T20 World Cup 2024: భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. సందడి చేసిన క్రిస్‌ గేల్‌ | T20 World Cup 2024 IND VS PAK: Chris Gayle Wearing A Suit Colored With Indian Flag On One Side And Pakistani Flag On The Other | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. సందడి చేసిన క్రిస్‌ గేల్‌

Published Sun, Jun 9 2024 8:51 PM | Last Updated on Sun, Jun 9 2024 8:51 PM

T20 World Cup 2024 IND VS PAK: Chris Gayle Wearing A Suit Colored With Indian Flag On One Side And Pakistani Flag On The Other

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా న్యూయార్క్‌ వేదికగా ఇవాళ (జూన్‌ 9) భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. తేలికపాటి జల్లులు, ఔట్‌ ఫీల్డ్‌ తడిగా ఉన్న కారణంగా టాస్‌ అరగంట ఆలస్యమైంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ రాత్రి 8:50 గంటలకు ప్రారంభమైంది.

ఈ మ్యాచ్‌లో భారత్‌ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా బరిలోకి దించగా.. పాక్‌ గత మ్యాచ్‌లో ఆడిన జట్టులో ఓ మార్పు చేసింది. పాక్‌.. వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ఆజం ఖాన్‌కు పక్కన పెట్టి ఇమాద్‌ వసీంను తుది జట్టులోకి తీసుకుంది.

సందడి చేసిన క్రిస్‌ గేల్‌..
మ్యాచ్‌ ప్రారంభానికి ముందు విండీస్‌ క్రికెట్‌ దిగ్గజం క్రిస్‌ గేల్‌ న్యూయార్క్‌ మైదానంలో సందడి చేశాడు. ఈ సందర్భంగా గేల్‌ ధరించిన తెలుపు రంగు సూట్‌ ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది. గేల్‌ ధరించిన సూట్‌పై (రెండు చేతులపై) భారత్‌, పాకిస్తాన్‌ జెండా రంగులు అందరినీ ఆకట్టుకున్నాయి. భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌ ప్రత్యేకత గుర్తుగా గేల్‌ ఈ తరహా డ్రస్‌ ధరించినట్లు తెలుస్తుంది. గేల్‌ తన సూట్‌పై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రిషబ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, చహల్‌ తదితరుల ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నాడు. గేల్‌.. భారత ఆటగాళ్లతో సందడి చేసిన దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి.

తుది జట్లు..

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్‌కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్

పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్‌కీపర్‌), బాబర్ ఆజం(కెప్టెన్‌), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement