
కోహ్లి, గేల్ క్రేజీ వీడియో!
న్యూఢిల్లీ: ఐపీఎల్-9లో టైటిల్ పోరుకు సిద్ధమైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) టీమ్ ఫుల్ జోష్ మీద ఉంది. బెంగళూరులో మంగళవారం రాత్రి జరిగిన తొలి క్వాలిఫయిర్ మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ జట్టుపై గెలిచిన తర్వాత ఆర్సీబీ ఆటగాళ్లు పండగ చేసుకున్నారు. ఆటపాటలతో చిందేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత పార్టీలో మునిగి తేలారు. ఈ సందర్భంగా ఆర్సీబీ ప్లేయర్స్ డాన్సులు చేశారు. ఈ వీడియోను ఆర్సీబీ బ్యాట్స్ మన్ మన్ దీప్ సింగ్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశాడు.
'సిక్సర' పిడుగులు క్రిస్ గేల్, విరాట్ కోహ్లి 'భాంగ్రా' నృత్యంతో సందడి చేశారు. ముందుగా గేల్ తో మన్ దీప్ భాంగ్రా స్టెప్పులు వేయించాడు. తర్వాత వీరితో కోహ్లి జత కలిశాడు. ముగ్గురూ హుషారుగా డాన్స్ చేశారు. చివర్లో మన్ దీప్, గేల్ మీసాలు మెలేసి, తొడగొట్టారు. ఈ వీడియో ఆర్సీబీ ట్విటర్ పేజీలో కూడా పోస్ట్ చేశారు. వీడియోను యూట్యూబ్ లో అప్పుడే లక్ష మందిపైనే వీక్షించడం విశేషం.