్పాల్సింది చెప్పి.. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని, ‘విజయ్ చౌక్‌లో ఉరేసుకోవాలనిపిస్తోంద’ని మల్లికార్జున ఖర్గే లోక్‌సభ అధికారితో అన్నారు. అడ్వాణీ బాధ అర్థం చేసుకోగలను: స్పీకర్ అడ్వాణీ బాధను తాను అర్థం చేసుకోగలనని స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. పార్లమెంటు ఆరోగ్యకర చర్చలకు వేదిక కావాలని.. కానీ అలా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశాలు సజావుగా సాగకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, దీంతో అడ్వాణీయే కాదు దేశంలో ప్రతి వ్యక్తీ విచారిస్తున్నాడని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మండిపడ్డారు. నేడు ప్రధాని వద్దకు రాహుల్ బృందం ఉత్తరప్రదేశ్‌లో తాను చేపట్టిన ‘కిసాన్ యాత్ర’ సందర్భంగా రైతులు చేసిన డిమాండ్లను తెలియజేసేందుకు రాహుల్ గాంధీ నేతృత్వంలోని విపక్ష పార్టీల బృందం శుక్రవారం ఉదయం ప్రధానిని కలవనుంది. ఆ తర్వాత ఈ బృందం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలసి నోట్లరద్దు సమస్యలపై ఫిర్యాదు చేయనుంది. -
భగత్‌సింగ్ స్ఫూర్తితో ఉద్యమించాలి
– ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు స్టాలిన్ చిలుకూరు: విద్యార్థులు భగత్‌సింగ్ స్ఫూర్తితో ఉద్యమించాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు స్టాలిన్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి సందర్భంగా సెమినార్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 23 ఏళ్ల వయస్సులో భగత్‌సింగ్ స్వాంతత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించాడని అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందియన్నారు. అనంతరం భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, ఎంపీటీసీ పుట్టపాక శ్రీనివాస్ యాదవ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చేపూరి కొండల్, సహాయ కార్యదర్శి కొండూరి వెంకటేష్, జిల్లా, మండల విద్యార్థి సంఘం నాయకులు తమ్మనబోయిన నరేశ్, ఉపేందర్, యాదగిరి, రంగా, నవీన్, భారతీ, శైలజ, సావిత్రి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
నేడు దేశభక్తులు లేరు.. దేశముదుర్లే
షహీద్ భగత్‌సింగ్ పుస్తకావిష్కరణ సభలో ఎండ్లూరి రాజమహేంద్రవరం కల్చరల్: చెరసాలలే చంద్రశాలలుగా, అరదండాలే విరిదండలుగా నాటి త్యాగధనులు భావించారు.నేడు దేశభక్తులు లేరు.. దేశముదుర్లే కనిపిస్తున్నారు అని తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్యపీఠం డీన్ ఆచార్య ఎండ్లూరి సుధాకర్ అన్నారు. సర్ ఆర్ధర్ కాటన్ మెమోరియల్ సోషల్ సర్వీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశ్రాంతపేపర్ మిల్లు అధికారి ఎస్బీచౌదరి రచించిన‘షహీద్ భగత్‌సింగ్’పుస్తకావిష్కరణ సభలో ఎండ్లూరి ప్రసంగించారు. నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ముర్రు ముత్యాలునాయుడు ‘షహీద్ భగత్‌సింగ్ ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. భగత్ సింగ్, స్వామి వివేకానంద, ఆదిశంకరాచార్యులు జీవించినది కొద్ది కాలమే అయినా మానవాళికి వారు చేసిన సేవలు లెక్కపెట్టలేమన్నారు. గ్రంథకర్త ఎస్బీ చౌదరి మాట్లాడుతూ మంచి మనుషులే సమాజంలో నిజమైన మైనారిటీలన్నారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ అరిపిరాల నారాయణరావు మాట్లాడుతూ ఉరితీయకముందు భగత్‌సింగ్‌ను నాటి పోలీస్ అధికారులు చిత్రహింసలకు గురిచేశారన్నారు. స్వాగతవచనాలు పలికిన మహమ్మద్ఖాదర్ఖాన్ ‘జీవితాన్ని ప్రేమిస్తాం–మరణాన్ని ప్రేమిస్తాం, మేం మరణించి–ఎర్రపూల వనంలో పూలై పూస్తాం, ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం, నిప్పురవ్వల మీద నిదురిస్తాం’ అన్న కవితను చదివారు. వ్యక్తిత్వవికాసనిపుణుడు డాక్టర్ బీవీ పట్టాభిరామ్ గ్రంథకర్త కృషిని కొనియాడారు. కోడూరి రంగారావు, ఎర్రాప్రగడ రామకృష్ణ, పెరుమాళ్ల రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
పదేళ్ళు దాటితే..
రాయపూర్ః దేశంలో పొల్యూషన్ పై పోరాటం ప్రారంభమైంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన పద్ధతులతో కాలుష్యాన్ని నివారించేందుకు అక్కడి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అందులోభాగంగా తాజాగా పదేళ్ళు దాటిన ట్రక్కులు, బస్సులు, ఆటోలను బ్యాన్ చేసేందుకు ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓ సంవత్సరం పాటు గడువు ఇస్తున్నామని, ఆలోపు కొత్త వాహనం కొనే ప్రయత్నం చేసుకోవాలని వాహన యజమానులకు రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అంతేకాక 'ఈ' రిక్షాలను కొనేవారికి ప్రత్యేక ఆర్థిక సాయం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన అమల్లోకి తెస్తోంది. పన్నెండేళ్ళు దాటిన బస్సులు, పదేళ్ళు దాటిన ట్రక్కులు, ఆటో రిక్షాలు వంటి కమర్షియల్ వాహనాలు రోడ్లపై తిరగకుండా నిలిపివేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. గాలిలో కాలుష్యాన్ని తగ్గించి, వాతావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ముందడుగు వేయాలని ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్.. సీనియర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఛత్తీస్ ఘడ్ ఎన్విరాన్మెంట్ కంజర్వేషన్ బోర్డ్ ఛైర్ పర్సన్ అమన్ కుమార్ సింగ్ తెలిపారు. ఇప్పటినుంచీ పదేళ్ళు దాటిన ట్రక్కులు, ఆటోలు, పన్నెండేళ్ళు దాటిన బస్సులకు అనుమతులు ఇవ్వొద్దని, వాహన యజమానులు కొత్త వాహనాలు కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఓ సంవత్సరం పాటు గడువు ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన ఎనిమిదేళ్ళు దాటిన పాత వాహనాలకు రిజిస్ట్రేషన్లు కూడ చేయొద్దని ఆదేశించినట్లు తెలిపారు. 'ఈ' రిక్షాలను ప్రోత్సహించేందుకు గాను ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. వాతావరణ పరిరక్షణలో భాగంగా మరో నిర్ణయం తీసుకున్నామని, ఆన్ లైన్ మానిటరింగ్ తో పారిశ్రామిక కాలుష్య పరిమాణాన్ని అంచనా వేస్తామని సీఎం రమణ్ సింగ్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నెల్లో రెండుసార్లు పరిశ్రమల యాజమాన్యాలు ప్రవర్తిస్తే ఆయా యూనిట్లను మూసివేయిస్తామన్నారు. రాష్ట్ర రాజధాని రాయపూర్ లో పొల్యూషన్ తగ్గించేందుకు ఓ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. గత నెల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూ హెచ్ వో) వెల్లడించిన నివేదికల ప్రకారం అత్యధిక కాలుష్యంగల నగరాల్లో రాయపూర్ ఏడో స్థానంలో ఉందని, ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తో రాయపూర్ లో వచ్చే రెండేళ్ళలో కాలుష్యం నివారించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా రాయపూర్ లోని రైల్వే ట్రాక్ ప్రాంతాల్లో నివసించే వారికి ప్రధానమంత్రి ఉజ్వల్ పథకం ద్వారా డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు అందిస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేక సర్వే చేపడుతున్నట్లు ఓ అధికారి తెలిపారు. అలాగే రాజధానిలో ఈ సంవత్సరం సుమారు 30 లక్షల వరకూ మొక్కలు నాటేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని, గృహాల్లోని వ్యర్థాలకోసం సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు సైతం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. -
కోహ్లి, గేల్ క్రేజీ వీడియో!
న్యూఢిల్లీ: ఐపీఎల్-9లో టైటిల్ పోరుకు సిద్ధమైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) టీమ్ ఫుల్ జోష్ మీద ఉంది. బెంగళూరులో మంగళవారం రాత్రి జరిగిన తొలి క్వాలిఫయిర్ మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ జట్టుపై గెలిచిన తర్వాత ఆర్సీబీ ఆటగాళ్లు పండగ చేసుకున్నారు. ఆటపాటలతో చిందేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత పార్టీలో మునిగి తేలారు. ఈ సందర్భంగా ఆర్సీబీ ప్లేయర్స్ డాన్సులు చేశారు. ఈ వీడియోను ఆర్సీబీ బ్యాట్స్ మన్ మన్ దీప్ సింగ్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. 'సిక్సర' పిడుగులు క్రిస్ గేల్, విరాట్ కోహ్లి 'భాంగ్రా' నృత్యంతో సందడి చేశారు. ముందుగా గేల్ తో మన్ దీప్ భాంగ్రా స్టెప్పులు వేయించాడు. తర్వాత వీరితో కోహ్లి జత కలిశాడు. ముగ్గురూ హుషారుగా డాన్స్ చేశారు. చివర్లో మన్ దీప్, గేల్ మీసాలు మెలేసి, తొడగొట్టారు. ఈ వీడియో ఆర్సీబీ ట్విటర్ పేజీలో కూడా పోస్ట్ చేశారు. వీడియోను యూట్యూబ్ లో అప్పుడే లక్ష మందిపైనే వీక్షించడం విశేషం. -
దిగ్విజయ్ సింగ్ కు కలిసొచ్చింది...!
మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కు భారీగా కలిసొచ్చింది. వేతనాలు పెంచాలంటూ గతంలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు చేసిన డిమాండ్ పై ప్రభుత్వం స్పందించింది. వేతనాలను పెంచుతూ ప్రకటన వెలువరించింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కు కూడ ఏడు రెట్లు జీతం పెరిగింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వేతనాలు పెంపుపై శనివారం ప్రకటన చేశారు. వేతనాలను పెంచాలంటూ బిజెపి, కాంగ్రెస్ చట్టసభ సభ్యుల డిమాండ్ కు శివరాజ్ సింగ్ ప్రభుత్వం ఈ సంవత్సరం ఏప్రిల్ మొదటివారంలోనే ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు, స్పీకర్, ఎమ్మెల్యేలకు జీతం పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ తాజా నిర్ణయంతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కు కూడ భారీగా ప్రయోజనం కలిగింది. తాజా నిర్ణయంతో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ జీతం కూడ ఏడు రెట్టు పెరిగింది. దీంతో ప్రస్తుతం 26,000 రూపాయలు జీతాన్ని అందుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి ఇకపై నెలకు 1.7 లక్షలు పొందే అవకాశం ఉంది. -
సరైన రీతిలో స్పందిస్తాయని ఆశీస్తున్నా
-
మొదటి ప్రపంచ యుద్ధంజ్ఞాపకాల ప్రదర్శన ప్రారంభం
న్యూఢిల్లీ: సుమారు ఏడు లక్షల మంది భారత సైనికులు పాల్గొన్న మొదటి ప్రపంచయుద్ధంపై సోమవారం నగరంలో ప్రదర్శన ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరుగనున్న ఈ ప్రదర్శనను సాంస్కృతిక శాఖ కార్యదర్శి రవీందర్ సింగ్ ప్రారంభించారు. వందేళ్ల కిందట జరిగిన ఈ ప్రపంచ యుద్ధాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ఫొటోగ్రాఫ్‌లు, వీడియోలతో పాటు భారత జవాన్లు ఉపయోగించిన యూనిఫాంలు, కోట్లు, ఫ్లాస్క్‌లు, మ్యాప్ కేస్లు, కత్తులు, సిగరెట్ ప్యాక్‌లు, బిస్కెట్లు ఇతర తినుబండారాలను ప్యాక్చేసిన కార్డ్‌బోర్డులు, ప్రథమ చికిత్స కిట్ బాక్స్‌లు, బ్యాడ్జీలు తదితర వస్తువులను ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా సింగ్ మాట్లాడుతూ.. 1914-18 మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు, యుద్ధం ఎందువల్ల ప్రారంభమైంది.. అప్పుడు సైనికుల మానసిక స్థితి ఎలా ఉంది.. తదితర విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ ప్రదర్శనను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. త్వరలో ఈ ఎగ్జిబిషన్‌ను ఫ్రాన్స్‌తో పాటు పలు దేశాల్లో ప్రదర్శించనున్నట్లు వివరించారు. కాగా, ఎగ్జిబిషన్లో ప్రదర్శించేందుకు యుద్ధం నాటి ఫొటోలను ఇంపీరియల్ వార్ మ్యూజియం, బ్రిటిష్ లైబ్రరీ, లండన్, ఫ్రెంచ్ మిలటరీ లైబ్రరీ, ఫ్లండర్స్ మ్యూజియం, బెల్జియం వంటి ప్రాంతాలనుంచి తెప్పించినట్లు సింగ్ చెప్పారు. అలాగే అప్పటి భారత సైనికులు యుద్ధ రంగంలో చిత్రీకరించిన నిశ్శబ్ద చిత్రాలు, సౌండ్రికార్డింగ్లను సైతం ఇందులో పొందుపరిచినట్లు వివరించారు. ఈ సందర్భంగా 18వ సైనికుల రెజిమెంట్‌లో పనిచేసిన పరమవీర్ చక్ర అవార్డు గ్రహీత సుబేదార్ యోగేందర్ సింగ్ యాదవ్ సహా పలువురు సైనికుల నుంచి వివరాలు సేకరించి రోలీబుక్స్ సంస్థ ప్రచురించిన పుస్తకాన్ని సింగ్‌కు ఆ సంస్థకు చెందిన ప్రమోద్‌కుమార్ అందజేశారు. కాగా, ఈ ఎగ్జిబిషన్‌ను రోలీబుక్స్, ఫ్రెంచ్ ఎంబసీ, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. కార్యక్రమంలో ఫ్రాన్స్ అంబాసిడర్ ఫ్రాంకోయిస్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ అన్వేషణ
= జిల్లాల వారీగా సమావేశాలు = 6న రాష్ట్రానికి దిగ్విజయ్ = ఉడిపి, దక్షిణ కన్నడ, చిక్కమగళూరు జిల్లాల నేతలతో సమావేశం సాక్షి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో గెలుపు గుర్రాల కోసం వేట మొదలైంది. ఎన్నికల్లో కచ్చితంగా గెలిచే అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఆ పార్టీ రాష్ట్ర విభాగం కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా బెంగళూరులోని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఆది వారం జిల్లాల వారీగా వివిధ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యనేతలతో కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశమయ్యారు. మొదటిరోజు ఉడిపి, దక్షిణ కన్నడ, చిక్కమగళూరు, మైసూరు, మం డ్య, బీదర్, రాయచూరు, కొప్పళ, బళ్లారి జిల్లా ఎమ్మెల్యేలు, గత పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో పోటీచేసిన పరాజితులు, పార్టీ జిల్లాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి జిల్లాకు అరగంట సమయం కేటాయించారు. సవ ూవేశంలో పాల్గొన్న ప్రతి నాయకుడి అభిప్రాయాన్ని విన్నారు. తమ జిల్లాల్లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడాలని ఎవరెవరు భావిస్తున్నారు, అందులో గెలుపు అవకాశాలు ఎవ రికున్నాయి అన్న విషయాలపై ఇరువురు నాయకులు కూపీ లాగారు. చర్చకు వచ్చిన ప్రతి విషయాన్ని ఇరువురు నోట్ చేసుకున్నారు. అనంతరం అన్ని జిల్లాల నాయకులను ఒకచోట చేర్చి పరమేశ్వర్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. సిద్ధరామయ్య , పరమేశ్వర్, మల్లికార్జున ఖర్గే గ్రూపులుగా విడిపోయారంటూ అటు సొంత పార్టీలోనూ ఇటు విపక్షాల్లోనూ విమర్శలు వస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఇకపై పార్టీలో గ్రూపు రాజకీయాలు జరపకూడదన్నారు. పార్టీ హైకవ ూండ్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎవరికి టికెట్టు ఇచ్చినా మిగిలిన నాయకులు సదరు నాయకుడి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. పార్టీకి వ్యతిరేకంగా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ఈ సమీక్షసమావేశం సోమవారం) కూడా కొనసాగనుంది. జనవరి 6న రాష్ట్రానికి దిగ్విజయ్.... రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ జనవరి 6న రాష్ట్రానికి రానున్నారు. ఆదేరోజున ఆయన అధ్యక్షతన పార్టీ సమన్వయ సమితి సభ జరగనున్నట్లు సమాచారం. -
సీఐ విజయభాస్కర్‌రెడ్డి సస్పెన్షన్
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: ప్రొద్దుటూరు వన్‌టౌన్ సీఐగా గత ఏడాది విధులు నిర్వహించిన విజయభాస్కర్‌రెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రొద్దుటూరులో విధులు నిర్వహిస్తున్న సమయంలో సీఐపై వచ్చిన ఆరోపణలపై అనంతపురం అడిషనల్ ఎస్పీ సింగ్ ప్రొద్దుటూరుకు వచ్చి విచారణ చేశారు. ఓ మహిళను వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తే వేధింపులు చేస్తున్న వ్యక్తితో సీఐ కుమ్మక్కై ఫిర్యాదు చేసిన మహిళను బెదిరించారన్న విషయం ఆ మహిళ అడిషనల్ ఎస్పీ ఎదుట కూడా చెప్పినట్లు తెలిసింది. అలాగే రూ.33లక్షల స్థలం పంచాయతీలో తలదూర్చి బాధితులను బెదిరించినట్లు కూడా సీఐపై ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపై అడిషనల్ ఎస్పీ సాక్షులను విచారించారు. ఈ నేపథ్యంలో సీఐని సస్పెండ్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం విజయభాస్కరరెడ్డి కర్నూలు జిల్లా సీసీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నారు. -
రాజకీయ లబ్ధి కోసమే వి‘భజన’
తిరుపతి, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా లబ్ధి పొందడం కోసం రాష్ట్రాన్ని విభజించేందుకు కుట్రలు పన్నుతోందని సమైక్యవాదులు మండి పడుతున్నారు. దిగ్విజయ్, ఆంటోనీ వంటి వృద్ధుల సలహాలు తీసుకున్నంత కాలం కాంగ్రెస్ బాగుపడదని శాపనార్థాలు పెడుతున్నారు. ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్ర సమైక్యత కోసం తుదికంటా పోరాడతామని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ బుధవారం జిల్లాలో నిరసన కార్యక్రమాలు యధావిధిగా కొనసాగాయి. తిరుపతి తుడా సర్కిల్లో వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రిలే దీక్షల్లో 50వ డివిజన్ పరిధిలోని ప్రశాంతినగర్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి దీక్షా శిబిరానికి వచ్చి వారికి సంఘీభావంగా కాసేపు శిబిరంలో కూర్చున్నారు. టౌన్ క ్లబ్ కూడలిలో మబ్బు చెంగారెడ్డి ఆధ్వర్యంలో సమైక్యవాదులు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. పలమనేరులో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షల్లో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి పాల్గొని విభజన విషయంలో కాంగ్రెస్ కుట్రలను వివరించారు. ఆయన కొబ్బరి బోండాంలు అమ్మి నిరసన తెలిపారు. సమైక్య రాష్ట్రాన్ని కాపాడు కునేందుకు తమ పార్టీ వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో తుదికంటా పోరాడుతుందన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మదనపల్లెలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టి మల్లికార్జున సర్కిల్లో సోనియాగాంధీ దిష్టి బొమ్మను తగులబెట్టారు. ఎన్జీవో, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. పలమనేరులో టీడీపీ, కాంగ్రెస్ దీక్షలు కొనసాగాయి. శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రిలే దీక్షలు కొనసాగించారు. -
నాటకాలు చేసె వ్యక్తి దేశాన్ని సమర్ధంగా నడపగలరా?