
డెహ్రాడున్: ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చార్‌ధామ్ దేవస్థానం బోర్డును రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ముఖ్యమంత్రి పుస్కర్ సింగ్ ధామి సోమవారం ఈ విషయాన్ని ప్రకటించారు. దేశస్థానం బోర్డుకు సంబంధించిన అన్ని అంశాలను అధ్యయనం చేస్తామని తెలిపారు.
అప్పటివరకు చార్‌ధామ్ దేవస్థానం బోర్డు చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించామని సీఎం ధామి పేర్కొన్నారు. ఈ బోర్డును 2019లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బోర్డును రద్దు చేయాలని పెద్ద ఎత్తున పూజారులు డిమాండ్ చేస్తున్నారు. ఆలయాల సాంప్రదాయ హక్కులకు వ్యతిరేకంగా బోర్డు ఉందని పూజారులు ఆరోపలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో దేవస్థానం బోర్డుపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం ధామి రద్దు నిర్ణయం తీసుకున్నారు. మనోహర్ కంట్ దయానీ నేతృత్వంలోని బృందం నివేదికను తయారు చేసింది. దేవస్థానం బోర్డు కింద 51 ఆలయాల నిర్వహణ ఉండగా.. ప్రముఖ కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రీ ఆలయాలు కూడా బోర్డు పరిధిలోనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment