char dham
-
రేపటి నుంచి కేదార్నాథ్ ఆలయం మూసివేత
చార్‌ధామ్‌గా ప్రసిద్ది చెందిన హిందూ పుణ్యక్షేత్రాలైన గంగోత్రి, యుమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల తలుపులు మూతపడనున్నాయి. చలికాలం రావడంతో అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నాలుగు ఆలయాలను ఆరు నెలలపాటు మూసివేయానున్నారు. ఆ తర్వాత మళ్లీ వేసవికాలంలో చార్ధామ్ యాత్ర కొనసాగుతుంది.కాగా ఈ ఏడాది మే 10వ తేదీన ప్రారంభం అయిన చార్ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకోగా.. ఈ నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను శనివారం మధ్యాహ్నం 12.14 గంటలకు మూసివేశారు. చార్‌ధామ్‌లో కీలకమైన కేదార్నాథ్ ఆలయాన్ని ఈ నెల 3వ తేదీన ఉదయం 8.30 గంటలకు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు యమునోత్రి ధామ్ తలుపులు మూసివేసేందుకు కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక విష్ణువు కొలువైన బద్రీనాథ్ ధామ్‌ను నవంబర్ 17వ తేదీన రాత్రి 9.07 గంటలకు మూసివేయనున్నారు. -
గతంలో బద్రీనాథ్ నడక మార్గం ఎలా ఉండేది?
దేశంలో చార్ధామ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. యాత్రికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది. చార్ధామ్లలో ఒకటైన బద్రీనాథ్‌కు నడకమార్గం గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఉత్తరాఖండ్‌లోని యోగా సిటీ రిషికేశ్ పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరొందింది. దీనిని తీర్థయాత్రల ప్రధాన ద్వారం అని కూడా అంటారు. రిషికేశ్ ఆలయంతో పాటు ఇక్కడి ఘాట్ భక్తులను అమితంగా ఆకర్షిస్తుంటాయి. కొన్నేళ్ల క్రితం రిషేకేశ్‌ను సందర్శించిన తర్వాతే చార్‌ధామ్‌కు వెళ్లేవారు. రిషికేశ్కు ప్రతి సంవత్సరం వేలాది మంది వస్తుంటారు. అనేక పురాతన, గుర్తింపు పొందిన ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం రిషికేశ్‌లోని త్రివేణి ఘాట్ బద్రీనాథ్ ధామ్‌కు నడక మార్గంగా ఉండేది.రిషికేశ్‌లోని సోమేశ్వర్ మహాదేవ్ ఆలయ పూజారి మహంత్ రామేశ్వర్ గిరి మీడియాకు ఈ ప్రాంతపు ప్రత్యేకతలను తెలియజేశారు. ఇక్కడ మూడు పవిత్ర నదుల త్రివేణీ సంగమం ఉందన్నారు. ఇక్కడున్న మార్కెట్ రిషికేశ్‌లోని ప్రధాన మార్కెట్ అని, ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఏదో ఒక వస్తువును కొనుగోలు చేసి, తమతో పాటు తీసుకువెళతారన్నారు. ఈ మార్కెట్ కొన్నాళ్ల క్రితం బద్రీనాథ్‌కు నడక మార్గంగా ఉండేదని తెలిపారు. దీంతో ఈ రహదారి మార్గంలో అనేక దుకాణాలు, రెస్టారెంట్లు, భవనాలు నిర్మితమయ్యాయన్నారు.కొన్నాళ్ల క్రితం రిషికేశ్ అడవిలా ఉండేదని రామేశ్వర్ గిరి తెలిపారు. నాడు ఇక్కడ ఋషులు కఠోర తపస్సు చేసేవారన్నారు. ఇక్కడికి వచ్చే యాత్రికులంతా త్రివేణిలో స్నానమాచరించిన తర్వాతనే చార్ధామ్ యాత్రకు బయలుదేరేవారని పేర్కొన్నారు. -
పెల్లుబికిన భక్తి ప్రవాహం.. చార్ధామ్ యాత్రలో భక్తుల రద్దీ!
హిందువులు చార్ధామ్ యాత్రను ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. తమ జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్ర చేయాలనుకుంటారు. ప్రతి సంవత్సరం చార్ధామ్ యాత్రకు భక్తులు తరలివస్తుంటారు. చార్ధామ్ యాత్ర అంటే కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రిలను చుట్టిరావడం. ఈ చార్ధామ్ యాత్రతో పాటు ఇతర ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు కూడా 2023లో భక్తుల తాకిడి ఎదురయ్యింది. 2023లో ఏ ధామాన్ని సందర్శించడానికి ఎంత మంది భక్తులు వచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరం 50 లక్షల మందికి పైగా భక్తులు చార్ధామ్ యాత్రచేశారు. 2021లో సుమారు 5 లక్షల 18 వేల మంది భక్తులు చార్ ధామ్ యాత్ర చేశారు. 2022లో ఈ సంఖ్య 46 లక్షల 27 వేలు దాటింది. 2023లో అక్టోబర్ 16 నాటికి ఈ సంఖ్య 50 లక్షలు దాటడం విశేషం. కేదార్నాథ్ ధామ్ ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ధామ్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి హెలికాప్టర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. 2023 లో 19 లక్షల 61 వేల మందికి పైగా భక్తులు కేదార్నాథ్ ధామ్‌కు తీర్థయాత్ర చేశారు. 2023లో కేదార్నాథ్ తలుపులు ఏప్రిల్ 25న తెరుచుకున్నాయి. ఈ యాత్ర నవంబర్ 15న ముగిసింది. బద్రీనాథ్ ధామ్ విష్ణు భక్తులు బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించడాన్ని ఒక వరంగా భావిస్తారు. ఈ సంవత్సరం బద్రీనాథ్ యాత్ర ఏప్రిల్ 27న ప్రారంభమై, నవంబర్ 15న ముగిసింది. ఈ ఏడాది బద్రీనాథ్‌కు వచ్చిన 18 లక్షల 34 వేల మందికి పైగా భక్తులు బద్రీ విశాల్ స్వామిని దర్శించుకున్నారు. గంగోత్రి ఈ ఏడాది 9 లక్షల 5 వేల మందికి పైగా భక్తులు గంగోత్రి యాత్రను పూర్తి చేసుకున్నారు. 2023లో గంగోత్రి యాత్ర ఏప్రిల్ 22 నుండి ప్రారంభమై, నవంబర్ 14న ముగిసింది. ప్రతి సంవత్సరం గంగోత్రి యాత్ర ప్రారంభం కాగానే గంగమ్మ దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు ఇక్కడికు తరలి వస్తుంటారు. యమునోత్రి ఈ ఏడాది యమునోత్రిని 7 లక్షల 35 వేల మందికి పైగా భక్తులు సందర్శించారు. యమునోత్రి యాత్ర 2023, ఏప్రిల్ 22న న ప్రారంభమై నవంబర్ 15న ముగిసింది. యమునోత్రిని యమునా దేవి నివాసంగా చెబుతారు. ఇక్కడ యమునా దేవి ఆలయం కూడా ఉంది. అమర్నాథ్ చార్ధామ్తో పాటు ఇతర యాత్రా స్థలాల విషయానికి వస్తే 2023లో దాదాపు 4 లక్షల 40 వేల మంది భక్తులు అమర్నాథ్ను దర్శించుకున్నారు. ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్ర జూలై ఒకటి నుండి ప్రారంభమై ఆగస్టు 31న ముగిసింది. అమర్నాథ్ ప్రయాణం ఎంతో కష్టతరమైనప్పటికీ భక్తులు ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో ఇక్కడికి తరలివస్తుంటారు హేమకుండ్ సాహిబ్ యాత్ర హేమకుండ్ సాహిబ్ సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం హేమకుండ్ సాహిబ్ యాత్ర మే 20 నుంచి నుండి అక్టోబర్ 11 వరకు కొనసాగింది. ప్రతి సంవత్సరం హేమకుండ్ సాహిబ్ యాత్రకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. 2023లో దాదాపు 2 లక్షల మంది హేమకుండ్ సాహిబ్‌ను సందర్శించుకున్నారు. ఇది కూడా చదవండి: అలరిస్తున్న ఉల్లి, ఇసుకల శాంతాక్లాజ్ శిల్పం! -
120 గంటలుగా సొరంగంలోనే.. కార్మికుల ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోసొరంగం కూలిన ఘటనలో బాధితుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నది. ప్రమాదం జరిగి అయిదు రోజులు కావొస్తుంది. గత 120 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం 40 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు ఒక్క కార్మికుడు కూడా సురక్షితంగా బయటకు రాలేకపోయారు. దీంతో సొరంగం లోపల బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న కార్మికుల ఆరోగ్యం, క్షేమంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు 24 మీటర్ల వరకు శిథిలాలను రక్షణ బృందాలు తొలగించారు. నాలుగు పైపుల ద్వారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు ఆక్సిజన్, నీరు, ఆహారం అందిస్తున్నారు. థాయ్‌లాండ్, నార్వేకు చెందిన ఎలైట్ రెస్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. వీటిలో 2018లో థాయ్‌లాండ్‌లోని గుహలో చిక్కుకున్న పిల్లలను విజయవంతంగా రక్షించిన రెస్యూటీమ్‌లు కూడా ఉన్నాయి. 50 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న పైపులను శిథిలా గుండా సొరంగంలోకి పంపిస్తున్నారు. దీనిద్వారా కార్మికులను ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కూలిపోయిన సొరంగం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్యాలిసౌర్ విమానాశ్రయానికి ‘అమెరికన్ ఆగర్’ మిషన్ (విడదీసిన భాగాలు) చేరుకుంది. కూలిపోయిన సొరంగం నుంచి శిథాలల గుండా మార్గాన్ని తవ్వడానికి ఈ యంత్రం ఉపయోగించనున్నారు. ఇది గంటకు 5 మీటర్ల బండరాళ్లను తొలగిస్తుంది,. కాగా నవంబర్ 12న (ఆదివారం) ఉదయం ఉత్తరకాశీలో చార్ధామ్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సిల్క్యారా టన్నెల్లో కొంతభాగం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈఘటనలో సొరంగం పనిచేస్తున్న 40 మంది కార్మికులు శిథిలాల మధ్య చిక్కుకుపోయారు. సొరంగం ప్రవేశ ద్వారం నుంచి 200 మీటర్ల దూరంలో వారంతా చిక్కుకుపోయారు. శిథిలాలు ముందు 50 మీటర్ల వరకు పడిపోయాయి. గత నాలుగు రోజులుగా వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు సొరంగంలో చిక్కుక్ను కార్మికుల ఆరోగ్యంపై వైద్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి మనుగడ, భవిష్యత్తుపై ప్రశ్నార్థకంగా మారినట్లు చెబతుఉన్నారు. సుదీర్ఘకాలంగా నిర్బంధంలో ఉండటం వల్ల తీవ్ర భయాందోళనకు గురవుతారని మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు వంటి పరిసర పరిస్థితులు వారి శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని తెలిపారు. భూగర్భంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల అపస్మారక స్థితికి చేరుకోవచ్చని పేర్కొన్నారు. నిర్మాణంలోని వస్తువులు తమపై పడటం వల్ల తీవ్రమైన గాయాలు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. వారిని బయటకు తీశాక కూడా సమగ్ర పునరావాసం అవసరమని పేర్కొన్నారు. -
4 క్షేత్రాలు.. 40 కష్టాలు
చార్ధామ్ యాత్రలో భాగంగా యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ దర్శనాల కోసం భక్తులు పోటెత్తుతున్నారు. కరోనా కారణంగా రెండేళ్ల పాటు దర్శనాలు రద్దు కావడంతో ఇప్పుడు పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. కొండదారుల్లో అత్యంత క్లిషమైన ప్రయాణం సాగించడమే కాకుండా మంచు, చలి, ప్రకృతి పరంగా అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. మధ్యాహ్నం పూట కేవలం 5 డిగ్రీల ఉష్ఞొగ్రత, రాత్రిపూట మైనస్ డిగ్రీల ఉష్ఞొగ్రతలు నమోదు కావడంతో భక్తులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. గత రెండు రోజులుగా 39 భక్తులు మృతి చెందడమే ఇందుకు ఉదాహరణ. ఈ పుణ్యక్షేత్రాల ప్రయాణంలో వసతి సౌకర్యాలు లేకపోతే ఆ కష్టాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. సముద్ర మట్టానికి 3 కిలోమీటర్ల కంటే ఎత్తున క్షేత్రాలు ఉండటంతో తక్కువ స్థాయిలో ఆక్సిజన్ లభ్యమవుతుంది. దాంతో గతంలో కోవిడ్ వచ్చిన భక్తులు ఆకస్మికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ యాత్రలకు రోజూ 20వేల మంది పైగా భక్తులు వస్తుండటంతో ఏర్పాట్లకు క్లిష్టంగా మారింది. కొండలపై సౌకర్యం ఉన్నది కేవలం 5వేల మందికే కావడంతో భారీ సంఖ్యలో వస్తున్న భక్తులకు ఏర్పాట్లు చేయలేమంటున్నారు అధికారులు. అత్యంత క్లిషమైన ప్రయాణం కేదార్నాథ్ ఈ యాత్రల్లో కేదార్నాథ్ అత్యంత క్లిషమైంది. గౌరీఖుండ్ నుంచి కేదార్ నాథ్‌కు 18 కి.మీ ట్రెక్కింగ్ సౌకర్యం ఉన్నా, ట్రెక్కింగ్ సమయంలో హైబీపీ, గుండెపోటు సమస్యలు వస్తున్నాయి. పరిస్థితి తీవ్రం కావడంతో 132 మంది డాక్టర్లను ఉత్తరాఖాండ్ ప్రభుత్వం రంగంలోకి దించింది. అదే సమయంలో ముందస్తు ఏర్పాట్లు లేనిదే చార్ధామ్ యాత్రకు రావద్దని ప్రభుత్వం అంటోంది. సరిపడా అందుబాటులో లేని రవాణా సౌకర్యాలతో పాటు, హరిద్వార్-రుషికేష్ మధ్య వాహనాలు భారీగా నిలిచిపోవడం అధికార యంత్రాంగానికి సవాల్‌గా మారింది. రుద్ర ప్రయాగ నుంచి అన్ని రూట్లలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండటంతో అధికారులకు తలనొప్పిగా మారింది. -
ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. చార్ధామ్ బోర్డు రద్దు
డెహ్రాడున్: ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చార్ధామ్ దేవస్థానం బోర్డును రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ముఖ్యమంత్రి పుస్కర్ సింగ్ ధామి సోమవారం ఈ విషయాన్ని ప్రకటించారు. దేశస్థానం బోర్డుకు సంబంధించిన అన్ని అంశాలను అధ్యయనం చేస్తామని తెలిపారు. అప్పటివరకు చార్ధామ్ దేవస్థానం బోర్డు చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించామని సీఎం ధామి పేర్కొన్నారు. ఈ బోర్డును 2019లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బోర్డును రద్దు చేయాలని పెద్ద ఎత్తున పూజారులు డిమాండ్ చేస్తున్నారు. ఆలయాల సాంప్రదాయ హక్కులకు వ్యతిరేకంగా బోర్డు ఉందని పూజారులు ఆరోపలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవస్థానం బోర్డుపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం ధామి రద్దు నిర్ణయం తీసుకున్నారు. మనోహర్ కంట్ దయానీ నేతృత్వంలోని బృందం నివేదికను తయారు చేసింది. దేవస్థానం బోర్డు కింద 51 ఆలయాల నిర్వహణ ఉండగా.. ప్రముఖ కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రీ ఆలయాలు కూడా బోర్డు పరిధిలోనే ఉన్నాయి. -
చార్‌ధామ్‌కు అనంత్ అంబానీ భారీ విరాళం
డెహ్రాడూన్: ఆసియా అపర కుబేరుడు, పారిశ్రామిక దిగ్గజం, ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ దాతృత్వాన్ని చాటుకున్నారు. రిలయన్స్ అధినేత కుమారుడు, జియో ప్లాట్‌ఫామ్స్ బోర్డు అదనపు డైరెక్టర్ అనంత్ అంబానీ ఉత్తరాఖండ్‌లోని చార్ధామ్ దేవస్థానం బోర్డుకు రూ .5 కోట్లు విరాళంగా ఇచ్చారు. గత సంవత్సరం కూడా రిలయన్స్ కుటుంబం రూ .2 కోట్లు విరాళంగా ఇచ్చింది. కరోనా మహమ్మారి, లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నచార్‌ధామ్ దేవస్థానానికి అంబానీ కుటుంబం ఈ భారీ విరాళాన్ని అందించింది. ఉద్యోగుల జీతాలు చెల్లించడం, మౌలిక సదుపాయాలు పెంపు, యాత్రికులకు సౌకర్యాలు కోసం దీన్ని వినియోగించనున్నారు. కరోనా మహమ్మారి పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ప్రధానంగా లాక్డౌన్ ప్రభావంతో రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. దీంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తమకు సాయపడాలని దేవస్థాన బోర్డు అదనపు సీఈవో బీడీ సింగ్ అంబానీ కుటుంబానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అనంత్ అంబానీ ఈ విరాళం ప్రకటించారు. ఈ మహమ్మారి కారణంగా సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతున్నామని సింగ్ పేర్కొన్నారు. బోర్డు సీఈఓ రవీనాథ్ రామన్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం విన్నపం మేరకు 2019 మార్చిలో అనంత్ శ్రీ బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీలో భాగమయ్యారు. చార్ధామ్ దేవస్థానం బోర్డు కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి నాలుగు పుణ్యక్షేత్రాలతోపాటు, ఇతర 51 దేవాలయాల కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అయితే కమిటీలో చేరకముందే, అంబానీ 2018లో ఈ పుణ్యక్షేత్రాలను సందర్శించారు.అలాగే కుమార్తె ఇషా అంబానీ వెడ్డింగ్ కార్డును ఇక్కడ అందించారు. ఆ సమయంలో రూ .51 లక్షల రూపాయలను ఆలయం నిధులకు అందించినట్లు సమాచారం. -
గంగోత్రిలో పాలమూరు జిల్లా యాత్రికులు క్షేమం
న్యూఢిల్లీ : చార్ధామ్ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 150మంది యాత్రికులు క్షేమంగా ఉన్నారు. వారంతా గంగోత్రిలో ఉన్నట్లు సమాచారం అందింది. కమ్మగిరి స్వామి నేతృత్వంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు చార్ధాయ్ యాత్రకు వెళ్లారు. తామంతా క్షేమంగా ఉన్నట్లు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. మరోవైపు ఉత్తరాఖండ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రుద్రప్రయాగ, చమోలీ జిల్లాల్లో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. చార్ధాయ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు అష్టకష్టాలు పడుతున్నారు. శుక్రవారం కేదార్‌లోయ, హేమ్‌కుంద్ సాహిబ్, బద్రీనాథ్ ప్రాంతాల నుంచి హెలీకాప్టర్ల ద్వారా 900 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
‘చార్ధామ్’ బాధితులకు ఎక్స్‌గ్రేషియా
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్రకు వెళ్లి వరదల్లో ప్రాణాలు కోల్పోయిన జిల్లావాసుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్ధిక సహాయం విడుదల చేసిందని కలెక్టర్ బి.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం 23మంది మృతులకు గాను ఒక్కో కుటుంబానికి రూ.3.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చిందన్నారు. కలెక్టర్ శ్రీధర్ గురువారం కలెక్టరేట్లోని కోర్టు హాలులో బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు.