ఆ పాత్ర చేయడం కోసం వారిని గమనించా: బడ్డీ హీరోయిన్ | Buddy Telugu Movie Heroine Prisha Singh Comments On Tollywood | Sakshi
Sakshi News home page

Prisha Singh: టాలీవుడ్‌లో న‌టించ‌డం మంచి అనుభవం: అల్లు శిరీష్ హీరోయిన్

Published Tue, Jul 23 2024 6:41 PM | Last Updated on Tue, Jul 23 2024 7:11 PM

Tollywood Movie Buddy Heroine Prsiha Singh Comments On Tollywood

అల్లు శిరీష్ హీరోగా నటించిన తాజా చిత్రం బడ్డీ.  శామ్ ఆంటోన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రంతో ప్రిషా సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్‌ కాగా.. అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది చిత్రబృందం. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రిషా సింగ్ బడ్డీ సినిమాలో అవకాశం రావడంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ప్రిషా సింగ్ మాట్లాడుతూ .. 'నా ఫొటోల‌ను చూసి ఆడిష‌న్‌కు పిలిచారు. సెల‌క్ట్ అయ్యా. అయితే పాత్ర‌లోని వేరియేష‌న్స్ నేను చేయ‌గ‌ల‌నా అని కూడా ఆలోచించా. బ‌డ్డీ చిత్రంలో నేను ఎయిర్ హోస్టెస్ పాత్ర‌లో క‌నిపిస్తా. ఆ పాత్ర కోసం చాలా మంది ఎయిర్ హోస్టెస్‌లను గ‌మ‌నించా. వారెలా న‌డుస్తారు.. ఎలా మాట్లాడుతారు.. ఇత‌రుల‌తో ఎలా ప్ర‌వ‌ర్తిస్తారు? వంటి విష‌యాల‌ను దగ్గరగా గ‌మ‌నించా. టాలీవుడ్ న‌టించ‌టం న‌టిగా నాకొక మంచి అనుభవం. ఇంకా వైవిధ్య‌మైన పాత్ర‌లు చేయ‌టానికి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నా' అని అన్నారు.

అంతే కాకుండా తనకు వైల్డ్ లైఫ్ ఫొటోగ్ర‌ఫీ అంటే అభిరుచి ఎక్కువ‌ని చెబుతోంది. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో వాటికి సంబంధించిన ఫొటోల‌ను షేర్ చేసింది. వైల్డ్ లైఫ్ అంటే కేవ‌లం జంతువుల‌ను, చెట్ల‌ ఫొటోల‌ను కెమెరాల్లో బంధించ‌టం మాత్ర‌మే కాదని అంటోంది. వాటి స‌హ‌జ‌మైన భావోద్వేగాల‌ను కమెరాల్లో బంధించ‌ట‌మేనని వెల్లడించింది. మన కెమెరాల్లో బంధించే ప్రతి విషయానికి బలమైన కథ ఉంటుందని.. న‌ట‌న ప‌రంగానూ ఇది నన్ను మెరుగుప‌రుచుకునేలా చేసిందని తెలిపింది. అందుకే కెమెరా ముందు ధైర్యంగా న‌టిస్తున్నా అని ప్రిషా సింగ్ చెప్పుకొచ్చింది. కాగా.. బడ్డీ చిత్రం ఆగస్టు 2న థియేటర్లలో సందడి చేయనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement