డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ ముఖ‍్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిరోహించనున్నారనే అనేక అంచనాల మధ్య ఈ ఉత్కంఠకు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ తీరత్ సింగ్ రావత్ ఎంపికయ్యారు. త్రివేంద్ర సింగ్ రావత్ మంగళవారం రాజీనామా చేయడంతో బుధవారం నాటి బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సాయంత్రం తీరత్ సింగ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ సందర్భంగా తీరత్ సింగ్ రావత్ మాట్లాడుతూ తాను చిన్న గ్రామం నుండి వచ్చిన పార్టీ కార్యకర్తగా తాను ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదంటూ సంతోషం వ్యక్తం చేశారు. తనపై నమ్మకాన్ని ఉంచిన ప్రధాని, హోం మంత్రి పార్టీ చీఫ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశలను నెరవేర్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామనీ, గత నాలుగేళ్లుగా చేపట్టిన కృషిని ముందుకు తీసుకెళతామంటూ హామీ ఇచ్చారు.
అయితే సీఎం రేసులో బీజేపీ ఎమ్మెల్యే ధన్ సింగ్ రావత్, బీజేపీ సీనియర్ నేత ఎంపీ అజయ్‌భట్, అనిల్ బలూని పేర్లు కూడా బాగా వినిపించిన సంగతి తెలిసిందే. మరోవైపు, కుమాన్ ప్రాంతం నుంచి ఒకరిని డిప్యూటీ సీఎంగా నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. (ఉత్తరాఖండ్ సీఎం రాజీనామా)
Comments
Please login to add a commentAdd a comment